Home Blog Page 38

నిన్న మావిగన్.. నేడు విజయవాడ.. జగన్ మళ్ళీ..!

Y S Jagan Mohan Reddy
Y S Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: రాష్ట్ర రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి యూటర్న్ తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. నిన్ననే మావిగన్ రాజధాని అంటూ తేల్చి చెప్పిన జగన్మోహన్ రెడ్డి.. ఒక్కరోజు గడవకముందే ఇప్పుడు అమరావతి కాదు.. విజయవాడ మన రాజధాని అంటూ తేల్చి చెప్పారు. నిన్ననే మీడియా ముందుకు వచ్చి మావిగన్ అజెండాతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్తుందని ప్రకటించారు. అదే మీడియా సమావేశంలో విశాఖ పరిస్థితి ఏంటి అని జర్నలిస్టులు అడిగితే సమాధానమివ్వకుండా జారుకున్నారు. అందుకే సోషల్ మీడియాకు ఆయన టార్గెట్ అయ్యారు. మీమ్స్ ఓ రేంజ్ లో పేలుతున్నాయి. మళ్లీ ఈరోజు మరోసారి నోరు జారి వారికి అడ్డంగా దొరికిపోయారు జగన్. వాస్తవానికి మన రాజధాని అమరావతి కాదు.. విజయవాడ మన రాజధాని అంటూ జగన్ చేసిన తాజా కామెంట్లకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

* పరామర్శ చేసిన క్రమంలో..
తాజాగా మరో పరామర్శ చేశారు జగన్మోహన్ రెడ్డి. కృష్ణలంక మాజీ సిఐ నాగరాజు వేధింపులతో తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ క్రాంతి కుమార్ అనే వ్యక్తి సెల్ఫీ సూసైడ్ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో క్రాంతి కుమార్ కుటుంబాన్ని గురువారం పరామర్శించారు. విజయవాడలో ఆయన కుటుంబాన్ని పరామర్శించే క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదంతా కూడా సో కాల్డ్ క్యాపిటల్, సో కాల్ టు రాజధానిలో జరుగుతోందని జగనన్నారు. చంద్రబాబు కూడా పక్కనే ఉంటారని.. అమరావతి కాదు మన రాజధాని.. సో కాల్డ్.. వాస్తవం చెప్పాలంటే విజయవాడ మన రాజధాని అని జగన్ చెప్పారు. కళ్లెదుటే పోలీస్ స్టేషన్, సిపి కార్యాలయం, డిజిపి ఆఫీస్, హోం మంత్రి ఆఫీస్.. సీఎం అందరం ఇక్కడే ఉంటామని అన్నారు.

* ఒక్క రోజులోనే మారిన మాట..
వాస్తవానికి జగన్ సో కాల్డ్ రాజధాని అమరావతి అని చెబుతూనే విజయవాడ మన రాజధాని అని అన్నారు. అంటే అమరావతి సో కాల్డ్ రాజధాని అయినప్పుడు.. విజయవాడ కూడా సో కాల్డ్ రాజధాని అన్న ఉద్దేశంతో జగన్ ఆ కామెంట్స్ చేసి ఉండవచ్చు. కానీ ఇలా పూటకో సారి రాజధాని విషయంలో జగన్ మాట మారుస్తుండడంతో.. రాజధాని విషయంపై జగన్కు క్లారిటీ లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సైతం ఇది ఎంత మాత్రం మింగుడు పడడం లేదు. రాజధాని విషయంలో జగన్ తీసుకుంటున్న యూటర్న్ లపై నెటిజెన్లు మీమ్స్ పండుగ చేసుకుంటున్నారు.

సభ్య సమాజం తలదించుకునేలా దళిత క్రైస్తవ శంఖారావ సభ

Dalit Christian Sankharava Sabha

Dalit Christian Sankharava Sabha : దళిత క్రైస్తవ శంఖారావ సభ.. ఏలూరులో జరిగింది. సభ ఉద్దేశం వేరు.. అక్కడ జరిగింది వేరు. దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలన్నది ఈ సభ ప్రధాన ఉద్దేశం. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ ను తిట్టడం.. జడ శ్రవణ్ కుమార్, ప్రశ్న రావణ్ లు సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడారు. ఇదేనా రిజర్వేషన్లు సాధించే మార్గం.. రిజర్వేషన్లు సాధించాలంటే జనాలను ఎడ్యూకేట్ చేయాలి. ఎలా దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు సాధించాలో ప్లాన్ చేయాలి. కానీ సుప్రీంకోర్టు స్వయంగా దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కల్పించకూడదు అని స్పష్టం చేసింది.

సభ ఉద్దేశం ఒకటైతే.. వేదికపై వినిపించిన మాటలు మరోలా ఉంటే అసలు సమస్యే పక్కదారి పడుతుంది. ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ శంఖారావ సభ కూడా ఇప్పుడు అదే చర్చకు కారణమైంది. దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు కల్పించాలనే ప్రధాన డిమాండ్‌తో నిర్వహించిన ఈ సమావేశం, ఆ అంశంపై నిర్మాణాత్మక చర్చకు వేదిక కావాల్సింది. కానీ సభలో కొందరు చేసిన రాజకీయ విమర్శలు, వ్యక్తిగత వ్యాఖ్యలే ఎక్కువగా హైలైట్ కావడంతో అసలు లక్ష్యం మరుగున పడిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రజాస్వామ్యంలో ఏ వర్గానికైనా తమ హక్కుల కోసం పోరాడే హక్కు ఉంది. రిజర్వేషన్ల వంటి సున్నితమైన అంశాలపై తమ వాదనను వినిపించడం కూడా రాజ్యాంగబద్ధమైన హక్కే. అయితే అలాంటి డిమాండ్లకు బలం చేకూరాలంటే భావోద్వేగాల కంటే వాస్తవాలు, చట్టపరమైన అంశాలు, గణాంకాలు, సామాజిక న్యాయం వంటి అంశాల ఆధారంగా ప్రజలను చైతన్యపరచడం అవసరం. వ్యక్తులపై విమర్శలు లేదా వివాదాస్పద వ్యాఖ్యలు సమస్య పరిష్కారానికి దోహదం చేయవు.

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలా వద్దా అనే అంశం ఇప్పటికే న్యాయ, రాజ్యాంగ, సామాజిక కోణాల్లో విస్తృత చర్చకు గురైంది. ఈ అంశంపై వివిధ న్యాయస్థానాల్లో విచారణలు జరిగాయి. ఇలాంటి నేపథ్యంలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే చట్టపరమైన మార్గాలు, ప్రజల్లో అవగాహన పెంపు, ప్రభుత్వంపై విధానపరమైన ఒత్తిడి వంటి అంశాలపై దృష్టి పెట్టడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

ఏ ఉద్యమమైనా తన లక్ష్యాన్ని చేరుకోవాలంటే సందేశం స్పష్టంగా ఉండాలి. వేదికలు సమస్య పరిష్కారానికి మార్గాలు సూచించాలి కానీ కొత్త వివాదాలకు కేంద్రబిందువుగా మారకూడదు. సమాజంలో చర్చించాల్సిన అసలు అంశం రిజర్వేషన్లపై విధానం కావాలి గానీ, సభలో ఎవరు ఎవరిని ఏమన్నారు అనేది కాకూడదు. అదే జరిగితేనే ఉద్యమం తన అసలు ఉద్దేశాన్ని నెరవేర్చగలదు.

సభ్య సమాజం తలదించుకునేలా దళిత క్రైస్తవ శంఖారావ సభ.. దీనిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

సత్యదేవ్ 'రావు బహదూర్' బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్లు రాబట్టాలో తెలుసా..

Rao Bahadur 4 Days Collection
Rao Bahadur 4 Days Collection

రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల అవ్వబోతున్న కొత్త సినిమాల్లో , ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించిన చిత్రం ‘రావు బహదూర్’. తన ప్రతీ సినిమాతో ప్రేక్షకులకు కొత్త రకమైన సినిమాటిక్ అనుభూతిని కలిగించాలని తపన పడే సత్యదేవ్ ఈ చిత్రం లో హీరో గా నటించగా, ‘కేర్ ఆఫ్ కంచెరపాలెం’ ఫేమ్ వెంకటేష్ మహా దర్శకత్వం వహించారు. ఇక మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాని ఆయన తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రమోట్ చేయడమే కాదు , ట్రైలర్ కి వాయిస్ ఓవర్ ని కూడా అందించారు. ఇలా ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తిని కలిగించిన ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బలంగానే జరిగింది. సత్యదేవ్ కి సోలో హీరో గా ఇప్పటి వరకు స్థిరమైన మార్కెట్ లేదు అనేది వాస్తవం.

ఆయన నటించిన సినిమాలకు ఓటీటీ లో మంచి ఆదరణ దక్కాయి కానీ , థియేట్రికల్ ఆదరణ మాత్రం దక్కలేదు. అయినప్పటికీ కూడా ఈ చిత్రానికి మార్కెట్ లో 10 కోట్ల రూపాయిల రేంజ్ లో ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఆసక్తికరంగా ఉండడం తో పాటు , వెంకటేష్ మహా , సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రాండ్ ఇమేజ్ కూడా ఈ చిత్రానికి కలిసొచ్చింది. దీంతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని లాభాల్లోకి అడుగుపెట్టాలంటే 11 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. మరి ఆ రేంజ్ వసూళ్లు వస్తాయా అంటే , అవుననే అంటున్నారు ట్రేడ్ పండితులు. ఎందుకంటే అడ్వాన్స్ బుకింగ్స్ చాలా ప్రామిసింగ్ గా ఉన్నాయి. ఒక్క నార్త్ అమెరికా నుండే ఈ చిత్రానికి లక్ష డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

ఇది సాధారణమైన విషయం కాదు. టాక్ వస్తే కచ్చితంగా ఈ చిత్రం 1 మిలియన్ గ్రాస్ వసూళ్లను కూడా రాబడుతుంది , అందులో ఎలాంటి సందేహం లేదు. ‘కేర్ ఆఫ్ కంచెరపాలెం’ చిత్రం లో డైరెక్టర్ వెంకటేష్ మహా ఇచ్చే కొన్ని ట్విస్టులకు ఆడియన్స్ కి మైండ్ బ్లాక్ అయ్యింది. ఇదేంటి బాబు , అసలు ఊహించలేకపోయాము, టేకింగ్ లో ఇది మాస్టర్ పీస్ రేంజ్ అని ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్ చేశారు. హీరో సత్య దేవ్ ‘రావు బహదూర్’ లో అంతకు మించిన ట్విస్టులు , షాకింగ్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయని చెప్పుకొచ్చారు. అదే కనుక నిజమైతే , బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా వసూళ్ల సునామీ ని సృష్టించబోతోంది అనొచ్చు , అందులో ఎలాంటి సందేహం లేదు.

'బిగ్ బాస్ 10 ' లో కంటెస్టెంట్స్ అలాంటి పనులు చేస్తే 10 లక్షలు జరిమానా..!

Bigg Boss 10 Telugu
Bigg Boss 10 Telugu

Bigg Boss 10 Telugu: బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘బిగ్ బాస్ 10’ ఫెవర్ మొదలైంది. ఈ ఏడాది సెప్టెంబర్ 6 నుండి ఈ సీజన్ గ్రాండ్ గా ప్రారంభం కానుంది. గత ఏడాది లాగానే ఈ ఏడాది లో కూడా ‘అగ్నిపరీక్ష’ షో ద్వారా సామాన్యులను ఎంచుకొని బిగ్ బాస్ షో లోకి పంపబోతున్నారు. అందుకోసం ప్రారంభించిన దరఖాస్తుల ప్రక్రియ కూడా ముగిసింది. భారీ రేంజ్ లో అప్లికేషన్స్ వస్తాయని ఊహించారు కానీ , ఆ రేంజ్ లో మాత్రం రాలేదు. గత సీజన్ లో లాగానే , ఈ సీజన్ లో కూడా 8 మంది సామాన్యులను ఎంపిక చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపబోతున్నారు. సెలబ్రిటీల జాబితా 12 నుండి 14 మంది వరకు ఉండొచ్చు. ఈసారి మోస్ట్ పాపులర్ సెలబ్రిటీలను దించాలనే చూస్తున్నారు.

త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఈమధ్య కాలం లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మధ్య వాగ్వాదాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. గత సీజన్స్ లో నేరుగా ఒకరిని ఒకరు బూతులు తిట్టుకోవడం వంటివి కూడా మనం కళ్లారా చూశాము. ముఖ్యంగా ఇలాంటి షోస్ ని ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా చూస్తుంటారు , వాళ్లకు ఇలాంటి బూతులు వినడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంతే కాకుండా గత సీజన్స్ లో మతాల కార్డుని ఉపయోగించుకున్న వాళ్ళు ఉన్నారు , అదే విధంగా తెలుగు వెర్సస్ కన్నడ వాదన కూడా తీసుకొచ్చారు. ప్రతీ సీజన్ కి ఇలాంటివి బాగా పెరిగిపోతున్నాయి. అందుకే వీటిని తగ్గించడం కోసం బిగ్ బాస్ టీం ఒక సరికొత్త నిర్ణయం తీసుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో ఒక గాసిప్ వినిపిస్తోంది. అదేమిటంటే బూతులు మాట్లాడిన, ఫిజికల్ గా ఎవరిపైన అయినా చెయ్యి చేసుకున్నా , విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కంటెస్టెంట్స్ ప్రవర్తించిన జరిమానా భారీ రేంజ్ లో విధించబోతున్నారని టాక్.

రెమ్యూనరేషన్ నుండి రెండు , మూడు వారాలు కట్ చేయడమో , లేదంటే 10 లక్షల రూపాయిల రేంజ్ లో జరిమానా విధించడమో జరుగుతుందట. మన సీజన్స్ లో ఇప్పటి వరకు ఉద్దేశపూర్వకంగా కొట్టడం వంటివి జరగలేదు కానీ , తమిళ , హిందీ బిగ్ బాస్ సీజన్స్ లో మాత్రం ఇలాంటి సంఘటనలు జరిగాయి. అక్కడి హోస్టులు కంటెస్టెంట్స్ కి రెడ్ కార్డు ఇచ్చి బయటకు పంపేసేవారు. మన తెలుగు బిగ్ బాస్ లో రెడ్ కార్డు మాత్రమే కాకుండా, ఇలా జరిమానా కూడా విధించాలని అనుకుంటున్నారట. మరి ఇందులో ఎంత మాత్రం నిజముందో చూడాలి.

'రంగస్థలం' ఇప్పుడు విడుదల అయ్యుంటే ఇండియా షేక్ అయ్యేది : అక్కినేని అఖిల్

Akhil Akkineni
Akhil Akkineni

Akkineni Akhil: ‘ మెగా అభిమానుల్లో ఎప్పటి నుండో ఒక చిన్న నిరాశ , అసంతృప్తి దాగుంది. అదేమిటంటే రామ్ చరణ్ కెరీర్ లో ల్యాండ్ మార్క్ లాగా నిల్చినటువంటి ‘రంగస్థలం’ చిత్రాన్ని కేవలం ప్రాంతీయ బాషా చిత్రం గా మిగిల్చడమే. ఈ సినిమాకు పాన్ ఇండియా లెవెల్ లో ‘పుష్ప’ రేంజ్ వసూళ్లు సునామీ ని సృష్టించేంత సత్తా ఉంది. అయినప్పటికీ మేకర్స్ ఎందుకో ఆ సాహసం చేయలేదు. అప్పటికే బాహుబలి సిరీస్ కారణంగా మన టాలీవుడ్ కి పాన్ ఇండియా మార్కెట్ కూడా వచ్చేసింది. అయినప్పటికీ మేకర్స్ ఆసక్తి చూపించలేదు. ఆరోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 230 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది , ఇది సాధారణమైన విషయం కాదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి వచ్చిన లాంగ్ రన్ ని చూసి ట్రేడ్ పండితులు కూడా మెంటలెక్కిపోయారు.

ఒక్కమాటలో చెప్పాలంటే మన టాలీవుడ్ లో అత్యధిక సెంటర్స్ లో వంద రోజులు ఆడిన చివరి చిత్రం ఇదే అనొచ్చు. అయితే అభిమానుల్లో ఎలాంటి ఫీలింగ్ ఉందో , ఈ సినిమాపై ప్రముఖ యంగ్ హీరో అక్కినేని అఖిల్ లో కూడా అలాంటి ఫీలింగే ఉంది. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ‘రంగస్థలం చిత్రం మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే వన్ ఆఫ్ ది కల్ట్ క్లాసిక్ అనొచ్చు. ఈ చిత్రం ఇప్పుడు విడుదల అయ్యుంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేసి ఉండేది. ‘పుష్ప’ తరహా లోనే ఇండియా లో బిగ్గెస్ట్ బ్రాండ్ అయ్యేది’ అంటూ చెప్పుకొచ్చారు అక్కినేని అఖిల్. ఆయన మాటలను ఏకీభవిస్తూ రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా పోస్టులు పెడుతున్నారు. వాస్తవానికి ఈ సినిమాని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ కి అప్పట్లో పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలను రిలీజ్ చేసేంత ధైర్యం లేదు.

‘పుష్ప’ చిత్రాన్ని కూడా మొదట్లో పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చెయ్యాలని అనుకోలేదు. రాజమౌళి ఈ సినిమాకు ముంబై లో మంచి క్రేజ్ ఉందని, అందరూ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారని , మీరు కచ్చితంగా నార్త్ ఇండియా లో విడుదల చేయాలనీ , లేదంటే చాలా నష్టపోతారని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పడంతో , అల్లు అర్జున్ నిర్మాతలపై ఒత్తిడి చేసి ఈ చిత్రాన్ని నార్త్ ఇండియా లో విడుదల చేయించారు. ఇక ఆ తర్వాత హిస్టరీ ఏంటో తెలిసిందే. ‘పుష్ప’ చిత్రంతో అల్లు అర్జున్ నార్త్ ఇండియా లో ప్రభంజనం సృష్టించిన మాస్ ప్రాంతాల్లో కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు. ఒకవేళ రామ్ చరణ్ కూడా ఇదే విధంగా ఒత్తిడి చేసి రంగస్థలం చిత్రాన్ని నార్త్ ఇండియా లో విడుదల చేయించి ఉండుంటే ఈరోజు పరిస్థితి ఎలా ఉండేదో అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

రాజమౌళి కి దక్కిన అరుదైన గౌరవం.. జీవితాంతం గుర్తించుకోదగ్గ జ్ఞాపకం ఇది.

SS Rajamouli
SS Rajamouli

SS Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి కి మరో అరుదైన గౌరవం దక్కింది. ఇటీవలే ఆయన ఫ్రాన్స్ దేశంలోని లియోన్ నగరం లో పర్యటించారు. ఆ నగరం లోని ప్రఖ్యాతి గాంచిన ‘లూమినర్ మ్యూజియం’ ని సందర్శించగా , అక్కడ ఆయనకు అరుదైన సత్కారం లభించింది. మార్టిన్గ్ స్కోర్సెస్ , క్లింట్ ఈస్ట్ వుడ్, క్వేన్టిన్ టొరంటీనో , ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా వంటి ప్రపంచ సినిమా ఇండుస్త్రీలను శాసించిన ప్రపంచ దిగ్గజాల పేర్లు ఉన్న గోడపై రాజమౌళి పేరు కూడా శాశ్వతంగా చెక్కబడింది. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలుపుతూ బాగా ఎమోషనల్ అయ్యారు. అక్కడి ప్రేక్షకులు తన #RRR, ఈగ చిత్రాలను బాగా ఆదరించారని , లూమియార్ ఇన్స్టిట్యూట్ , కేన్స్ ఫిలిం ఫెస్టివల్ డైరెక్టర్ థియరీ ఫ్రిమాక్స్ నన్ను ఎంతో మర్యాదపూర్వకంగా తమ ప్రేక్షకులకు పరిచయం చేయడం మర్చిపోలేని అనుభూతి అంటూ ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత ఆయన నాకు ఇచ్చిన సరప్రైజ్ ని జీవితం లో ఎప్పటికీ మర్చిపోలేను. ఈ ప్రపంచం లో సినిమా పుట్టిన వీధిలో నన్ను నడిపించుకుంటూ తీసుకెళ్లారు. తన చుట్టూ జరుగుతున్న ఈ సంఘటనలను చూసి చాలా ఎమోషనల్ కి గురయ్యాను అని , ఇక ఆ తర్వాత ప్రపంచం లో ప్రఖ్యాతి గాంచిన దిగ్గజ దర్శకుల మధ్యలో తన పేరు ఉండడం చూసి షాక్ కి గురయ్యాను అని రాజమౌళి వివరించారు . ఇలాంటి గౌరవాన్ని ఇచ్చినందుకు తన నోటి నుండి మాట కూడా రాలేదని , వాళ్లకు కేవలం కృతఙ్ఞతలు మాత్రమే చెప్పగలనని , వాళ్లపై గౌరవంతో మనస్ఫూర్తిగా నా తలవంచి నమస్కరాలు అందిస్తున్నామని చెప్పుకొచ్చారు రాజమౌళి. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది, నెటిజెన్స్ తో పాటు గా సినీ సెలబ్రిటీలు కూడా రాజమౌళి కి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసారు.

ఇకపోతే ప్రస్తుతం రాజమౌళి ‘వారణాసి’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలోని మేజర్ యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన చిత్రీకరణ ఇప్పటికే పూర్తి అయ్యిందని , ఈ అక్టోబర్ నెలలో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ విడుదల చేస్తామని రాజమౌళి రీసెంట్ గానే చెప్పుకొచ్చారు. ఈ నెల 6 వ తేదీ నుండి హైదరాబాద్ లో వేసిన భారీ సెట్స్ లో , ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించనున్నారు రాజమౌళి. ఈ షెడ్యూల్ లో ప్రధాన తారాగణం తో పాటు 3000 మంది జూనియర్ ఆర్టిస్టులు కూడా నటించబోతున్నారు. ఏప్రిల్ 7 న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు రాజమౌళి.

పెద్ద రిస్క్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. 2023 రిపీట్ కానుందా? మరోసారి పరువు పోనుందా..

Chiranjeevi
Chiranjeevi

Chiranjeevi: 2023 వ సంవత్సరం మెగా ఫ్యాన్స్ కి ఆరంభం లో సంక్రాంతి సీజన్ ఏ రేంజ్ కిక్ ఇచ్చిందో, అదే ఏడాది సెకండ్ హాఫ్ మెగా అభిమానులకు అదే రేంజ్ నిరాశను మిగిలించింది. ఆ ఏడాది లో ఆగస్టు 11 మెగా ఫ్యాన్స్ కి ఒక పీడకల లాంటిది. ఎందుకంటే ఆరోజున మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ చిత్రం విడుదలైంది. తమిళం లో అప్పుడెప్పుడో సూపర్ హిట్ గా నిల్చిన ‘వేదలమ్’ చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రాన్ని మెహర్ రమేష్ తెరకెక్కించారు. ఈ సినిమా విడుదలైన రోజునే సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్’ చిత్రం విడుదలైంది. ఫలితం ఏంటో అందరికీ తెలిసిందే. భోళా శంకర్ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిలబడగా, ‘జైలర్’ చిత్రం సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి వదిలింది.

ప్రపంచవ్యాప్తంగా 650 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి, తెలుగు వెర్షన్ నుండి 90 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మరోపక్క ‘భోళా శంకర్’ చిత్రం మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత తక్కువ వసూళ్లను రాబట్టిన సినిమాగా నిల్చింది. ప్రపంచవ్యాప్తంగా కనీసం పాతిక కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది. ఇంకా చెప్పాలంటే మన చిన్నతనం లో విడుదలైన ‘మృగరాజు’ చిత్రానికి ఈ సినిమాకంటే ఎక్కువ వసూళ్లు కొన్ని సెంటర్స్ లో వచ్చాయి. 2026 కూడా అదే సీన్ రిపీట్ అవ్వనుందా? అని అంటున్నారు నెటిజెన్స్. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి లాంగ్ అవైటెడ్ మూవీ ‘విశ్వంభర’ చిరాన్ని అక్టోబర్ 16 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా విడుదలయ్యే ముందు రోజు , అనగా అక్టోబర్ 15 న రజినీకాంత్ ‘జైలర్ 2’ చిత్రం విడుదల కానుంది.

ఈ సినిమా పై ఆడియన్స్ లో ఎలాంటి హైప్ ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి ఒక్క కంటెంట్ కూడా బయటకు రాలేదు, అయినప్పటికీ ఈ రేంజ్ క్రేజ్ ఉందంటే, ఇక టీజర్ , పాటలు విడుదల తర్వాత ఏ రేంజ్ హైప్ క్రియేట్ అవుతుందో మీరే ఊహించుకోండి. మరోపక్క విశ్వంభర చిత్రాన్ని మెగా ఫ్యాన్స్ కూడా పూర్తిగా మర్చిపోయారు. విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ ఒక్కటి కూడా క్లిక్ అవ్వలేదు. ఇలాంటి మూవీ ని జైలర్ 2 వంటి భారీ హైప్ ఉన్న మూవీ కి పోటీగా విడుదల చేస్తే 2023 ఫీట్ రిపీట్ అవుతుందని స్వయంగా మెగా ఫ్యాన్స్ అంటున్నారు, మరి ఏమి జరగబోతుందో చూడాలి.

ఈ ఆకుల టీ తో కీళ్ల నొప్పులు మాయం.. అయితే ఇవి తప్పనిసరి..

parijat tea benefits : ఇంటి ఆవరణలో ఉండే కొన్ని పూల చెట్లు సువాసనలు వెదజల్లడమే కాదు… మంచి ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాయి. వీటిలో పారిజాత చెట్టు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈ చెట్టుకు ఉండే ఆకులు, పువ్వులు, బెరడు వంటి భాగాలను వివిధ ఆరోగ్య సమస్యలకు ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్‌తో పాటు పలు కొండ ప్రాంతాల్లో పారిజాత ఆకులతో తయారు చేసిన కషాయాన్ని తరతరాలుగా గృహ వైద్యంగా ఉపయోగిస్తున్నారు. అయితే పారిజాతం టీ తాగడం వల్ల కీళ్ల నొప్పులు మటుమాయం అవుతాయని కొందరు చెబుతున్నారు. అసలు ఈ పారిజాతం టీ ని ఎలా తయారు చేస్తారు?

పారిజాతం టీ..
ఉత్తరాఖండ్‌కు చెందిన ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ అజెల్ పటేల్ వివరాల ప్రకారం.. పారిజాత టీ తయారీ చాలా సులభం. రెండు గ్లాసుల నీటిలో కొన్ని తాజా, శుభ్రంగా కడిగిన పారిజాత ఆకులను వేసి తక్కువ మంటపై మరిగించాలి. నీరు సగానికి తగ్గిన తర్వాత వడకట్టి గోరువెచ్చగా తాగాలి. ఈ కషాయంలో చక్కెర కలపకూడదని సూచిస్తున్నారు. అవసరమైతే కొద్దిగా చల్లారిన తర్వాత మాత్రమే వైద్యుల సలహాతో కొద్దిగా తేనె కలుపుకోవచ్చు.

ఎప్పుడు తాగితే మంచిది?
సాంప్రదాయంగా పారిజాత ఆకుల కషాయాన్ని ఉదయం ఖాళీ కడుపుతో లేదా తేలికపాటి అల్పాహారం చేసిన తర్వాత తీసుకుంటారు. ఇలా తీసుకోవడం వల్ల శరీరానికి ఇందులోని సహజ గుణాలు బాగా అందుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రతి ఒక్కరి శరీర తత్వం భిన్నంగా ఉండటంతో దీన్ని అలవాటుగా తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

ఆయుర్వేదం చెప్పే ఆరోగ్య ప్రయోజనాలు
ఆయుర్వేద గ్రంథాల ప్రకారం పారిజాత ఆకుల్లో వాపును తగ్గించడంలో సహాయపడే సహజ జీవక్రియాశీల సమ్మేళనాలు (Bioactive Compounds) ఉంటాయి. అందువల్ల కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్, కీళ్ల వాపు వంటి సమస్యల్లో ఇది కొంత ఉపశమనం కలిగించవచ్చని భావిస్తారు. కొన్ని ప్రాంతాల్లో జ్వరాలు, శరీర నొప్పులు వంటి సమస్యల సమయంలో కూడా దీనిని సంప్రదాయ వైద్యంగా ఉపయోగించే ఆనవాయితీ ఉంది.

శాస్త్రీయ ఆధారాలు ఇంకా పరిమితమే
పారిజాత ఆకుల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేదంలో ప్రస్తావించినప్పటికీ, వాటిని పూర్తిస్థాయిలో నిర్ధారించే శాస్త్రీయ పరిశోధనలు ప్రస్తుతం పరిమితంగానే ఉన్నాయి. అందువల్ల దీనిని అద్భుత ఔషధంగా లేదా అన్ని వ్యాధులకు శాశ్వత పరిష్కారంగా భావించడం సరైంది కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

మందులకు ప్రత్యామ్నాయం కాదు
ఆర్థరైటిస్, యూరిక్ యాసిడ్, కీళ్ల వాపు లేదా ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఇప్పటికే వైద్యుల సూచన మేరకు మందులు వాడుతున్నవారు వాటిని స్వయంగా ఆపేయకూడదు. పారిజాత టీని సహాయకంగా మాత్రమే పరిగణించాలి. ఇది వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు.

జాగ్రత్తలు తప్పనిసరి
ఏదైనా మూలికా కషాయం అయినప్పటికీ ప్రతి ఒక్కరికి ఒకే విధంగా ప్రయోజనం కలుగుతుందని చెప్పలేం. గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు, అలర్జీలు ఉన్నవారు లేదా ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు వైద్యుల సలహా లేకుండా పారిజాత టీని తీసుకోకపోవడం మంచిది.

'ఇసకపట్నం' వెబ్ సిరీస్ రివ్యూ : ఇదేమి కాన్సెప్ట్ బాబోయ్.. అసలు ఊహించలేదు

Isakapatnam Web Series Review
Isakapatnam Web Series Review

Isakapatnam Web Series Review: ఒక పక్క సినిమాలు , మరోపక్క వెబ్ సిరీస్ లు చేస్తూ ఆడియన్స్ ని ఎల్లప్పుడూ ఎంటర్టైన్ చేస్తూ ఉండే హీరోయిన్స్ లో ఒకరు ఐశ్వర్య రాజేష్. ఆమె ఏ జానర్ సినిమాని ఎంచుకున్నా, తనకు నటనకు స్కోప్ ఉండేలా చూసుకుంటూ వస్తోంది. ‘సంక్రాంతి వస్తున్నాం’ వంటి భారీ హిట్ తర్వాత ఆమె ప్రధాన పాత్ర పోషించిన వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’. నిన్న అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అయినటువంటి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఒకసారి ఈ రివ్యూ లో చూద్దాం.

కథ :

నాయుడు(సముద్రఖని) అనే వ్యక్తి తన భార్య , పిల్లలతో కలిసి ఇసకపట్నం అనే గ్రామం లో కూలీగా అడుగుపెడతాడు. కుట్ర, కుతంత్రాల ఆలోచనలతో ఉన్న నాయుడు , ఆ ఊరిలో ప్రజల మనిషిగా మంచి పేరు తెచ్చుకున్న చిన్నారావు (రాజీవ్ కనకాల) ని చెంపేసి నాయకుడిగా ఎదుగుతాడు. ఇక అప్పటి నుండి నాయుడు అరాచకాలకు హద్దు అదుపు లేకుండా పోయింది. ఆ ఊర్లో ఆయన చెప్పిందే వేదం , అతనికి ఎవరైనా ఎదురు తిరిగితే చంపేస్తుంటాడు. తండ్రి చేసే దుర్మార్గాలను అతని కూతురు భారతి ‘ఐశ్వర్య రాజేష్’ వ్యతిరేకిస్తూ ఉంటుంది. నాయుడి దగ్గర పని చేసే సూరి (సుధాకర్ కొమాకుల) అనే వ్యక్తిని ప్రేమిస్తుంది . కానీ నాయుడు మాత్రం తన అధికారాన్ని కాపాడుకోవడం కోసం తన ప్రత్యర్థి అయినటువంటి ప్రతాప్ వర్మ(రవివర్మ) తో పెళ్లి జరిపిస్తాడు. అయితే తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు ఆవేశం తో రగిలిపోయిన భారతి తన భర్త ప్రతాప్ వర్మ ని చంపేస్తుంది. ఆ తర్వాత ఏమైంది అనేది స్టోరీ , స్క్రీన్ ప్లే.

విశ్లేషణ : నాయుడు పాత్రలో సముద్రఖని నటించలేదు జీవించాడు అనే చెప్పాలి. తనదైన హావబాలతో , డైలాగ్స్ తో విలనిజాన్ని పీక్ రేంజ్ కి తీసుకెళ్లాడు. ఇక ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ పాత్ర ప్రదమైన హైలైట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇన్ని రోజులు కేవలం పాజిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించిన ఐశ్వర్య రాజేష్ , ఇందులో నెగెటివ్ షేడ్స్ లో కూడా కనిపించి సర్ప్రైజ్ కి గురి చేసింది. ఇక పోలీస్ ఆఫీసర్ గా సునీల్ అదరగొట్టేసాడు. చాలా కాలం తర్వాత ఆయనకు మంచి పాత్ర దొరికింది. ఆరంభం ఎపిసోడ్స్ లో పాత్రలను పరిచయం చేయడానికి ఎక్కువ సమయం తీసుకున్న దర్శకుడు , రెండో ఎపిసోడ్ నుండి కథలోకి ప్రేక్షకులని తీసుకెళ్లి ఎంటర్టైన్ చేయడం లో సక్సెస్ అయ్యాడు. ఒక్క మాటలో చెప్పాలంటే , ఇసుకపట్నం మంచి పొలిటికల్ ఎంగేజింగ్ థ్రిల్లర్ సిరీస్. ఐశ్వర్య రాజేష్ , సముద్ర ఖని ఈ సిరీస్ లో పోటాపోటీగా నటించారు. కచ్చితంగా ఈ సిరీస్ ని థ్రిల్లర్ జానర్ సినిమాలను ఇష్టపడే వాళ్ళు చూడొచ్చు.

మావిగన్ వాదనతో ఓటమిని ముందుగానే ఖాయం చేసుకున్న జగన్

Amaravati Capital Issue

Amaravati Capital Issue : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. “మావిగన్‌ను ఒప్పుకునే వారు నాకు ఓటు వేస్తారు.. అమరావతిని ఒప్పుకునే వారు చంద్రబాబుకు ఓటు వేస్తారు” అని ఆయన చేసిన వ్యాఖ్యలు, రాబోయే ఎన్నికలను రాజధాని అంశం చుట్టూ తిప్పే ప్రయత్నంగా కనిపిస్తున్నాయి.

అయితే ఇక్కడ ప్రధాన ప్రశ్న ఏమిటంటే… పార్లమెంట్ చట్టబద్ధ ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన అమరావతి రాజధానిని మళ్లీ మార్చే రాజకీయ, చట్టపరమైన అవకాశం జగన్‌కు ఉందా? రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా కేంద్రం అటువంటి నిర్ణయానికి అంగీకరిస్తుందా? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం ఇప్పటివరకు కనిపించడం లేదు.

మరోవైపు జాతీయ పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్ రెండూ అమరావతినే రాజధానిగా అంగీకరిస్తున్నాయి. అలాంటి పరిస్థితిలో జగన్ మళ్లీ కొత్త రాజధాని ఆలోచనను ముందుకు తీసుకురావడం ఎంతవరకు ఆచరణ సాధ్యమనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

జగన్ తన వాదనలో “నేను అమరావతికి వ్యతిరేకం కాదు… అక్కడ జరిగిన అవినీతికి మాత్రమే వ్యతిరేకం” అని చెబుతున్నారు. అదే సమయంలో భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేస్తామని చెబుతూనే, గతంలో భూములు ఇవ్వొద్దని చెప్పిన విషయాన్ని రాజకీయ ప్రత్యర్థులు గుర్తుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో అమరావతి విషయంలో వైసీపీ అసలు వైఖరి ఏమిటనే సందేహం మరింత బలపడుతోంది.

ఇంకా ఒక కీలక అంశం… గతంలో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల సిద్ధాంతాన్ని ప్రకటించింది. అందులో విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా ప్రతిపాదించింది. ఇప్పుడు ఆ అంశాన్ని పక్కనబెట్టి “మావిగన్” అనే కొత్త నినాదాన్ని ముందుకు తేవడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇది కొత్త రాజకీయ వ్యూహమా? లేక గత నిర్ణయాల నుంచి వైదొలిగిన సంకేతమా? అనే చర్చ సాగుతోంది.

రాజధాని అంశం ఇప్పటికే ఎన్నో రాజకీయ, చట్టపరమైన మలుపులు చూసింది. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల ఆందోళనలు, కోర్టు తీర్పులు, కేంద్ర ప్రభుత్వ వైఖరి వంటి పరిణామాల తర్వాత మళ్లీ కొత్త రాజధాని ప్రతిపాదనను ప్రజలు ఎంతవరకు స్వీకరిస్తారనేది ఎన్నికల్లో కీలక అంశంగా మారే అవకాశం ఉంది.

ప్రస్తుతం కనిపిస్తున్న రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తే, “మావిగన్ వర్సెస్ అమరావతి” అనే పోరును ఎన్నికల ప్రధాన అజెండాగా మార్చాలని జగన్ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ వ్యూహం ఆయనకు రాజకీయంగా లాభం చేకూరుస్తుందా? లేక ఇప్పటికే స్థిరపడిన అమరావతి అంశంపై మళ్లీ వివాదం సృష్టించడం ద్వారా ప్రతికూల ఫలితాలు ఎదుర్కొంటారా? అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.

రాజధాని వంటి సున్నితమైన అంశంలో ప్రజలు భావోద్వేగాలకన్నా ఆచరణ సాధ్యత, చట్టబద్ధత, రాష్ట్ర అభివృద్ధి వంటి అంశాలనే ఎక్కువగా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. అందుకే ఈ ఎన్నికల్లో రాజధాని రాజకీయాలు మరోసారి కీలక పాత్ర పోషించబోతున్నాయి.

మావిగన్ వాదనతో ఓటమిని ముందుగానే ఖాయం చేసుకున్న జగన్.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

'జైలర్ 2' టీజర్ వచ్చేసింది .. అనిరుద్ మరోసారి విశ్వరూపం చూపించేశాడుగా..!

Jailer 2 teaser Review

Jailer 2 teaser : సౌత్ ఇండియన్ మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘జైలర్ 2’ అప్డేట్ వచ్చేసింది. రీసెంట్ గానే షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 15 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు , ఒక చిన్న బ్లాస్టింగ్ టీజర్ తో ప్రకటించారు మేకర్స్. ఈ టీజర్ లో నెల్సన్ మార్క్ టేకింగ్ కనిపించింది. ‘జైలర్’ టీజర్ అప్పుడు కూడా ఆయన ఇదే ఫార్మటు ని అనుసరించారు. క్యారెక్టర్స్ ని పూర్తి స్థాయి లో రివీల్ చేయకుండా , కేవలం రజినీకాంత్ ని మాత్రమే చూపించారు. కానీ ఈ టీజర్ లో క్యారెక్టర్స్ ని రివీల్ చేయలేదు , అదే విధంగా రజినీకాంత్ ని కూడా చూపించలేదు. దూరం నుండి ఆయన వెనక్కి తిరిగి నిల్చున్న షాట్ ని మాత్రమే చూపించారు.

అయితే ఈ టీజర్ లో అనిరుద్ మరోసారి తన విశ్వరూపం చూపించాడు అనే చెప్పాలి. ‘జైలర్’ థీమ్ మ్యూజిక్ ని మోడిఫై చేస్తూ తన సరికొత్త అప్డేటెడ్ వెర్షన్ కి సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. అనిరుద్ ఇలాంటి విషయాల్లో అసలు వెనక్కి తగ్గడు , మరోసారి ఆయనకు ఎందుకు సౌత్ ఇండియా లో ఇంత డిమాండ్ ఉంది అనేది ఈ ఒక్క బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో చెప్పకనే చెప్పారు. ఇకపోతే ఈ టీజర్ లో సినిమా కథ ఎక్కడి నుండి మొదలు అవుతుందో చెప్పుకొచ్చారు డైరెక్టర్. మొదటి భాగం క్లైమాక్స్ లో విలన్ చనిపోయే ముందు కొన్ని మాటలు అంటాడు గుర్తుందా?, నన్ను చంపి ఎంత పెద్ద తప్పు చేయబోతున్నావో నీకు తెలియదు , ఇదొక మహాసముద్రం , నా వెనుక ఎవరెవరు ఉన్నారో తెలుసా? అని అంటాడు. అక్కడి నుండే ఈ చిత్రం మొదలు అవుతుంది.

అవినీతి మార్గం లోకి వెళ్తే కన్నకొడుకుని కూడా కనికరం లేకుండా చంపేసిన హీరో కి , ఈ మాఫియా నుండి ఎదురైనా సమస్యలు ఏంటి?, దాని నుండి ఆయన ఎలా బయటపడ్డాడు అనేదే స్టోరీ గా తీసినట్టు టీజర్ ని చూస్తుంటే అర్థం అవుతోంది. ఇకపోతే మొదటి భాగం లో శివరాజ్ కుమార్ , మోహన్ లాల్ పాత్రలు కనిపించింది చాలా తక్కువసేపు అయినప్పటికీ, బలమైన ప్రభావం చూపించారు , ఈ చిత్రం లో కూడా వాళ్ళ పాత్రలు ఉంటాయట, అదే విధంగా బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ కూడా ఈ చిత్రం లో బలమైన పవర్ ఫుల్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారట. రెండు రోజుల క్రితమే ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ ని కూడా పూర్తి చేశారు. ‘జైలర్’ తో ఏకంగా 650 కోట్ల రూపాయిలకు పైగా గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టిన సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్ 2’ తో వెయ్యి కోట్లు అందుకుంటాడా లేదా అనేది చూడాలి.

బాత్రూంలో జారిపడిన అక్కినేని అఖిల్.. తీవ్ర గాయాలు.. 42 కుట్లు.. వీడియో వైరల్..

akhil-akkineni-reveals-bathroom-accident-42-stitches-lenin-movie-interview

Akhil Akkineni Injury : అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘లెనిన్’ చిత్రం ఈ నెల 10 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా అఖిల్ అనేక ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. ఈ ఇంటర్వ్యూస్ లో ఆయన ‘లెనిన్’ చిత్రం గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా అభిమానులు తనపై ఎంత కోపంగా ఉన్నారో చెప్పుకొచ్చారు. కెరీర్ మొత్తం మీద సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేదు , ఇలాంటి సమయం లో మూడేళ్లు గ్యాప్ ఇచ్చేసరికి అక్కినేని ఫ్యాన్స్ సోషల్ మీడియా లో అఖిల్ ని ట్యాగ్ చేసి తిట్టడం మొదలు పెట్టారు. ఇదే అంశాన్ని ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ అడుగుతారు. ఇంత గ్యాప్ ఇచ్చినందుకు ఫ్యాన్స్ మీ మీద కోపం గా ఉన్నారు, వాళ్లకు ఏమి సమాధానం చెప్తారు అని అడుగుతారు.

అందుకు అఖిల్ సమాధానం చెప్తూ ‘వాళ్లకు కోపం రావడం లో తప్పు లేదు. నా వైపు కొంత మిస్టేక్ ఉంది , అదే విధంగా టెక్నీకల్ వాల్యూస్ పరంగా కొంత ఆలస్యం అయ్యింది. నేను కావాలని మాత్రం ఆలస్యం చేయలేదు , బాత్రూం లో ఒకరోజు జారీ ఒక గ్లాస్ అడ్డం మీద పడ్డాను , తీవ్రమైన గాయాలు అయ్యాయి, రెండు సర్జరీలు జరిగాయి, 42 కుట్లు పడ్డాయి. ఆ కారణం చేత 16 నెలలు షూటింగ్ కి బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. అంతే కాకుండా సరైన కథ వచ్చేంత వరకు సినిమా చేయకూడదు అని అనుకున్నాను. 16 నెలల తర్వాత నేను పూర్తిగా కోలుకొని , జిమ్ లో వర్కౌట్స్ చేసి , బలాన్ని రప్పించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసి , ఈరోజు మీ ముందు ఇలా ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చారు.

దీంతో అక్కినేని ఫ్యాన్స్ నువ్వు సినిమాల పట్ల సీరియస్ గా లేవని తప్పుగా అపార్థం చేసుకున్నాము , దయచేసి మమ్మల్ని క్షమించు అంటూ ట్వీట్లు వేస్తున్నారు. ప్రతీ సినిమాకు అఖిల్ తన వైపు నుండి నూటికి నూరు శాతం బెస్ట్ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు, డ్యాన్స్ బాగా వేస్తారు , ఫైట్స్ అద్భుతంగా చేస్తారు , నటన కూడా పర్వాలేదు అనిపించుకున్నారు , కానీ స్క్రిప్ట్ సెలక్షన్ సరిగా లేకపోవడం వల్ల, ఆయన వరుసగా ఫ్లాప్స్ ని ఎదురుకోవాల్సి వచ్చింది. కానీ ‘లెనిన్’ పట్ల అఖిల్ చాలా నమ్మకంతో ఉన్నారు , ఆయన మాటల్లోని కాన్ఫిడెన్స్ , ఉత్సాహం చూస్తుంటే ఈసారి కుంభస్థలం బద్దలు కొట్టడం ఖాయం అనిపిస్తోంది.

ప్రశ్న రావణ్ పై కోడి గుడ్లతో దాడి చేసిన పవన్ కళ్యాణ్ అభిమానులు.. వీడియో వైరల్..

Pawan Kalyan, Prashna Ravan, Ravan Arrest

Prashna Ravan : భావ స్వేచ్ఛ ప్రతీ ఒక్కరికి ఉంటుంది , అది మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు. ఈ దేశం లో మనకి నచ్చని అంశాల మీద, ఐడియాలజీ మీద , వ్యక్తుల పైన , రాజకీయ పార్టీలపైనా విమర్శలు చేయొచ్చు , అందులో ఎలాంటి తప్పు లేదు , విమర్శలు ఉండాలి , అప్పుడే మన సమాజం లోని సమస్యలకు పరిష్కారాలను వెతకగలం. అయితే బావ స్వేచ్ఛ ప్రకటన అంటూ , అవతల వ్యక్తిపై ఇష్టమొచ్చినట్టు నోరు పారేసుకోమని రాజ్యాంగం చెప్పలేదు. ఇంట్లో ఆడవాళ్ళని దూషించమని, అసభ్య పదజాలంతో రెచ్చిపోమని చెప్పలేదు , ఒక మతాన్ని కించపర్చామని కూడా చెప్పలేదు. ఇవన్నీ చట్టా రీత్యా నేరం, ఇన్ని చేసిన వ్యక్తులను వదిలేస్తే సమాజానికే అత్యంత ప్రమాదకరం. అందుకే ప్రశ్న రావణ్ ని అరెస్ట్ చేయించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

మొన్న అర్థ రాత్రి హైదరాబాద్ లో ఉంటున్న రావణ్ ఇంటికి వెళ్లిన పిఠాపురం పోలీసులు , ఆయన్ని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. అయితే జడ శ్రవణ్ కుమార్ రావణ్ కి మద్దతుగా నిలిచి , ఆయన తరుపున వాదించి బెయిల్ ఇప్పించారు. అయితే 2025 వ సంవత్సరం లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సర్పవరం లో రావణ్ పై పోలీస్ కేసు నమోదైంది. దీంతో ఆయనకు బెయిల్ వచ్చిన వెంటనే సర్పవరం పోలీసులు వచ్చి రావణ్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అయితే నిన్న పిఠాపురం పోలీస్ స్టేషన్ వద్ద కానీ , నేడు సర్పవరం పోలీస్ స్టేషన్ వద్ద కానీ , పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ ఎత్తున చేరుకొని ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ‘డౌన్ డౌన్ రావణ్’ అని అరుస్తూ, ఆయనపై కఠినమైన చర్యలు తీసుకోవాలని , లేని పక్షం లో అతన్ని మాకు వదిలేయాలని డిమాండ్ చేశారు.

ఇక నేడు సర్పవరం పోలీస్ స్టేషన్ నుండి రావణ్ ని కోర్టు కి తరలిస్తున్న సమయం లో పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ ఎత్తున అక్కడికి చేరుకొని రావణ్ పై గుడ్ల వర్షం కురిపించారు. పోలీసులు అతనికి రక్షణ కల్పిస్తూ , చాలా సురక్షితంగా కోర్టుకి తీసుకెళ్లారు. చూస్తూనే పవన్ కళ్యాణ్ అభిమానులు ఈసారి రావణ్ ని వదిలిపెట్టేలా లేరు , గతం లో ఇతను పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అలా ఉన్నాయ్ మరీ. అంతే కాకుండా పిఠాపురం కి వెళ్లి , చిన్న పిల్లలు కొట్టుకుంటే, దాంట్లో కూడా కుల విద్వేషాలను రెచ్చగొట్టాలని చూసాడు, ఇలాంటి వారిని అరెస్ట్ చేయడం లో చాలా ఆలస్యం చేశారు అనేది నెటిజెన్స్ వాదన. ఇక రావణ్ పై దాడి చేసిన వీడియో ని మీకోసం ఎక్సక్లూసివ్ గా క్రింద అందిస్తున్నాము చూడండి.

మేక మాంసం అని చెప్పి ఎద్దు మాంసం విక్రయం..! పోలీసుల అదుపులో మటన్ విక్రయదారుడు..

Hyderabad Mutton Adulteration
Hyderabad Mutton Adulteration

Hyderabad Mutton Adulteration: ప్రస్తుతం కాలంలో ప్రతీ ఆహార వస్తువు కల్తీమయంగా మారుతోంది. ముఖ్యంగా బయట లభించే ఆహార పదార్థాల్లో కొందరు లాభాపేక్షను ఎక్కువగా ఆశించి కల్తీ చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో వరుసగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ మటన్ షాపులో మేక మాంసంలో ఎద్దు మాంసం కలిపి తక్కువ ధరకు హోటళ్లకు సరఫరా చేస్తున్న వ్యక్తిని అధికారులు పట్టుకోవడంతో నగరంలో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో మాంసాహార ప్రియుల్లో ఆందోళన వ్యక్తమయింది. ఇలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే?

హైదరాబాద్ లోని హబీబ్‌నగర్ పోలీస్ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులతో కలిసి సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లెపల్లిలోని ఓ మాంసం దుకాణంపై దాడి చేసి ఉస్మాన్ ఖురేషి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో మేక మాంసంలో ఎద్దు మాంసాన్ని కలిపి, స్వచ్ఛమైన మటన్‌గా చూపిస్తూ తక్కువ ధరకు హోటళ్లకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ తనిఖీల్లో దుకాణంలో నిల్వ ఉంచిన సుమారు 50 కిలోల అనుమానాస్పద మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ మాంసాన్ని సీజ్ చేసి, ప్రయోగశాల పరీక్షల కోసం నమూనాలను పంపించారు. పరీక్షల నివేదిక వచ్చిన తర్వాత మాంసంలో ఏయే రకాల కల్తీ జరిగిందో అధికారికంగా నిర్ధారణ కానుంది.

కల్తీ ఆహార పదార్థాల విక్రయం, వినియోగదారులను మోసం చేయడం, ఆహార భద్రత నిబంధనలను ఉల్లంఘించడం వంటి ఆరోపణలపై నిందితుడు ఉస్మాన్ ఖురేషిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మాంసాన్ని ఏయే హోటళ్లకు సరఫరా చేశాడు? ఎంతకాలంగా ఈ అక్రమ వ్యాపారం కొనసాగుతోంది? ఇందులో మరెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.

ఇలాంటి సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా తక్కువ ధరకు లభిస్తోందని నాణ్యత తెలియని మాంసాన్ని కొనుగోలు చేయొద్దని ఫుడ్ సేఫ్టీ అధికారులు సూచిస్తున్నారు. పరిశుభ్రత పాటించే, లైసెన్స్ ఉన్న దుకాణాల నుంచే మాంసం కొనుగోలు చేయాలని, అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. నాసిరకం లేదా కల్తీ మాంసం వినియోగం వల్ల ఫుడ్ పాయిజనింగ్, ఇన్‌ఫెక్షన్లు, జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Motorola నుంచి సూపర్ మోడల్ ఫోన్.. ఫీచర్స్ తెలిస్తే షాక్ అవుతారు..

Motorola Edge 70 Max
Motorola Edge 70 Max

Motorola Edge 70 Max: Motorola కంపెనీ తన ప్రీమియం ఎడ్జ్ సిరీస్‌లో సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేయడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా Motorola Edge 70 Max మోడల్, ఇప్పుడు ఏకంగా రెండు ప్రముఖ గ్లోబల్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్లలో కనిపించడంతో ఈ ఫోన్ రావడానికి దారులు పడ్డాయని తెలుస్తోంది. ఈ కొత్త ఫోన్ భారత్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో అతి త్వరలోనే విడుదల కాబోతోందని తెలుస్తోంది. ఈ ఫోన్ ఎలా ఉండబోతుందో చూద్దాం..

మోటోరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ మోడల్ నంబర్ XT2611 తో లిస్ట్ అయింది. ఈ లిస్టింగ్ ద్వారా ఫోన్‌లో 25W వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఐఫోన్లలో ఉండే మ్యాగ్‌సేఫ్ లాగా, ఈ ఫోన్ లోపలే ఇన్‌బిల్ట్ అయస్కాంతాలు ఉంటాయి. దీనివల్ల ఎలాంటి ప్రత్యేకమైన కవర్లు లేకుండానే మోటోరోలా ఫోన్ నేరుగా మేగ్నెటిక్ చార్జర్లు, పవర్‌బ్యాంకులకు సులభంగా కనెక్ట్ అవుతుంది.

ఈ ఫోన్ స్క్రీన్ అత్యుత్తమ కలర్ ప్రొడక్షన్, బ్రైట్‌నెస్ ను అందించనుంది. అయితే దీని డిజైన్ విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. ఈ ఫోన్ ఫ్లాట్ స్క్రీన్, ఫ్లాట్ అల్యూమినియం ఫ్రేమ్‌తో రానుందని చూపించగా.. WPC సర్టిఫికేషన్ ఇమేజ్‌లో మాత్రం కర్వ్‌డ్ డిస్‌ప్లే కనిపిస్తోంది. బహుశా మోటోరోలా ప్రయోగాత్మకంగా టెస్ట్ చేసిన మోడల్ ఇమేజ్ అయి ఉండొచ్చని, ఫైనల్ వేరియంట్ ఫ్లాట్ బాక్సీ డిజైన్‌తోనే వచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు భావిస్తున్నారు.

పనితీరు విషయానికి వస్తే.. మోటోరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ అత్యంత శక్తివంతమైన Qualcomm Snapdragon 8 Gen 5 ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్‌తో రన్ కానుంది. భారీ గేమింగ్, మల్టీటాస్కింగ్ , అడ్వాన్స్‌డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లను ఈ ప్రాసెసర్ చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలదు. సాఫ్ట్‌వేర్ పరంగా ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ‘హెల్లో యూఐ’ (Hello UI) ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేయనుంది.

ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్ వెనుక భాగంలో స్క్వేర్ షేప్ కెమెరా మాడ్యూల్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండబోతోంది. ఇందులో ఒక హై-రెజల్యూషన్ ప్రైమరీ కెమెరా, ఒక అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ మరియు పోర్ట్రెయిట్ షాట్స్, జూమింగ్ కోసం ఒక అంకితమైన టెలిఫోటో లెన్స్ ఉంటాయని సమాచారం. ఇప్పటికే ఈ సిరీస్‌లో ఎడ్జ్ 70 ఫ్యూజన్, ప్రో మోడల్స్ అందుబాటులో ఉండగా, ఈ సరికొత్త ‘మ్యాక్స్’ వేరియంట్ వాటికంటే అత్యంత ప్రీమియం ధరలో, రాబోయే కొన్ని వారాల్లోనే మార్కెట్లోకి లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

'టాక్సిక్' తర్వాత యాష్ చేయబోతున్న సినిమా అదేనా.. ఇలాంటి కాంబినేషన్ అసలు ఊహించలేదు..

Yash Upcoming Movie
Yash Upcoming Movie

Yash Upcoming Movie: ‘కేజీఎఫ్’ సిరీస్ తర్వాత రాకింగ్ స్టార్ యాష్ సుమారుగా మూడేళ్ళ సుదీరఘమైన గ్యాప్ తీసుకొని చేసిన చిత్రం ‘టాక్సిక్’. ఈ గ్యాప్ లో ఆయన తోటి పాన్ ఇండియన్ స్టార్ హీరోలు అయినటువంటి ప్రభాస్ ఏకంగా 4 సినిమాలు విడుదల చేశారు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ వంటి సెన్సేషన్ క్రియేట్ చేశారు. రామ్ చరణ్ ఆచార్య, గేమ్ చేంజర్ , పెద్ది వంటి చిత్రాలను విడుదల చేయగా, ఎన్టీఆర్ దేవర , వార్ 2 వంటి చిత్రాలను విడుదల చేశారు. ఇలా పాన్ ఇండియన్ హీరోలందరూ వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తుంటే , యాష్ మాత్రం ఇంతటి సుదీర్ఘమైన గ్యాప్ ఇచ్చారు. ‘టాక్సిక్’ చిత్రాన్ని మొదలు పెట్టేముందు యాష్ చాలా పెద్ద విరామం తీసుకున్నారు. దాన్ని చూసి అప్పట్లో అసలు ఈయన సినిమాలు చేస్తారా?, లేదా ? అనే అనుమానం కలిగింది.

ఇంత గ్యాప్ వచ్చింది కాబట్టి, ఇకపై ఆయన సినిమాల విషయం వేగంగా ఉండాలని చూస్తున్నారు. ఆగస్టు 26 న ‘టాక్సిక్’ చిత్రం విడుదల కాబోతుంది , ఈ సినిమా విడుదలైన రెండు నెలలకు ఆయన రావణాసురుడి పాత్ర పోషించిన హిందీ ‘రామాయణం’ విడుదల కాబోతుంది. ఈ రెండు చిత్రాలకు కూడా ఆయన సహా నిర్మాతగా పని చేయడం విశేషం. ఇక వీటి తర్వాత యాష్ చేయబోతున్న సినిమా ఏంటి? అనే దానిపై సోషల్ మీడియా లో గత కొంతకాలంగా పెద్ద చర్చనే నడుస్తోంది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే, యాష్ తన తదుపరి చిత్రాన్ని ప్రముఖ తమిళ డైరెక్టర్ నర్తన్ తో చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులో యాష్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనించనున్నారు. ఒక పాత్ర సైనికుడు కాగా, మరో పాత్ర ‘మ్యాడ్ పోలీస్ ఆఫీసర్’ అట. ఈ పాన్ ఇండియన్ భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ‘ధర్మ ప్రొడక్షన్స్’ నిర్మించబోతోంది.

ఇక ఈ చిత్రం లో హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారు ?, విలన్ గా ఎవరు చేయబోతున్నారు ?, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు వంటి వివరాలు బయటకు రాలేదు , ‘టాక్సిక్’ విడుదల తర్వాత స్వయంగా మేకర్స్ పూర్తి వివరాలను రివీల్ చేస్తారట. ఇక ‘టాక్సిక్’ విషయానికి వస్తే అనేక వాయిదాల తర్వాత ఈ చిత్రం ఆగస్టు 26 న విడుదల కాబోతోంది. నిన్న ఈ చిత్రం నుండి విడుదలైన ‘లేడీస్ & లేడీస్’ అనే టీజర్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఒక సినిమాని ఎంత బోల్డ్ గా తియ్యాలో , అంత బోల్డ్ గా తీసినట్టు ఈ టీజర్ ని చూస్తుంటే అర్థం అవుతోంది. యూత్ ఆడియన్స్ లో ఈ చిత్రం మంచి క్రేజ్ , అంచనాలు ఉన్నాయి. మరి వారి అంచనాలను అందుకుంటుందా లేదా అనేది చూడాలి.

కొత్తగా కారు కొంటున్నారా.. తక్కువ వడ్డీ రేట్లు చూసి టెమ్ట్ కావొద్దు.. ముందు ఇవి తెలుసుకోండి..

Car Loan Interest Rates
Car Loan Interest Rates

Car Loan Interest Rates: కొత్త కారు కొనుగోలు చేయాలని చాలా మందికి ఉంటుంది. అయితే చాలా మంది ఒకే మొత్తంతో కాకుండా లోన్ ద్వారా కొనాలని చూస్తున్నారు. అంతేకాకుండా మిగతా వాటి కంటే కారు లోన్ పై వడ్డీ చాలా తక్కువగా ఉంటుంది. ప్రసత్తుం కొన్ని బ్యాంకుల్లో తక్కువ వడ్డీకే లోన్ ఇస్తున్నారు. అయితే కారు కొనే ముందు చాలామంది కేవలం తక్కువ వడ్డీ రేటును మాత్రమే చూసి నిర్ణయం తీసుకుంటారు. కానీ వడ్డీతో పాటు ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర ఛార్జీలు, లోన్ నిబంధనలు కూడా మొత్తం ఖర్చుపై ప్రభావం చూపుతాయి. అందుకే కార్ లోన్ తీసుకునే ముందు అన్ని అంశాలను పూర్తిగా పరిశీలించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే?

ఏ బ్యాంక్‌లో ఎంత వడ్డీ?
ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న కార్ లోన్ ఆఫర్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులు పోటీపడుతున్నాయి. యూకో బ్యాంక్ అత్యల్పంగా 7.35 శాతం నుంచి 10.00 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 7.45 శాతం ప్రారంభ వడ్డీ రేటుతో లోన్లు ఇస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ 8.80 శాతం నుంచి 9.85 శాతం వరకు వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది. ప్రైవేట్ బ్యాంకుల్లో హెచ్‌డీఎఫ్‌సీ 8.15 శాతం నుంచి, ఐసీఐసీఐ బ్యాంక్ 8.40 శాతం నుంచి కార్ లోన్లను అందిస్తోంది.

ప్రాసెసింగ్ ఫీజులు పరిశీలించాలి:
వడ్డీ రేటు తక్కువగా ఉందని వెంటనే లోన్ తీసుకోవడం సరైన నిర్ణయం కాదు. బ్యాంకులు వసూలు చేసే ప్రాసెసింగ్ ఫీజులు కూడా మొత్తం లోన్ ఖర్చును పెంచుతాయి. ప్రస్తుతం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కార్ లోన్లపై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయడం లేదు. అయితే ఇతర బ్యాంకులు రూ.1,000 నుంచి గరిష్టంగా లోన్ మొత్తంలో 2 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తున్నాయి.

లోన్ తీసుకునే ముందు కేవలం వడ్డీ రేటును మాత్రమే కాకుండా, మొత్తం చెల్లించాల్సిన మొత్తాన్ని లెక్కించాలి. వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు, ఇన్సూరెన్స్, ఇతర అదనపు ఖర్చులను కలిపి ఎంత మొత్తం చెల్లించాల్సి వస్తుందో ముందుగానే అంచనా వేసుకోవాలి. తక్కువ వడ్డీ ఉన్నా ఇతర ఛార్జీలు ఎక్కువగా ఉంటే లోన్ ఖరీదైనదిగా మారే అవకాశం ఉంది. మీ క్రెడిట్ స్కోర్ ఎంత బాగుంటే అంత తక్కువ వడ్డీ రేటు పొందే అవకాశం ఉంటుంది. సాధారణంగా 750 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి బ్యాంకులు మెరుగైన వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తాయి. కాబట్టి లోన్‌కు దరఖాస్తు చేసే ముందు మీ క్రెడిట్ స్కోర్‌ను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.

ఆర్థిక నిపుణులు సూచించే 20/4/10 సూత్రం కార్ కొనుగోలులో చాలా ఉపయోగపడుతుంది. దీని ప్రకారం కారు విలువలో కనీసం 20 శాతం డౌన్ పేమెంట్ చేయాలి. లోన్ కాలపరిమితి నాలుగు సంవత్సరాలకు మించకుండా చూసుకోవాలి. అలాగే కారు కోసం ప్రతి నెల చెల్లించే ఈఎంఐతో పాటు నిర్వహణ ఖర్చులు కలిపి మీ నెలవారీ ఆదాయంలో 10 శాతం దాటకుండా ఉండాలి.