
ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకటరావును మార్చేందుకు టీడీపీ అధినేత యోచిస్తున్నట్టు సమాచారం. ప్రతి ఒక్కరికి ఆమోదయోగ్యమైన మరో బలమైన నాయకుడిని నియమించాలని ఆలోచిస్తున్నారు. కళా వెంకటరావు ఎన్నికల్లో ఓడిపోవడంతో స్వయంగా టీడీపీ అధ్యక్ష రేసు నుంచి తప్పుకొని కొత్త వారికి చాన్స్ ఇచ్చారు.
వైసీపీ ప్రతీకారంతో ఇప్పుడు టీడీపీలో ముగ్గురు కీలక నేతలు జైలుపాలయ్యారు. వైసీపీ భయానికి టీడీపీ నేతలంతా ఇప్పుడు సైలెంట్ అయిపోతున్నారు. ఈ క్రమంలోనే పార్టీకి వీర విధేయుడైన అచ్చెన్నాయుడిని జైలుకు పంపి సర్కార్ నానా రకాల ఇబ్బందులకు గురిచింది… ఆ కుటుంబానికి న్యాయం చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నాడని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత అచ్చెన్నాయుడు కుటుంబమే టీడీపీలో బాగా ఇబ్బంది పడింది. ఎక్కువ కాలం జైల్లో అచ్చెన్న ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన నేతృత్వంలో పనిచేసేందుకు ఏపీ టీడీపీని సిద్ధం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. తద్వారా టీడీపీనే నమ్ముకొని ఉన్న ఆ కుటుంబానికి న్యాయం చేయాలని బాబు యోచిస్తున్నారట..
ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా బలమైన బీసీ నేత అచ్చెన్నాయుడిని చేస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే వివాదాస్పద నేత కావడంతో ఆయనను పలువురు వ్యతిరేకిస్తున్నట్టు తెలిసింది. పైగా ఆ కుటుంబానికి చంద్రబాబు ఇప్పటికే పార్టీలో పెద్ద పదవులు ఇచ్చారు.
అయితే గత ఎన్నికల్లో ఓటమి తర్వాత అచ్చెన్నాయుడు కుటుంబమే టీడీపీలో బాగా ఇబ్బంది పడింది. అసెంబ్లీలో చంద్రబాబు వెంట ఉపనేతగా అచ్చెన్న గర్జించాడు. వైసీపీని ప్రతీసారి ఇరుకునపెట్టాడు. అలా వైసీపీకి టార్గెట్ అయ్యారు. ఈఎస్ఐ కేసులో ఇరుక్కొని ఎక్కువ కాలం జైల్లో అచ్చెన్న ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన నేతృత్వంలో పనిచేసేందుకు ఏపీ టీడీపీని సిద్ధం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే ప్రస్తుతం ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావ్ ను దించేసి ఆయన స్థానంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని నియమించే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను మండల స్థాయిలో ఇప్పటికే టీడీపీ పూర్తి చేయగా.. త్వరలో లోక్ సభ నియోజకవర్గాల వారీగా కమిటీలను నియమించనుంది. ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టి పెడుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.