
దేశానికి ప్రధాని.. భారీ భద్రత.. ఈగ కూడా లోపలికి రాదు.. అయితే ఆన్ లైన్ లో ప్రపంచంలో అలాంటి పప్పులు ఉడకవు.. అమెరికా అధ్యక్షుడైనా.. భారత ప్రధాని అయినా నెటిజన్లు తలుచుకుంటే ఉతికి ఆరేయగలరు. అలాగే హ్యాకర్లు కూడా.. వారికి తమ పర బేధాలుండవు. ముఖ్యంగా సెలెబ్రెటీలంటే హ్యాకర్లకు బాగా మోజు. అందుకే వారి అకౌంట్లను, వెబ్ సైట్లను హ్యాక్ చేస్తూ ‘క్యాష్’ చేసుకుంటారు.
తాజాగా ప్రధాని నరేంద్రమోడీ పర్సనల్ వెబ్ సైట్ కు చెందిన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కావడం పెను సంచలనమైంది. హ్యాకర్ తెలివిగా ప్రధాని పేరుతో కరోనా రిలీఫ్ ఫండ్ కోసం ఆర్థిక సాయం చేయాలని వెబ్ సైట్ తెరపై పెట్టడం విశేషం.
ప్రధాని నరేంద్రమోడీ పేరుతో విరాళాలు అడిగితే కోట్లు ఇస్తారు. అందుకే హ్యాకర్లు తెలివిగా మోడీ వెబ్ సైట్ కు చెందిన ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేసి అందులో సాయం చేయాలని ‘బిట్ కాయిన్’ ఫండ్ కోసం డిమాండ్ చేశారు.
ప్రధాని మోడీ ట్విట్టర్ అకౌంట్ పై క్రిప్టో కరెన్సీతో ముడిపెడుతూ ఈ ట్వీట్ వచ్చింది. కోవిడ్ 19 కోసం పీఎం మోడీ రిలీఫ్ ఫండ్ కు విరాళం ఇవ్వాలని అందులో కోరారు. ‘జాన్ విక్’ పేరుతో మోడీ అకౌంట్ హ్యాక్ అయ్యింది.
ఈ గ్రూపుకు పేటీఎం మాల్ డేటా చోటీలో హస్తముందనే ఆరోపణలు వచ్చాయి. కాగా ప్రధాని ట్విట్టర్ అకౌంట్ కు 25 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. దీంతో ఎంతమంది ఎంత విరాళం ఇచ్చారన్నది ప్రశ్నార్థకంగా మారింది. మొత్తానికి మోడీ ట్విట్టర్ కే సూటి పెట్టి దోచుకునే ప్లాన్ ను హ్యాకర్లు చేశారన్న మాట..