Homeఎంటర్టైన్మెంట్NTR and Vakkantham Vamsi: ఆ దర్శకుడు ఎన్టీఆర్ కి క్లోజ్ ఫ్రెండ్...కానీ తారక్ అతనితో...

NTR and Vakkantham Vamsi: ఆ దర్శకుడు ఎన్టీఆర్ కి క్లోజ్ ఫ్రెండ్…కానీ తారక్ అతనితో సినిమా చేయడం లేదా..? కారణమేంటంటే..?

NTR and Vakkantham Vamsi: సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలు సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఒక సినిమాతో ఫ్లాప్ ని ముడగట్టుకున్నా కూడా వాళ్ళు చాలా వరకు తమ మార్కెట్ ను కోల్పోవాల్సి ఉంటుంది. తమ తోటి హీరోలతో పోటీ పడే అవకాశం కూడా లేకుండా పోతుంది. అందుకే ఎప్పటికప్పుడు వాళ్లు కొత్త పంథా ను ఎంచుకొని ఏ దర్శకుడైతే వాళ్ళ నటనను బాగా ఎలివేట్ చేసి చూపించగలుగుతాడో అతనికే వాళ్ళ డేట్స్ అయితే […]

NTR and Vakkantham Vamsi: సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలు సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఒక సినిమాతో ఫ్లాప్ ని ముడగట్టుకున్నా కూడా వాళ్ళు చాలా వరకు తమ మార్కెట్ ను కోల్పోవాల్సి ఉంటుంది. తమ తోటి హీరోలతో పోటీ పడే అవకాశం కూడా లేకుండా పోతుంది. అందుకే ఎప్పటికప్పుడు వాళ్లు కొత్త పంథా ను ఎంచుకొని ఏ దర్శకుడైతే వాళ్ళ నటనను బాగా ఎలివేట్ చేసి చూపించగలుగుతాడో అతనికే వాళ్ళ డేట్స్ అయితే ఇస్తుంటారు. ఇక ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు సైతం వైవిధ్యభరితమైన కథాంశాలను ఎంచుకుంటూ స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే మొదటి నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ కి చాలా మంచి ఫ్రెండ్ అయిన వక్కంతం వంశీ రైటర్ గా భారీ విజయాలను సాధించాడు. జూనియర్ ఎన్టీఆర్ సైతం అశోక్, ఊసరవెల్లి, టెంపర్ లాంటి సినిమాలకు కథలను అందించాడు. ఈ మూడు సినిమాలు కూడా అతనికి మంచి ఇమేజ్ ను సంపాదించి పెట్టాయి. ఇక ఎలాగైనా సరే తను ఎన్టీఆర్ తో సినిమా చేద్దామని అనుకున్నాడు.

కానీ అనుకోని కారణాలవల్ల ఆయన అల్లు అర్జున్ తో ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ అనే సినిమా చేశాడు. ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. ఇక ఆ తర్వాత నితిన్ ను హీరోగా పెట్టి ‘ఎక్స్ట్రాడినరీ మ్యాన్’ అనే సినిమా చేశాడు. ఆ సినిమా కూడా డిజాస్టర్ అవ్వడంతో ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకుడిగా సినిమా చేసే ఆలోచనను మానుకున్నట్టుగా తెలుస్తుంది.

మళ్లీ తను సురేందర్ రెడ్డి లాంటి స్టార్ డైరెక్టర్ కి కథ రచయితగా వ్యవహరిస్తున్నాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ మొదట్లో వక్కంతం వంశీ తో సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. అయినప్పటికి జూనియర్ ఎన్టీఆర్ ఆ మాటను నిలబెట్టుకోలేక పోయాడు. ఇక సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫెయిల్యూర్ మాత్రమే మాట్లాడతాయని హీరోలతో ఫ్రెండ్షిప్ ఉన్నంత మాత్రాన సినిమాలు ఇచ్చే అవకాశమైతే లేదనేది చాలా క్లారిటీగా తెలుస్తుంది.

బయటికి అన్ని వర్కౌట్ అవుతాయని సినిమాల పరంగా మాత్రం ఎలాంటి ఫ్రెండ్షిప్ కుదరవని చాలామంది చాలా ప్రాక్టికల్ గా ఉంటారనే విషయం జూనియర్ ఎన్టీఆర్ ను చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే వక్కంతం వంశీకి ఉన్న మార్కెట్ వేరు జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న మార్కెట్ వేరు… ఇప్పుడు ఎన్టీఆర్ పాన్ ఇండియాలో ముందుకు దూసుకెళ్తున్నాడు కాబట్టి తనతో పాటు సమానమైన మార్కెట్ ఉన్న దర్శకుడితోనే ఆయన సినిమాలు చేస్తాడు తప్ప, చిన్న దర్శకులతో సినిమాలు చేసే అవకాశమైతే లేదనే చెప్పాలి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper