Home Blog Page 73

అదే పనిగా వస్తువులు కొంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి ఈ పని చేయండి..

Diderot Effect
Diderot Effect

Diderot Effect: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ తమ ఆదాయాన్ని పెంచుకోవాలని, మంచి జీవనశైలిని సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నారు. అయితే పెరుగుతున్న ధరలు, రోజువారీ ఖర్చులు, కొత్త అవసరాల కారణంగా చాలామంది పొదుపు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీతం పెరిగినా ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరగడం వల్ల ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడం కష్టమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ‘డిడిరో ఎఫెక్ట్’ (Diderot Effect) అనే ఆర్థిక ప్రవర్తన గురించి తెలుసుకోవడం చాలా అవసరం. అసలేంటిది? ఈ సమయంలో ఏం చేయాలి?

డిడిరో ఎఫెక్ట్ అంటే ఏమిటి?
డిడిరో ఎఫెక్ట్ అనే భావనకు ఫ్రెంచ్ తత్వవేత్త డెనిస్ డిడిరో పేరు పెట్టారు. ఒక కొత్త లేదా ఖరీదైన వస్తువును కొనుగోలు చేసిన తర్వాత, దానికి సరిపోయేలా మిగతా వస్తువులను కూడా అప్‌గ్రేడ్ చేయాలనే కోరిక కలగడం దీనికి ప్రధాన లక్షణం. అంటే ఒక కొనుగోలు మరిన్ని కొనుగోళ్లకు దారి తీస్తుంది. మొదట చిన్న ఖర్చుగా మొదలైన విషయం, తర్వాత పెద్ద ఆర్థిక భారంగా మారే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు, ఎవరైనా ఖరీదైన స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేశారని అనుకుందాం. ఆ తర్వాత దానికి మంచి కవర్, వైర్‌లెస్ ఇయర్‌బడ్స్, స్మార్ట్‌వాచ్ వంటి వస్తువులు కూడా కొనాలని అనిపించవచ్చు. అలాగే కొత్త సోఫా కొంటే, దానికి సరిపోయే కర్టెన్లు, టేబుల్, డెకరేషన్ వస్తువులు కొనాలనిపిస్తుంది. ఇలా ఒక కొనుగోలు మరెన్నో అదనపు ఖర్చులకు కారణమవుతుంది.

యువతపై ప్రభావం ఎక్కువ
సోషల్ మీడియా, ఆన్‌లైన్ షాపింగ్, ఇన్‌ఫ్లుయెన్సర్ కల్చర్ కారణంగా నేటి యువతలో డిడిరో ఎఫెక్ట్ మరింత ఎక్కువగా కనిపిస్తోంది. కొత్త గ్యాడ్జెట్లు, బ్రాండెడ్ దుస్తులు లేదా లగ్జరీ వస్తువులు కొనుగోలు చేసిన తర్వాత వాటికి అనుగుణంగా జీవనశైలిని మార్చుకోవాలని చాలామంది భావిస్తున్నారు. దీని వల్ల అవసరం లేని ఖర్చులు పెరిగి, పొదుపులు తగ్గిపోతాయి.

ఆర్థిక పరిస్థితిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
డిడిరో ఎఫెక్ట్ కారణంగా చాలామంది తమ బడ్జెట్‌ను దాటిపోయి ఖర్చు చేస్తారు. క్రెడిట్ కార్డులు, ఈఎంఐలు, వ్యక్తిగత రుణాలపై ఆధారపడే పరిస్థితి కూడా వస్తుంది. ఫలితంగా అత్యవసర పరిస్థితుల కోసం అవసరమైన నిధులు చేతిలో ఉండవు. అనుకోని వైద్య ఖర్చులు, ఉద్యోగ నష్టం లేదా ఇతర అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు ఆర్థిక ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంటుంది.

దీనిని ఎలా నియంత్రించాలి?
ఏదైనా కొత్త వస్తువు కొనాలనిపించినప్పుడు అది నిజంగా అవసరమా లేదా కేవలం ఆకర్షణ మాత్రమేనా అనే విషయాన్ని ముందుగా ఆలోచించాలి. పెద్ద కొనుగోలు చేసిన వెంటనే దానికి సంబంధించిన ఇతర వస్తువులు కొనకుండా కొంతకాలం వేచి చూడడం మంచిది. ‘24 గంటల నియమం’ లేదా ‘30 రోజుల నియమం’పాటించడం ద్వారా అనవసర కొనుగోళ్లను తగ్గించుకోవచ్చు. కొనుగోలు చేయాలనుకున్న వస్తువును జాబితాలో పెట్టి కొంతకాలం తర్వాత కూడా అవసరం అనిపిస్తే మాత్రమే కొనడం ఉత్తమం.

పొదుపులను ప్రాధాన్యంగా తీసుకోవాలి:
ఆదాయం వచ్చిన వెంటనే ముందుగా కొంత మొత్తాన్ని పొదుపు లేదా పెట్టుబడుల కోసం కేటాయించడం మంచి అలవాటు. మిగిలిన మొత్తాన్ని ఖర్చుల కోసం ఉపయోగిస్తే ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతుంది. అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడే ఎమర్జెన్సీ ఫండ్ ఉంటే అనుకోని పరిస్థితుల్లో ఇబ్బందులు తగ్గుతాయి.

వర్షా కాలంలో తప్పనిసరిగా చూడాల్సిన ఈ 4 ప్రదేశాలు.. ఎంజాయ్ మిస్ కాకండి

Monsoon Travel
Monsoon Travel

Monsoon Travel: వర్షాకాలం ప్రకృతికి కొత్త అందాలను తీసుకువస్తుంది. ఈ సమయంలో పచ్చని కొండలు, మేఘాల మధ్య జలపాతాలు, చల్లని వాతావరణం ఏర్పడుతుంది. ఇన్నాళ్లు వేసవి వేడిలో విసిగిపోయిన వారు ఇక్కడి వెళ్లి హాయిగా గడపొచ్చు. అలాంటి ప్రదేశాలు మన దేశంలో చాలా వరకు ఉన్నాయి. అయితే ఈ మాన్ సూన్ లో ట్రిప్ కు అనువైన ప్రదేశాల్లో కొన్ని అద్భుతం అని అనిపిస్తాయి. అలాంటి వాటిలో ఈ 4 ముఖ్యమైనవి. హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఎలా వెళ్లాలో తెలుసుకుందాం..

టీ తోటల స్వర్గం..మున్నార్:
కేరళలోని మున్నార్ మాన్‌సూన్ సీజన్‌లో మరింత అందంగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా పచ్చని టీ తోటలు, పొగమంచుతో కప్పుకున్న కొండలు, జలపాతాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఎరవికుళం నేషనల్ పార్క్, మాట్టుపెట్టి డ్యామ్, టాప్ స్టేషన్ వంటి ప్రదేశాలు ప్రత్యేక ఆకర్షణలు. వర్షాల్లో ఇక్కడి ప్రకృతి అందాలు మరింత మెరుగ్గా కనిపిస్తాయి. హైదరాబాద్ నుంచి కొచ్చి వరకు విమానంలో వెళ్లి, అక్కడి నుంచి సుమారు 130 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో టాక్సీ లేదా బస్సులో మున్నార్ చేరుకోవచ్చు. రైలులో ప్రయాణించేవారు ఎర్నాకుళం స్టేషన్ వరకు వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గాన్ని ఎంచుకోవచ్చు.

కాఫీ తోటల అందాలకు కేరాఫ్..కూర్గ్:
భారతదేశంలోని అత్యంత అందమైన హిల్ స్టేషన్లలో కర్ణాటక రాష్ట్రంలోని కూర్గ్ ఒకటి. వర్షాకాలంలో ఇక్కడి కాఫీ తోటలు, పచ్చని కొండలు, అబ్బే ఫాల్స్ వంటి జలపాతాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ప్రశాంత వాతావరణం, ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునేవారికి ఇది ఉత్తమ ఎంపిక. ఇక్కడికి వెళ్లాలని అనుకునేవారు హైదరాబాద్ నుంచి మైసూరు లేదా బెంగళూరు వరకు రైలు, బస్సు లేదా విమానంలో వెళ్లవచ్చు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కూర్గ్ చేరుకోవచ్చు. బెంగళూరు నుంచి కూర్గ్ దూరం సుమారు 260 కిలోమీటర్లు.

అద్భుతమైన జలపాతం..లోనావాలా..:
మహారాష్ట్రలోని లోనావాలా మాన్‌సూన్ టూరిజానికి ప్రసిద్ధి చెందింది. వర్షాకాలంలో ఇక్కడి లోయలు, పచ్చని కొండలు, చిన్న పెద్ద జలపాతాలు అద్భుతంగా కనిపిస్తాయి. ట్రెక్కింగ్, ఫోటోగ్రఫీ, ఫ్యామిలీ ట్రిప్స్‌కు ఇది మంచి గమ్యస్థానం. టైగర్ పాయింట్, భూషి డ్యామ్, రాజమాచి ఫోర్ట్ వంటి ప్రదేశాలు తప్పక చూడాల్సినవి. హైదరాబాద్ నుంచి పుణె లేదా ముంబై వరకు రైలు లేదా విమానంలో వెళ్లి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సులభంగా లోనావాలా చేరుకోవచ్చు. పుణె నుంచి కేవలం 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

రంగురంగుల పూల ప్రపంచం..వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్:
ఉత్తరాఖండ్‌లోని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రం. జూలై నుంచి సెప్టెంబర్ మధ్య వేలాది రకాల అడవి పూలతో ఈ లోయ రంగుల హరివిల్లుగా మారుతుంది. ప్రకృతి ప్రేమికులు, ట్రెక్కింగ్ అభిమానులకు ఇది స్వర్గధామం లాంటిది. హైదరాబాద్ నుంచి డెహ్రాడూన్ వరకు విమానంలో వెళ్లాలి. అక్కడి నుంచి జోషిమఠ్, గోవిందఘాట్ చేరుకుని ట్రెక్కింగ్ ద్వారా వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌కు చేరుకోవాలి. ఈ ప్రయాణం కొంత కష్టమైనదే అయినా, అక్కడి అందాలు జీవితాంతం గుర్తుండిపోతాయి.

అయితే ప్రస్తుతం వర్షాకాలం సీజన్ కావడంతో వాతావరణ పరిస్థితులు తెలుసుకొని ఇక్కడికి వెళ్లాలి. అంతేకాకుండా తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది.

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ లేపేయడానికి ఇజ్రాయిల్ స్కెచ్.. నవ్వి నవ్వి చచ్చిపోతే ఎవడ్రా గ్యారెంటీ..

Pakistan Army Chief Asim Munir
Pakistan Army Chief Asim Munir

Pakistan Army Chief Munir: ఏదైనా ఒక విషయం చెబితే నమ్మే విధంగా ఉండాలి. ముఖం మీద ఉమ్మే విధంగా ఉండకూడదు. ఈ విషయం కూడా అటువంటిదే. దానిని ఒక బ్రెజిల్ జర్నలిస్ట్ చెప్పాడు. జర్నలిస్టు కదా.. చెబితే నమ్మాలి కదా అనుకుంటుంటే.. అది నమ్మే విధంగా లేదు. ముఖం మీద ఉమ్మే విధంగా ఉంది. ఇంతకీ అతడు చెప్పిన ఆ కథేంటి.. దాని వ్యవహారం ఏంటి..

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గా మునిర్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇతగాడు తన పదవిని కాపాడుకోవడం కోసం రకరకాల మాయలు.. రకరకాల వ్యవహారాలు సాగిస్తూ ఉంటాడు. అమెరికా ముందు సాగిలపడుతూ ఉంటాడు. అదే కాదు తన పదవి కోసం పాకిస్తాన్ ప్రయోజనాలను సైతం తాకట్టు పెట్టడానికి వెనుకాడడు. అటువంటి మునీర్ ఇజ్రాయిల్ లిస్టులో ఉన్నాడట. ఇజ్రాయిల్ సీక్రెట్ ఏజెన్సీ సంస్థ మోసాద్ ఇతడిని లేపేయడానికి కుట్ర పన్నిందట. అంతేకాదు కొంతకాలంగా పాకిస్తాన్ డెలిగేట్స్ విషయంలో కూడా ఇజ్రాయిల్ పక్క ప్లాన్ తో ఉందట.

ఈ విషయాన్ని బ్రెజిల్ జర్నలిస్టు పేప్ ఎస్కో బార్ బయటపెట్టాడు. జెనీవాలో అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చ సందర్భంగా మునీర్.. ఇతర పాకిస్తాన్ డెలిగేట్స్ ను చంపడానికి ఇజ్రాయిల్ స్కెచ్ వేసిందట.. ఈ విషయం పాకిస్తాన్ దేశానికి తెలిసిందంట. మా ఆర్మీకి ఏదైనా జరిగితే మీ దేశాన్ని నాశనం చేస్తామని మధ్యవర్తుల ద్వారా పాకిస్తాన్ హెచ్చరించిందట.

పాకిస్తాన్ కే దిక్కు దివానం లేదు. లెబనాన్ మీద దాడులు చేస్తుంటే అంతటి అమెరికా మూసుకొని కూర్చుంది. పైగా ఇజ్రాయిల్ సీక్రెట్ ఏజెన్సీ సంస్థ ఎలా పనిచేస్తుందో అందరికీ తెలుసు. చివరికి అమెరికా కూడా ఇజ్రాయిల్ ముందు తలవంచక తప్పదు. ఇజ్రాయిల్ స్కెచ్ వేస్తే ఎంతటి నాయకుడైనా సరే చావాల్సిందే. అంతటి కోరలు చాచి ఉన్న ఇరాన్ ఖమేని చచ్చి ఊరుకున్నాడు. అటువంటి ఇజ్రాయిల్ సీక్రెట్ ఏజెన్సీ ముందు పాకిస్తాన్ నిలబడుతుందా.. మునీర్ బతికి బట్ట కడతాడా..

ఒకవేళ ఇజ్రాయిల్ దేశానికి పాకిస్తాన్ పై దాడులు చేయాల్సిన అవసరం ఏంటి.. మునీర్ ను చంపేస్తే పాకిస్తాన్ కి వచ్చే ప్రయోజనం ఏంటి. ఇవేవీ పనికొచ్చే ముచ్చట్లు కావు. బ్రెజిల్ జర్నలిస్ట్ ఏదో గాలి మాటలు మాట్లాడినట్టు కనిపిస్తోంది. ఒకవేళ చంపాలి అనుకుంటే ఇజ్రాయిల్ దేశానికి పెద్ద లెక్క కాదు. పాకిస్తాన్ దేశం పెద్ద లెక్కలోది కాదు. ఎందుకంటే ఇజ్రాయిల్ సాంకేతికంగా.. ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశం. అక్కడ ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. పాకిస్తాన్ లాగా దరిద్రంగా.. చండాలంగా ఉండదు.

ఒకవేళ పాకిస్తాన్ కనుక ఇజ్రాయిల్ మీద దాడి చేస్తే.. మరుసటి క్షణం ఈ భూమి మీద పాకిస్తాన్ పేరు ఉండదు. ఇజ్రాయిల్ తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఇరాన్ కు తెలుసు.. హిజ్ బుల్లా ఉగ్రవాదులకు తెలుసు. తెలియనిది కేవలం పాకిస్తాన్ కి మాత్రమే. ఆల్రెడీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దెబ్బకు పాకిస్తాన్ అన్ని మూసుకుంది. ఆ చిన్న దళాన్నే పాకిస్తాన్ ఏం చేయలేకపోతోంది. ఇజ్రాయిల్ దేశాన్ని ఏం చేయగలుగుతుంది..

జబర్దస్త్ ఫైమా సీక్రెట్ పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా? ఊహించని ట్విస్ట్

Jabardasth Faima marriage

Jabardasth Faima marriage : జబర్దస్త్ వేదికపై తనదైన కామెడీ టైమింగ్, తెలంగాణ యాసతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన లేడీ కమెడియన్ ఫైమా జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఎలాంటి ముందస్తు ప్రకటనలు, ఆర్భాటాలు లేకుండా తన ప్రియుడు ప్రవీణ్ నాయక్‌ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, అభిమానులు, సినీ, టెలివిజన్ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

తొమ్మిదేళ్ల ప్రేమకు పెళ్లి ముహూర్తం

ఫైమా భర్తగా మారిన వ్యక్తి పేరు ప్రవీణ్ నాయక్. ఆసక్తికర విషయం ఏమిటంటే.. వీరిద్దరూ గత తొమ్మిదేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఫైమా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టకముందే వీరి పరిచయం ప్రేమగా మారింది. ఈ ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు, ఒత్తిళ్లు, విమర్శలు ఎదురైనా ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకాన్ని మాత్రం కోల్పోలేదు. చివరకు ఆ ప్రేమను పెళ్లి బంధంతో శాశ్వతం చేసుకున్నారు.

ఎమోషనల్ పోస్ట్‌తో మనసు విప్పిన ఫైమా

పెళ్లి అనంతరం రిజిస్ట్రార్ కార్యాలయంలో భర్త ప్రవీణ్‌తో కలిసి దిగిన ఫోటోలు, వీడియోను ఫైమా తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. ఈ సందర్భంగా ఆమె చేసిన ఎమోషనల్ పోస్ట్ అభిమానులను కదిలించింది.

“మమ్మల్ని అనుమానించారు.. మమ్మల్ని విమర్శించారు.. మమ్మల్ని విడదీయడానికి ఎంతో ప్రయత్నించారు. కానీ మా ప్రేమ ప్రతి అడ్డంకిని అధిగమించి మరింత బలపడింది. ఈ ప్రయాణంలో ఎన్నో పోరాటాలు, అంతులేని సహనం ఉన్నాయి. ఒకరినొకరు వదిలేయడానికి వేల కారణాలు ఉన్నా.. ప్రతిరోజూ ఒకరి కోసం ఒకరం జీవించాలని నిర్ణయించుకున్నాం. చివరకు ఈ రోజు భార్యాభర్తలమయ్యాం” అంటూ తన ప్రేమ ప్రయాణాన్ని భావోద్వేగంగా వివరించింది.

పటాస్ నుంచి బిగ్‌బాస్ వరకు…

పటాస్ కార్యక్రమంతో కెరీర్ ప్రారంభించిన ఫైమా, జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించింది. అనంతరం బిగ్‌బాస్ రియాలిటీ షోలో పాల్గొని మరింత ప్రజాదరణ పొందింది. తన సహజమైన కామెడీ, టైమింగ్‌తో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆమె ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో కూడా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది.

సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ

ఫైమా పెళ్లి వార్త బయటకు రావడంతో అభిమానులతో పాటు జబర్దస్త్ సహచరులు, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్లు, పలువురు టెలివిజన్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఎన్నో ఒడిదొడుకులను దాటి ప్రేమను గెలిపించుకున్న ఫైమా-ప్రవీణ్ జంటకు నెటిజన్లు అభినందనలు తెలియజేస్తూ, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by FAIMA (@faima_patas)

ఐదు రాశుల వారు ఈ రోజు ఏ పని మొదలుపెట్టినా విజయమే..

Today 6 July 2026 Horoscope
Today 6 July 2026 Horoscope

Today June 25 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అన్ని అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి ఉద్యోగులకు ఈ రోజు అనుకూలమైన ఫలితాలు ఉండనున్నాయి. కొన్ని ప్రాజెక్టులు పూర్తికావడానికి తోటి వారి సహకారం ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉండటంతో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. అదనపు బాధ్యతలు పెరగడంతో బిజీగా మారుతారు. విద్యార్థుల పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈరోజు తోటి వారి సహకారంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. విద్యార్థుల కెరీర్ పై తల్లిదండ్రులు కీలకమైన నిర్ణయం తీసుకుంటారు. శక్తి సామర్ధ్యాల మీదకే ఖర్చులు పెట్టాలి. అవసరపు ఖర్చులకు దూరంగా ఉండడమే మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఇదే మంచి సమయం.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారికి ఈ రోజు అన్ని శుభ ఫలితాలే రానున్నాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు అధిక లాభాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల ముఖ్యమైన పనులను పూర్తి చేసుకోగలుగుతారు. పెద్దల ఆశీస్సులతో కొత్తగా పెట్టుబడులు పెడతారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఉద్యోగులకు కార్యాలయాల్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. తమ నైపుణ్య ప్రదర్శన ద్వారా అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ప్రియమైన వారి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు ప్రత్యర్థుల బెడద ఉండే అవకాశం ఉంటుంది.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో గౌరవం లభిస్తుంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు నిర్జల ఏకాదశి సందర్భంగా వీరు చేసే ప్రతి పనిలో విజయం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి సంతోషంగా గడుపుతారు. పిల్లల భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకుంటారు.

కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు మానసికంగా సంతృప్తిగా ఉంటారు. అప్పుల నుంచి బయటపడతారు . ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. కెరీర్ విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. మెరుగైన ఆరోగ్యం కోసం నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవాలి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అవసరానికి మించి ఖర్చులు చేయకుండా ఉండాలి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఇదే మంచి సమయం.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని విజయాలే ఉంటాయి. గతంలో ఉన్న అప్పులను ఈరోజు తీరుస్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. విహార యాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. గతంలో కంటే ఇప్పుడు మానసికంగా సంతృప్తిగా ఉంటారు. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. ఇంటికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈరోజు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పరిస్థితులకు అనుకూలంగా వ్యవహరించాలి. కొందరు తప్పు దోవ పట్టించే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలోనే అప్రమత్తంగా ఉండాలి. దూరపు బంధువుల నుంచి సమాచారం అందుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు అన్నీ అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఏ పని చేసిన విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు తోటి వారి సహకారం ఉండడంతో ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. అవసరానికి డబ్బు అందడంతో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారులు ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు అనుకున్న విజయాలను సాధిస్తారు. అయితే ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. ఉద్యోగులు కొన్ని పనులు సకాలంలో పూర్తి చేయకపోవచ్చు. ఇలాంటి సమయంలో అధికారుల నుంచి వేధింపులు ఉంటాయి. ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. కొత్త ఆలోచనలతో ఉత్సాహంగా ఉంటారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని విజయాలే ఉంటాయి. నైపుణ్యాలు ప్రదర్శించడం ద్వారా ఉద్యోగులకు అధికారుల నుంచి వేధింపులు ఉంటాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. గ్రహాల అనుకూలతలతో అనుకొని అదృష్టం వరిస్తుంది.

తానా – SATVIINSPIRE ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెనుగుపూడి జెడ్పీ హైస్కూల్ విద్యార్థులకు హోంవర్క్ డైరీల పంపిణీ

TANA - SATVIINSPIRE Foundation

TANA – SATVIINSPIRE Foundation అనకాపల్లి: విద్యార్థుల్లో క్రమశిక్షణ, బాధ్యతాభావం పెంపొందించడంతో పాటు తల్లిదండ్రులు వారి విద్యా పురోగతిని సులభంగా పర్యవేక్షించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), SATVIINSPIRE ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం తెనుగుపూడి ప్రభుత్వ జెడ్పీ హైస్కూల్‌లో హోంవర్క్ డైరీలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి చి. శ్రీచరణి మేకా స్పాన్సర్‌గా వ్యవహరించగా, తానా ఫౌండేషన్ ట్రస్టీ సతీష్ చౌదరి మేకా సమన్వయంతో డైరీలను విద్యార్థులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ, హోంవర్క్ డైరీల ద్వారా విద్యార్థులు ప్రతిరోజూ చేసే హోంవర్క్, పాఠశాల కార్యకలాపాలు, విద్యా పురోగతిని తల్లిదండ్రులు క్రమం తప్పకుండా తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. అలాగే విద్యార్థుల్లో బాధ్యతాభావం, సమయపాలన, క్రమశిక్షణ పెంపొందించడంతో పాటు పాఠశాల–తల్లిదండ్రుల మధ్య సమన్వయం మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.ఎస్.ఎస్.వి. ప్రసాద్ మాట్లాడుతూ, ఈ విద్యా సేవా కార్యక్రమానికి సహకరించిన తానా ఫౌండేషన్ ట్రస్టీ సతీష్ మేకా, తానా ఫౌండేషన్ సభ్యులు, SATVIINSPIRE ఫౌండేషన్ ప్రతినిధులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు అందించిన సహకారాన్ని అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పెద్దాడ వెంకటరమణ, శ్రీనివాసరావు, మహేశ్వరరావు, కొండమ్మ, త్రినాధరావు తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు, తానా ఫౌండేషన్ చైర్మన్ డా. ప్రసాద్ నల్లూరి, తానా బోర్డు చైర్మన్ డా. నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి, అలాగే తానా న్యూజెర్సీ బృందం మార్గదర్శకత్వం, సహకారం అందించారు.

ఈ సందర్భంగా SATVIINSPIRE ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, అర్హత కలిగిన ఉపాధ్యాయులు సేవలందిస్తున్న, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు అధికంగా చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల్లో భవిష్యత్తులో కూడా ఇలాంటి విద్యా సహాయ కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.

విద్యార్థుల విద్యాభివృద్ధికి దోహదపడే ఈ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు, తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం తానా, SATVIINSPIRE ఫౌండేషన్ చేపడుతున్న విద్యా సేవా కార్యక్రమాలు మరెంతో మందికి ఆదర్శంగా నిలుస్తాయని వారు పేర్కొన్నారు.

కుశిత.. నిన్ను చూస్తే ఎదలో గిలిగింత..

Kushitha Kallapu latest photos
Kushitha Kallapu latest photos

'సింగ్ గీతం' వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్.. పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ డిజాస్టర్ గా మిగిలింది..

Sing Geetham Movie Collections
Sing Geetham Movie Collections

Sing Geetham Movie Collections: రీసెంట్ గా విడుదలైన చిత్రాల్లో ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ రివ్యూస్ ని సొంతం చేసుకున్న చిత్రం ‘సింగ్ గీతం’. 94 ఏళ్ళ వయస్సులో , సినిమా మీద ప్యాషన్ తో సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ చిత్రానికి క్రిటిక్స్ నుండి కూడా అద్భుతమైన రివ్యూస్ వచ్చాయి .పాటలతో సినిమా అనే సరికొత్త ప్రయోగం తో సింగీతం శ్రీనివాస రావు రూపొందించిన ఈ చిత్రం , ఒక అద్భుతమైన ప్రయోగమని , ఈ కాలం లో ఇలాంటి కాన్సెప్ట్ ని ఎంచుకొని సినిమా చేయడం కేవలం ఆయనకు మాత్రమే సాధ్యమని , ఇలాంటి సినిమాలను ఆడియన్స్ కమర్షియల్ గా కూడా ఆదరిస్తే బాగుంటుందని చూసిన వాళ్ళు చెప్పుకొచ్చారు. కానీ ఈ చిత్రం ఓవరాల్ గా థియేట్రికల్ రన్ పరంగా డిజాస్టర్ గా నిల్చింది.

ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి నమోదైన గ్రాస్ మరియు షేర్ వసూళ్ళు ఎంతో ఒకసారి చూద్దాం. నైజాం ప్రాంతం నుండి 3 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, ఆంధ్ర ప్రదేశ్ + సీడెడ్ ప్రాంతం నుండి 2 కోట్ల 15 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 5 కోట్ల 15 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అవ్వగా, 2 కోట్ల 45 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు నమోదు అయ్యాయి. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ కలిపి ఈ చిత్రానికి 2 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, 7 కోట్ల 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 3 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా పూర్తి స్థాయి లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని క్లీన్ సూపర్ హిట్ స్టేటస్ ని అందుకోవాలంటే 7 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది.

కానీ ఆ అందులో కేవలం సగం వసూళ్లను మాత్రమే ఈ చిత్రం రాబట్టిగలిగింది. ఓవరాల్ గా ఒక మంచి సినిమా కమర్షియల్ గా డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలినట్టు అయ్యింది చివరికి. మన టాలీవుడ్ లో ఆడియన్స్ రొటీన్ సినిమాలను చూసి విసిగిపోయాము , కొత్త తరహా ప్రయోగాత్మక చిత్రాలను అందించండి అంటూ పెద్ద రేంజ్ లో గొడవ చేస్తారు. కానీ అలాంటి సినిమాలు వచ్చినప్పుడు మాత్రం ఆదరించరు . 94 ఏళ్ళ వయస్సులో పని చెయ్యాలని సింగీతం శ్రీనివాస్ కి ఎందుకు ఉంటుంది చెప్పండి?, పని మీద ప్రేమ కారణంగా ఆడియన్స్ కి ఒక సరికొత్త థియేట్రికల్ అనుభూతిని అందించాలనే కసి తో పని చేసాడు , కనీసం అందుకోసం అయినా మన మూవీ లవర్స్ ఒక్కసారి ఈ చిత్రాన్ని చూసి ఉండాల్సింది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మండిపడుతున్నారు.

మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ లో రామ్ చరణ్.. అసలు కారణం ఏంటంటే..

Ram Charan And Pawan Kalyan
Ram Charan And Pawan Kalyan

Ram Charan And Pawan Kalyan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ మూవీ సక్సెస్ తో ఫుల్ జోష్ మీద ఉన్నాడు. థియేటర్స్ లో గత మూడు వారాల నుండి అద్భుతంగా రన్ ని సొంతం చేసుకుంటూ ముందుకెళ్తున్న ఈ సినిమా, కొన్ని ప్రాంతాల్లో అధిక రేట్స్ కారణంగా బ్రేక్ ఈవెన్ మార్కు ని అందుకోలేకపోయినప్పటికీ, నటుడిగా రామ్ చరణ్ ని పూర్తి స్థాయిలో సంతృప్తి పడేలా చేసిన సినిమా ఇది. ఎందుకంటే ఈ సినిమాకు ఆయన పడినంత కష్టం , ఏ సినిమాకు కూడా పడలేదు, అది మన కళ్ళకు స్ఫష్టంగా కనిపిస్తోంది. 21 రోజుల్లో 350 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించిన ఈ చిత్రం , దాదాపుగా థియేటర్స్ వద్ద రన్ ని పూర్తి చేసుకునే పరిస్థితి కి వచ్చేసింది. నిన్ననే ఈ చిత్రానికి సంబంధించిన విజయోత్సవ సభ ని చాలా గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్.

ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథి గా పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ గురించి , పెద్ది చిత్రం గురించి గొప్పగా మాట్లాడిన మాటలు కొన్ని ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇదంతా పక్కన పెడితే నేడు ఆంధ్ర ప్రదేశ్ లోని మంగళగిరి క్రికెట్ స్టేడియం లో ‘ఆంధ్ర ప్రీమియర్ లీగ్’ మ్యాచులు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా పాల్గొనేందుకు వచ్చిన రామ్ చరణ్, పనిలో పనిగా తన బాబాయ్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆఫీస్ ని కూడా సందర్శించాడు. అందుకు సంబంధించిన ఫోటో ఒకటి కాసేపటి క్రితమే సోషల్ మీడియా లో విడుదలై బాగా వైరల్ అయ్యింది. బ్లాక్ టీ షర్ట్ , కూలింగ్ గ్లాస్సెస్ పెట్టుకొని రామ్ చరణ్ ఒక పక్క స్టైల్ గా నడుస్తుంటే , మరో పక్క పవన్ కళ్యాణ్ అమ్మవారి మాలలో , కూలింగ్ గ్లాస్సెస్ తో కనిపిస్తూ , ఫోన్ చూసుకుంటూ నడుస్తున్నాడు.

ఈ ఫొటోలో వీళ్లిద్దరి స్టైల్ , స్వాగ్ ని చూసి అభిమానులు ఎంతగానో మురిసిపోతున్నారు. దాదాపుగా 40 నిమిషాల పాటు బాబాయ్ మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ లో గడిపాడట రామ్ చరణ్. 2019 ఎన్నికల తర్వాత , రామ్ చరణ్ జనసేన పార్టీ మంగళగిరి ఆఫీస్ కి రావడం ఇదే రెండవ సారి. గతం లో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం లో భాగంగా , వడదెబ్బ సోకి పడిపోయారు. ఆ సమయం లో పవన్ కళ్యాణ్ ని ఓదార్చేందుకు వచ్చిన రామ్ చరణ్ , మళ్లీ ఇన్నాళ్లకు జనసేన పార్టీ ఆఫీస్ లో దర్శనం ఇవ్వడం అభిమానులకు పండగ వాతావరణం ని తలపించింది.

కుక్కపై పరీక్షలు.. మద్యంలో విషం.. 8 మందిని కడతేర్చి అంత్యక్రియలకు హాజరు.. ఫోన్ కాల్ తో సైకో కిల్లర్ దొరికాడిలా..

Chhattisgarh Serial Killer
Chhattisgarh Serial Killer

Chhattisgarh Serial Killer: ఫోరెన్సిక్ సినిమా చూశారా.. అందులో సైకో కిల్లర్ తాను చిన్నగా ఉన్నప్పుడే కోడి పిల్లలను బంధిస్తాడు. వాటిని అత్యంత క్రూరంగా చంపేస్తాడు. ఆ తర్వాత అదే ప్రయోగాన్ని మనుషుల మీద చేస్తుంటాడు. తనకు గిట్టని వాళ్ళ కదలికలను వాళ్లకు తెలియకుండానే పసిగడతాడు. ఆ తర్వాత అదును చూసి దాడి చేస్తాడు. చంపేసి.. ఆనవాళ్లు లేకుండా చేస్తాడు. సేమ్ ఇలాంటిదే చత్తీస్ గడ్ రాష్ట్రంలో జరిగింది. ఆ సైకో కిల్లర్ చేసిన దారుణాలు.. వెలుగులోకి వస్తుంటే పోలీసులకు మతి పోయినంత పని అయింది.

చత్తీస్ గడ్ రాష్ట్రంలో ఇటీవల బలోద బజార్ జిల్లాలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఈ ప్రాంతానికి చెందిన రామ్ సహాయ్ జైస్వాల్ అనే వ్యక్తి కిరాణా దుకాణాన్ని నడిపిస్తూ ఉంటాడు. ఇతడు సుహాగా అనే విషాన్ని వీధి కుక్కకు ఆహారంలో పెట్టాడు. అది తిన్న కుక్క చనిపోయింది. ఆ తర్వాత దాన్ని అతడు మనుషుల మీద కూడా ప్రయోగించడం మొదలుపెట్టాడు..

తనతో శత్రుత్వం కొనసాగించిన వారిని.. గొడవ పెట్టుకున్న వారిని.. అప్పులు ఇచ్చిన వారిని.. అనుచితంగా ప్రవర్తించిన వారిని జైస్వాల్ అంతం చేశాడు. బద్రి అనే వ్యక్తి హత్యతో తన నరమేధానికి శ్రీకారం చుట్టాడు జైస్వాల్. ఫిబ్రవరి 6న బద్రికి మద్యంలో విషం కలిపి తాగించాడు ఆ తర్వాత బద్రి చనిపోయాడు. ఫిబ్రవరి 20న కుల ఎన్నికలకు సంబంధించి వివాదాలు ఏర్పడిన నేపథ్యంలో.. బుతాలు అనే వ్యక్తిని హత్య చేశాడు. మార్చి 12న తన భార్య తో సంబంధం కొనసాగిస్తున్నాడని అనుమానంతో చట్టూ రామ్ అనే వ్యక్తిని విషం ఇచ్చి చంపాడు. మార్చి 20న ఒక భూ వివాదానికి సంబంధించిన కేసులో బుద్రం అనే వ్యక్తిని లక్ష్యంగా చేసుకొని చంపేశాడు. మార్చి 31న వినోద్ కుమార్ అనే వ్యక్తితో వివాదాలు జరిగిన నేపథ్యంలో అతన్ని కూడా విషం ఇచ్చి చంపేశాడు. ఏప్రిల్ 28న గజానంద్ అనే వ్యక్తికి విషం ఇచ్చి చంపేశాడు. గజానంద్ తనకు క్షుద్ర పూజలు చేస్తున్నాడని.. ఆర్థికంగా నష్టం కలిగిస్తున్నాడని అనుమానించి అతడిని చంపేశాడు.

జైస్వాల్ చైతురామ్ అనే వ్యక్తి దగ్గర 50,000 అప్పు తీసుకున్నాడు. ఇచ్చిన అప్పును తిరిగి ఇవ్వాలని చైతు రామ్ జైస్వాల్ మీద ఒత్తిడి తేవడం మొదలుపెట్టాడు. అతడికి డబ్బులు చెల్లించే ఉద్దేశం లేకపోవడంతో జస్వాల్ చైతురామ్ ను హత్య చేశాడు. ఆ తర్వాత అతనితో గొడవపడిన మహేతురు రామ్ అనే వ్యక్తిని మే 14న చంపేశాడు జైస్వాల్.

చనిపోయిన వారందరికీ జైస్వాల్ మద్యం తాగించేవాడు. అందులో ఈ ప్రమాదకరమైన విషం కలిపేవాడు. అది తాగిన తర్వాత వారంతా చనిపోయారు. అన్ని మరణాలు ఒకే విధంగా ఉండడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. అంతకంటే ముందు చనిపోయిన వారి అంత్యక్రియల్లో జైస్వాల్ పాల్గొనేవాడు. వారి కుటుంబ సభ్యులు ఏడుస్తుంటే ఓదార్చేవాడు. అంతేకాదు వారు అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్లేవాడు. ఇలా తనపై అనుమానం రాకుండా జైస్వాల్ చూసుకున్నాడు. గ్రామస్తులతో కలిసి విచారం వ్యక్తం చేసేవాడు. దీంతో జైస్వాల్ మీద ఎవరికి అనుమానం రాలేదు.

కార్తీక్ అనే వ్యక్తిని కూడా చంపడానికి మద్యం లో విషం కలిపాడు. అయితే కార్తీక్ అపస్మారక స్థితికి చేరుకున్నప్పటికీ ప్రాణాలతో బయటపడ్డాడు. జైస్వాల్ తనకు ఆ పానీయం వల్లే ఇలా అయిపోయానని.. కార్తీక్ పోలీసులతో చెప్పడంతో.. వారికి అనుమానం మొదలైంది. మద్యం తాగించడానికి ముందు కార్తీక్ కు జైస్వాల్ ఫోన్ చేశాడు. ఆ తర్వాత అన్ని చావుల పరంపర ఒకే విధంగా ఉండడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు మొదలుపెట్టారు. విచారణ జరుగుతున్నప్పుడు జైస్వాల్ మొదట నిరాకరించాడు. ఆ తర్వాత పోలీసులు తమదైన శైలిలో విచారిస్తే అసలు విషయాలను చెప్పాడు.

తనతో గొడవ పడిన వారిని.. క్షుద్ర పూజలు చేస్తున్న వారిని టార్గెట్ గా చేసుకున్నానని.. వారికి మందులో విషం కలిపి తాగించాలని జైస్వాల్ ఒప్పుకున్నాడు. మొత్తంగా పోలీసులు జైస్వాల్ మీద 8 హత్య కేసులు.. ఒక హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇన్ని మరణాలు జరుగుతున్నప్పటికీ అక్కడ గ్రామస్తులకు ఏదో జరుగుతోంది అనే అనుమానం మాత్రమే వచ్చింది.. అయితే చనిపోయిన వారు ముందుగా జైస్వాల్ ను కలవడం, కార్తీక్ అనే వ్యక్తికి ఫోన్ కాల్ చేయడంతో ఈ కేసులో పోలీసులకు క్లూ దొరికింది. దాని ఆధారంగా దర్యాప్తు చేస్తే జైస్వాల్ మారణకాండ బయటపడింది.

ఆయిల్‌ ట్యాంకర్ల ధరకు రెక్కలు.. చమురుకు కొత్త కష్టాలు!

Crude Oil Shipping Cost Increase
Crude Oil Shipping Cost Increase

Crude Oil Shipping Cost Increase: ఇరాన్‌–అమెరికా మధ్య డీల్‌ కుదరడంతో హర్మూజ్‌ తెరుచుకుంది. దీంతో నౌకల రాకపోకలు మళ్లీ మొదలయ్యాయి. దీంతో ఇక చమురు సంక్షోభం తీరినట్లే అని ప్రపంచమంతా ఊపిరి పీల్చుకుంది. చమురుధరలు కొంతమేర తగ్గాయి. కానీ ఈ సంతోషం ఆదిలోనే ఆవిరైంది. అనూహ్యంగా చమురుకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. డిమాండ్‌కు అనుగుణంగా ట్యాంకర్లు అందుబాటులో లేకపోవడంతో వాటి ఛార్జీలు భారీగా పెరిగాయి. భారత్‌కు చమురు తీసుకురావడానికి ఒక సూపర్‌ ట్యాంకర్‌ను బుక్‌ చేసుకునేందుకు సాధారణ బెంచ్‌మార్క్‌ రేటు కంటే దాదాపు తొమ్మిది రెట్లు ఎక్కువ చెల్లించాల్సి వచ్చింది. దాదాపు 20 లక్షల బ్యారెళ్ల చమురు మోసుకెళ్లగల సామర్థ్యం ఉన్న ఈ ట్యాంకర్‌ను దక్షిణ కొరియాకు చెందిన సినోకోర్‌ సంస్థ నిర్వహిస్తోంది. ఈ స్థాయిలో ధరలు పెరగడం ఈ ఏడాదిలో ఇదే మొదటిసారి అని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

హర్మూజ్‌ పునరుద్ధరణ..
అమెరికా–ఇరాన్‌ మధ్య శాంతి ఒప్పందం కారణంగా హర్మూజ్‌ జలసంధిని మళ్లీ వాణిజ్య రవాణాకు తెరిచారు. అయితే యుద్ధకాలంలో ఇరాన్‌ ఈ మార్గంలో వేలాది సముద్ర గనులు పరిచింది. వాటిని తొలగించే పని ఆలస్యం అవుతుండటంతో నౌకలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. యుద్ధం వల్ల అక్కడే నిలిచిపోయిన వేలాది ట్యాంకర్లు తమ గమ్యస్థానాలకు చేరేందుకు ఇంకా కొన్ని నెలలు పట్టవచ్చని అంచనా.

బీమా ఖర్చులు, ట్యాంకర్ల కొరత
యుద్ధ ప్రమాదం కారణంగా బీమా ప్రీమియంలు భారీగా పెరగడంతో ఖాళీ ట్యాంకర్లు అందుబాటులో ఉండడం కష్టమైంది. ఒప్పందం ప్రకారం 30 రోజుల్లోపు సముద్ర గనులను పూర్తిగా తొలగించకపోతే, రానున్న వారాల్లో ట్యాంకర్ల ఛార్జీలు మరింతగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రిఫైనరీలు, వినియోగదారులపై ప్రభావం..
ట్యాంకర్ల ఛార్జీలు పెరగడంతో గల్ఫ్‌ నుంచి చమురు దిగుమతి చేసుకునే భారత్, చైనా వంటి దేశాల రిఫైనరీలపై అదనపు భారం పడుతోంది. రవాణా ఖర్చులు పెరగడంతో రిఫైనరీలు రిటైల్‌ ధరలను పెంచే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గినా, వినియోగదారులకు ఆ ప్రయోజనం త్వరగా చేరే అవకాశం తక్కువగా ఉందని విశ్లేషకులు అంటున్నారు.

ప్రస్తుతం బ్రెంట్‌ క్రూడ్‌ ధర నాలుగు నెలల కనిష్ట స్థాయి 76 డాలర్ల వద్ద ఉన్నప్పటికీ, ఈ ఏడాది రెండో అర్ధభాగంలో ధరలు మళ్లీ పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు నిల్వలు బాగా తగ్గాయి. ఇప్పుడు దేశాలు నిల్వలను పునరుద్ధరించడంపై దృష్టి పెట్టడంతో డిమాండ్‌ మళ్లీ పెరగనుంది. ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ఎనర్జీ అంచనా ప్రకారం, రాబోయే నెలల్లో బ్యారెల్‌ ధర 80 నుంచి 90 డాలర్ల మధ్య ఉండే అవకాశం ఉంది.

కోడలు కోరిందని కొడుకును ఒప్పించి పంపింది.. చావుకు కారణమైంది.. ఆ తల్లి గుండెకోత తీరేదెలా..

Ketan Agarwal Death
Ketan Agarwal Death

Ketan Agarwal Death: ఇది మామూలు గుండె కోతకాదు.. కళ్ళముందే పెళ్లీడుకొచ్చిన కుమారుడు హత్యకు గురైతే ఆ తల్లి బాధ ఏ స్థాయిలో ఉంటుంది. అది మాటలకు అందదు. ఆ బాధ వర్ణనకు పోలదు. ఈ బాధను ఆ మాతృమూర్తి అనుభవిస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా తన కొడుకును పంపించానని.. అతడి చావుకు పరోక్షంగా కారణమయ్యానంటూ విలపిస్తోంది.

పూణేలోని లోహ్ గడ్ కోట ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్ జూన్ 18న లోయలో పడి చనిపోయాడు. ఆ ఘటన సహజమైనదని అందరు భావించారు. ఆ తర్వాత పోలీసులు ఈ కేసును విచారిస్తుంటే దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. ఈ ఘోరానికి కేతన్ అగర్వాల్ కాబోయే భార్య సియా కారణమని పోలీసులు నిర్ధారించారు. దీనికి ఆమె ప్రియుడు కేతన్ సహకరించాడని.. వారిద్దరు కలిసి అతడిని అంతం చేశారని పోలీసులు తమ దర్యాప్తులో పేర్కొన్నారు.

జూన్ 18 కంటే ముందు.. జూన్ 14న లోహ్ గడ్ కోటకు సియా, కేతన్ వెళ్లారు. అప్పుడు అతడిని లోయలోకి తోసి వేసింది. అప్పుడు ఒక పొదను పట్టుకొని అతడు ప్రాణాలు కాపాడుకున్నాడు. పాము కనిపిస్తే తోసి వేశానని.. అప్పుడు సియా చెప్పింది. ఆమె చెప్పిన మాటలను కేతన్ నమ్మాడు.

ఆ తర్వాత జూన్ 18న తన పుట్టినరోజు కావడంతో సియా లోహ్ గడ్ కోటకు వెళ్దామని కేతన్ కు చెప్పింది. దానికి అతడు ఒప్పుకోలేదు. దీంతో సియా కేతన్ తల్లిని సంప్రదించింది.”అత్తయ్య ఈరోజు నా పుట్టినరోజు. కేతన్ తో కలిసి జరుపుకోవాలని అనుకుంటున్నాను. అతనితో కొంత సమయం గడపాలి అనుకుంటున్నాను. ఆ కోటకు వెళ్తాం. మీరు అతడిని ఒప్పించండని” కోరింది. కాబోయే కోడలు చెప్పిన మాటలు విన్న ఆమె.. కేతన్ తో మాట్లాడింది. అతడిని ఒప్పించింది. అంతేకాదు సియాను జాగ్రత్తగా చూసుకో అని చెప్పింది.

తన కొడుకును తానే కోటకు పంపించానని.. అందువల్లే అతడు చనిపోయాడని కేతన్ మాతృమూర్తి పదే పదే బాధపడుతోంది. ఆ సంఘటన గుర్తుకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఉలిక్కిపడుతోంది. తనను తానే తిట్టుకుంటున్నది. కన్నీటిపర్యంతమవుతున్నది. ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కేతన్ భయపడుతుంటాడని.. ఆ విషయం తెలిసి కూడా అతడిని పంపించానని.. ఇప్పుడు అతడు లేకపోవడం.. కాబోయే భార్య చేతిలో చనిపోవడం.. గుండెను ముక్కలు చేసినట్టు ఉంటున్నదని కేతన్ తల్లి వాపోతోంది.

'ది ప్యారడైజ్' మూవీ షూటింగ్ అప్డేట్.. పాపం నాని కి చుక్కలు చూపిస్తున్నాడుగా డైరెక్టర్..

Paradise Movie
Paradise Movie

The Paradise Movie Update: నేచురల్ స్టార్ నాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో మంచి ఊపు మీదున్న నాని వేరే లెవెల్ కి వెళ్ళేందుకు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తో ఈ చిత్రాన్ని ప్లాన్ చేసాడు. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి విడుదలైన ప్రతీ కంటెంట్ కి ఆడియన్స్ నుండి బ్లాస్టింగ్ రేంజ్ రెస్పాన్స్ రావడంతో సినిమా పై హైప్ ఎవ్వరూ ఊహించనంత రేంజ్ కి చేరింది. ఎప్పుడు విడుదలైనా ఒక స్టార్ హీరో సూపర్ హిట్ సినిమాకు ఎలాంటి ఓపెనింగ్ వస్తుందో , అలాంటి ఓపెనింగ్ ఈ చిత్రానికి కచ్చితంగా వస్తుందని ట్రేడ్ విశ్లేషకులు సైతం చెప్పుకొచ్చారు. అయితే ఈ చిత్రం రిపీట్ గా విడుదల తేదీలను వాయిదా వేసుకుంటూ ఉండడం వల్ల, మార్కెట్ లో బజ్ చిన్నగా తగ్గిపోతూ వస్తోంది.

ముందుగా మార్చి 26 న విడుదల చెయ్యాలని అనుకున్నారు , ఆ తర్వాత ఆగస్టు 21 కి వాయిదా వేశారు , ఇప్పుడు ఆ తేదీలో కూడా వచ్చే పరిస్థితులు లేకపోవడం తో , సెప్టెంబర్ 25 న ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని చూస్తున్నారట. అది కూడా నెట్ ఫ్లిక్స్ సంస్థ ఒత్తిడి చేయడం వల్లే, ఆ తేదీన రావాలని అనుకుంటున్నారని , కానీ అప్పటికీ కూడా ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలు లేవని ఇండస్ట్రీ వర్గాల్లో సాగుతున్న చర్చ. ఇలాంటి రూమర్స్ వచ్చిఅప్పుడల్లా ప్యారడైజ్ టీం సోషల్ మీడియా లో రెస్పాన్స్ ఇస్తూ , అలాంటివేమీ లేదని , షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతుందని , ఆగస్టు 21 న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నామంటూ చెప్పుకొచ్చేది. కానీ ఇప్పుడు మూవీ టీం నుండి చప్పుడు లేదు. రీసెంట్ గా వాళ్ళు మీడియా కి ఒక సమాచారం అందించారట.

ఈ సినిమా షూటింగ్ 80 శాతం వరకు పూర్తి అయ్యిందని , బ్యాలన్స్ 20 శాతం షూట్ తో పాటు, పాటల చిత్రీకరణ మాత్రమే బ్యాలన్స్ ఉందని చెప్పారట. కానీ అసలు విషయం వేరే ఉందని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ వరకు ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యిందట, ఫైనల్ ఎడిట్ కూడా లాక్ చేశారట. కానీ సెకండ్ హాఫ్ కి శ్రీకాంత్ ఓదెల వద్ద బౌండెడ్ స్క్రిప్ట్ లేకపోవడం తో ఇంత ఆలస్యం అవుతూ వచ్చింది అట. అంతే కాకుండా రీ షూట్స్ కూడా చాలా ఎక్కువ జరుగుతున్నాయట, నాని కి సైతం డైరెక్టర్ మీద తీవ్రమైన అసహనం ఏర్పడిందని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే , ఈసారైనా చెప్పిన సమయానికి ఈ చిత్రాన్ని తీసుకొస్తారా లేదా అనేది చూడాలి.

సీఎం విజయ్ తండ్రి దర్శకత్వంలో మిస్ అయిన పవన్ కళ్యాణ్ సినిమా అదేనా..?

Pawan Kalyan
Pawan Kalyan

Pawan Kalyan: తెలుగు, తమిళ భాషల్లో పవన్ కళ్యాణ్ మరియు విజయ్ లకు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వీళ్ళిద్దరిని అభిమానులు కేవలం హీరోలుగా మాత్రమే చూడరు , తమ ఆరాధ్య దైవంగా చూస్తుంటారు. అందుకే వీళ్లిద్దరు రాజకీయాల్లోకి అడుగుపెట్టి, ప్రభుత్వాలను స్థాపించి , ఒకరు సీఎం గా కొనసాగుతుండగా , మరొకరు డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్నారు. అభిమానులకు వీళ్లిద్దరు ఇచ్చే గూస్ బంప్స్ స్టఫ్ సినిమాటిక్ అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది. ఇదంతా పక్కన పెడితే విజయ్ తండ్రి చంద్ర శేఖర్ తమిళనాడు లో పెద్ద స్టార్ డైరెక్టర్ అనే విషయం మీ అందరికీ తెలిసిందే. ఆయన టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి తో చట్టానికి కళ్ళు లేవు , దేవాంతకుడు వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు. అదే విధంగా తమిళనాడు లో తన కొడుకు విజయ్ ని హీరో గా పరిచయం చేస్తూ అనేక సూపర్ హిట్ చిత్రాలను కెరీర్ ప్రారంభం లో తెరకెక్కించారు.

అయితే ఒకానొక దశలో చంద్ర శేఖర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఒక సినిమా సెట్స్ మీద వరకు వెళ్లి ఆగిపోయింది అట. ఆ సినిమా మరేదో కాదు ‘సుస్వాగతం’. తమిళం లో తన కొడుకు విజయ్ నటించిన ‘లవ్ టుడే’ అనే చిత్రానికి ఇది రీమేక్. చంద్ర శేఖర్ ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ తో చేస్తే చాలా బాగుంటుందని , ఆయనకు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని చిరంజీవి ని కలిసి కథ ని వినిపించాడట. అనంతరం చిరంజీవి పవన్ కళ్యాణ్ ని ఇంటికి పిలిపించి ఈ స్టోరీ ని వినిపించాడట. ఆయనకు కూడా తెగ నచ్చేసింది. అయితే ఈ చిత్రాన్ని స్వయంగా చంద్ర శేఖర్ తన సొంతంగా నిర్మించాలని అనుకున్నారు. కానీ మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ రీమేక్ రైట్స్ అమ్మడానికి ఇష్టపడలేదు.

ఇదొక యూనివర్సల్ సబ్జెక్టు అని , తామే ఈ చిత్రాన్ని తెలుగు లో స్వయంగా నిర్మిస్తామని చెప్పారట. దీంతో కోపం తెచ్చుకున్న చంద్ర శేఖర్ ఈ సినిమా నుండి తప్పుకున్నాడట. ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు భీమినేని శ్రీనివాస రావు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడట. ఆరోజుల్లో పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచి, ఆయన్ని ఇండస్ట్రీ లో ఒక హీరో గా నిలబెట్టింది. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఎలాంటి సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాడో , యూత్ ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ని సొంతం చేసుకున్నాడో మన అందరికీ తెలిసిందే. అలా పవన్ కళ్యాణ్ , విజయ్ తండ్రి చంద్ర శేఖర్ కాంబినేషన్ లో ఈ క్రేజీ మూవీ మిస్ అయ్యింది.

దేశమంతా కరువు..ఇక్కడేమో కుమ్మేస్తున్నవానలు.. ముంచేస్తున్న వరదలు.ఎల్ నీనో ముప్పు తొలగినట్టేనా..

Mumbai Heavy Rains
Mumbai Heavy Rains

Mumbai Heavy Rains: అది మామూలు వాన కాదు.. జడివాన.. ప్రచండమైన వాన.. ఊరును మొత్తం ముంచేసేవాన. ఆకాశానికి చిల్లి పడినట్టు.. మేఘాలు మొత్తం ఒక్కసారిగా కరిగిపోయినట్టు కురిసింది. వర్షం తాకిడికి వరద కాదు.. ఏకంగా సునామీనే వచ్చినట్టుగా ఉంది. లోతట్టు ప్రాంతాలు కాదు.. ఎత్తైన ప్రాంతాలు కూడా మునిగిపోయాయి. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. చెట్లు కూలిపోయాయి. కొండల మీద ఉన్న రాళ్లు కింద పడిపోయాయి. పెద్ద పెద్ద భవంతుల్లోకి కూడా నీళ్లు వచ్చి చేరాయి. ఇదంతా నిరుడు కురిసిన వర్షం గురించి కాదు.. ఈ ఏడాది నమోదైన వర్షపాతం గురించి..

అదేంటి ప్రస్తుతం ఎల్ నీనో ఉందని అంటున్నారు కదా.. అందువల్లే కదా వర్షాలు కురవడం లేదు.. రైతులు ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. ఇంతవరకు పంటలు కూడా సాగు చేయలేదు. పైగా ఎండా కాలాన్ని మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. ఇలాంటప్పుడు వర్షాలు పడుతున్నాయని మీరు ఎలా అంటున్నారు.. అనే ప్రశ్న మీలో వ్యక్తమౌతుంది కదూ. అయితే ఈ వర్షాలు కురుస్తున్న తీరు మాత్రం నిజంగానే ఆశ్చర్యంగా ఉంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఈ వర్షాకాలంలో ఇంతవరకు తొలి సీజన్ వర్షం పడలేదు. కానీ మంగళవారం అక్కడ బీభత్సంగా వర్షం పడింది. బుధవారం కూడా వర్షం కురిసింది. ఆ వర్షం కూడా ఒక రేంజ్ లో పడింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో ముంబై నగరం తడిసి ముద్దయింది. చాలావరకు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. పలు ప్రాంతాలలో రైల్వేస్టేషన్లోకి నీళ్లు వచ్చి చేరాయి. అంతేకాదు కొన్నిచోట్ల రైలు పట్టాలు కూడా కొట్టుకుపోయాయి. కేవలం 24 గంటల వ్యవధిలో ముంబై నగరంలో 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది అంటే మామూలు విషయం కాదు. ముంబై.. తానే.. రాయిగడ్.. పాల్గర్.. సింధు దుర్గ్ వంటి జిల్లాలలో విపరీతంగా వర్షం కురిసింది. ఏకంగా అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

ముంబై మాత్రమే కాదు అరుణాచల్ ప్రదేశ్ లో కూడా విపరీతంగా వర్షం కురుస్తుంది. ఈ సీజన్లో ఇంతవరకు అక్కడ ఆశించిన స్థాయిలో వర్షం కురువలేదు. కానీ గడిచిన రెండు రోజులుగా అక్కడ విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మంగళవారం అయితే బీభత్సంగా వర్షం కురిసింది. బుధవారం కూడా అక్కడ వర్షాలు పడుతూనే ఉన్నాయి. వర్షాలు తీవ్రతకి వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. దీంతో అరుణాచల్ ప్రదేశ్ లోని చాలా ప్రాంతాలు నీట మునిగిపోయాయి. వరద ప్రవాహానికి చెట్లు కొట్టుకొని వస్తున్నాయి. కొండ ప్రాంతాలలో చరియలు విరిగిపడిపోతున్నాయి.

దేశంలో క్షామ పరిస్థితులు నెలకొంటే.. ఇక్కడ మాత్రం వర్షాలు కురవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే క్లౌడ్ బరస్ట్ వల్ల ఇలా జరుగుతూ ఉంటుందని అధికారులు అంటున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా రుతుపవనాల విస్తరణ సాగుతోంది. అనుకూలంగా ఉన్నచోట ఇదే స్థాయిలో వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. అయితే ఇలా వర్షాలు కురిసినంత మాత్రాన ఎల్ నీనో ప్రభావం తొలగిపోయినట్టు కాదని.. దాని ప్రభావం అలానే ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

వైభవ్ సూర్యవంశీ విధ్వంసాన్నే తట్టుకోలేకపోతున్నాం.. అతడి తమ్ముడు అంతకుమించి.. ఏం చేశాడో తెలుసా..

Ashirvad Suryavanshi
Ashirvad Suryavanshi

Ashirvad Suryavanshi: ఐపీఎల్ లో ఆరెంజ్ క్యాప్ సాధించాడు. తాజాగా శ్రీలంక ట్రై సిరీస్లో ఆకాశమేహద్దుగా చెలరేగిపోయాడు. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక మొత్తాన్ని షేక్ చేశాడు. బంతి పగిలి వక్కలు అయ్యేలాగా బ్యాటింగ్ చేశాడు.. సెంచరీ కోల్పోయాడు గాని.. ఇంకా కాసేపు ఉండి ఉంటే కచ్చితంగా టీమిండియా 500 స్కోర్ చేసేది..

సూర్య వంశీ విధ్వంసానికే కొలమానాలు లేకుండా పోయాయి.. అతని ఆట చూసి లెజెండరీ బౌలర్లు కూడా బౌలింగ్ వేయాలంటే భయపడుతున్నారు.. అతడే ఒక డేంజర్ మ్యాన్ అనుకుంటే.. ఇప్పుడు అతని తమ్ముడు అంతకు మించిన స్థాయిలో ఆడుతున్నాడు. తన అన్న టైగర్ అయితే.. తాను అంతకుమించిన పరుగుల చీతా అని నిరూపిస్తున్నాడు.

వైభవ్ తమ్ముడు పేరు ఆశీర్వాద్.. ఆమధ్య ఒక మ్యాచ్లో అద్భుతమైన సెంచరీ చేశాడు.. కాకపోతే స్థిరంగా బ్యాటింగ్ చేశాడు. అన్న మాదిరిగా దూకుడుగా కాకుండా.. దృడచిత్తంతో ఆడాడు. అప్పట్లో ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో కూడా తనకు క్రికెటర్ కావాలని ఉందని మనసులో మాట చెప్పాడు. అయితే అది కేవలం మామూలుగా చెప్పిన మాట కాదు. ఆ మాట నిలబెట్టుకోవడానికి ఆశీర్వాద్ సూర్య వంశీ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు.

తాజాగా జరిగిన ఒక లోకల్ మ్యాచ్లో కేవలం 119 బంతుల్లోనే 19 ఫోర్లు, 6 సిక్సర్ల సహాయంతో 168 పరుగులు చేశాడు. తన అన్న సెంచరీలు మిస్ చేసుకుంటుంటే.. ఇతడు మాత్రం శతకాలు బాదేస్తూ ఉన్నాడు. తన అన్న తుఫాన్ లాగా బ్యాటింగ్ చేస్తుంటే.. ఇతడు ప్రత్యర్థి బౌలర్లకు సునామీని పరిచయం చేస్తున్నాడు. ఆశీర్వాద్ దూకుడు ఇలాగే ఉంటే త్వరలోనే అతడు ఐపిఎల్ కి వస్తాడని.. అన్నను మించిపోతాడని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. తన తమ్ముడు సెంచరీ చేసిన విషయాన్ని సూర్య వంశీ సోషల్ మీడియాలో పంచుకున్నాడు.