Homeఎంటర్టైన్మెంట్Anil Ravipudi: అనిల్ రావిపూడి 'దుర్యోధన' సబ్జెక్ట్ ను ఆ హీరో తో చేయాలనుకుంటున్నాడా..?

Anil Ravipudi: అనిల్ రావిపూడి ‘దుర్యోధన’ సబ్జెక్ట్ ను ఆ హీరో తో చేయాలనుకుంటున్నాడా..?

Anil Ravipudi: ఇప్పటివరకు కమర్షియల్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన అనిల్ రావిపూడి ఫ్యూచర్ లో మాత్రం ఒక డిఫరెంట్ సబ్జెక్టుని చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. దానికోసమే ‘దుర్యోధన’ అనే ఒక టైటిల్ తో ఒక భారీ కాన్సెప్ట్ రెడీ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మహాభారతంలోని దుర్యోధనుడి పాత్రను బేస్ చేసుకొని ఒక సబ్జెక్ట్ ను డిజైన్ చేశారట. అయితే ఈ సినిమాని పాన్ ఇండియాలో చేయాలని అనుకున్నాడట. అయితే ఈ మూవీ ఎప్పుడు చేస్తాను అనే విషయంలో అతనికి […]

Anil Ravipudi: ఇప్పటివరకు కమర్షియల్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన అనిల్ రావిపూడి ఫ్యూచర్ లో మాత్రం ఒక డిఫరెంట్ సబ్జెక్టుని చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. దానికోసమే ‘దుర్యోధన’ అనే ఒక టైటిల్ తో ఒక భారీ కాన్సెప్ట్ రెడీ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మహాభారతంలోని దుర్యోధనుడి పాత్రను బేస్ చేసుకొని ఒక సబ్జెక్ట్ ను డిజైన్ చేశారట. అయితే ఈ సినిమాని పాన్ ఇండియాలో చేయాలని అనుకున్నాడట. అయితే ఈ మూవీ ఎప్పుడు చేస్తాను అనే విషయంలో అతనికి క్లారిటి లేదని చెబుతున్నాడట. ఇక మొత్తానికైతే ఇది తన డ్రీమ్ ప్రాజెక్టుగా భావిస్తున్నాడట. ఈ సినిమా అయితే పెద్ద ఎత్తున చేస్తానని తన సన్నిహితుల దగ్గర చెబుతున్నాడట. అయితే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ని హీరోగా పెట్టుకుంటే బాగుంటుందనే ఆలోచనలో ఇప్పుడు ఉన్నారట.

కానీ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియాలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. కాబట్టి అనిల్ రావిపూడి ఇప్పటికే డేట్స్ ఇచ్చే అవకాశాలైతే లేవు. నిజానికి ఈ సినిమాని ఇప్పుడు చేయడం లేదు. మరో రెండు మూడు సంవత్సరాల తర్వాత ఆ సినిమా లైన్ లోకి తెచ్చే అవకాశాలైతే ఉన్నాయి.

కాబట్టి అప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ కు తగ్గట్టుగా అనిల్ పాన్ ఇండియాలో తన మార్కెట్ బిల్డ్ చేసుకోగలిగితే తప్పకుండా జూనియర్ ఎన్టీఆర్ అతనికి డేట్స్ అయితే ఇస్తాడు. దాన్ని మనసులో పెట్టుకొని అనిల్ రావిపూడి రాబోయే సినిమాలతో మరింత మంచి కథలను చేసి ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.

ప్రస్తుతం వెంకటేష్ – కళ్యాణ్ రామ్ లతో మల్టీ స్టారర్ సినిమాను చేస్తున్నాడు. ఈ మూవీ కూడా తెలుగుకే పరిమితమైనప్పటికి ఆ తర్వాత ఒక భారీ పాన్ ఇండియా సినిమాని చేసి ఆ తదుపరి దుర్యోధన సబ్జెక్టుని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారట. ఇక అని రాబోయే రోజుల్లో ఈ హీరోతో సినిమాలు చేస్తాడు ఏ రేంజ్ లో అలరిస్తాడు. సగటు ప్రేక్షకులను మెప్పించగలిగే కెపాసిటి సినిమాలకు ఉంటుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper