Home ఎంటర్టైన్మెంట్ Anil Ravipudi Movies Analysis: అనిల్ రావిపూడి మూవీస్ లో హీరోలకి ఆ ఒక్కటి కొంచెం...

Anil Ravipudi Movies Analysis: అనిల్ రావిపూడి మూవీస్ లో హీరోలకి ఆ ఒక్కటి కొంచెం ఎక్కువగా ఉంటుందా..?

11
Anil Ravipudi Movies Analysis
Anil Ravipudi Movies Analysis

Anil Ravipudi Movies Analysis: కమర్షియల్ సినిమాలకు పెట్టింది పేరుగా మారిన దర్శకుడు అనిల్ రావిపూడి… వరుసగా ఆయన చేసిన సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నాడు. ఇప్పటివరకు 9 సినిమాలు చేస్తే 9 సినిమాలు కూడా సూపర్ సక్సెస్ అవ్వడంతో ఆయన టాప్ డైరెక్టర్ గా మారిపోయాడు. అతని సినిమాలను చూడడానికి చాలా మంది ప్రేక్షకులు సైతం ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా పండుగ సీజన్ లో వచ్చి సూపర్ సక్సెస్ ని సాధించడం అనిల్ రావిపూడి నైజాం… ఇక అతను ప్రతి సంక్రాంతికి వచ్చి భారీ సక్సెస్ ని సాధిస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే అతని సినిమాలను చూడడానికి ఫ్యామిలీ ఆడియన్స్ ఎందుకని ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు అంటే అతని సినిమాల్లో పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే ను ఫాలో అవుతూ ఏ టైంలో ఏం రావాలో ప్రతిదీ ఒక మీటర్ మీద వచ్చేటట్టుగా సెట్ చేస్తూ ఉంటాడు.

అందువల్ల అతని సినిమాలకు ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తుందని చాలామంది చాలా రకాలుగా వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా అనిల్ రావిపూడి చేసే సినిమాల విషయంలో చాలా క్లారిటీ మెయింటైన్ చేస్తూ ఉంటాడు.

అయితే ఇప్పుడు ఆయన సినిమాల్లో చేసిన హీరోలందరిలో ఒక కామన్ ఎలిమెంట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆయన చేసిన ప్రతి సినిమాలోని హీరోకి కొంచెం హ్యూమర్ ఎక్కువగా ఉంటుంది. వాళ్లే కామెడిని చేస్తుంటారు. వీలైతే వాళ్లే విలన్స్ ని ఇరగదీస్తూ ఉంటారు. ఈ కామన్ పాయింట్స్ అయితే అతని సినిమాల్లో కనిపిస్తూ ఉంటాయి.

ఇక ఎప్పుడు కూడా హీరోని ఒక అగ్రెసివ్ షెడ్ లో అయితే ఆయన చూపించలేదు. ఇటు కామెడీ యాంగిల్ ను అటు కోపాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ చూపిస్తారు కాబట్టే ఆయన సినిమాలో హీరో చాలా వైల్డ్ గా కనిపిస్తూ ఉంటాడు. దీనివల్ల ప్రేక్షకులు సైతం ఆ క్యారెక్టర్ కి కనెక్ట్ అయ్యే అవకాశాలైతే పుష్కలంగా ఉంటాయి…