Bigg Boss 10 Telugu : ‘బిగ్ బాస్’ సందడి మొదలైంది. వచ్చే నెల 25 నుండి స్టార్ మా ఛానల్ లో ‘అగ్నిపరీక్ష 2’ మొదలు కానుంది. గత సీజన్ లో లాగానే , ఈ సీజన్ లో కూడా సామాన్యులను బిగ్ బాస్ హౌస్ లోకి పంపించబోతున్నారు. అదే విధంగా సెలబ్రిటీల ఎంపిక కూడా చాలా సాలిడ్ గా ఉండబోతుంది. ఎప్పుడు లేని రేంజ్ లో ఈసారి బాగా పేరు మోసిన సెలబ్రిటీలను ఒక పది మందిని చూడబోతున్నాము. అందులో ఒకప్పటి క్రేజీ హీరోయిన్ రేఖ కూడా ఉంది. ఈమె పేరు చెప్తే మీరు వెంటనే గుర్తుపట్టలేకపోవచ్చు , కానీ ఆమెని చూస్తే మాత్రం వెంటనే గుర్తుపట్టగలరు. మన చిన్నతనం లో ఈమె ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ‘ఆనందం’ సినిమాని అంత తేలికగా ఎవరైనా మర్చిపోగలరా?, ఈ చిత్రం లో హీరోయిన్ ఈమెనే.
కన్నడ సినీ పరిశ్రమ ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన ఈమె, అక్కడ రెండు సూపర్ హిట్ సినిమాలు చేసిన తర్వాత మన టాలీవుడ్ డైరెక్టర్ శ్రీను వైట్ల దృష్టిలో పడింది. ఆయన వెంటనే ఈమెని తన ‘ఆనందం’ చిత్రం లో హీరోయిన్ గా ఎంచుకున్నారు. ఇక ఆ తర్వాత తెలుగు లో ఈమె ‘జాబిల్లి’, ‘ఒకటో నెంబర్ కుర్రాడు’, ‘మన్మధుడు’, ‘దొంగోడు’, ‘అనగనగా ఓ కుర్రాడు’, ‘జానకి వెడ్స్ శ్రీరామ్’, ‘ప్రేమించుకున్నాం పెళ్ళికి రండి’, ‘నాయుడమ్మ’, ‘నిన్న నేడు రేపు’, ‘జీనియస్’, ‘అలా ఇలా ఎలా’ వంటి తెలుగు సినిమాల్లో నటించింది. కన్నడ లో రెగ్యులర్ గా హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ మరియు విలన్ రోల్స్ లో నటిస్తూ ఫుల్ బిజీ గా ఇంత కాలం తన కెరీర్ ని సాగించింది. ఇకపోతే రీసెంట్ గానే ఈమె ఒక పాపులర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఈమె ‘బిగ్ బాస్ 10’ లో పాల్గొంటారా అని అడిగిన ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం చెప్పింది.
ఆమె మాట్లాడుతూ ‘బిగ్ బాస్ కి వెళ్లాలంటే చాలా ధైర్యం ఉండాలి. అన్ని కెమెరాల ముందు , అంతమంది తో పోటీపడి టాస్కులు ఆడే కంటెస్టెంట్స్ కి సెల్యూట్ చేస్తాను. కానీ నాకు ఆ రియాలిటీ షో కి వెళ్లేంత ధైర్యం అయితే లేదు. ఒక గెస్ట్ గా వెళ్ళమంటే వెళ్తాను కానీ , కంటెస్టెంట్ గా అయితే నా వల్ల కాదు’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే గతం లో ఇలా చెప్పిన వాళ్ళే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు. ఈమె కూడా అంతే , బిగ్ బాస్ టీం ఈమెని త్వరలోనే సంప్రదిస్తారు , మంచి రెమ్యూనరేషన్ ఆఫర్ ఇస్తే మాత్రం ఈమె కచ్చితంగా ఈ షో లో పాల్గొంటుంది అంటూ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. మరి రేఖ వస్తుందో లేదో చూడాలి.
