Homeజాతీయ వార్తలుSiya: పూణే వ్యాపారి కేతన్ అగర్వాల్ కేసు.. సియాకు ఇంకా బుద్ధి రాలేదు

Siya: పూణే వ్యాపారి కేతన్ అగర్వాల్ కేసు.. సియాకు ఇంకా బుద్ధి రాలేదు

Siya: దేశవ్యాప్తంగా పూణే స్థిరాస్తి వ్యాపారి కేతన్ అగర్వాల్ కేసు ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ ఈ కేసు సంబంధించి ఏదో ఒక విషయం మీడియా ద్వారా వెలుగులోకి వస్తూనే ఉంది. పోలీసులు లీకులు ఇవ్వడంతో సంచలన నిజాలు తెరపైకి వస్తున్నాయి. ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో కీలక ఆధారాలను సంపాదించింది. వాంగ్మూలాలు సేకరించింది. సీన్ రిక్రియేషన్ కూడా చేసింది. ఈ హత్యలు ప్రధాన […]

Siya: దేశవ్యాప్తంగా పూణే స్థిరాస్తి వ్యాపారి కేతన్ అగర్వాల్ కేసు ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ ఈ కేసు సంబంధించి ఏదో ఒక విషయం మీడియా ద్వారా వెలుగులోకి వస్తూనే ఉంది. పోలీసులు లీకులు ఇవ్వడంతో సంచలన నిజాలు తెరపైకి వస్తున్నాయి.

ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో కీలక ఆధారాలను సంపాదించింది. వాంగ్మూలాలు సేకరించింది. సీన్ రిక్రియేషన్ కూడా చేసింది. ఈ హత్యలు ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న సియా.. ఆమె ప్రియుడు చేతన్ ను ప్రత్యేక దర్యాప్తు బృందం వేరువేరుగా విచారించింది. వారి దగ్గర నుంచి వాంగ్మూలాలు సేకరించింది.

ఈ కేసు తీవ్రత అధికంగా ఉండడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారులతో విచారణ సాగిస్తోంది. ఈ విచారణ ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చినట్టు సమాచారం. త్వరలోనే ఈ కేసు కు సంబంధించిన మరిన్ని కీలక విషయాలను దర్యాప్తు బృందం అధికారులు బయటపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా.. కేతన్ కేసులో ప్రధాన అభియోగాలు ఎదుర్కొంటున్న అతడికి కాబోయే భార్య సియా వ్యవహార శైలి తెరపైకి వచ్చింది.

అధికారులు విచారిస్తున్నప్పుడు సీఎం ప్రవర్తన ఏమాత్రం బాగోలేదట. పోలీసులు ఆమెను విచారణలో భాగంగా ఇంటికి తీసుకెళ్తుండగా.. మీడియా ప్రతినిధులను ఆమె చూసింది. మధ్య వేలును చూపించుకుంటూ అహంకారంతో వ్యవహరించింది. కాబోయే భర్తను పొట్టన పెట్టుకున్నప్పటికీ ఆమెలో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించలేదు. ఆమె వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మిడిల్ ఫింగర్ చూసిన తీరు పట్ల ప్రజలు అసహ్యం వ్యక్తం చేస్తున్నారు. సియా మిడిల్ ఫింగర్ చూపిస్తూ ముందుకు వెళుతుండగా.. దానికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తున్నాయి.

సియా ఈ తప్పు చేసిందని తాము నమ్మడం లేదని మొన్నటిదాకా తల్లిదండ్రులు పేర్కొన్నారు. అయితే ఇప్పుడు అనేక ఆధారాలు ఆమెకు వ్యతిరేకంగా లభించడంతో వారు నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఏ కోట నుంచి అయితే కేతన్ ను తోసివేసి చంపిందో.. ఒకవేళ తప్పు చేస్తే తన కూతురికి కూడా అలాంటి శిక్ష విధించాలని ఆ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.. మరోవైపు సియా ను విచారించిన పోలీసులు ఆమె సోదరుడిని కూడా అదుపులోకి తీసుకొని విచారించారు. గంటల తరబడి విచారించిన తర్వాత కీలక విషయాలను తెలుసుకున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper