Homeజాతీయ వార్తలుCM Vijay: సీఎం అయినా విజయ్ కి తప్పని అవమానాలు.. ఇబ్బందులు..

CM Vijay: సీఎం అయినా విజయ్ కి తప్పని అవమానాలు.. ఇబ్బందులు..

CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కి అవమానాల కొత్తకాదు. ఇబ్బందులు కూడా కొత్త కాదు. తన సినీ కెరియర్ మొదలుపెట్టిన తొలి రోజుల్లోనూ విజయ్ తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. వరుసగా వైఫల్యాలు.. అతని ముఖం రంగు.. హావ భావాలు.. ఇలా ప్రతి విషయంలోనూ ఆయన ఇబ్బంది పడ్డారు. చివరికి తనను తాను మలుచుకొని.. గొప్పగా ఎదిగారు. తమిళనాడు చిత్ర పరిశ్రమలోని ఎక్కువ అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న కథానాయకుడిగా నిలిచారు. ఇప్పుడు ఏకంగా తమిళనాడు రాష్ట్రానికి […]

CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కి అవమానాల కొత్తకాదు. ఇబ్బందులు కూడా కొత్త కాదు. తన సినీ కెరియర్ మొదలుపెట్టిన తొలి రోజుల్లోనూ విజయ్ తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. వరుసగా వైఫల్యాలు.. అతని ముఖం రంగు.. హావ భావాలు.. ఇలా ప్రతి విషయంలోనూ ఆయన ఇబ్బంది పడ్డారు. చివరికి తనను తాను మలుచుకొని.. గొప్పగా ఎదిగారు. తమిళనాడు చిత్ర పరిశ్రమలోని ఎక్కువ అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న కథానాయకుడిగా నిలిచారు. ఇప్పుడు ఏకంగా తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.

విజయ్ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఇబ్బందులు తప్పడం లేదు. అదేంటి.. ముఖ్యమంత్రి అయ్యాక విజయ్ చెప్పింది వేదం కదా.. ఆయన అన్నదే శాసనం కదా.. అలాంటప్పుడు ఆయనకు ఇబ్బందులు ఏముంటాయి. ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముంది.. పైగా విజయ్ భారీగా డబ్బు సంపాదించిన వ్యక్తి. తమిళనాడు ఆర్థికంగా బలమైన రాష్ట్రం.. అలాంటప్పుడు ఆయనకు ఇబ్బందులు ఏముంటాయి.. నచ్చిన ప్రేయసి త్రిష కూడా ఆయన వెంట ఉంది కదా.. అని మీరు అనుకోవచ్చు. కానీ విజయ్ కి ఉన్న ఇబ్బందులను ఆమె తల్లి శోభ వెల్లడించారు.

ఇటీవల కాలంలో విజయ్ ని ఉద్దేశించి ఉదయనిది స్టాలిన్ దారుణంగా మాట్లాడుతున్నారు. వ్యక్తిగత విషయాలను కూడా రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారు.. చివరికి కోర్టు వ్యవహారాలు.. విడాకుల సంగతులు అంటూ మాట్లాడుతున్నారు. అది విజయ్ ని తీవ్రమైన కలవరపాటుకు గురి చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో విజయ్ ఎవరిని కూడా విమర్శించలేదు. దారుణంగా మాట్లాడలేదు. అంతటి ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన కేవలం తన పార్టీ విధానాలు.. అధికారంలోకి ఏం చేస్తాం అనే విషయాలను మాత్రమే ప్రకటించారు.

తాజాగా విజయ్ గురించి.. అతడు పడుతున్న ఇబ్బందుల గురించి తల్లి శోభ బయటకు చెప్పారు..” పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత విజయ్ ఏ రోజు కూడా సరిగా నిద్రపోలేదు. ఎన్నో రకాల విమర్శలు.. అవమానాలు ఎదుర్కొన్నాడు. అవన్నీ చూస్తూ మౌనంగానే ఉన్నాడు. తన పని తాను చేసుకుంటూ పోయాడు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మా కుటుంబ సభ్యులు తీవ్రంగా బాధపడ్డారు. కొన్ని సందర్భాలలో విజయ్ కి చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ.. అతడు అప్పుడు కూడా మౌనంగానే ఉన్నాడు. ప్రతికూల భావనలను.. ప్రతికూల పరిస్థితులను అతడు సానుకూలంగా మార్చుకున్నాడు. ఫలితంగా ముందుకు సాగాడు. అందువల్లే అతడు ఈ స్థాయిలో ఉన్నాడని” అతడి తల్లి శోభ ఇటీవల చెప్పారు. ఈ ప్రకారం విజయ్ కేవలం ఒక టర్మ్ మాత్రమే కాదు.. తమిళనాడు రాజ్యాన్ని చాలా సంవత్సరాల పాటు ఏలెందుకే రాజకీయాలలోకి వచ్చినట్టు అర్థమవుతోందని విశ్లేషకులు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper