Home Blog Page 69

పవన్ కళ్యాణ్ 'జానీ' పాటకు చిందులేసిన మంత్రి.. సంచలనం రేపుతున్న వీడియో..

Pawan Kalyan
Pawan Kalyan

Pawan Kalyan: రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అభిమానులు పార్టీలుగా డివైడ్ అయిపోయి ఉండొచ్చు కానీ, మన చిన్నతనం లో చిరంజీవి కి , యవ్వనం లో పవన్ కళ్యాణ్ కి ఫ్యానిజం చేయకుండా ఉండలేము. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే , ఒకానొక దశలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని యూత్ కి ఏకైక రోల్ మోడల్ ఆయనే. తొలిప్రేమ , సుస్వాగతం , తమ్ముడు , బద్రి , ఖుషి అంటూ ఆయన ఒక జనరేషన్ యూత్ మొత్తాన్ని తన ఫ్యాన్ బేస్ గా మార్చేసుకున్నారు. యూత్ లో ఆ రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి కి కూడా పవన్ కళ్యాణ్ ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది కాదు అనేవారు విశ్లేషకులు. ముఖ్యంగా 90’s యువత అయితే ఇప్పటికీ ఆయన్ని అదే రేంజ్ లో ఆరాధిస్తుంటారు. అందులో మన ఆంధ్ర ప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి , బీజేపీ నాయకుడు సత్య కుమార్ యాదవ్ కూడా ఉన్నారు.

నేడు ఆయన ఒక ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ‘జానీ’ చిత్రం లోని పాపులర్ సాంగ్ ‘నారాజు గారకురా మా అన్నయ్య’ అనే పాటకు తోటి అభిమానులతో కలిసి చిందులేశారు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనంగా మారింది. సత్యకుమార్ యాదవ్ ఎన్నికల ప్రచారం సమయం లో కూడా తాను పవన్ కళ్యాణ్ అభిమాని అనే చెప్పుకుంటూ వచ్చారు. తన నియోజకవర్గం లో కూడా ఎమ్మెల్యే గా గెలిచేందుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో సహాయపడ్డారు. ఇప్పుడు మరోసారి ఆయనలోని వింటేజ్ పవన్ కళ్యాణ్ అభిమాని బయటకు వచ్చి , తన స్థాయి ని కూడా మర్చిపోయి చిందులు వేయడాన్ని చూసి , పవన్ అభిమానులు ‘పవనిజం’ లో మ్యాజిక్ అదే సార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇకపోతే పవన్ కళ్యాణ్ ఒక పక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపడుతూ ఫుల్ బిజీ గా ఉంటూనే, మరోపక్క సినిమాలు కూడా చేసేందుకు రెడీ అవుతున్నారు. రీసెంట్ గానే ఆయన ‘ఓజీ 2’ చిత్రాన్ని త్వరలోనే ప్రారంభించబోతున్నట్టు అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. నేడు ఈ చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్ వీడియో ని విడుదల చేయగా, దానికి ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఫ్యాన్స్ అయితే చెప్పక్కర్లేదు , మెంటలెక్కిపోతున్నారు. ఇప్పటి వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కలేదని , పవన్ కళ్యాణ్ సుజిత్ కి క్రియేటివ్ ఫ్రీడమ్ ఇస్తే వండర్స్ ని క్రియేట్ చేస్తాడని అంటున్నారు ఫ్యాన్స్ , నెటిజెన్స్.

సొంత ఊర్లో నితీష్ కుమార్ రెడ్డి.. నానమ్మకు ఊహించని గిఫ్ట్.. ఫిదా చేశాడు పో..

Nitish Kumar Reddy
Nitish Kumar Reddy

Nitish Kumar Reddy: ఎంత ఎత్తుకు ఎదిగినా సరే మూలాలు మర్చిపోకూడదు అని మన పెద్దలు అంటారు. దానిని నిజం చేసి చూపించాడు టీమిండియా యంగ్ ప్లేయర్.. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి. ఇప్పటికే అతడు ఐపిఎల్ లో.. టెస్ట్ క్రికెట్లో.. టి20 ఫార్మాట్లో అదరగొడుతున్నాడు. అనేక రికార్డులను సృష్టించాడు. మిడిల్ ఆర్డర్లో స్థిరమైన ఆటగాడిగా పేరుపొందాడు.

ఐర్లాండ్.. ఇంగ్లాండ్ సిరీస్ లకు ఎంపికైనప్పటికీ గాయం వల్ల అతడు జట్టుకు దూరమయ్యాడు. అతడు కోలుకోవడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.. ఇతడు స్థానంలో సూర్యాంష్ ను మేనేజ్మెంట్ ఎంపిక చేసింది. ఇప్పటికే టీం ఇండియా ఐర్లాండ్, ఇంగ్లాండ్ దేశాలతో ఆడే టి20 సిరీస్ ల కోసం బయలుదేరి వెళ్లిపోయింది. నితీష్ కుమార్ రెడ్డి మాత్రం గాయానికి చికిత్స పొందుతున్నాడు. త్వరలోనే పూర్వపు ఫామ్ అనుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.

గాయం వల్ల చికిత్స తీసుకుంటున్న నితీష్ కుమార్ రెడ్డికి కాస్త సమయం దొరికింది. కొంతకాలంగా అతడు నిర్విరామమైన క్రికెట్ ఆడుతున్నాడు. అందువల్లే మైదానం లేదా ఇల్లుకు మాత్రమే పరిమితమవుతున్నాడు. అయితే నితీష్ కుమార్ రెడ్డి kib కాస్త సమయం దొరకడంతో ఈరోజు తన సొంత ఊరు గాజువాక వెళ్లిపోయాడు. అతడి వెంట తల్లిదండ్రులు.. సోదరి కూడా ఉంది. గాజువాక నితీష్ కుమార్ రెడ్డి సొంత ఊరు. ఇక్కడే అతడు పుట్టాడు. ఆ తర్వాత క్రికెట్లో మెలకువలు నేర్చుకుని అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. ఈ నేపథ్యంలో తన నానమ్మకు ఊహించని కానుక అందించి.. ఆమె కళ్ళల్లో ఆనందం చూశాడు.

నితీష్ కుమార్ రెడ్డి తన నానమ్మకు బంగారు గాజులు చేయించాడు. భారత్ తరఫున ఆడాలని ఆమెకు కోరికగా ఉండేది. ఆమె కోరికను కూడా నెరవేర్చాడు. నితీష్ ఆ ఊరికి రావడంతో సందడి వాతావరణం ఏర్పడింది.. నానమ్మకు స్వయంగా బంగారు గాజులు తొడిగి.. ఆమె ఆనందాన్ని మరింత రెట్టింపు చేశాడు. తన మనవడితో తొడిగిన బంగారు గాజులను చూసి నితీష్ కుమార్ రెడ్డి నానమ్మ కన్నీటి పర్యంతమైంది. గాయంతో ఇబ్బంది పడుతున్న నితీష్ కుమార్ రెడ్డి.. పూర్తిస్థాయిలో సామర్థ్యం సాధించడానికి ఇంకా ఐదు వారాల దాకా సమయం పడుతుంది. ఆ తర్వాత అతడు జింబాబ్వే జట్టుతో మొదలయ్యే సిరీస్ ద్వారా మళ్ళీ మైదానం లోకి అడుగు పెడతాడు.

అక్షరాలా 5500 కోట్ల గ్రాస్.. సంచలనం రేపుతున్న నవీన్ పోలిశెట్టి లేటెస్ట్ వీడియో..

Naveen Polishetty
Naveen Polishetty

Naveen Polishetty: యంగ్ హీరోల్లో కామిక్ టైమింగ్ అంటే మన అందరికీ గుర్తొచ్చే ఒకరిద్దరు హీరోల్లో ఒకరు నవీన్ పోలిశెట్టి. ఇప్పటి వరకు ఆయన తీసిన ప్రతీ సినిమాలోనూ కామెడీ పీక్ రేంజ్ లో ఉన్నింది. ‘జాతి రత్నాలు’, ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’, ‘అనగనగ ఒక రాజు’ వంటి చిత్రాల్లో నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ చూస్తే పొట్ట చెక్కలు అవ్వాల్సిందే. సినిమాల్లో ఎంత ఫన్నీ గా కనిపిస్తుంటారో , బయట కూడా అదే రేంజ్ ఫన్నీ గా కనిపిస్తుంటాడు నవీన్ పోలిశెట్టి. ఈయన ఇంటర్వ్యూస్ ని చూస్తే ఆ విషయం అర్థం అవుతుంది. అంతే కాదు, తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా చాలా క్రియేటివ్ గా ప్రెజెంట్ చేసి అందిస్తుంటారు నవీన్ పోలిశెట్టి. కాసేపటి క్రితమే ఆయన తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒక వీడియో ని విడుదల చేశారు.

ఈ వీడియో లో ముందుగా ఆయన మాట్లాడుతూ ‘నా లైఫ్ లో కాస్ట్లీస్ట్ ఫ్రేమ్ ని మీ ముందు ఉంచబోతున్నాను’ అంటూ పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ స్టార్ స్టేటస్ ని సంపాదించుకున్న డైరెక్టర్స్ అందరినీ పరిచయం చేసాడు. ముందుగా లోకేష్ కనకరాజ్ ని చూపిస్తూ 500 కోట్లు అని , ఆ తర్వాత రిషబ్ శెట్టి ని చూపిస్తూ 700 కోట్లు అని , ఆ తర్వాత పుష్ప నిర్మాత నవీన్ , సుకుమార్ లను చూపిస్తూ 2000 వేల కోట్లు అని, ప్రశాంత్ నీల్ ని చూపిస్తూ 1400 కోట్లు అని, నా సినిమా తో కలిపి మొత్తం 5500 కోట్ల ఫ్రేమ్ ఇది అంటూ చాలా ఇన్నోవేటివ్ గా చూపించారు నవీన్ పోలిశెట్టి. ఈ వీడియో లో పాపం హరీష్ శంకర్ కూడా ఉన్నాడు , ఆయన్ని పట్టించుకోలేదు అనుకోండి అది వేరే విషయం.

వీళ్లందరినీ చూపించిన తర్వాత చాలా తెలివిగా తన తదుపరి చిత్రానికి సంబంధించిన అప్డేట్ ని త్వరలోనే ప్రకటిస్తానని చెప్పుకొచ్చారు నవీన్ పోలిశెట్టి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా ని ఒక రేంజ్ దున్నేస్తూ ముందుకు దూసుకువెళ్తోంది. నవీన్ పోలిశెట్టి తన అభిమానులను ఎప్పటికీ నిరాశ పర్చరు , ఇలాంటి సరికొత్త ఆలోచనలతో ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ నవీన్ పోలిశెట్టి ఎవరితో సినిమా చేయబోతున్నారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ , కానీ ఒక కొత్త డైరెక్టర్ తో చేయబోతున్నాడని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. సోషల్ మీడియా ని దున్నేస్తున్న ఈ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

పతనం అవుతున్న ఆయిల్ ధరలు.. ఎండ్ ఎందుకీ పరిస్థితి!

Oil Prices Falling
Oil Prices Falling

Oil Prices Falling: ప్రపంచ మార్కెట్లో ఆయిల్ ధరలు మళ్లీ భారీగా పడిపోతున్నాయి. జూన్ 25న బ్రెంట్ క్రూడ్ ధర 1.1 శాతం తగ్గి బ్యారెల్‌కు 72.8 డాలర్ల స్థాయికి చేరింది. అమెరికా బెంచ్‌మార్క్ డబ్ల్యూటీఐ క్రూడ్ కూడా 1.2 శాతం పడిపోయి 69.4 డాలర్లకు తగ్గింది. గత సెషన్‌లో ఏకంగా 4 శాతం వరకు పతనం నమోదైంది. ఈ ధరలు దాదాపు యుద్ధం ప్రారంభానికి ముందు ఉన్న స్థాయికి తిరిగి వచ్చాయి. మార్కెట్‌లో కొనుగోలుదారులు భారీ స్థాయిలో ఆయిల్ ఆర్డర్లు ఇస్తున్నారు. ఇది సప్లయ్ స్థిరత్వంపై మార్కెట్‌కు నమ్మకం పెరిగినట్లు సూచిస్తోంది.

ప్రధాన కారణాలు ఇవీ ..
ఇరాన్-అమెరికా మధ్య శాంతి ఒప్పందం (పీస్ డీల్) ఈ పతనానికి ముఖ్య కారణం. ఈ ఒప్పందం వల్ల మధ్యప్రాచ్యంలో భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గాయి. హార్ముజ్ జలసంధి నుంచి నౌకల రవాణా సాఫీగా, అడ్డంకులు లేకుండా సాగుతోంది. ప్రపంచ ఆయిల్ సప్లయ్‌లో దాదాపు 20 శాతం ఈ జలసంధి ద్వారా వస్తుంది. రవాణా సాధారణ స్థితికి వచ్చినందున, సప్లయ్ అంతరాయం లేకపోవడం మార్కెట్‌కు ఊరట కలిగించింది. ఫలితంగా, రిస్క్ ప్రీమియం (భయం వల్ల ధరలు పెరగడం) తగ్గి, ధరలు సహజంగా పడిపోతున్నాయి.

ఆర్థిక వ్యవస్థకు శుభ సూచకం..
తక్కువ ఆయిల్ ధరలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మంచి వార్త. ఇంధన ఖర్చులు తగ్గడం వల్ల ద్రవ్యోల్బణం (ఇన్‌ఫ్లేషన్) నియంత్రణలో ఉంటుంది. రవాణా, ఉత్పత్తి రంగాల్లో ఖర్చులు తగ్గి, వ్యాపారాలకు ఊతం లభిస్తుంది. భారత్ వంటి ఆయిల్ దిగుమతి చేసుకునే దేశాలకు ఇది ప్రత్యేకంగా ప్రయోజనకరం. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ దిగుమతిదారుల్లో ఒకటి. ధరలు పడిపోవడం వల్ల దిగుమతి బిల్లు తగ్గుతుంది. ఇది కరెంట్ అకౌంట్ డెఫిసిట్‌ను నియంత్రించడానికి, రూపాయి విలువను స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉంది. ఇది సాధారణ ప్రజల ఖర్చులను తగ్గించి, వినియోగాన్ని పెంచుతుంది.

ఇరాన్-అమెరికా శాంతి ఒప్పందం వల్ల వచ్చిన ఈ ధరల పతనం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సానుకూలం. భారత్ వంటి దేశాలు దీని నుంచి గణనీయమైన లాభం పొందవచ్చు.

ఘనంగా మొదలైన బాలకృష్ణ , కొరటాల శివ మూవీ.. వీడియో వైరల్..

Balakrishna Koratala Shiva Movie
Balakrishna Koratala Shiva Movie

Balakrishna Koratala Siva Movie: ‘అఖండ 2’ ఫ్లాప్ అయ్యాక బాలయ్య బాబు తన తదుపరి చిత్రాలపై చాలా ఫోకస్ గా ఉన్నారు. ఇక మీదట చేస్తే కుంభస్థలం బద్దలయ్యే సినిమాలే చెయ్యాలని ఆయన ఫిక్స్ అయ్యారు. ‘అఖండ’ తో మొదలైన బాలయ్య విజయ యాత్ర ‘అఖండ 2’ తో ముగిసింది. ఇప్పుడు ఆయన తన కెరీర్ లో మరో నూతన అధ్యాయం తెరిచాడు. ఇప్పటికే గోపీచంద్ మలినేని తో ఒక సినిమా ఒప్పుకొని, షూటింగ్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు. ఆ తర్వాత వివేక్ ఆత్రేయ తో ఒక సినిమా కూడా ఫిక్స్ అయ్యింది. ఇక రీసెంట్ గానే కొరటాల శివ తో ఒక ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమాలు విజయవాడలో గ్రాండ్ గా జరిగాయి. మూవీ టీం తో పాటు , ఆంధ్ర ప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ , సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ కొరటాల శివ మాట్లాడుతూ ‘ చిన్నతనం నుండి బాలయ్య బాబు ని అభిమానిస్తూ, ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన వాడిని మీ అందరిలాగానే, నేను కూడా బాలయ్య వీరాభిమానిని. ఈ సందర్భంగా నా తోటి అభిమానులందరికీ ఒక మాట ఇస్తున్న , మీరంతా గర్వపడేలా, ఒక విజువల్ ట్రీట్ లాగా ఈ సినిమాని మీ ముందుకు తీసుకొస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు మనం చూస్తూ పెరిగిన బాలయ్య ని కాకుండా, ఆయనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించి మన ముందుకు తీసుకొని రాబోతున్నాడట కొరటాల శివ. కొరటాల సినిమాల్లో హీరోలు చాలా సైలెంట్ యాక్టింగ్ చేస్తారు , కానీ బాలయ్య స్టైల్ లౌడ్ యాక్టింగ్. ఈ కలయికే డిఫరెంట్ గా ఉంది , ఎలాంటి జానర్ లో సినిమా తీయబోతున్నారో చూడాలి. ఒకవేళ బాలయ్య ని జెన్ జీ ఆడియన్స్ కి తగ్గట్టుగా కొత్త చూపిస్తే మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీనే చూస్తాము.

గతం లో బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన ‘సింహా’ చిత్రానికి కథ అందించినది మరెవరో కాదు , కొరటాల శివ నే. ఆ చిత్రానికి స్క్రీన్ ప్లే , మాటలు కూడా ఈయన ఇచ్చాడు. అలాంటి కొరటాల ఇప్పుడు డైరెక్టర్ గా మారి బాలయ్య తో సినిమా చేయబోతున్నాడు , ఇక ఔట్పుట్ ఏ రేంజ్ లో ఉండబోతుందో ఊహించుకోండి. ఇకపోతే ఈ చిత్రం లో విలన్ క్యారెక్టర్ కోసం సీనియర్ హీరో రాజశేఖర్ ని సంప్రదించే ఆలోచనలో ఉన్నారట కొరటాల శివ. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుంది. ఇక ఇందులో హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారు , మిగిలిన నటీనటుల సంగతి ఏంటి? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు.

రాజమౌళి తో సినిమా చేసే ఛాన్స్ వస్తే మిస్ చేసుకున్న స్టార్ హీరో...దెబ్బకి దెబ్బ కొట్టిన జక్కన్న...

S S Rajamouli
S S Rajamouli

Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడు రాజమౌళికి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటి వరకు12 సినిమాలు చేస్తే 12 సినిమాలు కూడా సూపర్ సక్సెస్ గా నిలిచాయి. ఇప్పుడు వారణాసి సినిమాతో మరోసారి పెను సంచలనాలను సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో అద్భుతాన్ని క్రియేట్ చేసిన ఆయన ఇప్పుడు వారణాసి సినిమాతో ప్రపంచ స్థాయి ప్రేక్షకులను సైతం తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. తెలుగు సినిమా స్థాయిని అమాంతం ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేయాలనే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తుంది…ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేసే అవకాశం వస్తే ప్రతి హీరో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నాడు.

ఇక ఇలాంటి క్రమంలోనే ఒకానొక సందర్భంలో రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం వచ్చినా కూడా ఒక స్టార్ హీరో మాత్రం సినిమా చేయలేదట. ఇంతకీ అతను ఎవరు అంటే అమీర్ ఖాన్ కావడం విశేషం…రాజమౌళి మగధీర తర్వాత అమీర్ ఖాన్ తో ఒక బాలీవుడ్ సినిమాని ప్లాన్ చేశాడు. కానీ అమీర్ ఖాన్ మాత్రం అప్పుడు రాజమౌళికి డేట్స్ అయితే ఇవ్వలేదు. కారణం ఏంటి అంటే రాజమౌళి తెలుగు సినిమా దర్శకుడు కావడం వల్లే అతనికి ఛాన్స్ దొరకలేదని ఆ తర్వాత కొన్ని కథనాలైతే వెలువడ్డాయి.

నిజానికి రాజమౌళి చెప్పిన కథలో ఎమోషన్ అద్భుతంగా ఉందని అమీర్ ఖాన్ చెప్పిన కూడా కేవలం తెలుగు వాళ్ళనే ఒక చిన్న చూపుతోనే రాజమౌళికి సినిమా చేసే అవకాశం అయితే ఇవ్వలేదు. ఇక దాంతో రాజమౌళితో ఇప్పుడు అమీర్ ఖాన్ సినిమా చేయాలనుకున్నప్పటికి రాజమౌళి అతనితో సినిమా చేయడం లేదనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

ఇక ఏది ఏమైనప్పటికి రాజమౌళి మాత్రం దెబ్బకు దెబ్బ కొట్టాడు అంటూ తెలుగు వాళ్ళు చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. అమీర్ ఖాన్ కి ఒకప్పుడు బాగా తల పొగరు ఉండేదని ఇప్పుడు సక్సెస్ లేకపోవడంతో అది కాస్త తగ్గిందని చెప్పుకుంటున్నారు. ఇక తెలుగు సినిమాలంటే ఒకప్పుడు పట్టించుకునే వాడు కాదట. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇండియాలోనే నెంబర్ వన్ ఇండస్ట్రీ గా మారడంతో మన దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తుండటం విశేషం…

బుడ్డోడికి నో ఎంట్రీ.. అరేయ్ ఏంట్రా ఇలా చేశారు..

Vaibhav Suryavanshi
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: వైభవ్ సూర్య వంశీ ఇటీవల కదా టీమిండియాలో చోటు సంపాదించుకున్నాడు.. ఐర్లాండ్ జట్టుతో జరిగే సిరీస్ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.. అతడు జాతీయ జట్టులో ఆడుతుంటే చూడాలని తల్లిదండ్రులు ఎంతో ఆశపడుతున్నారు. అతనితోపాటు ఐర్లాండ్ కూడా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. పైగా సూర్య వంశీ తమ్ముడు కూడా దుమ్ము రేపుతున్నాడు. స్థానిక టోర్నీలలో అదరగొడుతున్నాడు.

ఇంతటి అనుకూలతలు వైభవ్ సూర్య వంశీ చుట్టూ ఉంటే.. ఒక బ్యాడ్ న్యూస్ మాత్రం అతడిని వెంటాడుతోంది. అతడి అభిమానులకు కూడా ఆందోళన కలిగిస్తోంది. వైభవ్ సూర్య వంశీ భారత జట్టుతో కలిసి ఐర్లాండ్ గడ్డమీద అడుగుపెట్టాడు. అక్కడ ప్రాక్టీస్ కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఐర్లాండ్ సిరీస్ ద్వారా ఇంటర్నేషనల్ క్రికెట్లో ప్రకంపనలు సృష్టించాలని అతడు బలంగా నిర్ణయించుకున్నాడు. తోటి ప్లేయర్ల మద్దతు కూడా అతడికి విపరీతంగా ఉంది. పైగా ఇటీవల శ్రీలంక సిరీస్ లో కూడా అదరగొట్టాడు. ఫైనల్ మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అటువంటి సూర్య వంశీకి ఒక చేదు వార్త ఎదురైంది.

ఐర్లాండ్, ఇంగ్లాండ్ జట్లతో జరిగే టి20 సిరీస్ ల కోసం వైభవ్ జట్టు ప్లేయర్లతో కలిసి ఇప్పటికే యూకే చేరుకున్నాడు. ఐసీసీ, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నిబంధనల ప్రకారం 16 సంవత్సరాల లోపు ప్లేయర్లు పెద్దల డ్రెస్సింగ్ రూమ్ లు వాడకూడదు. మ్యాచ్ కు ముందు.. ఆ తర్వాత దుస్తులు మార్చుకోవడానికి ఒక ప్రత్యేకమైన గదిని మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది.

15 సంవత్సరాల సూర్య వంశీ కోసం ఇంగ్లాండు క్రికెట్ బోర్డు ఒక ప్రత్యేకమైన గదిని కేటాయించింది. అయితే ఈ గదిలో కేవలం సూర్య వంశీ కి మాత్రమే అవకాశం ఉంటుంది. తోటి ప్లేయర్లతో అతడు మాట్లాడొచ్చు. జట్టు సమావేశంలో పాల్గొనవచ్చు. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నిబంధనలు ఇలా ఉండడంతో.. సూర్య వంశీ అభిమానులు షాక్ అవుతున్నారు. బుడ్డోడికి ఏంటి ఇలాంటి పరీక్షలు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

మనదగ్గర మాత్రం ఇలాంటి నిబంధనలు ఉండవు. ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవచ్చు. వారితో పాటు ఉండొచ్చు. సరదాగా మాట్లాడుకోవచ్చు. జట్టు సమావేశాలలో పాల్గొనొచ్చు. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఈ నిబంధనను ఎప్పటి నుంచో అమలు చేస్తోంది. 15 ఏళ్ల సూర్యవంశీకి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు పెద్దగా మినహాయింపులు ఇవ్వలేదు.

అనిల్ రావిపూడి 'దుర్యోధన' సబ్జెక్ట్ ను ఆ హీరో తో చేయాలనుకుంటున్నాడా..?

Anil Ravipudi
Anil Ravipudi

Anil Ravipudi: ఇప్పటివరకు కమర్షియల్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన అనిల్ రావిపూడి ఫ్యూచర్ లో మాత్రం ఒక డిఫరెంట్ సబ్జెక్టుని చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. దానికోసమే ‘దుర్యోధన’ అనే ఒక టైటిల్ తో ఒక భారీ కాన్సెప్ట్ రెడీ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మహాభారతంలోని దుర్యోధనుడి పాత్రను బేస్ చేసుకొని ఒక సబ్జెక్ట్ ను డిజైన్ చేశారట. అయితే ఈ సినిమాని పాన్ ఇండియాలో చేయాలని అనుకున్నాడట. అయితే ఈ మూవీ ఎప్పుడు చేస్తాను అనే విషయంలో అతనికి క్లారిటి లేదని చెబుతున్నాడట. ఇక మొత్తానికైతే ఇది తన డ్రీమ్ ప్రాజెక్టుగా భావిస్తున్నాడట. ఈ సినిమా అయితే పెద్ద ఎత్తున చేస్తానని తన సన్నిహితుల దగ్గర చెబుతున్నాడట. అయితే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ని హీరోగా పెట్టుకుంటే బాగుంటుందనే ఆలోచనలో ఇప్పుడు ఉన్నారట.

కానీ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియాలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. కాబట్టి అనిల్ రావిపూడి ఇప్పటికే డేట్స్ ఇచ్చే అవకాశాలైతే లేవు. నిజానికి ఈ సినిమాని ఇప్పుడు చేయడం లేదు. మరో రెండు మూడు సంవత్సరాల తర్వాత ఆ సినిమా లైన్ లోకి తెచ్చే అవకాశాలైతే ఉన్నాయి.

కాబట్టి అప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ కు తగ్గట్టుగా అనిల్ పాన్ ఇండియాలో తన మార్కెట్ బిల్డ్ చేసుకోగలిగితే తప్పకుండా జూనియర్ ఎన్టీఆర్ అతనికి డేట్స్ అయితే ఇస్తాడు. దాన్ని మనసులో పెట్టుకొని అనిల్ రావిపూడి రాబోయే సినిమాలతో మరింత మంచి కథలను చేసి ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.

ప్రస్తుతం వెంకటేష్ – కళ్యాణ్ రామ్ లతో మల్టీ స్టారర్ సినిమాను చేస్తున్నాడు. ఈ మూవీ కూడా తెలుగుకే పరిమితమైనప్పటికి ఆ తర్వాత ఒక భారీ పాన్ ఇండియా సినిమాని చేసి ఆ తదుపరి దుర్యోధన సబ్జెక్టుని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారట. ఇక అని రాబోయే రోజుల్లో ఈ హీరోతో సినిమాలు చేస్తాడు ఏ రేంజ్ లో అలరిస్తాడు. సగటు ప్రేక్షకులను మెప్పించగలిగే కెపాసిటి సినిమాలకు ఉంటుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

విభజనతో కుంగిపోయింది ఇప్పుడు అభివృద్ధిలో అంగలేస్తుంది

Andhra Pradesh development

Andhra Pradesh development : 2014 లో ఆంధ్ర విడిపోయినప్పుడు గుర్తు చేసుకుంటే ఆంధ్రులకు నిద్ర పట్టదు. ఆదాయం లేదు.. రాజధాని లేకుండా రాష్ట్రాన్ని విడదీసిన అవిభాజ్య ఏపీకి అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. అంతటి విషాదంలో ఉన్న ప్రజలు.. కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపించిందన్న బాధ ఆంధ్రుల్లో నెలకొంది. 2014 తర్వాత స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటూ కాలయాపన.. రాజధాని లేకుండా సాగిన వైనంపై ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యాయి. 2019లో ఒక్క ఛాన్స్ అన్న జగన్ ను గెలిపించారు జనం. కానీ అభివృద్ధి లేకుండా సంక్షేమానికి పెద్దపీట వేసిన జగన్ ను జనం ఓడించారు.

పవన్ కళ్యాణ్ అటు టీడీపీని, బీజేపీని కలిపి ఆంధ్రాలో కూటమి కట్టి గెలుపునకు బాటలు వేశారు. కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రాకపోవడంతో ఈ కూటమి కీలక పాత్ర పోషించింది. పవన్ కీరోల్ గా ఈ కూటమి కట్టడంలో పాత్ర పోషించారు. ఈ పదేళ్లలో విభిజనతో పోగొట్టుకున్నటువంటి నిధులు, అభివృద్ధి శరవేగంగా సాగుతోంది. విభిజనతో నష్టపోయిన ఏపీకి ఇప్పుడు నిధుల వరద పారుతోంది. అమరావతి నిర్మాణం, పోలవరం పట్టాలెక్కింది. విశాఖ స్టీల్ ప్లాంట్ తిరిగి పునరుద్దరించబడింది.

విభజనతో కుంగిపోయింది ఇప్పుడు అభివృద్ధిలో అంగలేస్తున్న ఏపీ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

విజయ్ జస్ట్ ఫర్ "చేంజ్".. ఇది ఎవరూ ఊహించలేదు..

CM Vijay
CM Vijay

CM Vijay: ఒంటికి నల్లకోటు.. కళ్ళకు కళ్ళజోడు.. మంచి లెదర్ షూస్.. డెనీమ్ జీన్స్.. ఇది తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఆహార్యం.. తమిళనాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయ్ తన స్టైల్ మొత్తం మార్చేశారు. గడ్డంతో కనిపిస్తున్నారు. జుట్టు కూడా పెంచేశారు. ప్రజలను కలిసే విధానం.. తోటి నాయకులతో మాట్లాడే విధానం.. పథకాలు ప్రవేశపెట్టే విధానం.. సంచలన నిర్ణయాలు తీసుకునే విధానం.. ఇలా ప్రతిదాంట్లో విజయ్ తన మార్క్ చూపిస్తున్నారు.

సంక్షేమ పథకాల విషయంలో విజయ్ వెనకడుగు వేయడం లేదు. అలాగని అడ్డగోలుగా పంచుడు పథకాలు ప్రవేశపెట్టడం లేదు. బడ్జెట్ చూసుకొని.. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని అంచనా వేస్తూ.. నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొంతమంది దీనిని విమర్శిస్తున్నప్పటికీ.. మెజార్టీ ప్రజలు స్వాగతిస్తున్నారు. ఇది విజయ్ పరిపాలనలో సరికొత్త కోణాన్ని చూపిస్తోంది. ఇటీవల ఒక గ్రాము బంగారం పథకాన్ని ప్రవేశపెట్టారు విజయ్.ఈపథకాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు.

ఇటీవల ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం.. వెంటనే ప్రక్రియ చేపట్టింది. వారికి ముఖ్యమంత్రి నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ క్రమంలో ఒక గర్భిణీ ఉత్తర్వు అందుకోవడానికి వేదిక పైకి రాలేక పోతే.. విజయ్ కిందికి వచ్చి ఆమెకు నియామక పత్రాన్ని అందించారు. ఇలా చెప్పుకుంటూ పోతే విజయ్ తన పరిపాలనలో.. తాను అనుసరించే విధానంలో అనేక రకాల మార్పులు తీసుకొస్తూ.. సరికొత్త ముద్ర వేసుకుంటున్నారు. జాతీయ మీడియాలో కూడా కీలకమైన వ్యక్తిగా కనిపిస్తున్నారు.

తాజాగా విజయ్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. కాన్వాయ్ వదిలిపెట్టి సాధారణ ప్రయాణికుడి మాదిరిగా బస్సులో ప్రయాణించారు. చెన్నైలోని సెక్రటేరియట్ వద్ద 127 కోట్ల విలువైన 300 కొత్త బస్సులను ఆయన ప్రారంభించారు. అనంతరం పెరంబుర్ వెళ్లే ఓ బస్సులో ఆయన కూర్చున్నారు. ఆ మార్గంలో టికెట్ ధర ఎంత ఉంటుందో.. అంత చిల్లర తీసుకొని.. టికెట్ కొనుగోలు చేశారు. రోడ్డు వెంట బస్సు వెళ్తున్నప్పుడు ప్రజలకు అభివాదం చేశారు. అంతేకాదు స్వయంగా వీడియో తీసుకున్నారు. ప్రజలతో కలిసిపోయి.. ప్రజలతో మమేకమై.. వారి బాధలను తెలుసుకుంటూ విజయ్ తమిళనాడులో సరికొత్త పరిపాలనకు శ్రీకారం చుడుతున్నారు.

'ఆదర్శ కుటుంబం' మూవీలో త్రివిక్రమ్ మార్క్ మిస్ అవుతున్నట్టుంది...

Adarsha Kutumbam Movie
Adarsha Kutumbam Movie

Adarsha Kutumbam Movie: మాటల మాంత్రికుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్…కెరియర్ మొదట్లో ఎంతో మంది హీరోలకు తన కథలతో భారీ విజయాలను అందించిన త్రివిక్రమ్…దర్శకుడిగా మారిన తర్వాత స్టార్ హీరోలందరిని తనవైపు తిప్పుకున్నాడు. ఇక ప్రతి ఒక్కరు తనతో సినిమాలు చేయడానికి చాలా వరకు ఆసక్తి చూపించే రేంజ్ కు వెళ్లిపోయాడు. ఇక ప్రస్తుతం ఆయన వెంకటేష్ తో ‘ఆదర్శ కుటుంబం’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకొని తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకోవాలని చూస్తున్నాడు. ఇంతకుముందు మహేష్ బాబుతో చేసిన ‘గుంటూరు కారం’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో ఎలాగైనా సరే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించి తన రేంజ్ ను పెంచుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు…

ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఆదర్శ కుటుంబం సినిమాని పూర్తి యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నాడట. ఇందులో కామెడీ మిస్ అవుతుందని, ఇది త్రివిక్రమ్ మార్క్ సినిమా కాదంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. నిజానికి వెంకటేష్ త్రివిక్రమ్ అంటే కామెడీ ఎంటర్ టైనర్ వస్తుందని ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళ కాంబినేషన్లో ఇంతకుముందు నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి సినిమాలు వచ్చి సూపర్ సక్సెస్ ని సాధించాయి.

ఈ సినిమాలకు త్రివిక్రమ్ దర్శకుడు కాకపోయినా రచయితగా వ్యవహరించాడు. కాబట్టి తను రాసిన కథ మాటలే వెంకటేష్ నోట్లో నుంచి వచ్చాయి. కాబట్టి ఆ సినిమా భారీ విజయాన్ని సాధించిందని ఇప్పుడు కూడా వీళ్ళ కాంబినేషన్ కి చాలా మంచి క్రేజ్ ఉందని దాన్ని పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయగలిగితే సినిమా నెక్స్ట్ లెవెల్లో సక్సెస్ ని సాధిస్తుందని చాలామంది భావిస్తున్నారు.

కానీ ఈ సినిమాలో త్రివిక్రమ్ మార్క్ అయితే మిస్ అవుతుందని, త్రివిక్రమ్ ఏదో డిఫరెంట్ గా ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తుందని మరి కొంత మంది చెబుతున్నారు. చూడాలి మరి ఈ సినిమాతో అటు వెంకటేష్, ఇటు త్రివిక్రమ్ ఎలాంటి సక్సెస్ ను సాధిస్తారు. తద్వారా వీళ్ళ కాంబినేషన్ కి ప్రేక్షకుల్లో ఎలాంటి మార్కులు పడతాయి అనేది…

సీఎం అయినా విజయ్ కి తప్పని అవమానాలు.. ఇబ్బందులు..

CM Vijay
CM Vijay

CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కి అవమానాల కొత్తకాదు. ఇబ్బందులు కూడా కొత్త కాదు. తన సినీ కెరియర్ మొదలుపెట్టిన తొలి రోజుల్లోనూ విజయ్ తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. వరుసగా వైఫల్యాలు.. అతని ముఖం రంగు.. హావ భావాలు.. ఇలా ప్రతి విషయంలోనూ ఆయన ఇబ్బంది పడ్డారు. చివరికి తనను తాను మలుచుకొని.. గొప్పగా ఎదిగారు. తమిళనాడు చిత్ర పరిశ్రమలోని ఎక్కువ అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న కథానాయకుడిగా నిలిచారు. ఇప్పుడు ఏకంగా తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.

విజయ్ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఇబ్బందులు తప్పడం లేదు. అదేంటి.. ముఖ్యమంత్రి అయ్యాక విజయ్ చెప్పింది వేదం కదా.. ఆయన అన్నదే శాసనం కదా.. అలాంటప్పుడు ఆయనకు ఇబ్బందులు ఏముంటాయి. ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముంది.. పైగా విజయ్ భారీగా డబ్బు సంపాదించిన వ్యక్తి. తమిళనాడు ఆర్థికంగా బలమైన రాష్ట్రం.. అలాంటప్పుడు ఆయనకు ఇబ్బందులు ఏముంటాయి.. నచ్చిన ప్రేయసి త్రిష కూడా ఆయన వెంట ఉంది కదా.. అని మీరు అనుకోవచ్చు. కానీ విజయ్ కి ఉన్న ఇబ్బందులను ఆమె తల్లి శోభ వెల్లడించారు.

ఇటీవల కాలంలో విజయ్ ని ఉద్దేశించి ఉదయనిది స్టాలిన్ దారుణంగా మాట్లాడుతున్నారు. వ్యక్తిగత విషయాలను కూడా రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారు.. చివరికి కోర్టు వ్యవహారాలు.. విడాకుల సంగతులు అంటూ మాట్లాడుతున్నారు. అది విజయ్ ని తీవ్రమైన కలవరపాటుకు గురి చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో విజయ్ ఎవరిని కూడా విమర్శించలేదు. దారుణంగా మాట్లాడలేదు. అంతటి ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన కేవలం తన పార్టీ విధానాలు.. అధికారంలోకి ఏం చేస్తాం అనే విషయాలను మాత్రమే ప్రకటించారు.

తాజాగా విజయ్ గురించి.. అతడు పడుతున్న ఇబ్బందుల గురించి తల్లి శోభ బయటకు చెప్పారు..” పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత విజయ్ ఏ రోజు కూడా సరిగా నిద్రపోలేదు. ఎన్నో రకాల విమర్శలు.. అవమానాలు ఎదుర్కొన్నాడు. అవన్నీ చూస్తూ మౌనంగానే ఉన్నాడు. తన పని తాను చేసుకుంటూ పోయాడు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మా కుటుంబ సభ్యులు తీవ్రంగా బాధపడ్డారు. కొన్ని సందర్భాలలో విజయ్ కి చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ.. అతడు అప్పుడు కూడా మౌనంగానే ఉన్నాడు. ప్రతికూల భావనలను.. ప్రతికూల పరిస్థితులను అతడు సానుకూలంగా మార్చుకున్నాడు. ఫలితంగా ముందుకు సాగాడు. అందువల్లే అతడు ఈ స్థాయిలో ఉన్నాడని” అతడి తల్లి శోభ ఇటీవల చెప్పారు. ఈ ప్రకారం విజయ్ కేవలం ఒక టర్మ్ మాత్రమే కాదు.. తమిళనాడు రాజ్యాన్ని చాలా సంవత్సరాల పాటు ఏలెందుకే రాజకీయాలలోకి వచ్చినట్టు అర్థమవుతోందని విశ్లేషకులు అంటున్నారు.

నల్లగొండలో ఒకే కుటుంబంలో నలుగురు.. ఒక్క ఆధారం లేదు.. పోలీసులు నిందితులను ఎలా పట్టుకున్నారంటే..

Nalgonda Family Crime News
Nalgonda Family Crime News

Nalgonda Family Crime News: తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ నగరంలో ఇటీవల ఒకే కుటుంబంలో నలుగురు అంతమయ్యారు. ఈ కేసు తెలంగాణ రాష్ట్రంలో సంచలనం కలిగించింది. నిందితులు ఒక ఆధారాన్ని కూడా పోలీసులకు లభించకుండా జాగ్రత్త పడ్డారు. అయితే ఈ కేసును అత్యంత సవాల్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఆ దర్యాప్తులో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి.

నల్గొండ జిల్లా కేంద్రంలోని సాగర్ రోడ్డు ప్రాంతంలో తెలంగాణ కాలనీ ఉంటుంది.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఇక్కడ చనిపోయారు. గడిచిన శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ దారుణంలో హసీనా.. ఆమె ముగ్గురు కుటుంబ సభ్యులు ఘోరమైన స్థితిలో చనిపోయారు. మొదట్లో దీనిని గుర్తు తెలియని వ్యక్తుల పనిగా భావించారు.

పోలీసులకు రకరకాల అనుమానాలు ఉండడంతో విచారణ మొదలుపెట్టారు. ప్రాథమిక దర్యాప్తులో హసీనా పేరు మీద ఉన్న ఆస్తుల విషయంలో గొడవలు జరుగుతున్నట్టు సమాచారం. అయితే ఈ ఆస్తికోసం హసీనా మొదటి కూతురు (మొదటి భర్త ద్వారా జన్మించింది), ఆమె భర్త ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. ఈ దారుణం చేయాలని హైదరాబాద్ నుంచి కొంతమంది గ్యాంగ్ ను ఇక్కడికి రప్పించినట్టు తెలుస్తోంది.

ఆ గ్యాంగ్ సభ్యులకు అన్ని రకాలుగా సమాచారాన్ని హసీనా మొదటి కూతురు చెప్పింది. దీంతో వారు హత్యకముందే ఇక్కడ రెక్కి నిర్వహించారు.. అన్ని విధాలుగా చూసుకున్న తర్వాత వారు ఈ దారుణానికి పాల్పడ్డారు. శుక్రవారం అర్ధరాత్రి సుఫారి గ్యాంగ్ హసీనా ఇంటికి వెళ్ళింది. ముందుగా ఆమెను బయటికి పిలిచారు. ఆమె రాగానే కత్తెలతో దారుణంగా దాడి చేశారు. హసీనా కుమారుడు ముజమిల్ అడ్డుకునే ప్రయత్నం చేయగా అతడిని కూడా దారుణంగా అంతం చేశారు.. ఏదో గొడవ జరుగుతోందని మెలకువ వచ్చిన సుల్తాన్ (హసీనా మూడో భర్త) ను వారు చంపేశారు. ఇదంతా చూసిన మరో కుమార్తె అక్సరా ను ఆ దుండగులు అత్యంత దారుణంగా చంపేశారు. నలుగురిని చంపిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోయారు.

ఈ ఘటనలో మొత్తం ఎన్ని మంది పాలుపంచుకున్నట్టు పోలీసులు గుర్తించారు. కూతురు.. అల్లుడు.. నలుగురు నిధితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. ఈ ఘోరానికి పాల్పడిన దాచిన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు..

అందువల్లే గొడవ

హసీనా కు గతంలో రెండు వివాహాలు జరిగాయి. కొంతకాలం క్రితం సుల్తాన్ ను మూడవ వివాహం చేసుకుంది. అతడికి కూడా ఇది మూడవ వివాహం.. సుల్తాన్ కు మొదటి భార్య ద్వారా కలిగిన ముజమిల్, అక్సారా సంతానంతో కలిసి హసీనా ఉంటుంది. హసీనా పేరు మీద ఏకంగా స్థలాలు.. గృహాలు ఉన్నాయి. వీటి విలువ ఏకంగా కోట్లల్లో ఉంటుంది. అయితే వీటిని సుల్తాన్ పిల్లల మీద రాస్తున్నట్టు ఇటీవల హసీనా ప్రకటించింది. దీంతో హసీనాకు మొదటి భర్త ద్వారా కలిగిన కుమార్తె.. ఆమె భర్త ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు చెబుతున్నారు.

వావ్..! ఇలాంటి డిజైన్ ఏ ఫోన్లలో చూసి ఉండరు.. ఇది ఎందుకంటే..

Nothing Phone 4b Design Features
Nothing Phone 4b Design Features

Nothing Phone 4b Design Features: లండన్‌కు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ Nothing తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్ (4b) విడుదలకు ముందే డిజైన్ గురించి వెల్లడించింది. నేటి కాలంలో మొబైల్ కొనే సమయంలో చాలా మంది డిజైన్ విషయంలో కూడా ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఈ కంపెనీ బ్లూ కలర్ లో ఉన్న మోడల్ ను లీక్ చేసింది. అయితే ఈ ఫోన్ ఎప్పుడు మార్కెట్లోకి వస్తుంది? ఇందులో ఉండే మిగతా ఫీచర్లు ఎలా ఉన్నాయి? వాటి వివరాల్లోకి వెళితె..

Nothing Phone (4b) ఫోన్‌ జూలై 7, 2026 న మధ్యాహ్నం అధికారికంగా విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. భారతదేశంలో ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా దీనిని కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్ డిజైన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. నథింగ్ కంపెనీ తన ఫోన్లలో ఎప్పుడూ వాడే సిగ్నేచర్ సెమీ-ట్రాన్స్‌పరెంట్ బ్యాక్ ప్యానెల్ డిజైన్‌ను ఈ ఫోన్ లోనూ కొనసాగించింది. అయితే, ఈసారి సరికొత్తగా ‘బ్లూ కలర్వే’ ఆప్షన్‌ను పరిచయం చేసింది. ఈ ఫోన్ వెనుక భాగంలో లోపల ఉండే మెకానికల్ విడిభాగాలు, స్క్రూలు మరియు ఇండస్ట్రియల్ టెక్స్చర్‌లు బ్లూ షేడ్‌లో స్పష్టంగా కనిపిస్తూ డిజైన్ పరంగా చాలా ప్రీమియంగా, స్టైలిష్‌గా కనిపిస్తోంది. ఫోన్ పట్టుకోవడానికి వీలుగా ఉండేలా దీని బాడీకి సాఫ్ట్, స్కిన్-ఫ్రెండ్లీ టెక్స్చర్‌ను అందించారు.

గత మోడల్స్‌లో బ్యాక్ ప్యానెల్ మొత్తం విస్తరించి ఉండే గ్లిఫ్ లైటింగ్‌కు బదులుగా ఈ ఫోన్ (4b) లో సరికొత్త ‘గ్లిఫ్ బార్’ ను కంపెనీ ప్రవేశపెట్టింది. కెమెరా సెటప్‌కు కుడి వైపున నిలువుగా అమర్చిన 6 వైట్ LED లైట్లతో ఈ బ్లూ బ్లాక్ రూపొందింది. ఇందులో రికార్డింగ్ చేసేటప్పుడు బ్లింక్ అయ్యేలా ఒక రెడ్ ఇండికేటర్ కూడా ఉంది. ఈ గ్లిఫ్ బార్ ద్వారా యాప్ నోటిఫికేషన్‌లు, ఇన్‌కమింగ్ కాల్ అలర్ట్‌లు, ఛార్జింగ్ స్టేటస్ మరియు కెమెరా టైమర్ కౌంట్‌డౌన్ వంటి వాటిని యూజర్లు సులభంగా చూసుకోవచ్చు.

నథింగ్ ఫోన్ (4b) లో ఓవల్ (గుండ్రటి) ఆకారపు మాడ్యూల్‌లో అమర్చిన అప్‌గ్రేడెడ్ కెమెరా సెటప్ ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ ఫోన్ 6.32 అంగుళాల AMOLED డిస్‌ప్లే ను అమర్చారు. 120Hz రిఫ్రెష్ రేట్ తో ఉండే ఇందులో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్ ఉండనుంది. ఇందులో 5000mAh బ్యాటరీ ఉండగా.. 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ చేయనుంది.

లార్డ్స్‌లో జరిగిన చారిత్రాత్మక అద్భుతం.. భారత క్రికెట్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన విజయం!

Lord Historic Victory India Cricket
Lord Historic Victory India Cricket

Lord Historic Victory India Cricket: జూన్ 25.. క్రికెటర్ క్రీడాకారులు, అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని రోజు. భారత క్రికెట్ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన క్షణాలు ఆరోజు ఆవిష్కృతమయ్యాయి. అప్పటివరకు క్రికెట్ రా రాజుగా ఉన్న వెస్ట్ ఇండీస్ ను చిత్తుచేసి వన్డే క్రికెట్ వరల్డ్ కప్ తొలిసారి గెలిచిన భారత్ అద్భుతాన్ని ఆవిష్కరించింది. 1983లో ఇంగ్లండ్‌లో జరిగిన మూడో వన్డే వరల్డ్ కప్‌లో భారత్ పసికూన జట్టుగా ప్రవేశించింది. అప్పటికే వెస్టిండీస్ రెండు వరుస వరల్డ్ కప్‌లు గెలిచిన బలమైన జట్టు. కపిల్ దేవ్ నాయకత్వంలో భారత జట్టు గ్రూప్ స్టేజ్‌లో కష్టాలను ఎదుర్కొంది. జింబాబ్వేపై డ్రామాటిక్ విజయం (కపిల్ దేవ్ సెంచరీ), ఆస్ట్రేలియాపై విజయం వంటి మ్యాచ్‌లు జట్టుకు ఆత్మవిశ్వాసం కలిగించాయి. సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరింది. ఈ ప్రయాణం మొత్తం ఒక అద్భుత కథలా మారింది.

కల సాకారమైన రోజు..
జూన్ 25, 1983న ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన క్రీడామైదానం లార్డ్స్ లో జరిగిన ఫైనల్‌లో భారత్ ముందుగా బ్యాటింగ్ చేసి 60 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. సునీల్ గవాస్కర్, కృష్ణమాచారి శ్రీకాంత్ వంటి ఓపెనర్లు మంచి ప్రారంభం ఇచ్చినా, మధ్యలో వికెట్లు పడటంతో స్కోరు నియంత్రణలో ఉంది. లక్ష్య చేదనలో బలమైన వెస్టిండీస్ జట్టు (వివ్ రిచర్డ్స్, క్లైవ్ లాయిడ్, ఆండీ రాబర్ట్స్ వంటి స్టార్లు ఉన్న) కేవలం 140 పరుగులకే కుప్పకూలింది. మదన్ లాల్, రోజర్ బిన్నీ వంటి బౌలర్లు కీలక వికెట్లు తీసి ఆ బలమైన జట్టును కుదిపేశారు. మొహిందర్ అమర్‌నాథ్ అద్భుత ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్‌గా నిలిచారు.

అద్భుతం చేసిన కపిల్ దేవ్..
ఈ మ్యాచ్‌లో అత్యంత హైలైట్ కపిల్ దేవ్ పట్టిన వివ్ రిచర్డ్స్ క్యాచ్. రిచర్డ్స్ బ్యాటింగ్‌లో ఆధిపత్యం చూపుతున్న సమయంలో కపిల్ వెనక్కి పరిగెడుతూ అద్భుతంగా ఆ క్యాచ్‌ను అందుకున్నారు. ఆ క్షణం టోర్నీకే సింబల్‌గా మారింది. కపిల్ దేవ్ ఆ టోర్నమెంట్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపికయ్యారు. ఆయన బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, నాయకత్వం అన్నింటిలోనూ అద్భుతంగా రాణించారు. ఆయన నాయకత్వంలో జట్టు ఒకటిగా కలిసి ఆడి ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించింది.

భారత క్రికెట్‌పై ప్రభావం..
1983 విజయం భారత క్రికెట్ దిశనే మార్చివేసింది. ఆ రోజు వరకు భారత్‌లో క్రికెట్ ప్రధానంగా టెస్ట్ ఫార్మాట్‌కు పరిమితం. ఈ వన్డే విజయం తర్వాత దేశవ్యాప్తంగా క్రికెట్ పట్ల ఉత్సాహం పెరిగింది. యువత, పిల్లలు బ్యాట్, బాల్‌తో ఆడడం ప్రారంభించారు. టెలివిజన్ ద్వారా క్రికెట్ ప్రసారాలు పెరిగి, క్రికెట్ వాణిజ్యపరంగా ఎదగడానికి పునాది వేసింది. ఈ విజయం తర్వాత వచ్చిన తరం (సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ వంటి వారు) ఈ విజయం నుంచి స్ఫూర్తి పొందారు. 2011 వరల్డ్ కప్ విజయానికి కూడా ఈ 1983 విజయం ప్రేరణగా నిలిచింది.

1983 జూన్ 25న సాధించిన ఈ విజయం భారత క్రికెట్‌ను ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన మలుపు. ఆ రోజు వరకు భారత జట్టు అనుభవం లేని, బలహీనంగా చూడబడేది. కపిల్ దేవ్ నాయకత్వం, జట్టు సభ్యుల ఐక్యత, ధైర్యం ఈ విజయాన్ని సాధ్యం చేశాయి.ఈ విజయం భారతదేశంలో క్రికెట్‌ను “ఆట” నుంచి “జాతీయ గర్వం” స్థాయికి తీసుకెళ్లింది. దేశంలో క్రికెట్ అభిమానుల సంఖ్య గణనీయంగా పెరిగి, ఆ తర్వాతి దశాబ్దాల్లో భారత క్రికెట్ వాణిజ్య, మీడియా, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విషయంలో భారీగా అభివృద్ధి చెందింది. నేటికీ 1983 విజయం భారత క్రికెట్ అభిమానులకు, ఆటగాళ్లకు స్ఫూర్తి.

అనిల్ రావిపూడి మూవీస్ లో హీరోలకి ఆ ఒక్కటి కొంచెం ఎక్కువగా ఉంటుందా..?

Anil Ravipudi
Anil Ravipudi

Anil Ravipudi Movies Analysis: కమర్షియల్ సినిమాలకు పెట్టింది పేరుగా మారిన దర్శకుడు అనిల్ రావిపూడి… వరుసగా ఆయన చేసిన సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నాడు. ఇప్పటివరకు 9 సినిమాలు చేస్తే 9 సినిమాలు కూడా సూపర్ సక్సెస్ అవ్వడంతో ఆయన టాప్ డైరెక్టర్ గా మారిపోయాడు. అతని సినిమాలను చూడడానికి చాలా మంది ప్రేక్షకులు సైతం ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా పండుగ సీజన్ లో వచ్చి సూపర్ సక్సెస్ ని సాధించడం అనిల్ రావిపూడి నైజాం… ఇక అతను ప్రతి సంక్రాంతికి వచ్చి భారీ సక్సెస్ ని సాధిస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే అతని సినిమాలను చూడడానికి ఫ్యామిలీ ఆడియన్స్ ఎందుకని ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు అంటే అతని సినిమాల్లో పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే ను ఫాలో అవుతూ ఏ టైంలో ఏం రావాలో ప్రతిదీ ఒక మీటర్ మీద వచ్చేటట్టుగా సెట్ చేస్తూ ఉంటాడు.

అందువల్ల అతని సినిమాలకు ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తుందని చాలామంది చాలా రకాలుగా వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా అనిల్ రావిపూడి చేసే సినిమాల విషయంలో చాలా క్లారిటీ మెయింటైన్ చేస్తూ ఉంటాడు.

అయితే ఇప్పుడు ఆయన సినిమాల్లో చేసిన హీరోలందరిలో ఒక కామన్ ఎలిమెంట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆయన చేసిన ప్రతి సినిమాలోని హీరోకి కొంచెం హ్యూమర్ ఎక్కువగా ఉంటుంది. వాళ్లే కామెడిని చేస్తుంటారు. వీలైతే వాళ్లే విలన్స్ ని ఇరగదీస్తూ ఉంటారు. ఈ కామన్ పాయింట్స్ అయితే అతని సినిమాల్లో కనిపిస్తూ ఉంటాయి.

ఇక ఎప్పుడు కూడా హీరోని ఒక అగ్రెసివ్ షెడ్ లో అయితే ఆయన చూపించలేదు. ఇటు కామెడీ యాంగిల్ ను అటు కోపాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ చూపిస్తారు కాబట్టే ఆయన సినిమాలో హీరో చాలా వైల్డ్ గా కనిపిస్తూ ఉంటాడు. దీనివల్ల ప్రేక్షకులు సైతం ఆ క్యారెక్టర్ కి కనెక్ట్ అయ్యే అవకాశాలైతే పుష్కలంగా ఉంటాయి…

ఒక్క షాట్ కోసం 90 టేకులు.. 'వారణాసి' షూటింగ్ లో మహేష్ కి చుక్కలు చూపిన రాజమౌళి..

Mahesh Babu Varanasi Shooting
Mahesh Babu Varanasi Shooting

Mahesh Babu Varanasi Shooting: దర్శకుడు రాజమౌళి కి ఇంటర్నేషనల్ లెవెల్ లో ఫేమ్, క్రేజ్ ఊరికే రాలేదు. తన విజన్ కి తగ్గట్టు పని చేస్తూ , నూటికి నూరు శాతం పర్ఫెక్షన్ వస్తే తప్ప, ఒక షాట్ ని ఆయన ఓకే చేయడు. #RRR మూవీ ఎన్టీఆర్ రాజమౌళి ఎంత పర్ఫెక్షన్ కోరుకునే వ్యక్తో చెప్తాడు గుర్తుందా?, ముంబై ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోల ఎంట్రీ సరిగా రాలేదని , దానిని హైదరాబాద్ లో సెట్స్ వేసి రీ షూట్ చేసిన మనిషి ఆయన. ఈ రేంజ్ పర్ఫెక్షన్ ఉన్న డైరెక్టర్ ఇండియా లోనే కాదు, ప్రపంచం లోనే ఎక్కడా ఉండరేమో. ఇకపోతే ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న విజువల్ వండర్ ‘వారణాసి’ మూవీ షూటింగ్ విశేషాలను ఆ చిత్రం లో విలన్ క్యారెక్టర్ చేస్తున్న పృథ్వీ రాజ్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు.

ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. పృథ్వి రాజ్ మాట్లాడుతూ ‘నేను మోహన్ లాల్ బారోజ్ మూవీ లో ఒక చిన్న పాత్ర చేశాను . కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ షూటింగ్ నుండి మధ్యలోనే తప్పుకోవాల్సి వచ్చింది, మోహన్ లాల్ నటన చాలా దగ్గర నుండి చూసాను కాబట్టి ఆయన ఎంత గొప్ప నటుడో నాకు తెలుసు. ఆయన తర్వాత నా దృష్టిలో అంతటి గొప్ప నటుడు రాజమౌళి గారే. ప్రతీ సన్నివేశాన్ని ఆయన నటించి , జీవించి మాకు చూపిస్తాడు. మా పని చాలా సులువు అయ్యేలా చేస్తాడు. ఒక్కోసారి రాజమౌళి వివరించే సన్నివేశాలు నాకు అర్థం అయ్యేవి కాదు. దాన్ని అర్థం చేసుకోవడానికి నాకు తల ప్రాణం తోకకు వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆయన గొప్ప విజన్ కు , నా నటనకు మధ్య సెట్స్ లో చిన్నపాటి యుద్ధం అనేక సార్లు జరిగింది’.

‘కానీ ఆయనపై బలమైన నమ్మకం తో , ఆయన ఏది చెప్తే అదే చేస్తూ వచ్చాను. ఆ తర్వాత ఎడిటింగ్ టేబుల్ మీద ఫైనల్ ఔట్పుట్ ని చూసినప్పుడు చాలా గొప్పగా అలోచించి ఈ సన్నివేశాన్ని తీసాడని అనిపించేది. ఆయనతో పని చేయడం వల్ల ఒక నటుడిగా , దర్శకుడిగా ఎంతో పరిణీతి చెందాను. ఇప్పటి వరకు నేను రాజమౌళి రేంజ్ లో కష్టపడి పని చేసే డైరెక్టర్ ని చూడలేదు. ఉదయం 7 గంటలకు మొదటి షాట్ ని ప్లాన్ చేస్తే , ఆయన 5 గంటల 15 నిమిషాలకే సెట్స్ వద్దకు చేరుకొని , తన అస్సితన్స్ తో కలిసి 12 సార్లు రిహార్సల్స్ చేయిస్తారు. మేము ముందే సెట్స్ కి రావొచ్చా అని అడిగితే వద్దు అంటాడు. మాకు లంచ్ బ్రేక్ కూడా కేవలం 20 నిమిషాలు మాత్రమే ఇచ్చేవాడు. సెట్స్ లో ఒక్కో సన్నివేశాన్ని 90 టేకులకు పైగా తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉదయం 5 గంటలకు మొదలు పెడితే , రాత్రి వరకు కొనసాగిస్తారు, ఒకవేళ ఆయన విజన్ కి తగ్గట్టు షాట్ రాకపోతే మరుసటి రోజు కూడా అదే షాట్ ని తెరకెక్కిస్తారు ‘ అంటూ చెప్పుకొచ్చాడు.