Homeఅంతర్జాతీయంMonique Jeremiah: తన పక్కన పడుకోవచ్చు.. టచ్ చేయకూడదు.. నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..

Monique Jeremiah: తన పక్కన పడుకోవచ్చు.. టచ్ చేయకూడదు.. నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..

Monique Jeremiah: దూకుడు సినిమాలో అసలు మీద వడ్డీ.. వడ్డీ మీద చక్రవడ్డీ.. చక్రవడ్డీ మీద విష్ణు చక్రవడ్డీ.. వసూలు చేస్తూనే ఉంటాను. ఇది వ్యాపారం.. అని బ్రహ్మానందం అంటుంటాడు గుర్తుందా.. ఈ ప్రపంచంలో వ్యాపారం అనేది అనేక రకాలు. మనిషి అవసరాలను బట్టి వ్యాపారం సాగుతూ ఉంటుంది. ఆ వ్యాపారాన్ని చాలామంది రకరకాలుగా సాగిస్తూ ఉంటారు. అందులో ఈమె చేస్తున్న వ్యాపారం మాత్రం అన్నిటికంటే భిన్నం. ఇలా కూడా చేస్తారా.. ఇలా కూడా ఆలోచిస్తారా అని […]

Monique Jeremiah: దూకుడు సినిమాలో అసలు మీద వడ్డీ.. వడ్డీ మీద చక్రవడ్డీ.. చక్రవడ్డీ మీద విష్ణు చక్రవడ్డీ.. వసూలు చేస్తూనే ఉంటాను. ఇది వ్యాపారం.. అని బ్రహ్మానందం అంటుంటాడు గుర్తుందా.. ఈ ప్రపంచంలో వ్యాపారం అనేది అనేక రకాలు. మనిషి అవసరాలను బట్టి వ్యాపారం సాగుతూ ఉంటుంది. ఆ వ్యాపారాన్ని చాలామంది రకరకాలుగా సాగిస్తూ ఉంటారు. అందులో ఈమె చేస్తున్న వ్యాపారం మాత్రం అన్నిటికంటే భిన్నం. ఇలా కూడా చేస్తారా.. ఇలా కూడా ఆలోచిస్తారా అని చాలామంది అనుకోవడమే కాదు.. ఆశ్చర్యపోతున్నారు.

ఆమె పేరు మోనిక్ జెరీమియా వయసు 37 సంవత్సరాల వరకు ఉంటుంది. ఉండేది కెనడా దేశంలో. ఈమెకు గతంలోనే వివాహం జరిగింది. కొంతకాలం పాటు వైవాహిక జీవితం సజావుగానే సాగింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. మొదట్లో కాస్త సర్దుకున్నప్పటికీ.. అవి మరింత పెరిగిపోయాయి. దీంతో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. దీనికి తోడు కరోనా సోకడంతో అప్పుడు పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. ఆమె ఉపాధి కోసం రకరకాల మార్గాలను అన్వేషించింది. చివరికి ఒక కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టింది..

జెరీమియా ఉన్నత విద్యావంతురాలు కావడంతో విచిత్రంగా ఆలోచించింది. తను పడుకునే పడకలో సగభాగాన్ని అద్దెకు ఇవ్వడం మొదలుపెట్టింది. ఇలా సంపాదించడం ప్రారంభించింది. అయితే దీనికోసం ఒక షరతు కూడా పెట్టింది. తన పక్కన పడుకోవాలని.. టచ్ చేయకూడదు.. పైగా రెంట్ కూడా నార్మల్ ధరలోనే ఉండడంతో.. ఆమె ఆఫర్ చాలా మందికి నచ్చింది. ఫలితంగా ఆమె పక్కన పడుకోడానికి చాలామంది ముందుకు వచ్చారు. దీంతో ఆదాయం అదిరిపోయింది. ప్రతినెల ఇలా 50 వేల వరకు ఆమె సంపాదిస్తోంది.

తన పక్కన పడుకున్నప్పటికీ టచ్ చేయకూడదని ఆమె షరతు విధించడంతో.. దానికి చాలామంది లోబడి వచ్చారు. అందమైన అమ్మాయి.. పక్కనే అవకాశం కల్పించడంతో చాలామంది యువకులు పడుకోడానికి క్యూ కట్టారు. ఫలితంగా ఆమె ఆదాయం నెలకు 50000 వరకు జరిగింది. పైసా ఖర్చు లేకుండా.. రూపాయి పెట్టుబడి లేకుండా ఆమె ఇలా సంపాదించింది. మనదేశంలో ఇలాంటి విధానం లేకపోయినప్పటికీ.. విదేశాలలో ఇటువంటి విధానాలు కామన్. వీటిని అక్కడి ప్రజలు హాట్ బెడ్డింగ్ అని పిలుస్తుంటారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper