Home Blog Page 52

'లెనిన్' బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎంత గ్రాస్ రావాలో తెలుసా.. బయ్యర్స్ పెద్ద సాహసమే చేశారు..

Lenin Movie
Lenin Movie

Lenin Movie: అక్కినేని అఖిల్ కెరీర్ లో ‘లెనిన్’ చిత్రం ఎంతో ప్రత్యేకం. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని , ఈసారి ఎలా అయినా సూపర్ హిట్ కొట్టాలి అనే కసితో ఈ చిత్రాన్ని చేశాడు . ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఇన్నేళ్లు అయినప్పటికీ కూడా , ఇప్పటికీ సరైన హిట్ లేకపోవడం తో , అక్కినేని అభిమానులు అఖిల్ పట్ల తీవ్రమైన అసంతృప్తి తో ఉన్నారు. పాపం ప్రతీ సినిమాకు అఖిల్ ప్రాణం పెట్టి పని చేస్తున్నారు , కానీ ఫలితం మాత్రం దక్కడం లేదు అనే భావన కేవలం అక్కినేని ఫ్యాన్స్ లోనే కాదు, ఇతర హీరోల అభిమానుల్లో కూడా ఉంది. అందుకే తప్పుల నుండి అఖిల్ చాలా నేర్చుకున్నారని , ఈసారి ఆయన టార్గెట్ మిస్ అయ్యే అవకాశం లేదని అక్కినేని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. కేవలం వాళ్ళు మాత్రమే కాదు , ట్రేడ్ కూడా అఖిల్ ని ఈసారి గట్టిగానే నమ్ముతోంది.

అందుకే తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ ని జరుపుకుంటుంది ఈ చిత్రం. కేవలం ఒక్క కోస్తాంధ్ర ప్రాంతం లోనే ఈ చిత్రానికి 10 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ‘ఏజెంట్’ లాంటి దారుణమైన డిజాస్టర్ తర్వాత ఈ రేంజ్ బిజినెస్ జరగడం అనేది చిన్న విషయం కాదు. ఇక నైజాం , సీడెడ్ ప్రాంతాలకు కలిపి కచ్చితంగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల నుండే 22 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరుపుకునే అవకాశాలు ఉన్నాయని , ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 30 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ట్రెండ్ నడుస్తుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. కెరీర్ మొత్తం మీద ఒక్క హిట్ సరైనది లేదు, గత చిత్రం ఆల్ట్రా డిజాస్టర్, అయినప్పటికీ ఈ రేంజ్ బిజినెస్ జరిగిందంటే , అఖిల్ ని ఈసారి ట్రేడ్ చాలా గట్టిగా నమ్ముతుందని అర్థం.

ఇప్పటి వరకు విడుదలైన ప్రీ రిలీజ్ ప్రొమోషనల్ కంటెంట్ కి ఆడియన్స్ నుండి , ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక అఖిల్ తండ్రి నాగార్జున ఈ చిత్రాన్ని చూసి పుత్రోత్సాహం తో మురిసిపోతున్నారు. చూస్తుంటే అఖిల్ ఈసారి గట్టిగానే కొట్టేలా ఉన్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉండుంటే ఈ చిత్రం విడుదలై నేటికి నాలుగు రోజులు అయ్యుండేది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పర్ఫెక్షన్ కోసం జులై 10 కి వాయిదా వేశారు. మరి అఖిల్ ఈసారైనా అంచనాలను అందుకుంటాడా లేదా అనేది చూడాలి.

బాలీవుడ్ నటుడితో తెలుగు అమ్మాయి ఘాటు రొమాన్స్.. ప్రేమలో పడ్డారా...

Kavya NM
Kavya NM

Kavya NM: సినిమా ఇండస్ట్రీలో ఉండే నటీనటుల మధ్య ఫ్రెండ్షిప్ అనేది ఉంటుంది. ఎందుకంటే వాళ్లు సినిమాల్లో నటిస్తూనే ఒకరికొకరు పరిచయం చేసుకొని ఎవరు ఎలాంటి సినిమాలు చేస్తున్నారు. ఫ్యూచర్లో ఎవరు ఎలా ముందుకు వెళ్లాలనుకుంటున్నారు అనే విషయాలను పంచుకుంటారు. అలాగే సినిమా షూటింగ్లో కలిసి నటిస్తుంటారు. కాబట్టి వాళ్ళ మధ్య మంచి ఫ్రెండ్షిప్ కుదురుతుంది. ఆ ఫ్రెండ్షిప్ ప్రేమగా మారి నటీనటులు పెళ్లి చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగమ్మాయిగా మంచి గుర్తింపును సంపాదించుకొని యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ గా పేరు తెచ్చుకున్న కావ్య ఎన్ ఎమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం కావ్య ప్రముఖ బాలీవుడ్ నటుడు అయిన రాఘవ జుయల్ తో కొద్ది రోజులుగా రిలేషన్షిప్ లో ఉంటుంది ఏంటి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. దీనిమీద వాళ్ళిద్దరిలో ఎవరు కూడా అధికారిక ప్రకటన ఇవ్వకపోయిన కూడా రీసెంట్ గా వాళ్ళిద్దరూ క్లోజ్ గా దిగిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది… వాళ్ళిద్దరూ అంత క్లోజ్ గా ఉన్న ఫోటో బయటకి వచ్చింది అంటే కచ్చితంగా వాళ్ళిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారు అంటూ నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. ఇక ఆ ఫోటోకి రెడ్ హార్ట్ సింబల్ ని జోడించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ప్రతి ఒక్కరూ వాళ్లకు కంగ్రాట్స్ చెప్తున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా వీరిద్దరి జంట చూడ ముచ్చటగా ఉందని మరి కొంతమంది కామెంట్లు చేస్తుండటం విశేషం…ఇక రాఘవ్ జుయల్ ఇంతకుముందు ‘కిల్’ సినిమాలో నటించి ప్రేక్షకులందరికి దగ్గరయ్యాడు. ప్రస్తుతం నాని హీరోగా చేస్తున్న ప్యారడైజ్ సినిమాలో విలన్ గా నటిస్తుండడం విశేషం…

తను అనుకున్నట్టుగానే ఈ సినిమాలో విలన్ గా తన పాత్రని ఏ రేంజ్ లో పోషిస్తాడు ప్రేక్షకులందరి చేత శభాష్ అనిపించుకుంటాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలకు కమిట్ అయినట్టుగా తెలుస్తుంది. మరి ఆయన నుంచి వచ్చే సినిమాల విషయంలో తను చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు.

కొంచెం కూడా నిర్లక్ష్యం వహించకుండా ఖచ్చితంగా సక్సెస్ ఫుల్ సినిమాలను మాత్రమే చేయాలని తనకు గుర్తింపు వచ్చే క్యారెక్టర్లలో మాత్రమే నటించాలని ఆయన ఏరీ కోరి మరి క్యారెక్టర్స్ ని ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తుంది. మరి కావ్య ఎన్ ఎమ్ ను ప్రేమిస్తున్నాడా? లేదంటే రిలేషన్ షిప్ లో ఉన్నారా అనే విషయాన్ని ఆఫీషియల్ గా అనౌన్స్ చేస్తే బాగుంటుందని మరి కొంతమంది అతని అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు…

తన పక్కన పడుకోవచ్చు.. టచ్ చేయకూడదు.. నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..

Monique Jeremiah
Monique Jeremiah

Monique Jeremiah: దూకుడు సినిమాలో అసలు మీద వడ్డీ.. వడ్డీ మీద చక్రవడ్డీ.. చక్రవడ్డీ మీద విష్ణు చక్రవడ్డీ.. వసూలు చేస్తూనే ఉంటాను. ఇది వ్యాపారం.. అని బ్రహ్మానందం అంటుంటాడు గుర్తుందా.. ఈ ప్రపంచంలో వ్యాపారం అనేది అనేక రకాలు. మనిషి అవసరాలను బట్టి వ్యాపారం సాగుతూ ఉంటుంది. ఆ వ్యాపారాన్ని చాలామంది రకరకాలుగా సాగిస్తూ ఉంటారు. అందులో ఈమె చేస్తున్న వ్యాపారం మాత్రం అన్నిటికంటే భిన్నం. ఇలా కూడా చేస్తారా.. ఇలా కూడా ఆలోచిస్తారా అని చాలామంది అనుకోవడమే కాదు.. ఆశ్చర్యపోతున్నారు.

ఆమె పేరు మోనిక్ జెరీమియా వయసు 37 సంవత్సరాల వరకు ఉంటుంది. ఉండేది కెనడా దేశంలో. ఈమెకు గతంలోనే వివాహం జరిగింది. కొంతకాలం పాటు వైవాహిక జీవితం సజావుగానే సాగింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. మొదట్లో కాస్త సర్దుకున్నప్పటికీ.. అవి మరింత పెరిగిపోయాయి. దీంతో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. దీనికి తోడు కరోనా సోకడంతో అప్పుడు పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. ఆమె ఉపాధి కోసం రకరకాల మార్గాలను అన్వేషించింది. చివరికి ఒక కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టింది..

జెరీమియా ఉన్నత విద్యావంతురాలు కావడంతో విచిత్రంగా ఆలోచించింది. తను పడుకునే పడకలో సగభాగాన్ని అద్దెకు ఇవ్వడం మొదలుపెట్టింది. ఇలా సంపాదించడం ప్రారంభించింది. అయితే దీనికోసం ఒక షరతు కూడా పెట్టింది. తన పక్కన పడుకోవాలని.. టచ్ చేయకూడదు.. పైగా రెంట్ కూడా నార్మల్ ధరలోనే ఉండడంతో.. ఆమె ఆఫర్ చాలా మందికి నచ్చింది. ఫలితంగా ఆమె పక్కన పడుకోడానికి చాలామంది ముందుకు వచ్చారు. దీంతో ఆదాయం అదిరిపోయింది. ప్రతినెల ఇలా 50 వేల వరకు ఆమె సంపాదిస్తోంది.

తన పక్కన పడుకున్నప్పటికీ టచ్ చేయకూడదని ఆమె షరతు విధించడంతో.. దానికి చాలామంది లోబడి వచ్చారు. అందమైన అమ్మాయి.. పక్కనే అవకాశం కల్పించడంతో చాలామంది యువకులు పడుకోడానికి క్యూ కట్టారు. ఫలితంగా ఆమె ఆదాయం నెలకు 50000 వరకు జరిగింది. పైసా ఖర్చు లేకుండా.. రూపాయి పెట్టుబడి లేకుండా ఆమె ఇలా సంపాదించింది. మనదేశంలో ఇలాంటి విధానం లేకపోయినప్పటికీ.. విదేశాలలో ఇటువంటి విధానాలు కామన్. వీటిని అక్కడి ప్రజలు హాట్ బెడ్డింగ్ అని పిలుస్తుంటారు.

లోహ్ గడ్ కోట కిటకిట.. సియా పాయింట్ కోసం తహతహ.. ఇలా ఉన్నారేంట్రా బాబూ..

Lohagad Fort
Lohagad Fort

Lohagad Fort: మహారాష్ట్రలో పూణేకు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోహ్ గడ్ కోట చారిత్రాత్మకమైన ప్రాంతం. ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి చాలామంది పర్యటకులు వస్తూనే ఉంటారు. ఈ కోట అత్యంత పురాతనమైనది. ఇక్కడి ప్రాంతాలు అందంగా ఉంటాయి. గత చరిత్రను కళ్ళ ముందు ఉంచుతాయి. కానీ.. ఈ కోటను సందర్శించడానికి ఇటీవల కాలంలో పర్యాటకులు ఆసక్తిని చూపిస్తున్నారు. ఆ పర్యటకుల సంఖ్య ఇటీవల కాలంలో పెరిగింది. దీనికి కారణం ఒకే ఒక్క యువతి.

ఇటీవల లోహ్ గడ్ కోట లోయలో కేతన్ అనే వ్యాపారి పడి చనిపోయిన విషయం తెలిసిందే. అతడిని చంపిన ఘటనలో కాబోయే భార్య సియా, అతడి ప్రియుడు చేతన్ ముఖ్యపాత్ర పోషించారు. అతడిని చంపడానికి వారిద్దరు అనేక రకాలుగా ప్రణాళికలు రూపొందించారు. చివరికి చంపేసి తమకు అడ్డు లేకుండా చూసుకున్నారు. కానీ చట్టం అనేది ఒకటుంటుందని.. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేసి అదుపులోకి తీసుకుంటారని వారు ఊహించలేకపోయారు. చివరికి పోలీసులకు దొరికిపోయి జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తినే పద్యంలో ఈ కోటను సందర్శించడానికి పర్యాటకులు పెరిగిపోయారు. గతంతో పోల్చి చూస్తే 25% మంది పర్యాటకులు పెరగారని తెలుస్తోంది.. అంతేకాదు, ఈ కోట చివరి అంచు ప్రాంతంలోకి సియా ఎక్కడినుంచి కేతన్ ను నెట్టివేసిందో తెలుసుకోవడానికి పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారు. కేతన్ ను నెట్టి వేసిన ప్రాంతాన్ని సియా పాయింట్ గా అభి వర్ణించారు. అ పాయింట్ ను సందర్శించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారు.

ఒకప్పుడు ఒక హత్య జరిగితే ఆ ప్రాంతం వద్దకు వెళ్లాలంటే ప్రజలు భయపడేవారు. అక్కడ ఏమైనా ప్రతీప శక్తులు ఉంటాయేమోనని ఆందోళన చెందేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పైగా ఆ సంఘటన గురించి తెలుసుకోవడానికి.. ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి.. పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఎంతైనా నేటి సోషల్ మీడియా కాలంలో మనుషులు పూర్తిగా మారిపోయారు.

షాపులు తెరవడమే ఆలస్యం.. అందినకాడికి ఏసీలు ఎత్తుకుపోతున్నారు.. అక్కడ ఎందుకిలా. ఏం జరుగుతోంది..

France Heatwave
France Heatwave

France Heatwave: అది శీతల దేశం. మహా అయితే ఉష్ణోగ్రత 25 డిగ్రీలకు మించిపోదు. ఎండాకాలంలో కూడా అక్కడ ఉష్ణోగ్రత 25 డిగ్రీల లోపు ఉంటుంది.. అక్కడ సాధారణంగా ఏసీల వినియోగం కూడా అంతగా ఉండదు. చుట్టూ దట్టమైన కొండలు.. అంత ఎత్తున ఉండే వృక్షాలు ఆ దేశాన్ని సరికొత్తగా చూపిస్తుంటాయి. ఆ దేశాన్ని సందర్శించడానికి ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు ఆసక్తి చూపిస్తుంటారు. పైగా ఆ ప్రాంతంలో చలిని తట్టుకోవడానికి ప్రత్యేకంగా గీజర్లు ఉంటాయి. అయితే అటువంటి ఆ శీతల దేశంలో పరిస్థితి మారిపోయింది. ఎంతలా అంటే.. యావత్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూసేలా..

ఫ్రాన్స్ పేరు చెబితే ప్రపంచానికి ఫ్యాషన్ గుర్తుకొస్తుంది. అక్కడ ప్రతిరోజు ఫ్యాషన్ పోటీలు జరుగుతూనే ఉంటాయి. ప్రఖ్యాత ఈఫిల్ టవర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ మహా అయితే ఉష్ణోగ్రత 25° మించదు. కానీ ఇప్పుడు ఫ్రాన్స్ దేశం నిప్పుల కొలిమి మీద ఉంది. ఎండవేడికి తట్టుకోలేక అక్కడి ప్రజలు చుక్కలు చూస్తున్నారు. ఎండ వేడిమి నుంచి కాపాడుకోవడానికి సముద్ర తీర ప్రాంతాలకు వెళ్తున్నారు. సాయంత్రమైతే చాలు బీచ్ లలో సేద తీరుతున్నారు.. వాస్తవానికి అక్కడ ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అక్కడి ప్రజలు కలలో కూడా ఊహించలేదు.. ఎండ వేడిమి ఈ స్థాయిలో ఇబ్బంది పెడుతుంటే తమకు ఇంట్లో ఉండాలని కూడా అనిపించడం లేదని అక్కడ ప్రజలు అంటున్నారంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అక్కడ ఎండ వేడిమి అలా పెరిగిపోవడానికి ప్రధాన కారణం ఒమేగా ఎఫెక్ట్. పసిఫిక్ సముద్రంలో ఏర్పడిన ఎల్ నీనో వల్ల అక్కడ ఒమేగా ఎఫెక్ట్ చోటుచేసుకుంది. దీనికి తోడు అక్కడి వాతావరణం లో మార్పులు కూడా అనూహ్యంగా ఉంటున్నాయి.. ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో అక్కడ ప్రజలు ఏసీలు కొనుగోలు చేయడానికి పోటీ పడుతున్నారు. గతంలో ఎన్నడు లేనివిధంగా అక్కడ ఏసీల కొనుగోళ్లు పెరిగిపోయాయి. షాపులు ఓపెన్ చేయడమే ఆలస్యం.. ఏసీలు కొనుగోలు చేసేందుకు అక్కడి ప్రజలు పోటీ పడుతున్నారు. ఇటీవల ఫ్రాన్స్ లో చాబర్ అనే ప్రాంతంలో ఓ షాపు ఓపెన్ చేయగానే అందులోకి ప్రజలు భారీగా వచ్చారు. ఏసీలు కొనుగోలు చేశారు. కూరగాయలు.. ఉల్లిపాయలు కొనుగోలు చేసినట్టు ఏసీలను కొనుక్కున్నారు. అలా ప్రజలు ఏసీలు కొనుగోలు చేయడం అక్కడ పరిస్థితిని తేట తెల్లం చేస్తోందని నెటిజన్లు అంటున్నారు.

ఎండ వేడి పెరిగిపోవడంతో చల్లదనం కోసం ప్రజలు తాపత్రయపడుతున్నారు
. అందువల్ల ఇలా ఏసీలను కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఏసీలను కొనుగోలు చేసేవారి సంఖ్య అక్కడ పెరిగిపోయింది. అందువల్లే అన్ని షాపులు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. కొన్ని షాపులలో అయితే. ఔట్ ఆఫ్ స్టాక్ అని బోర్డు పెట్టారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
image.png

ఏఐ ని నమ్ముకుంటే పుట్టి మునిగింది.. చివరికి ఆ కంపెనీ ఏం చేసిందంటే..

Ford AI
Ford AI

Ford AI: కృత్రిమ మేధ.. కొంతకాలంగా ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. అన్ని కంపెనీలు దీని మాయలో పడి ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఉద్యోగాలలో కోత విధిస్తున్నాయి. దీంతో లక్షల పదిమంది రోడ్డు మీద పడ్డారు. ఇంకా పడుతూనే ఉన్నారు. అతిపెద్ద కంపెనీల నుంచి మొదలు పెడితే కింది స్థాయి సంస్థల వరకు ఉద్యోగులను కంపెనీలు తొలగిస్తున్న నేపథ్యంలో.. భవిష్యత్ కాలంలో అసలు మనుషుల అవసరం లేకుండానే అన్ని జరిగిపోతాయని.. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ మనుషుల జీవితాల్లో సమూల మార్పులు తీసుకొస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాలలో ప్రవేశించి.. సమూల మార్పులకు కారణమవుతున్న నేపథ్యంలో.. ఓ కంపెనీలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి ఏర్పడుతోంది. అంతేకాదు ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ నమ్ముకున్న ఆ కంపెనీ నిండా మునిగింది. చివరికి ఏం చేయాలో తెలియక ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

కార్ల తయారీలో అత్యంత కీలకమైన సంస్థగా ఫోర్డ్ కంపెనీ కొనసాగుతోంది. ఈ కంపెనీలో అనుభవం ఉన్న ఇంజనీర్లు అనేక రకాల కారణాలతో బయటకు వెళ్లిపోయారు. అయితే ఆ సంస్థ వారి స్థానంలో కొత్తవారిని నియమించుకోలేదు. పైగా గత ఏడాది అక్టోబర్లో 900 ఏఐ ఆధారిత కెమెరాలను ఏర్పాటు చేసింది. అవి ఆశించిన స్థాయిలో పనిచేయలేకపోవడంతో మళ్లీ అనుభవం ఉన్న ఉద్యోగులను తిరిగి ఫోర్డ్ కంపెనీ నియమించుకుంటున్నది. ఇప్పటిదాకా 350 మంది ఉద్యోగులను ఫోర్డ్ కంపెనీ నియమించుకుంది. ఆ ఉద్యోగులు కృత్రిమ మేధకు శిక్షణ ఇవ్వబోతున్నారు. వాస్తవానికి కృత్రిమ మేధ అనేది సొంతంగా పనిచేయదు. దానికి సొంతంగా పనిచేసే స్థాయి కూడా ఉండదు.. శిక్షణ ఇస్తేనే అది పనిచేస్తూ ఉంటుంది.

“కొంతకాలంగా మేము అనుభవం ఉన్న ఉద్యోగులకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదు. కృత్రిమ మేధ మీద ఎక్కువగా దృష్టి పెట్టాం. అయితే ఉద్యోగులు చేసే స్థాయిలో కృత్రిమ మేధ పనిచేయలేకపోయింది. సంస్థ అవసరాలకు తగ్గట్టుగా ఉత్పత్తులు అందించలేకపోయింది. డిజైన్ అవసరాలకు అనుగుణంగా ఇన్పుట్ ఇస్తే.. కృత్రిమ మేధ అత్యున్నత నాణ్యత ఉన్న ఉత్పత్తులు తయారు చేస్తుందని అనుకున్నాం. కానీ అలా జరగలేదు. కృత్రిమ మేధను నమ్ముకుని మేము విఫలమయ్యామని” ఫోర్డ్ కంపెనీ హార్డ్వేర్ ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్ చార్లెస్ చెబుతున్నారు. సంస్థ అవసరం తగ్గట్టుగా చాలామంది ఇంజనీర్లను నియమించుకోవాలని అనుకుంటున్నాం. త్వరలోనే ఆ ప్రక్రియ పూర్తి చేస్తామని ఆయన అంటున్నారు. ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దుమ్ము రేపుతున్న నేపథ్యంలో.. అది కేవలం అవసరానికి పనికి వచ్చే టూల్ మాత్రమేనని.. అది నవ్యతను.. అంది పుచ్చుకోలేదని.. ఇచ్చిన పని మాత్రమే చేస్తుందని ఫోర్డ్ కంపెనీ ఉదంతం ద్వారా తెలిసింది.

ఫుడ్ డెలివరీ బాయ్ ని కొట్టిన 'రాజు వెడ్స్ రాంబాయి' హీరో...వైరల్ వీడియో...

Akhil Raj
Akhil Raj

Akhil Raj: సినిమా ఇండస్ట్రీలో ఒక్కసారి హీరోగా మారిన తర్వాత వాళ్ళ ఆటిట్యూడ్ మొత్తం మారిపోతుంది. అంతకుముందు ఉన్న వైఖరి సినిమా సక్సెస్ అయిన తర్వాత ఉండదని చాలా మంది చెబుతూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే గత సంవత్సరం ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన నటుడు అఖిల్ రాజ్… ఈ మూవీతోనే హీరోగా పరిచయమైన తను మొదటి సినిమాతోనే సక్సెస్ ని సాధించాడు. దాంతో అతనికి ఇండస్ట్రీలో భారీ అవకాశాలైతే వస్తున్నాయి. ఇక దానికి తోడుగా ఆయన ప్రతి సినిమా విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే ఆయన ఏదో ఒక రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ అయితే పెట్టుకున్నాడు. ఫుడ్ డెలివరీ బాయ్ రాంగ్ ఫుడ్ ఆర్డర్ డెలివరీ చేయడంతో అఖిల్ రాజ్ తో పాటు వాళ్ళ అమ్మ కూడా అతని మీద గొడవకు దిగారు.

మొత్తానికైతే ఫుడ్ డెలివరీ అబ్బాయి తీసిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇదంతా చూసిన కొంతమంది హీరో అయితే ఎందుకు అంత పొగరు ఫుడ్ డెలివరీ బాయ్ మీద దాడి చేయడం ఏంటి రాంగ్ ఫుడ్ వస్తే అది రెస్టారెంట్ వాడి తప్పు ఫుడ్ డెలివరీ చేసిన వాడి తప్పు కాదు కదా అంటూ కొంతమంది మాట్లాడుతున్నారు.

ఇక ఫుడ్ డెలివరీ బాయ్ మాత్రం అఖిల్ రాజు వాళ్ళ అమ్మ తన మొహం మీద ఉమ్మేసిందని ఆ వీడియో తీస్తూ మాట్లాడుతున్నాడు. నిజానికి ఒక సినిమా సక్సెస్ సాధించినంత మాత్రాన అంత తల పొగరు ఉండాల్సిన పని లేదు. అంతకంటే చాలా గొప్ప సక్సెస్ లను సాధించిన వారు కామ్ గా ఉంటూ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

ఆ వీడియోలో అఖిల్ రాజ్ ను చూస్తే వాళ్ళ నాన్నను దాటుకుని మరీ వచ్చి ఆ ఫుడ్ డెలివరీ బాయ్ ని కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ పొగరు మార్చుకోకపోతే మాత్రం సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు నిలవడం చాలా కష్టమవుతుందని చాలామంది విమర్శకులు సైతం అతన్ని హెచ్చరిస్తున్నారు…

 

View this post on Instagram

 

A post shared by Telangana News Zone (@tnewszone)

'ఓజీ 2' లో డిజాస్టర్ హీరోయిన్.. భయపడిపోతున్న ఫ్యాన్స్..

OG 2 Movie
OG 2 Movie

OG 2 Movie: ‘సోషల్ మీడియా లో గత వారం రోజుల నుండి ఎక్కడ చూసినా ‘ఓజీ 2’ మేనియా నే కనిపిస్తోంది. గత ఏడాది దసరా కానుకగా విడుదలైన ఈ చిత్రం , జెన్ జీ ఆడియన్స్ ని విపరీతంగా అలరించింది. ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత , ఈ చిత్రానికి పాన్ ఇండియా లెవెల్ లో ఇంకా ఎక్కువ రీచ్ వచ్చింది. దీంతో అభిమానుల నుండి ‘ఓజీ 2’ కచ్చితంగా కావాల్సిందే అనే డిమాండ్ రోజురోజుకి పెరుగుతూ పోవడం తో , వాళ్ళ కోసం పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ చిత్రం చేయడానికి నడుం బిగించారు. ఈ సినిమాకు సంబంధించిన చర్చలు మొదలయ్యాయి. రీసెంట్ గానే డైరెక్టర్ సుజిత్ పవన్ కళ్యాణ్ ని కలిసి ఈ సినిమా స్టోరీ ని వినిపించారు. ఆయనకు తెగ నచ్చేసింది , ఈ సినిమా కోసం ఎంత దూరమైనా వస్తా, ఏదైనా చేస్తా అని ఆయన మాట ఇచ్చారు.

ఈ వీడియో ని చూసిన తర్వాత అభిమానులు మెంటలెక్కిపోయారు, ముఖ్యంగా సుజిత్ పవన్ కళ్యాణ్ కి ఈ చిత్రం లోని సన్నివేశాలను వివరించే విధానం వాళ్లకు గూస్ బంప్స్ రప్పించింది. ఆయన చెప్పిన సన్నివేశాలకు AI ద్వారా విజువల్ రూపం ఇస్తూ , సోషల్ మీడియా లో ఎన్నో వేల ఎడిటింగ్స్ ని అప్లోడ్ చేశారు నెటిజెన్స్. ముఖ్యంగా గంభీర పెట్ డ్రాగన్ అంటూ ఏ రేంజ్ ఎడిటింగ్స్ వచ్చాయో మన అందరం చూసాము, చూస్తూనే ఉన్నాం. ఇదంతా పక్కన పెడితే గత రెండు రోజుల క్రితమే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ ని సంప్రదిస్తున్నారు అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అభిమానులు ఈ విషయం తెలుసుకొని సంబరాలు చేసుకున్నారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా మరో వార్త వినిపిస్తోంది.

ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం హాట్ బ్యూటీ పూజ హెగ్డే ని ఎంచుకునే ఆలోచనలో ఉన్నారట సుజిత్. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేస్తారట. పూజ హెగ్డే హీరోయిన్ అయితే కొంతమంది అభిమానులు సంతోషిస్తున్నారు కానీ , ఎక్కువ శాతం మంది అభిమానులు మాత్రం మాకొద్దు బాబోయ్ అంటున్నారు. ఎందుకంటే పూజా హెగ్డే ఈమధ్య కాలం లో చేసిన ప్రతీ సినిమా కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. రీసెంట్ గా బాలీవుడ్ డీసెంట్ హైప్ తో విడుదలైన సినిమా కూడా యావరేజ్ రేంజ్ లో ఆడింది. ప్రస్తుతం ఆమె టైం అసలు బాలేదు , ఇలాంటి సమయం లో ఆమెని ఏరికోరి ‘ఓజీ 2’ లాంటి సినిమాలో తీసుకోవడం అవసరమా అని మెజారిటీ పవన్ అభిమానులు అంటున్నారు. మరి సుజిత్ రాబోయే రోజుల్లో ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

ఈ ఐదురాశుల వారు ఈరోజు నక్క తోక తొక్కినట్లే.. పట్టిందల్లా బంగారమే..

Today 30 June 2026 Horoscope:
Today 30 June 2026 Horoscope:

Today 30 June 2026 Horoscope: జ్యోతిష శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమే అవుతుంది. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

ఈ ఐదురాశుల వారు ఈరోజు నక్క తోక తొక్కినట్లే.. పట్టిందల్లా బంగారమే..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి నిరుద్యోగులు ఈరోజు శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో ముఖ్యమైన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తారు. సీనియర్ల మద్దతు ఉండడంతో కొందరికి పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు రాజయోగం ఉండే అవకాశం ఉంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు పొందుతారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారికి ఇదే మంచి సమయం. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పాత అప్పుడు తీరిపోవడంతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం చేకూరుతుంది. అధికారుల నుంచి మద్దతు ఉండడంతో పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారికి ఈ రోజు అన్ని శుభాలే జరగనున్నాయి. అయితే కుటుంబ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో మాటల తీరును అదుపులో ఉంచుకోవాలి. సొంత వాహనాలపై ప్రయాణం చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం తగదు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు ప్రమోషన్ విషయంలో శుభవార్తలు అందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో రాణించడానికి గురువుల సహాయం తీసుకుంటారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. దీంతో గతంలో కంటే ఇప్పుడు వీరు అధిక ఆదాయాన్ని పొందుతారు. గ్రహాల అనుకూలతలతో ఏ పని మొదలుపెట్టిన ఈరోజు విజయం అవుతుంది.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు త్వరలో జరిగే శుభకార్యానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి అధిక రాబడి పొందే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగులకు కొత్త అవకాశాలు ఏర్పడతాయి. ఇదే సమయంలో అదనపు ఆదాయం చేకూరుతుంది.

కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని విజయాలే ఉంటాయి. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు ఉంటాయి. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. దైవానుగ్రహం ఉండడంతో పెట్టుబడుల నుంచి అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఓపికతో చేపట్టిన పనులు అన్నీ పూర్తిచేసే ప్రయత్నం చేయాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఉద్యోగులకు అధికారుల సహాయం ఉంటుంది. దీంతో అధిక ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని విజయాలే చేకూరుతాయి. అయితే సొంత వాహనాలపై ప్రయాణం చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. అనుకోకుండా శుభకార్యంలో పాల్గొనాల్సి వస్తుంది. పాత అప్పులను తీర్చేందుకు ఇదే మంచి సమయం.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు కొత్త ప్రాజెక్టులను చేపట్టేందుకు అవకాశం ఏర్పడుతుంది. అయితే ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్థుల కెరీర్ విషయంలో తల్లిదండ్రులు కీలక నిర్ణయం తీసుకుంటారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . ఈ రాశి వారికి ఈ రోజు ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. గతంలో పోగొట్టుకున్న డబ్బులు తిరిగి పొందుతారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. పాత అప్పులను తీరుస్తారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తారు. ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు ఊహించిన దానికంటే అధిక లాభాలు రానున్నాయి. వ్యక్తిగత జీవితం మెరుగ్గా ఉంటుంది. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం కుదుటపడుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. దీంతో ఊహించిన దాని కంటే ఎక్కువ లాభాలు ఉంటాయి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారులు అనుకోని విధంగా అధిక లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. కొత్త పెట్టుబడులకు ఇదే మంచి సమయం.

ఆ మూడు బ్యాంకులు విలీనం.. ఇకపై ఉండేది ఒకటే.. కేంద్రం కీలక ప్రకటన

Bank Merger Rumours

Bank Merger Rumours : అప్పట్లో కొన్ని బ్యాంకులు విలీనమయ్యాయి. ఆ తర్వాత ఇంతవరకు మళ్లీ బ్యాంకుల విలీనం సాధ్యం కాలేదు. అప్పట్లో విలీనమైన జాబితాలో ఆంధ్రా బ్యాంకు ఉంది. ఆ బ్యాంకు యూనియన్ బ్యాంకులో విలినమైంది. ఆంధ్ర బ్యాంకు లో ఉన్న డిపాజిట్లు.. ఆస్తులు.. ఇతర వ్యవహారాలు యూనియన్ బ్యాంక్ పరిధిలోకి వచ్చాయి.

మళ్లీ ఇప్పుడు కూడా దేశంలో మూడు ప్రభుత్వ రంగ బ్యాంకులు విలీనం అవుతాయంటూ ప్రచారం మొదలైంది. ముఖ్యంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనం అవుతాయని.. కేంద్ర ప్రభుత్వం దీనికి ఆమోదం తెలిపిందని సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం మొదలైంది. వాస్తవానికి ఇటువంటి అంశం ఏదైనా ఉంటే ముందుగానే కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటనలు చేస్తూ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా చెబుతూనే ఉంటారు. కానీ ఈసారి అలాంటిదేమీ లేకుండా ఈ మూడు అతిపెద్ద బ్యాంకులు విలీనం కావడం ఒకరకంగా సంచలనమే. ఇప్పటికిప్పుడు ఈ మూడు బ్యాంకులను విలీనం చేయాల్సిన అవసరం ఏముంది అనే ప్రశ్నలు కూడా వ్యక్తమయ్యాయి. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ.. ఇతర ఫైనాన్స్ భాగాలు ఎటువంటి ప్రకటన చేయలేదు.

ఈ మూడు బ్యాంకుల విలీనం మీద కేంద్రం క్లారిటీ ఇచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్.. కెనరా బ్యాంకు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనం సాధ్యం కాదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న సందేశాలు మొత్తం ఫేక్ అని స్పష్టం చేసింది. వీటిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదని పి ఐ బి ఫ్యాక్ట్ చెక్ విభాగం సోషల్ మీడియా వేగంగా ఒక పోస్ట్ చేసింది. బ్యాంకుల విలీనానికి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఆర్బిఐ వెబ్సైట్లో ఉంటుందని.. అనుమానాస్పదమైన సమాచారాన్ని ఎవరైనా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తే 8799 711 259 వాట్స్అప్ నెంబర్లు సంప్రదించాలని.. ఒకవేళ ఫ్యాక్ట్ చెక్ విభాగానికి మెసేజ్ కూడా చేయవచ్చని సూచించింది. అయితే కొంతకాలంగా ఇటువంటి నిరాధారమైన సమాచారాలు సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. దానిపై అధికారికంగా ఎస్బిఐ లేదా మిగతా బ్యాంకులు ప్రకటన చేయలేదు. దీంతో ఇటువంటి నిరాధారమైన సమాచారాన్ని స్ప్రెడ్ చేసే వారి మీద కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది.
image.png

జగన్- కేటీఆర్.. తెరవెనుక ఏదో జరుగుతోందబ్బా..

YS Jagan Mohan Reddy, KTR

YS Jagan Mohan Reddy : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్, తెలంగాణ ఐటి శాఖ మాజీ మంత్రి కేటీఆర్ కు ఒకరికి పరస్పరమైన అభిమానం ఉంది. దీనిని బహిరంగంగానే వారిద్దరూ వ్యక్తం చేస్తూ ఉంటారు. వారిద్దరు ఒకరు ఒకరు అత్యంత గౌరవంగా సంబోధించుకుంటూ ఉంటారు. ఒకరి గురించి మరొకరు గొప్ప విషయాలు చెప్పుకుంటారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడుతూ.. జగన్ అంత ఎత్తునుంచి బంగి జంప్ ఎలా చేశారో అర్థం కావడం లేదని.. ఈసారి కలిస్తే కచ్చితంగా అడుగుతానని అన్నారు. అంతకుముందు వీరిద్దరూ బెంగళూరులో ఆ ప్రైవేట్ కార్యక్రమంలో కలిశారు. ఇద్దరు పక్క పక్కన కూర్చొని మాట్లాడుకున్నారు.

వారిద్దరు కలుసుకొని మాట్లాడుకున్న మాటలకు సంబంధించిన విషయాలను అటు నమస్తే తెలంగాణ.. ఇటు సాక్షి గొప్పగానే చెప్పుకున్నాయి. గొప్పగానే రాశాయి. 2014 నుంచి 2023 వరకు తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. సాక్షి పేపర్ పెద్దగా నెగిటివ్ వార్తలు రాయలేదు. 2014లో గెలిచిన వైసిపి ఎమ్మెల్యేలు భారత రాష్ట్ర సమితిలో చేరినప్పుడు కూడా సాక్షి పెద్దగా వ్యతిరేక వార్తలు రాలేదు. జగన్ నాడు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే వారంతా కూడా గులాబీ పార్టీలోకి చేరిపోయారు. దీనికి తోడు నాడు కెసిఆర్ జగన్మోహన్ రెడ్డితో మంతనాలు జరిగినట్టు వార్తలు కూడా వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒకసారి ప్రగతి భవన్ వచ్చారు. కాలేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి కూడా హాజరయ్యారు. 2023లో భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కార్యకలాపాలు మొదలుపెట్టింది. కెసిఆర్ ముఖ్యమంత్రి హోదాలో ఏపీలో పర్యటించారు. నాడు మంత్రిగా ఉన్న రోజా ఇంటికి వెళ్లారు. ఆమె పెట్టిన రొయ్యల పులుసు తిన్నారు. నాడు కెసిఆర్ వెంట కవిత కూడా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డితో కలిసి ఏపీ రాష్ట్రంలో పనిచేస్తామని.. ఏపీ రాష్ట్రం రూపురేఖలు మార్చుతామని కెసిఆర్ అన్నారు.

ఈ ప్రకారం కేసీఆర్ కుటుంబానికి.. జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి రాజకీయంగా సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఎన్నికల సంఘం తీసుకొచ్చిన సర్ నిబంధన మీద అవగాహన కల్పించడానికి కేటీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల ఆయన సర్ మీద అవగాహన కార్యక్రమం నిర్వహిస్తుండగా ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. జగన్, కేటీఆర్ ఫోటోలను పక్కపక్కన ఏర్పాటు చేసి ఫ్లెక్సీలను ప్రదర్శించారు. ఈ ఫోటోలు గులాబీ పార్టీ, వైఎస్ఆర్ సీపీ మధ్య ఉన్న సంబంధాన్ని వ్యక్తం చేస్తున్నాయి. సాక్షి మీడియా ఈ చిత్రాలను విస్తృతంగా ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తామని. ఇలా జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలో రెండు పర్యాయాలు ఇటువంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గులాబీ పార్టీ, వైసీపీల మధ్య సంబంధాలు కుదిరినట్టు బహిరంగంగానే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రత్యక్ష పొత్తు కాక పోయినప్పటికీ ఈ రెండు పార్టీల మధ్య అంతర్గత అవగాహన ఉందని తెలుస్తోంది. ఈ రెండు పార్టీల కార్యకలాపాలను దగ్గరుండి పరిశీలిస్తున్న కొంతమంది వ్యక్తులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం విశేషం.

'గాడ్ ఆఫ్ వార్' ఆ ఫ్లాప్ చిత్రానికి రీమేకా..? ఈ త్రివిక్రమ్ జన్మలో మారడు..

Trivikram NTR new movie update
Trivikram NTR new movie update

NTR God of War : టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ లో ఒకటి ‘గాడ్ ఆఫ్ వార్’. త్రివిక్రమ్ దర్శకత్వం లో తెరకెక్కబోయే ఈ సినిమాలో హీరో గా ఎన్టీఆర్ నటించబోతున్నారా ?, లేదా అల్లు అర్జున్ నటించబోతున్నారా ? అని ఇంతకాలం సోషల్ మీడియా లో పెద్ద చర్చ నే నడిచింది. అయితే ఈ చిత్రం లో ఎన్టీఆర్ నే నటించబోతున్నారని నేడు అధికారికంగా ఖరారు అయ్యింది. స్వయంగా ఎన్టీఆర్ ఈ విషయాన్ని నిర్ధారిస్తూ కాసేపటి క్రితమే ఈ సినిమాకు సంబంధించిన థీమ్ పోస్టర్ ని విడుదల చేశారు. ఈ పోస్టర్ కి ఫ్యాన్స్ , ఆడియన్స్ నుండి బ్లాస్టింగ్ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. కార్తికేయ స్వామి చేతిలో ఉండే ఆయుధాన్ని చాలా క్రియేటివ్ గా DNA అర్థం వచ్చేలా పొందుపరుస్తూ ఈ పోస్టర్ ని డిజైన్ చేశారు. ఇది చాలాసేపు గమనించిన తర్వాత ఫ్యాన్స్ కి కూడా అర్థం అయ్యింది.

అయితే ఇన్ని రోజులు అభిమానులు , ప్రేక్షకులు ఈ చిత్రాన్ని పూర్తి స్థాయి ఫాంటసీ చిత్రం గా ఊహించుకున్నారు. కార్తికేయ స్వామి జీవిత చరిత్ర మీదనే చిత్రం మొత్తం ఉంటుందని అనుకున్నారు. కానీ ఈ లోగో ని గమనిస్తే , ఇది సెమి ఫాంటసీ చిత్రం అనేది అర్థం అవుతోంది. కార్తికేయ స్వామి DNA ని హీరో పాత్రకు బదిలీ చేస్తారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలే ఈ సినిమా అని అంచనా వేస్తున్నారు. గతం లో ఇదే కాన్సెప్ట్ తో తమిళ హీరో సూర్య ‘7th సెన్స్’ అనే చిత్రం చేశారు. ఈ సినిమా తెలుగు లో కమర్షియల్ గా హిట్ అయ్యినప్పటికీ, తమిళం లో మాత్రం ఫ్లాప్ అయ్యింది. ఓవరాల్ గా కమర్షియల్ గా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడంలో విఫలం అయ్యింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే , బోధి ధర్మ DNA ని హీరో పాత్రకు ఎక్కిస్తారు , అతను మన దేశాన్ని నాశనం చేయడానికి వచ్చిన చైనా దేశం ఆటలను అరికట్టుతారు.

‘గాడ్ ఆఫ్ వార్’ లో కూడా అదే కాన్సెప్ట్ ని ఇరికించారు. దీంతో ఈ చిత్రం ‘7 th సెన్స్’ కి రీమేక్ అంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీనిపై మూవీ టీం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది పూర్తి స్థాయి ఫాంటసీ చిత్రం అని నమ్మబట్టే , అభిమానులతో పాటు , ప్రేక్షకుల్లో కూడా ఈ చిత్రం పై ఆసక్తి కలిగింది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ విన్నాక , ఆ ఆసక్తి కాస్త తగ్గింది. భవిష్యత్తులో మేకర్స్ ఈ సినిమా కాన్సెప్ట్ పై ఏమైనా క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి.

హుటాహుటిన ముంబై ఆస్పత్రికెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..ఆందోళనలో ఫ్యాన్స్..

Pawan Kalyan Health
Pawan Kalyan Health

Pawan Kalyan Health : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. రీసెంట్ గానే ఆయన రివ్యూ మీటింగ్ లో ఉండగా అకస్మాత్తుగా అస్వస్థతకు గురి అవ్వడం , వెంటనే హాస్పిటల్ కి తరలించి ముక్కు కి సర్జరీ చేయడం జరిగింది. ఆ తర్వాత నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న పవన్ కళ్యాణ్ , మరోసారి పాలన పరంగా ఫుల్ యాక్టీవ్ అవ్వడమే కాకుండా, పార్టీ ని కూడా క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు కార్యాచరణ మొదలు పెట్టారు. వీటితో పాటు కోట్లాది సినీ అభిమానులు ఎంతగానో కోరుకుంటున్న ‘ఓజీ 2’ చిత్రం చేయడం కోసం కూడా ఆయన రెడీ అయిపోయారు. అంతా బాగానే ఉంది అని అనుకుంటున్న సమయం లో మరోసారి ఆయన వైద్య పరీక్షల కోసం ముంబై కి వెళ్లడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ బ్యాక్ పెయిన్ తో ఇబ్బంది పడుతున్నారు. అంతే కాకుండా తన భుజాలకు సంబంధించిన రొటేటర్ కఫ్ గాయం అవ్వడం వల్ల, రెండు భుజాలకు చెందిన కండరాలు పూర్తిగా చిట్లిపోయాయి. ఈ కారణం చేత ఆయన ఎక్కువసేపు కుర్చీలో కూర్చోలేని పరిస్థితి ఏర్పడింది. రీసెంట్ గా కూడా ఆయన క్యాబినెట్ మీటింగ్ లో ఎక్కువసేపు కూర్చోలేక మధ్యలోనే వెళ్లిపోయిన సందర్భం కూడా ఒకటి ఉంది. దీనికి శాశ్వత పరిష్కారం కోసమే నేడు ఆయన ముంబై కి వెళ్లాల్సి వచ్చింది.

కాసేపటి క్రితమే ముంబై కి చేరుకున్న పవన్ కళ్యాణ్, కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్ కి వెళ్లనున్నారు. ఆయనకు తోడుగా సతీమణి అన్నా లెజినోవా కూడా వచ్చింది. భవిష్యత్తులో రాజకీయ పరంగా ఎన్నో కార్యక్రమాలు , యాత్రలు చేయాల్సి ఉంది , అదే విధంగా వృత్తి పరంగా సినిమాలను కూడా ప్రారంభించే సమయం వచ్చేసింది , నవంబర్ నుండి ఓజీ 2 షూటింగ్ లో ఆయన పాల్గొనబోతున్నారు. ఇలాంటి సమయంలో ఆరోగ్య పరంగా ఫిట్ గా ఉండాలనే ఉద్దేశ్యంతోనే పవన్ కళ్యాణ్ హాస్పిటల్ కి వచ్చారని , అభిమానులు భయపడాల్సిన అవసరమే లేదని అంటున్నారు. త్వరలోనే పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా మాటామంతి కార్యక్రమాన్ని మొదలు పెట్టనున్నారు. రీసెంట్ గానే ఈ కార్యక్రమాన్ని కాకినాడ లో నిర్వహించిన సంగతి తెలిసిందే. త్వరలోనే అన్ని జిల్లాల్లోనూ ఈ కార్యక్రమం వ్యాపించనుంది.

'బిగ్ బాస్ 10' లోకి ఎంట్రీ ఇవ్వనున్న 'ఆనందం' హీరోయిన్.. రెమ్యూనరేషన్ ఏంటంటే..

Rekha-Vedavyas

Bigg Boss 10 Telugu :   ‘బిగ్ బాస్’ సందడి మొదలైంది. వచ్చే నెల 25 నుండి స్టార్ మా ఛానల్ లో ‘అగ్నిపరీక్ష 2’ మొదలు కానుంది. గత సీజన్ లో లాగానే , ఈ సీజన్ లో కూడా సామాన్యులను బిగ్ బాస్ హౌస్ లోకి పంపించబోతున్నారు. అదే విధంగా సెలబ్రిటీల ఎంపిక కూడా చాలా సాలిడ్ గా ఉండబోతుంది. ఎప్పుడు లేని రేంజ్ లో ఈసారి బాగా పేరు మోసిన సెలబ్రిటీలను ఒక పది మందిని చూడబోతున్నాము. అందులో ఒకప్పటి క్రేజీ హీరోయిన్ రేఖ కూడా ఉంది. ఈమె పేరు చెప్తే మీరు వెంటనే గుర్తుపట్టలేకపోవచ్చు , కానీ ఆమెని చూస్తే మాత్రం వెంటనే గుర్తుపట్టగలరు. మన చిన్నతనం లో ఈమె ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ‘ఆనందం’ సినిమాని అంత తేలికగా ఎవరైనా మర్చిపోగలరా?, ఈ చిత్రం లో హీరోయిన్ ఈమెనే.

కన్నడ సినీ పరిశ్రమ ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన ఈమె, అక్కడ రెండు సూపర్ హిట్ సినిమాలు చేసిన తర్వాత మన టాలీవుడ్ డైరెక్టర్ శ్రీను వైట్ల దృష్టిలో పడింది. ఆయన వెంటనే ఈమెని తన ‘ఆనందం’ చిత్రం లో హీరోయిన్ గా ఎంచుకున్నారు. ఇక ఆ తర్వాత తెలుగు లో ఈమె ‘జాబిల్లి’, ‘ఒకటో నెంబర్ కుర్రాడు’, ‘మన్మధుడు’, ‘దొంగోడు’, ‘అనగనగా ఓ కుర్రాడు’, ‘జానకి వెడ్స్ శ్రీరామ్’, ‘ప్రేమించుకున్నాం పెళ్ళికి రండి’, ‘నాయుడమ్మ’, ‘నిన్న నేడు రేపు’, ‘జీనియస్’, ‘అలా ఇలా ఎలా’ వంటి తెలుగు సినిమాల్లో నటించింది. కన్నడ లో రెగ్యులర్ గా హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ మరియు విలన్ రోల్స్ లో నటిస్తూ ఫుల్ బిజీ గా ఇంత కాలం తన కెరీర్ ని సాగించింది. ఇకపోతే రీసెంట్ గానే ఈమె ఒక పాపులర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఈమె ‘బిగ్ బాస్ 10’ లో పాల్గొంటారా అని అడిగిన ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం చెప్పింది.

ఆమె మాట్లాడుతూ ‘బిగ్ బాస్ కి వెళ్లాలంటే చాలా ధైర్యం ఉండాలి. అన్ని కెమెరాల ముందు , అంతమంది తో పోటీపడి టాస్కులు ఆడే కంటెస్టెంట్స్ కి సెల్యూట్ చేస్తాను. కానీ నాకు ఆ రియాలిటీ షో కి వెళ్లేంత ధైర్యం అయితే లేదు. ఒక గెస్ట్ గా వెళ్ళమంటే వెళ్తాను కానీ , కంటెస్టెంట్ గా అయితే నా వల్ల కాదు’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే గతం లో ఇలా చెప్పిన వాళ్ళే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు. ఈమె కూడా అంతే , బిగ్ బాస్ టీం ఈమెని త్వరలోనే సంప్రదిస్తారు , మంచి రెమ్యూనరేషన్ ఆఫర్ ఇస్తే మాత్రం ఈమె కచ్చితంగా ఈ షో లో పాల్గొంటుంది అంటూ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. మరి రేఖ వస్తుందో లేదో చూడాలి.

టీమిండియా పై చారిత్రాత్మక విజయం.. ఐర్లాండ్ కోచ్ కీలక నిర్ణయం..ఇదేం ట్విస్ట్ రా అయ్యా

India Vs Ireland
India Vs Ireland

India Vs Ireland: టీమ్ ఇండియా లాంటి అత్యంత బలమైన జట్టు మీద సిరీస్ గెలవడం అంత ఈజీ కాదు. అందులోనూ టి20 ఫార్మాట్లో గెలవడం అంత సులభం కాదు. కానీ దీనిని చేసి చూపించింది ఐర్లాండ్ జట్టు. ఏకంగా రెండు టీ20 మ్యాచ్ లలో వరుసగా విజయాలు సాధించి ట్రోఫీ అందుకుంది. దక్షిణాఫ్రికా నుంచి మొదలుపెడితే ఆస్ట్రేలియా వరకు ఏ జట్టు వల్ల కానిది ఐర్లాండ్ జట్టు చేసి చూపించింది.

ఐర్లాండ్ జట్టు ఈ విజయం సాధించిన తర్వాత.. టీమిండియా మీద విమర్శలు పెరిగిపోయాయి. ముఖ్యంగా కెప్టెన్ అయ్యర్ వ్యవహరించిన తీరు పట్ల నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.”అవకాశం రాకపోతే సో కాల్డ్ ఆర్మీ ద్వారా విమర్శలు చేయిస్తారు. అవకాశం వచ్చిన తర్వాత ఇలా చేతులెత్తేస్తారు. ఇటువంటి ఆటగాళ్లను నమ్ముకుని జట్టు పగ్గాలు అప్పగిస్తే.. నిండా ముంచేస్తారు. అసలు ఇటువంటి వాళ్ళు క్రికెట్ ఎందుకు ఆడతారు.
. క్రికెట్లోకి ఎందుకు వస్తారు.. మేనేజ్మెంట్ కు బుర్ర లేదు. ముందుచూపు అంతకంటే లేదని” నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఐర్లాండ్ జట్టు చారిత్రాత్మకమైన విజయం సాధించిన తర్వాత.. టీమిండియా మీద ట్రోఫీని అందుకున్న తర్వాత.. వాస్తవానికి ఆ జట్టు ప్లేయర్లు ఆకాశం చివరి అంచులో తేలిపోతున్నారు. ప్రపంచాన్ని జయించినంత గొప్పగా వేడుకలు చేసుకుంటున్నారు. కానీ ఐర్లాండ్ జట్టు కోచ్ మాత్రం కీలక నిర్ణయం తీసుకున్నాడు. అతడు తీసుకున్న నిర్ణయం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. భారత జట్టు మీద గెలిచిన తర్వాత అసలు ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారని సగటు అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఐర్లాండ్ జట్టు కోచ్ గా హెన్రిచ్ మలాన్ కొనసాగుతున్నారు. 2022లో ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు. 2027 వరకు ఆయనకు పదవీకాలం ఉంది. అయితే ఇంకా ఒక సంవత్సరం ఆయనకు పనిచేసే అవకాశం ఉన్నప్పటికీ.. తన కోచ్ పదవికి ఆయన రాజీనామా చేశారు. 2027 వన్డే వరల్డ్ కప్ కోసం జట్టును సిద్ధం చేయాల్సి ఉందని.. దాని కంటే ముందుగానే తాను జట్టు నుంచి వెళ్ళిపోతున్నానని ఆయన పేర్కొన్నారు. కొత్త కోచ్ గా గ్యారీ విల్సన్ నియమితులవుతారని తెలుస్తోంది. ఐర్లాండ్ జట్టు ఈ స్థాయిలో విజయం సాధించినప్పటికీ కోచ్ పదవి నుంచి తప్పుకోవడం పట్ల మలాన్ పై ప్రశంసలు కురుస్తున్నాయి.

ఓలా కంపెనీకి రూ.45,000 ఫైన్.. అసలు ఈవీలకు ఏ వారంటీ ఉంటుంది.. ఎలా ఫిర్యాదు చేయాలి..

Ola Electric
Ola Electric

Ola Electric: ప్రస్తుతం చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. అయితే వీటిలో సమస్యలు రావడం సాధారణం. కానీ కొన్ని కంపెనీలు వీటి పరిష్కారానికి వారంటీ ఇచ్చినప్పటికీ.. ఆ తరువాత వినియోగదారులు ఫిర్యాదులు చేస్తే పట్టించుకోవడం లేదు. ఇలాంటి ఓ సమస్య ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ వినియోగదారుడికి వచ్చింది. అయితే అతడు కంపెనీని సంప్రదిస్తే పట్టించుకోకపోవడంతో కన్జ్యూమర్ కోర్టులో ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ కంపెనీకి కన్జ్యూమర్ కోర్టు భారీగా జరిమానా విధించింది. అయితే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎలా ఫిర్యాదు చేయాలి?

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు చెందిన ఎం మురళీ మోహన్ అనే న్యాయవాది 2022 అక్టోబర్ లో ఓలా ఎస్ 1 ప్రో స్కూటర్ ను కొనుగోలు చేశాడు. దీనిపై 3 ఏళ్ల వారంటీని ఇచ్చారు. అయితే కొన్ని రోజులకే స్కూటర్ డిక్ లాక్ పాడైపోయింది. దీంతో అతడికి తీవ్ర సమస్యలు ఎదురయ్యాయి. ఈ క్రమంలో అతడు మెయిల్ ద్వారా కంపెనీని సంప్రదించినా పట్టించుకోలేదు. ఆ తరువాత ఆయన 2025లో లీగల్ నోటీసులు పంపాడు.

ఈ నోటీసులపై నిర్లక్ష్యంగా ఉండడంతో కన్జ్యూమర్ కోర్టు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీకి రూ. 45,000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో వాహనదారుల్లో కొత్త భరోసాను నింపింది. డిక్కీ లాక్ వంటి చిన్న సమస్యే కదా అని నిర్లక్ష్యం చేసినందుకు, వారంటీ పరిధిలో ఉన్నా సేవలు అందించనందుకు కోర్టు ఈ విలక్షణ తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో, అసలు ఎలక్ట్రిక్ వాహనాలు (EVs) కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి వారంటీలు లభిస్తాయి? వినియోగదారుల కోర్టును ఎలా ఆశ్రయించాలి?

ఎలక్ట్రిక్ వాహనాలకు లభించే ప్రధాన వారంటీలు
సాధారణ పెట్రోల్ వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల వారంటీ విధానం కాస్త భిన్నంగా ఉంటుంది. ఇందులో అత్యంత ఖరీదైన భాగం బ్యాటరీ. అందుకే కంపెనీలు దీనికి ప్రత్యేకంగా 3 నుండి 8 సంవత్సరాల వరకు లేదా ఒక నిర్దిష్ట కిలోమీటర్ల పరిమితి వరకు వారంటీ ఇస్తాయి.వాహనాన్ని నడిపించే ఎలక్ట్రిక్ మోటార్, పవర్ కంట్రోలర్ వంటి సాంకేతిక భాగాలకు సాధారణంగా 3 సంవత్సరాల వరకు వారంటీ లభిస్తుంది.

స్కూటర్ బాడీ, లైట్లు, డిజిటల్ స్క్రీన్, వైరింగ్, లాకింగ్ సిస్టమ్స్ వంటి ఇతర భాగాలకు కంపెనీని బట్టి ఒకటి నుండి 3 సంవత్సరాల ప్రాథమిక వారంటీ ఉంటుంది. (అనంతపురం కేసులో ఓలా S1 ప్రో వాహనానికి 36 నెలలు లేదా 40,000 కిలోమీటర్ల వారంటీ ఉంది).

కన్జ్యూమర్ కోర్టులో ఫిర్యాదు చేయడం ఎలా? స్పష్టమైన మార్గదర్శకాలు
కంపెనీలు వారంటీ నిబంధనలను ఉల్లంఘించినా, లోపభూయిష్టమైన సేవలు అందించినా వినియోగదారులు కింది పద్ధతుల్లో చట్టపరంగా ముందుకెళ్లవచ్చు:

లీగల్ నోటీసు పంపడం:
సమస్య వచ్చినప్పుడు మొదట సర్వీస్ సెంటర్‌ను, ఈమెయిల్ ద్వారా కంపెనీని సంప్రదించాలి. అక్కడ స్పందన లేకపోతే, ఒక లీగల్ నోటీసును రిజిస్టర్డ్ పోస్ట్ లేదా ఈమెయిల్ ద్వారా కంపెనీకి పంపాలి. నోటీసు అందిన 15 రోజుల్లోగా సమస్యను పరిష్కరించకపోతే కోర్టుకు వెళ్లే హక్కు లభిస్తుంది.

నేరుగా లేదా ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు:
వినియోగదారులు కన్జ్యూమర్ కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వం e-Daakhil (ఇ-దాఖిల్) పోర్టల్ (www.edaakhil.nic.in) ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ఇంట్లో కూర్చునే ఆన్‌లైన్‌లో ఫిర్యాదు నమోదు చేయవచ్చు. లేదా స్థానిక జిల్లా వినియోగదారుల కమిషన్‌లో నేరుగా పేపర్లు సమర్పించవచ్చు.

కోర్టును ఆశ్రయించాలి?
నష్టపరిహారం విలువ రూ. 50 లక్షల లోపు ఉంటే స్థానిక జిల్లా కోర్టులో ఫిర్యాదు చేయాలి. వివాద విలువ రూ. 50 లక్షల నుండి రూ. 2 కోట్ల వరకు ఉంటే రాష్ట్ర రాజధానిలోని స్టేట్ కమిషన్‌ను ఆశ్రయించాలి.

జతచేయాల్సిన పత్రాలు:
ఫిర్యాదు చేసే సమయంలో వాహన కొనుగోలు బిల్లు (Invoice), వారంటీ కార్డు, సర్వీస్ సెంటర్‌కు తిరిగినట్లు చూపే జాబ్ కార్డ్స్, కంపెనీకి పంపిన ఈమెయిల్స్, లీగల్ నోటీసు కాపీ మరియు దానికి సంబంధించిన రశీదులను ఆధారాలుగా జతచేయాలి.

లక్షా 20 వేలకు బంగారం ధరలు తగ్గుతాయా..! ఇప్పుడు అమ్మొచ్చా..కొన్నిరోజులు ఆగాలా..

Gold Price
Gold Price

Gold Price: భారతీయులకు బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు.. అది ఒక భద్రమైన పెట్టుబడి కూడా. అయితే ఇటీవల పరిస్థితి మారుతోంది. బంగారం ధరలు గత ఏడాది కాలంలో రికార్డు స్థాయికి చేరుకున్న తర్వాత ఇప్పుడు చాలామంది తమ వద్ద ఉన్న బంగారాన్ని విక్రయిస్తున్నారు. అసలు దేశవ్యాప్తంగా బంగారం అమ్మకాలు పెరగడానికి కారణం ఏంటీ? ఇప్పుడు బంగారం విక్రయిస్తే లాభాలేనా?

ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) గణాంకాల ప్రకారం.. 2026 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారతీయ కుటుంబాలు సుమారు 50 టన్నుల బంగారాన్ని విక్రయించాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 43 శాతం అధికం. ఇంత పెద్ద మొత్తంలో కుటుంబాలు బంగారాన్ని అమ్మడం ఇటీవల కాలంలో అరుదైన పరిణామం.

గత ఏడాది నుంచి అంతర్జాతీయ ఆర్థిక, భౌగోళిక పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు వరుసగా పెరుగుతూ కొత్త గరిష్ఠ స్థాయిలను తాకాయి. దీంతో చాలా మంది పెట్టుబడిదారులు మంచి లాభాల్లోకి వచ్చారు. అయితే ఇటీవల ధరలు కొంత తగ్గుముఖం పట్టడంతో, ఇప్పుడే విక్రయిస్తే లాభాలను ఖరారు చేసుకోవచ్చని భావించి బంగారాన్ని అమ్ముతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. దీనినే మార్కెట్ భాషలో ‘ప్రాఫిట్ బుకింగ్’ అంటారు.

బులియన్ మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రస్తుతం బంగారం ధరలు ఇప్పటికే చాలా ఎత్తుకు చేరుకున్నాయి. ఇకపై గతంలా వేగంగా పెరిగే అవకాశం తక్కువగా ఉండొచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. అందుకే ధరలు మరింత తగ్గకముందే విక్రయించి నగదు చేతికి తెచ్చుకోవాలని చాలామంది నిర్ణయించుకుంటున్నారు. కొన్ని మార్కెట్ అంచనాల ప్రకారం, రాబోయే రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర రూ.1.20 లక్షల స్థాయికి చేరే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, కొందరు విశ్లేషకులు అంతర్జాతీయ పరిస్థితులు, కేంద్ర బ్యాంకుల నిర్ణయాలు, డాలర్ బలాబలాలు వంటి అంశాలపై ఆధారపడి ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగవచ్చని కూడా చెబుతున్నారు. అంటే ఇవి కేవలం అంచనాలు మాత్రమే, ఖచ్చితమైన ధరలను ఎవరూ ముందుగా చెప్పలేరు.

ధరలు అనుకూలంగా ఉండటంతో పాటు, విద్య, వైద్యం, గృహ కొనుగోలు, వ్యాపార అవసరాలు వంటి కారణాలతో కూడా కుటుంబాలు బంగారాన్ని విక్రయిస్తున్నాయి. అత్యవసర సమయాల్లో బంగారం సులభంగా నగదుగా మారే ఆస్తి కావడంతో, మంచి ధర లభిస్తున్న సమయంలో దానిని విక్రయించేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు.

ఆర్థిక నిపుణుల సూచన ప్రకారం.. కేవలం ధరలు పెరిగాయనే కారణంతో మొత్తం బంగారాన్ని విక్రయించడం సరైన నిర్ణయం కాకపోవచ్చు. వ్యక్తిగత ఆర్థిక అవసరాలు, భవిష్యత్ లక్ష్యాలు, పెట్టుబడి ప్రణాళికను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవడం మంచిది. బంగారం ఇప్పటికీ దీర్ఘకాలిక పెట్టుబడిగా, ద్రవ్యోల్బణానికి రక్షణగా పరిగణించబడుతోంది. అందువల్ల మార్కెట్ అంచనాల ఆధారంగా కాకుండా, ఆర్థిక సలహా తీసుకుని నిర్ణయం తీసుకోవడం మరింత శ్రేయస్కరం.