Home Blog Page 39

నేడే 'జైలర్ 2' టీజర్..? సంచలనం రేపుతున్న మేకర్స్ లేటెస్ట్ పోస్ట్..

Jailer 2 Movie
Jailer 2 Movie

Jailer 2 Teaser: సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తోస్తున్న ‘జైలర్ 2’ అప్డేట్ వచ్చేసింది. నేడు సాయంత్రం 6 గంటలకు ఈ చిత్రానికి సంబంధించిన బ్లాస్టింగ్ అప్డేట్ ఇవ్వబోతున్నట్టు ‘సన్ పిక్చర్స్’ సంస్థ సోషల్ మీడియా ద్వారా అధికారిక ప్రకటన చేసింది. దీంతో రజినీకాంత్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకోవడం మొదలు పెట్టారు. ఇంతకీ సన్ పిక్చర్స్ ఇవ్వబోతున్న అప్డేట్ ఏంటి?, గ్లింప్స్ వీడియో విడుదల చేయబోతున్నారా?, లేదా టీజర్ వదులుతున్నారా?, ఇవి రెండు కాకుండా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల తేదీతో వదలబోతున్నారా?, అసలు ఏమి చేయబోతున్నారు అనే ఉత్కంఠ నెలకొంది అభిమానుల్లో. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అయితే , షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి అని , ఈ సందర్భంగా విడుదల తేదీని ప్రకటించబోతున్నారని అంటున్నారు. ఏది ఏమైనా ‘జైలర్ 2’ అప్డేట్ రావడం అభిమానులకు ఒక పండగే.

రజినీకాంత్ కెరీర్ కి అత్యంత కీలక సమయం లో ఈ ‘జైలర్’ చిత్రం విడుదలైంది. అప్పటికే డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ విజయ్ తో ‘బీస్ట్’ అనే ఫ్లాప్ చిత్రం చేయడం వల్ల , ఈ సినిమాపై అనుకున్నంత స్థాయి అంచనాలు అయితే లేవు. అలా మోడరేట్ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీ నే కురిపించింది. కేవలం తెలుగు వెర్షన్ నుండే ఈ చిత్రానికి 90 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 650 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. అలాంటి సినిమాకు సీక్వెల్ అంటే కచ్చితంగా అంచనాలు భారీగా ఉండడం సహజం. కానీ ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి ఎలాంటి కంటెంట్ విడుదల చేయలేదనే అసంతృప్తి అభిమానుల్లో ఉండేది.

నేడు సన్ పిక్చర్స్ అప్డేట్ తో వాళ్ళ ప్రాణాలు లేచివచ్చినట్టు అయ్యింది. ఇకపోతే మొదటి భాగం లాగానే , సీక్వెల్ లో కూడా శివరాజ్ కుమార్, మోహన్ లాల్ వంటి వారు గెస్టులుగా కనిపించబోతున్నారు. వీళ్ళతో పాటు బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ పవర్ ఫుల్ గెస్ట్ రోల్ చేస్తున్నారు. ఆయన పాత్ర నిడివి 20 నిమిషాలు వరకు ఉంటుందట. రీసెంట్ గానే ఆయనకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తి అయ్యింది. రెండు రోజుల క్రితమే హృతిక్ రోషన్ , రజినీకాంత్ కాంబినేషన్ లో ఒక సన్నివేశాన్ని కూడా పూర్తి చేశారు. దీంతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయ్యిందట. అక్టోబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.

భోజనం చేసిన తరువాత ఎంత సేపు నడవాలి.. లేకపోతే ఏం జరుగుతుంది..

After Meal Walking Benefits
After Meal Walking Benefits

After Meal Walking Benefits: నేటి జీవనశైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలామంది జిమ్‌లకు వెళ్లి గంటల తరబడి వ్యాయామం చేస్తున్నారు. అయితే ప్రతిరోజూ జిమ్‌లో 45 నిమిషాల వర్కౌట్ చేయడం కంటే భోజనం చేసిన తర్వాత కేవలం 15 నిమిషాలు నడవడం వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రక్తంలో చక్కెర నియంత్రణ, జీర్ణక్రియ మెరుగుదల, బరువు నియంత్రణలో ఈ అలవాటు కీలక పాత్ర పోషిస్తుందని వివరిస్తున్నారు. అసలు భోజనం చేసిన తరువాత ఎందుకు నడవాలి? శరీరంలో ఏం జరుగుతుంది?

భోజనం చేసిన వెంటనే శరీరంలో గ్లూకోజ్ స్థాయులు పెరుగుతాయి. ఈ సమయంలో 10 నుంచి 15 నిమిషాల పాటు నడవడం వల్ల కండరాలు గ్లూకోజ్‌ను శక్తిగా వినియోగిస్తాయి. దీంతో రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగకుండా నియంత్రణలో ఉంటుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, భోజనం తర్వాత నడక వల్ల రక్తంలో చక్కెర స్థాయులు సుమారు 20 నుంచి 30 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని, అలాగే ఇన్సులిన్ పనితీరు కూడా మెరుగుపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు.

స్థూలకాయంతో బాధపడుతున్న వారికి భోజనం తర్వాత నడక మంచి అలవాటుగా భావిస్తున్నారు. తిన్న ఆహారంలోని క్యాలరీలు త్వరగా ఖర్చవ్వడంతో పాటు కొవ్వు పేరుకుపోవడం తగ్గుతుంది. రోజూ క్రమం తప్పకుండా ఈ అలవాటు పాటిస్తే శరీర బరువు నియంత్రణలో ఉండటమే కాకుండా, పొట్ట చుట్టూ కొవ్వు తగ్గే అవకాశాలు కూడా పెరుగుతాయి. భోజనం చేసిన వెంటనే పడుకోవడం లేదా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే భోజనం అనంతరం నెమ్మదిగా నడవడం వల్ల జీర్ణవ్యవస్థ చురుకుగా పనిచేస్తుంది. ఆహారం సులభంగా జీర్ణమై మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

రోజువారీ నడక గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తప్రసరణ సక్రమంగా జరిగి రక్తపోటు నియంత్రణలో ఉండటానికి సహాయపడుతుంది. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ తగ్గి, మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి కూడా ఇది దోహదపడుతుంది. దీర్ఘకాలంలో గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఈ అలవాటు ఉపయోగపడుతుంది. భోజనం తర్వాత ప్రశాంతంగా నడవడం వల్ల శరీరంతో పాటు మనసుకూ విశ్రాంతి లభిస్తుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గి మానసిక ప్రశాంతత పెరుగుతుంది. నడక సమయంలో శరీరంలో ఎండార్ఫిన్స్ విడుదల కావడం వల్ల ఉత్సాహం పెరిగి, రోజంతా చురుకుదనం కొనసాగుతుంది.

భోజనం చేసిన వెంటనే వేగంగా పరుగెత్తడం లేదా కఠినమైన వ్యాయామం చేయడం మంచిది కాదు. సాధారణ వేగంతో 10 నుంచి 15 నిమిషాలు నడవడం సరిపోతుంది. ముఖ్యంగా మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తమ వైద్యుల సలహా మేరకు ఈ అలవాటు ప్రారంభించడం ఉత్తమం.

కాంగ్రెస్‌ ఐకాన్‌లను తన ఖాతాలో వేసుకుంటున్న బీజేపీ.. తాజాగా ఘనంగా తెలుగు నేత జయంతి!

PV Narasimha Rao
PV Narasimha Rao

PV Narasimha Rao: ప్రధాని మోదీ వేసే ఎత్తులు ఎవరికీ అర్థం కావావు. మోదీ కాంగ్రెస్‌కు చెందిన ఐకానిక్‌ వ్యక్తులను లాగేసుకుంటున్నారు. తాజాగా మరో కీలక వ్యక్తిని లాగేశారు. 130 ఏళ్ల చరిత్రగల కాంగ్రెస్‌ ప్రస్తుతం ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడిగా, అభివృద్ధికి మార్గదర్శకుడిగా చెప్పుకుంటుందో ఆయన కాంట్రి బ్యూషన్‌ను ముందుకు తీసుకొస్తున్నారు. 2024లో మొదటి అడుగు వేశారు. భారత రత్న ప్రకటించారు. 2025లో ఆ వ్యక్తి కుటుంబ సభ్యులను ఇంటికి వెళ్లి కలిశారు. మంచి గుర్తింపు ఇచ్చి గౌరవించింది. తాజాగా ఆ వ్యక్తి పుట్టిన రోజును మూడు రోజులు నిర్వహించి ప్రధాన మంత్రులకు సంబంధించిన వస్తువులు, జ్ఞాపకాలు, స్మృతులు ఉన్న లౌబ్రరీలో జరిపించారు. కాంగ్రెస్‌ పట్టించుకోని గౌరవించని వ్యక్తిని ఇప్పుడు బీజేపీ ఓన్‌ చేసుకుంటోంది. ఆయనే పీవీ.నర్సింహారావు. తెలుగు, తెలంగాణకు చెందిన వ్యక్తి. కాంగ్రెస్‌ కోసం జీవితాంతం పనిచేశారు. అత్యంత సరళమైన జీవితం గడిపారు. అధికారానికి సమీపంలో ఉండి కూడా ఇంటలెక్చువల్‌ ప్రధానిగా గుర్తింపు పొందారు.

2024లో భారత రత్న..
2024లో కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారత రత్న పురస్కారం ఇచ్చింది. ఆయన దేశంలో ఆర్థిక సంస్కరణలకు మార్గదర్శకత్వం వహించిన వ్యక్తిగా గుర్తింపు లభించింది. 2025లో ప్రధాని నరేంద్ర మోదీ ఆయన కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా కలిసి గౌరవించారు. ఇటీవల ఆయన పుట్టినరోజు సందర్భంగా జూన్‌ 28, 29, 30 తేదీల్లో ప్రధాన మంత్రుల స్మృతి గ్రంథాలయంలో మూడు రోజుల వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేశ అభివృద్ధిలో పీవీ పాత్రను వివరించారు. పీఎంవోలోని కీలక అధికారి ఈ వేడుకలకు నాయకత్వం వహించడం ద్వారా ప్రభుత్వం ఆయన వారసత్వాన్ని బలంగా ప్రచారం చేస్తోంది.

చివరి వరకు కాంగ్రెస్‌లోనే ఉన్న పీవీ..
పీవీ నరసింహారావు ప్రధాని పదవి ముగిసిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ ఆయనను పూర్తిగా విస్మరించినట్లు కనిపిస్తోంది. జార్ఖండ్‌ ముక్తిమోర్చా సంబంధిత కేసులో పార్టీ నుంచి సహకారం లభించలేదు. దీంతో ఆయన ఇంటిని అమ్ముకుని కేసులు ఎదుర్కొన్నారు. ఆయన మరణానంతరం అంత్యక్రియలు ఢిల్లీలో నిర్వహించేందుకు కూడా సోనియాగాంధీ అంగీకించలేదు. దీంతో కొందరు నేతలు హైదరాబాద్‌ తీసుకువచ్చి నిర్వహించారు. ఆయన సరళమైన జీవితం, బుద్ధిజీవి నాయకత్వం ఉన్నప్పటికీ కాంగ్రెస్‌ ఆయనను తన వారసత్వంలో భాగం చేయలేదు.

కీలక నేతలను ఓన్‌ చేసుకుంటున్న బీజేపీ..
బీజేపీ ప్రభుత్వం ఇలాంటి చర్యలను ఇతర చారిత్రక వ్యక్తులకు కూడా విస్తరించింది. కాంగ్రెస్‌ పక్కన పెట్టిన సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌కు నర్మదా ప్రాజెక్టు వద్ద భారీ విగ్రహం నిర్మించింది. మదన్‌ మోహన్‌ మాలవ్యకు భారత రత్న ప్రదానం చేసింది. సుభాష్‌ చంద్రబోస్, డా. బి.ఆర్‌. అంబేడ్కర్‌ వంటి నాయకులను కూడా తన రాజకీయ కథనంలో భాగం చేసుకుంటోంది. కాంగ్రెస్‌ గొప్పగా చెప్పుకునే వ్యక్తులను బీజేపీ తన వైపుకు లాగుతున్నట్లు ఈ ఘటనలు సూచిస్తున్నాయి.

భారత రాజకీయాల్లో చారిత్రక వారసత్వం కోసం జరుగుతున్న పోటీని స్పష్టంగా చూపిస్తున్నాయి. బీజేపీ తన ఆదర్శాలకు అనుగుణంగా వివిధ నాయకులను గౌరవించడం ద్వారా విస్తృత మద్దతును పొందాలని ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ ఈ నాయకులను నిర్లక్ష్యం చేయడం వల్ల బీజేపీకి ఈ అవకాశం దొరికిందని చెప్పవచ్చు.దేశ చరిత్రను తన వైపుకు తిప్పుకోవడానికి రాజకీయ పార్టీలు చేసే ప్రయత్నాలను ఈ ఘటనలు హైలైట్‌ చేస్తున్నాయి.

RCB లవర్స్ కోసం ప్రత్యేక ఫోన్.. దీని డిజైన్ చూస్తే మతి పోతుంది.. ధర ఎంతంటే..

Nothing Phone 4b RCB Edition
Nothing Phone 4b RCB Edition

Nothing Phone 4b RCB Edition: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనేటప్పుడు డిజైన్ చూసి మురిసిపోయేవాళ్లు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వారి కోసం కొన్ని కంపెనీలు ఫోన్ డిజైన్ పై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ లండన్ బేస్డ్ టెక్నాలజీ సంస్థ అయిన Nothing కంపెనీ నుంచి భారతీయ మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ విడుదల కానుంది. అయితే ఈ ఫోన్ ఐపీఎల్ ప్రాంఛైజీ ఆర్సీబీ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ టీమ్ లవర్స్ ను ఇది ఆకట్టుకోనుంది. అంతేకాకుండా ఇతర స్పెషిఫికేషన్, కెమెరా వేరియంట్ అన్నీ ఆకట్టుకుంటున్నాయి. ఇంతకీ ఇది ఏ ఫోన్? దీని ధర ఎంత ఉండనుంది?

Nothing సంస్థ నుంచి ఈనెల 7న Phone 4b మోడల్‌లో క్రికెట్ అభిమానుల కోసం ఒక ప్రత్యేకమైన RCB Edition (Royal Challengers Bengaluru) వేరియంట్‌ గురించి కంపెనీ అధికారికంగా టీజ్ చేసింది. ఐపీఎల్ సీజన్లలో ఆర్‌సీబీ టీమ్‌కు టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించిన నథింగ్, ఇప్పుడు ఆ జట్టు అద్భుత విజయాలకు గుర్తుగా ఈ స్పెషల్ ఎడిషన్ ఫోన్‌ను డిజైన్ చేసింది. ఈ ఫోన్ గురించి ఇప్పటికే సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో షేర్ చేసింది. ఈ కొత్త ఫోన్ సాధారణ నథింగ్ ఫోన్ల లాగా కాకుండా, దీని వెనుక ప్యానెల్‌పై మ్యాట్ రెడ్ (Matte Red) ఫినిషింగ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అధికారిక లోగో ఉండే అవకాశం ఉంది. దీంతో పాటు ఫోన్ లోపల ఆర్‌సీబీ థీమ్స్, వాల్‌పేపర్స్, ప్రత్యేకమైన బాక్స్ ప్యాకేజింగ్ వంటి ఎక్స్‌క్లూజివ్ ఎలిమెంట్స్ రానున్నాయి. ఇక స్టాండర్డ్ వేరియంట్ విషయానికొస్తే ఇది బ్లూ, బ్లాక్, మరియు వైట్ కలర్ ఆప్షన్లలో లభించనుంది. దీని వెనుక భాగంలో నథింగ్ సిగ్నేచర్ గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ లైటింగ్ బార్ కూడా ఉంటుంది.

ఈ మొబైల్ లో డిజైన్ మాత్రమే కాకుండా ఇతర ఫీచర్లు కూడా ఆకట్టుకోనున్నాయి. ఇందులో 6.77 అంగుళాల Full HD ప్లస్ AMOLED డిస్ ప్లే ఉండనుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. అలాగే క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ఆక్టా-కోర్ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. వెనుక వైపు 50MP ప్రైమరీ కెమెరా 8MP అల్ట్రా వైడ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీల కోసం 16MP కెమెరాను అమర్చారు. లాంగ్ లైఫ్ ఇచ్చే 5,400mAh భారీ బ్యాటరీ ఉండగా.. దీనికి 3W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత నథింగ్ ఓఎస్ తో ఈ ఫోన్ పనిచేస్తుంది.

భారతదేశంలో ఈ Nothing Phone 4b స్మార్ట్‌ఫోన్‌ను వినియోగదారుల బడ్జెట్ కు తగినట్లుగా నాలుగు వేర్వేరు వేరియంట్లను తీసుకురానుంది. ఇందులో బేస్ వేరియంట్ 8GB ర్యామ్, 128GB స్టోరేజ్‌తో ప్రారంభం కానుండగా, గరిష్టంగా 256GB వరకు స్టోరేజ్ లభించనుంది. నథింగ్ ఫోన్ 4b సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను కంపెనీ అప్పర్ మిడ్-రేంజ్ విభాగంలో ప్రవేశపెడుతోంది. భారతీయ మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ. 30,000 కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

వారి రాజకీయ జీవితంతో జగన్ ఆటలు!

YS Jaganmohan Reddy
YS Jaganmohan Reddy

YS Jagan Mohan Reddy: జగన్మోహన్ రెడ్డి మావిగన్ స్పష్టతపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఆందోళన వ్యక్తం అవుతోంది. మొన్న అమరావతి రైతుల కోసం వెళ్ళిన వైసీపీ నేతల పరిస్థితి తెలిసింది. సిఆర్డిఏ పరిరక్షణ కమిటీ పేరుతో అమరావతి ప్రాంతంలో పర్యటించారు వైసీపీ నేతలు. అప్పటికే ఆగ్రహంగా ఉన్న అమరావతి రైతులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మహిళా రైతులు అయితే వెంట పడ్డారు. కోడిగుడ్ల దాడి కూడా జరిగింది. అయితే ఈ ఊహించని పరిణామంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు షాక్ కు గురయ్యారు. తమపై హత్యాయత్నం జరిగిందని రాజకీయ ప్రకటనలతో సరిపెట్టుకున్నారు. అయితే ఆ నేతలంతా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మావిగన్ నిర్ణయంతో ఒక్కసారిగా షాక్ తిన్నారు. అటువంటప్పుడు తమను ఎందుకు పరామర్శకు పంపారు అని బాధపడుతున్నారు.

* సిఆర్డిఏ పరిరక్షణ కమిటీ పేరుతో..
సిఆర్డిఏ పరిరక్షణ కమిటీ పేరుతో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని.. వైసిపి ముఖ్యులు తలసిల రఘురాం, దేవినేని అవినాష్ వంటి వారు అమరావతి ప్రాంతంలో పర్యటించారు. అయితే అక్కడి రైతులు వీరిని అడ్డుకున్నారు. అడ్డగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు అంబటి రాంబాబు. ఓ సీఐ అయితే తోసేశారు. ఈ క్రమంలో అమరావతి రైతులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. కోడిగుడ్లు విసరడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు భయంతో పరుగులు తీశారు. తరువాత ఆ బాధిత వైసిపి నేతలు అంతా మీడియా ముందుకు వచ్చారు. తాము అమరావతికి వ్యతిరేకం కాదు అని.. జగన్మోహన్ రెడ్డికి సైతం ఆ భావన లేదని.. ఆ ప్రాంత రైతులకు న్యాయం చేయాలన్నదే తమ లక్ష్యం అని చెప్పుకొచ్చారు. అక్కడకు రోజుల వ్యవధిలోనే జగన్మోహన్ రెడ్డి మావిగన్ మా రాజధాని స్టాండ్ అంటూ తేల్చేయడంతో వారు పడుతున్న బాధ వర్ణనాతీతం.

* అలవాటైన విద్య..
తన రాజకీయం కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల భవిష్యత్తును పణంగా పెట్టడం జగన్మోహన్ రెడ్డికి అలవాటు అయిన విద్య. కచ్చితంగా ఇప్పుడు పరామర్శకు వెళ్లిన నేతలపై రాజకీయ ప్రభావం ఉంటుంది. ఎందుకంటే కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు అమరావతి రాజధానికి జై కొడుతున్నారు. ఇప్పుడు సిఆర్డిఏ పరిరక్షణ పేరుతో వచ్చిన వైసీపీ నేతలు అంతా ఆ రెండు జిల్లాలకు చెందిన వారే. అమరావతి పై జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న డ్రామాను వారంతా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు తమ ప్రాంతానికి చెందిన నేతలు జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో పడ్డారని భావిస్తున్నారు. మరోసారి వారిని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే తమ రాజకీయ ఎదుగుదల కష్టమని అలా వెళ్ళిన నేతలంతా బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

ఢిల్లీ నాయకులను భయపెట్టిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.. దద్దరిల్లిపోయింది సభ.. వీడియో వైరల్..

Pawan Kalyan Fans
Pawan Kalyan Fans

Pawan Kalyan Fans: ‘ఓజీ’ మూవీ ఆరంభం లో ‘హడలెను ఊరు..విని తనపేరు.. ఓజాస్.. గంభీర’ అనే బ్యాక్ గ్రౌండ్ వోకల్స్ తో ఒక మ్యూజిక్ వస్తుంది గుర్తుందా?, సోషల్ మీడియా లో కూడా ఆ షాట్ విపరీతంగా ట్రెండ్ అయ్యింది. ఈ డైలాగ్ ని ఓజాస్ గంభీర పాత్ర ఎంత పవర్ ఫుల్ అని చెప్పడానికి ఉపయోగించినట్టు గా అనిపించడం లేదు, హీరో పవన్ కళ్యాణ్ పవర్ ఎలాంటిదో చెప్పే డైలాగ్ గా అనిపించింది. ఏ సభ లో అయినా సరే , ఆయన పేరు వినిపిస్తే చాలు , ‘బాహుబలి 2’ చిత్రం లోని ఇంటర్వెల్ సన్నివేశం రిపీట్ అవుతూ ఉంటుంది. అప్పట్లో అడవి శేష్ పవన్ కళ్యాణ్ పేరుని ‘బాహుబలి 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎత్తగానే సభా ప్రాంగణం మొత్తం ఏ స్థాయిలో దద్దరిల్లిపోయిందో మన కళ్లారా చూశాం.

జనాల నుండి వచ్చిన ఆ రెస్పాన్స్ ని చూసి రాజమౌళి సైతం సైతం పట్టుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎన్నో ఈవెంట్స్ లో ఇలాంటి సంఘటనలు జరుగుతూ వచ్చాయి. రీసెంట్ గానే ‘పెద్ది’ మూవీ విజయోత్సవ సభ లో నిర్మాత పవన్ కళ్యాణ్ పేరు ఎత్తగానే ఎంతటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో మన కళ్లారా చూశాము . ఆ ఈవెంట్ కి ముఖ్య అతిథి గా విచ్చేసిన చిరంజీవి సైతం షాక్ కి గురయ్యే పరిస్థితి ఏర్పడింది , డైరెక్టర్ అనిల్ రావిపూడి అయితే చెవులు మూసుకున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే నేడు కూడా రిపీట్ అయ్యింది. నేడు ఆంధ్ర ప్రదేశ్, రాయలసీమ ప్రాంతం లోని రైల్వే కోడూరు లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘VB-G RAM-G’ ప్రోగ్రాం కి సంబంధించిన ప్రారంభోత్సవ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విచ్చేసి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. శివరాజ్ చౌహాన్ తో పాటు , ఢిల్లీ నుండి కొంతమంది ముఖ్య నాయకులు కూడా ఈ సభ కి విచ్చేసారు. అందులో ఒక నాయకుడు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు ఎత్తాడు అంతే, సభా ప్రాంగణం మొత్తం జనాల కేరింతలతో దద్దరిల్లిపోయింది. ఒక 40 సెకండ్ల పాటు ఆయన్ని మాట్లాడనివ్వలేదు. దీంతో ఆ ఢిల్లీ నాయకుడు ఒక్కసారిగా కంగుతిన్నారు. అనంతరం మన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ అధికారి ఆయన వద్దకు వచ్చి , ఇలాంటివి అన్నీ ఇక్కడ మామూలే , మీ ప్రసంగాన్ని కొనసాగించండి అని చెప్పిన విజువల్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇక ఈ ‘VB-G RAM-G’ స్కీం విషయానికి వస్తే , ఈ పధకం ద్వారా దేశం లోని పేద ప్రజలకు 125 రోజుల పాటు పని కల్పించనున్నారు, నేటి నుండి ఈ పధకం అమలులోకి రానుంది. ఈ పధకానికి అర్హులైన కూలీలకు రోజుకి 312 రూపాయిల వేతనాన్ని ఖరారు చేశారు.

త్రిష పెంపుడు కుక్క ఆ యంగ్ హీరోదా ..? సీక్రెట్ లీక్ అయిపోయిందిగా..

Trisha Pet Dog
Trisha Pet Dog

Trisha Pet Dog: సౌత్ ఇండియాలో ప్రస్తుతం త్రిష పేరు ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఎదో ఒక అంశం లో ఆమె పేరు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతూనే ఉంది . ఒకపక్క వరుస బ్లాక్ బస్టర్స్ ని చేస్తూ , కెరీర్ పరంగా పీక్ రేంజ్ లో ఉంది , మరోపక్క ఆమె ప్రియుడు తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి , ప్రస్తుతానికి ఆమె కలలో కూడా ఊహించని జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు త్రిష పెంపుడు కుక్క కూడా సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిపోయింది. ప్రముఖ యంగ్ కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో త్రిష పెంపుడు కుక్కకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఆయన మాట్లాడుతూ ‘ఇప్పటి వరకు ఈ విషయాన్ని నేను ఎక్కడా చెప్పలేదు. కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. నా దగ్గర ఉన్నతివంటి పెంపుడు కుక్క పేరు ‘టెడ్డీ’. ఇది పుడుల్ జాతికి చెందిన కుక్క. దీని కూతురే ఇప్పుడు త్రిష వద్ద పెరుగుతోంది. తన భార్య జ్వాలా గుత్తా త్రిష కి బెస్ట్ ఫ్రెండ్. వాళ్లిద్దరూ తరుచూ కలుస్తుంటారు. ఎక్కువగా కుక్కల గురించి మాట్లాడుకునేవారు. వాళ్ళ మధ్య ఉన్న ఆ సాన్నిహిత్యం వల్లే , నా భార్య త్రిష కి ‘టెడ్డీ’ కూతుర్ని బహుమతిగా ఇచ్చింది. ఈ సీక్రెట్ ని రెవీల్ చేసినందుకు త్రిష ఏమనుకోదని భావిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు విష్ణు విశాల్. త్రిష కి కుక్కలు అంటే ఎంత ప్రాణమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అందుకు ఒక ఉదాహరణ కూడా ఉంది. రీసెంట్ గా తన వ్యక్తిగతం విషయాలపై సోషల్ మీడియా లో ట్రోల్స్ చేసేవారికి త్రిష చాలా గట్టి కౌంటర్ ఇచ్చింది. నా వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అర్హత కేవలం నా పెంపుడు కుక్క కి మాత్రమే అనుమతి ఉంది అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు.

మరి విష్ణు విశాల్ రెవీల్ చేసిన ఈ సీక్రెట్ కి త్రిష కౌంటర్ ఇస్తుందా లేదా అనేది చూడాలి. ఇకపోతే విష్ణు విశాల్ రీసెంట్ గా ‘మట్టి కుస్తీ 2’ అనే చిత్రం చేసారు. ‘మట్టి కుస్తీ’ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా , రేపు తెలుగు , తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ చిత్రం లో కూడా ఐశ్వర్య లెక్ష్మి హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా విష్ణు విశాల్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో పై విషయాన్ని చెప్పుకొచ్చారు.

ఒరేయ్ వైభవ్.. ఒక్కసారి ఇటు చూడరా..

Vaibhav Suryavanshi
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: టీమిండియా తాజా సంచలనం సూర్యవంశీ గురించి మీడియాలో రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ వార్తలు ప్రతి రోజు సంచలనం కలిగిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ అతడి గురించి వార్తలు రాకుండా ఉండడం లేదు. మీడియా అతని మీద ఫోకస్ చేయకుండా ఉండడం లేదు. మీడియాలో అతని గురించి జరుగుతున్న చర్చ మామూలుగా లేదు. అయినప్పటికీ అతని గురించి తెలుసుకోవాలని.. భారతదేశంలో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు.. ప్రపంచ దేశంలో ఉన్నవారు సైతం ఆసక్తిని చూపిస్తున్నారు.

సూర్య వంశీ కి ఇటీవల జాతీయ జట్టులో చోటు లభించింది. అంతకుముందు జరిగిన ఐపీఎల్ లో అతడు అదరగొట్టాడు. ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. అయితే సూర్య వంశీ ఆట తీరు మెచ్చిన మేనేజ్మెంట్ అతడికి ఐర్లాండ్ సిరీస్ లో అవకాశం కల్పించింది. కారణం తెలియదు గానీ అతడికి రెండు మ్యాచ్లలో ఆడే అవకాశం లభించలేదు. ఆ సిరీస్ టీమ్ ఇండియా ఓడిపోయింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టుతో టీమిండియా టి20 మ్యాచ్ల సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్ లో కూడా సూర్య వంశీకి చోటు లభించలేదు.

తొలి మ్యాచ్లో సూర్య వంశీ ఎప్పటిలాగే వాటర్ బాయ్ అవతారం ఎత్తాడు. సీనియర్ ప్లేయర్లు ఆడుతుంటే చూస్తూ ఉండిపోయాడు. సంజు శాంసన్ విఫలమవుతున్నప్పటికీ అతడికి మేనేజ్మెంట్ అవకాశాలు ఇస్తూనే ఉంది.. తాజాగా ఇంగ్లాండ్ సిరీస్ లో కూడా అతడికి అవకాశం కల్పించింది. సూర్యవంశీ రిజర్వ్ బెంచుకు మాత్రమే పరిమితమయ్యాడు. ఈ నేపథ్యంలో సూర్య వంశీ మీద రక రకాల కథనాలు మీడియాలో వస్తున్నాయి.

ఇటీవల జరిగిన ఐర్లాండ్ సిరీస్ లో సూర్య వంశీ వాటర్ బాయ్ పాత్రకు మాత్రమే పరిమితమయ్యాడు. ఈ నేపథ్యంలో అతడితో ఫోటో దిగాలని ఓ తెలుగు అభిమాని భావించాడు. అతడిని అనేక సందర్భాల్లో పిలిచినప్పటికీ పలకలేదు..” ఒరేయ్ సూర్య వంశీ ఇటు చూడు.. ఒక ఫోటో తీసుకొని వెళ్ళిపోతాను” అని అతడు అరిచినప్పటికీ సూర్య వంశీ చూడలేదు. సూర్య వంశీ అంటే తనకు అభిమానమని.. అతని గట్టిగా పిలిచింది కూడా ప్రేమతోనేనని.. ఆ తెలుగు అభిమాని క్లారిటీ ఇచ్చాడు. దానికి సంబంధించిన వీడియో అతడు సోషల్ మీడియాలో అందుబాటులో పెట్టాడు. అది కాస్త చర్చకు దారితీస్తోంది.

'జై హనుమాన్' షూటింగ్ పై సెన్సేషనల్ అప్డేట్.. ఆ ఇద్దరి హీరోలపై భారీ షెడ్యూల్..

Jai-Hanuman-Movie
Jai-Hanuman-Movie

Jai Hanuman Movie: మన టాలీవుడ్ లో చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీ ని సృష్టించిన చిత్రాల్లో ఒకటి ‘హనుమాన్’. ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో తేజ సజ్జ హీరో గా నటించిన ఈ చిత్రానికి 2024 సంక్రాంతి కానుకగా విడుదలై , ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు , త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘గుంటూరు కారం ‘ చిత్రాన్ని సైతం డామినేట్ చేసి 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది. ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుంది అనే విషయం , మొదటి భాగం క్లిఫ్ హ్యాంగర్ సన్నివేశంతోనే చెప్పుకొచ్చారు డైరెక్టర్. ‘జై హనుమాన్’ పేరుతో రీసెంట్ గానే మొదలైన ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అప్డేట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన 20 రోజుల భారీ షెడ్యూల్ ని పూర్తి చేశారట. ఈ షెడ్యూల్ లో ఆంజనేయ స్వామి పాత్ర పోషిస్తున్న రిషబ్ శెట్టి తో పాటు, విలన్ గా నటిస్తున్న దగ్గుబాటి రానా కూడా పాల్గొన్నారు. వీళ్లిద్దరి మధ్య కొన్ని వీరోచిత సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరించారట. ఇకపోతే ఈ చిత్రం లో ‘ధురంధర్’ ఫేమ్ అక్షయ్ ఖన్నా శుక్రాచార్య పాత్రలో కనిపించబోతున్నారట, ఆయనకు సంబంధించిన సన్నివేశాలు తదుపరి షెడ్యూల్ లో చిత్రీకరించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ , టీ సిరీస్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. రీసెంట్ గానే ‘హనుమాన్ ‘ చిత్రాన్ని 3D వెర్షన్ లోకి మార్చి భారీ లెవెల్ లో రీ రిలీజ్ చేశారు. రెస్పాన్స్ అదిరిపోయింది , దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు , ఈ సినిమాపై ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉంది అనేది. మన ఇండియన్ మూవీ లవర్స్ హనుమాన్ ని ఒక సూపర్ హీరో గా చూస్తారు.

ఆయన్ని వెండితెర పై పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేస్తే మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ అవుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి భాగం లో ‘హనుమాన్’ విజువల్స్ కేవలం గ్లింప్స్ లాగా చూపిస్తేనే థియేటర్స్ లో ఆడియన్స్ కి గూస్ బంప్స్ ఫీలింగ్ వచ్చింది. అలాంటిది ‘హనుమాన్’ ని ఫుల్ లెంగ్ స్క్రీన్ టైం లో చూపిస్తే బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్ని అద్భుతాలు క్రియేట్ అవుతాయో వచ్చే ఏడాది మనమంతా చూడబోతున్నాము. ఇకపోతే ‘హనుమాన్’ పాత్రకు రిషబ్ శెట్టి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారు. ఆయన ఎంత గొప్ప నటుడు అనేది ఇప్పటికే ‘కాంతారా’ సిరీస్ తో రుజువు అయ్యింది. ఇక ఈ ‘జై హనుమాన్’ చిత్రం లో ఎంత అద్భుతంగా నటించబోతున్నారో చూడాలి.

ఎట్టకేలకు 'జన నాయగన్' కి విముక్తి.. విడుదల తేదీని గ్రాండ్ గా ప్రకటించిన మేకర్స్..

Jana Nayagan release date
Jana Nayagan release date

Jana Nayagan release date: ఈ ఏడాది జనవరి 9 న సంక్రాంతి కానుకగా విడుదల అవ్వాల్సిన ‘జన నాయగన్ ‘ చిత్రాన్ని, సెన్సార్ సభ్యులు అడ్డుకోవడం వల్ల విడుదల ఆగిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత నిర్మాతలు కోర్టు మెట్లు ఎక్కడం, కోర్టు సినిమాని చూసి సెన్సార్ సభ్యుల నిర్ణయానికి మద్దతుగా తీర్పుని ఇవ్వడం , ఆ తర్వాత సెన్సార్ సభ్యులు చెప్పిన సూచనలను బట్టి కొన్ని సన్నివేశాలను కత్తిరించడం వంటివి జరిగింది. అయినప్పటికీ సెన్సార్ సభ్యులు మొన్నట్టి వరకు ఈ చిత్రానికి సర్టిఫికేట్ ఇవ్వలేదు. ఆ చిత్ర హీరో విజయ్ ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యినప్పటికీ కూడా సెన్సార్ బోర్డు అసలు తగ్గలేదు. అయితే లేటెస్ట్ గా అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు నిన్నటితో పూర్తి అయ్యాయట.

సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి A సర్టిఫికేట్ జారీ చేసినట్టు సమాచారం. ఈ నెల 30 న ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారట. మొత్తానికి విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక , ఆయన అభిమానులు చొక్కాలు చింపుకొని థియేటర్స్ లో చిందులు వేసే సమయం వచ్చేసింది. ఇప్పటికే ఈ చిత్రం ఆన్లైన్ లో లీకైన సంగతి అందరికీ తెలిసిందే. ఎన్నో వేలమంది ఈ చిత్రాన్ని ఇప్పటికే వీక్షించారు. అయినప్పటికీ కూడా ఇది విజయ్ చివరి చిత్రం , పైగా ముఖ్యమంత్రి అయ్యాక ఆయన నుండి విడుదల అవుతున్న సినిమా కావడం తో ప్రేక్షకుల్లో ఈ చిత్రం అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉన్నాయి. మొదట్లో విడుదల అయ్యుంటే ఈ సినిమా ఓపెనింగ్స్ ఎలా ఉండేవో తెలియదు కానీ, ఇప్పుడు మాత్రం కచ్చితంగా ఈ చిత్రానికి మొదటి రోజు 100 కోట్ల గ్రాస్ ఓపెనింగ్ వస్తుందని బలమైన నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు విజయ్ ఫ్యాన్స్.

మరి ఆ రేంజ్ కి ఈ చిత్రం వెళ్తుందో లేదో చూడాలి. మన తెలుగు లో సూపర్ హిట్ గా నిల్చిన బాలయ్య ‘భగవంత్ కేసరి’ చిత్రానికి ఇది రీమేక్. ఇందులో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించగా, విజయ్ కి కూతురు గా ప్రేమలు ఫేమ్ మమిత బైజు నటించింది. అదే విధంగా ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రం లో విలన్ గా నటించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పాటలు , ట్రైలర్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. మరి మేకర్స్ విడుదలకు ముందు వేరే కొత్త కంటెంట్ ని విడుదల చేస్తారో లేదో చూడాలి.

మోహన్ బాబు, రాజశేఖర్ వీళ్ళిద్దరిలో ఎవరు మంచి నటుడు...

Mohan Babu vs Rajasekhar
Mohan Babu vs Rajasekhar

Mohan Babu vs Rajasekhar: ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి నటులు ఇండస్ట్రీకి నాలుగు పిల్లర్లుగా ఉండేవారు… వీళ్లను ప్రేక్షకులు ఆదరించడమే కాకుండా యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ప్రేక్షకులందరు వీళ్ళ అభిమానులుగా మారిపోయారు. ఇక ఇలాంటి క్రమంలోనే వీళ్లతో పాటు మోహన్ బాబు, రాజశేఖర్ లాంటి నటులు కూడా హీరోలుగా రాణిస్తూ సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నారు. నిజానికి మోహన్ బాబు రాజశేఖర్ ల మార్కెట్ ఇప్పుడు పూర్తిగా డౌన్ అయిపోయింది. వాళ్ళతో సినిమాలు చేసే రేంజ్ లో ఎవరు లేరు. కాబట్టి క్యారెక్టర్ ఆర్టిస్టుగా కానీ, విలన్స్ గా వాళ్ళను వాళ్లు ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే మోహన్ బాబు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. ‘ప్యారడైజ్’ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. అలాగే మహేష్ బాబు వాళ్ళ అన్న కొడుకు అయిన జయకృష్ణ హీరోగా వస్తున్న ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. ఇక దీంతో పాటుగా మరికొన్ని సినిమాలకు కూడా కమిట్ అయినట్టుగా తెలుస్తుంది. రాజశేఖర్ నితిన్ హీరోగా వచ్చిన ‘ఎక్స్ట్రాడినరీ మ్యాన్’ అనే సినిమాలో నటించాడు. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో అతనికి ఏమాత్రం గుర్తింపు రాలేదు. ఇక శర్వానంద్ హీరోగా చేసిన ‘బైకర్’ సినిమాలో సైతం హీరో ఫాదర్ క్యారెక్టర్ లో నటించాడు. ఆ సినిమాలో అతని క్యారెక్టర్ కి మంచి గుర్తింపు లభించినప్పటికి సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఆయన కొంతవరకు డీలాపడిపోయాడు. ఇక ఏది ఏమైనా కూడా రాజశేఖర్ నుంచి వచ్చే సినిమాల విషయంలో ఆయన ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి.

తన క్యారెక్టర్ ను ఎంచుకోవడంలో ఆచి చూచి అడుగులు వేస్తున్న కూడా సక్సెస్ ని సాధిస్తేనే ఆయనకు గొప్ప గుర్తింపైతే వస్తుంది లేకపోతే కష్టమనే చెప్పాలి. మోహన్ బాబు రాజశేఖర్ ఇద్దరిలో ఎవరు మంచి నటుడు వాళ్ళిద్దరిలో ఎవరిని సినిమాలో తీసుకుంటే ఆ సినిమాకి ఇంపాక్ట్ పెరుగుతుంది అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి.

నిజానికి వీళ్ళిద్దరు కూడా మంచి నటులే అయినప్పటికి మంచి పాత్ర దొరికితేనే వాళ్ళను వాళ్ళు ఎలివేట్ చేసుకోగలుగుతారు లేకపోతే మాత్రం చాలావరకు డౌన్ అయిపోయే ప్రమాదం అయితే ఉంది. ఇక సోషల్ మీడియాలో వీళ్ళిద్దరి మీద చాలా రకాల చర్చలైతే నడుస్తున్నాయి.

వీళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ నటుడు అని కొంతమంది కొన్ని ప్రశ్నలు అడిగితే కొంతమంది మోహన్ బాబు మంచి నటుడు అని చెబుతుంటే మరి కొంత మంది మాత్రం రాజశేఖర్ గొప్ప నటుడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. నిజానికి ఇద్దరు మంచి నటులే అయినప్పటికి వీళ్లిద్దరూ కూడా చాలా వరకు కాంట్రవర్సీలో ఇరుక్కోవడం వల్ల వాళ్ల సినిమా కెరియర్ ను కోల్పోయారు…

పెట్టుబడుల సదస్సు.. ఆ ఐదు నగరాల్లో సైతం!

Andhra Pradesh Investment Summit 2026
Andhra Pradesh Investment Summit 2026

Andhra Pradesh Investment Summit 2026: ఏపీ ప్రభుత్వం దూకుడు మీద ఉంది. దూకుడు నిర్ణయాలు తీసుకుంటోంది. రాజకీయపరమైన నిర్ణయాలు ఒక వైపు తీసుకుంటూనే.. పాలనాపరంగా కూడా దృష్టి పెట్టింది. పెట్టుబడులు ఆకర్షించే నిరంతర ప్రయత్నం కొనసాగాలని భావిస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది సిఐఐ భాగస్వామి సదస్సు 2026ను నవంబర్లో నిర్వహించేందుకు కసరత్తు మొదలైంది. ఇప్పటికే ఈ సదస్సు నిర్వహణపై ఓ ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. అయితే ఈ సదస్సు ఒక నగరానికి పరిమితం చేయకుండా.. గతానికి భిన్నంగా ప్రాంతీయ స్థాయికి తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు భావించారు. యంత్రాంగానికి కీలక ఆదేశాలు ఇచ్చారు. నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖలో ప్రధాన సదస్సు నిర్వహిస్తారు. అంతకంటే ముందే రాష్ట్రంలోని ఐదు ప్రముఖ నగరాల్లో ప్రాంతీయ భాగస్వామ్య సదస్సులు నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం విశేషం.

* రాష్ట్రవ్యాప్తంగా విస్తరణ..
ప్రస్తుతం ప్రధాన నగరాల జాబితాలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, అనంతపురం, కాకినాడ తదితర నగరాలు ఉన్నాయి. విశాఖలో ప్రధాన సదస్సు జరుగుతున్న దృష్ట్యా మిగతా ఐదు నగరాల్లో ప్రాంతీయ సదస్సులు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల వికేంద్రీకరణ కేవలం ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కాకుండా.. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలనేది సీఎం చంద్రబాబు సంకల్పం. ఏయే ప్రాంతాల్లో ఏయే రంగాలకు చెందిన పరిశ్రమలు స్థాపించేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయో.. గుర్తించేందుకు ఈ ప్రాంతీయ సదస్సులు ఉపయోగపడతాయని అంచనా వేస్తున్నారు. స్థానిక అవసరాలకు తగ్గట్టు ఒప్పందాలు కుదుర్చుకునేలా పక్కాగా ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

గతంలో విశాఖలో పెట్టుబడుల సదస్సు నిర్వహించారు. ఆ సమయంలో ప్రాంతీయ నగరాల పేర్లు పరిగణలోకి వచ్చాయి. పెట్టుబడులు కూడా ఒకే ప్రాంతానికి తరలిస్తున్నారన్న విమర్శ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది. అందుకే ఈసారి పారిశ్రామిక సదస్సులను రీజనల్ స్థాయికి తీసుకెళ్లడం ద్వారా.. ప్రభుత్వ కృషి ప్రజలకు నేరుగా అర్థం కావడంతో పాటు స్థానిక యువతతో పాటు జెన్ జి భాగస్వామ్యం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

* భారీగా ప్రచారం..
విశాఖ పెట్టుబడుల సదస్సుకు భారీగా ప్రచారం కల్పించాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. అందులో భాగంగా జూలై నుంచి సెప్టెంబర్ వరకు దేశంలోని ప్రముఖ నగరాలుగా ఉన్న ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, కోయంబత్తూర్, అహ్మదాబాద్, హైదరాబాదులలో భారీ రోడ్ షోలు నిర్వహించేందుకు అధికారులు షెడ్యూల్ సిద్దం చేశారు. అంతర్జాతీయ డెలిగేట్స్, ప్రముఖ యూనివర్సిటీల నిపుణులు, కేంద్ర మంత్రులతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా లేఖలు రాసి ఆహ్వానించాలని భావిస్తున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనువైన వాతావరణాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేయనున్నారు. పెట్టుబడుల సదస్సులు అంటే కేవలం కంపెనీలతో ఒప్పందాలు కాదు.. అంతర్జాతీయ నిపుణుల ద్వారా నాలెడ్జ్ షేరింగ్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

పాకిస్తాన్‌ ఆర్మీకి విటమిన్‌ ఎం ఇంజక్షన్‌.. పారిపోకుండా పెద్ద స్కెచ్‌

Pakistan Army Salary Hike
Pakistan Army Salary Hike

Pakistan Army Salary Hike: అనేక సమస్యలు, సవాళ్లు, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌ తాజాగా సరిహద్దుల నుంచి అంతర్గత భద్రతా సమస్యల వరకు సైన్యం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇటీవలి సంఘటనలు సైనికుల మనోబలాన్ని ప్రభావితం చేశాయి. దీంతో సైన్యాధ్యక్షుడు ఫీల్డ్‌ మార్షల్‌ ఆసిమ్‌ మునీర్‌ మనోబలం పెంచే ప్రయత్నం చేయాలి. కానీ ఆయనకే మనోబలం తక్కువ. అందుకే మనీ బలంతో సైనికుల్లో ధైర్యంపెంచే ప్రయత్నం చేస్తున్నారు. వేతనాలు, అలవెన్సులు పెంచడం ద్వారా సైనికులను ప్రోత్సహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఆపరేషన్‌ సిందూర్‌ ప్రభావం..
2025 మేలో జరిగిన ఆపరేషన్‌ సిందూర్‌ పాకిస్తాన్‌ వైమానిక రంగంపై గణనీయమైన ప్రభావం చూపిందని నివేదికలు సూచిస్తున్నాయి. రాడార్‌ వ్యవస్థలు, రన్‌వేలు, డ్రోన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లు పనిచేయకపోవడం, నూర్‌ ఖాన్‌ ఎయిర్‌బేస్, కిరాణా హిల్స్‌ వంటి కీలక స్థావరాలపై దెబ్బలు తగిలినట్లు సమాచారం. ఇది సైనికుల్లో భయం, అసహనం పెరగడానికి దోహదపడింది. టీటీపీ (తెహ్రీక్‌–ఎ–తాలిబాన్‌ పాకిస్తాన్‌) దాడులు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలో సైన్యం తన బలగాల మనోబలాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఏర్పడింది.

అంతర్గత భద్రతా సవాళ్లుబ..
లూచిస్తాన్, పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌ (పీవోకే), ఖైబర్‌ పఖ్తూన్ఖ్వా ప్రాంతాల్లో సైనికులపై దాడులు తరచుగా జరుగుతున్నాయి. బలూచ్‌ విముక్తి సంస్థలు, టీటీపీ వంటి సమూహాలు భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. బలూచిస్తాన్‌లోని కొన్ని దాడుల్లో వందలాది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పీవోకేలో సైనికులపై స్థానికుల తిరుగుబాట్లు పెరిగాయి. ప్యాంట్లు, షర్టులు ఊడదీసి కొడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సైనికులు బలూచిస్తాన్‌ వంటి ప్రాంతాల్లో విధులు నిర్వహించడానికి వెనుకాడుతున్నారని, కొందరు భయంతో రాజీనామా చేసినట్లు సమాచారం.

విటమిన్‌ ఎంతో ఊరట..
ఈ నేపథ్యంలో ఆసిమ్‌ మునీర్‌ నేతృత్వంలో సైన్యం సైనికులు, అధికారుల వేతనాలను సుమారు 25 శాతం పెంచింది. ఉదాహరణకు, లక్ష రూపాయల వేతనం ఉన్నవారికి ఇప్పుడు 1.25 లక్షలు లభిస్తాయి. ఇది సైనికుల మనోబలం, ఆత్మవిశ్వాసం పెంచడానికి చేసిన చర్యగా చెబుతున్నారు. పాకిస్తాన్‌ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, సైన్యం ప్రాధాన్యతను ఇచ్చి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.

అలవెన్సుల పెంపు..
వేతనంతోపాటు డిస్టర్బెన్స్‌ అలవెన్స్‌ను మూడింతలు పెంచారు. హై–రిస్క్‌ జోన్లు బలూచిస్తాన్, పీవోకే, ఖైబర్‌ పఖ్తూన్ఖ్వాలో విధులు నిర్వహించే సైనికులకు ఇది అదనపు ప్రోత్సాహం. మంచి పనితీరుకు ఇచ్చే అలవెన్స్‌ను డబుల్‌ చేశారు. బ్యాట్‌మెన్‌ అలవెన్స్, యూనిఫాం అలవెన్స్‌ వంటివి కూడా రెట్టింపు చేశారు. ఈ చర్యలు సైనికులను ఉత్సాహపరచి, ఉద్యోగ వ్యతిరేకతను తగ్గించడానికి ఉద్దేశించినట్లు అర్థం అవుతోంది.

వేతనలా పెంపు మాత్రమే చాలదు..
వేతనాల పెంపు స్వల్పకాలికంగా మనోబలం పెంచవచ్చు. అయితే, దీర్ఘకాలికంగా సైనికుల్లో దేశభక్తి, నాయకత్వంపై నమ్మకం, ఆపరేషన్ల విజయం, దేశ ఆర్థిక స్థిరత్వం వంటి అంశాలు ముఖ్యం. పాకిస్తాన్‌లో సైన్యంలో అసంతృప్తి, ఇమ్రాన్‌ ఖాన్‌ అనుకూలులు, ఫాయిజ్‌ హమీద్‌ అనుకూలులు వంటివారు ఆసిమ్‌ మునీర్‌పై అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో డబ్బు మాత్రమే సమస్యలను పరిష్కరించలేదు. భారత సైన్యంలో వేతనాలు పాకిస్తాన్‌ కంటే ఎక్కువగా ఉన్నాయి. అక్కడ సైనికుల్లో దేశభక్తి, శిక్షణ, నాయకత్వం బలంగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాకిస్తాన్‌లో ఈ అంశాలు బలహీనంగా ఉంటే, వేతనాల పెంపు తాత్కాలిక ఉపశమనం మాత్రమే అవుతుంది.

పాకిస్తాన్‌ సైన్యం ప్రస్తుతం మనోబలం, ఆర్థిక ఒత్తిడి, అంతర్గత దాడుల మధ్య సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. వేతనాలు, అలవెన్సుల పెంపు ఒక అడుగు అయినప్పటికీ, నిజమైన మార్పు కోసం విస్తతమైన సంస్కరణలు, ఆపరేషన్ల విజయం, దేశ ఐక్యత అవసరం.

ప్రకాష్ రాజ్ కు ఉన్న వివాదాలు చాలవా?!

Prakash Raj
Prakash Raj

Prakash Raj: సినీ నటుడు ప్రకాష్ రాజ్ లేనిపోని వివాదాల్లో తల దూర్చుతున్నారు. తాజాగా ఆయన ఏపీలో జరుగుతున్న పరిణామాలపై స్పందించారు. ఇటీవల గోదావరి జిల్లాలో జరిగిన ఓ సభలో మతపరమైన వ్యాఖ్యలు చేసిన వారిని ఏపీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల ఆదేశాలతో జరిగినట్లు.. ఇది మంచి పద్ధతి కాదు అంటూ ప్రకాష్ రాజు ట్విట్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఇప్పటికే ప్రకాష్ రాజ్ కర్ణాటక ధర్మస్థలి వివాదంలో ఉన్నారు. మరోవైపు నాలుగు రాష్ట్రాల్లో ఓటరు గుర్తింపు కలిగి ఉండడం పై కూడా ఆయనపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ ఏపీలో అనవసర వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి గట్టిగానే ఆయనకు హెచ్చరికలు పంపారు. అనవసరంగా ఏపీ విషయంలో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు.

* ప్రశ్నిస్తాను అంటూ..
ప్రకాష్ రాజ్ భారతీయ జనతా పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఆ పార్టీ భావజాలాన్ని తప్పుపడుతున్నారు. ఈ క్రమంలో ఆ పార్టీతో జత కడుతున్న రాజకీయ పార్టీలను టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం ప్రకటనల విషయంలో ప్రకాష్ రాజ్ తీవ్రంగా విభేదిస్తూ అనేక రకాల వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నిస్తాను అంటూ నిత్యం పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ప్రభుత్వ పెద్దలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో యూట్యూబర్ అరెస్టు కాగా.. మరొకరిపై కేసు కూడా నమోదయింది. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ స్పందించారు. ప్రశ్నించే గొంతుకులను నొక్కేస్తారా అంటూ నిలదీశారు.

* ఆ రెండు వివాదాల్లో..
దక్షిణ భారతదేశంలో ఏ పరిణామాలు చోటు చేసుకున్న ప్రకాష్ రాజ్ స్పందిస్తున్నారు. ముఖ్యంగా హిందుత్వ వాదాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇటీవల కర్ణాటక ధర్మస్థలపై అంతర్జాతీయంగా జరిగిన కుట్రలో.. ప్రకాష్ రాజ్ సైతం భాగస్తుడు అని ఆరోపణలు వచ్చాయి. వాటిపై స్పష్టత ఇచ్చే క్రమంలో ప్రకాష్ రాజ్ తడబడ్డారు. కన్నడ మీడియా ముందు మాట్లాడుతూ పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. అక్కడితో ఆగకుండా అలా ప్రశ్నించిన జర్నలిస్టులను పెయిడ్ అంటూ పోల్చారు. ఆ వివాదం అలానే కొనసాగుతుండగా.. ప్రకాష్ రాజ్ దక్షిణాదిలో నాలుగు రాష్ట్రాల్లో ఓటరు ఐడి కలిగి ఉన్నారని కోర్టులో పిటిషన్ దాఖలు అయింది. దానిపై కోర్టు సీరియస్ అయింది. విచారణకు పిలిచిన ప్రకాష్ రాజ్ హాజరు కాలేదు. దీనిపై కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇలా ప్రధానంగా వివాదాల్లో ఉన్న ఆయన ఇప్పుడు ఏపీ రాజకీయ వ్యవహారాల్లో… అందులో మతపరమైన వ్యాఖ్యలు చేసిన వారికి మద్దతుగా నిలుస్తుండడం విశేషం.

'తల్లికి వందనం' పై బిగ్ అప్డేట్!

Thalliki Vandanam Scheme
Thalliki Vandanam Scheme

Thalliki Vandanam Scheme: ఏపీలో తల్లికి వందనం పథకం పై స్పష్టత వచ్చింది. లక్షలాదిమంది విద్యార్థులు చదువు సాయం కోసం ఎదురుచూస్తుండగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టమైన ప్రకటన చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు వారాలు గడుస్తున్న నేపథ్యంలో.. దీనిపై స్పష్టతనిచ్చారు. ఈనెల లోనే తల్లికి వందనం సాయం చేస్తామని చెబుతున్నారు. ఇప్పటికే అంతర్గతంగా విద్యాశాఖకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈనెల 16 నుంచి మూడు రోజుల్లో జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హౌస్ మ్యాపింగ్ సర్వే పూర్తి కావడంతో.. జాబితాలను సచివాలయాల వారిగా విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది.

* ఎంతమంది పిల్లలు ఉన్నా..
పిల్లల చదువు కోసం ఏటా తల్లికి వందనం పథకం కింద నిధులు జమ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15 వేల రూపాయల చొప్పున జమ చేస్తూ వస్తున్నారు. ఈ ఏడాది కూడా ఈ పథకానికి దరఖాస్తులను పాఠశాలల ద్వారా ఆహ్వానించారు. ఇలా వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయి పరిశీలనకు ప్రభుత్వం పంపింది. సచివాలయ ఉద్యోగులు క్షేత్రస్థాయిలో ఈ నిధులను అందుకునేందుకు అర్హులైన తల్లులను గుర్తించారు. త్వరలో సచివాలయాల వారీగా జాబితాలను ప్రదర్శించనున్నారు. ఈ ఏడాది పాఠ్యపుస్తకాలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆలస్యంగా అందాయి. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి కిట్లు కూడా అందుబాటులోకి రాలేదు తగినంతగా. దానికి కారణం పశ్చిమ ఆసియాలో యుద్ధం. ఆ కిట్లకు సంబంధించి ముడి సరుకులు రాకపోవడంతో.. ఇబ్బందులు ఎదురయ్యాయి.

* జూలై మూడో వారంలో..
వేసవి సెలవులు అనంతరం.. గత నెల 12న పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. ఇప్పుడు జూలై మొదటి వారం దాటుతోంది. తల్లికి వందనం నిధులు విడుదల కాకపోవడం పై విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ పెట్టి తల్లికి వందనం నిధులు జమ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఈనెల మూడో వారంలో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై స్పష్టమైన ప్రకటన చేశారు మంత్రి లోకేష్. మరోవైపు సీఎం చంద్రబాబు సైతం పలికి వందనం నిధుల విడుదలపై స్పష్టతనిచ్చారు. అన్నీ కుదిరితే ఈ నెల 16 నుంచి 18 లోపు తల్లికి వందనం నిధులు జమ కావడం ఖాయం. అయితే ఈసారి విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మరోవైపు తప్పిదాలు సరిచేసుకునే అవకాశం కూడా ఇవ్వనున్నారు. అర్హత ఉండే వివిధ కారణాలతో సాయం దక్కని వారికి.. మరోసారి గ్రీవెన్స్ కు వెళ్లే ఛాన్స్ ఇవ్వనున్నారు. ముందుగా సచివాలయాల వారీగా అర్హుల జాబితాను ప్రదర్శిస్తారు. తరువాత అభ్యంతరాలను స్వీకరిస్తారు.

హైకోర్టుకు ఎదురెళ్లి సవాల్ చేసిన విజయ్..ఇది మాములు సంచలనం కాదు

CM Vijay
CM Vijay

CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ దూకుడుగా వెళ్తున్నారు. రాజకీయంగా ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. తన ప్రభుత్వాన్ని కూల్చి వేయడానికి అక్కడి ప్రతిపక్షం చేస్తున్న వ్యవహారాన్ని ఇటీవల బట్ట బయలు చేశారు. అంతటితోనే విజయ్ ఆగడం లేదు. ఇప్పుడు ఏకంగా అక్కడి న్యాయస్థానానికే ఎదురు వెళ్తున్నారు. వాస్తవానికి ఈ తీర్పును మద్రాస్ హైకోర్టు తన పరిధిని దాటి ఇచ్చిందని టీవీకి నేతలు అభిప్రాయపడుతున్నారు.

తమిళనాడు రాష్ట్రంలో ఎద్దులు, ఆవులు, దూడల వధకు సంబంధించి మద్రాస్ హైకోర్టు సంపూర్ణ నిషేధాన్ని అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విజయ్ ఆధ్వర్యంలోని టీవీకే ప్రభుత్వం హైకోర్టు తీర్పును తీవ్రంగా తప్పు పట్టింది. అంతేకాదు ఏకంగా దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

గత నెల 27న మద్రాస్ హైకోర్టు ఒక కీలక తీర్పును వెల్లడించింది. తమిళనాడు రాష్ట్రంలో బక్రీద్ తో పాటు ఇతర పండగల సందర్భంగా జంతువులను చంపడాన్ని పూర్తిగా నిషేధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై విజయ్ ప్రభుత్వం వెంటనే స్పందించింది. దేశ సర్వోన్నత న్యాయస్థానంలో తనదైన వాదనలు వినిపించింది.. 1958 నుంచి తమిళనాడు రాష్ట్రంలో జంతు సంరక్షణ చట్టం అమల్లో ఉందని.. దాని ప్రకారం 10 సంవత్సరాల పైన ఉండి.. సంతాన ఉత్పత్తికి పనికిరాని జంతువులను మాత్రమే వధించడానికి అనుమతి ఉంది. మద్రాస్ హైకోర్టు దీనిని పక్కన పెట్టింది. సంపూర్ణ నిషేధాన్ని విధించడం ఏకంగా న్యాయస్థానాల పరిధి దాటి వ్యవహరించడమేనని ప్రభుత్వం వ్యాఖ్యానించింది. కోయంబత్తూర్ లాంటి ప్రాంతంలో బక్రీద్ లాంటి పండుగ జరిగినప్పుడు బహిరంగ ప్రదేశాలలో జంతువులను చంపడాన్ని నిషేధించాలని మాత్రమే పిటిషనర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారని ప్రభుత్వం స్పష్టం చేసింది.. పిటిషనర్ అడగకుండానే పూర్తి నిషేధాన్ని విధించడం సరికాదని సుప్రీంకోర్టు దృష్టికి తమిళ్నాడు ప్రభుత్వం తీసుకెళ్లింది.

తమిళనాడు హైకోర్టు ఇచ్చిన తీర్పును అక్కడి పార్టీలు స్వాగతించడం లేదు. కోర్టుల పరిధి దాటి తీర్పులు ఇవ్వకూడదని.. మత సంప్రదాయాలను తొక్కిపెట్టకూడదని తమిళనాడు రాజకీయ పార్టీ నాయకులు అంటున్నారు.. పాలు ఇచ్చే ఆవులను ఎవరూ చంపరని.. అయితే కోర్టు ఇచ్చిన తీర్పు అనేక రకాలుగా ప్రభావం చూపిస్తోందని అక్కడి రాజకీయ పార్టీల నాయకులు అంటున్నారు. కేవలం ముస్లింలు మాత్రమే జంతువులను వధించరని.. హిందువులు కూడా వారి పండుగ సమయంలో జంతువులను చంపుతారని.. కోర్టు ఇచ్చిన నిబంధనలు స్థానికంగా ఇబ్బందికరమైన వాతావరణాన్ని కలగజేస్తోందని అక్కడి రాజకీయ పార్టీల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

కేవలం లైసెన్స్ పొందిన కసాయి కేంద్రాలలో మాత్రమే జంతువులను చంపాలి అని అనడం సరికాదని.. పండుగ సమయంలో డిమాండ్ తట్టుకునే సామర్థ్యం కసాయి కేంద్రాలకు లేదని అక్కడి పార్టీల నేతలు చెబుతున్నారు. అధికార టీవీకే పార్టీ స్పందించిన తీరు పట్ల కొంతమంది స్వాగతిస్తుండగా.. మరి కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. అయితే ఈ అంశంపై చాలా ఆలస్యంగా టీవీకే సుప్రీంకోర్టు దాకా వెళ్ళిందని.. అక్కడి రాజకీయ విశ్లేషకులు అంటుంటే.. సున్నితమైన అంశం కాబట్టి.. అనేక రకాలుగా చర్చించి ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని టీవీకే నేతలు చెబుతున్నారు.

త్రివిక్రమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ కి రాజమౌళి సంబంధం ఏంటంటే..?

Trivikram Srinivas Dream Project
Trivikram Srinivas Dream Project

Trivikram Srinivas Dream Project: మాటల మాంత్రికుడిగా గుర్తింపును సంపాదించిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్… ఆయన సినిమాల్లో మాటలతో గారడీలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. కామెడీ సన్నివేశాలతో ప్రేక్షకులను మెప్పించడంలో ఆయనను మించిన వారు ఎవరు లేరు. అలాంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మధ్యకాలంలో కొంతవరకు డౌన్ అయ్యాడు. ఇక ఇప్పుడు వెంకటేష్ తో చేసిన ‘ఆదర్శ కుటుంబం’ సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ తో గాడ్ ఆఫ్ వార్ అనే మైథాలాజికల్ సినిమా కూడా చేస్తున్నాడు. దానికి సంబంధించిన అనౌన్స్ మెంట్ కూడా రీసెంట్ గానే ఇచ్చారు. మొత్తానికైతే ఈ సినిమా విషయంలో త్రివిక్రమ్ చాలా క్లారిటీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే త్రివిక్రమ్ డ్రీమ్ ప్రాజెక్టుగా ఒక సినిమా అయితే పెట్టుకున్నాడట… మహాభారతంలోని కురుక్షేత్రాన్ని బేస్ చేసుకుని ఒక సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్నాడట. అది తన డ్రీం ప్రాజెక్టు అని కూడా తన సన్నిహితుల దగ్గర చెబుతున్నాడట. మహాభారతం మొత్తం కాకుండా ఓన్లీ కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించిన ఎపిసోడ్స్ మాత్రమే తను చిత్రీకరించడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ చేయాలంటే ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలు అవసరం అవుతారని తను భావిస్తున్నాడట. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే రాజమౌళి సైతం మహాభారతం సినిమాని చేయడం తన డ్రీమ్ అంటూ పలు సందర్భాల్లో చెబుతూ వచ్చాడు.

ఇక మధ్యలో త్రివిక్రమ్ కూడా మహాభారతాన్ని బేస్ చేసుకొని ఒక సినిమాను చేయాలనుకుంటున్నాడు. కాబట్టి వీళ్లిద్దరిలో ఎవరు ఆ సినిమా చేస్తారు. ఒకవేళ ఇద్దరు చేస్తే అందులో ఎవరు సక్సెస్ సాధిస్తారు అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

ఇక ఇద్దరు దర్శకులు కూడా ఒకే సినిమాను వాళ్ల డ్రీమ్ ప్రాజెక్ట్ గా పెట్టుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇందులో ఎవరు ముందుగా సినిమాని తెరకెక్కిస్తారు. ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఒకరు కాంప్రమైజ్ అవుతారా? అసలేం జరగబోతుంది…