Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్ 10' లోకి ఎంట్రీ ఇచ్చేందుకు 1 కోటి...

Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు 1 కోటి రూపాయిలు డిమాండ్ చేస్తున్న సీరియల్ ఆర్టిస్ట్..

Bigg Boss 10 Telugu: ప్రతీ ఏడాది సెప్టెంబర్ నెలలో మొదలయ్యే ‘బిగ్ బాస్’ సీజన్ కోసం బుల్లితెర ఆడియన్స్ ఎంత ఆతృతగా ఎదురు చూస్తుంటారో మనం చూస్తూనే ఉన్నాము. గత సీజన్ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం తో , ఈ ఏడాది జరగబోయే ‘బిగ్ బాస్ 10’ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గత ఏడాది లాగానే , ఈ ఏడాది కూడా ‘అగ్నిపరీక్ష’ షో ని నిర్వహిస్తున్నారు. ఈ షో […]

Bigg Boss 10 Telugu: ప్రతీ ఏడాది సెప్టెంబర్ నెలలో మొదలయ్యే ‘బిగ్ బాస్’ సీజన్ కోసం బుల్లితెర ఆడియన్స్ ఎంత ఆతృతగా ఎదురు చూస్తుంటారో మనం చూస్తూనే ఉన్నాము. గత సీజన్ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం తో , ఈ ఏడాది జరగబోయే ‘బిగ్ బాస్ 10’ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గత ఏడాది లాగానే , ఈ ఏడాది కూడా ‘అగ్నిపరీక్ష’ షో ని నిర్వహిస్తున్నారు. ఈ షో ద్వారా సామాన్యులను మరోసారి బిగ్ బాస్ హౌస్ లోకి పంపబోతున్నారు. గత సీజన్ లో లాగానే , ఈ సీజన్ లో కూడా సామాన్యులు వెర్సస్ సెలబ్రిటీస్ మధ్య భీకర పోరు జరగనుంది. ఈ పోరులో ఎవరు గెలుస్తారు అనేది సస్పెన్స్. గత సీజన్ లో అయితే సామాన్యుడు కళ్యాణ్ పడాల టైటిల్ విన్నర్ గా నిలిచాడు.

ఈ సీజన్ లో కూడా సామాన్యుడే గెలుస్తాడని నెటిజెన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణ్ పడాల , డిమోన్ పవన్ రేంజ్ కంటెస్టెంట్స్ కోసం వడగాస్తున్నారు మేకర్స్. అగ్నిపరీక్ష కి సంబంధించిన ధరఖాస్తుల తేదీని కూడా పొగిడించారు. ఇకపోతే ఈ సీజన్ లో సెలబ్రిటీలను కూడా టాప్ రేంజ్ వాళ్ళని తీసుకొచ్చేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారట మేకర్స్. అందులో భాగంగా ‘కార్తీక దీపం’ సీరియల్ ద్వారా డాక్టర్ బాబు క్యారెక్టర్ తో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులను అలరించిన నిరుపమ్ ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట. కానీ ఈయన చాలా ఆర్టిస్ట్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుత్తం ‘కార్తీక దీపం’ సీజన్ 2 సీరియల్ చేస్తున్నాడు. దీంతో పాటు ‘పొదరిల్లు’ అనే సీరియల్ కి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ఈ రెండు సీరియల్స్ రికార్డు స్థాయి టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకు దోసుకువెళ్తోంది.

అలాంటి పీక్ రేంజ్ లో ఉన్న సీరియల్ హీరోని ‘బిగ్ బాస్ 10’ లోకి తీసుకొని రావాలంటే , రెమ్యూనరేషన్ వాళ్ళు ఎంత అడిగితే , అంత ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవ్వాలి. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం , నిరుపమ్ ఈ సీజన్ లో పాల్గొనడానికి ఏకంగా 1 కోటి రూపాయిల రెమ్యూనరేషన్ అడిగాడని సమాచారం. ప్రస్తుతం బిగ్ బాస్ టీం ఆయనతో భేరాలు ఆడుతున్నారు. నూటికి 90 శాతం ఈయన ఈ సీజన్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఒకవేళ నిరుపమ్ ఎంట్రీ ఇస్తే , మిగిలిన కంటెస్టెంట్స్ కి అన్యాయం జరగొచ్చు , ఎందుకంటే నిరుపమ్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో , ముఖ్యం గా లేడీస్ లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఆయన బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తే ప్రతీ వారం నామినేషన్స్ లోకి వచ్చినప్పుడు ఆయనకు వన్ సైడెడ్ గా ఓటింగ్ పడుతుందని , ఆ కారణం చేత బాగా ఆడే కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వొచ్చని అంటున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper