Home Blog Page 70

అనిల్ రావిపూడి మూవీస్ లో హీరోలకి ఆ ఒక్కటి కొంచెం ఎక్కువగా ఉంటుందా..?

Anil Ravipudi
Anil Ravipudi

Anil Ravipudi Movies Analysis: కమర్షియల్ సినిమాలకు పెట్టింది పేరుగా మారిన దర్శకుడు అనిల్ రావిపూడి… వరుసగా ఆయన చేసిన సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నాడు. ఇప్పటివరకు 9 సినిమాలు చేస్తే 9 సినిమాలు కూడా సూపర్ సక్సెస్ అవ్వడంతో ఆయన టాప్ డైరెక్టర్ గా మారిపోయాడు. అతని సినిమాలను చూడడానికి చాలా మంది ప్రేక్షకులు సైతం ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా పండుగ సీజన్ లో వచ్చి సూపర్ సక్సెస్ ని సాధించడం అనిల్ రావిపూడి నైజాం… ఇక అతను ప్రతి సంక్రాంతికి వచ్చి భారీ సక్సెస్ ని సాధిస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే అతని సినిమాలను చూడడానికి ఫ్యామిలీ ఆడియన్స్ ఎందుకని ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు అంటే అతని సినిమాల్లో పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే ను ఫాలో అవుతూ ఏ టైంలో ఏం రావాలో ప్రతిదీ ఒక మీటర్ మీద వచ్చేటట్టుగా సెట్ చేస్తూ ఉంటాడు.

అందువల్ల అతని సినిమాలకు ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తుందని చాలామంది చాలా రకాలుగా వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా అనిల్ రావిపూడి చేసే సినిమాల విషయంలో చాలా క్లారిటీ మెయింటైన్ చేస్తూ ఉంటాడు.

అయితే ఇప్పుడు ఆయన సినిమాల్లో చేసిన హీరోలందరిలో ఒక కామన్ ఎలిమెంట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆయన చేసిన ప్రతి సినిమాలోని హీరోకి కొంచెం హ్యూమర్ ఎక్కువగా ఉంటుంది. వాళ్లే కామెడిని చేస్తుంటారు. వీలైతే వాళ్లే విలన్స్ ని ఇరగదీస్తూ ఉంటారు. ఈ కామన్ పాయింట్స్ అయితే అతని సినిమాల్లో కనిపిస్తూ ఉంటాయి.

ఇక ఎప్పుడు కూడా హీరోని ఒక అగ్రెసివ్ షెడ్ లో అయితే ఆయన చూపించలేదు. ఇటు కామెడీ యాంగిల్ ను అటు కోపాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ చూపిస్తారు కాబట్టే ఆయన సినిమాలో హీరో చాలా వైల్డ్ గా కనిపిస్తూ ఉంటాడు. దీనివల్ల ప్రేక్షకులు సైతం ఆ క్యారెక్టర్ కి కనెక్ట్ అయ్యే అవకాశాలైతే పుష్కలంగా ఉంటాయి…

ఒక్క షాట్ కోసం 90 టేకులు.. 'వారణాసి' షూటింగ్ లో మహేష్ కి చుక్కలు చూపిన రాజమౌళి..

Mahesh Babu Varanasi Shooting
Mahesh Babu Varanasi Shooting

Mahesh Babu Varanasi Shooting: దర్శకుడు రాజమౌళి కి ఇంటర్నేషనల్ లెవెల్ లో ఫేమ్, క్రేజ్ ఊరికే రాలేదు. తన విజన్ కి తగ్గట్టు పని చేస్తూ , నూటికి నూరు శాతం పర్ఫెక్షన్ వస్తే తప్ప, ఒక షాట్ ని ఆయన ఓకే చేయడు. #RRR మూవీ ఎన్టీఆర్ రాజమౌళి ఎంత పర్ఫెక్షన్ కోరుకునే వ్యక్తో చెప్తాడు గుర్తుందా?, ముంబై ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోల ఎంట్రీ సరిగా రాలేదని , దానిని హైదరాబాద్ లో సెట్స్ వేసి రీ షూట్ చేసిన మనిషి ఆయన. ఈ రేంజ్ పర్ఫెక్షన్ ఉన్న డైరెక్టర్ ఇండియా లోనే కాదు, ప్రపంచం లోనే ఎక్కడా ఉండరేమో. ఇకపోతే ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న విజువల్ వండర్ ‘వారణాసి’ మూవీ షూటింగ్ విశేషాలను ఆ చిత్రం లో విలన్ క్యారెక్టర్ చేస్తున్న పృథ్వీ రాజ్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు.

ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. పృథ్వి రాజ్ మాట్లాడుతూ ‘నేను మోహన్ లాల్ బారోజ్ మూవీ లో ఒక చిన్న పాత్ర చేశాను . కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ షూటింగ్ నుండి మధ్యలోనే తప్పుకోవాల్సి వచ్చింది, మోహన్ లాల్ నటన చాలా దగ్గర నుండి చూసాను కాబట్టి ఆయన ఎంత గొప్ప నటుడో నాకు తెలుసు. ఆయన తర్వాత నా దృష్టిలో అంతటి గొప్ప నటుడు రాజమౌళి గారే. ప్రతీ సన్నివేశాన్ని ఆయన నటించి , జీవించి మాకు చూపిస్తాడు. మా పని చాలా సులువు అయ్యేలా చేస్తాడు. ఒక్కోసారి రాజమౌళి వివరించే సన్నివేశాలు నాకు అర్థం అయ్యేవి కాదు. దాన్ని అర్థం చేసుకోవడానికి నాకు తల ప్రాణం తోకకు వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆయన గొప్ప విజన్ కు , నా నటనకు మధ్య సెట్స్ లో చిన్నపాటి యుద్ధం అనేక సార్లు జరిగింది’.

‘కానీ ఆయనపై బలమైన నమ్మకం తో , ఆయన ఏది చెప్తే అదే చేస్తూ వచ్చాను. ఆ తర్వాత ఎడిటింగ్ టేబుల్ మీద ఫైనల్ ఔట్పుట్ ని చూసినప్పుడు చాలా గొప్పగా అలోచించి ఈ సన్నివేశాన్ని తీసాడని అనిపించేది. ఆయనతో పని చేయడం వల్ల ఒక నటుడిగా , దర్శకుడిగా ఎంతో పరిణీతి చెందాను. ఇప్పటి వరకు నేను రాజమౌళి రేంజ్ లో కష్టపడి పని చేసే డైరెక్టర్ ని చూడలేదు. ఉదయం 7 గంటలకు మొదటి షాట్ ని ప్లాన్ చేస్తే , ఆయన 5 గంటల 15 నిమిషాలకే సెట్స్ వద్దకు చేరుకొని , తన అస్సితన్స్ తో కలిసి 12 సార్లు రిహార్సల్స్ చేయిస్తారు. మేము ముందే సెట్స్ కి రావొచ్చా అని అడిగితే వద్దు అంటాడు. మాకు లంచ్ బ్రేక్ కూడా కేవలం 20 నిమిషాలు మాత్రమే ఇచ్చేవాడు. సెట్స్ లో ఒక్కో సన్నివేశాన్ని 90 టేకులకు పైగా తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉదయం 5 గంటలకు మొదలు పెడితే , రాత్రి వరకు కొనసాగిస్తారు, ఒకవేళ ఆయన విజన్ కి తగ్గట్టు షాట్ రాకపోతే మరుసటి రోజు కూడా అదే షాట్ ని తెరకెక్కిస్తారు ‘ అంటూ చెప్పుకొచ్చాడు.

బాలయ్య సక్సెస్ సీక్రెట్ ఏంటంటే..?

Balakrishna Success Secret
Balakrishna Success Secret

Balakrishna Success Secret: నందమూరి నటసింహం బాలయ్య బాబు ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో ఆచితూచి మరి అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే వరుసగా నాలుగు విజయాలను సాధించిన బాలయ్య బోయపాటి డైరెక్షన్ లో చేసిన ‘అఖండ 2’ సినిమాతో కొంతవరకు తడబడ్డప్పటికి ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాతో పాటుగా కొరటాల శివ దర్శకత్వంలో కూడా ఒక సినిమాని స్టార్ట్ చేశాడు. ఈ సినిమా భారీ కమర్షియల్ హంగులతో ఉండడమే కాకుండా బాలయ్య బాబు ఇంతకుముందు చేసిన సినిమాలన్నింటి కంటే భిన్నంగా ఉండబోతుందట… బాలయ్య వరుస సక్సెస్ లు సాధించడం వెనుక సీక్రెట్ ఏంటి అంటూ చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. నిజానికి బాలయ్య చిన్న కూతురు అయిన తేజస్విని బాలయ్య బాబు స్టోరీ సెలక్షన్స్ లో భాగమైంది.

కాబట్టే అతనికి భారీ సక్సెస్ లు రావడానికి అవకాశం దొరికిందని ఆమె ప్రతి విషయాన్ని కూడా దర్శకుడితో చర్చించిన తర్వాతే బాలయ్య బాబు దగ్గరికి ఆ కథలనైతే తీసుకెళ్తుందట. స్క్రిప్ట్ ఫైనల్ చేస్తే బాధ్యతను కూడా తనే తీసుకుంటుందని చెబుతున్నారు. దానివల్లే బాలయ్య బాబు వరుసగా సక్సెస్ లను సాధిస్తున్నాడని అలాగే మంచి కాంబినేషన్స్ కూడా సెట్ చేసుకోగలుగుతున్నాడు అంటు మరి కొంతమంది కామెంట్స్ చేస్తుండటం విశేషం…

ముఖ్యంగా తేజస్విని బాలయ్య అభిమానులతో అప్రోచ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళు బాలయ్య నుంచి ఏం కోరుకుంటున్నారు ఈ ఏజ్ లో బాలయ్య బాబు ని ఎలా చూడాలనుకుంటున్నారు అనే విషయాలను సేకరించి దానికి తగ్గట్టుగానే దర్శకులకు చెప్పి అలాంటి కథలను రెడీ చేయిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.

ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు ఈ ఏజ్ లో పెను సంచలనాలను సృష్టించే సినిమాలను చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి… ఇప్పటివరకు బాలయ్య చేసిన సినిమాలు ఒక రేంజ్ లో ఉంటే ఇప్పుడు చేయబోతున్న సినిమాలు మరో రేంజ్ లో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది…

ప్రభాస్ కి కథలను సెలెక్ట్ చేసేది అతనేనా..?

Prabhas story selection process
Prabhas story selection process

Prabhas story selection process: ‘ఈశ్వర్’ సినిమాతో తన కెరియర్ ను మొదలుపెట్టిన నటుడు ప్రభాస్… మొదటి సినిమాతోనే నటుడిగా చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత చేసిన రాఘవేంద్ర సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన కూడా వర్షం సినిమాతో స్టార్ హీరోగా మారిపోయాడు. తన లాంటి హీరో మరొకరు ఉండరు అనేంతలా పేరు ప్రఖ్యాతను సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో చాలా వరకు ఆచితూచి మరి ముందుకు అడుగులు వేస్తున్నాడు. బాహుబలి సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన ఆయన ఆ తర్వాత చేసిన సినిమాలతో విభిన్న తరహా సినిమాల వైపు అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్ అనే రెండు సినిమాలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ తను చేసే సినిమా కథలను ఆయన సెలెక్ట్ చేసుకోవడం లేదట. ఆయన ఒకసారి కథను విని దాన్ని ఫైనల్ చేసే బాధ్యతను వంశీ ప్రమోద్ ల పైన పెడుతున్నట్టుగా తెలుస్తుంది. వంశీ ప్రమోద్ లు ఇద్దరు కూడా ప్రభాస్ కి కజిన్ బ్రదర్స్ అవుతారు. మూవీ క్రియేషన్స్ అనే సంస్థను స్థాపించింది కూడా ప్రభాసే కావడం విశేషం…

ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాల విషయంలో చాలా ఆచితూచి మరి ముందుకు అడుగులు వేస్తున్నాడు. ఆయన నుంచి ఈ సంవత్సరం వచ్చిన రాజాసాబ్ సినిమా కొంతవరకు నిరాశపరిచింది. అంతకుముందు చేసిన కల్కి, సలార్ రెండు సినిమాలు కూడా భారీ విజయాన్ని సాధించడంతో ఆయన టాప్ రేంజ్ కి వెళ్ళిపోయాడు.

ఇక ఇప్పుడు ఫౌజీ, స్పిరిట్ సినిమాలతో కూడా మరోసారి పెను సంచలనాలను క్రియేట్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంటే మాత్రం తనను మించిన నటుడు మరొకరు ఉండరనేది చాలా క్లారిటీగా తెలిసిపోతుంది. లేకపోతే మాత్రం ఆయన చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు…

'ఓజీ 2' లో 'డ్రాగన్'.. సుజిత్ విజన్ కి ఈసారి ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్..

OG 2
OG 2

Dragon in OG 2: మన టాలీవుడ్ నుండి లోకేష్ కనకరాజ్ తరహా డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే డైరెక్టర్ సుజిత్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం ప్రమోషనల్ కంటెంట్ తోనే సినిమా పై విపరీతమైన హైప్ ని పెంచగల సత్తా ఉన్న డైరెక్టర్ ఆయన. కానీ హాఫ్ బేకింగ్ మూవీస్ తో తదుపరి లెవెల్ కి వెళ్లలేకపోయాడు ఇన్ని రోజులు. గత ఏడాది పవన్ కళ్యాణ్ తో తీసిన ‘ఓజీ’ చిత్రం జెన్ జీ యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని తెచ్చిపెట్టింది. కానీ సెకండ్ హాఫ్ ఇంకా బాగా తీసి ఉండాల్సిందని , చాలా రొటీన్ స్టోరీ అవ్వడం వల్ల, ఆ చిత్రానికి పాన్ ఇండియా లెవెల్ లో రీచ్ రాలేదని అభిమానుల్లో ఏర్పడిన చిన్న అసంతృప్తి. కానీ ముందుగా రాసుకున్న సెకండ్ హాఫ్ అది కాదట.

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఫుల్ బిజీ గా ఉండడం వల్ల, ఓజీ చిత్రం షూటింగ్ కి కాస్త బ్రేక్ పడింది. మళ్లీ తిరిగి షూటింగ్ లోకి వచ్చిన తర్వాత , సమయం లేకపోవడం తో , ముందు అనుకున్న సెకండ్ హాఫ్ స్టోరీ ని పక్కన పెట్టి, సింపుల్ గా సెకండ్ హాఫ్ ని డిజైన్ చేయాల్సి వచ్చిందట. అయితే నేడు ‘ఓజీ 2’ కి సంబంధించిన కాన్సెప్ట్ వీడియో వచ్చింది. ఈ వీడియో చివర్లో పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం తన నుండి నూటికి నూరు శాతం బెస్ట్ ఇస్తానని మాట ఇవ్వడం తో సుజిత్ కి క్రియేటివ్ ఫ్రీడమ్ దొరికినట్టు అయ్యింది. ఈ వీడియో సుజిత్ పవన్ కళ్యాణ్ కి కథ ని వివరిస్తే ‘అతనికి ఒక పెట్(పెంపుడు జంతువు) ఉంటుంది అన్నమాట’ అని అంటాడు గుర్తుందా?, పెట్ అంటే కుక్కనో , పిల్లినో అనుకునేరు, ఏకంగా డ్రాగన్ అది.

డ్రాగన్ ని హీరో కి పెట్ అనడం సుజిత్ మార్క్ పీక్ ఎలివేషన్ అనొచ్చు. సినిమాలో డ్రాగన్ పాత్ర అత్యంత కీలకంగా ఉండబోతుంది. డ్రాగన్ విజువల్స్ తో ఇప్పటి వరకు ఇండియా లో ఒక్క సినిమా కూడా రాలేదు. బడ్జెట్ సుజిత్ అడిగినంత ఇవ్వగలిగితే మాత్రం దేశం గర్వించదగ్గ చిత్రం ఆయన నుండి రాబోతుంది అనుకోవచ్చు. ఓజీ చిత్రానికి ఫుల్ రన్ లో 320 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి, అది ‘ఓజీ 2’ కి మొదటి రోజే రావొచ్చు , ఆ రేంజ్ హైప్ క్రియేట్ అయ్యింది. రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకా ఎన్ని అద్భుతాలను నెలకొల్పబోతుందో చూడాలి. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో ఈ చిత్రాన్ని భారీ లెవెల్ లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఇది కేవలం పాన్ ఇండియన్ సినిమా మాత్రమే కాదు , పాన్ వరల్డ్ సినిమా అట.

'ఓజీ 2' కాన్సెప్ట్ వీడియో వచ్చేసింది.. ఇంట్రడక్షన్ షాట్ కే 500 కోట్లు ఫిక్స్..

OG 2 concept video
OG 2 concept video

OG 2 concept video: గత ఏడాది ‘ఓజీ’ సృష్టించిన మేనియా నుండి జెన్ జీ యూత్ ఆడియన్స్ ఇంకా బయటకు రాలేదు. సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఈ సినిమాకు సంబంధించిన క్లిప్పింగ్స్ కనిపిస్తున్నాయి. అదే విధంగా మీమర్స్ కి ఈ చిత్రం ఒక వరం లాగా మారిపోయింది. ఏ సందర్భం వచ్చినా ఈ సినిమాలోని సన్నివేశాన్ని మీమ్ గా వాడుతూ హల్చల్ చేస్తున్నారు. ఈ మైన ఇంకా పచ్చిగా ఉండగానే పవన్ కళ్యాణ్ టీం ‘ఓజీ 2’ గురించి ప్రకటన ఇవ్వడం తో , సోషల్ మీడియా లో ఈ సినిమా గురించి తప్ప మరో టాపిక్ లేకుండా పోయింది. రెండు రోజుల క్రితమే సుజిత్ పవన్ కళ్యాణ్ ని కలిసిన ఫోటోని సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ టీం అప్లోడ్ చేసిన సంగతి తెలిసిందే . ఈ ఫోటో సోషల్ మీడియా ని ఒక ఊపు ఊపేసింది.

అభిమానుల ఉత్సాహానికి మరింత బూస్ట్ ఇస్తూ కాసేపటి క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్ వీడియో ని విడుదల చేశారు. ఈ వీడియో చూసిన తర్వాత అభిమానులకే కాదు , సాధారణ మూవీ లవర్స్ కి కూడా గూస్ బంప్స్ వచ్చాయి. డైరెక్టర్ సుజిత్ పవన్ కళ్యాణ్ కి సన్నివేశాన్ని వివరిస్తూ ‘ మంచు రక్తం తో తడిపొయి ఉంటుంది, అప్పుడు ఓజాస్ గంభీర అనే టైటిల్ తో ఓపెనింగ్ షాట్ పడుద్ది సార్’ అంటారు. ఈ సన్నివేశానికి 500 కోట్ల గ్రాస్ ఫిక్స్ అయిపోయింది , ఇక ఆ తర్వాత సుజిత్ వదిలే కంటెంట్ బట్టీ హైప్ డబుల్ , ట్రిపుల్ అవుతుంది , పవన్ కళ్యాణ్ కి మొట్టమొదటి వెయ్యి కోట్ల సినిమా అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ఫ్యాన్స్ మరియు నెటిజెన్స్. ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ కి ఒక పెంపుడు జంతువు ఉంటుంది , అదేంటో తెలుసా?, ‘డ్రాగన్’ అట.

ఈ వీడియో లో సుజిత్ ఆ డైలాగ్ ని వివరించిన వెంటనే రెడ్ డ్రాగన్ ని బ్యాక్ డ్రాప్ లో చూపిస్తారు. దీనిని బట్టీ ఆయన విజన్ ఈ సినిమా పట్ల ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ కామిక్ బుక్ లో ఒక విజువల్ ని చూసి , ఇది సినిమాలో ఐకానిక్ విజువల్ గా ఉండిపోతుంది అని అంటాడు. ఆ విజువల్ ఏంటో ప్రస్తుతానికి మనకు తెలియదు కానీ , ఫ్యాన్స్ మాత్రం ఇప్పటి నుండే తమ ఊహల్లో మునిగి తెలుస్తున్నారు. ఇక చివర్లో పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం నా వైపు నుండి ఎంత ఇవ్వాలో అంత ఇస్తాను అని మాట ఇవ్వడం, సుజిత్ , పవన్ కళ్యాణ్ , తమన్ లను మూడు డ్రాగన్స్ గా చూపించి , ఒక పెద్ద డ్రాగన్ గా ట్రాన్స్ ఫార్మ్ అవ్వడం వంటివి చూసేందుకు చాలా పీక్ గా గా అనిపించింది. ఇకపోతే తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి భాగానికి రెండింతలు బెటర్ మ్యూజిక్ ని ‘ఓజీ 2’ కి అందించబోతున్నాడు తమన్.

జనసేనలోకి మాజీ మంత్రి!

Avanthi Srinivas joins Janasena
Avanthi Srinivas joins Janasena

Avanthi Srinivas joins Janasena: జనసేనలో చేరికలకు రంగం సిద్ధం అవుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల చేరికల కమిటీని ఏర్పాటు చేశారు. 14 మంది నేతలతో కూడిన ఈ కమిటీ జనసేనలో చేరికల విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుంటుంది. ప్రధానంగా వివిధ పార్టీల్లో పనిచేస్తున్న వారు, తటస్తులు, విద్యాధికులను పరిశీలించి పార్టీలోకి ఆహ్వానించనుంది. అయితే ఈ కమిటీ ఓ మాజీ మంత్రికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. వైసీపీకి రాజీనామా చేసి పొలిటికల్ జంక్షన్ లో నిలబడిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కు పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తోంది. త్వరలో ఆయన జనసేనలో చేరడం ఖాయమని ప్రచారం ప్రారంభమైంది. ఒక్క అవంతి శ్రీనివాసరావు మాత్రమే కాదు.. చాలామంది నేతల చేరికకు తెరవెనుక కసరత్తు మొదలైనట్లు తెలుస్తోంది.

మొన్నటి ఎన్నికల్లో ఓటమి..
మొన్నటి ఎన్నికల్లో భీమిలి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు అవంతి శ్రీనివాసరావు. ఆయనపై టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు భారీ మెజారిటీతో గెలిచారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అవంతి శ్రీనివాసరావు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. తెలుగుదేశం పార్టీలో చేరాలని భావించారు. కానీ అక్కడ గంటా శ్రీనివాసరావు రూపంలో బలమైన నాయకుడు ఉన్నారు. ఆయన అభ్యంతరంతో టీడీపీ నాయకత్వం అవంతి శ్రీనివాసరావుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. అయితే ఇప్పుడు జనసేన చేరికలకు ప్రోత్సహిస్తున్న తరుణంలో అవంతి శ్రీనివాస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

పిఆర్పి ద్వారా ఎంట్రీ..
ప్రజారాజ్యం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు అవంతి శ్రీనివాసరావు. 2009లో తొలిసారిగా భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2014 ఎన్నికల్లో కు ముందు తెలుగుదేశం పార్టీలో చేరిన అవంతి శ్రీనివాసరావు అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి బరిలో దిగారు. ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగు పెట్టారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అవంతి శ్రీనివాసరావుకు భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఆ ఎన్నికల్లో గెలిచిన ఆయనను మంత్రివర్గంలోకి తీసుకున్నారు జగన్. 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా రెండోసారి పోటీ చేసి భీమిలి నుంచి ఓడిపోయారు. ఓడిపోయిన వెంటనే పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల పునర్విభజనతో అవంతి శ్రీనివాస్ రావు కు చాన్స్ ఇస్తానని పవన్ హామీ ఇచ్చినట్లు సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో.

ముగ్గురు ముఖ్యమంత్రులు ఒకే చోటకు.. ఏం జరుగుతుందో?

Three Chief Ministers Meeting
Three Chief Ministers Meeting

Three Chief Ministers Meeting: దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తోంది. ఆ పార్టీ నేరుగా మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. తమిళనాడులో ప్రభుత్వ భాగస్వామిగా ఉంది. అయితే ఏపీలో మాత్రం టిడిపి కూటమి ప్రభుత్వం ఉంది. ఒకరకంగా ఎన్డీఏ ప్రభుత్వం అనుకోవాలి. అయినా సరే ఏపీ సీఎం చంద్రబాబు దక్షిణాది రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్యమంత్రిలతో మంచి సంబంధాలే కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, ఏపీ సీఎం చంద్రబాబు ఒకే వేదికపై వస్తున్నారు. నిజంగా ఇది ఆశ్చర్యకరం. ఓ అధికారిక కార్యక్రమంలో భాగంగా ఆ ముగ్గురు ముఖ్యమంత్రులు ఒకే వేదికపై వస్తుండడంతో అందరి దృష్టి అటువైపే ఉంది.

గత ఏడాది కొట్టుకుపోయిన గేట్లు..
గత ఏడాది ఆగస్టులో తుంగభద్ర ప్రాజెక్టుకు సంబంధించి గేట్లు కొట్టుకుపోయాయి. ఆ సమయంలో ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. సంబంధిత నిపుణులతో కలిసి తాత్కాలిక గేట్లు ఏర్పాటు చేసి వరద నీటిని అడ్డుకున్నారు. అయితే ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో 120 రోజుల్లోనే 33 నూతన క్రస్ట్ గేట్ల ఏర్పాటు పూర్తయింది. ఈరోజు ఆ గేట్లను ప్రారంభించనున్నారు. కార్యక్రమానికి మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి ఆర్ పాటిల్ ఈ గేట్లను ప్రారంభించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నిన్ననే కర్నూలు చేరుకున్నారు. గురువారం ఉదయం ప్రత్యేక హెలికాప్టర్లో కర్ణాటకలోని కొప్పల జిల్లాలో ఎయిర్పోర్ట్ కు చేరుకొని.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రాజెక్టు దగ్గరకు వెళ్తారు. హైదరాబాదు నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక విమానంలో వచ్చి.. రోడ్డు మార్గంలో తుంగభద్ర ప్రాజెక్టుకు చేరుకుంటారు. కేంద్ర మంత్రి పాటిల్, కర్ణాటక సీఎం బి కే శివకుమార్ సైతం ఆ సమయానికి చేరుకుంటారు. కేంద్ర మంత్రులతో పాటు ముగ్గురు ముఖ్యమంత్రులు 33 గేట్లను ప్రారంభిస్తారు. అనంతరం మునీరాబాద్ సమీపంలో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు.

భిన్నమైన ప్రభుత్వాలు..
కర్ణాటక తోపాటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. అయితే ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు విషయంలో కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు గౌరవభావంతోనే ఉంటున్నారు. అయితే ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు ఒకే వేదిక పైకి వస్తుండడంతో.. ప్రాధాన్యత సంతరించుకుంది. పైగా కేంద్ర జల శక్తి మంత్రి హాజరవుతుండడంతో సరిహద్దు జలాల వివాదాలు పరిష్కారమయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఒక సహృద్భావ వాతావరణం నెలకొనే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికైతే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలయిక ఒక సంచలనం అయితే.. కర్ణాటక సీఎం వీరిని జతకలుస్తుండడం మరింత ప్రాధాన్యంగా మారింది.

పూరి జగన్నాధ్ ఇక కథలు మార్చడా..? ఒకే స్టోరీ ఎన్ని సినిమాలు తీస్తాడు..

Puri Jagannadh Movies
Puri Jagannadh Movies

Puri Jagannadh Movies: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్… ఒకప్పుడు ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉండేది. ఆయన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆరించేవి. ఇక చాలామంది స్టార్ హీరోలు సైతం అతనితో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపించేవారు. కానీ గత కొద్దిరోజుల నుంచి ఆయన చాలావరకు డీలా పడిపోయాడు. వచ్చిన సినిమాలు వచ్చినట్టుగా ఫ్లాప్ అవుతున్నాయి. దాంతో ఏం చేయాలో తెలియని ఒక దిక్కు తోచని పరిస్థితులో తను ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇష్మార్ట్ శంకర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఆయన ఆ తర్వాత చేసిన లైగర్, డబుల్ ఇష్మార్ట్ సినిమాలతో డీలా పడ్డాడు.

మరోసారి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే స్లమ్ డాగ్ మూవీ టీజర్ ని కనుక మనం చూసినట్లయితే ఈ మూవీ రొటీన్ రొట్ట ఫార్ములా సినిమా లాగానే కనిపిస్తుంది. ఇంతకు ముందు పూరి చేసిన సినిమాలన్నింటిని మిక్స్ చేసి ఈ సినిమాను చేసినట్టుగా తెలుస్తుంది.

ఎందుకని పూరి జగన్నాథ్ ఒకే కథతో సినిమా చేస్తున్నాడు. ఎప్పుడు హీరో పోలీస్ ఆఫీసర్ లేదంటే హీరో మాఫియా డాన్ ఇలాంటి కథలతోనే సినిమాలు చేస్తున్నారు. కొత్తగా ఆలోచించి మంచి కథలను సినిమాలుగా చేయొచ్చు కదా అని ధోరణిలో కూడా కొంతమంది కొన్ని అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా పూరి జగన్నాథ్ నుంచి వచ్చే సినిమాలు అంత ఎఫెక్టివ్ గా ఉండడం లేదు.

ఇప్పటికైనా ఆయన కథలు మారిస్తే బాగుంటుందని మంచి కథలతో సినిమాలు చేయగలిగితే ఆయన ఇప్పటికి సక్సెస్ ని సాధించగలిగే కెపాసిటి ఉన్న దర్శకుడని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇక రాబోయే రోజుల్లో కూడా భారీ విజయాలను సాధించగలిగే కెపాసిటి ఉన్న దర్శకుడిగా మారతాడా? లేదంటే ఫ్లాప్ సినిమా దర్శకుల లిస్టులోనే మిగిలిపోతాడా అనేది తెలియాల్సి ఉంది…

మతం మారలేదు.. మారాలన్న ఒత్తిడి లేదు.. ఉష వాన్స్ కీలక వ్యాఖ్యలు!

Usha Vance statement on religion
Usha Vance statement on religion

Usha Vance statement on religion: అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షుడు జీడివన్స్. ఈయన భారతదశ అల్లుడు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఉష – వాన్స్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2024 నవంబర్లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జేడీ వాన్స్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీంతో ఆంధ్ర ప్రదేశ్ లోనూ సంబరాలు చేసుకున్నారు. తాజాగా జేడీ వాన్స్ ఉష దాంపత్య జీవితంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుంది.

వివాదం ఎలా మొదలైంది?
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన భార్య ఉషా (హిందూ నేపథ్యం ఉన్న భారతీయ-అమెరికన్) ఒకరోజు క్రిస్టియన్ మతంలోకి మారాలని ఆశిస్తున్నట్లు గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. మిసిసిపీలోని యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఇలా అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా, మీడియాలో విస్తృతంగా చర్చకు గురయ్యాయి. కొందరు దీన్ని ఉష విశ్వాసాన్ని తక్కువ చేసినట్లు, బలవంతపు మత మార్పిడిగా వ్యాఖ్యానించగా, మరికొందరు ఇది వ్యక్తిగత విశ్వాసం వల్ల వచ్చిన సహజమైన కోరిక అని అభిప్రాయపడ్డారు.

స్పష్టత ఇచ్చిన వాన్స్..
అయితే వాన్స్ తర్వాత తన వ్యాఖ్యలను స్పష్టం చేస్తూ, ఉష క్రిస్టియన్ కాదని, మారాలనే ప్రణాళిక లేదని, కానీ తాను ఆమెను గౌరవిస్తానని చెప్పారు. వాన్స్ 2019లో కాథలిక్ మతంలోకి మారిన నేపథ్యం, పిల్లల పెంపకం విధానంపై సోషల్ మీడియాలో వాన్స్ తీరుపై ప్రచారం మొదలైంది.

ఉషా ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు…
తాజాగా సీబీఎస్ న్యూస్ సండే మార్నింగ్ ఇంటర్వ్యూలో ఉష వాన్స్ ఈ వివాదంపై స్పందించారు. “నేను స్థిరమైన హిందూ కుటుంబంలో పెరిగాను. వాన్స్ లాగా మరొక విశ్వాసాన్ని అనుసరించాలని నాకు ఎప్పుడూ అనిపించలేదు” అని తెలిపారు. “నన్ను రోజూ కన్వర్ట్ చేయడానికి వాన్స్ ప్రయత్నిస్తారని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అలాంటిది ఏమీ లేదు. ఆయన కాథలిక్ మతస్థుడు కాబట్టి, తన విశ్వాసాన్ని వ్యాప్తి చేయాలని ఆశించడం ఆయన విశ్వాసంలో భాగం. కానీ ఆయన నన్ను ఎలాంటి ఒత్తిడి చేయడం లేదు” అని స్పష్టం చేశారు. ఈ సమాధానం ద్వారా ఉష తన వ్యక్తిగత విశ్వాసం, కుటుంబ సంప్రదాయాలను గౌరవిస్తూ ఉన్నట్లు, అలాగే దంపతుల మధ్య బలవంతం లేదని చెప్పారు.

దంపతుల పరస్పర మద్దతు..
ఉషా వాన్స్ (పుట్టుకతో ఉష చిలుకూరి) దక్షిణ కాలిఫోర్నియాలో భారతీయ వలసదారుల కుటుంబంలో పెరిగారు. ఆమె కుటుంబం హిందూ మత సంప్రదాయాలను అనుసరిస్తుంది, అయినప్పటికీ అంత బలంగా మతపరమైనది కాదు. వాన్స్ 2019లో కాథలిక్ మతంలోకి మారారు. ఆ సమయంలో ఉషా ఆయన విశ్వాస ప్రయాణానికి పూర్తి మద్దతు ఇచ్చారు. వాన్స్ తన ఫెయిత్ జర్నీ గురించి మాట్లాడుతూ, “ఉష నా విశ్వాసం వైపు తిరిగేందుకు ఎంతో ప్రోత్సహించింది. ఆమె క్రిస్టియన్ కాకపోయినా, నేను ఈరోజు క్రిస్టియన్‌గా ఉండటానికి ఆమె సహకారం చాలా ముఖ్యం” అని చెప్పారు. వారిద్దరూ మతం, విశ్వాసం గురించి లోతైన చర్చలు చేస్తారని, ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటారని రెండు వైపులా తెలిపారు.

పిల్లల పెంపకం, కుటుంబ సంప్రదాయాలు..
జేడీ వాన్స్-ఉషా దంపతులకు ప్రస్తుతం ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారు నాలుగో బిడ్డను ఆశిస్తున్నారు. పిల్లలను కాథలిక్/క్రిస్టియన్ పాఠశాలలో చదివిస్తున్నారు. అయితే, ఉష నానమ్మ (హిందూ మతం బాగా అనుసరించేవారు) ద్వారా హిందూ సంప్రదాయాలు (పూజలు, ఆలయాలు) పిల్లలకు పరిచయం చేస్తున్నారు. పిల్లలు కాథలిక్‌గా బాప్టిజం తీసుకోవాలని బలవంతం చేయకుండా, వారు పెద్దయ్యాక ఎంచుకోవాలని నిర్ణయించారు.

మొత్తం మీద ఉష ఇచ్చిన స్పష్టీకరణ ఆ అపోహలను తొలగించి, వారి కుటుంబంలో నిజమైన సమన్వయం ఎలా ఉందో చూపించింది. అమెరికా వంటి వైవిధ్యభరిత దేశంలో రాజకీయ నాయకుల కుటుంబాల్లో కూడా మత స్వేచ్ఛ, వ్యక్తిగత ఎంపికలు గౌరవించబడాలనే సందేశం ఇది ఇస్తోంది.

డ్రాగన్ సినిమాను రాజమౌళికి చూపించిన ఎన్టీఆర్.. జక్కన్న రియాక్షన్..

NTR Dragon movie Rajamouli reaction
NTR Dragon movie Rajamouli reaction

NTR Dragon movie Rajamouli reaction: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్… ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టాయి. దేవర సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన ‘వార్ 2’ సినిమాతో అతను చాలావరకు డీలా పడిపోయాడు. కారణం ఏంటంటే ఆయన నుంచి వచ్చే సినిమాలేవీ ప్రేక్షకుల్లో అంత ఇంపాక్ట్ చూపించడం లేదు. దాంతో ఎలాగైనా సరే తన తదుపరి సినిమాల విషయంలో చాలా క్లారిటిని మెయింటైన్ చేయాలనే ఉద్దేశ్యంతో ఆయన ఉన్నట్టుగా తెలుస్తుంది…ఇక ప్రస్తుతం ‘డ్రాగన్’ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయిన నేపథ్యంలో సినిమాకు సంబంధించిన రషెస్ మొత్తాన్ని దర్శక ధీరుడు రాజమౌళికి చూపించారట.

ఎన్టీఆర్ కి రాజమౌళికి మధ్య చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉన్న విషయం మనకు తెలిసిందే. కెరియర్ స్టార్టింగ్ నుంచి కూడా వీళ్ళిద్దరు చాలా మంచి ఫ్రెండ్షిప్ ని మెయింటైన్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే రాజమౌళి నాలుగు సినిమాలు చేశాడు. తన ఎంటైర్ కెరీర్లో ఎక్కువ సినిమాలు ఏ హీరోతో చేయలేదు. ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరి మధ్య చాలా మంచి బాండింగ్ ఉంది. దాంతోనే ఎన్టీఆర్ రాజమౌళికి సినిమాను చూపించాడు.

ఇక అది చూసిన రాజమౌళి అద్భుతంగా ఉందని ఈ సినిమాతో ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్ హీరోగా మారబోతున్నాడు అంటూ చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ విషయాన్ని విన్న ఎన్టీఆర్ చాలా ఆనందంగా ఉన్నారట. ప్రశాంత్ నీల్ సైతం రెట్టింపు ఉత్సాహంతో వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది…

ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే మాత్రం మరో సంవత్సరం వరకు వెయిట్ చేయాల్సిందే… ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని షేక్ చేయగలిగే కెపాసిటి జూనియర్ ఎన్టీఆర్ కైతే ఉంది. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో పెను సంచలనాలను క్రియేట్ చేయగలుగుతాడా లేదా అనేది చూడాలి…

పవన్ కళ్యాణ్ సినిమా ఇప్పుడప్పుడే లేనట్టేనా..?

Pawan Kalyan new movie update
Pawan Kalyan new movie update

Pawan Kalyan new movie update: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఒక సినిమా వస్తుందంటే చాలు తెలుగు సినిమా ప్రేక్షకులంతా ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఆయన కెరియర్ స్టార్టింగ్ లోనే ప్రేక్షకుల్లో విశేషమైన క్రేజ్ ను సంపాదించుకునే సినిమాలను చేసి స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక ప్రస్తుతం జనసేన పార్టీని పెట్టి ఏపీ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలను కొనసాగిస్తున్నప్పటికి తన తదుపరి సినిమాల విషయంలో కూడా ఆయన చాలా కీలకమైన పాత్రను వహిస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సంవత్సరం ఇప్పటికే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన తన తదుపరి సినిమా విషయంలో కూడా చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ని అయితే బయటికి తెలియజేయడం లేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మరింత లేటయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. సురేందర్ రెడ్డి గతంలో ‘ఏజెంట్’ అనే సినిమా ద్వారా భారీ దెబ్బతిని ఉన్నాడు.

ఇక ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ తో ఒక సక్సెస్ ఫుల్ సినిమాని చేసి తన రేంజ్ ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ని నమ్ముకుంటే ఇప్పుడప్పుడే సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలైతే లేవు. మరి సురేందర్ రెడ్డి ఎంత కాలం అని పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు.

ఈ సంవత్సరం మిస్ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ ఇక వచ్చే సంవత్సరం నుంచి ఆయన నెక్స్ట్ ఎలక్షన్స్ కి సంబంధించిన ప్రణాళికను రూపొందించుకొని ఆ కార్యక్రమాలను నిర్వహించే పనులు బిజీగా ఉంటాడు. కాబట్టి ఈ సంవత్సరమే అతనితో సినిమాలు చేసెయ్యాలి. లేకపోతే మాత్రం వచ్చే సంవత్సరం పవన్ కళ్యాణ్ ఎవ్వరి చేతికి దొరకడనే చెప్పాలి… సురేందర్ రెడ్డి ఈ విషయంలో ఏం ఆలోచిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తాడా లేదంటే ఆ సినిమాను పక్కనపెట్టి మరో హీరోతో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయా అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి…

చిరంజీవి కొత్త సినిమాలోకి వచ్చిన నయా విలన్...ఆయనేంటి..? విలనేంటి..?

Chiranjeevi new movie villain
Chiranjeevi new movie villain

Chiranjeevi new movie villain: మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ డైరెక్షన్లో చేస్తున్న సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా కోసం చిరంజీవి తీవ్రమైన కసరత్తులు చేస్తున్నాడు. ఈ సంవత్సరం ఆయన చేసిన ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది. దాంతో ఇకమీదట చేయబోయే సినిమాలు కూడా కమర్షియల్ సక్సెస్ లను సాధించాలనే ఉద్దేశ్యంతోనే ఆయన ముందుకు సాగుతున్నాడు. బాబీ డైరెక్షన్లో ఇంతకుముందు చేసిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా కూడా సూపర్ సక్సెస్ సాధించింది. దాంతో వీళ్ళిద్దరి కాంబినేషన్ కి మంచి క్రేజ్ అయితే ఉంది. ఇక ఇలాంటి క్రమంలోనే చిరంజీవి ఈ సినిమాలో చాలా వైల్డ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడట. 50 సంవత్సరాల పైబడిన వయసులో కనిపించి మెప్పించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

తను అనుకుంటున్నట్టుగానే ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తాడా? తద్వారా ప్రేక్షకులందరిని మెప్పించగలుగుతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో విలన్ గా ఒక స్టార్ హీరోని తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. ఒకప్పుడు హీరోగా రాణించి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన శివాజీ ని ఇందులో విలన్ గా తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది.

శివాజీ రేంజ్ కి చిరంజీవిని ఢీకొట్టే కెపాసిటి ఉందా అతను సినిమాలో విలన్ అయితే వీక్ విలన్ అయిపోతాడేమో అని కొంతమంది కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. శివాజీ చిరంజీవికి విలన్ గా పనికి రాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ విషయం మీద చర్చిస్తున్న సినిమా యూనిట్ తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి మరొక విలన్ ని తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంతవరకు ఈ సినిమాలో విలన్ గా ఎవరు చేస్తున్నారనే విషయం మీద సరైన క్లారిటి వచ్చే అవకాశం లేదు…చూడాలి మరి ఈ సినిమా చిరంజీవి కెరియర్ లోనే ది బెస్ట్ సినిమా గా నిలుస్తుందా లేదా అనేది…

చిరంజీవి మీద కోపం తోనే కొరటాల శివ పవర్ ఫుల్ కథను రెడీ చేశాడా..?బాలయ్య ప్రభంజనం స్టార్ట్ అవ్వబోతుందా..?

Chiranjeevi Koratala Siva controversy
Chiranjeevi Koratala Siva controversy

Chiranjeevi Koratala Siva controversy: తెలుగు సినిమా ఇండస్ట్రీకి గత 50 సంవత్సరాల నుంచి ఎనలేని సేవలను అందిస్తున్న వారిలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. వైవిద్య భరితమైన సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను రాబట్టిన నటుడు కూడా తనే కావడం విశేషం…ఇతర ఇండస్ట్రీల నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని తెలుగు ఇండస్ట్రీ ని టాప్ పొజిషన్ లోకి తీసుకెళ్లిన నటుడు కూడా చిరంజీవి కావడం విశేషం…మాస్ కమర్షియల్ సినిమాలను చేయడంలో ఆయన్ని మించిన వారు మరెవరు లేరనెంతల గుర్తింపుని తెచ్చుకున్నాడు. అయితే చిరంజీవి తను చేసే సినిమాల్లో తన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగానే ఉంటుందని చాలా మంది చెబుతుంటారు. దానివల్ల సినిమాకు హెల్ప్ అయితే పర్లేదు. కానీ ఒకవేళ చెడు జరిగితే మాత్రం చిరంజీవి చేయడం వల్లే సినిమాలు ప్లాప్ అయ్యాయని కొంతమంది చెప్తుంటే చిరంజీవి చెప్పిన మాటలు దర్శకులు వినకపోవడం వల్లే ఇలా జరుగుతున్నాయని మరికొంతమంది చెబుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా మెగాస్టార్ చిరంజీవి లాంటి నటుడు ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో ఆచితూచి మరి ముందుకు అడుగులు వేస్తున్నాడు. ఇప్పటివరకు చిరంజీవి చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాలు మరొకెత్తుగా మారబోతున్నాయి.

70 సంవత్సరాలు పైబడిన వయసులో కూడా ఆయన సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను రాబట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పటికి ఆయన కమర్షియల్ సినిమాలను చేస్తున్నాడని కొంతమంది అంటుంటే మరి కొంతమంది మాత్రం ఆయన చేసే సినిమాల్ని తనని చేయనివ్వండి. డిఫరెంట్ సినిమాలను ఆయన ఎప్పుడైతే చేయాలనుకుంటాడో అప్పుడు మాత్రమే చేస్తాడు.

ఒకవేళ అతడి నుంచి అలాంటి సినిమాలు వచ్చినప్పుడు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించడం లేదు కాబట్టి చిరంజీవి అలాంటి సినిమా చేయడం లేదని చెప్పేవారు కూడా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి చేసిన ఆచార్య సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో కొరటాల శివ చిరంజీవి ఇచ్చిన ఇన్పుట్స్ తీసుకోలేదని అందువల్లే సినిమా ప్లాప్ అయిందని చాలా మంది చెబుతున్నారు.

ఒకరకంగా కొరటాల శివ మాత్రం చిరంజీవి చెప్పిన చేంజెస్ వల్లే సినిమా ప్లాప్ అయిందని తన సన్నిహిత వర్గాల దగ్గర చెబుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక చిరంజీవి మీద కోపం తో ఆయనకి ఆల్టర్నేట్ అయిన బాలయ్య ను టాప్ లోకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతోనే కొరటాల శివ భారీ బడ్జెట్ తో పవర్ ఫుల్ సబ్జెక్టుని రెడీ చేసి మరి సినిమాని చేస్తున్నట్టుగా తెలుస్తుంది…

మహేష్ బాబుకి ఆ స్టార్ హీరో క్లోజ్ ఫ్రెండ్.. ఆయన్ని సంవత్సరానికి రెండు సార్లే కలుస్తాడు..

Mahesh Babu NTR friendship
Mahesh Babu NTR friendship

Mahesh Babu NTR friendship: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వైవిధయల్భరితమైన సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ఇప్పటివరకు తెలుగులో వరుస సినిమాలను చేస్తూ ప్రేక్షకులందరిని మెప్పించాడు. కానీ ఇప్పుడు మొదటిసారి రాజమౌళి డైరెక్షన్లో చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. వారణాసి సినిమాతో ప్రపంచ స్థాయి ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే మహేష్ బాబుకు సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు…

తనకి ఉన్న ఫ్రెండ్స్ అందరిలో ఒక హీరోని మాత్రం మహేష్ బాబు ఎప్పుడు తన క్లోజ్ ఫ్రెండ్ గా భావిస్తుంటాడట. నిజానికి ఫ్రెండ్ గా కంటే కూడా సొంత తమ్ముడిలా ట్రీట్ చేస్తూ ఉంటాడని గతంలో పలు సందర్భాల్లో ఆయన చెప్పాడు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు అంటే ఎన్టీఆర్ కావడం విశేషం… ఎన్టీఆర్ సైతం మహేష్ బాబుని అన్నా అని పిలుస్తూ ఉంటాడు…

వాళ్ళిద్దరూ సొంత అన్నదమ్ముల కలిసిమెలిసి ఉంటారని వీళ్ళ సన్నిహితులు సైతం చెబుతుంటారు. అయితే మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ ని సంవత్సరంలో రెండుసార్లు మాత్రమే కలుస్తారట. ఒకటి ఎన్టీఆర్ బర్త్ డే రోజు, రెండు మహేష్ బాబు పుట్టినరోజు నాడు ఈ రెండు రోజులు మాత్రమే ఎన్టీఆర్ ని తప్పకుండా కలుస్తారట. ఇక మిగతా సందర్భాల్లో ఏదైనా ఈవెంట్స్ లో గాని పక్కపక్కన షూటింగ్స్ జరుగుతుంటే సెట్స్ లో కలుస్తుంటారట.

కాకపోతే అఫీషియల్ గా మాత్రం రెండు రోజుల్లో పక్కగా కలుస్తూ ఉంటారని అయినప్పటికి జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో తనకు ఉన్న స్నేహితుల్లో క్లోజ్ ఫ్రెండ్ అని మహేష్ బాబు చెబుతూ ఉంటాడు. ఎన్నిసార్లు కలిసాము అనేదానికంటే కూడా వాళ్ళతో మనకు ఎంత మంచి బాండింగ్ ఉందనే దానికి మహేష్ బాబు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాడు… ఇక ప్రస్తుతం మహేష్ బాబు వారణాసి సినిమా చేస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం డ్రాగన్ సినిమాలో బిజీగా ఉన్నాడు…

దేశంలో 500 కంపెనీలు.. 89 లక్షల మందికి ఉపాధి.. తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఇదే!

India top 500 companies
India top 500 companies

India top 500 companies: దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థల్లో లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ఉద్యోగ ఉపాధి సేవా రంగాల్లో వివిధ స్థాయిల్లో ఉపాధి అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రైవేటు రంగ సంస్థలు కూడా లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఇందులో ఫార్మా, గ్రీన్ ఎనర్జీ రంగాలు ముందంజలో ఉన్నాయి. బర్గుండీ ప్రైవేట్ హురున్ ఇండియా సంస్థ దేశంలోని ప్రముఖ ప్రైవేటు సంస్థలు వాటిలో ఉపాధి పొందుతున్న ఉద్యోగుల వివరాలతో నివేదిక రూపొందించింది. దేశంలో కనీసం రూ.10,000 కోట్ల విలువ ఉన్న 500 కంపెనీల మొత్తం విలువ రూ.323 లక్షల కోట్లు. ఈ కంపెనీలు సుమారు 89 లక్షల మందికి నేరుగా ఉపాధి కల్పిస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో ఉండగా, హెచ్‌డీఎఫ్‌సీ, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ, టీసీఎస్ వంటి సంస్థలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ లెక్కలు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా ఉందో చూపిస్తున్నాయి.

ఏపీ-టీజీలో 39 కంపెనీలు..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి 39 కంపెనీలు మాత్రమే ఈ జాబితాలో చోటు సంపాదించాయి. వీటి మొత్తం విలువ రూ.12 లక్షల కోట్లు. ఇవి రెండు రాష్ట్రాలకు సుమారు 3.40 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 500 కంపెనీల్లో ఈ 39 సంస్థల విలువ కేవలం 3.7 శాతం.

టాప్ 5 కంపెనీలు ఇవీ..
బర్గుండీ ప్రైవేట్ హురున్ ఇండియా ప్రకారం..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి 39 కంపెనీలలో దివీస్ లాబొరేటరీస్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, మేఘా ఇంజనీరింగ్, అరబిందో ఫార్మా, గ్రీన్కో వరుసగా టాప్ 5 స్థానాల్లో ఉన్నాయి. ఇందులో మొదటి నాలుగు ఫార్మాస్యూటికల్ రంగానికి చెందినవి. గ్రీన్కో మాత్రం పునరుత్పాదక ఇంధన (రెన్యూవబుల్ ఎనర్జీ) రంగంలో ముందుంది. ఇది రెండు రాష్ట్రాల్లో ఫార్మా రంగం ఎంత బలంగా ఉందో తెలియజేస్తోంది.

ఉపాధి, ఆర్థిక వృద్ధికి సహకారం..
ఈ కంపెనీలు కేవలం విలువలోనే కాదు, నాణ్యమైన ఉద్యోగాల్లోనూ ముందుంటున్నాయి. ఫార్మా కంపెనీలు అధిక విలువ గల ఉత్పత్తులు ఎగుమతి చేస్తాయి. ఇది రాష్ట్రాల విదేశీ మారక ద్రవ్యాన్ని పెంచుతుంది. గ్రీన్కో వంటి సంస్థలు సౌర, గాలి శక్తి ప్రాజెక్టుల ద్వారా సుస్థిర అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. మేఘా ఇంజనీరింగ్ వంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు రోడ్లు, నీటిపారుదల, పారిశ్రామిక ప్రాజెక్టుల్లో పెద్ద పాత్ర పోషిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాలకు ఆర్థిక శక్తి ల..
ఆంధ్రప్రదేశ్తె, లంగాణలోని ఈ 39 కంపెనీలు దేశంలోని మొత్తం 500 కంపెనీల్లో చిన్న శాతం మాత్రమే అయినా, వాటి విలువ, ఉపాధి సంఖ్య గణనీయంగా ఉంది. ఇది రెండు రాష్ట్రాల్లో ఫార్మా, గ్రీన్ ఎనర్జీ రంగాలు ఎంతగా అభివృద్ధి చెందాయో చెబుతోంది. ఈ కంపెనీలు యువతకు నైపుణ్యం కలిగిన ఉద్యోగాలు ఇస్తున్నాయి. ఇవి రాష్ట్రాల జీడీపీకి నేరుగా సహకరిస్తాయి. అలాగే, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణ భారతదేశం, ముఖ్యంగా ఏపీ-టీజీలో పారిశ్రామిక వృద్ధి వేగంగా జరుగుతోందని ఈ నివేదిక సూచిస్తోంది.

బర్గుండీ ప్రైవేట్ హురున్ ఇండియా నివేదిక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ను భారతదేశ ఆర్థిక వృద్ధిలో ముఖ్యమైన భాగంగా నిలబెడుతోంది. ఫార్మా ఎగుమతులు, పునరుత్పాదక ఇంధనం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి వంటి రంగాల్లో రెండు రాష్ట్రాలు ఇంకా ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి.

తెలంగాణ వర్సెస్‌ ఆంధ్రప్రదేశ్‌.. విభజన తర్వాత అభివృద్ధిలో వ్యత్యాసం!

Telangana vs Andhra Pradesh
Telangana vs Andhra Pradesh

Telangana vs Andhra Pradesh: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగి 12 ఏళ్లు గడిచింది. ఒకే రాష్ట్ర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా విడిపోయాయి. విభజన తర్వాత తెలంగాణలో కరెంటు ఉండదని, నక్సలిజం పెరుగుతుందని అప్పట్లో కొందరు నేతలు వ్యాఖ్యానించారు. మరో బిహార్‌ అవుతుందని హెచ్చరించారు. అయితే ఇందుకు విరుద్ధంగా రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి వేగం పుంజుకుంది. వేర్వేరు ప్రాధాన్యతలతో అభివృద్ధి పనులు చేపట్టాయి. ఒక్కొక్క రాష్ట్రం తన ప్రధాన సమస్యలను దృష్టిలో పెట్టుకుని మౌలిక సదుపాయాలను నిర్మించుకుంది. ఇది రెండు రాష్ట్రాల మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని సృష్టించింది.

హైదరాబాద్‌లో ఫ్లై ఓవర్లు…
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినత ర్వాత అధికారం చేపట్టిన కేసీఆర్‌ హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించడంపై ఎక్కువ దృష్టి పెట్టారు. రాష్ట్ర విభజన తర్వాత దాదాపు ఒక దశాబ్దంలో హైదరాబాద్‌లోనే 35కిపైగా ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, సబ్‌వేలు నిర్మించడం ద్వారా ట్రాఫిక్‌ ప్రవాహాన్ని మెరుగుపరచింది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణం, రోడ్ల విస్తరణ, చెరువుల సుందరీకరణ వంటి పనులు కూడా చేపట్టింది. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కూడా ఈ క్రమాన్ని కొనసాగిస్తూ మరిన్ని ఫ్లై ఓవర్లను ప్రారంభించింది.

ఆంధ్రప్రదేశ్‌లో విమానాశ్రయాలు..
ఇక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్ర విభజన తర్వాత విమానాశ్రయాల అభివృద్ధిపై ఎక్కువ దృష్టి సారించింది. కర్నూల్, కడప, భోగాపురం వద్ద కొత్త అంతర్జాతీయ విమానాశ్రయాలు ఏర్పాటు చేయడం, అమరావతిలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం, గ్రీన్‌ ఫీల్డ్‌ విమానాశ్రయాలకు సన్నాహాలు చేయడం ద్వారా రాష్ట్రంలో ఎయిర్‌ కనెక్టివిటీని మెరుగుపరచాలని ప్రయత్నిస్తోంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులకు త్వరలో అందుబాటులోకి రానుంది.

ఏపీలో నగరాభివృద్ధి లోపం..
ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో ఫ్లై ఓవర్ల నిర్మాణం చాలా తక్కువగా ఉంది. మెట్రో ప్రాజెక్టులతో ఫ్లై ఓవర్లను ముడిపెట్టే ప్రతిపాదనలు కేంద్రం నుంచి ఆమోదం పొందలేకపోవడం ఒక కారణం. రాజధాని అమరావతి నిర్మాణంపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల మిగిలిన జిల్లాలు, నగరాల్లో ఫ్లై ఓవర్లు, రోడ్ల విస్తరణ పనులు వెనకబడ్డాయి. అలాగే నగరాల్లో పచ్చదనం పెంచడంలో కూడా తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌ వెనుకబడి ఉంది.

రెండు రాష్ట్రాల ప్రాధాన్యతలు…
తెలంగాణ ప్రభుత్వం పట్టణీకరణ వల్ల ఏర్పడిన ట్రాఫిక్‌ సమస్యలను పరిష్కరించడానికి ఫ్లై ఓవర్లు, రోడ్ల అభివృద్ధిని ప్రాధాన్యతగా తీసుకుంది. అయితే కొత్త విమానాశ్రయాల ఏర్పాటులో వెనుకబడింది. వరంగల్, ఆదిలాబాద్‌ విమానాశ్రయాలకు ఆమోదం వచ్చినా నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదు. ఆంధ్రప్రదేశ్‌ మాత్రం రాష్ట్ర విభజన తర్వాత కనెక్టివిటీ, ఆర్థిక వృద్ధిని దృష్టిలో పెట్టుకుని విమానాశ్రయాలు, హైవేల నిర్మాణంపై ఎక్కువ దృష్టి పెట్టింది. కానీ నగరాల్లో ట్రాఫిక్‌ సౌకర్యాలు, ఫ్లై ఓవర్ల నిర్మాణంలో ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది.

ప్రస్తుతం తెలంగాణకు కొత్త విమానాశ్రయాలు అవసరం ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు నగరాల్లో ఫ్లై ఓవర్లు, రోడ్ల విస్తరణ, పచ్చదనం పెంచడం అత్యవసరం. రెండు రాష్ట్రాలు తమ బలహీనతలను గుర్తించి, ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటూ సమతుల్య అభివృద్ధిని సాధించాల్సిన అవసరం ఉంది.