Home Blog Page 40

మోహన్ బాబు, రాజశేఖర్ వీళ్ళిద్దరిలో ఎవరు మంచి నటుడు...

Mohan Babu vs Rajasekhar
Mohan Babu vs Rajasekhar

Mohan Babu vs Rajasekhar: ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి నటులు ఇండస్ట్రీకి నాలుగు పిల్లర్లుగా ఉండేవారు… వీళ్లను ప్రేక్షకులు ఆదరించడమే కాకుండా యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ప్రేక్షకులందరు వీళ్ళ అభిమానులుగా మారిపోయారు. ఇక ఇలాంటి క్రమంలోనే వీళ్లతో పాటు మోహన్ బాబు, రాజశేఖర్ లాంటి నటులు కూడా హీరోలుగా రాణిస్తూ సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నారు. నిజానికి మోహన్ బాబు రాజశేఖర్ ల మార్కెట్ ఇప్పుడు పూర్తిగా డౌన్ అయిపోయింది. వాళ్ళతో సినిమాలు చేసే రేంజ్ లో ఎవరు లేరు. కాబట్టి క్యారెక్టర్ ఆర్టిస్టుగా కానీ, విలన్స్ గా వాళ్ళను వాళ్లు ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే మోహన్ బాబు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. ‘ప్యారడైజ్’ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. అలాగే మహేష్ బాబు వాళ్ళ అన్న కొడుకు అయిన జయకృష్ణ హీరోగా వస్తున్న ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. ఇక దీంతో పాటుగా మరికొన్ని సినిమాలకు కూడా కమిట్ అయినట్టుగా తెలుస్తుంది. రాజశేఖర్ నితిన్ హీరోగా వచ్చిన ‘ఎక్స్ట్రాడినరీ మ్యాన్’ అనే సినిమాలో నటించాడు. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో అతనికి ఏమాత్రం గుర్తింపు రాలేదు. ఇక శర్వానంద్ హీరోగా చేసిన ‘బైకర్’ సినిమాలో సైతం హీరో ఫాదర్ క్యారెక్టర్ లో నటించాడు. ఆ సినిమాలో అతని క్యారెక్టర్ కి మంచి గుర్తింపు లభించినప్పటికి సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఆయన కొంతవరకు డీలాపడిపోయాడు. ఇక ఏది ఏమైనా కూడా రాజశేఖర్ నుంచి వచ్చే సినిమాల విషయంలో ఆయన ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి.

తన క్యారెక్టర్ ను ఎంచుకోవడంలో ఆచి చూచి అడుగులు వేస్తున్న కూడా సక్సెస్ ని సాధిస్తేనే ఆయనకు గొప్ప గుర్తింపైతే వస్తుంది లేకపోతే కష్టమనే చెప్పాలి. మోహన్ బాబు రాజశేఖర్ ఇద్దరిలో ఎవరు మంచి నటుడు వాళ్ళిద్దరిలో ఎవరిని సినిమాలో తీసుకుంటే ఆ సినిమాకి ఇంపాక్ట్ పెరుగుతుంది అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి.

నిజానికి వీళ్ళిద్దరు కూడా మంచి నటులే అయినప్పటికి మంచి పాత్ర దొరికితేనే వాళ్ళను వాళ్ళు ఎలివేట్ చేసుకోగలుగుతారు లేకపోతే మాత్రం చాలావరకు డౌన్ అయిపోయే ప్రమాదం అయితే ఉంది. ఇక సోషల్ మీడియాలో వీళ్ళిద్దరి మీద చాలా రకాల చర్చలైతే నడుస్తున్నాయి.

వీళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ నటుడు అని కొంతమంది కొన్ని ప్రశ్నలు అడిగితే కొంతమంది మోహన్ బాబు మంచి నటుడు అని చెబుతుంటే మరి కొంత మంది మాత్రం రాజశేఖర్ గొప్ప నటుడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. నిజానికి ఇద్దరు మంచి నటులే అయినప్పటికి వీళ్లిద్దరూ కూడా చాలా వరకు కాంట్రవర్సీలో ఇరుక్కోవడం వల్ల వాళ్ల సినిమా కెరియర్ ను కోల్పోయారు…

పెట్టుబడుల సదస్సు.. ఆ ఐదు నగరాల్లో సైతం!

Andhra Pradesh Investment Summit 2026
Andhra Pradesh Investment Summit 2026

Andhra Pradesh Investment Summit 2026: ఏపీ ప్రభుత్వం దూకుడు మీద ఉంది. దూకుడు నిర్ణయాలు తీసుకుంటోంది. రాజకీయపరమైన నిర్ణయాలు ఒక వైపు తీసుకుంటూనే.. పాలనాపరంగా కూడా దృష్టి పెట్టింది. పెట్టుబడులు ఆకర్షించే నిరంతర ప్రయత్నం కొనసాగాలని భావిస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది సిఐఐ భాగస్వామి సదస్సు 2026ను నవంబర్లో నిర్వహించేందుకు కసరత్తు మొదలైంది. ఇప్పటికే ఈ సదస్సు నిర్వహణపై ఓ ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. అయితే ఈ సదస్సు ఒక నగరానికి పరిమితం చేయకుండా.. గతానికి భిన్నంగా ప్రాంతీయ స్థాయికి తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు భావించారు. యంత్రాంగానికి కీలక ఆదేశాలు ఇచ్చారు. నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖలో ప్రధాన సదస్సు నిర్వహిస్తారు. అంతకంటే ముందే రాష్ట్రంలోని ఐదు ప్రముఖ నగరాల్లో ప్రాంతీయ భాగస్వామ్య సదస్సులు నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం విశేషం.

* రాష్ట్రవ్యాప్తంగా విస్తరణ..
ప్రస్తుతం ప్రధాన నగరాల జాబితాలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, అనంతపురం, కాకినాడ తదితర నగరాలు ఉన్నాయి. విశాఖలో ప్రధాన సదస్సు జరుగుతున్న దృష్ట్యా మిగతా ఐదు నగరాల్లో ప్రాంతీయ సదస్సులు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల వికేంద్రీకరణ కేవలం ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కాకుండా.. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలనేది సీఎం చంద్రబాబు సంకల్పం. ఏయే ప్రాంతాల్లో ఏయే రంగాలకు చెందిన పరిశ్రమలు స్థాపించేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయో.. గుర్తించేందుకు ఈ ప్రాంతీయ సదస్సులు ఉపయోగపడతాయని అంచనా వేస్తున్నారు. స్థానిక అవసరాలకు తగ్గట్టు ఒప్పందాలు కుదుర్చుకునేలా పక్కాగా ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

గతంలో విశాఖలో పెట్టుబడుల సదస్సు నిర్వహించారు. ఆ సమయంలో ప్రాంతీయ నగరాల పేర్లు పరిగణలోకి వచ్చాయి. పెట్టుబడులు కూడా ఒకే ప్రాంతానికి తరలిస్తున్నారన్న విమర్శ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది. అందుకే ఈసారి పారిశ్రామిక సదస్సులను రీజనల్ స్థాయికి తీసుకెళ్లడం ద్వారా.. ప్రభుత్వ కృషి ప్రజలకు నేరుగా అర్థం కావడంతో పాటు స్థానిక యువతతో పాటు జెన్ జి భాగస్వామ్యం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

* భారీగా ప్రచారం..
విశాఖ పెట్టుబడుల సదస్సుకు భారీగా ప్రచారం కల్పించాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. అందులో భాగంగా జూలై నుంచి సెప్టెంబర్ వరకు దేశంలోని ప్రముఖ నగరాలుగా ఉన్న ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, కోయంబత్తూర్, అహ్మదాబాద్, హైదరాబాదులలో భారీ రోడ్ షోలు నిర్వహించేందుకు అధికారులు షెడ్యూల్ సిద్దం చేశారు. అంతర్జాతీయ డెలిగేట్స్, ప్రముఖ యూనివర్సిటీల నిపుణులు, కేంద్ర మంత్రులతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా లేఖలు రాసి ఆహ్వానించాలని భావిస్తున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనువైన వాతావరణాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేయనున్నారు. పెట్టుబడుల సదస్సులు అంటే కేవలం కంపెనీలతో ఒప్పందాలు కాదు.. అంతర్జాతీయ నిపుణుల ద్వారా నాలెడ్జ్ షేరింగ్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

పాకిస్తాన్‌ ఆర్మీకి విటమిన్‌ ఎం ఇంజక్షన్‌.. పారిపోకుండా పెద్ద స్కెచ్‌

Pakistan Army Salary Hike
Pakistan Army Salary Hike

Pakistan Army Salary Hike: అనేక సమస్యలు, సవాళ్లు, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌ తాజాగా సరిహద్దుల నుంచి అంతర్గత భద్రతా సమస్యల వరకు సైన్యం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇటీవలి సంఘటనలు సైనికుల మనోబలాన్ని ప్రభావితం చేశాయి. దీంతో సైన్యాధ్యక్షుడు ఫీల్డ్‌ మార్షల్‌ ఆసిమ్‌ మునీర్‌ మనోబలం పెంచే ప్రయత్నం చేయాలి. కానీ ఆయనకే మనోబలం తక్కువ. అందుకే మనీ బలంతో సైనికుల్లో ధైర్యంపెంచే ప్రయత్నం చేస్తున్నారు. వేతనాలు, అలవెన్సులు పెంచడం ద్వారా సైనికులను ప్రోత్సహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఆపరేషన్‌ సిందూర్‌ ప్రభావం..
2025 మేలో జరిగిన ఆపరేషన్‌ సిందూర్‌ పాకిస్తాన్‌ వైమానిక రంగంపై గణనీయమైన ప్రభావం చూపిందని నివేదికలు సూచిస్తున్నాయి. రాడార్‌ వ్యవస్థలు, రన్‌వేలు, డ్రోన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లు పనిచేయకపోవడం, నూర్‌ ఖాన్‌ ఎయిర్‌బేస్, కిరాణా హిల్స్‌ వంటి కీలక స్థావరాలపై దెబ్బలు తగిలినట్లు సమాచారం. ఇది సైనికుల్లో భయం, అసహనం పెరగడానికి దోహదపడింది. టీటీపీ (తెహ్రీక్‌–ఎ–తాలిబాన్‌ పాకిస్తాన్‌) దాడులు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలో సైన్యం తన బలగాల మనోబలాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఏర్పడింది.

అంతర్గత భద్రతా సవాళ్లుబ..
లూచిస్తాన్, పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌ (పీవోకే), ఖైబర్‌ పఖ్తూన్ఖ్వా ప్రాంతాల్లో సైనికులపై దాడులు తరచుగా జరుగుతున్నాయి. బలూచ్‌ విముక్తి సంస్థలు, టీటీపీ వంటి సమూహాలు భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. బలూచిస్తాన్‌లోని కొన్ని దాడుల్లో వందలాది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పీవోకేలో సైనికులపై స్థానికుల తిరుగుబాట్లు పెరిగాయి. ప్యాంట్లు, షర్టులు ఊడదీసి కొడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సైనికులు బలూచిస్తాన్‌ వంటి ప్రాంతాల్లో విధులు నిర్వహించడానికి వెనుకాడుతున్నారని, కొందరు భయంతో రాజీనామా చేసినట్లు సమాచారం.

విటమిన్‌ ఎంతో ఊరట..
ఈ నేపథ్యంలో ఆసిమ్‌ మునీర్‌ నేతృత్వంలో సైన్యం సైనికులు, అధికారుల వేతనాలను సుమారు 25 శాతం పెంచింది. ఉదాహరణకు, లక్ష రూపాయల వేతనం ఉన్నవారికి ఇప్పుడు 1.25 లక్షలు లభిస్తాయి. ఇది సైనికుల మనోబలం, ఆత్మవిశ్వాసం పెంచడానికి చేసిన చర్యగా చెబుతున్నారు. పాకిస్తాన్‌ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, సైన్యం ప్రాధాన్యతను ఇచ్చి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.

అలవెన్సుల పెంపు..
వేతనంతోపాటు డిస్టర్బెన్స్‌ అలవెన్స్‌ను మూడింతలు పెంచారు. హై–రిస్క్‌ జోన్లు బలూచిస్తాన్, పీవోకే, ఖైబర్‌ పఖ్తూన్ఖ్వాలో విధులు నిర్వహించే సైనికులకు ఇది అదనపు ప్రోత్సాహం. మంచి పనితీరుకు ఇచ్చే అలవెన్స్‌ను డబుల్‌ చేశారు. బ్యాట్‌మెన్‌ అలవెన్స్, యూనిఫాం అలవెన్స్‌ వంటివి కూడా రెట్టింపు చేశారు. ఈ చర్యలు సైనికులను ఉత్సాహపరచి, ఉద్యోగ వ్యతిరేకతను తగ్గించడానికి ఉద్దేశించినట్లు అర్థం అవుతోంది.

వేతనలా పెంపు మాత్రమే చాలదు..
వేతనాల పెంపు స్వల్పకాలికంగా మనోబలం పెంచవచ్చు. అయితే, దీర్ఘకాలికంగా సైనికుల్లో దేశభక్తి, నాయకత్వంపై నమ్మకం, ఆపరేషన్ల విజయం, దేశ ఆర్థిక స్థిరత్వం వంటి అంశాలు ముఖ్యం. పాకిస్తాన్‌లో సైన్యంలో అసంతృప్తి, ఇమ్రాన్‌ ఖాన్‌ అనుకూలులు, ఫాయిజ్‌ హమీద్‌ అనుకూలులు వంటివారు ఆసిమ్‌ మునీర్‌పై అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో డబ్బు మాత్రమే సమస్యలను పరిష్కరించలేదు. భారత సైన్యంలో వేతనాలు పాకిస్తాన్‌ కంటే ఎక్కువగా ఉన్నాయి. అక్కడ సైనికుల్లో దేశభక్తి, శిక్షణ, నాయకత్వం బలంగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాకిస్తాన్‌లో ఈ అంశాలు బలహీనంగా ఉంటే, వేతనాల పెంపు తాత్కాలిక ఉపశమనం మాత్రమే అవుతుంది.

పాకిస్తాన్‌ సైన్యం ప్రస్తుతం మనోబలం, ఆర్థిక ఒత్తిడి, అంతర్గత దాడుల మధ్య సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. వేతనాలు, అలవెన్సుల పెంపు ఒక అడుగు అయినప్పటికీ, నిజమైన మార్పు కోసం విస్తతమైన సంస్కరణలు, ఆపరేషన్ల విజయం, దేశ ఐక్యత అవసరం.

ప్రకాష్ రాజ్ కు ఉన్న వివాదాలు చాలవా?!

Prakash Raj
Prakash Raj

Prakash Raj: సినీ నటుడు ప్రకాష్ రాజ్ లేనిపోని వివాదాల్లో తల దూర్చుతున్నారు. తాజాగా ఆయన ఏపీలో జరుగుతున్న పరిణామాలపై స్పందించారు. ఇటీవల గోదావరి జిల్లాలో జరిగిన ఓ సభలో మతపరమైన వ్యాఖ్యలు చేసిన వారిని ఏపీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల ఆదేశాలతో జరిగినట్లు.. ఇది మంచి పద్ధతి కాదు అంటూ ప్రకాష్ రాజు ట్విట్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఇప్పటికే ప్రకాష్ రాజ్ కర్ణాటక ధర్మస్థలి వివాదంలో ఉన్నారు. మరోవైపు నాలుగు రాష్ట్రాల్లో ఓటరు గుర్తింపు కలిగి ఉండడం పై కూడా ఆయనపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ ఏపీలో అనవసర వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి గట్టిగానే ఆయనకు హెచ్చరికలు పంపారు. అనవసరంగా ఏపీ విషయంలో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు.

* ప్రశ్నిస్తాను అంటూ..
ప్రకాష్ రాజ్ భారతీయ జనతా పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఆ పార్టీ భావజాలాన్ని తప్పుపడుతున్నారు. ఈ క్రమంలో ఆ పార్టీతో జత కడుతున్న రాజకీయ పార్టీలను టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం ప్రకటనల విషయంలో ప్రకాష్ రాజ్ తీవ్రంగా విభేదిస్తూ అనేక రకాల వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నిస్తాను అంటూ నిత్యం పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ప్రభుత్వ పెద్దలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో యూట్యూబర్ అరెస్టు కాగా.. మరొకరిపై కేసు కూడా నమోదయింది. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ స్పందించారు. ప్రశ్నించే గొంతుకులను నొక్కేస్తారా అంటూ నిలదీశారు.

* ఆ రెండు వివాదాల్లో..
దక్షిణ భారతదేశంలో ఏ పరిణామాలు చోటు చేసుకున్న ప్రకాష్ రాజ్ స్పందిస్తున్నారు. ముఖ్యంగా హిందుత్వ వాదాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇటీవల కర్ణాటక ధర్మస్థలపై అంతర్జాతీయంగా జరిగిన కుట్రలో.. ప్రకాష్ రాజ్ సైతం భాగస్తుడు అని ఆరోపణలు వచ్చాయి. వాటిపై స్పష్టత ఇచ్చే క్రమంలో ప్రకాష్ రాజ్ తడబడ్డారు. కన్నడ మీడియా ముందు మాట్లాడుతూ పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. అక్కడితో ఆగకుండా అలా ప్రశ్నించిన జర్నలిస్టులను పెయిడ్ అంటూ పోల్చారు. ఆ వివాదం అలానే కొనసాగుతుండగా.. ప్రకాష్ రాజ్ దక్షిణాదిలో నాలుగు రాష్ట్రాల్లో ఓటరు ఐడి కలిగి ఉన్నారని కోర్టులో పిటిషన్ దాఖలు అయింది. దానిపై కోర్టు సీరియస్ అయింది. విచారణకు పిలిచిన ప్రకాష్ రాజ్ హాజరు కాలేదు. దీనిపై కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇలా ప్రధానంగా వివాదాల్లో ఉన్న ఆయన ఇప్పుడు ఏపీ రాజకీయ వ్యవహారాల్లో… అందులో మతపరమైన వ్యాఖ్యలు చేసిన వారికి మద్దతుగా నిలుస్తుండడం విశేషం.

'తల్లికి వందనం' పై బిగ్ అప్డేట్!

Thalliki Vandanam Scheme
Thalliki Vandanam Scheme

Thalliki Vandanam Scheme: ఏపీలో తల్లికి వందనం పథకం పై స్పష్టత వచ్చింది. లక్షలాదిమంది విద్యార్థులు చదువు సాయం కోసం ఎదురుచూస్తుండగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టమైన ప్రకటన చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు వారాలు గడుస్తున్న నేపథ్యంలో.. దీనిపై స్పష్టతనిచ్చారు. ఈనెల లోనే తల్లికి వందనం సాయం చేస్తామని చెబుతున్నారు. ఇప్పటికే అంతర్గతంగా విద్యాశాఖకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈనెల 16 నుంచి మూడు రోజుల్లో జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హౌస్ మ్యాపింగ్ సర్వే పూర్తి కావడంతో.. జాబితాలను సచివాలయాల వారిగా విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది.

* ఎంతమంది పిల్లలు ఉన్నా..
పిల్లల చదువు కోసం ఏటా తల్లికి వందనం పథకం కింద నిధులు జమ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15 వేల రూపాయల చొప్పున జమ చేస్తూ వస్తున్నారు. ఈ ఏడాది కూడా ఈ పథకానికి దరఖాస్తులను పాఠశాలల ద్వారా ఆహ్వానించారు. ఇలా వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయి పరిశీలనకు ప్రభుత్వం పంపింది. సచివాలయ ఉద్యోగులు క్షేత్రస్థాయిలో ఈ నిధులను అందుకునేందుకు అర్హులైన తల్లులను గుర్తించారు. త్వరలో సచివాలయాల వారీగా జాబితాలను ప్రదర్శించనున్నారు. ఈ ఏడాది పాఠ్యపుస్తకాలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆలస్యంగా అందాయి. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి కిట్లు కూడా అందుబాటులోకి రాలేదు తగినంతగా. దానికి కారణం పశ్చిమ ఆసియాలో యుద్ధం. ఆ కిట్లకు సంబంధించి ముడి సరుకులు రాకపోవడంతో.. ఇబ్బందులు ఎదురయ్యాయి.

* జూలై మూడో వారంలో..
వేసవి సెలవులు అనంతరం.. గత నెల 12న పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. ఇప్పుడు జూలై మొదటి వారం దాటుతోంది. తల్లికి వందనం నిధులు విడుదల కాకపోవడం పై విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ పెట్టి తల్లికి వందనం నిధులు జమ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఈనెల మూడో వారంలో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై స్పష్టమైన ప్రకటన చేశారు మంత్రి లోకేష్. మరోవైపు సీఎం చంద్రబాబు సైతం పలికి వందనం నిధుల విడుదలపై స్పష్టతనిచ్చారు. అన్నీ కుదిరితే ఈ నెల 16 నుంచి 18 లోపు తల్లికి వందనం నిధులు జమ కావడం ఖాయం. అయితే ఈసారి విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మరోవైపు తప్పిదాలు సరిచేసుకునే అవకాశం కూడా ఇవ్వనున్నారు. అర్హత ఉండే వివిధ కారణాలతో సాయం దక్కని వారికి.. మరోసారి గ్రీవెన్స్ కు వెళ్లే ఛాన్స్ ఇవ్వనున్నారు. ముందుగా సచివాలయాల వారీగా అర్హుల జాబితాను ప్రదర్శిస్తారు. తరువాత అభ్యంతరాలను స్వీకరిస్తారు.

హైకోర్టుకు ఎదురెళ్లి సవాల్ చేసిన విజయ్..ఇది మాములు సంచలనం కాదు

CM Vijay
CM Vijay

CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ దూకుడుగా వెళ్తున్నారు. రాజకీయంగా ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. తన ప్రభుత్వాన్ని కూల్చి వేయడానికి అక్కడి ప్రతిపక్షం చేస్తున్న వ్యవహారాన్ని ఇటీవల బట్ట బయలు చేశారు. అంతటితోనే విజయ్ ఆగడం లేదు. ఇప్పుడు ఏకంగా అక్కడి న్యాయస్థానానికే ఎదురు వెళ్తున్నారు. వాస్తవానికి ఈ తీర్పును మద్రాస్ హైకోర్టు తన పరిధిని దాటి ఇచ్చిందని టీవీకి నేతలు అభిప్రాయపడుతున్నారు.

తమిళనాడు రాష్ట్రంలో ఎద్దులు, ఆవులు, దూడల వధకు సంబంధించి మద్రాస్ హైకోర్టు సంపూర్ణ నిషేధాన్ని అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విజయ్ ఆధ్వర్యంలోని టీవీకే ప్రభుత్వం హైకోర్టు తీర్పును తీవ్రంగా తప్పు పట్టింది. అంతేకాదు ఏకంగా దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

గత నెల 27న మద్రాస్ హైకోర్టు ఒక కీలక తీర్పును వెల్లడించింది. తమిళనాడు రాష్ట్రంలో బక్రీద్ తో పాటు ఇతర పండగల సందర్భంగా జంతువులను చంపడాన్ని పూర్తిగా నిషేధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై విజయ్ ప్రభుత్వం వెంటనే స్పందించింది. దేశ సర్వోన్నత న్యాయస్థానంలో తనదైన వాదనలు వినిపించింది.. 1958 నుంచి తమిళనాడు రాష్ట్రంలో జంతు సంరక్షణ చట్టం అమల్లో ఉందని.. దాని ప్రకారం 10 సంవత్సరాల పైన ఉండి.. సంతాన ఉత్పత్తికి పనికిరాని జంతువులను మాత్రమే వధించడానికి అనుమతి ఉంది. మద్రాస్ హైకోర్టు దీనిని పక్కన పెట్టింది. సంపూర్ణ నిషేధాన్ని విధించడం ఏకంగా న్యాయస్థానాల పరిధి దాటి వ్యవహరించడమేనని ప్రభుత్వం వ్యాఖ్యానించింది. కోయంబత్తూర్ లాంటి ప్రాంతంలో బక్రీద్ లాంటి పండుగ జరిగినప్పుడు బహిరంగ ప్రదేశాలలో జంతువులను చంపడాన్ని నిషేధించాలని మాత్రమే పిటిషనర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారని ప్రభుత్వం స్పష్టం చేసింది.. పిటిషనర్ అడగకుండానే పూర్తి నిషేధాన్ని విధించడం సరికాదని సుప్రీంకోర్టు దృష్టికి తమిళ్నాడు ప్రభుత్వం తీసుకెళ్లింది.

తమిళనాడు హైకోర్టు ఇచ్చిన తీర్పును అక్కడి పార్టీలు స్వాగతించడం లేదు. కోర్టుల పరిధి దాటి తీర్పులు ఇవ్వకూడదని.. మత సంప్రదాయాలను తొక్కిపెట్టకూడదని తమిళనాడు రాజకీయ పార్టీ నాయకులు అంటున్నారు.. పాలు ఇచ్చే ఆవులను ఎవరూ చంపరని.. అయితే కోర్టు ఇచ్చిన తీర్పు అనేక రకాలుగా ప్రభావం చూపిస్తోందని అక్కడి రాజకీయ పార్టీల నాయకులు అంటున్నారు. కేవలం ముస్లింలు మాత్రమే జంతువులను వధించరని.. హిందువులు కూడా వారి పండుగ సమయంలో జంతువులను చంపుతారని.. కోర్టు ఇచ్చిన నిబంధనలు స్థానికంగా ఇబ్బందికరమైన వాతావరణాన్ని కలగజేస్తోందని అక్కడి రాజకీయ పార్టీల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

కేవలం లైసెన్స్ పొందిన కసాయి కేంద్రాలలో మాత్రమే జంతువులను చంపాలి అని అనడం సరికాదని.. పండుగ సమయంలో డిమాండ్ తట్టుకునే సామర్థ్యం కసాయి కేంద్రాలకు లేదని అక్కడి పార్టీల నేతలు చెబుతున్నారు. అధికార టీవీకే పార్టీ స్పందించిన తీరు పట్ల కొంతమంది స్వాగతిస్తుండగా.. మరి కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. అయితే ఈ అంశంపై చాలా ఆలస్యంగా టీవీకే సుప్రీంకోర్టు దాకా వెళ్ళిందని.. అక్కడి రాజకీయ విశ్లేషకులు అంటుంటే.. సున్నితమైన అంశం కాబట్టి.. అనేక రకాలుగా చర్చించి ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని టీవీకే నేతలు చెబుతున్నారు.

త్రివిక్రమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ కి రాజమౌళి సంబంధం ఏంటంటే..?

Trivikram Srinivas Dream Project
Trivikram Srinivas Dream Project

Trivikram Srinivas Dream Project: మాటల మాంత్రికుడిగా గుర్తింపును సంపాదించిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్… ఆయన సినిమాల్లో మాటలతో గారడీలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. కామెడీ సన్నివేశాలతో ప్రేక్షకులను మెప్పించడంలో ఆయనను మించిన వారు ఎవరు లేరు. అలాంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మధ్యకాలంలో కొంతవరకు డౌన్ అయ్యాడు. ఇక ఇప్పుడు వెంకటేష్ తో చేసిన ‘ఆదర్శ కుటుంబం’ సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ తో గాడ్ ఆఫ్ వార్ అనే మైథాలాజికల్ సినిమా కూడా చేస్తున్నాడు. దానికి సంబంధించిన అనౌన్స్ మెంట్ కూడా రీసెంట్ గానే ఇచ్చారు. మొత్తానికైతే ఈ సినిమా విషయంలో త్రివిక్రమ్ చాలా క్లారిటీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే త్రివిక్రమ్ డ్రీమ్ ప్రాజెక్టుగా ఒక సినిమా అయితే పెట్టుకున్నాడట… మహాభారతంలోని కురుక్షేత్రాన్ని బేస్ చేసుకుని ఒక సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్నాడట. అది తన డ్రీం ప్రాజెక్టు అని కూడా తన సన్నిహితుల దగ్గర చెబుతున్నాడట. మహాభారతం మొత్తం కాకుండా ఓన్లీ కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించిన ఎపిసోడ్స్ మాత్రమే తను చిత్రీకరించడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ చేయాలంటే ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలు అవసరం అవుతారని తను భావిస్తున్నాడట. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే రాజమౌళి సైతం మహాభారతం సినిమాని చేయడం తన డ్రీమ్ అంటూ పలు సందర్భాల్లో చెబుతూ వచ్చాడు.

ఇక మధ్యలో త్రివిక్రమ్ కూడా మహాభారతాన్ని బేస్ చేసుకొని ఒక సినిమాను చేయాలనుకుంటున్నాడు. కాబట్టి వీళ్లిద్దరిలో ఎవరు ఆ సినిమా చేస్తారు. ఒకవేళ ఇద్దరు చేస్తే అందులో ఎవరు సక్సెస్ సాధిస్తారు అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

ఇక ఇద్దరు దర్శకులు కూడా ఒకే సినిమాను వాళ్ల డ్రీమ్ ప్రాజెక్ట్ గా పెట్టుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇందులో ఎవరు ముందుగా సినిమాని తెరకెక్కిస్తారు. ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఒకరు కాంప్రమైజ్ అవుతారా? అసలేం జరగబోతుంది…

స్పిరిట్ షూటింగ్ టైమ్ లో రవితేజ కొడుకు మీద సందీప్ వంగ సీరియస్ అయ్యాడా..? కారణమేంటంటే...

Sandeep Reddy Vanga
Sandeep Reddy Vanga

Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన దర్శకుడు సందీప్ రెడ్డివంగా… ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి ఆయన సంపాదించుకున్న పాపులారిటి మాత్రం చాలా ఎక్కువనే చెప్పాలి. ఆయనకున్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఇప్పుడు చాలామంది హీరోలు అతనితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. తను అనుకున్నట్టుగా ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది. ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ను రాబడుతుందా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇప్పటివరకు వీళ్ళు చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాలు మరొకెత్తుగా మారబోతున్నాయి.

యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించగలిగే కెపాసిటి ఉన్న చాలా మంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకోవాలని చూస్తున్నారు. ప్రభాస్ ఇలాంటి సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేస్తానని తన సన్నిహితుల దగ్గర చెబుతున్నారట.

ఇక ఇదిలా ఉంటే స్పిరిట్ సినిమాకి సందీప్ రెడ్డి వంగ దగ్గర రవితేజ కొడుకు మహాధన్ భూపతి రాజు డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో వర్క్ చేస్తున్నాడు. అయితే రీసెంట్ గా జరిగిన షెడ్యూల్లో మహధన్ భూపతి రాజు మీద ఫైర్ అయ్యాడు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగ మహధన్ ఒక్కడి మీదనే అరవలేదట. టీమ్ లో ఉన్న కొంతమంది చేసిన కొన్ని తప్పుల వల్ల చిన్న డిస్టబెన్సేస్ వచ్చాయట. దానివల్ల సందీప్ రెడ్డివంగా డైరెక్షన్ టీమ్ లో ఉన్న అందరి మీద అరిచాడట.

ఇక అందులో త్రివిక్రమ్ కొడుకు రవితేజ కొడుకు కూడా ఉన్నారట. ఇక ఏది ఏమైనా కూడా దర్శకుడు అనేవాడు తనకు అనుకూలంగా వర్క్ చేయకపోతే ఎవరి మీద అయిన అరుస్తాడు. ఎందుకంటే అది కోట్లలో జరిగే వ్యాపారం అలాగే క్రియేటివిటీకి సంబంధించిన వ్యవహారం కాబట్టి ఏ చిన్న మిస్టేక్ జరిగినా కూడా చాలా వరకు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. ఇది సినిమా రిజల్ట్ మీద కూడా ప్రభావాన్ని చూపించే ప్రమాదమైతే ఉంది…

తమిళనాడులో శివాజీ–టిప్పు సుల్తాన్‌ పోస్టర్ల వివాదం.. హిందూ సంఘాల ఆగ్రహంతో విజయ్‌ సర్కార్‌ అలర్ట్‌!

Tamil Nadu Shivaji Tipu Sultan Poster Controversy
Tamil Nadu Shivaji Tipu Sultan Poster Controversy

Tamil Nadu Shivaji Tipu Sultan Poster Controversy: తమిళనాడు అంటేనే భాషాభిమానం. ప్రాతీయ అభిమానం ఎక్కువ. ఉత్తరాది భాషలను చిన్నచూపు చూస్తారు. అయితే అక్కడి వారికి ఛత్రపతి శివాజీ అంటే అభిమానం. తాజాగా మొహర్రం పండుగ సందర్భంగా కొందరు వ్యక్తులు వివాదాస్పద పోస్టర్లు అంటించారు. ఆ పోస్టర్లలో ఛత్రపతి శివాజీ మహారాజు టిప్పు సుల్తాన్‌ పాదాల వద్ద ఉన్నట్లు చిత్రీకరించడం జరిగింది. ఈ చిత్రాలు అనేక ప్రాంతాల్లో అంటించడంతో స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. శివాజీని అత్యంత గౌరవించే తమిళ ప్రజలు ఈ చిత్రీకరణను అవమానంగా భావించారు. హిందూ సంఘాలు వెంటనే నిరసనలు తెలిపాయి. ప్రభుత్వం అప్రమత్తమై పోస్టర్లు తక్షణం తొలగించాలని ఆదేశించింది. అధికారులు వాటిని తొలగించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

చరిత్రతో సంబంధం లేకపోయినా..
ఛత్రపతి శివాజీ మహారాజు, టిప్పు సుల్తాన్‌ పూర్తిగా వేర్వేరు కాలాలకు చెందిన వ్యక్తులు. శివాజీ మరణించిన 70 సంవత్సరాల తర్వాతే టిప్పు సుల్తాన్‌ జన్మించారు. ఇద్దరూ ఎప్పుడూ ఒకరినొకరు ఎదుర్కొన్నట్లు చారిత్రక ఆధారాలు లేవు. ఈ నేపథ్యంలో శివాజీని టిప్పు సుల్తాన్‌ పాదాల వద్ద చిత్రీకరించడం ద్వారా మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఇలాంటి చిత్రీకరణలు చరిత్రను రాజకీయ లేదా మతపరమైన ప్రయోజనాల కోసం వక్రీకరించడానికి ఉపయోగపడతాయని చాలా మంది చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.

తమిళనాడులో శివాజీపై ప్రత్యేక అభిమానం..
తమిళనాడులో శివాజీకి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. ప్రముఖ నటుడు శివాజీ గణేశన్‌ పేరు కూడా ఛత్రపతి శివాజీ మహారాజుపై ఉన్న గౌరవం వల్లే పెట్టుకున్నారు. శివాజీ గణేశన్‌ చారిత్రక పాత్రల్లో నటించినందున ఆయన్ను ‘శివాజీ’ అని పిలవడం మొదలైంది. దీంతో తమిళ ప్రజల్లో శివాజీ మహారాజు పట్ల భక్తి, గౌరవం ఇంకా పెరిగింది. శివాజీని హిందూ వీరుడిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా భావించే వారు అక్కడ చాలా మంది ఉన్నారు. అలాంటి వారి భావోద్వేగాలను రెచ్చగొట్టేలా పోస్టర్లు వేయడం సున్నితమైన విషయం.

హిందూ సంఘాల నిరసన..
వివాదాస్పద పోస్టర్లపై హిందూ సంఘాలు వెంటనే రంగంలోకి దిగి పోస్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి పోస్టర్లు తొలగించాలని ఆదేశించింది. అధికారులు వాటిని తొలగించడంతో పెద్ద ఎత్తున ఘర్షణలు జరగకుండా నివారించగలిగారు. ఇలాంటి సున్నితమైన సందర్భాల్లో ప్రభుత్వాలు త్వరగా, నిష్పక్షపాతంగా వ్యవహరించడం చాలా అవసరం. ఇది చట్టం, శాంతి రక్షణకు మంచి ఉదాహరణగా నిలిచింది.

రాజకీయ లబ్ధి కోసమేనా..
ఈ సంఘటన ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇలా చేశారా లేక మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నమా అన్న చర్చ జరుగుతోంది. శివాజీ, టిప్పు సుల్తాన్‌ ఇద్దరూ వేర్వేరు కాలాల వారు. వారి మధ్య ఎలాంటి నేరుగా సంబంధం లేదు. అయినప్పటికీ ఒకరిని మరొకరి పాదాల వద్ద చిత్రీకరించడం ద్వారా మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నం జరిగినట్లు కనిపిస్తోంది. అలాంటి చర్యలు సమాజంలో అనవసరమైన విభజనను సృష్టిస్తాయి. హిందూ, ముస్లిం సమాజాల మధ్య శతాబ్దాలుగా ఉన్న సామరస్యాన్ని దెబ్బతీస్తాయి. నిజమైన చరిత్ర అధ్యయనం చేసి, వాస్తవాల ఆధారంగా గౌరవం చూపడం మాత్రమే దీర్ఘకాలిక సామరస్యానికి దారి తీస్తుంది. పోస్టర్లు, బ్యానర్లు, సోషల్‌ మీడియా ద్వారా ఇలాంటి వక్రీకరణలు చేయడం నేరం. అందుకే విజయ్‌ సర్కార్‌ త్వరగా చర్యలు చేపట్టింది. అయితే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిరోధించడానికి మరింత అప్రమత్తత అవసరం. మత పండుగలు శాంతియుతంగా జరగాలి, ఇతరుల భావోద్వేగాలను గౌరవించాలి. చరిత్రను గౌరవించడం అంటే దాన్ని వక్రీకరించకుండా, వాస్తవాలతో మాత్రమే మాట్లాడడం.

సమాజంలో శాంతి, సామరస్యం నిలబెట్టుకోవాలంటే చరిత్రను రాజకీయ ఆయుధంగా మార్చకూడదు. వాస్తవాల ఆధారంగా గౌరవం, అవగాహన పెంచుకోవాలి. ఈ మేరకు ప్రభుత్వం కూడా మత ఉద్రిక్తతలు పెంచేవారిపై కఠిన చర్యలు చేపట్టాలి.

సుకుమార్ తన శిష్యులను డైరెక్టర్లుగా మార్చడమే టార్గెట్ గా పెట్టుకున్నాడా..?

Sukumar
Sukumar

Sukumar: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంటలిజెంట్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్… ఆయన నుంచి వచ్చే సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుంటాయి. ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది… ఇక అల్లు అర్జున్ తో చేసిన పుష్ప సినిమాతో పాన్ ఇండియాలో పెను సంచలనాలను క్రియేట్ చేసిన ఆయన ఇప్పుడు మరోసారి రామ్ చరణ్ తో భారీ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక ఇదిలా ఉంటే అతని దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసిన తన అసిస్టెంట్ డైరెక్టర్లను సైతం దర్శకులుగా మార్చే బాధ్యతను తనే ఎత్తుకున్నాడు. ఇప్పటికే బుచ్చిబాబు ను దర్శకుడిగా పరిచయం చేసి తనను టాప్ డైరెక్టర్ గా మార్చాడు. ఇక ఇప్పుడు మరో ఇద్దరు ముగ్గురు దర్శకులను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసే ప్రయత్నంలో ఉన్నాడు…

మొత్తానికైతే సుకుమార్ దగ్గర దర్శకత్వం విభాగంలో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా టాప్ డైరెక్టర్స్ గా మరి వాళ్ళ సత్తా చాటుతుండటం విశేషం… బుచ్చిబాబుతో పాటు శ్రీకాంత్ ఓదెల సైతం దసర సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేశాడు. ఇక ఇండస్ట్రీలో ఇప్పుడు సుకుమార్ శిష్యులకు మంచి క్రేజ్ ఉంది.

ఆయన దగ్గర పని చేసి దర్శకులుగా మారడానికి ఇంకా కొంతమంది సిద్ధమవుతున్నారు… నిజానికి ఏ దర్శకుడు కూడా తన శిష్యులను డైరెక్టర్స్ గా చేసి వాళ్లకు కూడా ఒక లైఫ్ ఇవ్వాలని ఆలోచించడు. ఎంతసేపు తన సినిమాకి అసిస్టెంట్ గా చేసిన వాళ్ళని వాడుకున్నామా తన సినిమా సక్సెస్ సాధించిందా? లేదా అనే రీతిలోనే ఆలోచిస్తారు గాని వాళ్ళ శిష్యులను కూడా దగ్గరుండి మరి దర్శకులుగా మార్చాలనే ఒక ఆలోచనైతే సుకుమార్ కే వచ్చింది.

అందుకే ఆయన అటు దర్శకుడిగా రాణిస్తూనే ఇటు గొప్ప గురువుగా కూడా పేరు సంపాదించుకుంటున్నాడు…ఇక రాబోయే సినిమాలతో ఆయన ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తాడు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

అనిల్ రావిపూడి కొత్త మూవీలో నటించనున్న రాజమౌళి... క్యారెక్టర్ ఏంటి ఇంత కామెడీగా ఉంది...

Anil Ravipudi
Anil Ravipudi And SS Rajamouli

Anil Ravipudi And SS Rajamouli: కమర్షియల్ సినిమాలకు పెట్టింది పేరుగా మారిన దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. రాజమౌళి తర్వాత వరుసగా సక్సెస్ లను సాధిస్తున్న దర్శకుడు కూడా తనే కావడం విశేషం… ఇక అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన అన్ని సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. ఇక ప్రస్తుతం ఆయన వెంకటేష్ – కళ్యాణ్ రామ్ లను హీరోలుగా పెట్టి ఒక భారీ మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడు. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్టార్ హీరోలిద్దరిని ఎలా వాడుకోబోతున్నాడు అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో రాజమౌళిని సైతం భాగం చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అయితే ఈ సినిమాలో ఉందట. ఆ పాత్ర రాజమౌళి చేస్తే బాగుంటుందని అనిల్ రావిపూడి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక దానికి రాజమౌళి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే రాజమౌళిని కలిసి ఆ క్యారెక్టర్ గురించి చర్చించిన అనిల్ తొందరలోనే రాజమౌళి ఈ మూవీ చేస్తున్నాడు అంటూ ఒక అఫిషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది.

ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో చేస్తున్న ‘వారణాసి’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. కాబట్టి అనిల్ సైతం సినిమా షూటింగ్ మొత్తాన్ని అయిపోగొట్టిన తర్వాత చివరిలో రాజమౌళి పోర్షన్ షూట్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడడట.

ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టినప్పటికి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తన పరిధిని విస్తరించుకున్నాడు. కాబట్టి రాజమౌళి అంటే ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ అయితే ఉంటుంది. ఇక దానికి తగ్గట్టుగానే ఆయనకు సరిపడా ఒక మంచి క్యారెక్టర్ అయితే అనిల్ రావిపూడి డిజైన్ చేశారట.

ఆయన పాత్ర సినిమాలో 5 నిమిషాల పాటు కనిపిస్తుందని కూడా అనిల్ రావిపూడి తన సన్నిహిత వర్గాల నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి మంచి నటుడు కాబట్టి అనిల్ తన చేత కామెడీ చేయించాలని డిసైడ్ అయ్యాడట. రాజమౌళి కామెడీ ఎలా పండిస్తాడు అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే…

అల్లు అర్జున్ మీద ఫైర్ అవుతున్న మలయాళం ప్రేక్షకులు... బన్నీ అలా చేస్తాడని అనుకోలేదు...

Allu Arjun
Allu Arjun

Allu Arjun: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇండియాలోనే టాప్ ఇండస్ట్రీ గా మారిపోయింది. ప్రస్తుతం స్టార్ హీరోలందరు టైర్ వన్ హీరోలుగా కొనసాగుతున్నారు. పాన్ ఇండియాలో మన హీరోలను మించిన నటులు మరెవరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మన హీరోలు వాళ్ళ స్టార్ డమ్ ను వాడుకుంటూ గొప్ప సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నారు. ఇక ఈ క్రమంలోనే ఇండియా వైడ్ గా ఉన్న ప్రేక్షకులందరిని అలరిస్తూ వాళ్లందరిని మైమరిపింప చేస్తున్నారు. ఇక దానికి తోడుగా అన్ని ఇండస్ట్రీ లలో ఉన్న ప్రేక్షకులు కూడా మన వాళ్ళు చేసే సినిమాలకు మన హీరోలకి అభిమానులుగా మారిపోతున్నారు.

ఇక ఇలాంటి క్రమంలోనే అల్లు అర్జున్ కెరియర్ మొదటి నుంచి తెలుగుతోపాటు మలయాళం ఇండస్ట్రీలో చాలా మంచి మార్కెట్ ఉంది. అతని సినిమాలు అక్కడ మంచి విజయాలు సాధించాయి. ఇక ఈ క్రమంలోనే అతన్ని అక్కడ ‘మల్లు అర్జున్’ అని కూడా పిలుస్తూ ఉంటారు. మరి అలాంటి అల్లు అర్జున్ మీద మలయాళం ప్రేక్షకులు కొంతవరకు సీరియస్ అవుతున్నారట.

కారణమేంటి అంటే అల్లు అర్జున్ కి తెలుగు తర్వాత అంత మంచి మార్కెట్ ని క్రియేట్ చేసిన ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే అది మలయాళం ఇండస్ట్రీ అనే చెప్పాలి. మరి అలాంటి ఇండస్ట్రీలో ఇప్పటివరకు తను ఒక్కటి కూడా స్ట్రెయిట్ మలయాళం సినిమా చేయలేదని ఎప్పటినుంచో తన దగ్గర అలాంటి ప్రస్తావన వచ్చినా కూడా ప్రతిసారి దాన్ని దాటవేస్తున్నాడు అంటూ అక్కడి ప్రేక్షకులు ఫైర్ అవుతున్నారు.

ఇక ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా హీరో అయిపోయాడు కాబట్టి మలయాళంలో ఉన్న దర్శకులతో సినిమా చేస్తే బాగుంటుందని ఎంతసేపు తెలుగు, తమిళ్ దర్శకులతోనే సినిమాలు చేయడం సబబు కాదని వాళ్లు సోషల్ మీడియా వేదికగా వల్ల అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఇక దీని మీద అల్లు అర్జున్ ఎలా స్పందిస్తాడు తొందరలోనే మలయాళం ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్లతో సినిమాలను సెట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

భర్తలను ఎలా ఖతం చేయాలి.. దీనిపై పుస్తకాలు రాస్తున్నారు.. మహిళలు చదువుతున్నారు.. ఏం సొసైటీ రా బై

Pune Businessman Case
Pune Businessman Case

Pune Businessman Case: మగాళ్ళ బతుకు ఎంత దారుణంగా మారిపోయింది అంటే.. కట్టుకున్న భార్య చేతిలో సేఫ్టీ లేదు. కట్టుకోబోయే భార్య దగ్గర భద్రత లేదు. ప్రేమికురాలిని నమ్మే పరిస్థితి లేదు. ఎక్కడ స్పాట్ పెట్టారో తెలియదు. ఎవరితో డీల్ కుదుర్చుకున్నారో తెలియదు. ఎలా వేసేస్తారో కూడా తెలియదు.. ఒకటా రెండా.. ఎన్నో సంఘటనలు.. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. జైలు శిక్షలు పడుతున్నాయి. మీడియాలో ప్రధానంగా వార్తలు వస్తున్నాయి. అయినప్పటికీ పరిస్థితి మారడం లేదు. మారే అవకాశం కనిపించడం లేదు.

ఇటీవల పూణే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ వ్యవహారం ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడిని కాబోయే భార్య తన ప్రియుడితో కలిసి అంతం చేసింది. అత్యంత ఎత్తైన కోట నుంచి కిందికి తోసి చంపేసింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సరికొత్త చర్చకు దారి తీసింది. అంతేకాదు.. కాబోయే భార్యలు కూడా చాలా డేంజర్ అని.. వాళ్లతో అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఈ సంఘటన నిరూపించింది.

ఓ మెట్రో రైల్లో ప్రయాణిస్తున్న ఓ మహిళ ప్రయాణికురాలు ఓ పుస్తకం చదువుతోంది. ఆ పుస్తకం అట్ట మీద భర్తను ఎలా చంపాలి అని రాసి ఉంది. పైగా ఆ పుస్తకం భారీగా అమ్ముడుపోయింది కూడా. నేటి కాలంలో యూ ట్యూబ్ ను చూసి చాలామంది హత్యలు ఎలా చేయాలో నేర్చుకుంటున్నారు. ఇప్పుడు భర్తలను ఎలా చంపాలో భార్యలు పుస్తకాలు చూసి తెలుసుకుంటున్నారు.

గత ఏడాది ఇండోర్ వ్యాపారవేత్త రాజా రఘు వంశీ తన భార్య చేతిలో హతమయ్యాడు. అతడిని మేఘాలయ విహారయాత్రకి తీసుకెళ్లిన భార్య.. తన ప్రియుడితో చంపించేసింది. ఈ సంఘటన గత ఏడాది దేశాన్ని ఉలిక్కి పడేవిధంగా చేసింది. ఇప్పుడు దానిని మించిపోయింది పూనే వ్యాపారవేత్త కేసు. వాస్తవానికి ఇలా మహిళలు ఎందుకు మారిపోతున్నారు.. ఏకంగా పుస్తకాలు చదివి భర్తలను ఎందుకు అంతం చేస్తున్నారు.. అనే ప్రశ్నలకు సమాధానం లభించడం లేదు. ఒకవేళ నచ్చకపోతే వేరుగా ఉండవచ్చు.. విడాకులు కూడా తీసుకోవచ్చు. నచ్చిన వ్యక్తులతో జీవించవచ్చు. ఈ సౌలభ్యం మన రాజ్యాంగం అందించింది. కానీ వీటిని ఉపయోగించుకోకుండా.. అత్యంత దారుణాలకు పాల్పడడం. ఘోరాలకు ఒడికట్టడం అత్యంత పాపమని మానసిక విశ్లేషకులు అంటున్నారు.

ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల హెచ్చరిక!

Andhra Pradesh Weather
Andhra Pradesh Weather

Andhra Pradesh Weather: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. మరోవైపు ఎండ తీవ్రత, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. జూలై మొదటి వారం గడుస్తున్న ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడంతో సర్వత్రా ఆందోళన ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో.. శుక్రవారం బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో వాతావరణం ఒక్కసారిగా మారనుంది. జూలై 4 నుంచి ఉత్తర కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఐదో తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వర్షాలు విస్తరించే ఛాన్స్ కనిపిస్తోంది. వర్షం జాడ లేకపోవడంతో ఈ ఏడాది ఖరీఫ్ ఫై ఆశలు వదులుకున్నారు రైతులు. వర్ష సూచన ఉందని తెలియడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

* ఆలస్యంగా రుతుపవనాలు..
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా దేశంలో ప్రవేశించాయి. వాటి విస్తరణ కూడా మంద గమనంలో ఉన్నాయి. ఎల్ నినో ప్రభావం కూడా అధికంగా ఉంది. దీంతో వర్షాలు ఆశించిన స్థాయిలో పడడం లేదు. అయితే ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకొని ఈ అల్పపీడనం ఏర్పడనుంది. రాజస్థాన్ వైపు పయనించవచ్చని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. దీనివల్ల దేశంలోని మిగిలిన ప్రాంతాలకు కూడా రుతుపవనాలు వేగంగా విస్తరించే అవకాశం ఉంది. తూర్పు, మధ్య, ఉత్తర భారత దేశంలో వర్షాల జోరు బాగా పెరుగుతుందని కూడా అంచనా వేస్తున్నారు.

* ఉత్తరాంధ్రకు హెచ్చరిక..
ముఖ్యంగా ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన ఉంది. గురువారం రోజంతా ఆకాశం మేఘావృతం అయి ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. అదే సమయంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ గట్టి హెచ్చరికలు పంపింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది . ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా అక్కడక్కడ జల్లులు కురిసే ఛాన్స్ కనిపిస్తోంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి అని కూడా తెలుస్తోంది. మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా వాతావరణం మారుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం చల్లబడింది. గురువారం రాత్రి ఢిల్లీ ఎం సి ఆర్ పరిధిలో భారీ వర్షం కురవడంతో నగరవాసులు ఉపశమనం పొందారు . ఢిల్లీలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. ఇక్కడ వర్షాలు ఈదురు గాలులు వీచే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

సాంబ సార్.. మీ పచ్చ జర్నలిజం వర్ధిల్లాలి..

Samba Siva Rao TV5
Samba Siva Rao TV5

Samba Siva Rao TV5: మీడియా అనేది బాకాలు ఊదే వ్యవస్థగా మారిపోయి చాలా సంవత్సరాలు గడిచిపోయింది. తెలుగు రాష్ట్రాలలో ఇది ఇంకా చాలా దారుణంగా ఉంది. రాజకీయ పార్టీలకు మౌత్ పీసుల మాదిరిగా మీడియా దిగజారిపోయింది. ఒక వార్త ప్రసారం అవుతోంది అంటే మీది ఏ పార్టీకి అనుకూలమైన భజన ఛానల్ అనే పరిస్థితి ప్రజల్లో వచ్చేసింది. మీడియా యాజమాన్యాల రాజకీయరంగుల వల్ల ప్రజలకు వాస్తవం అనేది తెలవకుండా పోతుంది. ఎవరికివారు భజన చేయడంలో పోటీపడుతున్నారు. యాజమాన్యాలు అలా ఉన్నాయంటే.. యాజమాన్యాల కింద పనిచేసే వారు మరింత ఘోరంగా తయారయ్యారు.

ఆయా చానల్స్ లో పనిచేస్తున్న జర్నలిస్టులు పార్టీలకు డప్పు కొట్టడంలో.. భజన చేయడంలో ఒక స్థాయిని కూడా దాటిపోయారు. తాము చదువుతున్నది వార్తలనని.. లక్షల మంది జనం చూస్తున్నారని సోయి కూడా లేకుండా వ్యవహరిస్తున్నారు. చివరికి ఈ భజన కార్యక్రమం ఎక్కడ దాకా దిగజారింది అంటే.. సగటు కార్యకర్త కూడా బాధపడేలాగా.. ఎన్నడు ఈ స్థాయిలో తమ నాయకుడిని ఈ స్థాయిలో భుజాల మీద మోయలేని విధంగా మారిపోయింది.

ఓ చానల్లో పనిచేసే జర్నలిస్టు ఓ పార్టీకి భజన చేస్తుంటారు. ఆ ఛానల్ యాజమాన్యం కూడా ఆ పార్టీకి మౌత్ పీస్ లాగా ఉంటుంది. ఆ చానల్ యజమాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత కీలకమైన దేవస్థానానికి చైర్మన్. అంతకుముందే ఆ ఛానల్ ఆ పార్టీకి వీర లెవెల్లో భజన చేసేది. ఇప్పుడు ఆయన దేవస్థానానికి చైర్మన్ కావడంతో ఆ భజన మరింత పెరిగిపోయింది. ముఖ్యంగా ప్రైమ్ టైం లో టెలికాస్ట్ అయ్యే ప్రోగ్రామ్ లలో అయితే ఆ జర్నలిస్ట్ పసుపు దండకం చదువుతూ ఉంటాడు. ఒంటికి పసుపు రంగు పూసుకొని పోతురాజు మాదిరిగా కొట్టుకుంటూ ఉంటాడు.

అతడు ఇచ్చే ఎలివేషన్లు కేజిఎఫ్ సినిమాను కూడా దాటిపోయి ఉంటాయి. అసలు ఇటువంటి వ్యక్తులను జర్నలిస్టులు అనాలా.. దీనిని జర్నలిజం అని చెప్పుకోవాలా.. ఇంతకంటే దిగజారుడుతనం ఇంకొకటి ఏముంటుంది. న్యూట్రల్ గా వ్యవహరించాల్సిన మీడియా ఇలా డప్పు కొట్టే వ్యవస్థ లాగా మారిపోవడం.. జర్నలిస్టులు ఇలా పార్టీ కార్యకర్తలుగా మారిపోతున్న దుర్మార్గం.. ఇంతకంటే హీనం ఇంకొకటి ఏముంటుంది.. ఇంతకంటే డౌన్ ఫాల్ ఇంకొకటి ఉంటుందా.. దీనిని పాత్రికేయం అని ఎలా అంటారని.. విశ్లేషకులు చెబుతున్నారు. సమాజంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో.. అన్ని పార్టీలకు అనుకూలంగా మీడియా చానల్స్ ఉన్నాయి. అలాంటప్పుడు మీడియా నుంచి నిష్పక్షపాతం వ్యవహరించడం.. ఎడారిలో నీటి కోసం వెతకడం లాంటిదేనని విశ్లేషకుల మాట.

'రావు బహదూర్' మహేష్ చేయాల్సిన సినిమానా ? సీక్రెట్ బయటపెట్టిన స్టార్ డైరెక్టర్...

Rao Bahadur 4 Days Collection
Rao Bahadur 4 Days Collection

Rao Bahadur: సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన రావు బహదూర్ సినిమా రేపు రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవేంటంటే రావు బహదూర్ సినిమా మొదట పెద్ద స్కేల్ లో రాసుకొని దానిని మహేష్ బాబుతో చేయడానికి దర్శకుడు సన్నాహాలు చేసుకున్నారట. మహేష్ బాబు కి సైతం కథ వినిపించినప్పుడు ఆ క్యారెక్టర్ లో నటించడానికి మహేష్ కి ఇంట్రెస్ట్ వచ్చినప్పటికి అది తన ఇమేజ్ కి తగ్గ కథ కాదేమో అనే ఉద్దేశ్యంతో మహేష్ బాబు ఈ స్టోరీ ని రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది.

కానీ ఈ కథని ఏదైనా చిన్న హీరోతో చేయమని దానికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేస్తే తనే ప్రొడ్యూస్ చేస్తానని కూడా మహేష్ చెప్పడంతో దర్శకుడు వెంకటేష్ మహా కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి తనకి మొదటి నుంచి మంచి ఫ్రెండ్ అయినా సత్యదేవ్ ను హీరోగా పెట్టి ఈ సినిమా చేశాడు. ఈ సినిమాలో సత్యదేవ్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందనే విషయమైతే మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది.

మొత్తానికైతే మహేష్ బాబు ఈ సినిమాతో టాప్ ప్రొడ్యూసర్ అనిపించుకుంటాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. మహేష్ బాబు ఇప్పుడు ‘వారణాసి’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన మరో పాన్ ఇండియా దర్శకుడితో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. రావు బహదూర్ సినిమా రేపు రిలీజ్ అవ్వనున్న నేపథ్యంలో ఈ సినిమాతో మహేష్ బాబు ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు.

తద్వారా తన కెరీర్ లో ఈ సినిమా ఒక మైలురాయిగా మిగిలిపోతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది… ఇక ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేసిన కూడా సక్సెస్ లు దక్కించుకోలేకపోతున్న సత్యదేవ్ ఈ సినిమాతో ఎలాంటి పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేయబోతున్నాడు అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

మీ పిల్లల్ని శ్రీ చైతన్యకి పంపిస్తున్నారా.. ఓసారి ఈ వీడియో చూడండి

Sri Chaitanya Central Kitchen
Sri Chaitanya Central Kitchen

Sri Chaitanya Central Kitchen: ప్రభుత్వం వేల కోట్లు ఖర్చుపెట్టి పాఠశాలలు, కళాశాలలు నిర్వహిస్తున్నప్పటికీ చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను కార్పొరేట్ విద్యాలయాలలోకి తరలిస్తారు. లక్షలకు లక్షలు ఖర్చుపెట్టి అక్కడికి పంపిస్తుంటారు. పైగా ఆ విద్యాలయాలలో చదివించడాన్ని స్టేటస్ సింబల్ గా భావిస్తుంటారు
. మా వాడు ఫలానా కాలేజీలో చదువుతున్నాడు.. మేము అన్ని డబ్బులు ఖర్చు పెట్టి చదివిస్తున్నామని గొప్పగా చెబుతుంటారు.

తల్లిదండ్రుల డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని కార్పొరేట్ విద్యాలయాలు అడ్డగోలుగా ధనార్జనకు పాల్పడుతున్నాయి. అగ్గిపెట్టెల లాంటి భవనాలలో విద్యార్థులకు చదువులు చెబుతున్నాయి. గాలివీయదు. ఆడుకోవడానికి చోటు ఉండదు. కనీసం స్వేచ్ఛగా తిరగడానికి స్థలం కూడా ఉండదు. ఇక ఇటువంటి చోట పిల్లలకు వసతి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

కార్పొరేట్ విద్యాలయాలలో వంటలు ఉండే ప్రదేశాలు ఎలా ఉంటాయో గతంలో అనేక సందర్భాల్లో వీడియోల ద్వారా బయటికి వచ్చింది. అధికారుల తనిఖీల్లో కార్పొరేట్ కాలేజీల పన్నాగం బయటపడింది. మళ్లీ ఇప్పుడు అధికారులు దాడులు చేయడంతో కార్పొరేట్ కాలేజీల కిచెన్ వ్యవహారాలు బయటపడ్డాయి..

ఇటీవల హైదరాబాదులోని మాదాపూర్ ప్రాంతంలో శ్రీ చైతన్య విద్యాసంస్థల సెంట్రల్ కిచెన్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఫ్లోర్ తడిగా ఉండడాన్ని గమనించారు. వంట చేసే చోటు శుభ్రంగా లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. వంట వండడానికి ఉపయోగించే టమాటాలు కుళ్లిపోయాయి. కిచెన్ పరిసర ప్రాంతాల్లో విపరీతంగా ఈగలు ఉన్నాయి. చెత్త డబ్బాల మీద మూతలు కూడా లేవు. ఇటువంటి పరిస్థితుల మధ్య పిల్లలకు ఎలా ఆహారం వండి పెడుతున్నారని అధికారులు ప్రశ్నించారు.

శ్రీ చైతన్య సెంట్రల్ కిచెన్ లోనే ఇలా ఉంటే.. ఇక మిగతా ప్రాంతాలలో ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. ఈగలు కూడా విపరీతంగా వృద్ధి చెందుతున్నాయి. సీజనల్ వ్యాధులు కూడా వ్యాపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కిచెన్ పరిసర ప్రాంతాల్ని కనీసం శ్రీ చైతన్య యాజమాన్యం శుభ్రంగా ఉంచకపోవడం పట్ల విమర్శలు వస్తున్నాయి. తల్లిదండ్రుల నుంచి లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తున్న శ్రీ చైతన్య యాజమాన్యం ఇలా చేయడం పట్ల ఆరోపణలు వినిపిస్తున్నాయి.