Naga Durga: ఇండస్ట్రీ లోకి ఇప్పుడిప్పుడే ఎంట్రీ ఇస్తున్న సెలబ్రిటీలకు ‘బిగ్ బాస్’ రియాలిటీ షో అనేది ఒక మంచి ప్లాట్ ఫార్మ్. ఈ షో ద్వారా తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గర అవ్వొచ్చు , వచ్చిన ఫేమ్ తో సినిమా అవకాశాలు కూడా సంపాదించొచ్చు. ఒకప్పుడు వరుస సినిమాలు చేసి , మధ్యలో భారీ గ్యాప్ ఇచ్చి , మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వాలని అనుకునే సెలబ్రిటీలకు కూడా ఇదొక మంచి ప్లాట్ ఫార్మ్. అందుకు బెస్ట్ ఉదాహరణ శివాజీ నే. ఈయన ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ గా మారిపోయారు. అలాంటి బిగ్ బాస్ ఆఫర్ ని ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా నటించని ఒక యంగ్ హీరోయిన్ కూడా రిజెక్ట్ చేసిందట. ఆమె మరెవరో కాదు , నాగ దుర్గ.
తెలంగాణ ఫోక్ డ్యాన్సర్ గా నాగ దుర్గ కి ఎంత మంచి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. యూట్యూబ్ లో ఈమె పాటలకు వందల మిలియన్ల సంఖ్యలో వ్యూస్ , లైక్స్ వస్తుంటాయి. అలా వచ్చిన ఫేమ్ తో రీసెంట్ గానే ఈమె హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇచ్చింది. ప్రియదర్శి హీరో గా , సుకుమార్ , బన్నీ వాసు కలిసి నిర్మిస్తున్న ‘ఇడుపుకాగితం ‘ అనే చిత్రంలో ఈమె హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన ప్రారంభోత్సవం కూడా ఘనంగా జరిగింది. అంతే కాదు టైటిల్ పెద్ద వివాదాలకు కూడా తెరలేపింది. అదే విధంగా ఈమె తమిళం లో హీరో ధనుష్ మేనల్లుడు హీరో గా నటిస్తున్న ‘లవ్ ఓ లవ్’ చిత్రంలో కూడా నటిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే నగదుర్గాకు రీసెంట్ గా ‘బిగ్ బాస్ 10’ లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనమని ఆఫర్ వచ్చిందట.
రెమ్యూనరేషన్ కూడా భారీ లెవెల్ లోనే ఆఫర్ చేశారట. కానీ ఈమె మాత్రం ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసింది. ఈ విషయం పై ఆమె మాట్లాడుతూ ‘బిగ్ బాస్ రియాలిటీ షో కి సెట్ అయ్యే మనస్తత్వం కాదు నాది. నేను చాలా సైలెంట్ గా ఉండే అమ్మాయిని. మొహమాటం బాగా ఎక్కువ , అంత తేలికగా నేను మనుషులతో కలిసిపోలేను. ఏ విషయం లో అయినా ఎదుటి వ్యక్తికీ నో చెప్పడానికి చాలా ఇబ్బంది పడుతుంటాను. ఎదుటి వ్యక్తులను బాధపెట్టడం ఇష్టం లేక , నాకు ఏదైనా నచ్చకపోతే ఒంటరిగా కూర్చొని ఏడ్చేదాన్ని. నా తల్లిదండ్రులకు బిగ్ బాస్ ఆఫర్ గురించి చెప్పగా, ప్రతీ చిన్న విషయానికి ఎమోషనల్ అయిపోయే నీకు , ఈ షో అసలు సూట్ అవ్వదని , అక్కడి పరిస్థితులను నువ్వు తట్టుకోలేవని చెప్పారు. కానీ నా తండ్రి మాత్రం , ఆ షోలో కనీసం రెండు మూడు వారాలైనా ఉంటే ప్రేక్షకులకు ఇంకా బాగా దగ్గర అవుతావు అన్నారు. వాళ్లిద్దరూ ఇచ్చిన సూచనలు తీసుకొని బాగా ఆలోచించిన తర్వాత , ప్రస్తుతానికి నా ఫోకస్ సినిమాల మీద మాత్రమే ఉంచాలని నిర్ణయించుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది నాగదుర్గ .
















సీఎం విజయ్ -త్రిషపై దారుణ కామెంట్స్ .. ఎమ్మెల్యే అరెస్ట్
MLA Anitha Radhakrishnan: ప్రజా ప్రతినిధులు బాధ్యతగా ఉండాలి. మాట్లాడే ప్రతి మాట హుందాగా ఉండాలి. అన్నిటికి మించి ప్రజల సమక్షంలో మాట్లాడుతున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే.. కనీసం స్పృహ కూడా లేకుండా వ్యవహరిస్తే.. ఆ తర్వాత మర్యాద ఉండదు. ఇప్పుడు ఇదే పరిస్థితిని తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఎదుర్కొంటున్నారు.
ఆయన పేరు అనితా రాధాకృష్ణన్.. తమిళనాడులో డీఎంకేకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే. ఆయనను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేస్తారని విషయం ఆయనకు ముందుగానే తెలుసు. అందువల్లే మద్రాస్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే ఆ వాజ్యాన్ని మద్రాస్ హైకోర్టు తీసి పక్కనపెట్టింది. దీంతో తమిళనాడు పోలీసులకు లైన్ క్లియర్ అయింది. ఫలితంగా ఆయనను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. దర్జాగా శ్రీకృష్ణ జన్మస్థానానికి తీసుకెళ్లారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆయనను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి ఆయనకు జ్యూడిషియల్ రిమాండ్ విధించారు.
రాధాకృష్ణన్ కు నోటి దూల ఎక్కువ. అందువల్లే ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. కనీసం ఆడవాళ్ళకు గౌరవం కూడా ఇవ్వరు. తను ఏం మాట్లాడుతున్నాడు సోయి కూడా ఉండదు. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, త్రిష ఉద్దేశించి ఓ సభలో దారుణంగా మాట్లాడారు. “విజయ్ రాజకీయాల్లో ఇరుక్కుపోయారు. ఆ విషయంలో ఆయన బాధపడుతూనే ఉంటారు. ఇంట్లో నటి (త్రిష) తో ఎంతో సంతోషంగా ఉండి ఉంటారు. ఇప్పుడు దానిని ఆయన నిత్యం గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఎందుకు వచ్చిన రాజకీయాలు అని ఆయన నిత్యం అనుకుంటూనే ఉంటారని” రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఆ వ్యాఖ్యలను టీవీకే నేతలు తీవ్రంగా స్పందించారు. రాజకీయాలలో వ్యక్తిగత అంశాలను ఎందుకు తీసుకొస్తారని.. వ్యక్తిగత అంశాలను ఎందుకు ప్రస్తావిస్తారని టీవీకే నేతలు ప్రశ్నించారు. మరోవైపు దీనిపై టీవీకే నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు కేసు నమోదు చేశారు. ఇప్పుడు తమిళనాడు పోలీసులు ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నారు. నోరు హద్దులలో ఉంటే బాగుంటుంది. అదుపు తప్పితే ఇదిగో ఇలానే జైలు పాలు కావాల్సి వస్తుంది.