Homeఎంటర్టైన్మెంట్Ram Charan Sukumar Movie: సుకుమార్ సినిమాలో ఈసారి రామ్ చరణ్ బ్లైండ్ గా కనిపించబోతున్నాడా..?

Ram Charan Sukumar Movie: సుకుమార్ సినిమాలో ఈసారి రామ్ చరణ్ బ్లైండ్ గా కనిపించబోతున్నాడా..?

Ram Charan Sukumar Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంటెలిజెంట్ డైరెక్టర్ గా తనకంటూ పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్… పుష్ప సినిమాతో ఇండియాలో తనకంటూ ఒక క్రేజ్ ను క్రియేట్ చేసుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా క్లారిటిని మైంటైన్ చేస్తున్నాడు. రామ్ చరణ్ తో చేయబోతున్న సినిమా విషయంలో ఆయన చాలావరకు కసరత్తులైతే చేస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ బ్లైండ్ గా నటించబోతున్నాడనే వార్తలు కూడా […]

Ram Charan Sukumar Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంటెలిజెంట్ డైరెక్టర్ గా తనకంటూ పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్… పుష్ప సినిమాతో ఇండియాలో తనకంటూ ఒక క్రేజ్ ను క్రియేట్ చేసుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా క్లారిటిని మైంటైన్ చేస్తున్నాడు. రామ్ చరణ్ తో చేయబోతున్న సినిమా విషయంలో ఆయన చాలావరకు కసరత్తులైతే చేస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ బ్లైండ్ గా నటించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇంతకుముందు వీళ్ళ కాంబోలో వచ్చిన ‘రంగస్థలం’ సినిమాలో రామ్ చరణ్ చెవిటి వాడి పాత్రలో కనిపించాడు…ఇక ఈ సినిమాలో గుడ్డివాడిగా నటించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం తెలియదు. కానీ మొత్తానికైతే సుకుమార్ ఈ సినిమాని చాలా ప్రస్టేజియస్ గా తీసుకొని తెరకెక్కించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా కథలో కూడా చాలా వరకు వైవిధ్యాన్ని చూపించాలనే ప్రయత్నం చేస్తున్నాడట.

అందుకోసమే ఆయన బ్లైండ్ గా ఉండే హీరో క్యారెక్టరైజేషన్ రాసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ క్యారెక్టర్ లో తను ఇమిడిపోయి నటిస్తాడని కూడా రామ్ చరణ్ అభిమానులైతే వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా సుకుమార్ ఏది చేసిన కూడా వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు.

కాబట్టి ఈ సినిమాలో రామ్ చరణ్ ను చాలా డిఫరెంట్ గా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక సుకుమార్ అనుకున్నట్టుగానే ఈ సినిమాలో రామ్ చరణ్ వైల్డ్ గా కనిపిస్తాడా? అలాగే గుడ్డివాడి పాత్రలో కూడా నటించి మెప్పిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.

మొత్తానికైతే ఈ సినిమాకి సంబంధించిన అవుట్ లైన్ ఏంటి అనేది తెలియాలంటే మాత్రం సుకుమార్ అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఇప్పటివరకు ఏ న్యూస్ వచ్చినా కూడా అది రూమర్ గానే పరిగణించబడుతుంది తప్ప అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే కాదని మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper