Homeఎంటర్టైన్మెంట్Balakrishna Success Secret: బాలయ్య సక్సెస్ సీక్రెట్ ఏంటంటే..?

Balakrishna Success Secret: బాలయ్య సక్సెస్ సీక్రెట్ ఏంటంటే..?

Balakrishna Success Secret: నందమూరి నటసింహం బాలయ్య బాబు ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో ఆచితూచి మరి అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే వరుసగా నాలుగు విజయాలను సాధించిన బాలయ్య బోయపాటి డైరెక్షన్ లో చేసిన ‘అఖండ 2’ సినిమాతో కొంతవరకు తడబడ్డప్పటికి ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాతో పాటుగా కొరటాల శివ దర్శకత్వంలో కూడా ఒక సినిమాని స్టార్ట్ చేశాడు. ఈ […]

Balakrishna Success Secret: నందమూరి నటసింహం బాలయ్య బాబు ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో ఆచితూచి మరి అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే వరుసగా నాలుగు విజయాలను సాధించిన బాలయ్య బోయపాటి డైరెక్షన్ లో చేసిన ‘అఖండ 2’ సినిమాతో కొంతవరకు తడబడ్డప్పటికి ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాతో పాటుగా కొరటాల శివ దర్శకత్వంలో కూడా ఒక సినిమాని స్టార్ట్ చేశాడు. ఈ సినిమా భారీ కమర్షియల్ హంగులతో ఉండడమే కాకుండా బాలయ్య బాబు ఇంతకుముందు చేసిన సినిమాలన్నింటి కంటే భిన్నంగా ఉండబోతుందట… బాలయ్య వరుస సక్సెస్ లు సాధించడం వెనుక సీక్రెట్ ఏంటి అంటూ చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. నిజానికి బాలయ్య చిన్న కూతురు అయిన తేజస్విని బాలయ్య బాబు స్టోరీ సెలక్షన్స్ లో భాగమైంది.

కాబట్టే అతనికి భారీ సక్సెస్ లు రావడానికి అవకాశం దొరికిందని ఆమె ప్రతి విషయాన్ని కూడా దర్శకుడితో చర్చించిన తర్వాతే బాలయ్య బాబు దగ్గరికి ఆ కథలనైతే తీసుకెళ్తుందట. స్క్రిప్ట్ ఫైనల్ చేస్తే బాధ్యతను కూడా తనే తీసుకుంటుందని చెబుతున్నారు. దానివల్లే బాలయ్య బాబు వరుసగా సక్సెస్ లను సాధిస్తున్నాడని అలాగే మంచి కాంబినేషన్స్ కూడా సెట్ చేసుకోగలుగుతున్నాడు అంటు మరి కొంతమంది కామెంట్స్ చేస్తుండటం విశేషం…

ముఖ్యంగా తేజస్విని బాలయ్య అభిమానులతో అప్రోచ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళు బాలయ్య నుంచి ఏం కోరుకుంటున్నారు ఈ ఏజ్ లో బాలయ్య బాబు ని ఎలా చూడాలనుకుంటున్నారు అనే విషయాలను సేకరించి దానికి తగ్గట్టుగానే దర్శకులకు చెప్పి అలాంటి కథలను రెడీ చేయిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.

ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు ఈ ఏజ్ లో పెను సంచలనాలను సృష్టించే సినిమాలను చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి… ఇప్పటివరకు బాలయ్య చేసిన సినిమాలు ఒక రేంజ్ లో ఉంటే ఇప్పుడు చేయబోతున్న సినిమాలు మరో రేంజ్ లో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper