Home Blog Page 74

సీఎం విజయ్ తండ్రి దర్శకత్వంలో మిస్ అయిన పవన్ కళ్యాణ్ సినిమా అదేనా..?

Pawan Kalyan
Pawan Kalyan

Pawan Kalyan: తెలుగు, తమిళ భాషల్లో పవన్ కళ్యాణ్ మరియు విజయ్ లకు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వీళ్ళిద్దరిని అభిమానులు కేవలం హీరోలుగా మాత్రమే చూడరు , తమ ఆరాధ్య దైవంగా చూస్తుంటారు. అందుకే వీళ్లిద్దరు రాజకీయాల్లోకి అడుగుపెట్టి, ప్రభుత్వాలను స్థాపించి , ఒకరు సీఎం గా కొనసాగుతుండగా , మరొకరు డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్నారు. అభిమానులకు వీళ్లిద్దరు ఇచ్చే గూస్ బంప్స్ స్టఫ్ సినిమాటిక్ అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది. ఇదంతా పక్కన పెడితే విజయ్ తండ్రి చంద్ర శేఖర్ తమిళనాడు లో పెద్ద స్టార్ డైరెక్టర్ అనే విషయం మీ అందరికీ తెలిసిందే. ఆయన టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి తో చట్టానికి కళ్ళు లేవు , దేవాంతకుడు వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు. అదే విధంగా తమిళనాడు లో తన కొడుకు విజయ్ ని హీరో గా పరిచయం చేస్తూ అనేక సూపర్ హిట్ చిత్రాలను కెరీర్ ప్రారంభం లో తెరకెక్కించారు.

అయితే ఒకానొక దశలో చంద్ర శేఖర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఒక సినిమా సెట్స్ మీద వరకు వెళ్లి ఆగిపోయింది అట. ఆ సినిమా మరేదో కాదు ‘సుస్వాగతం’. తమిళం లో తన కొడుకు విజయ్ నటించిన ‘లవ్ టుడే’ అనే చిత్రానికి ఇది రీమేక్. చంద్ర శేఖర్ ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ తో చేస్తే చాలా బాగుంటుందని , ఆయనకు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని చిరంజీవి ని కలిసి కథ ని వినిపించాడట. అనంతరం చిరంజీవి పవన్ కళ్యాణ్ ని ఇంటికి పిలిపించి ఈ స్టోరీ ని వినిపించాడట. ఆయనకు కూడా తెగ నచ్చేసింది. అయితే ఈ చిత్రాన్ని స్వయంగా చంద్ర శేఖర్ తన సొంతంగా నిర్మించాలని అనుకున్నారు. కానీ మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ రీమేక్ రైట్స్ అమ్మడానికి ఇష్టపడలేదు.

ఇదొక యూనివర్సల్ సబ్జెక్టు అని , తామే ఈ చిత్రాన్ని తెలుగు లో స్వయంగా నిర్మిస్తామని చెప్పారట. దీంతో కోపం తెచ్చుకున్న చంద్ర శేఖర్ ఈ సినిమా నుండి తప్పుకున్నాడట. ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు భీమినేని శ్రీనివాస రావు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడట. ఆరోజుల్లో పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచి, ఆయన్ని ఇండస్ట్రీ లో ఒక హీరో గా నిలబెట్టింది. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఎలాంటి సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాడో , యూత్ ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ని సొంతం చేసుకున్నాడో మన అందరికీ తెలిసిందే. అలా పవన్ కళ్యాణ్ , విజయ్ తండ్రి చంద్ర శేఖర్ కాంబినేషన్ లో ఈ క్రేజీ మూవీ మిస్ అయ్యింది.

దేశమంతా కరువు..ఇక్కడేమో కుమ్మేస్తున్నవానలు.. ముంచేస్తున్న వరదలు.ఎల్ నీనో ముప్పు తొలగినట్టేనా..

Mumbai Heavy Rains
Mumbai Heavy Rains

Mumbai Heavy Rains: అది మామూలు వాన కాదు.. జడివాన.. ప్రచండమైన వాన.. ఊరును మొత్తం ముంచేసేవాన. ఆకాశానికి చిల్లి పడినట్టు.. మేఘాలు మొత్తం ఒక్కసారిగా కరిగిపోయినట్టు కురిసింది. వర్షం తాకిడికి వరద కాదు.. ఏకంగా సునామీనే వచ్చినట్టుగా ఉంది. లోతట్టు ప్రాంతాలు కాదు.. ఎత్తైన ప్రాంతాలు కూడా మునిగిపోయాయి. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. చెట్లు కూలిపోయాయి. కొండల మీద ఉన్న రాళ్లు కింద పడిపోయాయి. పెద్ద పెద్ద భవంతుల్లోకి కూడా నీళ్లు వచ్చి చేరాయి. ఇదంతా నిరుడు కురిసిన వర్షం గురించి కాదు.. ఈ ఏడాది నమోదైన వర్షపాతం గురించి..

అదేంటి ప్రస్తుతం ఎల్ నీనో ఉందని అంటున్నారు కదా.. అందువల్లే కదా వర్షాలు కురవడం లేదు.. రైతులు ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. ఇంతవరకు పంటలు కూడా సాగు చేయలేదు. పైగా ఎండా కాలాన్ని మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. ఇలాంటప్పుడు వర్షాలు పడుతున్నాయని మీరు ఎలా అంటున్నారు.. అనే ప్రశ్న మీలో వ్యక్తమౌతుంది కదూ. అయితే ఈ వర్షాలు కురుస్తున్న తీరు మాత్రం నిజంగానే ఆశ్చర్యంగా ఉంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఈ వర్షాకాలంలో ఇంతవరకు తొలి సీజన్ వర్షం పడలేదు. కానీ మంగళవారం అక్కడ బీభత్సంగా వర్షం పడింది. బుధవారం కూడా వర్షం కురిసింది. ఆ వర్షం కూడా ఒక రేంజ్ లో పడింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో ముంబై నగరం తడిసి ముద్దయింది. చాలావరకు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. పలు ప్రాంతాలలో రైల్వేస్టేషన్లోకి నీళ్లు వచ్చి చేరాయి. అంతేకాదు కొన్నిచోట్ల రైలు పట్టాలు కూడా కొట్టుకుపోయాయి. కేవలం 24 గంటల వ్యవధిలో ముంబై నగరంలో 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది అంటే మామూలు విషయం కాదు. ముంబై.. తానే.. రాయిగడ్.. పాల్గర్.. సింధు దుర్గ్ వంటి జిల్లాలలో విపరీతంగా వర్షం కురిసింది. ఏకంగా అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

ముంబై మాత్రమే కాదు అరుణాచల్ ప్రదేశ్ లో కూడా విపరీతంగా వర్షం కురుస్తుంది. ఈ సీజన్లో ఇంతవరకు అక్కడ ఆశించిన స్థాయిలో వర్షం కురువలేదు. కానీ గడిచిన రెండు రోజులుగా అక్కడ విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మంగళవారం అయితే బీభత్సంగా వర్షం కురిసింది. బుధవారం కూడా అక్కడ వర్షాలు పడుతూనే ఉన్నాయి. వర్షాలు తీవ్రతకి వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. దీంతో అరుణాచల్ ప్రదేశ్ లోని చాలా ప్రాంతాలు నీట మునిగిపోయాయి. వరద ప్రవాహానికి చెట్లు కొట్టుకొని వస్తున్నాయి. కొండ ప్రాంతాలలో చరియలు విరిగిపడిపోతున్నాయి.

దేశంలో క్షామ పరిస్థితులు నెలకొంటే.. ఇక్కడ మాత్రం వర్షాలు కురవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే క్లౌడ్ బరస్ట్ వల్ల ఇలా జరుగుతూ ఉంటుందని అధికారులు అంటున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా రుతుపవనాల విస్తరణ సాగుతోంది. అనుకూలంగా ఉన్నచోట ఇదే స్థాయిలో వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. అయితే ఇలా వర్షాలు కురిసినంత మాత్రాన ఎల్ నీనో ప్రభావం తొలగిపోయినట్టు కాదని.. దాని ప్రభావం అలానే ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

వైభవ్ సూర్యవంశీ విధ్వంసాన్నే తట్టుకోలేకపోతున్నాం.. అతడి తమ్ముడు అంతకుమించి.. ఏం చేశాడో తెలుసా..

Ashirvad Suryavanshi
Ashirvad Suryavanshi

Ashirvad Suryavanshi: ఐపీఎల్ లో ఆరెంజ్ క్యాప్ సాధించాడు. తాజాగా శ్రీలంక ట్రై సిరీస్లో ఆకాశమేహద్దుగా చెలరేగిపోయాడు. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక మొత్తాన్ని షేక్ చేశాడు. బంతి పగిలి వక్కలు అయ్యేలాగా బ్యాటింగ్ చేశాడు.. సెంచరీ కోల్పోయాడు గాని.. ఇంకా కాసేపు ఉండి ఉంటే కచ్చితంగా టీమిండియా 500 స్కోర్ చేసేది..

సూర్య వంశీ విధ్వంసానికే కొలమానాలు లేకుండా పోయాయి.. అతని ఆట చూసి లెజెండరీ బౌలర్లు కూడా బౌలింగ్ వేయాలంటే భయపడుతున్నారు.. అతడే ఒక డేంజర్ మ్యాన్ అనుకుంటే.. ఇప్పుడు అతని తమ్ముడు అంతకు మించిన స్థాయిలో ఆడుతున్నాడు. తన అన్న టైగర్ అయితే.. తాను అంతకుమించిన పరుగుల చీతా అని నిరూపిస్తున్నాడు.

వైభవ్ తమ్ముడు పేరు ఆశీర్వాద్.. ఆమధ్య ఒక మ్యాచ్లో అద్భుతమైన సెంచరీ చేశాడు.. కాకపోతే స్థిరంగా బ్యాటింగ్ చేశాడు. అన్న మాదిరిగా దూకుడుగా కాకుండా.. దృడచిత్తంతో ఆడాడు. అప్పట్లో ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో కూడా తనకు క్రికెటర్ కావాలని ఉందని మనసులో మాట చెప్పాడు. అయితే అది కేవలం మామూలుగా చెప్పిన మాట కాదు. ఆ మాట నిలబెట్టుకోవడానికి ఆశీర్వాద్ సూర్య వంశీ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు.

తాజాగా జరిగిన ఒక లోకల్ మ్యాచ్లో కేవలం 119 బంతుల్లోనే 19 ఫోర్లు, 6 సిక్సర్ల సహాయంతో 168 పరుగులు చేశాడు. తన అన్న సెంచరీలు మిస్ చేసుకుంటుంటే.. ఇతడు మాత్రం శతకాలు బాదేస్తూ ఉన్నాడు. తన అన్న తుఫాన్ లాగా బ్యాటింగ్ చేస్తుంటే.. ఇతడు ప్రత్యర్థి బౌలర్లకు సునామీని పరిచయం చేస్తున్నాడు. ఆశీర్వాద్ దూకుడు ఇలాగే ఉంటే త్వరలోనే అతడు ఐపిఎల్ కి వస్తాడని.. అన్నను మించిపోతాడని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. తన తమ్ముడు సెంచరీ చేసిన విషయాన్ని సూర్య వంశీ సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

మంచు కురిసే ఆ దేశంలో 40 మంది చనిపోయారు.. ఏమైంది.. ఎందుకిలా జరిగింది..

France Heatwave
France Heatwave

France Heatwave: కేవలం మన దగ్గరే అనుకున్నాం.. ప్రపంచ దేశాలలో కూడా ఎండలు గట్టిగానే కొడుతున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల జలాలు విపరీతంగా వేడెక్కుతున్న నేపథ్యంలో వర్షాలు కురవడం లేదు. వర్షాలు కురువకపోవడంతో ఎండలు దంచి కొడుతున్నాయి.. ముఖ్యంగా సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.. ఒక స్థాయి ఉష్ణోగ్రత అయితే పెద్దగా ఇబ్బంది ఉండదు. అదే అంతకుమించితే మాత్రం మనుషులు తట్టుకోలేరు.. ఇప్పుడు ఆ దేశంలో కూడా అలానే జరుగుతోంది.

యూరప్ ఖండంలో అత్యంత కీలకమైన దేశాలలో ఫ్రాన్స్ ఒకటి. ఇక్కడ మంచు విపరీతంగా కురుస్తూ ఉంటుంది. ఉష్ణోగ్రతలు ఒక స్థాయిలో మాత్రమే నమోదు అవుతూ ఉంటాయి. అందువల్లే ఆ దేశంలో పర్యటించడానికి పర్యాటకులు ఆసక్తి చూపిస్తుంటారు. పైగా ప్రఖ్యాతమైన ఈఫిల్ టవర్ కూడా అక్కడే ఉంది.. అక్కడి వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి పర్యాటకులు కూడా ఆస్వాదిస్తూ ఉంటారు.. అక్కడ ఉష్ణోగ్రతలు సాధ్యమైనంతవరకు 35 డిగ్రీలకు మించిపోవు. ఒకవేళ ఏవైనా అనుకోని మార్పులు జరుగుతే తప్ప అక్కడ ఆ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావు.. కానీ కొంతకాలంగా అక్కడ ఉష్ణోగ్రతలు ఏకంగా 45 డిగ్రీలను మించి పోతున్నాయి.

1947 తర్వాత ఇప్పుడు అక్కడ ఆ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. చల్లటి వాతావరణంలో మాత్రమే ఉండేందుకు ఇష్టపడే ఫ్రాన్స్ వాసులు ఆ స్థాయిలో ఎండను తట్టుకోలేకపోతున్నారు. ఇంట్లో ఉంటే ఉక్క పోత విపరీతంగా వేధిస్తున్న నేపథ్యంలో ఫ్రాన్స్ వాసులు చల్లదనం కోసం కెనాల్స్.. నీటి కుంటల్లోకి దూకి ఈత కొడుతున్నారు. అయితే కొంతమందికి సరిగ్గా ఈత రాకపోవడంతో నీటిలో మునిగి చనిపోతున్నారు.. గడిచిన ఐదు రోజుల్లో ఫ్రాన్స్ దేశవ్యాప్తంగా ఏకంగా 40 మంది చనిపోయారు. ప్రమాదకరమైన కెనాల్స్ లో ఈత కొట్టేందుకు దూకి.. అంతమంది చనిపోయారు.. రోజుల వ్యవధిలో 40 మంది చనిపోవడంతో ఫ్రాన్స్ దేశ అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదకరమైన కాల్వలో దూకి ప్రాణాలు కోల్పోవద్దని హెచ్చరికలు జారీ చేశారు

ఎల్ నీనో ఎఫెక్ట్ వల్ల ఈసారి ఫ్రాన్స్ దేశంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా నమోదు అవుతున్నాయి.. ఎండ వేడి మాత్రమే కాకుండా ఉక్కపోత కూడా అధికంగా ఉంటున్నది. అందువల్లే ప్రజలు ఉపశమనం కోసం ఈత కొడుతున్నారు. కొంతమంది నిర్లక్ష్యంగా దూకడంతో నీటిలో మునిగి చనిపోతున్నారు.. మరి కొద్దిరోజులు ఫ్రాన్స్ దేశంలో ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు చెబుతున్నారు. అసలే చల్లటి దేశమైన ఫ్రాన్స్ లో ఈ స్థాయిలో ఉష్ణోగ్రతల నమోదు అయితే ఎలా బతకాలో అర్థం కావడం లేదని అక్కడి ప్రజలు వాపోతున్నారు.

రవితేజ నెక్స్ట్ సినిమాలో ప్రయోగాత్మకమైన క్యారెక్టర్...

Ravi Teja Next Movie
Ravi Teja Next Movie

Ravi Teja Next Movie: మాస్ మహారాజా రవితేజ హీరోగా చేసిన సినిమాలకు ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ లభిస్తుంది. అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరియర్ ను మొదలుపెట్టిన రవితేజ ఆ తర్వాత కాలంలో నటుడిగా మారి హీరోగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకొని స్టార్ హీరోగా ముందుకు దూసుకెళ్తుండటం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఆయన ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటం విశేషం… ప్రస్తుతం ‘ఇరుముడి’ సినిమాతో కొత్త పంథాలో ముందుకు సాగుతున్న ఆయన ఇప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఎప్పుడైతే ఆయన ఇరుముడి సినిమాని ఒప్పుకున్నాడో అప్పటినుంచి ఆయన కొత్త సినిమాల వైపు అడుగులు వేయాలని చూస్తున్నాడు. రొటీన్ సినిమాలకు స్వస్థి చెప్పిన ఆయన వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

నిజానికి వివేక్ ఆత్రేయ డిఫరెంట్ సినిమాలను చేస్తాడనే పేరు ఉంది. స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేయగలిగే వివేక్ ఆత్రేయ రవితేజతో చేయబోయే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుంది అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే వివేక్ ఆత్రేయ ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలన్నీ డిఫరెంట్ గా జానర్ లో తెరకెక్కాయి.

కాబట్టి ఇప్పుడు రవితేజతో చేస్తున్న సినిమాల విషయంలో కూడా ఆయన చాలా వరకు కేర్ ఫుల్ గా వ్యవహరిస్తే మంచిదని దానికి తోడుగా రవితేజ తనకు పూర్తిగా సరెండర్ అయిపోయి ఆయన ఏం చెప్తే అది చేస్తే రవితేజ కి కూడా చాలా మంచి మేకోవర్ తో పాటు ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేసే అవకాశం కూడా లభిస్తుందని చెబుతున్నారు. మరి ఈ సినిమా ఏ జానర్ లో తెరకెక్కబోతుంది. వివేక్ ఆత్రేయ మరోసారి ఎలాంటి ప్రయోగం చేయబోతున్నాడు అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

లోకేష్ కనకరాజ్ మూవీ కోసం ఆ లుక్ లో అల్లు అర్జున్...

Allu Arjun Lokesh Kanagaraj Movie
Allu Arjun Lokesh Kanagaraj Movie

Allu Arjun Lokesh Kanagaraj Movie: తెలుగు సినిమా ఇండస్ట్రిలో స్టైలిష్ స్టార్ గా అవతరించిన అల్లు అర్జున్ పాన్ ఇండియాలో ఐకాన్ స్టార్ గా మారాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ వరుస సినిమాలను చేస్తూ భారీ క్రేజ్ ను మూటగట్టుకున్నాడు. ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో చేస్తున్న రాకా సినిమాతో తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా కోసం ఆయన విపరీతంగా కష్టపడుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే లోకేష్ కనకరాజు సినిమాలో అల్లు అర్జున్ డిఫరెంట్ మేకవర్లో కనిపించబోతున్నాడు.

ఇక ఈ సినిమాలో అతను మూడు గెటప్పుల్లో కనిపించబోతున్నాడు మరి వీటి కోసం ఆయన విపరీతంగా కష్టపడి ఎలాగైనా సరే ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఎలాంటి వండర్స్ ని క్రియేట్ చేస్తాడు. ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను రాబట్టుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక లోకేష్ కనకరాజు ఇప్పటికే అల్లు అర్జున్ కి లుక్ ల గురించిన టెస్టులైతే చేస్తున్నారట. మొత్తానికైతే రాకా సినిమా పూర్తి అయిన తర్వాత ఫుల్ టైమ్ ఈ సినిమా మీద అల్లు అర్జున్ వర్క్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా కనుక సూపర్ సక్సెస్ ను సాధిస్తే అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం తార స్థాయికి వెళ్ళిపోతుంది.

లోకేష్ సైతం పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గాఅవతరిస్తాడు. వీళ్లిద్దరు కలిసి చేస్తున్న ఈ ప్రయోగం ఎంత వరకు సక్సెస్ అవుతుంది. అల్లు అర్జున్ అభిమానులు ఈ ప్రాజెక్టు మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు. వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా ఉంటుందా? ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసే కలెక్షన్స్ ని కొల్లగొట్టగలుగుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…

ఖమేనీ అంత్యక్రియలు.. మోదీకి ఆహ్వానం.. అనూహ్య పరిణామం

Ayatollah Khamenei Funeral
Ayatollah Khamenei Funeral

Ayatollah Khamenei Funeral: అమెరికా–ఇరాన్‌ యుద్ధం దాదాపు ముగిసింది. జనీవాలో తుది ఒప్పందం కుదిరింది. దీంతో ఇక ఇరాన్‌లో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్‌ సంకుక్తంగా జరిపిన దాడిలో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా ఖమేనీ మరణించారు. ఫిబ్రవరి 28న ఈ ఘటన జరిగింది. అప్పటి నుంచి యుద్ధం కొనసాగుతుండడం, ఖమేనీ కుమారుడు, ప్రస్తుత సుప్రీం లీడర్‌ కూడా గాయపడడంతో ఖమేనీ అంత్యక్రియలు నిర్వహించలేదు. ఇప్పుడు శాంతి ఒప్పందం కుదరడంతో ఖమేనీ అంత్యక్రియలు నిర్వహించాలని ఇరాన్‌ నిర్ణయించింది. ఈమేరకు అంత్యక్రియలకు ప్రపంచంలోని వివిధ దేశాల నేతలకు ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ తరఫున ఆహ్మానాలు పంపారు. ఈమేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఆహ్వానం అందింది. జూలైలో జరగనున్న అయతొల్లా ఖమేనీ అంత్యక్రియలకు రావాలని న్యూఢిల్లీలోని ఇరాన్‌ రాయబార కార్యాలయం ఈ ఆహ్వానాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖకు అందజేసింది.

ఖమేనీ మరణం నేపథ్యం
ఫిబ్రవరి 28న అమెరికా–ఇజ్రాయెల్‌ దాడుల్లో 86 ఏళ్ల ఇరాన్‌ సుప్రీం నాయకుడు అయతుల్లా ఖమేనీ కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు జూలై 9న మషాద్‌లో జరగనున్నాయి. కార్యక్రమాలు జూలై 4 నుంచి టెహ్రాన్‌లో మొదలై, జూలై 9న ఖననంతో ముగుస్తాయి. ఈ కార్యక్రమానికి చైనా, రష్యా, ఖతార్, ఫ్రాన్స్, పాకిస్తాన్‌ తదితర దేశాల అధినేతలను కూడా ఆహ్వానించారు. పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఒక ప్రతినిధి బృందం హాజరవుతుందని తెలియజేశారు.

మోదీ హాజరవుతారా?
భారత్‌ తరఫున ఎవరు ఈ కార్యక్రమానికి హాజరవ్వాలనే విషయంపై ఇంకా నిర్ణయం కాలేదు. మార్చి 5న ఖమేనీ మరణానికి భారత్‌ అధికారికంగా సంతాపం తెలిపింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రి ఇరాన్‌ రాయబార కార్యాలయాన్ని సందర్శించి సంతాప పుస్తకంలో సంతకం చేశారు.

మోదీ–ఇరాన్‌ సంబంధాలు
ప్రధాని మోదీ చివరిసారిగా 2016 మేలో ఇరాన్‌ను అధికారికంగా సందర్శించారు. ఆ సమయంలో చాబహార్‌ పోర్టు# అభివృద్ధి కోసం త్రైపాక్షిక ఒప్పందంపై సంతకం చేశారు. 2018లో ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహానీ భారత్‌ను సందర్శించారు. అక్టోబర్‌ 2024లో బ్రిక్స్‌ సదస్సులో మోదీ, పెజెష్కియాన్‌ సమావేశమయ్యారు. ఆ సందర్భంగా మోదీ పెజెష్కియాన్‌ను భారత్‌కు ఆహ్వానించారు.

ఇరు దేశాల మధ్య ఇప్పటి వరకు సత్సంబంధాలే ఉన్నాయి. ఈ సంబంధాల కారణంగానే యుద్ధ సమయంలో ఇరాన్‌ హర్మూజ్‌ గుండా ఇరాన్‌ చమురు నౌకలు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. అయితే ఖమేనీ అంత్యక్రియలకు మోదీ హాజరు అనుమానమే అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వెల్లకపోవడమే మేలని కూడా సూచిస్తున్నారు.

పెద్ది' 20 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. మ్యాజిక్ నెంబర్ కి అతి చేరువలో ఓవరాల్ గ్రాస్..

Peddi 20 Days Worldwide Collections
Peddi 20 Days Worldwide Collections

Peddi 20 Days Worldwide Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం విజయవంతంగా 20 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. ఈ 20 రోజుల్లో ఈ చిత్రాన్ని వచ్చిన వసూళ్లు ట్రేడ్ కి ఒక విచిత్రమైన అనుభూతిని కలిగించింది. కలెక్షన్స్ బాగున్నాయి , కానీ ఓవరాల్ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ మాత్రం అవ్వలేదు. తెలుగు రాష్ట్రాల్లో సీడెడ్, నెల్లూరు జిల్లాల్లో భారీ నష్టాలు తప్పేలా లేవు. అదే విధంగా ఓవర్సీస్ , నార్త్ ఇండియా, కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా వంటి ప్రాంతాల్లో ఈ చిత్రానికి భారీ నుండి అతి భారీ నష్టాలు వచ్చాయి. మంచి వసూళ్లు వచ్చినప్పటికీ నిర్మాతలు బయ్యర్స్ కి హద్దులు దాటిన ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం తో నష్టాలు వాటిల్లాయి. ఇకపోతే 20 వ రోజున ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 32 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే నైజాం ప్రాంతం నుండి 54 కోట్ల 29 లక్షలు రాగా , సీడెడ్ ప్రాంతం నుండి 20 కోట్ల 88 లక్షలు , ఉత్తరాంధ్ర ప్రాంతం, నుండి 22 కోట్ల 76 లక్షలు , ఈస్ట్ గోదావరి నుండి 12 కోట్ల 82 లక్షలు , వెస్ట్ గోదావరి నమ్మేది 9 కోట్ల 5 లక్షలు , గుంటూరు జిల్లా నుండి 12 కోట్ల 55 లక్షలు , కృష్ణ జిల్లా నుండి 10 కోట్ల 16 లక్షలు నెల్లూరు జిల్లా నుండి 5 కోట్ల 82 లక్షలు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 148 కోట్ల 33 లక్షల షేర్ వసూళ్లు, 227 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లుయ్ వచ్చాయి. ఇది మామూలు విషయం కాదు.

ఇక ఇతర రాష్ట్రాల వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే కర్ణాటక నుండి ఈ చిత్రానికి 20 రోజుల్లో 15 కోట్ల 20 లక్షలు రాగా, తమిళనాడు + కేరళ నుండి 2 కోట్ల 40 లక్షలు, హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 12 కోట్ల 15 లక్షలు , ఓవర్సీస్ నుండి 23 కోట్ల 55 లక్షలు వచ్చాయి. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 201 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 343 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ వీకెండ్ తో ప్రతిష్టాత్మక 350 కోట్ల గ్రాస్ మైల్ స్టోన్ ని దాటేస్తుందని. ఇక వర్ల్ద్న్ వైడ్ గా అన్ని భాషలకు కలిపి 218 కోట్ల రూపాయలకు జరగ్గా, మరో 17 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది.

'బిగ్ బాస్ 10' లోకి ఎంట్రీ ఇచ్చేందుకు 1 కోటి రూపాయిలు డిమాండ్ చేస్తున్న సీరియల్ ఆర్టిస్ట్..

Bigg Boss 10 Telugu
Bigg Boss 10 Telugu

Bigg Boss 10 Telugu: ప్రతీ ఏడాది సెప్టెంబర్ నెలలో మొదలయ్యే ‘బిగ్ బాస్’ సీజన్ కోసం బుల్లితెర ఆడియన్స్ ఎంత ఆతృతగా ఎదురు చూస్తుంటారో మనం చూస్తూనే ఉన్నాము. గత సీజన్ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం తో , ఈ ఏడాది జరగబోయే ‘బిగ్ బాస్ 10’ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గత ఏడాది లాగానే , ఈ ఏడాది కూడా ‘అగ్నిపరీక్ష’ షో ని నిర్వహిస్తున్నారు. ఈ షో ద్వారా సామాన్యులను మరోసారి బిగ్ బాస్ హౌస్ లోకి పంపబోతున్నారు. గత సీజన్ లో లాగానే , ఈ సీజన్ లో కూడా సామాన్యులు వెర్సస్ సెలబ్రిటీస్ మధ్య భీకర పోరు జరగనుంది. ఈ పోరులో ఎవరు గెలుస్తారు అనేది సస్పెన్స్. గత సీజన్ లో అయితే సామాన్యుడు కళ్యాణ్ పడాల టైటిల్ విన్నర్ గా నిలిచాడు.

ఈ సీజన్ లో కూడా సామాన్యుడే గెలుస్తాడని నెటిజెన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణ్ పడాల , డిమోన్ పవన్ రేంజ్ కంటెస్టెంట్స్ కోసం వడగాస్తున్నారు మేకర్స్. అగ్నిపరీక్ష కి సంబంధించిన ధరఖాస్తుల తేదీని కూడా పొగిడించారు. ఇకపోతే ఈ సీజన్ లో సెలబ్రిటీలను కూడా టాప్ రేంజ్ వాళ్ళని తీసుకొచ్చేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారట మేకర్స్. అందులో భాగంగా ‘కార్తీక దీపం’ సీరియల్ ద్వారా డాక్టర్ బాబు క్యారెక్టర్ తో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులను అలరించిన నిరుపమ్ ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట. కానీ ఈయన చాలా ఆర్టిస్ట్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుత్తం ‘కార్తీక దీపం’ సీజన్ 2 సీరియల్ చేస్తున్నాడు. దీంతో పాటు ‘పొదరిల్లు’ అనే సీరియల్ కి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ఈ రెండు సీరియల్స్ రికార్డు స్థాయి టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకు దోసుకువెళ్తోంది.

అలాంటి పీక్ రేంజ్ లో ఉన్న సీరియల్ హీరోని ‘బిగ్ బాస్ 10’ లోకి తీసుకొని రావాలంటే , రెమ్యూనరేషన్ వాళ్ళు ఎంత అడిగితే , అంత ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవ్వాలి. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం , నిరుపమ్ ఈ సీజన్ లో పాల్గొనడానికి ఏకంగా 1 కోటి రూపాయిల రెమ్యూనరేషన్ అడిగాడని సమాచారం. ప్రస్తుతం బిగ్ బాస్ టీం ఆయనతో భేరాలు ఆడుతున్నారు. నూటికి 90 శాతం ఈయన ఈ సీజన్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఒకవేళ నిరుపమ్ ఎంట్రీ ఇస్తే , మిగిలిన కంటెస్టెంట్స్ కి అన్యాయం జరగొచ్చు , ఎందుకంటే నిరుపమ్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో , ముఖ్యం గా లేడీస్ లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఆయన బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తే ప్రతీ వారం నామినేషన్స్ లోకి వచ్చినప్పుడు ఆయనకు వన్ సైడెడ్ గా ఓటింగ్ పడుతుందని , ఆ కారణం చేత బాగా ఆడే కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వొచ్చని అంటున్నారు.

రాజమౌళి కొడుకు కార్తీకేయ ఆ విషయంలో క్లారిటీ మిస్ అవుతున్నాడా..?

SS Rajamouli Son Karthikeya
SS Rajamouli Son Karthikeya

SS Rajamouli Son Karthikeya: దర్శక ధీరుడు రాజమౌళి ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఆయన చేసిన సినిమాలు యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తుంటాయి. ప్రతి సీన్ లో కూడా ఎమోషన్ ని పెడుతూ ప్రతి ప్రేక్షకుడి చేత శభాష్ అనిపించుకోవడమే రాజమౌళి యొక్క లక్షణం… అలాంటి దర్శకుడు ఇప్పుడు మహేష్ బాబుతో వారణాసి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే ఒక సూపర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు.

రాజమౌళి కొడుకు అయిన కార్తీకేయ సైతం మొదట్లో ప్రొడక్షన్ సైడు ఆయన తన బాధ్యతలను కొనసాగించాడు. ఇక ఇప్పుడు ఒక ప్రొడక్షన్ హౌజ్ కూడా స్థాపించినట్టుగా తెలుస్తుంది. మధ్యలో ఒక బిజినెస్ ను కూడా స్టార్ట్ చేసి విపరీతంగా నష్టపోయాడు. మరి మళ్ళీ ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మారాడు. కాబట్టి ఇప్పుడు తను ప్రొడ్యూస్ చేసే సినిమాతో సక్సెస్ ని సాధిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

నిజానికి రాజమౌళి కొడుకు అయిన కార్తికేయ సినిమా ఇండస్ట్రీలోనే ఉండి హీరోగా గాని లేదంటే దర్శకుడిగా గాని ప్రయత్నం చేస్తే బాగుండేది. అలా కాకుండా బిజినెస్ వైపు వెళ్లడం అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా రాజ్యమౌళి అభిమానులను తీవ్రంగా కలిచి వేస్తుంది. తొందర్లోనే తను ఏం కావాలనుకుంటున్నాడు అసలు తన టార్గెట్ ఏంటి అనేది తెలుసుకుంటే మంచిదని లేకపోతే ఆయన చాలా వరకు తన కెరీర్ ని కోల్పోవాల్సిన పరిస్థితి అయితే రావచ్చని కొంతమంది ట్రేడ్ పండితులు సైతం అభిప్రాయపడుతున్నారు.

తనకి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ కూడా ఉంది కాబట్టి సినిమా ఇండస్ట్రీలోనే ప్రొడ్యూసర్ గా గాని లేదంటే దర్శకుడుగా గాని రానిస్తే బాగుంటుందని పలువురు సినిమా మేధావులు కామెంట్లు చేస్తున్నారు… లేదంటే రాజమౌళి చేసే సినిమాలకు సహాయకుడిగా వ్యవహరించిన కూడా రాజమౌళికి కొంచెం హెల్ప్ ఫుల్ గా ఉంటుందని మరి కొంత మంది భావిస్తున్నారు…

ఆ దర్శకుడు ఎన్టీఆర్ కి క్లోజ్ ఫ్రెండ్...కానీ తారక్ అతనితో సినిమా చేయడం లేదా..? కారణమేంటంటే..?

NTR and Vakkantham Vamsi
NTR and Vakkantham Vamsi

NTR and Vakkantham Vamsi: సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలు సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఒక సినిమాతో ఫ్లాప్ ని ముడగట్టుకున్నా కూడా వాళ్ళు చాలా వరకు తమ మార్కెట్ ను కోల్పోవాల్సి ఉంటుంది. తమ తోటి హీరోలతో పోటీ పడే అవకాశం కూడా లేకుండా పోతుంది. అందుకే ఎప్పటికప్పుడు వాళ్లు కొత్త పంథా ను ఎంచుకొని ఏ దర్శకుడైతే వాళ్ళ నటనను బాగా ఎలివేట్ చేసి చూపించగలుగుతాడో అతనికే వాళ్ళ డేట్స్ అయితే ఇస్తుంటారు. ఇక ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు సైతం వైవిధ్యభరితమైన కథాంశాలను ఎంచుకుంటూ స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే మొదటి నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ కి చాలా మంచి ఫ్రెండ్ అయిన వక్కంతం వంశీ రైటర్ గా భారీ విజయాలను సాధించాడు. జూనియర్ ఎన్టీఆర్ సైతం అశోక్, ఊసరవెల్లి, టెంపర్ లాంటి సినిమాలకు కథలను అందించాడు. ఈ మూడు సినిమాలు కూడా అతనికి మంచి ఇమేజ్ ను సంపాదించి పెట్టాయి. ఇక ఎలాగైనా సరే తను ఎన్టీఆర్ తో సినిమా చేద్దామని అనుకున్నాడు.

కానీ అనుకోని కారణాలవల్ల ఆయన అల్లు అర్జున్ తో ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ అనే సినిమా చేశాడు. ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. ఇక ఆ తర్వాత నితిన్ ను హీరోగా పెట్టి ‘ఎక్స్ట్రాడినరీ మ్యాన్’ అనే సినిమా చేశాడు. ఆ సినిమా కూడా డిజాస్టర్ అవ్వడంతో ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకుడిగా సినిమా చేసే ఆలోచనను మానుకున్నట్టుగా తెలుస్తుంది.

మళ్లీ తను సురేందర్ రెడ్డి లాంటి స్టార్ డైరెక్టర్ కి కథ రచయితగా వ్యవహరిస్తున్నాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ మొదట్లో వక్కంతం వంశీ తో సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. అయినప్పటికి జూనియర్ ఎన్టీఆర్ ఆ మాటను నిలబెట్టుకోలేక పోయాడు. ఇక సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫెయిల్యూర్ మాత్రమే మాట్లాడతాయని హీరోలతో ఫ్రెండ్షిప్ ఉన్నంత మాత్రాన సినిమాలు ఇచ్చే అవకాశమైతే లేదనేది చాలా క్లారిటీగా తెలుస్తుంది.

బయటికి అన్ని వర్కౌట్ అవుతాయని సినిమాల పరంగా మాత్రం ఎలాంటి ఫ్రెండ్షిప్ కుదరవని చాలామంది చాలా ప్రాక్టికల్ గా ఉంటారనే విషయం జూనియర్ ఎన్టీఆర్ ను చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే వక్కంతం వంశీకి ఉన్న మార్కెట్ వేరు జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న మార్కెట్ వేరు… ఇప్పుడు ఎన్టీఆర్ పాన్ ఇండియాలో ముందుకు దూసుకెళ్తున్నాడు కాబట్టి తనతో పాటు సమానమైన మార్కెట్ ఉన్న దర్శకుడితోనే ఆయన సినిమాలు చేస్తాడు తప్ప, చిన్న దర్శకులతో సినిమాలు చేసే అవకాశమైతే లేదనే చెప్పాలి…

గర్భిణీ స్త్రీ కోసం సీఎం విజయ్ చేసిన ఈ పని చూస్తే చేతులెత్తి దండం పెడుతారు..

CM Vijay Pregnant Woman Honor
CM Vijay Pregnant Woman Honor

CM Vijay pregnant Woman Honor: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కేవలం తమిళ ప్రజల అభిమానాన్ని మాత్రమే కాదు , తన పాలనతో , ప్రవర్తనతో తెలుగు ప్రజల మనసుల్ని కూడా దోచుకుంటున్నారు. రోజు రోజుకు ఆయన వ్యవహార శైలి అందరికీ తెగ నచ్చేస్తోంది. ఎన్నికల ముందు ఓట్ల కోసం చేసే పనులన్నీ , ఆయన ఎన్నికల్లో గెలిచిన తర్వాత చేస్తూ , స్వచ్ఛమైన మనసు ఉన్న నాయకుడిగా ముద్ర వేసుకుంటున్నారు. ఇలా ప్రతీ రాష్ట్రము లోని సీఎం వ్యవహరిస్తే ఎంత బాగుంటుందో అని అనిపించేలా ఆయన తీరు ఉంది. నేడు విజయ్ ప్రభుత్వ ఉద్యోగులను సన్మానించే కార్యక్రమాన్ని తలపెట్టాడు. ఈ కార్యక్రమం లో ఒక గర్భిణీ స్త్రీ వేదిక మీదకు ఎక్కే పరిస్థితి లేదు. ఇది గమనించిన విజయ్ , స్వయంగా తానే క్రిందకు దిగి వచ్చి , ఆ గర్భిణీ స్త్రీ ని సత్కరించారు.

ఇలా ఎంత మంది ముఖ్యమంత్రులు ఉంటారు చెప్పండి?, జనాల్లోకి వస్తే పరదాల చాటున వెళ్లే ముఖ్యమంత్రులు ఎక్కడ?, సామాన్యులతో మమేకమయ్యే విజయ్ లాంటి ముఖ్యమంత్రి ఎక్కడ?, ఎన్నికల ముందు పాదయాత్ర అంటూ డ్రామాలు చేసి , ప్రతీ ఒక్కరిని ముద్దాడి తెగ ప్రేమ నటించే ముఖ్యమంత్రులు ఎక్కడ?, ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కూడా అణిగిమణిగి ఉండే విజయ్ ఎక్కడ? అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్న ఈ వీడియో ని మీరు కూడా క్రింద చూసేయండి. విజయ్ అధికారం లోకి వచ్చిన తర్వాత ఇంత సాఫ్ట్ గా ఉంటే ఎలా?, ఇలా అయితే ప్రత్యర్థులు ఆయన మనస్తత్వం తో చెడుగుడు ఆడుకుంటారని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే మొన్న అసెంబ్లీ లో విజయ్ ప్రతిపక్ష నేత స్టాలిన్ ని ఏ రేంజ్ లో చెడుగుడు ఆడుకున్నాడో అంతా చూసారు.

అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. మన టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు సైతం విజయ్ కి సంబంధించిన ఆ అసెంబ్లీ వీడియో ని షేర్ చేస్తూ ఎలివేషన్స్ ఇస్తున్నారు. ఈ రేంజ్ లో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో నాయకులకు , హీరోలకు కూడా క్రేజ్ లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. విజయ్ కి ఉన్నటువంటి క్రేజ్ ని చూస్తుంటే , ఆయన త్వరలోనే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా తన TVK పార్టీ ని విస్తరింపచేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు నెటిజెన్స్.

సుకుమార్ సినిమాలో ఈసారి రామ్ చరణ్ బ్లైండ్ గా కనిపించబోతున్నాడా..?

Ram Charan Sukumar Movie
Ram Charan Sukumar Movie

Ram Charan Sukumar Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంటెలిజెంట్ డైరెక్టర్ గా తనకంటూ పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్… పుష్ప సినిమాతో ఇండియాలో తనకంటూ ఒక క్రేజ్ ను క్రియేట్ చేసుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా క్లారిటిని మైంటైన్ చేస్తున్నాడు. రామ్ చరణ్ తో చేయబోతున్న సినిమా విషయంలో ఆయన చాలావరకు కసరత్తులైతే చేస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ బ్లైండ్ గా నటించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇంతకుముందు వీళ్ళ కాంబోలో వచ్చిన ‘రంగస్థలం’ సినిమాలో రామ్ చరణ్ చెవిటి వాడి పాత్రలో కనిపించాడు…ఇక ఈ సినిమాలో గుడ్డివాడిగా నటించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం తెలియదు. కానీ మొత్తానికైతే సుకుమార్ ఈ సినిమాని చాలా ప్రస్టేజియస్ గా తీసుకొని తెరకెక్కించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా కథలో కూడా చాలా వరకు వైవిధ్యాన్ని చూపించాలనే ప్రయత్నం చేస్తున్నాడట.

అందుకోసమే ఆయన బ్లైండ్ గా ఉండే హీరో క్యారెక్టరైజేషన్ రాసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ క్యారెక్టర్ లో తను ఇమిడిపోయి నటిస్తాడని కూడా రామ్ చరణ్ అభిమానులైతే వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా సుకుమార్ ఏది చేసిన కూడా వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు.

కాబట్టి ఈ సినిమాలో రామ్ చరణ్ ను చాలా డిఫరెంట్ గా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక సుకుమార్ అనుకున్నట్టుగానే ఈ సినిమాలో రామ్ చరణ్ వైల్డ్ గా కనిపిస్తాడా? అలాగే గుడ్డివాడి పాత్రలో కూడా నటించి మెప్పిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.

మొత్తానికైతే ఈ సినిమాకి సంబంధించిన అవుట్ లైన్ ఏంటి అనేది తెలియాలంటే మాత్రం సుకుమార్ అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఇప్పటివరకు ఏ న్యూస్ వచ్చినా కూడా అది రూమర్ గానే పరిగణించబడుతుంది తప్ప అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే కాదని మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…

బెంగాల్ బీజేపీ ప్రభుత్వ మొదటి బడ్జెట్ ఎలా వుంది?

West Bengal BJP Budget 2026

West Bengal BJP Budget 2026 : నిన్న మొట్టమొదటి సారి బీజేపీ బెంగాల్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఫైనాన్స్ మినిస్టర్ స్వపన్ దాస్ గుప్తా.. ఈయన జర్నలిస్ట్ , కాలమిస్ట్.. రాజ్యసభ సభ్యుడు.. 4.39 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్ర అప్పు 8.15 లక్షల కోట్లు. అయినా ఊహించని పద్దతుల్లో సంక్షేమానికి, మౌళిక వసతులకు పెద్ద పీట వేశారు. ఉద్యోగ కల్పన చూస్తే.. ప్రభుత్వ ఉద్యోగాలు లక్ష ఇవ్వడానికి ప్రకటించారు. అందులో 50 వేలు విద్యారంగం ఉద్యోగాలే. టీచర్లు, నాన్ టీచింగ్, అడ్మినిస్ట్రేటర్లుగా.. 20వేల పోలీస్ ఉద్యోగాలు.. మిగతా 30 వేలు ప్రభుత్వ ఉద్యోగాలు.. నార్త్ బెంగాల్ గుర్ఖాల డిమాండ్ మేరకు వారిని వారిని ‘ఈస్ట్రన్ ఫ్రంటియర్ రైఫిల్స్’ ను మళ్లీ పునరుద్దరించి వెయ్యి మంది గుర్ఖాలను నియమించబోతున్నారు.

ఉద్యోగాలకు ఇచ్చిన హామీల మేరకు డీఏ 7.50 లక్షల మందికి 20 శాతం అదనపు డీఏను ప్రకటించారు. ఉద్యోగులు చాలా హ్యాపీగా ఉన్నారు. వెల్ఫేర్ చూస్తే.. గత అసెంబ్లీలో అన్నింటిని అమలు చేస్తామని ప్రకటించారు. లేడీ డిగ్రీ చదివే విద్యార్థినులకు 21 వేలు, మొదటిసారి ప్రెగ్నెంట్ అయితే 21 వేలు ఇస్తారు. అంగన్ వాడీలకు రూ.5వేల పెంపుదల.. ఇలా చాలా సంక్షేమ పథకాలు ప్రకటించారు.

బెంగాల్ బీజేపీ ప్రభుత్వ మొదటి బడ్జెట్ ఎలా వుంది? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

అనిల్ రావిపూడి ఆ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాడా..?

Anil Ravipudi Strict Filmmaking
Anil Ravipudi Strict Filmmaking

Anil Ravipudi Strict Filmmaking: ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇప్పుడున్న స్టార్ హీరోలందరు పాన్ ఇండియాలో డిఫరెంట్ సినిమాలను చేస్తూ వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే కమర్షియల్ సినిమాలతో వరుస విజయాలను సాధిస్తున్న అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు సైతం ఈ మధ్యకాలంలో చాలా తొందరగా సినిమాలను చేస్తున్నాడు. సంవత్సరానికి ఒక సినిమా చొప్పున ఆయన చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. దీనివల్ల ఆయన నుంచి చాలా ఎక్కువ సినిమాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే బిజినెస్ కూడా చాలా ఎక్కువగా జరుగుతుంది. ప్రొడ్యూసర్లు కూడా చాలా వరకు లాభపడుతున్నారు. ఆయన తీసే సినిమాలు అన్ని సూపర్ సక్సెస్ గా నిలుస్తున్నాయి.

కాబట్టి ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ కూడా రాబడుతున్నాడు. ఇక అలాంటి దర్శకుడు ఒక సినిమాని అనుకున్న సమయంలో తీసి రిలీజ్ చేయడానికి పకడ్బంది ప్రణాళికలో చేసుకుంటున్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే ప్రొడ్యూసర్ దగ్గర కూడా భారీరెమ్యూనరేషన్ కూడా తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

ప్రస్తుతం ఆయన ఒక సినిమా కోసం 30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి… ఇక ఏది ఏమైనా కూడా అనిల్ రావిపూడి నుంచి వచ్చే సినిమాల్లో క్రింజ్ కామెడీ ఉంటుందని కొంతమంది కామెంట్లు చేస్తుంటే, మరి కొంత మంది మాత్రం అతని సినిమాలను ఈజీగా ఒకసారి అలా ఫ్యామిలీ తో పాటు చూసేయొచ్చు అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా పండుగ సీజన్లో ఆయన సినిమాలకు మంచి గిరాకీ ఉంటుంది.

కాబట్టి ఆయన ప్రతి పండుగ సీజన్ ను క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు… ఇక రాబోయే రోజుల్లో ఆయన చేయబోయే సినిమాలు ఏ రేంజ్ సక్సెస్ లను సాధిస్తాయి. ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ రాబడతాయా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ఇప్పుడు వెంకటేష్, కళ్యాణ్ రామ్ లను ఎలా చూపిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…

మహేష్ బాబు విషయంలో తప్పుగా ఆలోచిస్తున్న దర్శకులు... కారణమేంటంటే..?

Mahesh Babu Next Movie
Mahesh Babu Next Movie

Mahesh Babu Next Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ హీరోగా మార్చాయి. ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీకే పరిమితమైన ఆయన ప్రస్తుతం రాజమౌళితో చేస్తున్న సినిమాతో ఇండియాలో తన సత్తా చాటుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. వారణాసి సినిమాతో ప్రేక్షకులను ఆదరించాలనే ప్రయత్నంలో ఉన్న మహేష్ బాబు ఇకమీదట చేయబోయే సినిమాల విషయంలో కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నాడు. అయితే చాలామంది దర్శకులు మహేష్ బాబు విషయంలో చాలా తప్పుగా ఆలోచిస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. కారణం ఏంటి అంటే మహేష్ బాబు వారణాసి సినిమా తర్వాత హాలీవుడ్ సినిమాలను మాత్రమే చేస్తాడని తెలుగు సినిమా దర్శకులను పట్టించుకునే స్థాయిలో తను ఉండకపోవచ్చనే ధోరణిలో ఆలోచిస్తున్నాడు.

నిజానికి మహేష్ బాబు మాత్రం అలాంటిదేమీ లేదని తెలుగు దర్శకులకే తన మొదటి ప్రిఫరెన్స్ ఇస్తానని మంచి కథ దొరికితే మానవాళ్ళతోనే ఆ సినిమా చేయడానికి తను ఆసక్తిగా ఉన్నానని అంటున్నాడు. ఇక వారణాసి సినిమా రిజల్ట్ ఏ రేంజ్ లోఉంటుందో మనందరం ముందే ఊహించుకోవచ్చు. ఎందుకంటే దాన్ని తెరకెక్కిస్తుంది రాజమౌళి కాబట్టి ఆయన చేసే సినిమా తప్పకుండా విజయాన్ని సాధిస్తుంది అనే ఉద్దేశ్యంతోనే చాలామంది అభిప్రాయపడుతున్నారు.

కూడా మహేష్ బాబు తన తదుపరి సినిమా విషయంలో ఇంకాస్త క్లారిటిని తెచ్చుకోవాల్సిన అవసరమైతే ఉందని మరి కొంతమంది భావిస్తున్నారు. కొంత మంది దర్శకులు ఇప్పటికే అతనికి కథలను చెబుతున్నప్పటికి ఆయన ఏ కథను కూడా ఫైనల్ చేయడం లేదు. కారణం ఏంటంటే వారణాసి సినిమా రిజల్ట్ ని బట్టి ఆయన ఎలాంటి సినిమాను సెలెక్ట్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట.

కానీ కొంతమంది మాత్రం ఆయన హాలీవుడ్ దర్శకులతో మాత్రమే సినిమా చేస్తానని తెలుగు వాళ్ళతో సినిమా చేయడనే ఒక న్యూస్ ను క్రియేట్ చేసి దాన్ని సర్క్యులేట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది…ఇక నిజంగానే మహేష్ బాబు తన నెక్స్ట్ సినిమాను ఎవరితో చేస్తాడనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…