Homeఎంటర్టైన్మెంట్CM Vijay Pregnant Woman Honor: గర్భిణీ స్త్రీ కోసం సీఎం విజయ్ చేసిన ఈ...

CM Vijay Pregnant Woman Honor: గర్భిణీ స్త్రీ కోసం సీఎం విజయ్ చేసిన ఈ పని చూస్తే చేతులెత్తి దండం పెడుతారు..

CM Vijay pregnant Woman Honor: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కేవలం తమిళ ప్రజల అభిమానాన్ని మాత్రమే కాదు , తన పాలనతో , ప్రవర్తనతో తెలుగు ప్రజల మనసుల్ని కూడా దోచుకుంటున్నారు. రోజు రోజుకు ఆయన వ్యవహార శైలి అందరికీ తెగ నచ్చేస్తోంది. ఎన్నికల ముందు ఓట్ల కోసం చేసే పనులన్నీ , ఆయన ఎన్నికల్లో గెలిచిన తర్వాత చేస్తూ , స్వచ్ఛమైన మనసు ఉన్న నాయకుడిగా ముద్ర వేసుకుంటున్నారు. ఇలా ప్రతీ రాష్ట్రము లోని […]

CM Vijay pregnant Woman Honor: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కేవలం తమిళ ప్రజల అభిమానాన్ని మాత్రమే కాదు , తన పాలనతో , ప్రవర్తనతో తెలుగు ప్రజల మనసుల్ని కూడా దోచుకుంటున్నారు. రోజు రోజుకు ఆయన వ్యవహార శైలి అందరికీ తెగ నచ్చేస్తోంది. ఎన్నికల ముందు ఓట్ల కోసం చేసే పనులన్నీ , ఆయన ఎన్నికల్లో గెలిచిన తర్వాత చేస్తూ , స్వచ్ఛమైన మనసు ఉన్న నాయకుడిగా ముద్ర వేసుకుంటున్నారు. ఇలా ప్రతీ రాష్ట్రము లోని సీఎం వ్యవహరిస్తే ఎంత బాగుంటుందో అని అనిపించేలా ఆయన తీరు ఉంది. నేడు విజయ్ ప్రభుత్వ ఉద్యోగులను సన్మానించే కార్యక్రమాన్ని తలపెట్టాడు. ఈ కార్యక్రమం లో ఒక గర్భిణీ స్త్రీ వేదిక మీదకు ఎక్కే పరిస్థితి లేదు. ఇది గమనించిన విజయ్ , స్వయంగా తానే క్రిందకు దిగి వచ్చి , ఆ గర్భిణీ స్త్రీ ని సత్కరించారు.

ఇలా ఎంత మంది ముఖ్యమంత్రులు ఉంటారు చెప్పండి?, జనాల్లోకి వస్తే పరదాల చాటున వెళ్లే ముఖ్యమంత్రులు ఎక్కడ?, సామాన్యులతో మమేకమయ్యే విజయ్ లాంటి ముఖ్యమంత్రి ఎక్కడ?, ఎన్నికల ముందు పాదయాత్ర అంటూ డ్రామాలు చేసి , ప్రతీ ఒక్కరిని ముద్దాడి తెగ ప్రేమ నటించే ముఖ్యమంత్రులు ఎక్కడ?, ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కూడా అణిగిమణిగి ఉండే విజయ్ ఎక్కడ? అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్న ఈ వీడియో ని మీరు కూడా క్రింద చూసేయండి. విజయ్ అధికారం లోకి వచ్చిన తర్వాత ఇంత సాఫ్ట్ గా ఉంటే ఎలా?, ఇలా అయితే ప్రత్యర్థులు ఆయన మనస్తత్వం తో చెడుగుడు ఆడుకుంటారని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే మొన్న అసెంబ్లీ లో విజయ్ ప్రతిపక్ష నేత స్టాలిన్ ని ఏ రేంజ్ లో చెడుగుడు ఆడుకున్నాడో అంతా చూసారు.

అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. మన టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు సైతం విజయ్ కి సంబంధించిన ఆ అసెంబ్లీ వీడియో ని షేర్ చేస్తూ ఎలివేషన్స్ ఇస్తున్నారు. ఈ రేంజ్ లో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో నాయకులకు , హీరోలకు కూడా క్రేజ్ లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. విజయ్ కి ఉన్నటువంటి క్రేజ్ ని చూస్తుంటే , ఆయన త్వరలోనే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా తన TVK పార్టీ ని విస్తరింపచేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు నెటిజెన్స్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper