Homeఎంటర్టైన్మెంట్Rajamouli: రాజమౌళి తో సినిమా చేసే ఛాన్స్ వస్తే మిస్ చేసుకున్న స్టార్ హీరో...దెబ్బకి దెబ్బ...

Rajamouli: రాజమౌళి తో సినిమా చేసే ఛాన్స్ వస్తే మిస్ చేసుకున్న స్టార్ హీరో…దెబ్బకి దెబ్బ కొట్టిన జక్కన్న…

Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడు రాజమౌళికి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటి వరకు12 సినిమాలు చేస్తే 12 సినిమాలు కూడా సూపర్ సక్సెస్ గా నిలిచాయి. ఇప్పుడు వారణాసి సినిమాతో మరోసారి పెను సంచలనాలను సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో అద్భుతాన్ని క్రియేట్ చేసిన ఆయన ఇప్పుడు వారణాసి సినిమాతో ప్రపంచ స్థాయి ప్రేక్షకులను సైతం తన […]

Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడు రాజమౌళికి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటి వరకు12 సినిమాలు చేస్తే 12 సినిమాలు కూడా సూపర్ సక్సెస్ గా నిలిచాయి. ఇప్పుడు వారణాసి సినిమాతో మరోసారి పెను సంచలనాలను సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో అద్భుతాన్ని క్రియేట్ చేసిన ఆయన ఇప్పుడు వారణాసి సినిమాతో ప్రపంచ స్థాయి ప్రేక్షకులను సైతం తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. తెలుగు సినిమా స్థాయిని అమాంతం ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేయాలనే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తుంది…ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేసే అవకాశం వస్తే ప్రతి హీరో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నాడు.

ఇక ఇలాంటి క్రమంలోనే ఒకానొక సందర్భంలో రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం వచ్చినా కూడా ఒక స్టార్ హీరో మాత్రం సినిమా చేయలేదట. ఇంతకీ అతను ఎవరు అంటే అమీర్ ఖాన్ కావడం విశేషం…రాజమౌళి మగధీర తర్వాత అమీర్ ఖాన్ తో ఒక బాలీవుడ్ సినిమాని ప్లాన్ చేశాడు. కానీ అమీర్ ఖాన్ మాత్రం అప్పుడు రాజమౌళికి డేట్స్ అయితే ఇవ్వలేదు. కారణం ఏంటి అంటే రాజమౌళి తెలుగు సినిమా దర్శకుడు కావడం వల్లే అతనికి ఛాన్స్ దొరకలేదని ఆ తర్వాత కొన్ని కథనాలైతే వెలువడ్డాయి.

నిజానికి రాజమౌళి చెప్పిన కథలో ఎమోషన్ అద్భుతంగా ఉందని అమీర్ ఖాన్ చెప్పిన కూడా కేవలం తెలుగు వాళ్ళనే ఒక చిన్న చూపుతోనే రాజమౌళికి సినిమా చేసే అవకాశం అయితే ఇవ్వలేదు. ఇక దాంతో రాజమౌళితో ఇప్పుడు అమీర్ ఖాన్ సినిమా చేయాలనుకున్నప్పటికి రాజమౌళి అతనితో సినిమా చేయడం లేదనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

ఇక ఏది ఏమైనప్పటికి రాజమౌళి మాత్రం దెబ్బకు దెబ్బ కొట్టాడు అంటూ తెలుగు వాళ్ళు చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. అమీర్ ఖాన్ కి ఒకప్పుడు బాగా తల పొగరు ఉండేదని ఇప్పుడు సక్సెస్ లేకపోవడంతో అది కాస్త తగ్గిందని చెప్పుకుంటున్నారు. ఇక తెలుగు సినిమాలంటే ఒకప్పుడు పట్టించుకునే వాడు కాదట. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇండియాలోనే నెంబర్ వన్ ఇండస్ట్రీ గా మారడంతో మన దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తుండటం విశేషం…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper