Homeఅంతర్జాతీయంUsha Vance statement on religion: మతం మారలేదు.. మారాలన్న ఒత్తిడి లేదు.. ఉష వాన్స్...

Usha Vance statement on religion: మతం మారలేదు.. మారాలన్న ఒత్తిడి లేదు.. ఉష వాన్స్ కీలక వ్యాఖ్యలు!

Usha Vance statement on religion: అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షుడు జీడివన్స్. ఈయన భారతదశ అల్లుడు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఉష – వాన్స్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2024 నవంబర్లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జేడీ వాన్స్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీంతో ఆంధ్ర ప్రదేశ్ లోనూ సంబరాలు చేసుకున్నారు. తాజాగా జేడీ వాన్స్ ఉష దాంపత్య జీవితంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుంది. వివాదం ఎలా మొదలైంది? అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ […]

Usha Vance statement on religion: అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షుడు జీడివన్స్. ఈయన భారతదశ అల్లుడు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఉష – వాన్స్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2024 నవంబర్లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జేడీ వాన్స్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీంతో ఆంధ్ర ప్రదేశ్ లోనూ సంబరాలు చేసుకున్నారు. తాజాగా జేడీ వాన్స్ ఉష దాంపత్య జీవితంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుంది.

వివాదం ఎలా మొదలైంది?
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన భార్య ఉషా (హిందూ నేపథ్యం ఉన్న భారతీయ-అమెరికన్) ఒకరోజు క్రిస్టియన్ మతంలోకి మారాలని ఆశిస్తున్నట్లు గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. మిసిసిపీలోని యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఇలా అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా, మీడియాలో విస్తృతంగా చర్చకు గురయ్యాయి. కొందరు దీన్ని ఉష విశ్వాసాన్ని తక్కువ చేసినట్లు, బలవంతపు మత మార్పిడిగా వ్యాఖ్యానించగా, మరికొందరు ఇది వ్యక్తిగత విశ్వాసం వల్ల వచ్చిన సహజమైన కోరిక అని అభిప్రాయపడ్డారు.

స్పష్టత ఇచ్చిన వాన్స్..
అయితే వాన్స్ తర్వాత తన వ్యాఖ్యలను స్పష్టం చేస్తూ, ఉష క్రిస్టియన్ కాదని, మారాలనే ప్రణాళిక లేదని, కానీ తాను ఆమెను గౌరవిస్తానని చెప్పారు. వాన్స్ 2019లో కాథలిక్ మతంలోకి మారిన నేపథ్యం, పిల్లల పెంపకం విధానంపై సోషల్ మీడియాలో వాన్స్ తీరుపై ప్రచారం మొదలైంది.

ఉషా ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు…
తాజాగా సీబీఎస్ న్యూస్ సండే మార్నింగ్ ఇంటర్వ్యూలో ఉష వాన్స్ ఈ వివాదంపై స్పందించారు. “నేను స్థిరమైన హిందూ కుటుంబంలో పెరిగాను. వాన్స్ లాగా మరొక విశ్వాసాన్ని అనుసరించాలని నాకు ఎప్పుడూ అనిపించలేదు” అని తెలిపారు. “నన్ను రోజూ కన్వర్ట్ చేయడానికి వాన్స్ ప్రయత్నిస్తారని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అలాంటిది ఏమీ లేదు. ఆయన కాథలిక్ మతస్థుడు కాబట్టి, తన విశ్వాసాన్ని వ్యాప్తి చేయాలని ఆశించడం ఆయన విశ్వాసంలో భాగం. కానీ ఆయన నన్ను ఎలాంటి ఒత్తిడి చేయడం లేదు” అని స్పష్టం చేశారు. ఈ సమాధానం ద్వారా ఉష తన వ్యక్తిగత విశ్వాసం, కుటుంబ సంప్రదాయాలను గౌరవిస్తూ ఉన్నట్లు, అలాగే దంపతుల మధ్య బలవంతం లేదని చెప్పారు.

దంపతుల పరస్పర మద్దతు..
ఉషా వాన్స్ (పుట్టుకతో ఉష చిలుకూరి) దక్షిణ కాలిఫోర్నియాలో భారతీయ వలసదారుల కుటుంబంలో పెరిగారు. ఆమె కుటుంబం హిందూ మత సంప్రదాయాలను అనుసరిస్తుంది, అయినప్పటికీ అంత బలంగా మతపరమైనది కాదు. వాన్స్ 2019లో కాథలిక్ మతంలోకి మారారు. ఆ సమయంలో ఉషా ఆయన విశ్వాస ప్రయాణానికి పూర్తి మద్దతు ఇచ్చారు. వాన్స్ తన ఫెయిత్ జర్నీ గురించి మాట్లాడుతూ, “ఉష నా విశ్వాసం వైపు తిరిగేందుకు ఎంతో ప్రోత్సహించింది. ఆమె క్రిస్టియన్ కాకపోయినా, నేను ఈరోజు క్రిస్టియన్‌గా ఉండటానికి ఆమె సహకారం చాలా ముఖ్యం” అని చెప్పారు. వారిద్దరూ మతం, విశ్వాసం గురించి లోతైన చర్చలు చేస్తారని, ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటారని రెండు వైపులా తెలిపారు.

పిల్లల పెంపకం, కుటుంబ సంప్రదాయాలు..
జేడీ వాన్స్-ఉషా దంపతులకు ప్రస్తుతం ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారు నాలుగో బిడ్డను ఆశిస్తున్నారు. పిల్లలను కాథలిక్/క్రిస్టియన్ పాఠశాలలో చదివిస్తున్నారు. అయితే, ఉష నానమ్మ (హిందూ మతం బాగా అనుసరించేవారు) ద్వారా హిందూ సంప్రదాయాలు (పూజలు, ఆలయాలు) పిల్లలకు పరిచయం చేస్తున్నారు. పిల్లలు కాథలిక్‌గా బాప్టిజం తీసుకోవాలని బలవంతం చేయకుండా, వారు పెద్దయ్యాక ఎంచుకోవాలని నిర్ణయించారు.

మొత్తం మీద ఉష ఇచ్చిన స్పష్టీకరణ ఆ అపోహలను తొలగించి, వారి కుటుంబంలో నిజమైన సమన్వయం ఎలా ఉందో చూపించింది. అమెరికా వంటి వైవిధ్యభరిత దేశంలో రాజకీయ నాయకుల కుటుంబాల్లో కూడా మత స్వేచ్ఛ, వ్యక్తిగత ఎంపికలు గౌరవించబడాలనే సందేశం ఇది ఇస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper