Homeఎంటర్టైన్మెంట్Peddi 20 Days Worldwide Collections: పెద్ది' 20 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. మ్యాజిక్...

Peddi 20 Days Worldwide Collections: పెద్ది’ 20 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. మ్యాజిక్ నెంబర్ కి అతి చేరువలో ఓవరాల్ గ్రాస్..

Peddi 20 Days Worldwide Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం విజయవంతంగా 20 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. ఈ 20 రోజుల్లో ఈ చిత్రాన్ని వచ్చిన వసూళ్లు ట్రేడ్ కి ఒక విచిత్రమైన అనుభూతిని కలిగించింది. కలెక్షన్స్ బాగున్నాయి , కానీ ఓవరాల్ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ మాత్రం అవ్వలేదు. తెలుగు రాష్ట్రాల్లో సీడెడ్, నెల్లూరు జిల్లాల్లో భారీ నష్టాలు తప్పేలా లేవు. అదే విధంగా ఓవర్సీస్ , నార్త్ ఇండియా, కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా వంటి ప్రాంతాల్లో ఈ చిత్రానికి భారీ నుండి అతి భారీ నష్టాలు వచ్చాయి. మంచి వసూళ్లు వచ్చినప్పటికీ నిర్మాతలు బయ్యర్స్ కి హద్దులు దాటిన ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం తో నష్టాలు వాటిల్లాయి. ఇకపోతే 20 వ రోజున ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 32 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే నైజాం ప్రాంతం నుండి 54 కోట్ల 29 లక్షలు రాగా , సీడెడ్ ప్రాంతం నుండి 20 కోట్ల 88 లక్షలు , ఉత్తరాంధ్ర ప్రాంతం, నుండి 22 కోట్ల 76 లక్షలు , ఈస్ట్ గోదావరి నుండి 12 కోట్ల 82 లక్షలు , వెస్ట్ గోదావరి నమ్మేది 9 కోట్ల 5 లక్షలు , గుంటూరు జిల్లా నుండి 12 కోట్ల 55 లక్షలు , కృష్ణ జిల్లా నుండి 10 కోట్ల 16 లక్షలు నెల్లూరు జిల్లా నుండి 5 కోట్ల 82 లక్షలు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 148 కోట్ల 33 లక్షల షేర్ వసూళ్లు, 227 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లుయ్ వచ్చాయి. ఇది మామూలు విషయం కాదు.

ఇక ఇతర రాష్ట్రాల వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే కర్ణాటక నుండి ఈ చిత్రానికి 20 రోజుల్లో 15 కోట్ల 20 లక్షలు రాగా, తమిళనాడు + కేరళ నుండి 2 కోట్ల 40 లక్షలు, హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 12 కోట్ల 15 లక్షలు , ఓవర్సీస్ నుండి 23 కోట్ల 55 లక్షలు వచ్చాయి. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 201 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 343 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ వీకెండ్ తో ప్రతిష్టాత్మక 350 కోట్ల గ్రాస్ మైల్ స్టోన్ ని దాటేస్తుందని. ఇక వర్ల్ద్న్ వైడ్ గా అన్ని భాషలకు కలిపి 218 కోట్ల రూపాయలకు జరగ్గా, మరో 17 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular