Home Blog Page 68

'జైలర్ 2' లో హృతిక్ రోషన్ షూటింగ్ పై సంచలన అప్డేట్.. మూవీ లవర్స్ కి పండగే..

Jailer 2 Hrithik Roshan
Jailer 2 Hrithik Roshan

Jailer 2 Hrithik Roshan: సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్’ చిత్రం ఏ రేంజ్ లో ఊపేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 650 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. హిందీ వెర్షన్ లో పెద్దగా వసూళ్లు రాలేదు కానీ , అక్కడ కూడా క్లిక్ అయ్యుంటే , కచ్చితంగా వెయ్యి కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టి ఉండేది ఈ చిత్రం. అలాంటి క్రేజీ బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ ఉంటుంది అని డైరెక్టర్ చెప్పినప్పుడే ప్రేక్షకుల్లో , అభిమానుల్లో అంచనాలు వేరే లెవెల్ కి వెళ్లాయి. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యి చాలా రోజులు అయ్యింది. అయితే ఈ చిత్రం లో ఒక స్పెషల్ క్యామియో రోల్ కోసం ఇండియా లో ఎంతమంది బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ని సంప్రదించారు అనే విషయం అందరికీ తెలిసిందే.

ముందుగా బాలయ్య బాబు ని అడిగారు, మొదట్లో కచ్చితంగా చేస్తాడనే రూమర్ వచ్చింది కానీ , చివరికి ఆయన నిరాకరించినట్టే చెప్పుకొచ్చారు. ఇక ఆ తర్వాత బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ని సంప్రదించారు , ఆయన డేట్స్ కూడా ఖాళీ లేకపోవడం తో కుదర్లేదు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ని కూడా సంప్రదించారు , కానీ ఆరోగ్య సమస్య దృష్ట్యా ఆయన కూడా ఒప్పుకోలేదు. ఇక చివరికి ఈ పాత్రని హృతిక్ రోషన్ చేస్తున్నాడు. గత పది రోజులుగా ఆయనపై కొన్ని సోలో సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక రజినీకాంత్ కాంబినేషన్ లో ఒక షాట్ కి సంబంధించిన చిత్రీకరణ మాత్రమే బ్యాలన్స్ ఉందట. త్వరలోనే అది కూడా పూర్తి చేయబోతున్నట్టు సమాచారం. ‘కూలీ’ చిత్రం లో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ గెస్ట్ రోల్ లో కనిపించగా, ‘జైలర్ 2’ లో మరో బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ కూడా అదే తరహా గెస్ట్ రోల్ లో కనిపించడం గమనార్హం. కానీ కూలీ లో అమీర్ ఖాన్ రోల్ క్లిక్ అవ్వలేదు , విమర్శలు వచ్చాయి , మరి ‘జైలర్ 2’ లో హృతిక్ రోల్ ని అయినా సరిగా చూపిస్తారో లేదో చూడాలి.

అల్లు అర్జున్ - లోకేష్ కనకరాజ్ మూవీ ఫస్ట్ లుక్ అప్డేట్ వచ్చేసింది.. ఫ్యాన్స్ కి ఇక పండగే..

Raka Movie First Look
Raka Movie First Look

Raka Movie First Look: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ముంబై లో ‘రాకా’ మూవీ షూటింగ్ తో ఫుల్ బిజీ గా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే . ఈ సినిమా షూటింగ్ కారణంగా సోమవారం తొక్కిసలాట కేసులో విచారణకు నాంపల్లి హైకోర్టు కి కూడా ఆయన హాజరు కాలేకపోయారు. దీనిపై సోషల్ మీడియా లో ఒక రేంజ్ ట్రోల్స్ నడిచాయి కూడా. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం తర్వాత ఆయన వెంటనే లోకేష్ కనకరాజ్ దర్శకత్వం లో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. గ్రాండ్ గా ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా జరిగింది. అయితే ఈమధ్య కాలం లో ఈ సినిమా ఆగిపోయిందని , అల్లు అర్జున్ కి కథ అసలు నచ్చలేదని సోషల్ మీడియా లో పలు రకాల రూమర్స్ చక్కర్లు కొట్టాయి.

ఆ రూమర్స్ కి చెక్ పెడుతూ , రేపు ముంబై లో ఈ చిత్రానికి సంబంధించిన ట్రయిల్ షూట్ ని భారీ రేంజ్ లో ప్లాన్ చేశారట. ఇది రెగ్యులర్ ఫోటో షూట్ కాదని , ట్రయిల్ షూట్ లాంటిదని , రాబోయే రోజుల్లో ఫస్ట్ లుక్ ని కూడా గ్రాండ్ స్కేల్ లో విడుదల చేస్తారని చెప్పుకొస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక అప్డేట్ రానుంది. అల్లు అర్జున్ , లోకేష్ కామరాజ్ , అనిరుద్ కాంబినేషన్ లో సినిమా అంటే , మూడు డ్రాగన్స్ కలిసి సృష్టించే విద్వంసం అన్నట్టే లెక్క. లోకేష్ కనకరాజ్ గత రెండు సినిమాలు కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపాయి కానీ , కంటెంట్ పరంగా ప్రేక్షకులను నిరాశకు గురి చేశాయి. అందుకే ఈసారి ఆయన తనలోని వింటేజ్ రైటింగ్ ని బయటకు తీసి ఇప్పటి వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఎవ్వరూ చూడని కథ తో మన ముందుకు రాబోతున్నారట.

ఈ సినిమాలు మ్యూజిక్ నుండే జెన్ జీ ఆడియన్స్ మెంటలెక్కిపోతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే ప్రకటన వీడియో కి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇన్ స్టాగ్రామ్ ని రూల్ చేస్తోంది. రీసెంట్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని ఉపయోగించుకున్నాడు అంటేనే అర్థం చేసుకోవచ్చు , ఈ సినిమా రేంజ్ ఏంటి అనేది. రాబోయే రోజుల్లో ఈ కాంబినేషన్ నుండి ఇంకెన్ని అద్భుతాలు క్రియేట్ అవుతాయో చూడాలి.

సామాన్యులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సీఎం విజయ్.. వీడియో వైరల్..

CM Vijay Bus Journey
CM Vijay Bus Journey

CM Vijay Bus Journey: నాయకుడు అంటే ఎలా ఉండాలో తమిళ నాడు ముఖ్యమంత్రి విజయ్ ని చూసి నేర్చుకోవాలి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్నికల ముందు ప్రతీ నాయకుడు ఓట్ల కోసం ఇంటింటికి వెళ్లారు, ఏమేమి చెయ్యాలో అన్నీ చేస్తారు, కానీ ఎన్నికలు పూర్తి అయ్యి పదవి చేపట్టిన తర్వాత జనాలను అంటరాని వాళ్ళుగా చూస్తుంటారు ఈ మన నాయకులు. వాళ్ళ మధ్యలోకి వచ్చేటప్పుడు పరదాలు పరుచుకుంటారు, హెలికాప్టర్ లో ప్రయాణిస్తే క్రింద చెట్లను కొట్టించేస్తుంటారు, చివరికి తిరుమల కి వెళ్లడం ఇష్టం లేక, ఇంట్లోనే తిరుమల సెట్స్ వేయిస్తారు , ఇలాంటి అద్భుత ఘట్టాలను గతంలో మనం చాలానే చూశాము. కానీ సీఎం విజయ్ ఎన్నికల ముందు ఓట్ల కోసం మన నాయకులూ లాగా డ్రామాలు చెయ్యలేదు , కానీ ముఖ్యమంత్రి అయ్యాక , ప్రజల వద్దకే పాలన అన్నట్టుగా ఆయన రూలింగ్ సాగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

రీసెంట్ గా ఆయన ప్రభుత్వ ఉద్యోగులను సన్మానిస్తున్న సమయంలో ఒక గర్భిణీ స్త్రీ స్టేజి మీదకు ఎక్కే పరిస్థితి లేని విషయాన్ని గమనించిన విజయ్, స్వయంగా తానే క్రిందకు దిగి , ఆ గర్భిణీ స్త్రీ ని సన్మానించిన వీడియో సోషల్ మీడియా లో ఎంత వైరల్ అయ్యిందో మనమంతా చూశాం. నేడు సీఎం విజయ్ సామాన్యులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం , అక్కడి ప్రయాణికులతో మమేకమై మాట్లాడడం వంటివి చేశాడు. ఆయన తీరులో ఇసుమంత గర్వం కూడా కనిపించలేదు. ఈ కాలం లో ఇలాంటి ముఖ్యమంత్రులను ఎక్కడ చూశాము చెప్పండి?, ఆయన పాలన ఏదైనా నేను చేసేదే చెప్తా , చెప్పిందే చేస్తా, ప్రజలే నా దేవుళ్ళు అన్నట్టుగా సాగుతోంది. ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. దేవాలయాల్లో VIp దర్శనాలు రద్దు చేయడం , అదే విధంగా దేవాలయాల హుండీలో ఉండే నిధులకు ప్రభుత్వం నుండి మినహాయింపు ప్రకటించడం వంటివి ఎంతో ఆదర్శప్రాయమైనవి.

అంతే కాకుండా ప్రైవేట్ స్కూల్స్ ఇష్టమొచ్చినట్టు ఫీజులు వసూలు చేసేందుకు వీలు లేదని , ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులే అమలు చేయాలనీ ఆదేశించడం, దేవాలయాలు , స్కూల్స్ పరిసరాల్లో మద్యం దుకాణాలను ఎత్తివేయడం, ఇలా ఒక్కటా రెండా , ఎన్నో ఉన్నాయి . అందుకే సీఎం విజయ్ రోజురోజుకి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫాలోవింగ్ , క్రేజ్ పెరిగిపోతూ ఉంది. అందరూ విజయ్ లాగా పరిపాలిస్తే ఎంత బాగుంటుందో అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.

ఐకానిక్ లుక్.. మోడరన్ ఎలక్ట్రిక్ డిజైన్.. 30నమార్కెట్లోకి టాటా కొత్త కారు..

Tata Sierra EV
Tata Sierra EV

Tata Sierra EV: భారతీయ ఆటోమోబైల్ రంగంలో Tata Motors సరికొత్త విప్లవానికి తెరతీస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా 90ల కాలంలో యువతను ఎంతగానో ఆకట్టుకున్న లెజెండరీ కారు ‘సియెర్రా’ ను మళ్లీ మన ముందుకు తీసుకురాబోతోంది. అయితే, ఈసారి దీనిని సాంప్రదాయ ఇంధన ఇంజిన్‌తో కాకుండా సరికొత్త ఎలక్ట్రిక్ రూపంలో టాటా సియెర్రా ఈవీ (Tata Sierra EV) గా రూపాంతరం చెందించింది. ఈ కారును అధికారికంగా జూన్ 30, 2026 న ముంబై వేదికగా ప్రపంచానికి పరిచయం చేయనున్నట్లు ప్రకటించింది. పాత జ్ఞాపకాలను గుర్తుచేస్తూనే నయా జెనరేషన్ టెక్నాలజీతో రాబోతున్న ఈ కారు విశేషాల్లోకి వెళితె..

ఒరిజినల్ సియెర్రా కారులో అందరినీ ఆకట్టుకున్న ప్రత్యేకమైన బాక్సీ డిజైన్, వెనుక భాగంలో ఉండే పెద్ద ‘ఆల్పైన్ విండో’ గ్లాస్ రూఫ్‌ను ఈ సరికొత్త ఈవీ మోడల్‌లోనూ టాటా కొనసాగించింది. కాకపోతే, దీనికి ఫ్యూచరిస్టిక్ టచ్ ఇస్తూ ముందు భాగంలో ఎండ్-టు-ఎండ్ కనెక్టెడ్ LED DRL లైట్లు, బంపర్ కింద అమర్చిన మెయిన్ హెడ్‌ల్యాంప్‌లు, ఎలక్ట్రిక్ వాహనాలకు ఉండేలా క్లోజ్డ్ ఆఫ్ గ్రిల్‌ను అందించారు. దీనితో పాటు ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, 19 అంగుళాల ఏరో ఆప్టిమైజ్డ్ అలాయ్ వీల్స్ ఈ ఎస్‌యూవీ కి మరింత స్పోర్టీ లుక్‌ను తీసుకువచ్చాయి.

టాటా సియెర్రా ఈవీని కంపెనీ సరికొత్త Acti.ev ప్లస్ ఆర్కిటెక్చర్‌పై నిర్మించింది. ఇది 65 kWhతో పాటు 75 kWh సామర్థ్యం గల రెండు పెద్ద బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో రానుంది. ఇది ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 500 నుండి 600 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని అంచనా. అంతేకాకుండా, ఈ విభాగంలోనే మొదటిసారిగా దీని టాప్ వేరియంట్లలో QWD డ్యూయల్-మోటార్ ఆల్-వీల్ డ్రైవ్ సాంకేతికతను ఇస్తున్నారు.

ఈ కారు క్యాబిన్ లోపలికి అడుగుపెడితే ఒక సరికొత్త లగ్జరీ ప్రపంచం కనిపిస్తుంది. ఐవరీ మరియు టాన్ కలర్ కాంబినేషన్‌లో ప్రీమియం డ్యూయల్-టోన్ లెథరెట్ సీట్లను ఇందులో అందించారు. డ్యాష్‌బోర్డ్‌పై ప్రధాన ఆకర్షణగా ట్రిపుల్-స్క్రీన్ సెటప్ ఉంటుంది. ఇందులో డ్రైవర్ డిస్‌ప్లే, మెయిన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు సహ-ప్రయాణికుడి కోసం ప్రత్యేకంగా మరో స్క్రీన్‌ను అమర్చారు.

ప్రయాణికుల భద్రత, సౌకర్యం కోసం ఇందులో లెవెల్-2 ADAS , 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 12-స్పీకర్ల JBL ఆడియో సిస్టమ్, మరియు వెంటిలేటెడ్ సీట్లను ఉంచారు. మార్కెట్లో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 20 లక్షల నుండి రూ. 25 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. జూలై 2026 నాటికి రోడ్లపైకి రానున్న ఈ సియెర్రా ఈవీ.. హ్యుందాయ్ క్రెటా ఈవీ, మహీంద్రా BE 6 మరియు మారుతి సుజుకి ఇ-విటారాలకు గట్టి పోటీ ఇవ్వనుంది.

అమ్మాయి, అబ్బాయి కలిసి చేసుకోవచ్చు.. చెమటలు చిందించొచ్చు.. ఇంతకీ ఈ ట్రెండ్ ఏంటో తెలుసా..

Sweat Dating
Sweat Dating

Sweat Dating: సోషల్ మీడియా మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. స్మార్ట్ ఫోన్ తో విడదీయరాని బంధం ఏర్పడింది. అలాంటప్పుడు కొత్త కొత్త బంధాల కోసం మనుషులు ఆరాట పడటంలో తప్పేముంది. పైగా ఇప్పుడు డేటింగ్ కల్చర్ జోరుగా సాగుతుంది. రకరకాల పద్ధతిలో ఈ డేటింగ్ సాగుతూ ఉంది. పైగా రకరకాల యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. దీంతో యువత నచ్చిన వాళ్లతో మెచ్చినంత కాలం ఉండడానికి ఇష్టపడుతోంది.

డేటింగ్ ఒకప్పుడు మెట్రో నగరాలకు మాత్రమే పరిమితమయ్యేది. ఇప్పుడు టైర్ 3 సిటీస్ లో కూడా అందుబాటులోకి వచ్చింది. పైగా యాప్స్ రకరకాల సదుపాయాలు తీసుకురావడంతో డేటింగ్ కల్చర్ దర్జాగా వర్ధిల్లుతోంది. కేవలం వెస్ట్రన్ కంట్రీస్ కు మాత్రమే ఒకప్పుడు ఈ కల్చర్ పరిమితమయ్యేది. మనదేశంలో ఇప్పుడు వందల కోట్ల వ్యాపారంగా మారిపోయింది. యాప్స్.. oyo రూమ్స్.. ఇంకా రకరకాల వాటి చుట్టూ డేటింగ్ తిరుగుతోంది.

డేటింగ్ అంటే ఒకప్పుడు మూవీలకు వెళ్లడం.. రెస్టారెంట్లకు వెళ్లడం.. పార్కులకు వెళ్లడం మాత్రమే అనుకునేవారు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఇవి అద్భుతమైన ప్రదేశాలు అని భావించేవారు. కానీ ఇప్పుడు సరికొత్త కల్చర్ వచ్చేసింది. దానికి నిపుణులు పెట్టిన పేరు స్వెట్ డేటింగ్. అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి కలిసి వర్కౌట్స్ చేయడమే. స్వెట్ డేటింగ్ వల్ల ఒత్తిడి తగ్గుతుంది. కొత్త వ్యక్తితో కలిసి చేస్తున్న పని హాయిని ఇస్తుంది. యాంగ్జైటీ పెరిగిపోయేలా చేస్తుంది. మొహమాటం తగ్గిస్తుంది. అంతేకాదు అలసిపోయినప్పుడు దాపరికాలను దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

డేటింగ్ వెళ్తున్న వారు సాధారణంగా మూడు డిన్నర్ డేట్ లను ఎంచుకుంటారు. కొందరైతే బ్లైండ్ డేట్ కూడా ఇష్టపడతారు. వాటన్నిట్లో దక్కని ఆనందం.. దొరకని సంతృప్తి.. కలగని హాయి ఇందులో లభిస్తుందని నిపుణులు అంటున్నారు. స్వెట్ డేటింగ్ వల్ల శరీరానికి వ్యాయామం లభించడం మాత్రమే కాకుండా.. శారీరక సంతృప్తి కూడా లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.చెమటలు చిందించడం వల్ల శరీరంలో అదనపు కొవ్వులు కరిగిపోతాయి. దేహం కూడా శక్తివంతంగా మారిపోతుంది. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. తెలియని వ్యక్తి సమక్షంలో కసరత్తులు చేస్తుంటే శరీరం కూడా తేలికపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఎనిమిది ఉద్యోగాలు.. ఒక్కతే అమ్మాయి.. అధికారులు ఏం చేశారంటే..

Forest Guard Jobs
Forest Guard Jobs

Forest Guard Jobs: మన దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటన విడుదల చేస్తే పీజీలు, పీహెచ్ డీ లు చేసినవారు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్ట్ కు వందల మంది పోటీపడ్డారు. అనేక రకాల ప్రక్రియల తర్వాత అభ్యర్థులను ఎంపిక చేయడానికి ప్రభుత్వం రాత పరీక్ష నిర్వహించింది.

రాత పరీక్షలో అర్హత సాధించిన వారు తదుపరి పరీక్షలు ఎదుర్కొన్నారు. ఇంకా ఫలితాలు రావాల్సి ఉంది. కానిస్టేబుల్ ఉద్యోగుల కోసమే ఆ స్థాయిలో పోటీ ఉంటే.. ఇక అత్యున్నత స్థాయిలో ఉన్న పోస్టుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పైగా ప్రభుత్వ ఉద్యోగాలు అంటే చాలామందికి విపరీతమైన ఇష్టం. ఎందుకంటే ప్రతి నెలా ఒకటో తేదీన జీతం వస్తుంది. భత్యాలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ప్రతి మూడు నెలలకు ఒకసారి కరువు భత్యం జీతంలో నమోదవుతూ ఉంటుంది. పిఆర్సి అమలు చేస్తే భారీగా వేతనం పెరుగుతుంది. అందువల్లే చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలను సాధించడానికి తాపత్రయపడుతుంటారు.

ప్రభుత్వ ఉద్యోగాలకు విపరీతమైన డిమాండ్ ఉంటున్న నేటి కాలంలో మధ్యప్రదేశ్లో మాత్రం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అక్కడి అటవీశాఖ ఎనిమిది మంది ఫారెస్ట్ గార్డు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో బైగా, భరియా, సహారియా తెగలకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చింది. ఈ పోస్టులకు 26 మంది అర్హత సాధించారు. అయితే శారీరక సామర్థ్య పరీక్షకు కేవలం ఒకే ఒక అమ్మాయి హాజరు కావడం అధికారులకు ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఆ అమ్మాయి ఒక్కతే పదిహేను కిలోమీటర్లు పాటు నడిచి ఉద్యోగాన్ని సాధించింది. మిగతా అభ్యర్థులు రాకపోవడంతో ఏడు పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. పోటీ ఎక్కువ.. పోస్టులు తక్కువగా ఉండడంతో అభ్యర్థులు భయపడి ఇంటర్వ్యూలకు.. పరీక్షలకు రాలేదు. అందువల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. మిగతా ఏడు పోస్టులకు తదుపరి నోటిఫికేషన్ విడుదల చేస్తామని.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎంపిక ప్రక్రియ చేపడతామని అధికారులు అంటున్నారు. పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ.. పోస్టులు తక్కువగా ఉన్నప్పటికీ.. ఎటువంటి భయం లేకుండా ఆ యువతి ముందుకు వచ్చింది. దర్జాగా పరీక్షలు ఎదుర్కొని ఉద్యోగం సాధించింది.

'మీరు అడిగారు..మేము విన్నాము' అంటూ 'ఓజీ 2' పై పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ ట్వీట్..

Pawan Kalyan OG 2
Pawan Kalyan OG 2

Pawan Kalyan OG 2:  సోషల్ మీడియా నేడు పవన్ కళ్యాణ్ అభిమానుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. సాధారణంగానే పవన్ ఫ్యాన్స్ ఫుల్ యాక్టీవ్ గా ఉంటారు , ఇక ఓజీ కి సంబంధించిన అప్డేట్స్ వస్తే సైలెంట్ గా ఉంటారా చెప్పండి?, ఓజీ అనే పేరు తీస్తేనే వాళ్ళ శరీరాల్లో వెయ్యి వోల్టుల ఎనర్జీ పాస్ అవుతుంది. ఇక రీసెంట్ గానే ‘ఓజీ 2’ కి సంబంధించిన చర్చలు మొదలు అయ్యాయి అంటూ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుండి కొన్ని ట్వీట్స్ పడ్డాయి. వాటికే అభిమానులు మెంటలెక్కిపోయారు, ఇక నేడు ఈ చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్ వీడియో ని విడుదల చేశారు.. అభిమానుల ఆనందం వెయ్యి రేట్లు ఎక్కువ అయ్యింది. ఇదంతా పక్కన పెడితే ట్విట్టర్ హిస్టరీ లో పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు తన సినిమాలకు సంబంధించి ఒక్కటంటే ఒక్క ట్వీట్ కూడా వెయ్యలేదు.

కానీ మొదటిసారి ఆయన ‘ఓజీ 2’ గురించి నేడు ట్వీట్ వేశారు. ఈరోజు ఉదయం అప్లోడ్ చేసిన వీడియో ని క్వాట్ చేస్తూ ‘మీరు అడిగారు..మేము విన్నాం.. వెల్కమ్ టు ది ఓజీ యూనివర్స్’ అంటూ ట్వీట్ వేశారు. అంతే ఒక్కసారిగా సోషల్ మీడియా మొత్తం ఊగిపోయింది. స్వయంగా పవన్ కళ్యాణ్ మెయిన్ అకౌంట్ నుండి ట్వీట్ పడడం చూసి , మా పవన్ కళ్యాణ్ అన్నయ్య లో ఇంత మార్పు ఏంటి?, అసలు మనం చూస్తున్నది పవన్ కళ్యాణ్ నేనా? అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్స్ వేశారు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన ట్వీట్ వేసిన వెంటనే వేల సంఖ్యలో లైక్స్ , రీట్వీట్స్ వచ్చాయి. ఇన్ స్టాగ్రామ్ లో అయితే లక్షల్లో లైక్స్ రావడం గమనార్హం. అయితే ఇన్ స్టాగ్రామ్ లో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ కి కేవలం 1 లక్ష ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు.

అయినప్పటికీ కూడా ఉదయం నుండి ఇప్పటి వరకు ఈ వీడియో కి 2 లక్షలకు పైగా లైక్స్ , 20 లక్షలకు పైగా వ్యూస్, 15 వేలకు పైగా రీ పోస్ట్స్ , 60 వేలకు పైగా షేర్స్ వచ్చాయి. తక్కువ ఫాలోవర్లు ఉన్న హ్యాండిల్ నుండి వీడియో వస్తేనే ఈ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందంటే , 40 లక్షల ఫాలోవర్లు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మెయిన్ ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ నుండి ఈ వీడియో వచ్చి ఉండుంటే ఏ రేంజ్ రీచ్ ఉండేదో మీరే ఊహించుకోండి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

జూలై 2025 నుంచి వరుస కార్యక్రమాలు.. తానా మిడ్-అట్లాంటిక్ 40వ ఈవెంట్‌గా ‘నాన్నతో నడక’ విజయవంతం

TANA Father's Day Walk

TANA Father’s Day Walk : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్-అట్లాంటిక్ ప్రాంతం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల పరంపర విజయవంతంగా కొనసాగుతోంది. జూలై 2025 నుంచి నిరంతరాయంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ తెలుగు సమాజాన్ని ఒక్క తాటిపైకి తీసుకువస్తున్న తానా మిడ్-అట్లాంటిక్, తాజాగా తన 40వ కార్యక్రమంగా ‘నాన్నతో నడక’ పేరుతో ప్రత్యేక వేడుకను ఘనంగా నిర్వహించింది.

ఫాదర్స్ డే సందర్భంగా జూన్ 21న పెన్సిల్వేనియాలోని వ్యాలీ ఫోర్జ్ నేషనల్ హిస్టారికల్ పార్క్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమం తండ్రి-పిల్లల అనుబంధానికి ప్రతీకగా నిలిచింది. కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న ప్రతి ఒక్కరికీ తమ నాన్నతో గడిపిన మధుర జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేస్తూ ఈ కార్యక్రమం భావోద్వేగభరితంగా సాగింది.

ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు డా. నరేన్ కొడాలి, తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి, తానా మిడ్-అట్లాంటిక్ రీజినల్ రిప్రజెంటేటివ్ ఫణి కంతేటి, తానా బెనిఫిట్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారి మార్గదర్శకత్వం, ప్రోత్సాహంతో కార్యక్రమం మరింత ఆకర్షణీయంగా సాగింది.

ఈ వేడుకకు ప్రముఖ సినీ నటుడు సుమన్ తల్వార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రతి వ్యక్తి జీవితంలో తండ్రి పాత్ర ఎంత గొప్పదో ఆయన తన ప్రసంగంలో హృదయాన్ని హత్తుకునేలా వివరించారు. అనంతరం తండ్రులు, పిల్లలతో కలిసి ఫోటోలు దిగుతూ అందరితో ఆత్మీయంగా మమేకమయ్యారు.

కార్యక్రమంలో ప్రముఖ కళాకారుడు మిమిక్రీ రమేష్ తన వినోదభరితమైన ప్రదర్శనలు, పాటలతో ప్రేక్షకులను అలరించారు. అలాగే మఖ్దూమ్ సయ్యద్, ఉమాకాంత్ తమ స్ఫూర్తిదాయకమైన సందేశాలతో కుటుంబ విలువలు, తల్లిదండ్రుల పట్ల గౌరవం గురించి మాట్లాడి కార్యక్రమానికి మరింత విలువను తీసుకొచ్చారు.

దాదాపు 200 మందికి పైగా తండ్రులు, పిల్లలు పాల్గొన్న ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో విజయవంతంగా ముగిసింది. కార్యక్రమం నిర్వహణలో కీలక పాత్ర పోషించిన సురేష్ యలమంచికి నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సునీల్ కోగంటి, రంజిత్ మామిడి, శ్రీధర్ సాదినేని, దీప్తి కోక, సంతోష్ రౌతు, చలం పావులూరి, కృష్ణ నందమూరి, విశ్వనాథ్ కోగంటి, ప్రసాద్ కస్తూరి తదితరుల సహకారాన్ని అభినందించారు.

ఈవెంట్ విజయవంతానికి అహర్నిశలు శ్రమించిన వాలంటీర్లకు ‘వాలంటీర్ సర్వీస్ అవర్ సర్టిఫికేట్లు’ అందజేసి వారి సేవలను గుర్తించారు. కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ రుచికరమైన మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, కుటుంబ సభ్యులు కలిసి ఆనందంగా గడిపేలా పలు కార్యకలాపాలు నిర్వహించారు. జూలై 2025 నుంచి వరుసగా 40 కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన తానా మిడ్-అట్లాంటిక్, తెలుగు సంఘానికి సేవ చేయడంలో మరో మైలురాయిని ఈ ‘నాన్నతో నడక’ కార్యక్రమం ద్వారా నమోదు చేసింది.

ఖర్గే తండ్రి కొడుకులపై భూ కబ్జా ఆరోపణలు

mallikarjun-kharge-priyank-kharge

Mallikarjun Kharge :  మల్లిఖార్జున ఖర్గే.. 80 సంవత్సరాల పైబడిన వయో వృద్ధుడు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ఖర్గే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన ఆస్తులు ఎన్ని? ఇవ్వాల ఆయన ఆస్తులు ఎన్ని..? కర్ణాటక రాజకీయాలు తెలిసిన వారు ఎవరైనా ఆయన అత్యంత అవినీతి పరుడని విమర్శలు వినిపిస్తుంటారు. ఆరోపణలు నిర్ధిష్టంగా ఉన్నాయి.

ప్రదీప్ భండారీ.. బీజేపీ అధికార ప్రతినిధి ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. టీవీల్లో మాట్లాడారు. ఒక 5 ఆరోపణలు చేశారు. ఖర్గే , ప్రియాంక్ ఖర్గే (కర్ణాటక హోం మంత్రి) వీరిద్దరూ కలిసి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ‘సిద్ధార్థ్ విహార్ ట్రస్ట్ ’ పేరుతో భూకబ్జాలు చేశారన్నది ఆరోపణ..

ఖర్గే తండ్రి కొడుకులపై భూ కబ్జా ఆరోపణలపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

విజయ్ దేవరకొండ పై ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో కంప్లైంట్.. ? నిర్మాతకు చుక్కలు చూపిస్తున్నాడుగా..

Vijay Deverakonda
Vijay Deverakonda

Vijay Deverakonda: నేటి తరం జెన్ జీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. కెరీర్ లో ఇప్పటి వరకు ఈయన చేసిన సినిమాల్లో సూపర్ హిట్స్ గా నిలిచినవి కేవలం 3 మాత్రమే , కానీ ఫ్యాన్ బేస్ మాత్రం వేరే లెవెల్ లో ఉంది. ముఖ్యంగా జెన్ జీ లేడీస్ అయితే విజయ్ దేవరకొండ పేరు తీస్తేనే పిచ్చెక్కిపోతుంటారు. అందంగా ఉండడమే కాకుండా యాక్టింగ్ కూడా అద్భుతంగా ఉండడం వల్లే విజయ్ దేవరకొండ కి ఎన్ని ఫ్లాప్స్ వచ్చినప్పటికీ క్రేజ్ తగ్గడం లేదు. నిర్మాతలు కూడా విజయ్ దేవరకొండ తో సరైన సినిమా తీస్తే ఇండస్ట్రీ రికార్డ్స్ ని షేక్ చేయొచ్చు అనే నమ్మకం తో ఉన్నారు కాబట్టే , ఆయనతో వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతుల్లో ‘రణబలి’, ‘రౌడీ జనార్ధన’ అనే చిత్రాలు ఉన్నాయి.

ఈ రెండు సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ లో సమాంతరంగా పాల్గొంటూ ఫుల్ బిజీ గా ఉన్నాడు విజయ్ దేవరకొండ. ఇప్పటికే ఈ రెండు సినిమాలకు సంబంధించిన గ్లింప్స్ వీడియోలు కూడా సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అయితే నేడు ఉదయం నుండి ఒక ప్రముఖ వెబ్ సైట్ లో వచ్చిన ఆర్టికల్ సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో చక్కర్లు కొడుతూ , విజయ్ దేవరకొండ పై తీవ్రమైన నెగెటివిటీ ని పెంచేలా చేస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే ‘రణబలి’ ని నిమిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ ని విజయ్ దేవరకొండ టార్చర్ చేస్తున్నాడని , షూటింగ్ లొకేషన్ లో కేవలం ఆయన కోసమే 5 క్యారవాన్ లు ఉపయోగించాలని , అదే విధంగా తన బాగోగులు చూసుకోవడానికి ఏకంగా 40 మంది అసిస్టెంట్లను అడిగాడని , దీంతో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో విజయ్ దేవరకొండ పై ఫిర్యాదు చేయడానికి రెడీ అయ్యిందని , ఇలా పలు రకాల వార్తలు ప్రచారం చేశాయి.

ఇక సోషల్ మీడియా లో విజయ్ దేవరకొండ మరియు నాని అభిమానుల మధ్య ఏ రేంజ్ లో ఫ్యాన్ వార్స్ నడుస్తుంటాయి మన కళ్లారా ప్రతీ రోజు చూస్తూనే ఉన్నాం. ఈ అంశాన్ని పట్టుకొని నాని ఫ్యాన్స్ విజయ్ దేవరకొండ ని ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. పాన్ ఇండియన్ సూపర్ స్టార్స్ గా వెలుగు వెలుగుతున్న ప్రభాస్, అల్లు అర్జున్ , రామ్ చరణ్ లాంటోళ్ళు కూడా ఈ రేంజ్ కోరికలు కోరరు కదా, నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావ్? అంటూ విజయ్ దేవరకొండ ని ట్యాగ్ చేసి పోస్టులు వేస్తున్నారు. అయితే ఆ ఆర్టికల్ బాగా వైరల్ అవ్వడం తో , సదరు వెబ్ సైట్ స్పందించింది. మా సైట్ నుండి ఈ ఆర్టికల్ పడలేదని , ఇది ఫేక్ గా ఎవరో క్రియేట్ చేసారని , త్వరలోనే వాళ్లెవరో కనిపెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని ఒక ట్వీట్ వేశారు.

'మా ఇంటి బంగారం' 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఈ వసూళ్ల సునామీ ఇప్పట్లో ఆగేలా లేదుగా...

Maa Inti Bangaram 6 Days Collections
Maa Inti Bangaram 6 Days Collections

Maa Inti Bangaram 6 Days Collections: లేడీ ఓరియెంటెడ్ సినిమాలు మన టాలీవుడ్ లో దుమ్ము లేపింది చివరిసారిగా ఎప్పుడో గుర్తుందా?, అప్పుడెప్పుడో బాహుబలి సిరీస్ తర్వాత అనుష్క చేసిన ‘భాగమతి’ అనే చిత్రం సూపర్ హిట్ అయ్యిందంతే. ఆ తర్వాత ఎంతో మంది స్టార్ హీరోయిన్లు ఎన్నో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేశారు కానీ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. ఇప్పుడు సమంత ‘మా ఇంటి బంగారం’ చిత్రం తో మరోసారి లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పూర్వ వైభవం తీసుకొచ్చింది. ఆమె ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ ని నెలకొల్పుతూ ముందుకు దూసుకెళ్తోంది. వర్కింగ్ డేస్ లో కూడా ఏ మాత్రం జోరు తగ్గడం లేదు , ఫ్యామిలీ ఆడియన్స్ తో థియేటర్స్ కళకళలాడుతున్నాయి. బాక్స్ ఆఫీస్ వద్ద 6 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం , ప్రాంతాల వారీగా ఎంత గ్రాస్ వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.

ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం ఈ చిత్రానికి 6 వ రోజున తెలుగు రాష్ట్రాల నుండి 1 కోటి 8 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఈ చిత్రానికి 14 కోట్ల కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు , 27 కోట్ల 15 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఒక్క నైజాం ప్రాంతం నుండే ఈ చిత్రానికి 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఆంధ్ర + సీడెడ్ ప్రాంతం నుండి 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా తమిళనాడు నుండి 1 కోటి 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా , కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 3 కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఇక ఓవర్సీస్ నుండి అయితే ఏకంగా 7 కోట్ల 90 లక్షలు రాబట్టింది.

ఈ వీకెండ్ తో ఈ చిత్రం నైజాం మరియు ఓవర్సీస్ మార్కెట్స్ లో చెరో 10 కోట్ల షేర్ మార్కుని కచ్చితంగా దాటుతుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఓవరాల్ గా ఈ చిత్రానికి జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కేవలం 12 కోట్ల రూపాయిల మాత్రమే. ఫుల్ రన్ లో కేవలం నైజాం , ఓవర్సీస్ మార్కెట్స్ నుండే చెరో 12 కోట్ల షేర్ మార్కుని అందుకునేలా ఉంది. బిజినెస్ పరంగా ఈ ఏడాది బయ్యర్స్ కి లాభాల పంట కురిపించింది ఈ చిత్రమే. ఇప్పటి వరకు 14 కోట్ల 32 లక్షల రూపాయిల లాభాలు వచ్చాయి , ఫుల్ రన్ లో ఇంకెంత లాభాలు వస్తాయో చూడాలి.

'పెద్ది' 3 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల్లో మరో కొత్త బెంచ్ మార్క్ ఖాయం..

Peddi OTT
Peddi OTT

Peddi 3 Weeks Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం ఇప్పటికీ థియేటర్స్ లో విజయవంతంగా నడుస్తూ డీసెంట్ షేర్ వసూళ్లను రాబడుతోంది. ఈ వీకెండ్ తో ఈ చిత్రం కచ్చితంగా రెండు ప్రధానమైన మైల్ స్టోన్స్ ని దాటనుంది. అవేమిటంటే వరల్డ్ వైడ్ గా 350 కోట్ల గ్రాస్ మార్క్ , అదే విధంగా తెలుగు రాష్ట్రాల నుండి 150 కోట్ల రూపాయిల షేర్ మార్క్ ని కూడా దాటబోతుంది. ఈ రెండు అరుదైన బెంచ్ మార్క్స్ ని ఇప్పటి వరకు కేవలం కొన్ని సినిమాలు మాత్రమే అందుకున్నాయి , వాటిల్లో ‘పెద్ది’ కూడా చేరిపోవడం అభిమానులకు ఒక విధంగా గర్వ కారణం అని చెప్పొచ్చు. ఒక రూరల్ బ్యాక్ డ్రాప్ సందేశాత్మక చిత్రానికి కమర్షియల్ గా ఇంత వసూళ్లు రావడం అనేది సాధారణమైన విషయం కాదు. 3 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లు వచ్చాయి అనేది ఇప్పుడు చూద్దాం.

నైజాం ప్రాంతం లో ఇప్పటి వరకు ఈ చిత్రానికి 54 కోట్ల 36 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. 16 కోట్ల షేర్ ఓపెనింగ్ తో ఇంత దూరం రావడం చిన్న విషయం కాదు. అదే విధంగా సీడెడ్ ప్రాంతం నుండి 20 కోట్ల 92 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి మరో 3 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది ఈ ప్రాంతంలో. ఇక ఉత్తరాంధ్ర ప్రాంతంలో అయితే ఈ చిత్రానికి ఏకంగా 22 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. సంక్రాంతి సీజన్ లో కూడా వేరే సీజన్ లో ఈ ప్రాంతం నుండి ఈ రేంజ్ షేర్ వసూళ్లు రావడం గమనార్హం. అదే విధంగా ఈస్ట్ గోదావరి నుండి 12 కోట్ల 84 లక్షలు , వెస్ట్ గోదావరి నుండి 9 కోట్ల 7 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

ఇక గుంటూరు జిల్లా నుండి 12 కోట్ల 57 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి , కృష్ణా జిల్లా నుండి 10 కోట్ల 18 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక నెల్లూరు జిల్లా నుండి అయితే మూడు వారాల్లో ఈ చిత్రానికి 5 కోట్ల 83 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 148 కోట్ల 57 లక్షలు , 228 కోట్ల 50 లక్షలు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక నుండి 15 కోట్ల 25 లక్షలు , తమిళనాడు + కేరళ నుండి 2 కోట్ల 40 లక్షలు , హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 12 కోట్ల 15 లక్షలు , ఓవర్సీస్ నుండి 23 కోట్ల 60 లక్షలు రాబట్టింది. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా 202 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు , 344 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

స్ప్లెండర్ బైక్ కనిపిస్తే చాలు.. వీడు అలా మారిపోతాడు.. ఇంతకీ ఏం చేస్తాడో తెలుసా..

Splendor Bike Theft
Splendor Bike Theft

Splendor Bike Theft: సకల కళల్లో చోర కళ కూడా ఒకటి. కాకపోతే ఇది అందరికీ సాధ్యం కాదు. కొంతమంది ఇందులో ఆరి తేరి ఉంటారు. తమ హ్యాండ్ పడితే అంతే చాలు ఉన్నది మొత్తం ఊడ్చేస్తారు. దర్జాగా వెళ్ళిపోతారు. కొందరైతే ఎటువంటి ఆధారాలు వదిలిపెట్టకుండా దర్జాగా దొంగతనాలు చేస్తూ.. ధూమ్ సినిమాలో హృతిక్ రోషన్ లాగా మాయమవుతుంటారు.

మనుషుల్లో రకాలు ఉన్నట్టే.. దొంగల్లో కూడా రకాలు ఉన్నారు. కొందరేమో విలువైన వస్తువులను దొంగతనం చేస్తారు. మరికొందరేమో డబ్బును మాత్రమే ఎత్తుకెళ్తారు. కానీ ఇతడు వారందరి కంటే భిన్నం. ఎందుకంటే ఇతడు చేసే దొంగతనాలు అటువంటివి మరి. చివరికి పోలీసులు ఇతడిని వెతికి మరీ పట్టుకున్నారు. అతడు చేసిన దొంగతనాలు చూసి ఆశ్చర్యపోయారు.

కర్ణాటక రాష్ట్రంలో బళ్లారి నగరంలో సిద్ధారెడ్డి అనే దొంగను ఇటీవల కాలంలో పోలీసులు పట్టు. ఇతడిని స్ప్లెండర్ సిద్ధారెడ్డి అని పిలుస్తుంటారు. అతడు చేస్తున్న దొంగతనాల ద్వారానే ఆ పేరు వచ్చింది. సిద్ధారెడ్డి ఆటోడ్రైవర్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడికి ద్విచక్ర వాహనాలంటే చాలా ఇష్టం. అందులోనూ స్ప్లెండర్ బైక్ లు అంటే మరింత ఇష్టం. ఆ మోడల్ బైకులు కనిపిస్తే చాలు వెంటనే ఇతడి చేతికి దురద పడుతుంది.

ఆ దురద పుట్టిన వెంటనే మరో మాటకు తావు లేకుండా స్పెండర్ బైక్ లను దొంగిలిస్తూ ఉంటాడు. ఆ తర్వాత వాటిని అమ్మేస్తూ ఉంటాడు. బళ్లారి.. విజయనగర.. చిత్రదుర్గ ప్రాంతాల్లో స్ప్లెండర్ బైక్లను ఇతడు దొంగతనం చేశాడు. సైడ్ లాక్ వేసినప్పటికీ వాటిని ఓపెన్ చేసి దొంగలించేవాడు. దొంగిలించిన బైక్లను దర్జాగా విక్రయించేవాడు. ఇతడిని పట్టుకున్న పోలీసులు దాదాపు 41 స్ప్లెండర్ ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ లక్షలలో ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.

స్ప్లెండర్ బైక్ లు అంటే సిద్ధారెడ్డికి చాలా ఇష్టమని.. అందువల్లే అతడు ఈ స్థాయిలో దొంగతనాలు చేశాడని పోలీసులు చెబుతున్నారు. పగటిపూట ఆటో డ్రైవర్గా పనిచేస్తూ రెక్కీ నిర్వహించి.. ఆ తర్వాత స్ప్లెండర్ బైక్ లను అతడు దొంగతనం చేసేవాడు. కొన్ని సందర్భాలలో స్ప్లెండర్ బైక్లను తన ఆటోలో ఎక్కించుకొని వెళ్లిపోయేవాడు. చివరికి ఇతడి దొంగతనాలకు అడ్డుకట్ట వేస్తూ పోలీసులు అరెస్ట్ చేశారు. కటకటాల వెనక్కి పంపించారు.

టికెట్లు మొత్తం అమ్ముడుపోయాయి.. సీట్ల సంఖ్యను పెంచారు.. మన సూర్య వంశీ రేంజ్ అలా ఉంటది మరి

Vaibhav Suryavanshi
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: ఐపీఎల్ లో 15 సంవత్సరాల బుడ్డోడు వైభవ్ సూర్య వంశీ ఎంతటి సంచలనాలను సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హేమా హేమీలైన ప్లేయర్లు ఆడినప్పటికీ సూర్య వంశీ మాత్రమే పరుగుల వరద పారించాడు. సీనియర్ ప్లేయర్లతో పోటీ మరీ సత్తా చూపించాడు. ఏకంగా ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు.. అంతేకాదు అనేక రికార్డులను బద్దలు కొట్టాడు.

ఇటీవల శ్రీలంకలో జరిగిన ట్రై సిరీస్ లో కూడా అదరగొట్టాడు. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బీభత్సంగా బ్యాటింగ్ చేసి.. శ్రీలంక జట్టుకు ట్రోఫీని దూరం చేశాడు. తనను ఎగతాళి చేసిన శ్రీలంక ప్లేయర్లకు గట్టి సమాధానం చెప్పాడు. తద్వారా సూర్య వంశీ తనమీద అంచనాలను మరింత పెంచుకునే విధంగా చేశాడు.

టీమిండియా ప్రస్తుతం ఐర్లాండ్ టూర్ వెళ్ళింది. అక్కడ ఆ జట్టుతో టి20 సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఈ టూర్ కు ఎంపికయ్యాడు వైభవ్ సూర్యవంశీ. ఇది అతడికి డెబ్యు సిరీస్. అతడు ఇటీవలే జట్టు ప్లేయర్లతో కలిసి ఐర్లాండ్ బయలుదేరి వెళ్లిపోయాడు. ఐపీఎల్ లో అదరగొట్టడం.. శ్రీలంక లో జరిగిన ట్రై సిరీస్లో దుమ్ము రేపడంతో సూర్య వంశీ మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో అతడు ఐర్లాండ్ టూర్ లో అదరగొడతాడని అభిమానులు భావిస్తున్నారు.

సూర్య వంశీ గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఐర్లాండ్ తో జరిగే సిరీస్ నేపథ్యంలో టికెట్లు భారీగా అమ్ముడుపోయినట్టు సమాచారం. మొత్తం టికెట్లు అమ్ముడుపోవడం ప్రత్యేకంగా సీట్లను ఏర్పాటు చేయాల్సి వచ్చిందని సోషల్ మీడియాలో కల్పిస్తున్న వార్తల సారాంశం. దీనిపై ఐర్లాండ్ క్రికెట్ బోర్డు ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. జాతీయ మీడియాలో గాని స్పోర్ట్స్ చానల్స్ లో గాని ఎటువంటి వార్తలు దీనికి సంబంధించి ప్రసారం కావడం లేదు. మరోవైపు ఐర్లాండ్ దేశంలో స్థిరపడిన భారతీయులు చాలామంది ఉన్నారు. అలాంటప్పుడు మ్యాచ్ చూసేందుకు వారు భారీగానే వచ్చే అవకాశం ఉంది. టికెట్లు ఈ స్థాయిలో అమ్ముడుపోయాయంటే అందులో ఆశ్చర్యం కనిపించడం లేదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే ఐపీఎల్ జరుగుతున్నప్పుడు.. సూర్య వంశీ ఆడుతున్నప్పుడు మనదేశంలో మైదానాలు ప్రేక్షకులతో కిటకిటలాడాయి. అదే సన్నివేశం ఐర్లాండ్ లో కూడా చోటు చేసుకుంటుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

దురంధర్ తరుముతున్నాడు.. యుగంధర్ వెంటపడుతున్నాడు.. పాపం పాకిస్తాన్

Pakistan Militants
Pakistan Militants

Pakistan Militants: పాకిస్తాన్ దేశంలో దురంధర్ అనే పేరు వినిపిస్తే చాలు అక్కడి పాలకులకు.. ఉగ్రవాదులకు ఉ* కారిపోతుంది. ఆ సినిమా భారత దేశంలో విడుదలై అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. మనదేశంలో కంటే పాకిస్తాన్లో ఎక్కువగా ప్రజలు చూసిన సినిమాగా అది రికార్డు సృష్టించింది. దీనిని బట్టి ఆ సినిమాలో వాస్తవాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. దురంధర్ సినిమాలో చూపించినట్టుగానే పాకిస్థాన్లో సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఉగ్రవాదుల విషయంలో కొంతమంది చేస్తున్న పనులు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

పాకిస్తాన్ లో కొంతకాలంగా ఉగ్రవాదులను గుర్తుతెలియని సాయుధులు కాల్చి చంపేస్తున్నారు. గతంలో ఈ దాడులు ఒక క్రమ పద్ధతి ప్రకారం జరిగితే.. ఇటీవల కాలంలో అవి మరింత పెరిగిపోయాయి. తాజాగా లష్కరే సంబంధించిన ఒక ఉగ్రవాదిని అజ్ఞాత సాయుధ దళాలు చంపేశాయి. అతడు పాకిస్తాన్లో అత్యంత మారుమూల ప్రాంతంలో జీవిస్తున్నాడు. కనీసం ఫోన్ కూడా ఉపయోగించడం లేదు. తనకు సంబంధించిన ఎటువంటి వివరాలు కూడా బయటికి తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. కానీ అజ్ఞాత సాయుధ దళాలు అతడిని చంపేశాయి. హాయ్ చెప్పి.. బాయ్ అంటూ పైకి పంపించాయి.

ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఐ ఎస్ ఐ కార్యకలాపాలకు పాల్పడుతున్న ఒక ఉగ్రవాది విషయంలో కూడా ఇలాంటి పనిని అజ్ఞాత సాయుధ దళాలు చేశాయి.. అతడిని చంపడం మాత్రమే కాకుండా.. అతని కుటుంబాన్ని కూడా కనిపించకుండా చేశాయి. ఆ తర్వాత కరాచీలో ఉంటూ లష్కరే ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్న ఒక వ్యక్తి విషయంలో కూడా అజ్ఞాత సాయుధ దళాలు ఇదేవిధంగా ప్రవర్తించాయి. అతడిని కూడా కాల్చి చంపేసాయి. వాస్తవానికి ఇటీవల కాలంలో ఉగ్రవాదులను చంపడం పాకిస్తాన్ దేశంలో కొత్త కాకపోయినప్పటికీ.. భారతదేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తున్న వారందరి పైన దాడులు జరుగుతున్నాయి. అరుదైన సందర్భాల్లోనే ఉగ్రవాదులకు గాయాలవుతున్నాయి. వారు చికిత్స పొంది.. ప్రాణాలు కాపాడుకున్నప్పటికీ.. వారు ఊహించని విధంగా గాలిలో కలిసిపోతున్నారు.

పాకిస్తాన్ లో దురంధర్ ఆపరేషన్లు దర్జాగా సాగుతుండగా.. ఈ ఆపరేషన్ల వెనుక యుగంధర్ లు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆ దురంధర్ ఎవరు.. దురంధర్ ను నడిపిస్తున్న యుగంధర్ ఎవరు.. అనేది అందరికీ తెలుసు. కానీ బయటికి చెప్పలేరు. మరోవైపు మనదేశంలో కూడా మీడియా ఉగ్రవాదులు చనిపోయిన వార్తలను రాయదు. కొన్ని మీడియా సంస్థలు మాత్రమే ఈ వార్తలను రాసి రాయినట్టుగా రాస్తున్నాయి. వేసి వేయనట్టుగా వేస్తున్నాయి.

అల్లు అర్జున్ రికార్డు మీద కన్నేసిన ఎన్టీఆర్...

Allu Arjun
Allu Arjun

Allu Arjun: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల హవా ఎక్కువగా కొనసాగుతుంది. టైర్ వన్ హీరోలు పాన్ ఇండియాలో తమ సత్తా చాటుతున్నారు. ఇక ఈ క్రమంలోనే ఎలాగైనా సరే ఇండస్ట్రీ లో భారీ రికార్డులను బ్రేక్ చేయాలని టైర్ వన్ హీరోలందరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్, అల్లు అర్జున్ లు పాన్ ఇండియాలో పెను సంచలనాలను క్రియేట్ చేశారు. వీళ్లిద్దరు దాదాపు 2000 కోట్ల వరకు కలెక్షన్స్ ను కొల్లగొట్టే సినిమాలను చేశారు. ఇక మిగతా హీరోలు సైతం వాళ్ళ బాటలోనే నడుస్తున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ రికార్డును బ్రేక్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్ 1850 కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొట్టాడు. ఇక అదే రీతిలో ఇప్పుడు డ్రాగన్ సినిమాతో ఎన్టీఆర్ ఆ రికార్డు ను బ్రేక్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.

నిజంగానే ఎన్టీఆర్ అనుకున్నట్టుగా ఆ రికార్డును బ్రేక్ చేస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎన్టీఆర్ ఆ రికార్డును బ్రేక్ చేయడం అసాధ్యమనే చెప్పాలి. పుష్ప సినిమా సూపర్ సక్సెస్ అయిన తర్వాత పుష్ప 2 సినిమాకి భారీ బజ్ క్రియేట్ అయింది. ఆ బజ్ వల్లే సినిమాని ప్రేక్షకులుగా రిపీట్ గా చూశారు. ప్రీమియర్ షోలకి అత్యధికంగా డబ్బులు వెచ్చించి సినిమాని చూడడం వల్ల ఆ రేంజ్ లో కలెక్షన్స్ వచ్చాయి. కానీ డ్రాగన్ సినిమా మీద ప్రస్తుతానికైతే పెద్దగా బజ్ లేదు.

ఇక దానికి తోడుగా ఎన్టీఆర్ కి అంత మంచి మార్కెట్ లేదు. ‘దేవర’ సినిమాతో 600 కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొట్టిన ఆయన ‘వార్ 2’ సినిమాతో ఏ మాత్రం సత్తా చూపించలేకపోయాడు. ఇక ఇప్పుడు డైరెక్టుగా 1850 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టడం అనేది అంత ఆషామాషి వ్యవహారమైతే కాదు…

మరి ఎన్టీఆర్ ఏ ధైర్యంతో ఉన్నాడు సినిమా అద్భుతంగా వచ్చిందా? దాన్ని బేస్ చేసుకొని ఎన్టీఆర్ అల్లు అర్జున్ రికార్డును బ్రేక్ చేయబోతున్నాను అంటూ తన సన్నిహితుల దగ్గర చెబుతున్నాడా అసలు ఏం జరగుతుంది అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

ఫ్యూచర్ లో మహేష్ బాబు ను అందుకోవడం ఎవరి వల్ల కాదా...

Mahesh Babu
Mahesh Babu

Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు మహేష్ బాబు… ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఆయన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇక మీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా ఆయన చాలా వరకు కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక వారణాసి సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న ఆయన ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తున్న మహేష్ బాబు వారణాసి సినిమాతో మాత్రం ప్రపంచ స్థాయి ప్రేక్షకులను అలరించాలని చూస్తున్నాడు.

ఈ సినిమాతో ఆయన 3000 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొట్టినట్లయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలెవరు అతన్ని టచ్ చేసే రేంజ్ కి కూడా వెళ్లలేరు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోలు సైతం మహేష్ బాబు ను టచ్ చేయడానికి కూడా సరిపోరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు ఈ సినిమాతో ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తాడు.

దర్శక ధీరుడు రాజమౌళి మహేష్ బాబుకి ఎలాంటి సక్సెస్ ని కట్టబెడతాడు అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే మహేష్ బాబు చేస్తున్న ఈ సినిమా అతని కెరియర్ ను మార్చేస్తుందని హాలీవుడ్ దర్శకులు సైతం ప్రస్తుతం మహేష్ బాబు కోసం ఎదురుచూస్తున్నారు అంటూ కొన్ని కథనాలైతే వెలువడుతున్నాయి.

ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు తన కటౌట్ కి తగ్గట్టుగానే భారీ కలెక్షన్స్ రాబట్టగలిగితే మాత్రం సినిమా ఇండస్ట్రీలో అతనికి తిరుగుండదనే చెప్పాలి… మొత్తానికి అయితే మహేష్ బాబు ఇప్పటివరకు ఒక పాన్ ఇండియా సినిమా చేయకపోయిన కూడా రాజమౌళి వల్ల పాన్ వరల్డ్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుండడం అలాగే తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ఉండడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…