Home Blog Page 75

అనిల్ రావిపూడి ఆ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాడా..?

Anil Ravipudi Strict Filmmaking
Anil Ravipudi Strict Filmmaking

Anil Ravipudi Strict Filmmaking: ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇప్పుడున్న స్టార్ హీరోలందరు పాన్ ఇండియాలో డిఫరెంట్ సినిమాలను చేస్తూ వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే కమర్షియల్ సినిమాలతో వరుస విజయాలను సాధిస్తున్న అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు సైతం ఈ మధ్యకాలంలో చాలా తొందరగా సినిమాలను చేస్తున్నాడు. సంవత్సరానికి ఒక సినిమా చొప్పున ఆయన చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. దీనివల్ల ఆయన నుంచి చాలా ఎక్కువ సినిమాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే బిజినెస్ కూడా చాలా ఎక్కువగా జరుగుతుంది. ప్రొడ్యూసర్లు కూడా చాలా వరకు లాభపడుతున్నారు. ఆయన తీసే సినిమాలు అన్ని సూపర్ సక్సెస్ గా నిలుస్తున్నాయి.

కాబట్టి ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ కూడా రాబడుతున్నాడు. ఇక అలాంటి దర్శకుడు ఒక సినిమాని అనుకున్న సమయంలో తీసి రిలీజ్ చేయడానికి పకడ్బంది ప్రణాళికలో చేసుకుంటున్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే ప్రొడ్యూసర్ దగ్గర కూడా భారీరెమ్యూనరేషన్ కూడా తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

ప్రస్తుతం ఆయన ఒక సినిమా కోసం 30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి… ఇక ఏది ఏమైనా కూడా అనిల్ రావిపూడి నుంచి వచ్చే సినిమాల్లో క్రింజ్ కామెడీ ఉంటుందని కొంతమంది కామెంట్లు చేస్తుంటే, మరి కొంత మంది మాత్రం అతని సినిమాలను ఈజీగా ఒకసారి అలా ఫ్యామిలీ తో పాటు చూసేయొచ్చు అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా పండుగ సీజన్లో ఆయన సినిమాలకు మంచి గిరాకీ ఉంటుంది.

కాబట్టి ఆయన ప్రతి పండుగ సీజన్ ను క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు… ఇక రాబోయే రోజుల్లో ఆయన చేయబోయే సినిమాలు ఏ రేంజ్ సక్సెస్ లను సాధిస్తాయి. ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ రాబడతాయా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ఇప్పుడు వెంకటేష్, కళ్యాణ్ రామ్ లను ఎలా చూపిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…

మహేష్ బాబు విషయంలో తప్పుగా ఆలోచిస్తున్న దర్శకులు... కారణమేంటంటే..?

Mahesh Babu Next Movie
Mahesh Babu Next Movie

Mahesh Babu Next Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ హీరోగా మార్చాయి. ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీకే పరిమితమైన ఆయన ప్రస్తుతం రాజమౌళితో చేస్తున్న సినిమాతో ఇండియాలో తన సత్తా చాటుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. వారణాసి సినిమాతో ప్రేక్షకులను ఆదరించాలనే ప్రయత్నంలో ఉన్న మహేష్ బాబు ఇకమీదట చేయబోయే సినిమాల విషయంలో కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నాడు. అయితే చాలామంది దర్శకులు మహేష్ బాబు విషయంలో చాలా తప్పుగా ఆలోచిస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. కారణం ఏంటి అంటే మహేష్ బాబు వారణాసి సినిమా తర్వాత హాలీవుడ్ సినిమాలను మాత్రమే చేస్తాడని తెలుగు సినిమా దర్శకులను పట్టించుకునే స్థాయిలో తను ఉండకపోవచ్చనే ధోరణిలో ఆలోచిస్తున్నాడు.

నిజానికి మహేష్ బాబు మాత్రం అలాంటిదేమీ లేదని తెలుగు దర్శకులకే తన మొదటి ప్రిఫరెన్స్ ఇస్తానని మంచి కథ దొరికితే మానవాళ్ళతోనే ఆ సినిమా చేయడానికి తను ఆసక్తిగా ఉన్నానని అంటున్నాడు. ఇక వారణాసి సినిమా రిజల్ట్ ఏ రేంజ్ లోఉంటుందో మనందరం ముందే ఊహించుకోవచ్చు. ఎందుకంటే దాన్ని తెరకెక్కిస్తుంది రాజమౌళి కాబట్టి ఆయన చేసే సినిమా తప్పకుండా విజయాన్ని సాధిస్తుంది అనే ఉద్దేశ్యంతోనే చాలామంది అభిప్రాయపడుతున్నారు.

కూడా మహేష్ బాబు తన తదుపరి సినిమా విషయంలో ఇంకాస్త క్లారిటిని తెచ్చుకోవాల్సిన అవసరమైతే ఉందని మరి కొంతమంది భావిస్తున్నారు. కొంత మంది దర్శకులు ఇప్పటికే అతనికి కథలను చెబుతున్నప్పటికి ఆయన ఏ కథను కూడా ఫైనల్ చేయడం లేదు. కారణం ఏంటంటే వారణాసి సినిమా రిజల్ట్ ని బట్టి ఆయన ఎలాంటి సినిమాను సెలెక్ట్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట.

కానీ కొంతమంది మాత్రం ఆయన హాలీవుడ్ దర్శకులతో మాత్రమే సినిమా చేస్తానని తెలుగు వాళ్ళతో సినిమా చేయడనే ఒక న్యూస్ ను క్రియేట్ చేసి దాన్ని సర్క్యులేట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది…ఇక నిజంగానే మహేష్ బాబు తన నెక్స్ట్ సినిమాను ఎవరితో చేస్తాడనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

తెలుగులో విలన్స్ కి మంచి క్రేజ్ పెరుగుతుందా..?

Telugu Cinema Villains
Telugu Cinema Villains

Telugu Cinema Villains: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో గొప్ప విజయాలను సాధించిన స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. ఇక అలాంటి క్రమంలోనే చాలామంది సీనియర్ హీరోలు సైతం ఇప్పుడు విలన్స్ గా మారి వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే జగపతిబాబు, శ్రీకాంత్ లు విలన్స్ గా రాణిస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేస్తూ ఇండస్ట్రీలో వాళ్ళ మార్క్ అనేది చూపిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం విలన్ క్యారెక్టర్ కి చాలా మంచి డిమాండ్ అయితే పెరిగింది. ఎందుకంటే ఇప్పటివరకు ఉన్న చాలా మంది నటులు చాలా సినిమాల్లో డిఫరెంట్ పాత్రలను పోషించారు. కాబట్టి తమ సినిమాకి కొత్తగా కనిపించే విలన్స్ కావాలని కొత్త విలన్స్ ను తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు.

మరి వాళ్ళ కోసం సపరేట్ గా క్యారెక్టర్స్ ని డిజైన్ చేసి వాళ్ళను రంగంలోకి దింపుతున్నట్టుగా తెలుస్తుంది. జగపతిబాబు, శ్రీకాంత్, శివాజీ లాంటి నటులు ఇప్పటికే క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, విలన్లుగా రాణిస్తున్నారు. ఇకమీదట రాబోతున్న సినిమాలతో వీళ్ళు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం తెలుగులో విలన్స్ కి మంచి డిమాండ్ పెరుగుతుంది.

సీనియర్ హీరోలు ఎవరైనా సరే విలన్ గా రాణిస్తే వారిని ఇండస్ట్రీ మొత్తం అక్కున చేర్చుకొని వాళ్లకి ఎక్కువ అవకాశాలను ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. ఇక గతంలో జగపతిబాబు విషయంలో ఇదే జరిగింది. లెజెండ్ సినిమాతో విలన్ గా మారిన ఆయన ఆ తర్వాత విభిన్న పాత్రలను పోషించడమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక మోస్ట్ పవర్ఫుల్ విలన్ గా కూడా ఎదిగాడు.

అతని ప్లేస్ ని భర్తీ చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కూడా రాణించాల్సిన నటులైతే ఇంకా రావాల్సి ఉంది. వాళ్ళు తొందరలోనే ఇండస్ట్రీకి వచ్చి తమ సత్తాను ప్రూవ్ చేసుకుంటారా? లేదంటే అవకాశాలను మిస్ చేసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది…

లక్నో జట్టులోకి ప్రమాదకరమైన కోచ్.. సంజీవ్ గోయంకా ప్లాన్ మామూలుగా లేదు

Lucknow IPL Team Coach Update
Lucknow IPL Team Coach Update

Lucknow IPL Team Coach Update: రిషబ్ పంత్ ఢిల్లీకి వెళ్లిపోతున్నాడు. ఢిల్లీ నుంచి కులదీప్ యాదవ్ వస్తున్నాడు. ఇంతవరకే లక్నో జట్టు గురించి అప్డేట్ తెలుసు. 2027 ఐపీఎల్ సీజన్లో దుమ్మురేపాలని లక్నో జట్టు ఇప్పటినుంచే బలమైన ప్రణాళికలతో అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది.

లక్నో జట్టు కేవలం ప్లేయర్ల విషయంలోనే కాదు.. ప్లేయర్లకు శిక్షణ ఇచ్చే కోచ్ ల విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటున్నది. ఈ క్రమంలోనే మెరుగైన ట్రాక్ రికార్డు ఉన్న మాజీ ప్లేయర్లను శిక్షకుల జాబితాలోకి తీసుకోవాలని భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఒక కీలకమైన మాజీ ఆటగాడిని సంప్రదించినట్టు తెలుస్తోంది. అతడు కూడా దానికి ఓకే చెప్పడంతో.. త్వరలోనే అతడు జట్టులో ప్రవేశించే అవకాశం ఉంది.

కేరళ నేపథ్యం ఉన్న జయ కుమార్ అనే ఆటగాడిని లక్నో జట్టు బ్యాటింగ్ విభాగంలో కోచ్ గా నియమించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అతడు త్వరలోనే జట్టులో చేరుతాడని.. దేశీయ ఆటగాళ్లతో కలిసి పని చేస్తాడని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే లక్నో జట్టుకు డాక్టర్ ఆఫ్ క్రికెట్ గా టామ్ మూడీ.. హెడ్ కోచ్ గా జస్టిన్ లాంగర్.. బౌలింగ్ కోచ్ గా భరత్ అరుణ్ పనిచేస్తున్నారు. ఆ ప్రాంతంలో త్వరలోనే విజయ్ కుమార్ చేరబోతున్నాడు. మొదట్లో దక్షిణాఫ్రికా లెజెండ్ ఆటగాడు క్లూసెనర్ ఈ జట్టులో భాగమవుతాడని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత జయకుమార్ వైపే లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయంకా మొగ్గు చూపాడని తెలుస్తోంది.

లక్నో జట్టులో కీలకమైన ప్లేయర్లుగా ఉన్న హిమ్మత్ సింగ్.. ముకుల్ చౌదరి.. అక్షత్ రఘు వంశీ.. అబ్దుల్ సమద్.. ఆయుష్ బదోని.. అర్షిన్ కులకర్ణి వంటి ప్లేయర్లను లక్నో యాజమాన్యం వచ్చేవారం ఆస్ట్రేలియాకు పంపిస్తోంది.. వారంతా కూడా లాంగర్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతారు. అక్కడ పూర్తయిన తర్వాత వాళ్లు చెన్నై వస్తారు. అక్కడ జయకుమార్ వాళ్లకు ట్రైనింగ్ ఇస్తాడు. జయ కుమార్ ఆధ్వర్యంలోనే సాయి సుదర్శన్ ఈ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు..

అయోధ్య రామాలయంలో భక్తుల కానుకల్ని బొక్కేశారు

Ayodhya Ram Mandir donations

Ayodhya Ram Mandir donations : అయోధ్య రామాలయం.. 500 ఏళ్ల పోరాట గీతం.. 2019 సుప్రీంకోర్టు తీర్పుతో రామాలయానికి దారులు పడ్డాయి. 2024 జనవరిలో ప్రారంభమైంది. ఆరోజు నుంచి కోట్లాది మంది భక్తులు అయోధ్య రామాలయాన్ని దర్శించారు. భక్తులు భక్తితో దేవుడితో కానుకలు కూడా వేశారు. ఇప్పుడు ఆ కానుకలే.. విశ్వాసంతో వేసిన కానుకలు కొట్టేశారు. ఒకనాడు 10 హుండీ బాక్సులు ఉండేవి. జనం రద్దీ వల్ల 40 హుండీ బాక్సులను ఏర్పాటు చేశారు. సిస్టంలు పెట్టారు. సీసీటీవీలు ఉన్నాయి. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు ఇప్పుడు శ్రీమంతులు అయ్యారు. కోటీశ్వరులుగా మారారు. ఇదంతా పైన వారికి తెలియకుండా జరిగిందా? లేక పైన వారు కింది వారు కుమ్మక్కు అయ్యారా? తేలాల్సింది ఇదీ..

డబ్బులు పోవటం అయిత వాస్తవం. కోట్ల రూపాయల డబ్బు.. కేజీల కొద్దీ బంగారం మాయమైందని అయోధ్యలో దారుణం జరిగిందని వార్తలు వస్తున్నాయి. సరైన పర్యవేక్షణ లేకపోతే బంగారం, డబ్బు చూస్తే టెంప్ట్ అవ్వడం ఖాయం. అయోధ్య రామాలయ నిర్వహణ ఒక ట్రస్ట్ ద్వారా జరుగుతోంది. 2019లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఒక ట్రస్ట్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2020 ఫిబ్రవరిలో ట్రస్ట్ ఏర్పడింది. మొత్తం 15 మంది ట్రస్ట్ సభ్యులు. అందులో ముగ్గురు ప్రభుత్వ అధికారులు. మిగతా 12 మంది మఠాధిపతులు హిందూ ప్రముఖులు ఇందులో ఉన్నారు. సుప్రీంకోర్టు సూచించిన దాంట్లో ఒకరు దళితులు అయ్యి ఉన్నారు. ఈ ట్రస్ట్ ప్రభుత్వ ట్రస్ట్ కాదు. ఇండిపెండెంట్ ట్రస్ట్.

అయోధ్య రామాలయంలో భక్తుల కానుకల్ని బొక్కేశారు.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

పూణే బిజినెస్ మెన్ కేసు.. ఆ ముసుగు వ్యక్తి ఎవరు..

Ketan Agarwal case update
Ketan Agarwal case update

Ketan Agarwal case update: మహారాష్ట్రలో ప్రస్తుత 33 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. నాలుగు రోజుల క్రితం కూడా అదే స్థాయిలో ఉష్ణోగ్రత ఉంది. అంతటి ఉష్ణోగ్రతలో.. అది కూడా ఉక్క పోత అధికంగా ఉన్న సమయంలో.. ఓ వ్యక్తి హుడి ధరించాడు. అంతేకాదు అత్యంత అనుమానాస్పదంగా కనిపించాడు. అదే ఇప్పుడు పూనే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ కీలకంగా మారింది.

కేతన్ అగర్వాల్ హత్య కేసులో సీసీటీవీ ఫుటేజ్ అత్యంత కీలకంగా మారింది. కేతన్.. అతడికి కాబోయే భార్య సియాగోయల్ ప్రయాణించిన దారిలో ఒక వ్యక్తి హుడి ధరించి కనిపించాడు. వారిని అనుసరించాడు. అయితే అతడు మరెవరో కాదని.. సియా ప్రియుడు చేతన్ అని పోలీసులు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు.

లోహ్ గడ్ ప్రాంతంలో ఉష్ణోగ్రత అధికంగా ఉన్నప్పటికీ ఆ వ్యక్తి హుడి ధరించడం పోలీసులకు అనుమానం కలిగించింది సియా.. కేతన్ వెళ్లిన మార్గంలోనే అతడు కనిపించాడు. అంతేకాదు, సియా వెనక్కి తిరిగి చూడగా ఆ హుడీ ధరించిన వ్యక్తి కింద కూర్చుని పోయాడు. సియా మళ్లీ ముందుకు చూడగానే అతడు నిలబడ్డాడు. ఈ నేపథ్యంలో అసలు సియా.. కేతన్ ఎందుకు ట్రెక్కింగ్ కు వచ్చారో.. పోలీసులు దర్యాప్తు చేస్తే.. సంచలన విషయాలు వెలుగు చూశాయి. కేతన్ ను అంతం చేయడానికే సియా అక్కడికి తీసుకెళ్లిందని తెలుస్తోంది.

ఆ కోట వద్దకు తీసుకుపోవాలని సియా అనేక పర్యాయాలు కేతన్ ను అడిగింది. కాబోయే భార్య మాట కాదనలేక కేతన్ సియాను తీసుకొని మే 31న అక్కడికి వెళ్ళాడు. జూన్ నాలుగున కూడా తీసుకెళ్లాలని సియా అడిగితే కేతన్ తల్లి ఒప్పుకోలేదు. అదే కాదు ప్రీ వెడ్డింగ్ షూట్ లో భాగంగా ఇండోనేషియాలోని బాలీ ప్రాంతానికి వెళ్దామని సియా అడిగింది. అయితే అప్పుడు కేతన్ పాస్ పోర్టు కనిపించకపోవడంతో ఆ ప్రయాణం కాస్త రద్దయింది.. బాలి ప్రాంతంలో అతడిని చంపేయాలని సియా ప్రణాళిక రూపొందించింది.

అంతకుముందు తోసేసింది

కేతన్ అగర్వాల్ ను జూన్ 14న లోహ్ గడ్ కోటకు తీసుకెళ్లిన సియా.. అతడిని తోసివేసింది. అయితే ఒక పొదను పట్టుకొని అతడు బతికిపోయాడు. అయితే ఆ సమయంలో తనకు ఒక పాము కనిపించిందని.. అందువల్లే తోసి వేశానని ఆమె చెప్పింది. ఆమె చెప్పిన మాటలను కేతన్ నమ్మాడు. జూన్ 14న బతికినప్పటికీ.. జూన్ 18న మళ్లీ అదే ప్రాంతంలో ప్రాణాలు కోల్పోయాడు. ఎత్తైన ప్రదేశాలను చూస్తే కేతన్ భయపడేవాడు. దానిని గుర్తించిన సియా అతడిని ఆ ప్రాంతం వద్దకు తీసుకెళ్లింది. గాలి తీవ్రతకు తట్టుకోలేక అతడు అందులో పడిపోయాడని కట్టుకథలు చెప్పింది.

మరోవైపు చేతన్, సియా దాదాపు 238 గంటలసేపు ఫోన్లో మాట్లాడుకున్నారు. వారిద్దరి మధ్య 2004 కాల్స్ కొనసాగాయి. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య బలమైన బంధం కొనసాగుతూ ఉందని పోలీసులు నిర్ణయించుకున్నారు. ప్రణాళిక ప్రకారమే వారిద్దరూ అతన్ని చంపేసినట్టు పోలీసులు అంచనాకు వచ్చారు. అంతేకాదు చేతన్ సోషల్ మీడియాలో ఫోటోలను చూసి.. అతడు ధరించిన హుడిని పరిశీలించారు. అతడే అని నిర్ధారణకు వచ్చారు. దీనికి తోడు అతడు పోర్టు ప్రాంతానికి తన ఫోన్ తీసుకురాలేదు. ఇంటర్నెట్ కూడా ఆపేశాడు. దీంతో పోలీసులు అనుమానించింది నిజమైంది.. జూన్ 18న కేతన్, సియా కోట వద్దకు రాగానే.. చేతన్ అలర్ట్ అయ్యాడు. తన ప్రియురాలు చెప్పినట్టుగా చేశాడు. ఆ తర్వాత సియా, చేతన్ కలిసి కేతన్ ను లోయలోకి తీసివేశారు. దానిని ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం చేశారు.

ఈ ఒక్క వాహనం కోసం ఎగబడుతున్నారు.. దీనికి ఎందుకంత క్రేజ్ అంటే

TVS XL100
TVS XL100

TVS XL100: భారత టూవీలర్ మార్కెట్లో మోపెడ్ TVS XL100 గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, చిన్న వ్యాపారులు ఎక్కువగా వినియోగించే దీనికి ఇప్పుడు పట్టణాల్లో కూడా ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా డెలివరీ సేవలు, చిన్న వ్యాపార కార్యకలాపాలు, రోజువారీ రవాణా అవసరాల కోసం దీని వినియోగం పెరుగుతుండటంతో అమ్మకాలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. గత నెలలో ఈ మోపెడ్ అమ్మకాలు ఎలా ఉన్నాయి? గత ఏడాది పోలిస్తే ఎంత వృద్ధి సాధించింది?

ఇటీవల వెలువడిన అమ్మకాల గణాంకాల ప్రకారం.. TVS XL 100 మోపెడ్‌లు 2025 మే నెలలో దేశవ్యాప్తంగా 37,264 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. అయితే 2026 మే నెలలో ఈ సంఖ్య ఏకంగా 48,569 యూనిట్లకు చేరుకుంది. అంటే ఏడాదిలో 11,305 అదనపు యూనిట్లు విక్రయించినట్లు తెలుస్తోంది. ఈ పెరుగుదల వార్షిక ప్రాతిపదికన సుమారు 30.34 శాతం వృద్ధిని సూచిస్తోంది.

TVS XL 100 విజయానికి ప్రధాన కారణం గ్రామీణ మార్కెట్‌లో దీనికి ఉన్న బలమైన స్థానం. వ్యవసాయ పనులు, పాలు, కూరగాయలు, ఇతర సరుకుల రవాణా కోసం ఈ మోపెడ్‌ను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. తక్కువ నిర్వహణ ఖర్చు, ఎక్కువ లోడ్ మోయగల సామర్థ్యం, సులభమైన డ్రైవింగ్ అనుభవం కారణంగా గ్రామీణ వినియోగదారులు దీనిని మొదటి ఎంపికగా భావిస్తున్నారు.

అయితే ఇటీవల కాలంలో పట్టణ ప్రాంతాల్లో కూడా XL 100కు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా ఈ-కామర్స్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు, చిన్న వ్యాపారులు, స్థానిక సరుకు రవాణా సేవలు అందించే వారు ఈ మోపెడ్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. తక్కువ ఇంధన వ్యయం, తక్కువ నిర్వహణ ఖర్చు ఉండటం వల్ల రోజువారీ వినియోగానికి ఇది అనువైన వాహనంగా మారింది.

దేశంలో పెట్రోల్ ధరలు అధికంగా ఉండటంతో వినియోగదారులు ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో TVS XL 100 వంటి మోపెడ్‌లు మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం ప్రయాణించగలగడం దీని ప్రధాన ఆకర్షణగా మారింది. XL 100 అమ్మకాల పెరుగుదల TVS Motor Companyకు సానుకూల సంకేతంగా భావిస్తున్నారు. కంపెనీ మొత్తం టూవీలర్ పోర్ట్‌ఫోలియోలో ఈ మోపెడ్ కీలక పాత్ర పోషిస్తోంది. గ్రామీణ మార్కెట్‌లో కంపెనీ ఆధిపత్యాన్ని నిలబెట్టడంలో XL 100 ప్రధాన బలంగా కొనసాగుతోంది.

ప్రస్తుతం చిన్న వ్యాపారాలు, డెలివరీ సేవలు, గ్రామీణ రవాణా అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో మోపెడ్‌లకు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉపయోగకరతను అందించే వాహనాలపై వినియోగదారుల ఆసక్తి కొనసాగితే TVS XL 100 అమ్మకాలు రానున్న నెలల్లో కూడా బలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అధునాతన ఫీచర్లు.. అద్భుతమైన డిజైన్..Motorola కొత్త ఫోన్ చూశారా..

Motorola Edge 70 Max features
Motorola Edge 70 Max features

Motorola Edge 70 Max features: Motorola కంపెనీ నుంచి అత్యంత శక్తివంతమైన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ రాబోతుంది. ‘Motorola Edge 70 Max’ పేరుతో వస్తున్న ఈ మొబైల్ గురించి ఇప్పటికే ప్రకటించడంతో కొత్తగా ఫోన్ కొనేవారిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. మార్కెట్లో ఉన్న ప్రీమియం ఫోన్‌లకు ఇది గట్టి పోటీ ఇచ్చేలా ఉందని కొందరు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. అధునాతన ఫీచర్లు, అద్భుతమైన డిజైన్ ను కలిగి ఉన్న ఈ ఫోన్ గురించి పూర్తి వివరా్లోకి వెళితె..

మోటోరోలా ఎడ్జ్ 70 సిరీస్ నుంచి ‘మాక్స్’ స్మార్ట్‌ఫోన్ రాబోతుంది. దీని పర్ఫార్మెన్స్ సరికొత్త రికార్డులు సృష్టించనుందని అంటున్నారు. ఇందులో క్వాల్‌కామ్ Snapdragon 8 Gen 5 చిప్‌సెట్‌ ఉండనుంది. దీంతో గేమింగ్, మల్టీ టాస్కింగ్ తో పాటు ఏఐ (AI) ఫీచర్లను ఉపయోగించే వారికి ఈ ప్రాసెసర్ చాలా ఉపయోగపడుతుంది. ఇందులో లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ ‘Hello UI’ ఉండనుంది.

ఈ కొత్త ఫోన్ లో 6.82 అంగుళాలOLED LTPO డిస్‌ప్లే ఉండనుంది. ఇది 2K రిజల్యూషన్ తో పనిచేస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేయడం వల్ల స్క్రోలింగ్, విజువల్స్ చాలా స్మూత్‌గా ఉంటాయి. ఈసారి మోటోరోలా ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్ , అల్ట్రా-స్లిమ్ బెజెల్స్‌తో ప్రీమియం లుక్‌ను అందించబోతోంది. గ్లాసియర్ బ్లూ, ఒనిక్స్ బ్లాక్ మరియు సేజ్ గ్రీన్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది.

కెమెరా విభాగంలో మోటోరోలా ఎడ్జ్ 70 మాక్స్ ఎక్కడా తగ్గడం లేదు. దీని వెనుక భాగంలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉన్న 50MP సోనీ లిటియా ప్రధాన కెమెరాను అమర్చినట్లు తెలుస్తోంది. దీంతో పాటు అల్ట్రా వైడ్, టెలిఫోటో లెన్స్‌లు కూడా ఉండనున్నాయి. చీకటిలో సైతం స్పష్టమైన, హై-క్వాలిటీ ఫోటోలను తీయడానికి ఈ కెమెరా సెటప్ అద్భుతంగా పని చేస్తుంది. ఇక సెల్ఫీల కోసం ముందు భాగంలో 32MP కెమెరాను కేటాయించినట్లు తెలుస్తోంది.

ఈ ఫోన్‌లో 8000mAh బ్యాటరీని అమర్చనున్నట్లు గ్యాడ్జెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇంత పెద్ద బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. దీంతో మాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉండే అవకాశం ఉంది. దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం IP68/69 రేటింగ్ ఉండనుంది.

భారత మార్కెట్లో ఈ Motorola Edge 70 Max ధర సుమారు రూ. 54,999 నుండి రూ. 59,999 మధ్య ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. శాంసంగ్, వన్‌ప్లస్ వంటి బ్రాండ్ల ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లకు తక్కువ ధరలోనే గట్టి పోటీ ఇవ్వడమే లక్ష్యంగా మోటోరోలా ఈ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే అంతర్జాతీయంగా మరియు భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేయనుంది.

యూట్యూబ్ ను షేక్ చేస్తున్న కొత్త ఫోక్ సాంగ్.. మీరు చూడండి..

Sakkani Na Bava Aligindu
Sakkani Na Bava Aligindu

Sakkani Na Bava Aligindu: ఒకప్పుడు జానపద పాటలు గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యేవి. కానీ డిజిటల్ మీడియాలో ఇవి వస్తూ.. సంగీత ప్రియులను ఉర్రూతలూగిస్తున్నాయి. ముఖ్యంగా యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్‌ల ద్వారా జానపద గీతాలు కోట్లాది మంది ప్రేక్షకులను చేరుకుంటున్నాయి. సినిమా పాటలకు ఏమాత్రం తీసిపోకుండా ఫోక్ సాంగ్స్ ను భారీ ఖర్చు పెట్టి తీస్తున్నారు. దీంతో ఇవి వ్యూయర్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల ఓ సాంగ్ మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతుంది. ఆ సాంగ్ వివరాల్లోకి వెళితె..

ఇటీవల యూట్యూబ్ లో విడుదలైన ‘సక్కని నా బావ అలిగిండు’ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ పాట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ సాధిస్తూ దూసుకుపోతోంది. ప్రేక్షకులు ఈ పాటను పదేపదే వింటూ, షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. పాటలోని సాహిత్యం, సంగీతం, విజువల్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటకు హేమ రెడ్డి సాహిత్యం అందించగా..మమత రమేష్ తన గాత్రంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. డీజే శేఖర్ ఇచ్చోడ అందించిన సంగీతం పాటకు మరింత ఊపు తెచ్చింది. అలాగే మాధురి రాథోడ్, రౌడీ హరీష్ నటన కూడా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో జానపద సంస్కృతికి ప్రత్యేక స్థానం ఉంది. గ్రామీణ జీవితం, ప్రేమ, కుటుంబ బంధాలు, పండుగలు, సంప్రదాయాలను ప్రతిబింబించే పాటలు ప్రజలకు త్వరగా కనెక్ట్ అవుతాయి. అందుకే ఫోక్ సాంగ్స్ వినగానే తమ మట్టివాసన, పల్లె జ్ఞాపకాలు గుర్తుకొస్తాయని చాలా మంది చెబుతున్నారు. ఈ భావోద్వేగ అనుబంధమే ఫోక్ పాటలను మరింత ప్రజాదరణ పొందేలా చేస్తోంది.

ఫోక్ సాంగ్స్ విజయంలో యూట్యూబ్ కీలక పాత్ర పోషిస్తోంది. ఒక మంచి పాట విడుదలైతే ప్రేక్షకులు వెంటనే దానిని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. రీల్స్, షార్ట్ వీడియోలు, స్టేటస్‌ల రూపంలో పాటలు మరింత వేగంగా వైరల్ అవుతున్నాయి. ఒకసారి పాట ట్రెండ్‌లోకి వస్తే లక్షల నుంచి కోట్ల వ్యూస్ సాధించడం ఇప్పుడు సాధారణ విషయంగా మారింది. దీంతో నిర్మాతలు, గాయకులు, సంగీత దర్శకులు కూడా ఫోక్ సాంగ్స్‌పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు.

గతంలో ప్రేక్షకుల దృష్టి ప్రధానంగా సినిమా పాటలపైనే ఉండేది. కానీ ఇప్పుడు ఫోక్ సాంగ్స్ కూడా అదే స్థాయిలో ఆదరణ పొందుతున్నాయి. కొన్ని జానపద పాటలు అయితే సినిమా పాటల కంటే ఎక్కువ వ్యూస్ సాధిస్తున్నాయి. తక్కువ బడ్జెట్‌తో రూపొందించినా, మంచి సాహిత్యం, ఆకట్టుకునే ట్యూన్ ఉంటే ప్రేక్షకులు వాటిని విపరీతంగా ఆదరిస్తున్నారు. దీంతో ఫోక్ మ్యూజిక్ ఇండస్ట్రీ వేగంగా విస్తరిస్తోంది.

భారత రక్షణ సాంకేతికతలో కొత్త శిఖరం.. అద్భుతం చేసిన డీఆర్‌డీవో

DRDO latest defence technology
DRDO latest defence technology

DRDO latest defence technology: భారతదేశం తన రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తూ, బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ (బీఎండీ) రంగంలో మరో ముఖ్యమైన మైలురాయిని అందుకుంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో ఫేజ్-2 బీఎండీ వ్యవస్థలోని ఏడీ-1, ఏడీ-2 ఇంటర్‌సెప్టర్ మిస్సైల్‌లు విజయవంతంగా పనిచేశాయి. ఈ సాధనతో భారత్ ఖండాతర బాలిస్టిక్ మిస్సైల్‌ల వంటి దీర్ఘ-దూర బెదిరింపులను అడ్డుకునే సామర్థ్యాన్ని ప్రదర్శించింది. ఇది దేశ రక్షణ వ్యవస్థకు కొత్త బలాన్ని జోడించి, వ్యూహాత్మక సమతుల్యతను మార్చే అవకాశం కల్పిస్తుంది.

ఒడిశా తీరంలో పరీక్ష..
డీఆర్డీవో ఇటీవల ఒడిశా తీరంలో నిర్వహించిన శ్రేణి పరీక్షల్లో ఏడీ-1, ఏడీ-2 ఇంటర్‌సెప్టర్‌లు విజయవంతంగా పనిచేశాయి. ఈ మిస్సైల్‌లు ఇన్‌కమింగ్ బాలిస్టిక్ మిస్సైల్‌లను వాతావరణం లోపల (ఎండో-అట్మాస్ఫెరిక్), వెలుపల (ఎక్సో-అట్మాస్ఫెరిక్) రెండు ప్రాంతాల్లోనూ అడ్డుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ప్రత్యేకంగా, మధ్య-దశ (మిడ్-కోర్స్)లో ఉన్న లక్ష్యాలను గుర్తించి, నాశనం చేసే సాంకేతికతను ఈ వ్యవస్థ అందించింది. 2 వేల కిలోమీటర్లు, అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణించగల బాలిస్టిక్ మిస్సైల్‌లను ఎదుర్కోవడానికి రూపొందించిన ఈ ఇంటర్‌సెప్టర్‌లు అధునాతన రాడార్లు, టార్గెట్ డిస్క్రిమినేషన్, హిట్-టు-కిల్ సాంకేతికతతో సన్నద్ధమయ్యాయి. ఇది ఫేజ్-1 బీఎండీకి అదనంగా మరింత విస్తృతమైన రక్షణ పొరను అందిస్తుంది.

ప్రపంచ స్థాయిలో గుర్తింపు ..
ఈ విజయంతో భారత్ అధునాతన బాలిస్టిక్ మిస్సైల్ రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేసిన కొద్ది దేశాల్లో ఒకటిగా అవతరించింది. అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ వంటి దేశాలతోపాటు ఈ సాంకేతికతను కలిగిన ఎలైట్ గ్రూపులో భారత్ చేరింది. ముఖ్యంగా ఎక్సో-అట్మాస్ఫెరిక్ మిడ్-కోర్స్ ఇంటర్‌సెప్షన్ సామర్థ్యం దీన్ని మరింత ప్రత్యేకంగా చేస్తుంది. ఇతర దేశాల రక్షణ వ్యవస్థలకు కూడా ఇది ఒక ముఖ్యమైన సంకేతం. చైనా వంటి దేశాలు అభివృద్ధి చేసిన దీర్ఘ-దూర మిస్సైల్‌లను ఎదుర్కోవడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. ఇది భారత స్వావలంబన లక్ష్యానికి బలమైన ఉదాహరణ.

వ్యూహాత్మక ప్రాముఖ్యత..
ఈ సాధన భారతదేశానికి రెండు ప్రధాన ప్రయోజనాలు కల్పిస్తుంది. మొదటిది, నిరోధక శక్తి. శత్రు దేశాలు బాలిస్టిక్ మిస్సైల్ దాడి చేసినా, దాన్ని మధ్యలోనే అడ్డుకోగల సామర్థ్యం ఉండటం వల్ల దాడి చేయడానికి వారు వెనుకాడతారు. ఇది భారత్ యొక్క “నో ఫస్ట్ యూజ్” విధానాన్ని మరింత బలపరుస్తుంది. రెండోది బహుళ-పొర రక్షణ. ఒక్క పొర మాత్రమే కాకుండా, ఎండో ఎక్సో రెండు పొరలు కలిపి ఉండటం వల్ల లోపాలు తక్కువ. ఇది పాకిస్తాన్, చైనా వంటి సరిహద్దు బెదిరింపుల నుంచి కీలక నగరాలు, సైనిక స్థావరాలు, వ్యూహాత్మక ఆస్తులను రక్షించడంలో సహాయపడుతుంది. అయితే, ఈ విజయం పూర్తి కార్యాచరణ స్థాయికి చేరుకోవడానికి ఇంకా కొంత సమయం పడుతుంది. రాడార్ నెట్‌వర్క్ విస్తరణ, ఇంటిగ్రేషన్, నిరంతర పరీక్షలు అవసరం. అయినప్పటికీ, స్వదేశీ సాంకేతికతతో ఇంత పెద్ద ముందడుగు వేయడం భారత రక్షణ పరిశ్రమను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తుంది.

ఇన్‌స్టంట్ ఫుడ్ వైపే జెన్ Z యూత్.. ఎందుకో తెలుసా..

Gen Z prefers instant food
Gen Z prefers instant food

Gen Z prefers instant food: ప్రస్తుతం వర్షాకాలం.. అందమైన సాయంత్రం వర్షం పడుతున్న వేళ వేడివేడి మ్యాగీ ని ఆస్వాదించడం.. రాత్రి ఆలస్యంగా పని ముగించుకుని ఒక ప్యాకెట్ రామెన్, స్నేహితులతో కలిసి స్పైసీ కొరియన్ నూడుల్స్ ఛాలెంజ్.. ఇవన్నీ నేటి యువత జీవనశైలిలో భాగమైపోయాయి. ఇవి కేవలం ఆకలి తీర్చే ఆహారంగా కాకుండా, ఇన్‌స్టంట్గా లభించే ఒక ‘కంఫర్ట్ ఫుడ్’గా మారిపోయాయి. అయితే వీటిని మాత్రమే యూత్ ఎందుకు ఇష్టపడుతున్నారు?వీటి వల్ల రాను రాను ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి?

వేగవంతమైన జీవనశైలి, సోషల్ మీడియా ప్రభావం, కొత్త రుచుల ఆకర్షణ కారణంగా ఇన్‌స్టంట్ ఫుడ్‌ వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ఇది కేవలం రెండు నుంచి ఐదు నిమిషాల్లో తయారయ్యే ఈ ఆహారం కావడంతో బిజీ జీవితానికి బాగా సరిపోతుందని భావిస్తున్నారు. హాస్టల్ విద్యార్థులు, ఉద్యోగులు, ఒంటరిగా నివసించే వారు వీటిని ఎక్కువగా ఎంచుకుంటున్నారు. అంతేకాకుండా తక్కువ ధరలో అందుబాటులో ఉండటం, విభిన్న రుచులు, మసాలా ఫ్లేవర్లు యువతను ఆకర్షిస్తున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొరియన్ నూడుల్స్ ఛాలెంజ్‌లు, ఫుడ్ వ్లాగ్‌లు కూడా వీటి ప్రాచుర్యాన్ని మరింత పెంచుతున్నాయి.

ఇన్‌స్టంట్ నూడుల్స్ తిన్న వెంటనే రుచికరమైన అనుభూతిని కలిగిస్తాయి. అయితే వీటిలో అధికంగా ఉండే ఉప్పు, శుద్ధి చేసిన పిండి , సంతృప్త కొవ్వులు, ప్రిజర్వేటివ్‌లు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. తరచుగా వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందకపోవచ్చు. ముఖ్యంగా ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్ వంటి పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి.

ఇన్‌స్టంట్ నూడుల్స్‌లో సోడియం (ఉప్పు) మోతాదు ఎక్కువగా ఉంటుంది. తరచూ అధిక ఉప్పు తీసుకోవడం వల్ల రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంటుంది. దీర్ఘకాలంలో ఇది గుండె సంబంధిత వ్యాధులు, స్ట్రోక్ వంటి సమస్యలకు దారితీయవచ్చు. ఇప్పటికే బీపీ సమస్య ఉన్నవారు వీటిని పరిమితంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

కొన్ని అధ్యయనాలు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను తరచుగా తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి క్షీణించడం, మానసిక ఆరోగ్య సమస్యలు, మెదడు పనితీరుపై ప్రభావం ఉండవచ్చని సూచిస్తున్నాయి. అలాగే అధిక కొవ్వులు, చక్కెరలు, కృత్రిమ పదార్థాలు ఉన్న ఆహారం హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే డిమెన్షియా లేదా హార్మోన్ల సమస్యలు కేవలం నూడుల్స్ వల్లే వస్తాయని చెప్పడానికి ఇంకా మరింత పరిశోధన అవసరమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

బరువు పెరగడం, జీర్ణ సమస్యలు
ఇన్‌స్టంట్ ఫుడ్‌లో కేలరీలు ఎక్కువగా ఉండటం, ఫైబర్ తక్కువగా ఉండటం వల్ల తరచూ తింటే బరువు పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు. కడుపు నిండిన భావన కలిగించినా, శరీరానికి అవసరమైన పోషకాలు అందకపోవడం వల్ల ఆకలి త్వరగా మళ్లీ వేయవచ్చు.

యువతను ఆకర్షిస్తున్న ప్రీమియం, కొరియన్ నూడుల్స్
ఇటీవల మార్కెట్లో ప్రీమియం రామెన్, కొరియన్-శైలి నూడుల్స్‌కు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఘాటైన రుచులు, ఆకర్షణీయమైన ప్యాకేజింగ్, సోషల్ మీడియా ట్రెండ్‌లు వీటిని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ముఖ్యంగా జెన్ Z, మిలీనియల్స్ కొత్త రుచులను ప్రయత్నించడంలో ఆసక్తి చూపుతున్నారు. అందుకే భారత ఇన్‌స్టంట్ నూడుల్స్ మార్కెట్ విలువ బిలియన్ల డాలర్ల స్థాయికి చేరుకుంది.

అయితే ఇన్‌స్టంట్ నూడుల్స్‌కు బదులుగా గోధుమ నూడుల్స్, మిల్లెట్ (సిరిధాన్యాల) నూడుల్స్, ఓట్స్ ఉప్మా, వెజిటబుల్ పోహా, అటుకుల ఉప్మా, రాగి జావ, పెసర అట్టు వంటి ఆహారాలను ఎంచుకోవచ్చు. ఇవి త్వరగా తయారవడమే కాకుండా ఎక్కువ పోషకాలు అందిస్తాయి. ఒకవేళ నూడుల్స్ తినాలనిపిస్తే వాటిలో క్యారెట్, బీన్స్, క్యాప్సికం, గుడ్డు లేదా చికెన్ వంటి పదార్థాలు కలిపి పోషక విలువను పెంచుకోవచ్చు.

ITR ఫైలింగ్‌ చేస్తున్నారా.. ఈ 5 తప్పులు చేయకండి.. లేకుంటే భారీ నష్టం..

ITR filing mistakes to avoid
ITR filing mistakes to avoid

ITR filing mistakes to avoid: ప్రతి ఏడాది ఆదాయపు పన్ను రిటర్న్ (IncomeTaxReturn) దాఖలు చేసే సమయంలో చాలా మంది పన్ను చెల్లింపుదారులు కొన్ని సాధారణ తప్పులు చేస్తుంటారు. ఇవి చిన్న పొరపాట్లుగా కనిపించినా, భవిష్యత్తులో నోటీసులు, రిఫండ్ ఆలస్యం, అదనపు పన్నులు లేదా జరిమానాలకు కారణమవుతాయి. అందుకే ITR సమర్పించే ముందు ప్రతి వివరాన్ని ఒకటికి రెండుసార్లు పరిశీలించడం అవసరం. ముఖ్యంగా ఈ 5 విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అవేంటంటే?

ఆన్‌లైన్‌లో సమర్పించిన తర్వాత రిటర్న్‌ను సరిచూసుకోకపోవడం:
చాలామంది ITR ఫైల్ చేసిన వెంటనే పని పూర్తయిందని భావిస్తారు. అయితే సమర్పించిన తర్వాత రిటర్న్‌లోని వివరాలను మరోసారి పరిశీలించకపోతే పొరపాట్లు గుర్తించలేరు. బ్యాంకు ఖాతా సంఖ్య, PAN, ఆదాయ వివరాలు లేదా డిడక్షన్‌లలో చిన్న తప్పు ఉన్నా రిఫండ్ ఆలస్యం కావచ్చు. కొన్నిసార్లు పన్ను శాఖ నుంచి వివరణ కోరుతూ నోటీసులు కూడా రావచ్చు. అందువల్ల రిటర్న్ సబ్మిట్ చేసిన తర్వాత acknowledgment కాపీని డౌన్‌లోడ్ చేసి అన్ని వివరాలను సరిచూడాలి.

రుజువు లేకుండా తగ్గింపులు, మినహాయింపులను క్లెయిమ్ చేయడం:
కొంతమంది పన్ను ఆదా కోసం సరైన ఆధారాలు లేకుండానే సెక్షన్ 80C, 80D లేదా ఇతర మినహాయింపులను క్లెయిమ్ చేస్తుంటారు. అయితే ఆదాయపు పన్ను శాఖ వద్ద AIS, Form 26AS, ఇతర డేటా అందుబాటులో ఉంటుంది. విచారణ సమయంలో ఆధారాలు చూపలేకపోతే ఆ క్లెయిమ్‌ను తిరస్కరించడంతో పాటు అదనపు పన్ను, వడ్డీ, జరిమానా విధించే అవకాశం ఉంటుంది. కాబట్టి క్లెయిమ్ చేసే ప్రతి డిడక్షన్‌కు సంబంధించిన రసీదులు, పెట్టుబడి పత్రాలు భద్రంగా ఉంచుకోవాలి.

ఆర్థిక వివరాలను సరిపోల్చుకోకపోవడం:
Annual Information Statement (AIS), Form 26ASలో జీతం, వడ్డీ ఆదాయం, టీడీఎస్, షేర్ లావాదేవీలు, ఇతర ఆర్థిక వివరాలు నమోదై ఉంటాయి. వీటిని పరిశీలించకుండా ఐటీఆర్ దాఖలు చేస్తే ఆదాయంలో వ్యత్యాసాలు కనిపించవచ్చు. ఉదాహరణకు బ్యాంకు FDలపై వచ్చిన వడ్డీని చూపకుండా వదిలేస్తే పన్ను శాఖ దానిని గుర్తించి నోటీసు పంపవచ్చు. అందుకే ITR ఫైల్ చేసే ముందు AIS, Form 26AS, బ్యాంక్ స్టేట్‌మెంట్లు, Form-16 వివరాలను తప్పనిసరిగా సరిపోల్చుకోవాలి.

సరైన ITR ఫారమ్‌ను ఎంచుకోకపోవడం:
పన్ను చెల్లింపుదారుల ఆదాయ వనరులను బట్టి వివిధ ITR ఫారమ్‌లు ఉంటాయి. ఉద్యోగులు, వ్యాపారులు, అద్దె ఆదాయం పొందేవారు, మూలధన లాభాలు పొందినవారికి వేర్వేరు ఫారమ్‌లు వర్తిస్తాయి. తగిన ఫారమ్‌కు బదులుగా తప్పు ఫారమ్ ఎంచుకుంటే రిటర్న్ చెల్లనిదిగా పరిగణించే అవకాశం ఉంది. దీంతో మళ్లీ రిటర్న్ దాఖలు చేయాల్సి రావచ్చు. కాబట్టి మీ ఆదాయ స్వరూపానికి అనుగుణంగా సరైన ఫారమ్‌ను ఎంపిక చేయడం చాలా ముఖ్యం.

మూలధన లాభాల రిపోర్టింగ్‌లో నిర్లక్ష్యం:
షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, భూములు లేదా ఇతర ఆస్తుల విక్రయం ద్వారా వచ్చిన లాభాలను సరైన విధంగా ప్రకటించాలి. చాలామంది లాభాలు తక్కువగా ఉన్నాయనే భావనతో వాటిని రిపోర్ట్ చేయకుండా వదిలేస్తారు. అయితే బ్రోకరేజ్ సంస్థలు, రిజిస్ట్రేషన్ శాఖల ద్వారా ఈ వివరాలు పన్ను శాఖకు చేరుతాయి. మూలధన లాభాలను ప్రకటించకపోతే అదనపు పన్ను, వడ్డీ, జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది. అందువల్ల అన్ని కొనుగోలు, విక్రయ రికార్డులను సేకరించి ఖచ్చితంగా నమోదు చేయాలి.

ఒక్క ఓటమి ఇన్ని లోపాలు బయటపెట్టింది.. హర్మన్ సేన నేర్చుకోవాల్సిన పాఠాలు ఇవే

Harmanpreet Kaur team
Harmanpreet Kaur team

Harmanpreet Kaur team: బండి బాగా వెళుతున్నప్పుడు పెద్దగా ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడే సమస్యలు మొదలవుతుంటాయి. లోపాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ ఉంటాయి. ఇప్పుడు భారత మహిళా క్రికెట్ జట్టు పరిస్థితి కూడా ఇలానే ఉంది. ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో టీమిండియా తొలి మ్యాచ్లో పాకిస్తాన్ మీద విజయం సాధించింది . ఆ తర్వాత నెదర్లాండ్ మీద విక్టరీ అందుకుంది. ఇదే ఊపులో దక్షిణాఫ్రికా మీద గెలుస్తుందనుకుంటున్న క్రమంలో.. ఓటమిపాలైంది.

టీమిడియాకు ఎదురైన ఓటమి ఎన్నో లోపాలను బయటపెట్టింది. ఈ లోపాలను అధిగమిస్తేనే టీమిండియా టి20 వరల్డ్ కప్ సాధిస్తుంది. ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో టీం ఇండియా గ్రూపు ఏ లో ఉంది. ఈ గ్రూపులో ఉన్న పాకిస్తాన్, నెదర్లాండ్స్ ఎప్పుడో ఇంటికి వెళ్లిపోయాయి. అన్ని జట్ల కంటే ఆస్ట్రేలియా 8 పాయింట్లో మొదటి స్థానంలో ఉంది. భారత్ ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నాయి. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నప్పటికీ.. నెట్ రన్ రేట్ మాత్రం టీమిండియాకే ఎక్కువగా ఉంది. భారత జట్టు తదుపరి బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాతో ఆడాలి. ఈ రెండు గెలిస్తే నేరుగా సెమీస్ వెళ్తుంది. ఒక్క దాంట్లో ఓడిపోయినా సరే నెట్ రన్ రేట్ అత్యంత కీలకమవుతుంది.

టీమిండియాలో బ్యాటింగ్ భారం మొత్తం స్మృతి మందాన, షాపాలీ వర్మ మీద మాత్రమే ఉంది. వీరిద్దరే ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నారు. అందువల్లే పరుగులు వస్తున్నాయి. చివర్లో రీచా అదరగొడుతోంది. కానీ మిడిల్ ఆర్డర్ మాత్రం దారుణంగా విఫలమవుతోంది. ముఖ్యంగా జమీమా ఏ మాత్రం గొప్పగా రావటం లేదు. హర్మన్ కూడా తన స్థాయి ఆట తీరు ప్రదర్శించాల్సిన అవసరం ఉంది.

దక్షిణాఫ్రికా తో జరిగిన మ్యాచ్లో కాప్ క్యాచ్ ను మన అమ్మాయిలు జారవిడిచారు. అది కేవలం క్యాచ్ మాత్రమే కాదు మ్యాచ్ ఫలితం కూడా అని తర్వాత తేలిపోయింది. ఎందుకంటే వచ్చిన అవకాశాన్ని కాప్ అద్భుతంగా సద్వినియోగం చేసుకుంది. దుమ్ము రేపే రేంజ్ లో బ్యాటింగ్ చేసి అదరగొట్టింది. మరోవైపు ఆ మ్యాచ్ లో ఫీల్డింగ్ కూడా దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే మ్యాచ్లలో టీమిండియా ప్లేయర్లు సత్తా చూపించాల్సిన అవసరం ఉంది

భారత జట్టుకు స్పిన్ బౌలింగ్ ప్రధాన బలం. తెలుగు క్రీడాకారిణి శ్రీ చరణి సత్తా చూపిస్తోంది. ఇప్పటికే ఆమె టి20 బౌలర్ల జాబితాలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్లలో పదవి వికెట్లు తన ఖాతాలో వేసుకుంది. ఆమెకు తగ్గట్టుగా మిగతావాళ్లు బౌలింగ్ వేస్తే భారతజట్టు పెద్దగా ఇబ్బందిపడాల్సిన అవసరంఉండదు. దీప్తి శర్మ ఒక మ్యాచ్లో 5 వికెట్ల ప్రదర్శన చేసింది. ఆ తర్వాత మిగతా మ్యాచ్లలో సత్తా చూపించలేదు. పేస్ బౌలర్లు అంత గొప్పగా బౌలింగ్ చేయడం లేదు. ఈ నేపథ్యంలో తదుపరి మ్యాచ్లలో వారు సత్తా చూపించాల్సిన అవసరం ఉంది.

గాదె సాయి కృష్ణ కేసు.. అసలు నిజాలను బయటపెట్టిన సిట్..

Sai Krishna case latest update
Sai Krishna case latest update

Sai Krishna case latest update: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ నగరంలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల కాలంలో గాదె సాయి కృష్ణ అనే యువకుడి కేసు సంచలనం కలిగించింది. అయితే ఇతడు నిన్నటి వరకు మిస్సింగ్ అని పోలీసులు చెప్పారు. ఇప్పుడు ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు కీలకమైన విషయాలను బయటపెట్టారు. దీంతో ఈ కేసు వ్యవహారం ఏపీ రాష్ట్ర రాజకీయాలను తీవ్రంగా కుదిపి వేసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. అంతేకాదు ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు రిమాండ్ రిపోర్ట్ కోర్టుకు సమర్పించిన నేపథ్యంలో.. ఈ కేసు కీలక మలుపు తీసుకుంది.

సాయి కృష్ణను గత నెల 6న మార్కాపురంలో పట్టుకుని కృష్ణలంక ప్రాంతాన్ని తీసుకొచ్చారు. అక్కడ కస్టడీకి అప్పగించారు. ఇక అప్పటినుంచి అతడి జడ కనిపించలేదు. చట్టానికి విరుద్ధంగా అతడిని కసిడిలో ఉంచారు. మే 6 నుంచి 8 తేదీలలో సాయికృష్ణ స్థానిక పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాడు. అతడి మీద అనేక రకాల పాత కేసులు.. నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్లో ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో సాయి కృష్ణ అపస్మారక స్థితిలో ఉన్నాడని సిట్ అధికారులకు అతని తల్లి చెప్పింది. అయితే గత నెల ఒకటి నుంచి ఈ నెల ఒకటి వరకు ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీటీవీ ఫుటేజీ కనిపించకపోవడం విశేషం.

పోలీస్ స్టేషన్ కు వచ్చిన తర్వాత సాయి కృష్ణ తన మొబైల్ ఫోన్ సిఐ నాగరాజుకు ఇచ్చారు. అయితే అతడిని సిఐ నాగరాజు మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచలేదు. పైగా హైకోర్టుకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కస్టడీలో అతడిని తీవ్రంగా కొట్టారు. గాయాల బారిన పడిన అతడు చనిపోయాడు. ఆ తర్వాత అతడి శవాన్ని మొత్తం మాయం చేశారు. శవాన్ని పూడ్చి వేయడానికి లేదా తగలబెట్టడానికి ప్రయత్నించారు. అయితే ఆ మృతదేహం ఇంకా లభించలేదు. సాయి కృష్ణ శవాన్ని ఏం చేశారనే దానిమీద ఇంకా క్లారిటీ లేదు. దానిమీద సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. మరోవైపు నాగరాజు దర్యాప్తు అధికారులకు సహకరించకపోవడంతో ఇంకా పూర్తి వివరాలు తెలియడం లేదు. కస్టడీలో అతడిని తీవ్రంగా కొట్టడం వల్లే చనిపోయాడని ఇప్పటికే సిట్ అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. రిమాండ్ రిపోర్టులో కూడా అదే విషయాన్ని బయటపెట్టారు. సిసి ఫుటేజ్ మొత్తాన్ని ఉద్దేశపూర్వకంగానే తొలగించారు. దీంతో సెట్ అధికారుల అనుమానాలు పూర్తిగా నిజమయ్యాయి.

మరోవైపు ఈ కేసులో కృష్ణలంక సీఐ నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి ఆయనకు 14 రోజులపాటు రిమాండ్ విధించారు.. రిమాండ్ కంటే ముందు ఆయనకు జి జి హెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు అధికారులు.. ఆ తర్వాత అతడిని జైలుకు తరలించారు.

పెరిగిన కోడి గుడ్ల ధరలు.. కారణం ఇదే..

Egg Price Hike
Egg Price Hike

Egg Price Hike: తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా నిత్యావసర ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలకు చౌకగా లభించే ఏకైక ప్రోటీన్ ఆహారమైన కోడిగుడ్డు ధరలు ఒక్కసారిగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం రెండు వారాల క్రితం వరకు హైదరాబాద్ మార్కెట్‌లో ఒక కోడిగుడ్డు విడిగా రూ.6 పలుకగా, ప్రస్తుతం అది ఏకంగా రూ.8 కి చేరింది. బహిరంగ మార్కెట్‌లో ఈ రీటైల్ ధరలు వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. ఇవి హోల్ సేల్ మార్కెట్లో ఎలా ఉన్నాయో చూద్దాం..

ఇటీవల కాలంలో తీవ్రమైన ఎండల తీవ్రత కారణంగా కోళ్ల ఫారాల్లో ఉత్పత్తి గణనీయంగా తగ్గినట్లు తెలుస్తోంది. ఉష్ణోగ్రతల ప్రభావంతో లేయర్ కోళ్లు సరిగ్గా గుడ్లు పెట్టకపోవడం, అలాగే వేసవిలో కోళ్ల మరణాలు పెరగడం వల్ల మార్కెట్‌కు వచ్చే గుడ్ల సరఫరా (సప్లై) పడిపోయింది. అయితే, పాఠశాలలు తిరిగి ప్రారంభం కావడం, హాస్టళ్లు తెరవడం మరియు రోజువారీ వినియోగం పెరగడంతో డిమాండ్‌కు సరిపడా గుడ్ల ఉత్పత్తి లేకపోవడమే ఈ ఆకస్మిక ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని పౌల్ట్రీ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.అటు హోల్‌సేల్ మార్కెట్‌లో కూడా ధరలు రూ.6 నుండి రూ.6.50 వరకు కొనసాగుతున్నాయి.

కేవలం గుడ్ల ధరలే కాకుండా మాంసం ప్రియులకు కూడా ధరల సెగ గట్టిగానే తగులుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.280 నుండి రూ.300 వరకు పలుకుతోంది. సాధారణంగా వేసవి ముగింపులో కోళ్ల ఎదుగుదల తగ్గడం మరియు రవాణా ఖర్చులు పెరగడంతో చికెన్ ధరలు కూడా గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. దీనివల్ల ఆదివారం వచ్చిందంటే చికెన్, గుడ్లతో విందు చేసుకునే సామాన్య కుటుంబాలు ఇప్పుడు మార్కెట్‌కు వెళ్లాలంటేనే జంకుతున్నారు.

చాలా కాలం తర్వాత ఫ్యాన్స్ మధ్యలోకి రానున్న మహేష్ బాబు.. కారణం ఏంటంటే..

Mahesh Babu
Mahesh Babu

Mahesh Babu public appearance: సూపర్ స్టార్ మహేష్ బాబు ని అభిమానులు బాగా మిస్ అవుతున్నారు. ‘గుంటూరు కారం’ చిత్రం విడుదలై రెండున్నర ఏళ్ళు పూర్తి అయ్యింది. అప్పటి నుండి ఆయన తన పూర్తి సమయాన్ని ‘వారణాసి’ చిత్రానికే కేటాయించారు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 7 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సెప్టెంబర్ నెలలోపు షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడట రాజమౌళి. ఇకపోతే మహేష్ బాబు అభిమానుల మధ్యకు వచ్చిన చివరి ఈవెంట్ #Globetrotter . ఈ ఈవెంట్ తర్వాత మరోసారి ఆయన అభిమానుల ముందుకు రాలేదు. ఇప్పుడు ఆయన జులై 2 న హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించబోయే ‘రావు బహదూర్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరు కాబోతున్నాడట. ఈ విషయాన్ని మూవీ టీం అధికారికంగా ప్రకటించింది.

ఈ చిత్రానికి సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరించిన సంగతి అందరికీ తెలిసిందే. ‘మేజర్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ఇది. సత్యదేవ్ ఇందులో హీరో గా నటించాడు. ఇప్పటి వరకు ఈ చిత్రం విడుదలైన టీజర్, ట్రైలర్ లకు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ‘C/O కంచరపాలెం’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేష్ మహా దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా ఇది. ట్రైలర్ ని చూస్తుంటేనే చాలా క్రియేటివ్ గా అనిపించింది. కచ్చితంగా ఇది టాలీవుడ్ లో పాత్ బ్రేకింగ్ మూవీ అవుతుందని అందరూ బలంగా నమ్ముతున్నారు. సత్యదేవ్ కూడా అద్భుతంగా నటించాడని , కమల్ హాసన్ గారు ఒక ఫంక్షన్ నాకన్నా బెటర్ యాక్టింగ్ తదుపరి జనరేషన్ లో ఎవరైనా చేస్తే , నేను సినిమాలకు రిటైర్మెంట్ ఇస్తానని అన్నాడు , సత్యదేవ్ అలాంటి యాక్టింగ్ చేశాడు , ఒకసారి చూడండి సార్ అంటూ డైరెక్టర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడిన మాటలు సంచలనంగా మారాయి.

ఇంత డేరింగ్ తో మాట్లాడాడు అంటే , కచ్చితంగా సినిమా ఔట్పుట్ అదే రేంజ్ లో వచ్చి ఉంటుందని , సత్యదేవ్ కెరీర్ ఈ చిత్రం తో పూర్తిగా మారిపోతుందని అంటున్నారు. ఇకపోతే జులై 2 న జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఏమి మాట్లాడబోతున్నాడో అని మహేష్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వారణాసి మూవీ గురించి మహేష్ చిన్న అప్డేట్ అయినా ఇస్తాడేమో అని అభిమానుల ఆశ. ఎందుకంటే ఆగస్టు 9 న మహేష్ బాబు పుట్టిన రోజు ఉంది కాబట్టి , ఆ రోజున ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని ఆశిస్తున్నారు ఫ్యాన్స్. మరి మహేష్ ఏమైనా అప్డేట్ ఇస్తాడో లేదో చూడాలి.

రామ్ చరణ్ పై ప్రశంసల వర్షం కురిపించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ట్వీట్ వైరల్..

Modi praises Ram Charan
Modi praises Ram Charan

Modi praises Ram Charan: మెగాస్టార్ చిరంజీవి కి రామ్ చరణ్ ని చూసినప్పుడల్లా ఎంత పుత్రోత్సాహం కలుగుతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 40 ఏళ్ళ తన సుదీర్ఘ సినీ కెరీర్ లో చిరంజీవి కూడా చెయ్యలేని పాత్రలు , ఆయన సాధించలేని రికార్డులు క్రియేట్ చేస్తూ రామ్ చరణ్ గ్లోబల్ వైడ్ గా సొంతం చేసుకుంటున్న ఫేమ్ ని చూసి ఆయన ఎంతగానో మురిసిపోతుంటాడు. నిన్న హైదరాబాద్ లో జరిగిన ‘పెద్ది’ సక్సెస్ ఫంక్షన్ లో చిరంజీవి తన కొడుకు గురించి గర్వంగా మాట్లాడుతూ ఎంతో సంతోషించాడో మన కళ్లారా చూశాము . సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ ప్రసంగానికి సంబంధించిన వీడియో నే చక్కర్లు కొడుతోంది. ఇదంతా పక్కన పెడితే మొన్న రామ్ చరణ్ ముంబై లో జరిగిన ఒక సమ్మిట్ కి హాజరైన సంగతి తెలిసిందే.

ఈ సమ్మిట్ కి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా హాజరయ్యారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ రామ్ చరణ్ ని ‘న్యూ ఏజ్ మెగాస్టార్’ గా సంబోదించాడు. దీనిపై నిన్న చిరంజీవి సక్సెస్ ఈవెంట్ లో చాలా గొప్పగా చెప్పుకొచ్చాడు. ఇప్పుడు కాసేపటి క్రితమే ఆయన తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కూడా ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడే పుట్టాడు, జనుల గనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ ‘ అనే పద్యాన్ని షేర్ చేసాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘నిన్న మన భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న రిపబ్లిక్ టీవీ కార్యక్రమంలో రామ్ చరణ్ ని న్యూ ఏజ్ మెగాస్టార్ అని సంబోధించడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఇలాంటి ప్రతిష్టాత్మక వేదికలపై చరణ్ కి లభిస్తున్న గుర్తింపు , గౌరవం చూస్తుంటే ఒక తండ్రిగా ఎంతో గర్వంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘తన కృషి , అంకితభావం , నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రమే కాదు , దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపు కూడా సంపాదించుకోవడం నిజంగా సంతోషకరం. ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరింపచెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ ఆయన చాలా భావోద్వేగం తో ట్వీట్ వేశారు. దీనిపై సోషల్ మీడియా లో అభిమానులు ఆనందిస్తుంటే , యాంటీ ఫ్యాన్స్ మాత్రం ట్రోల్స్ చేస్తున్నారు. ఇంత చిన్న దానికే చిరు ఇంతలా మురిసిపోతున్నాడు , రేపు నేషనల్ అవార్డు వస్తే ఇక పట్టుకోలేము ఏమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.