Homeఎంటర్టైన్మెంట్Mohan Babu vs Rajasekhar: మోహన్ బాబు, రాజశేఖర్ వీళ్ళిద్దరిలో ఎవరు మంచి నటుడు...

Mohan Babu vs Rajasekhar: మోహన్ బాబు, రాజశేఖర్ వీళ్ళిద్దరిలో ఎవరు మంచి నటుడు…

Mohan Babu vs Rajasekhar: ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి నటులు ఇండస్ట్రీకి నాలుగు పిల్లర్లుగా ఉండేవారు… వీళ్లను ప్రేక్షకులు ఆదరించడమే కాకుండా యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ప్రేక్షకులందరు వీళ్ళ అభిమానులుగా మారిపోయారు. ఇక ఇలాంటి క్రమంలోనే వీళ్లతో పాటు మోహన్ బాబు, రాజశేఖర్ లాంటి నటులు కూడా హీరోలుగా రాణిస్తూ సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నారు. నిజానికి మోహన్ బాబు రాజశేఖర్ […]

Mohan Babu vs Rajasekhar: ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి నటులు ఇండస్ట్రీకి నాలుగు పిల్లర్లుగా ఉండేవారు… వీళ్లను ప్రేక్షకులు ఆదరించడమే కాకుండా యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ప్రేక్షకులందరు వీళ్ళ అభిమానులుగా మారిపోయారు. ఇక ఇలాంటి క్రమంలోనే వీళ్లతో పాటు మోహన్ బాబు, రాజశేఖర్ లాంటి నటులు కూడా హీరోలుగా రాణిస్తూ సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నారు. నిజానికి మోహన్ బాబు రాజశేఖర్ ల మార్కెట్ ఇప్పుడు పూర్తిగా డౌన్ అయిపోయింది. వాళ్ళతో సినిమాలు చేసే రేంజ్ లో ఎవరు లేరు. కాబట్టి క్యారెక్టర్ ఆర్టిస్టుగా కానీ, విలన్స్ గా వాళ్ళను వాళ్లు ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే మోహన్ బాబు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. ‘ప్యారడైజ్’ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. అలాగే మహేష్ బాబు వాళ్ళ అన్న కొడుకు అయిన జయకృష్ణ హీరోగా వస్తున్న ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. ఇక దీంతో పాటుగా మరికొన్ని సినిమాలకు కూడా కమిట్ అయినట్టుగా తెలుస్తుంది. రాజశేఖర్ నితిన్ హీరోగా వచ్చిన ‘ఎక్స్ట్రాడినరీ మ్యాన్’ అనే సినిమాలో నటించాడు. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో అతనికి ఏమాత్రం గుర్తింపు రాలేదు. ఇక శర్వానంద్ హీరోగా చేసిన ‘బైకర్’ సినిమాలో సైతం హీరో ఫాదర్ క్యారెక్టర్ లో నటించాడు. ఆ సినిమాలో అతని క్యారెక్టర్ కి మంచి గుర్తింపు లభించినప్పటికి సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఆయన కొంతవరకు డీలాపడిపోయాడు. ఇక ఏది ఏమైనా కూడా రాజశేఖర్ నుంచి వచ్చే సినిమాల విషయంలో ఆయన ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి.

తన క్యారెక్టర్ ను ఎంచుకోవడంలో ఆచి చూచి అడుగులు వేస్తున్న కూడా సక్సెస్ ని సాధిస్తేనే ఆయనకు గొప్ప గుర్తింపైతే వస్తుంది లేకపోతే కష్టమనే చెప్పాలి. మోహన్ బాబు రాజశేఖర్ ఇద్దరిలో ఎవరు మంచి నటుడు వాళ్ళిద్దరిలో ఎవరిని సినిమాలో తీసుకుంటే ఆ సినిమాకి ఇంపాక్ట్ పెరుగుతుంది అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి.

నిజానికి వీళ్ళిద్దరు కూడా మంచి నటులే అయినప్పటికి మంచి పాత్ర దొరికితేనే వాళ్ళను వాళ్ళు ఎలివేట్ చేసుకోగలుగుతారు లేకపోతే మాత్రం చాలావరకు డౌన్ అయిపోయే ప్రమాదం అయితే ఉంది. ఇక సోషల్ మీడియాలో వీళ్ళిద్దరి మీద చాలా రకాల చర్చలైతే నడుస్తున్నాయి.

వీళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ నటుడు అని కొంతమంది కొన్ని ప్రశ్నలు అడిగితే కొంతమంది మోహన్ బాబు మంచి నటుడు అని చెబుతుంటే మరి కొంత మంది మాత్రం రాజశేఖర్ గొప్ప నటుడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. నిజానికి ఇద్దరు మంచి నటులే అయినప్పటికి వీళ్లిద్దరూ కూడా చాలా వరకు కాంట్రవర్సీలో ఇరుక్కోవడం వల్ల వాళ్ల సినిమా కెరియర్ ను కోల్పోయారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper