Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu Varanasi Shooting: ఒక్క షాట్ కోసం 90 టేకులు.. 'వారణాసి' షూటింగ్ లో...

Mahesh Babu Varanasi Shooting: ఒక్క షాట్ కోసం 90 టేకులు.. ‘వారణాసి’ షూటింగ్ లో మహేష్ కి చుక్కలు చూపిన రాజమౌళి..

Mahesh Babu Varanasi Shooting: దర్శకుడు రాజమౌళి కి ఇంటర్నేషనల్ లెవెల్ లో ఫేమ్, క్రేజ్ ఊరికే రాలేదు. తన విజన్ కి తగ్గట్టు పని చేస్తూ , నూటికి నూరు శాతం పర్ఫెక్షన్ వస్తే తప్ప, ఒక షాట్ ని ఆయన ఓకే చేయడు. #RRR మూవీ ఎన్టీఆర్ రాజమౌళి ఎంత పర్ఫెక్షన్ కోరుకునే వ్యక్తో చెప్తాడు గుర్తుందా?, ముంబై ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోల ఎంట్రీ సరిగా రాలేదని , దానిని హైదరాబాద్ […]

Mahesh Babu Varanasi Shooting: దర్శకుడు రాజమౌళి కి ఇంటర్నేషనల్ లెవెల్ లో ఫేమ్, క్రేజ్ ఊరికే రాలేదు. తన విజన్ కి తగ్గట్టు పని చేస్తూ , నూటికి నూరు శాతం పర్ఫెక్షన్ వస్తే తప్ప, ఒక షాట్ ని ఆయన ఓకే చేయడు. #RRR మూవీ ఎన్టీఆర్ రాజమౌళి ఎంత పర్ఫెక్షన్ కోరుకునే వ్యక్తో చెప్తాడు గుర్తుందా?, ముంబై ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోల ఎంట్రీ సరిగా రాలేదని , దానిని హైదరాబాద్ లో సెట్స్ వేసి రీ షూట్ చేసిన మనిషి ఆయన. ఈ రేంజ్ పర్ఫెక్షన్ ఉన్న డైరెక్టర్ ఇండియా లోనే కాదు, ప్రపంచం లోనే ఎక్కడా ఉండరేమో. ఇకపోతే ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న విజువల్ వండర్ ‘వారణాసి’ మూవీ షూటింగ్ విశేషాలను ఆ చిత్రం లో విలన్ క్యారెక్టర్ చేస్తున్న పృథ్వీ రాజ్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు.

ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. పృథ్వి రాజ్ మాట్లాడుతూ ‘నేను మోహన్ లాల్ బారోజ్ మూవీ లో ఒక చిన్న పాత్ర చేశాను . కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ షూటింగ్ నుండి మధ్యలోనే తప్పుకోవాల్సి వచ్చింది, మోహన్ లాల్ నటన చాలా దగ్గర నుండి చూసాను కాబట్టి ఆయన ఎంత గొప్ప నటుడో నాకు తెలుసు. ఆయన తర్వాత నా దృష్టిలో అంతటి గొప్ప నటుడు రాజమౌళి గారే. ప్రతీ సన్నివేశాన్ని ఆయన నటించి , జీవించి మాకు చూపిస్తాడు. మా పని చాలా సులువు అయ్యేలా చేస్తాడు. ఒక్కోసారి రాజమౌళి వివరించే సన్నివేశాలు నాకు అర్థం అయ్యేవి కాదు. దాన్ని అర్థం చేసుకోవడానికి నాకు తల ప్రాణం తోకకు వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆయన గొప్ప విజన్ కు , నా నటనకు మధ్య సెట్స్ లో చిన్నపాటి యుద్ధం అనేక సార్లు జరిగింది’.

‘కానీ ఆయనపై బలమైన నమ్మకం తో , ఆయన ఏది చెప్తే అదే చేస్తూ వచ్చాను. ఆ తర్వాత ఎడిటింగ్ టేబుల్ మీద ఫైనల్ ఔట్పుట్ ని చూసినప్పుడు చాలా గొప్పగా అలోచించి ఈ సన్నివేశాన్ని తీసాడని అనిపించేది. ఆయనతో పని చేయడం వల్ల ఒక నటుడిగా , దర్శకుడిగా ఎంతో పరిణీతి చెందాను. ఇప్పటి వరకు నేను రాజమౌళి రేంజ్ లో కష్టపడి పని చేసే డైరెక్టర్ ని చూడలేదు. ఉదయం 7 గంటలకు మొదటి షాట్ ని ప్లాన్ చేస్తే , ఆయన 5 గంటల 15 నిమిషాలకే సెట్స్ వద్దకు చేరుకొని , తన అస్సితన్స్ తో కలిసి 12 సార్లు రిహార్సల్స్ చేయిస్తారు. మేము ముందే సెట్స్ కి రావొచ్చా అని అడిగితే వద్దు అంటాడు. మాకు లంచ్ బ్రేక్ కూడా కేవలం 20 నిమిషాలు మాత్రమే ఇచ్చేవాడు. సెట్స్ లో ఒక్కో సన్నివేశాన్ని 90 టేకులకు పైగా తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉదయం 5 గంటలకు మొదలు పెడితే , రాత్రి వరకు కొనసాగిస్తారు, ఒకవేళ ఆయన విజన్ కి తగ్గట్టు షాట్ రాకపోతే మరుసటి రోజు కూడా అదే షాట్ ని తెరకెక్కిస్తారు ‘ అంటూ చెప్పుకొచ్చాడు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper