Home Blog Page 288

వాళ్లకు రోగాలంటే తెలియవు.. వందేళ్లు దర్జాగా జీవిస్తారు.. వారెవరు, ఇది ఎలా సాధ్యమంటే..

Ikaria Island People Lifestyle
Ikaria Island People Lifestyle

Ikaria Island People Lifestyle: పాతిక సంవత్సరాలకే బీపీ.. 30 సంవత్సరాలకే షుగర్.. 40 సంవత్సరాలకే మోకాళ్ల నొప్పులు.. తీపి తినలేరు. కారం భరించలేరు. ఉప్పును తట్టుకోలేరు. ఘాటును ఆస్వాదించలేరు.. మల్లీశ్వరి సినిమాలో చెప్పినట్టు ప్లేట్ భోజనం సరిగా తింటే జీర్ణించుకోలేరు.. ఇలా తయారైంది ఇప్పుడు మన జీవితం .

కానీ వీరు మాత్రం పూర్తిగా విభిన్నం. క్యాన్సర్, గుండె జబ్బులు, జీవన శైలి వ్యాధులతో ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతుంటే.. నిండు నూరేళ్లు వీరు జీవిస్తున్నారు. జీవితాన్ని హాయిగా ఆస్వాదిస్తున్నారు.. ఇటువంటి ఇబ్బందులు లేకుండా బతుకును గొప్పగా బతుకుతున్నారు. గ్రీస్ ప్రాంతంలోని ఇకారియ ద్వీప ప్రజలు ఇప్పుడు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.. వీరి జీవనశైలి చాలా గొప్పగా ఉంది. అది ప్రపంచం మొత్తాన్ని ఆకర్షిస్తోంది.

ఐకారియా ద్వీప ప్రజలకు ఒత్తిడి అంటే ఏంటో తెలియదు. ప్రశాంతంగా జీవనాన్ని సాగిస్తారు. సామూహికంగా ఉంటారు. ప్రతి మనిషి తోటి మనిషితో మాట్లాడుతుంటాడు. వారితో మెరుగైన సంబంధాలు కొనసాగిస్తూ ఉంటాడు. దీనివల్ల ఒత్తిడికి గురి చేసే కార్డి స్టాల్ అదే హార్మోన్ పర్మిత స్థాయిలో ఉంటుంది. వీరు తాజా ఆకుకూరలను.. కాయగూరలను తింటుంటారు. మాంసాహారాన్ని అత్యంత మితంగా తీసుకుంటారు. పైగా వీరు నివాసం ఉండే ప్రాంతాలు గుట్టల మీద ఉంటాయి. దీంతో పనులకు గుట్టలు ఎక్కి దిగుతూ ఉండటంవల్ల శారీరక శ్రమ కలుగుతుంది. ఫలితంగా వారిలో స్థూల కాయం, ఇతర సమస్యలు ఉండవు.

వీరిలో మద్యం తాగే అలవాటు ఉండదు. పైగా తాజా పండ్లను ఆహారంగా తీసుకుంటారు. దీనివల్ల వీరి శరీరం నాజూకుగా ఉంటుంది. పైగా ఈ ద్వీపంలో అక్కడక్కడ వేడి నీటి బుడగలు ఉంటాయి. వీటిలో అక్కడి ప్రజలు స్నానం చేస్తూ ఉంటారు. అందులో స్నానం చేయడం ద్వారా శరీర ఉష్ణోగ్రత క్రమబద్ధీకరణకు గురవుతుంది. ఫలితంగా వీరి శరీరంలో ఎటువంటి అసహజ మార్పులు చోటు చేసుకోవు.. వీరి జీవన శైలి.. ఆహారపు అలవాట్లు.. ప్రపంచానికి కొత్త పాఠాలు నేర్పుతున్నాయి. రోగాలతో.. రకరకాల ఇబ్బందులతో నిండు నూరేళ్లు జీవించలేక ఇబ్బంది పడుతుంటే.. ఇకారియా ప్రజలు మాత్రం మంచి మంచి ఆహారపు అలవాట్లు.. జీవన విధానాలతో బతుకును నూరేళ్లపాటు హాయిగా ఆస్వాదిస్తున్నారు.

హనుమాన్ జయంతి రోజున ఏం చేయాలి.. ఎటువంటి పూజలు నిర్వహించాలి..

Hanuman Jayanti 2026
Hanuman Jayanti 2026

Hanuman Jayanti 2026: శ్రీరాముడిపై అచంచల భక్తి, అపార బలం, వినయం, సేవాభావానికి ప్రతీకగా భావించే ఆంజనేయ స్వామిని హనుమాన్ జయంతి రోజు ప్రత్యేకంగా ఆరాధిస్తారు.2026 ఏడాదిలో మే 12న హనుమాన్ జయంతిని దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు. హనుమంతుడి అనుగ్రహం లభిస్తే భయాలు తొలగిపోవడం, ధైర్యం పెరగడం, కుటుంబంలో శాంతి నెలకొనడం జరుగుతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఈ రోజున ఉపవాసం, పూజలు, పారాయణాలు చేయడానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. ఈ రోజున ఎటువంటి నియమాలు పాటించాలి?

హనుమాన్ జయంతి రోజున భక్తులు ఉదయాన్నే లేచి స్నానం చేసి ఇల్లు, వాకిలిని శుభ్రం చేసుకోవాలి. పండితుల సూచనల ప్రకారం ఉదయం 9.54 గంటలలోపు హనుమంతుడికి పూజ చేయడం అత్యంత శుభప్రదమని చెబుతున్నారు. ఈ సమయంలో చేసిన ఆరాధన వల్ల శుభఫలితాలు ఎక్కువగా లభిస్తాయని నమ్మకం.పూజా మందిరంలో పంచముఖ ఆంజనేయుడి విగ్రహం లేదా ఫొటోను ప్రతిష్ఠించి పూలతో అందంగా అలంకరించాలి. ఎరుపు లేదా కాషాయ రంగు పూలను ఎక్కువగా ఉపయోగిస్తే మంచిదని భావిస్తారు. తమలపాకులు, బేతెల్ ఆకులు, వడమాలలు, వెన్న, సింధూరం సమర్పించడం హనుమంతుడికి ఎంతో ప్రీతికరమని పురాణాలు చెబుతున్నాయి. కొబ్బరికాయ, అరటిపండ్లు, బెల్లం నైవేద్యంగా సమర్పిస్తారు.

హనుమంతుడు శ్రీరాముడి పరమభక్తుడు కావడంతో పూజ ప్రారంభానికి ముందు “శ్రీరామ” నామాన్ని జపించడం విశేష ఫలితాలను ఇస్తుందని చెబుతారు. అలాగే శ్రీరామ రక్షా స్తోత్రం పారాయణం చేస్తే నెగటివ్ శక్తులు తొలగి మనసుకు ప్రశాంతత లభిస్తుందని విశ్వాసం. భక్తి భావంతో రామనామాన్ని జపించడం ద్వారా హనుమంతుడి కృప త్వరగా లభిస్తుందని పండితులు సూచిస్తున్నారు.

హనుమాన్ జయంతి రోజున హనుమాన్ చాలీసా, హనుమాన్ దండకం పఠించడం అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ స్తోత్రాలను భక్తిశ్రద్ధలతో చదవడం వల్ల శని దోషాలు తగ్గుతాయని, భయాలు తొలగిపోతాయని నమ్మకం. ఉద్యోగ, విద్య, ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని కూడా భక్తులు విశ్వసిస్తారు. ముఖ్యంగా మంగళవారం రోజున ఈ పారాయణాలు చేయడం మరింత శుభప్రదంగా భావిస్తారు.

హనుమంతుడికి తమలపాకులతో పూజ చేయడం చాలా ప్రత్యేకమైన ఆచారంగా కొనసాగుతోంది. తమలపాకులపై సింధూరం వేసి స్వామివారికి సమర్పిస్తే ఇంట్లో ఐశ్వర్యం, సుఖశాంతులు పెరుగుతాయని అంటారు. అలాగే దుష్టశక్తులు దూరమై కుటుంబ సభ్యులకు రక్షణ లభిస్తుందని భక్తుల నమ్మకం. కొందరు 11 లేదా 21 తమలపాకులతో ప్రత్యేక అర్చనలు కూడా నిర్వహిస్తారు.

హనుమాన్ జయంతి రోజున నవధాన్యాలపై నూనె లేదా నెయ్యి దీపం వెలిగించడం శుభసూచకంగా భావిస్తారు. ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచి ఆర్థిక ఇబ్బందులను తగ్గిస్తుందని విశ్వసిస్తారు. నవగ్రహ అనుగ్రహం లభించి కుటుంబంలో శాంతి, ఆనందం నెలకొంటాయని పండితులు చెబుతున్నారు. దీపారాధన అనంతరం కుటుంబ సభ్యులంతా కలిసి హారతి ఇవ్వడం ఆనందాన్ని మరింత పెంచుతుంది.

హనుమాన్ జయంతి రోజున చాలామంది ఉపవాసం పాటిస్తారు. కొందరు పండ్లు, పాలు మాత్రమే తీసుకుంటూ రోజంతా భక్తి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం ఆలయ దర్శనం చేసి ప్రసాదం తీసుకోవడం ఆనవాయితీ. అలాగే పేదలకు అన్నదానం, వడలు, పండ్లు పంచడం ద్వారా పుణ్యం కలుగుతుందని విశ్వాసం. ఈ రోజున చేసిన సేవా కార్యక్రమాలు హనుమంతుడికి ఎంతో ప్రీతికరమని పురాణాలు చెబుతున్నాయి.

వర్క్ ఫ్రం హోం మళ్లీ ఉద్యోగాలు మారబోతున్నాయా..

Work From Home
Work From Home

Work From Home: అంతర్జాతీయ సంక్షోభం, యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. బంగారం కొనుగోలు తగ్గించాలని.. ఇంధన పొదుపు చేయాలని చెప్పడం తో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) విధానాన్ని పునఃసమీక్షించాలని, దీనివల్ల కలిగే ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దీంతో ఐటీ రంగంలో కొత్త కదలిక మొదలైంది. కొన్ని ఐటీ కంపెనీలు తమ పని విధానాలను మార్చుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగా వర్క్ ఫ్రం హోం ను కేటాయించాలని నిర్ణయించుకుంటున్నాయి.

ప్రధాని పిలుపునకు మద్దతుగా భారత ఐటీ ఉద్యోగుల సంఘం (NITES) కేంద్ర ప్రభుత్వానికి ఒక కీలక విన్నపం చేసింది. దేశంలోని దాదాపు 58 లక్షల మంది ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్‌ను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేయాలని కోరింది. ఈ విధానం వల్ల ఉద్యోగుల పని-జీవిత సమతుల్యత (Work-Life Balance) మెరుగుపడటమే కాకుండా, మెట్రో నగరాల్లో ట్రాఫిక్ రద్దీ, కాలుష్యం తగ్గుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.

దీనిపై ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ జోహో (Zoho) వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఇటీవల తమ సంస్థ పూర్తిగా ‘వర్క్ ఫ్రమ్ ఆఫీస్’ విధానానికి మారిందని పేర్కొన్న ఆయన, ప్రధాని సూచనల నేపథ్యంలో మళ్ళీ WFH విధానాన్ని పరిశీలిస్తామని ప్రకటించారు. దీనివల్ల ఉద్యోగులకు వెసులుబాటు కలగడమే కాకుండా, పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని ఆయన భావిస్తున్నారు.

WFH విధానాన్ని ప్రోత్సహించడం వెనుక బలమైన కారణం పర్యావరణ కూడా ఉంది. ఉద్యోగులు ఆఫీసులకు రానవసరం లేకపోతే వాహనాల వాడకం గణనీయంగా తగ్గుతుంది. తద్వారా డీజిల్, పెట్రోల్ వాడకాన్ని తగ్గించి కర్బన్ ఉద్గారాలను నియంత్రించవచ్చని శ్రీధర్ వెంబు పేర్కొన్నారు. ఇది దేశ ఇంధన భద్రతకు, పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో దోహదపడుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కేవలం సౌకర్యం మాత్రమే కాదు.. అది ఆర్థిక, పర్యావరణ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశమని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయం, కంపెనీల స్పందన ఆధారంగా రానున్న రోజుల్లో ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

సల్మాన్ ఖాన్ ను ఆ పాత్రలో చూపించబోతున్న వంశీ పైడిపల్లి...

Salman Khan Vamshi Paidipally Movie
Salman Khan Vamshi Paidipally Movie

Salman Khan Vamshi Paidipally Movie: సల్మాన్ ఖాన్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక ఇప్పటికే ఈ మూవీ ఓపెనింగ్ కూడా జరిగింది. ఇక ఇప్పటికే ఈ సినిమా మీద సగటు ప్రేక్షకులందరు కాన్ఫిడెంట్ తో ఉన్నారు. అలాగే బాలీవుడ్ ప్రేక్షకులు సైతం సల్మాన్ ఖాన్ సినిమా మీద మొదటిసారి భారీ ఆశలను పెట్టుకున్నట్టుగా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. నిజానికి గత కొద్దిరోజుల నుంచి సల్మాన్ ఖాన్ కి సరైన సక్సెసులు రాలేదు. కారణం ఏంటి అంటే ఆయన చేసిన సినిమాలు అవి ప్రేక్షకులను పెద్దగా మెప్పించడం లేదు. ఆయన రొటీన్ సినిమాలను చేస్తున్నాడు అంటూ అక్కడి ప్రేక్షకులు సైతం సల్మాన్ ఖాన్ మీద ఫైర్ అవుతున్నారు.ఇక ఎట్టకేలకు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అతనికి ఒక మంచి ప్రాజెక్టు అయితే పడుతుందని సల్మాన్ ఖాన్ చాలా వరకు కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేస్తున్నాడట. అఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ని చాలా డిఫరెంట్ గా ప్రజెంట్ చేయబోతున్నారట…సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో రా ఏజెంట్ గా కనిపించబోతున్నాడట. ఇంతకుముందు మహేష్ బాబు హీరోగా వచ్చిన దూకుడు సినిమాలో ఆయన అండర్ కవర్ ఆఫీసర్ గా కనిపించాడు. ఈ సినిమా మొత్తం కామెడీ ఎమోషన్స్ తో నిండి ఉంటుంది.

అలాగే దూకుడు సినిమాను ఇన్స్పిరేషన్ గా తీసుకున్న వంశీ పైడిపల్లి సల్మాన్ ఖాన్ కి తగ్గట్టుగా ఒక కథనితో రెడీ చేశారట. అదే కథతో ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నాడు అంటూ మరి కొంతమంది కామెంట్సు చేస్తున్నారు. వంశీ పైడిపల్లి సినిమాలో రొటీన్ స్టోరీలే ఉంటాయి.

కారణం ఏంటి అంటే ఆయన ఎంచుకున్న పాయింట్ కూడా చాలా రొటీన్ గా ఉంటుంది. కానీ స్టార్ హీరోలతో సినిమా చేయడం వల్ల దాన్ని ఎమోషనల్ గా ఎలివేట్ చేయాలనే ప్రయత్నం చేస్తుంటాడు. కానీ అది వర్కౌట్ అవ్వడం లేదు. మహర్షి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఆయన ఆ తర్వాత విజయ్ తో చేసిన ‘వారసుడు’ సినిమాలో ఏమాత్రం ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయలేకపోయాడు.

దాంతో మూడు సంవత్సరాల పాటు గ్యాప్ తీసుకున్న ఆయన ఇప్పుడు ఎట్లకేలకు సల్మాన్ ఖాన్ తో సినిమా చేస్తుండడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుంది. ఇక ఈ మూవీతో అయిన వంశీకి భారీ విజయం దక్కుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

ప్రశాంత్ వర్మ కెరియర్ ఇక ముగిసిపోయినట్టేనా...

Prasanth Varma
Prasanth Varma

Prasanth Varma Career Downfall: హనుమాన్ సినిమాతో ఓవర్ నైట్ లో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయిన దర్శకుడు ప్రశాంత్ వర్మ… ఆ సినిమా తర్వాత మరొక సినిమా అయితే రిలీజ్ చేయలేదు. ఈ సినిమా వచ్చి రెండు సంవత్సరాలు దాటినా కూడా ఇప్పటివరకు ఆయన మరొక సినిమానైతే స్టార్ట్ చేయలేదు. హనుమాన్ కి సీక్వెల్ గా జై హనుమాన్ అంటూ ఒక సినిమాను స్టార్ట్ చేశాడు. హనుమంతుడి పాత్రలో రిషబ్ శెట్టినటించబోతున్నాడు అంటూ ఒక పోస్టు చేశారు. అయినప్పటికి ఇప్పటివరకు ఆ సినిమాకి సంబంధించిన ఏ వివరాలు కూడా బయటికి రావడం లేదు. ఈ మూవీ షూటింగ్ జరుగుతుందని కొంతమంది అంటుంటే మరి కొంతమంది మాత్రం సినిమా ఆగిపోయిందని చెబుతుండడం విశేషం…

ఇక ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రశాంత్ వర్మ కి భారీ గుర్తింపు వస్తుందని అందరు అనుకున్నారు. కానీ ఆయన తన టైమ్ అంతా వేస్ట్ చేసుకుంటున్నాడు. ఇక ఇప్పటికైన ఆయన మీద పూర్తి ఫోకస్ ని పెట్టి సినిమా చేస్తే బాగుంటుందని పలువురు సినిమా మేధావులు కామెంట్స్ చేస్తున్నారు. బాలయ్య బాబు కొడుకు అయిన మోక్షజ్ఞ తో సింబా అనే సినిమా చేయాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వల్ల ప్రాజెక్ట్ నుంచి ప్రశాంత్ వర్మ తప్పుకున్నాడు.

ఆయన ఎందుకని ఇలా చేస్తున్నాడు అవకాశాలు వస్తున్నా కూడా వాటిని పట్టించుకోకుండా ప్రొడక్షన్ వైపు వెళ్తున్నాడు. ఆయనకు దర్శకుడిగా చేసే ఇంట్రెస్ట్ లేదేమో అనే ఉద్దేశ్యంతో స్టార్ హీరోలు సైతం అతన్ని పట్టించుకోవడం లేదు. గతంలో ప్రభాస్ ను కలిసి ఒక కథను వినిపించానని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రశాంత్ వర్మ ఆ సినిమా విషయంలో కూడా ఎలాంటి క్లారిటిని చూపించలేకపోతున్నాడు. ఇక బాలీవుడ్ స్టార్ హీరో అయిన రన్వీర్ సింగ్ తో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. కానీ అనౌన్స్మెంట్ వచ్చింది. చాలా తక్కువ సమయంలోనే రన్వీర్ సింగ్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

ఇక దాంతో ప్రశాంత్ వర్మ డౌన్ ఫాల్ అయితే స్టార్ట్ అయిందంటూ ప్రతి ఒక్కరు కామెంట్స్ చేశారు. ఇక ఇప్పటివరకు ఆయన నుంచి మరొక సినిమా రాకపోవడంతో అతని అభిమానులతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులు సైతం ప్రశాంత్ వర్మ ఏం చేస్తున్నాడు అంటు అతని మీద కొన్ని విమర్శలైతే చేస్తున్నాడు…

బెంగాల్లో వేట మొదలైంది.. ఇక కాచుకోండి

TMC Leaders Arrested
TMC Leaders Arrested

TMC Leaders Arrested: పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వం మారింది. 15 ఏళ్లు అధికారంలో ఉన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీని ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ చిత్తుచేసి చరిత్ర సృష్టించింది. 70 ఏళ్ల చరిత్రలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. పార్టీని ముందు ఉండి నడిపించిన సువేందు అధికారి సీఎం అయ్యారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన రెండు రోజుల వ్యవధిలోనే బెంగాల్‌లో వేట మొదలు పెట్టింది. ఏప్రిల్‌లో మాల్దా జిల్లాలో ఎన్నికల జాబితాలో లోటుపాట్లు సరిచేసి సరైన ఆధారాలు ఉన్నవారికి ఓటుహక్కు కల్పించేందుకు వెళ్లిన న్యాయాధికారులపై తృణమూల్‌ కార్యకర్తలు దాడి చేశారు. ఆరేడు గంటలు నిర్బంధించారు. కొందరిపై భౌతిక దాడులు చేశారు. వారి వాహనం ధ్వంసం చేశారు. హత్య చేసేందుకు ప్రయత్నించారు. ఇది కేవలం దాడి కాదు – ఇది న్యాయవ్యవస్థపై ప్రత్యక్ష దాడి.

ఎన్నికల ప్రక్రియను భగ్నం చేయాలనే..
వీళ్లు ఎన్నికల ప్రక్రియకు భంగం కలిగించేందుకు సర్‌ పై విచారణను భగ్నం చేసేందుకు ప్రయత్నించారు. ఎన్నికల జాబితాలో లోటుపాట్లు సరిచేయడానికి వెళ్లిన న్యాయాధికారులను నిలిపివేయాలని ప్రయత్నించారు. ఇది ప్రజాస్వామ్య విధ్వంసం. సరైన ఆధారాలు ఉన్నవారికి ఓటుహక్కు కల్పించేందుకు ఈ ప్రక్రియ జరుగుతోంది. కానీ తృణమూల్‌ కార్యకర్తలు ఈ ప్రక్రియను భగ్నం చేయడానికి ప్రయత్నించారు.

ఆరుగురి అరెస్ట్‌..
ఈ కేసులో తాజాగా కాలియాచెక్‌ ప్రాంతంలో తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన బ్లాక్‌ అధ్యక్షుడు సార్యుల్‌ షేక్‌ను అరెస్టు చేశారు. మాజీ అధ్యక్షుడు యూసుఫ్‌ షేక్‌ను కూడా అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే యాస్మీన్‌ సబీనాను అరెస్టు చేశారు. అభ్యర్థికి ఎలక్షన్‌ ఏజెంట్‌గా పనిచేసిన అబిద్‌ ఉర్‌ రహమాన్, చటావుద్దీన్‌ షేక్‌ను కూడా అరెస్టు చేశారు.

ప్రజాస్వామ్యాపై దాడి..
తృణమూల్, మజ్లిస్‌ ఇత్తెహాద్‌తోపాటు మిగతా పార్టీల నాయకులు న్యాయాధికారులను ఘెరావ్‌ చేశారు. ఇది కేవలం తృణమూల్‌ పొరపాటు మాత్రమే కాదు – ఇది పార్టీల మధ్య కుట్ర. పార్టీలు ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి, న్యాయవ్యవస్థను గౌరవించాలి. ఒకవైపు ఎన్నికల జాబితా సవరణ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు, మరోవైపు ఆ ప్రక్రియను భగ్నం చేయడానికి పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.

న్యాయాధికారులపై దాడి చేసిన 6 మందిని అరెస్టు చేసిన ఘటన న్యాయం నెలకొంటుందని చూపిస్తోంది. ఇప్పటికే తృణమూల్‌ పాలనలో మూతపడిన గుళ్లు, బడులు తెరుచుకుంటున్నాయి. కజ్జాదారులు పారిపోతున్నారు. ఈ తరుణంలో సువేంది ప్రభుత్వం తాజాగా దాడులు చేసిన నేరస్తుల వేట మొదలు పెట్టింది.

నిన్న బంగారం .. నేడు స్కూళ్లు ,ఆఫీసులు బంద్‌ చేయాలి.. మోదీ పిలుపు వెనుక భయాందోళనలు

Modi Latest Speech
Modi Latest Speech

Modi Latest Speech: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు వచ్చిన సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో దేశ ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఇందులో ఏడాది పాటు బంగారం కొనొద్దని పిలుపునిచ్చారు. ఇది కీలకంగా మారింది. ఇంధన వినియోగం తగ్గించాలని, ఎరువులు పొదుపుగా వాడాలని విదేశీ మారక నిల్వలను రక్షించడంలో భాగస్వాములు కావాలని కోరారు. తాజాగా ఆయన పాఠశాలలు ఆన్‌లైన్‌ తరగతులు బోధించాలని సూచించారు. ఈ మార్పులు వెనుక ఏ భయాందోళనలు ఉన్నాయి.

బంగారం నుంచి బడి వరకు..
దేశంలో ఏడాదిపాటు బంగార కొనొద్దని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు మోదీ. అంతర్జాతీయ పరిస్థితుల వల్ల బంగారం అత్యంత ఖరీదుగా మారిపోయిందని ఆయన పేర్కొన్నారు. బంగారం దిగుమతులు తగ్గితే విదేశీ మారకద్రవ్యం మిగులుతుందని ఆయన సూచించారు. తాజాగా స్కూళ్లకు ఆన్‌లైన్‌ క్లాసులు చేపట్టాలని సూచించారు. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్, చారిటీ స్కూళ్లు ఆన్‌లైన్‌ క్లాసులకు షిఫ్ట్‌ అవ్వాలని మోదీ సూచించారు. కంపెనీలు వర్క్‌ ఫ్రం హోం ఇవ్వాలని తెలిపారు.

మోదీ భయాందోళనలకు కారణం..
మోదీ పిలుపు వెనుక పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ఉంది. ఇంధనాన్ని ఆదా చేయాలని ఇటీవల ప్రధాని పిలుపునిచ్చారు. పశ్చిమాసియాలో ఏర్పడిన యుద్ధ పరిస్థితులు ఇంధన ధరలను పెంచాయి, దీని వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఉంటుందని మోదీ భయాందోళన చెందుతున్నారు.

ఆర్థిక రక్షణ వ్యూహం..
మోదీ పిలుపు ఆర్థిక రక్షణ వ్యూహంలో భాగం. బంగారం దిగుమతులు తగ్గితే విదేశీ మారకద్రవ్యం మిగులుతుంది. రైతులు సేంద్రీయ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మధ్యతరగతి వారు దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. ఆన్‌లైన్‌ క్లాసులతో ఇంధన ఆదా చేయడానికి చర్య. బస్సులు, కార్లు ఉపయోగించకపోవడం వల్ల పెట్రోల్, డీజిల్‌ వినియోగం తగ్గుతుంది. వర్క్‌ ఫ్రం హోం కారణంగా ఇంధనం భారీగా మిగులుతుంది.

మొత్తంగా మోదీ పిలుపులు దేశ ఆర్థిక రక్షణ కోసం చర్యలు. పశ్చిమాసియా యుద్ధం వల్ల ఏర్పడిన పరిస్థితుల్లో ఈ చర్యలు అవసరం. పశ్చిమాసియా యుద్ధం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో ఉంది. దీని నుండి రక్షించడానికి మోదీ చర్యలు తీసుకుంటున్నారు.

ఢిల్లీ, పంజాబ్ మ్యాచ్ ఫిక్సింగ్.. వెలుగులోకి కీలక వీడియో

Delhi Vs Punjab Match Fixing
Delhi Vs Punjab Match Fixing

Delhi Vs Punjab Match Fixing: నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్లో.. ఢిల్లీ గెలిచింది. ఉత్కంఠ మధ్య సాగిన మ్యాచ్లో విజయం సాధించి అదరగొట్టింది. పంజాబ్ జట్టు కు దిమ్మతిరిగే ఓటమిని బహుమతిగా ఇచ్చింది.. తద్వారా ఈ టోర్నీలో ప్లే ఆఫ్ ఆశలను ఢిల్లీ జట్టు సజీవంగా ఉంచుకుంది..

211 పరుగుల టార్గెట్ తో సంఘంలోకి దిగిన ఢిల్లీ జట్టు.. ప్రారంభంలోనే నాలుగు కీలక వికెట్లను కోల్పోయింది. కేఎల్ రాహుల్, అభిషేక్, సాహిల్, స్టబ్స్ వంటి ప్లేయర్లు విఫలం కావడంతో ఢిల్లీ జట్టు ఓటమి ఖాయమని అందరూ అనుకున్నారు. ఈ దశలో కెప్టెన్ అక్షర్ పటేల్(56), డేవిడ్ మిల్లర్ (51), శర్మ (24), తివారి (18*) సత్తా చూపించారు.. దీంతో ఢిల్లీ జట్టు 19 ఓవర్లలో 7 వికెట్ల కోల్పోయి లక్ష్యాన్ని పూర్తి చేసింది.

ఒక దశలో ఢిల్లీ జట్టుకు ఓటమి ఖాయమని అందరూ అనుకున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్ బౌలర్లు చేతులెత్తేశారు. ఇదే సమయంలో ఢిల్లీ బ్యాటర్లు అదరగొట్టారు. ఏమాత్రం భయపడకుండా దూకుడుగా బ్యాటింగ్ చేశారు. నాలుగు కీలక వికెట్లు కోల్పోయినప్పటికీ.. గెలవాలనే కసి ఉండడంతో ఢిల్లీ బ్యాటర్లు పోరాడితే పోయేదేముంది డ్యూడ్ అన్నట్టుగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా మిల్లర్.. అక్షర్ పటేల్ పంజాబ్ బౌలర్లను ఎదుర్కొన్న తీరు అద్భుతం. ఈ సీజన్లో వరుస విజయాలతో అదరగొట్టిన పంజాబ్ జట్టు.. అదే స్థాయిలో ఓటములతో ఇప్పుడు ప్లే ఆఫ్ ఆశలను సంక్లిష్టంగా మార్చుకుంది. పాయింట్ల పట్టికలో మొన్నటిదాకా మొదటి స్థానంలో ఉన్న పంజాబ్.. ఇప్పుడు నాలుగవ స్థానానికి పడిపోయింది. వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిపోయింది.

ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు.. ఢిల్లీ బౌలర్ నో బాల్ వేసాడు. ఆ బంతిని సహజంగానే అంపైర్ ఫ్రీ హిట్ గా ప్రకటించాడు. దీంతో పంజాబ్ బ్యాటర్ భారీ షాట్ ఆడాడు. ఆ బంతి మిడిల్ ఆఫ్ లో గాలిలోకి లేచింది. ఆ బంతిని క్యాచ్ అందుకోలేక పోయాడు అక్షర్ పటేల్. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.. మ్యాచ్ ఫిక్సింగ్ అయిందని కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఇదంతా వాస్తవం కాదని ఢిల్లీ అభిమానులు చెబుతున్నారు. నోబాల్ అవడం వల్లే అక్షర్ క్యాచ్ పట్టలేదని ఢిల్లీ అభిమానులు క్లారిటీ ఇస్తున్నారు.

ఓ గొర్రెల కాపరి.. ఇరాక్ ను బతికించాడు.. ఇజ్రాయిల్ కు చుక్కలు చూపించాడు..

Israel Iraq Conflict
Israel Iraq Conflict

Israel Iraq Conflict: ప్రపంచాన్ని అత్యాధునిక మిలిటరీ సాంకేతిక పరిజ్ఞానం ఇజ్రాయిల్ వద్ద ఉంది. ఇజ్రాయిల్ తయారు చేసే వెపన్స్ అత్యంత ఖచ్చితత్వంతో పని చేస్తూ ఉంటాయి. పైగా ఇజ్రాయిల్ దేశానికి మోస్సాద్ అత్యంత సమర్థవంతంగా పనిచేసే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. అంతటి టెక్నాలజీ ఉన్న ఇజ్రాయిల్ దేశం ఒక గొర్రెల కాపరికి దొరికిపోయింది. అంతేకాదు బతుకు జీవుడా అంటూ బయటపడింది.

కౌంటర్ ఇంటెలిజెన్స్ లో ఇజ్రాయిల్ దేశానికి తిరుగులేదు. ఆ దేశం ఆయుధాల తయారీలో తిరుగులేని స్థానంలో ఉంటుంది. అత్యాధునిక సాంకేతిక పరికరాలను ఇజ్రాయిల్ తయారు చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా మూడవ కంటికి తెలియకుండా పని పూర్తి చేయడంలో ఇజ్రాయిల్ కు మించిన దేశం లేదు. ఇటీవల ఇరాన్ మీద యుద్ధం చేసినప్పుడు.. ఇజ్రాయిల్ అనేక శక్తివంతమైన ఆయుధాలను ప్రయోగించింది. మిస్సైల్స్ ను వేసింది. ఇరాన్ దేశాన్ని సర్వనాశనం చేసింది.

ఇరాన్ దేశంలో అంతకుమించి అనే స్థాయి విధ్వంసం సృష్టించేందుకు ఇజ్రాయిల్ ప్రణాళిక రూపొందించింది. మూడో కంటికి తెలియకుండా పని పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. ఇరాన్ మీద మరింత దారుణంగా దాడులు చేసేందుకు ఇజ్రాయిల్ మిలిటరీ ఏకంగా ఇరాక్ ఎడారి ప్రాంతంలో మిలిటరీ బేస్ వే ఏర్పాటు చేసింది. ఇరాన్ ఇజ్రాయిల్ దేశానికి 1000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అందువల్లే యుద్ధం ప్రారంభానికి ముందు ఈ పని చేసింది.

ఓ గొర్రెల కాపరి తన గొర్రెలను మేపుతుండగా ఇజ్రాయిల్ సైన్యం చేస్తున్న పని చూశాడు. ఈ సమాచారాన్ని ఇరాక్ దేశ అధికారులకు తెలియజేశాడు. వాస్తవానికి ఆ గొర్రెల కాపరి గనక లేకపోతే ఇరాన్ దేశం ఇంకా ఇబ్బంది పడేది. ఆ గొర్రెల కాపరి ఇజ్రాయిల్ దేశానికి ఒక రకంగా శత్రువుగా మారిపోయాడు. తన దీర్ఘ దృష్టితో ఇజ్రాయిల్ చేస్తున్న దురాగతాన్ని ఇరాక్ కు చేరవేశాడు. ఫలితంగా ఇజ్రాయిల్ పన్నాగం బయటపడింది. ఇరాక్ బతికిపోయింది.

ఇరాక్ మీద దాడి చేయడానికి ఇజ్రాయిల్ ఇరాన్ దేశాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక్కడ కాస్త కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ.. ఇరాక్ దేశంలో దాడులు చేసేందుకు ఇరాన్ భూభాగాన్ని స్థావరం గా ఎంచుకుంది ఇజ్రాయిల్. అయితే గొర్రెల కాపరి చూడటంతో ఇజ్రాయిల్ పన్నాగం బయటపడింది. ఈ క్రమంలోనే విచారణ జరపడానికి ఇరాకీ దళాలు అక్కడికి వెళ్లాయి. వారిపై ఇజ్రాయిల్ వైమానికంగా దాడులు చేసింది.. అయితే ఈ ఘటనలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు.. ఎంత నష్టం చోటుచేసుకుంది అనే విషయాల మీద ఇంతవరకు క్లారిటీ లేదు.

బండి సంజయ్ కొడుకు ఉదంతం.. రాజకీయ నాయకులకు ఓ గుణపాఠం

Bandi Sanjay Son Case
Bandi Sanjay Son Case

Bandi Sanjay Son Case:  ఎలా జరిగినా.. ఏం జరిగినా.. తప్పు తప్పే. దానిని సమర్థించకూడదు. ప్రోత్సహించకూడదు.. ముఖ్యంగా ఆడవాళ్ళ విషయంలో ఎవరైనా సరే అనుచితంగా.. దారుణంగా ప్రవర్తిస్తే ఆ తదుపరి పరిణామాలు కూడా అదే స్థాయిలో ఉండాలి. ఎందుకంటే ఆడవాళ్ళ మీద మరోసారి అటువంటి దారుణాలకు పాల్పడాలంటేనే మగవాళ్ళల్లో వణుకు పుట్టాలి. మన చట్టాలు, మన వ్యవస్థలు గొప్పవే అయినప్పటికీ.. అందులో ఉన్న లోపాలు కొంతమంది వ్యక్తులకు అనుకూలంగా ఉంటున్నాయి. వాటిలో ఉన్న లోపాలను సాకులుగా చూపించుకొని ఆయా వ్యక్తులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాలలో గత రెండు రోజులుగా కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడి వ్యవహారం విపరీతంగా చర్చలో ఉంది. ఒక అమ్మాయిపై అతడు దారుణంగా ప్రవర్తించాడని.. పేట్ బషీర్ బాదులో పోలీస్ స్టేషన్లో ఫోక్సో చట్టం కింద కేసు నమోదు అయింది. ఈ కేసు నమోదైన కొద్ది రోజులకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించారు. ఆ వేదిక మీద బండి సంజయ్ ఆవేశంగా మాట్లాడారు. తాను తప్పు చేయనని.. తప్పు చేసే అవకాశం కల్పించ బోనని స్పష్టం చేశారు. తద్వారా తన కుమారుడి మీద వస్తున్న ఆరోపణలకు బండి సంజయ్ పరోక్షంగా సమాధానం చెప్పారు.

వాస్తవానికి తెలుగు రాష్ట్రాలలో రాజకీయ నాయకుల కుమారులు.. వారితో సంబంధం ఉన్న వ్యక్తులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఆ మధ్య భారత రాష్ట్ర సమితికి సంబంధించిన ఓ మాజీ ఎమ్మెల్యే కుమారుడు అత్యంత వేగంగా కారు నడిపి.. ఓ బాలుడి మరణానికి కారణమయ్యాడు. కొంతమందిని తీవ్రంగా గాయపరిచాడు. ఆ సమయంలో అతడు మద్యం తాగి ఉన్నట్టు తెలుస్తోంది. పైగా ఈ కేసులో పోలీసులను బురిడీ కొట్టించడానికి ఆ మాజీ ఎమ్మెల్యే కుమారుడు ప్రయత్నించాడు. రోడ్డు ప్రమాదం జరగగానే అక్కడి నుంచి పారిపోయిన ఎమ్మెల్యే కుమారుడు.. తన స్థానంలో మరొక వ్యక్తి డ్రైవింగ్ చేస్తున్నట్టు నమ్మబలికాడు. చివరికి పోలీసులకు అన్ని ఆధారాలు దొరకడంతో అరెస్టు తప్పదని భావించిన అతడు దుబాయ్ పారిపోయాడు. తెలంగాణ పోలీసులు నోటీసుల మీద నోటీసులు జారీ చేయడంతో.. చివరికి అతడు దుబాయ్ నుంచి తెలంగాణకు వచ్చాడు. ఇటీవల కేసు విచారణ సందర్భంగా కోర్టుకు హాజరయ్యాడు.

భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భూపాలపల్లి జిల్లా అడవుల్లో అడవి జంతువుల వేట సాగింది. ఈ జంతువులను వేటాడింది నాటి గులాబీ పార్టీ లో ఓ కీలక నాయకుడి మనవడు. అయితే ఈ వ్యవహారాన్ని బయటపడకుండా చూశారు. చివరికి మీడియా ద్వారా బయటపడడంతో కేసును నీరుగార్చారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం పట్టణంలో అప్పటి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావు ఓ కుటుంబాన్ని వేధించాడు. దీంతో ఆ కుటుంబంలో ఉన్న నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల పుత్ర రత్నాల ఆగడాలు చాలానే ఉన్నాయి.

బండి సంజయ్ కుమారుడి వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ కేసును విచారించేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. దీనిపై స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగి కీలక ప్రకటన చేశారు. చర్యలు తీసుకునే విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. రేవంత్ ప్రభుత్వం గనుక ఈ కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరిపి.. అసలైన వారిపై చర్యలు తీసుకుంటే.. జన్మలో ప్రజాప్రతినిధుల కొడుకులు.. వారితో సంబంధం ఉన్న వ్యక్తులు ఇటువంటి వ్యవహారాలకు పాల్పడరని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఈ ఐదు రాశుల వారికి ఈరోజు లక్కీ డే..

Today 25 July 2026 Horoscope:
Today 25 July 2026 Horoscope:

Today 12 May 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై పూర్వాభాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఏ పని మొదలుపెట్టినా విజయమే వరిస్తుంది. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈరోజు పూర్తిగా మారిపోతుంది. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులను చేపడతారు. వ్యాపారులకు కొత్తగా లాభాలు వస్తాయి. కురుమ సభలతో సంతోషంగా ఉంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. సొంత వాహనాలపై ప్రయాణాలు చేయకుండా ఉండాలి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టేటప్పుడు పెద్దలను సంప్రదించడం మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగులు అదనపు ఆదాయం పొందడానికి మార్గం ఏర్పడుతుంది. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు అనుకూలంగా మారుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యక్తులను నమ్మకూడదు. జీవిత భాగస్వామి కోసం షాపింగ్ చేస్తారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి పెడతారు. ఇంట్లో జరిగే శుభకార్యం కోసం బిజీగా మారుతారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. ఎవరికైనా కొత్తగా వాహనాలు ఇవాల్చి వస్తే జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. అనుకోకుండా వ్యాపారులు లాభాలు పొందుతారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈరోజు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. కొన్ని పనులు క్లిష్టంగా ఉన్న వాటిని వెంటనే పూర్తి చేస్తారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. దీంతో ముఖ్యమైన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారులు ప్రత్యర్థులపై కన్నేసి ఉంచాలి. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారి ఆదాయం ఈరోజు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులు ప్రత్యర్థులతో ఆర్థిక వ్యవహారాలు జరపకుండా ఉండాలి. ఉద్యోగులకు అధికారుల సపోర్టు ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి బంధువుల నుంచి శుభవార్తలో అందుతాయి. ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. గతంలో అనుకున్న ఒక కోరికను ఈరోజు నెరవేర్చుకుంటారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో పనులు పూర్తి చేస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఆర్థిక వ్యవహారాలు జరిపేటప్పుడు పెద్దల సలహా తీసుకోవాలి. ఎవరికి అనవసరంగా డబ్బు ఇచ్చే ప్రయత్నం చేయవద్దు. ఇవి తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. కోపంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో ఈరోజు సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామి కోసం ప్రత్యేకంగా వస్తువులు కొనుగోలు చేస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి వ్యాపారాలు ఎప్పుడు లాభాలు పొందుతారు. చెప్పిన మాటలు వినకుండా సొంతంగా ఆలోచించాలి. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో గౌరవం లభిస్తుంది. అనుకోకుండా స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారు పెద్దల సలహా తీసుకోవడం మంచిది. డబ్బులు వ్యవహారంలో జీవిత భాగస్వామి సలహా తీసుకుంటారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. గతంలో పెట్టిన పెట్టుబడిల నుంచి ఇప్పుడు అనేక ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం చేయకూరుతుంది. కొందరికి పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. పెట్టుబడులపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రోజు వారిని ఈరోజు అన్ని శుభ ఫలితాలే పొందుతారు. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కీలకమైన పెట్టుబడులు పెడతారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో డబ్బు రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. అధికారుల నుంచి మద్దతు ఉండడంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు.

రెండు భాగాలుగా విడుదల కానున్న మెగాస్టార్ 'విశ్వంభర'.. స్పందించిన డైరెక్టర్..

Vishwambhara latest release date
Vishwambhara latest release date

Vishwambhara movie : మెగాస్టార్ చిరంజీవి లాంగ్ అవైటెడ్ మూవీ ‘విశ్వంభర’ కోసం మెగా అభిమానులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఎప్పుడో 2023 వ సంవత్సరం లోనే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని , గ్రాఫిక్స్ క్వాలిటీ ఔట్పుట్ కోసం ఇన్ని రోజులు విడుదల చేయకుండా, అనుకున్న ఔట్పుట్ వచ్చే వరకు ఎదురు చూశారు . ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన పనులు మొత్తం పూర్తి అయ్యాయి. ప్రస్తుతం రీ రికార్డింగ్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. సాధ్యమైనంత వరకు ఈ చిత్రాన్ని జులై నెలలో విడుదల చెయ్యాలని చూస్తున్నారు మేకర్స్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా బయటకు రానున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త నిన్నటి నుండి సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం సాగుతోంది.

అదేమిటంటే ఈ చిత్రాన్ని కేవలం ఒక భాగంగా మాత్రమే విడుదల చేసేలా కాకుండా, రెండు భాగాలుగా విడుదల చెయ్యాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్టు వార్తలు వినిపించాయి. సినిమా ఫైనల్ ఔట్పుట్ నాలుగు గంటలకు పైగానే వచ్చిందని , కొన్ని మార్పులు చేర్పులు చేసి రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని డైరెక్టర్ వశిష్ఠ అనుకుంటున్నాడని , సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం సాగింది. దీనిని ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మూర్తి ట్విట్టర్ లో తెలియజేయగా, డైరెక్టర్ బాబీ వెంటనే రెస్పాన్స్ ఇచ్చారు. సెటైరికల్ టోన్ లో మాట్లాడుతూ ‘అవునా.. నిజమా’ అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో ఒక్కసారిగా అందరికీ ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల అవ్వబోవడం లేదు, కేవలం ఒక్క భాగంగా మాత్రమే విడుదల అవుతుందని క్లారిటీ ఇచ్చారు. దీంతో రెండు భాగాలుగా ఈ చిత్రం విడుదల అవ్వబోతుంది అనే రూమర్ కి చెక్ పడింది.

ఇకపోతే ఈ సినిమా ఫైనల్ ఔట్పుట్ పై మెగాస్టార్ చిరంజీవి చాలా సంతృప్తిగా ఉన్నాడట. ముఖ్యంగా విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని , అభిమానులను ఇంతకాలం ఎదురు చూసేలా చేసినప్పటికీ, మంచి ఔట్పుట్ ని వాళ్లకు అందించబోతున్నామని , ఈ సినిమా ఎప్పుడు విడుదలైనా సంచలనాలను సృష్టిస్తుందని బలమైన నమ్మకం తో చెప్పాడట. మరి ఇందులో ఎంత మాత్రం నిజముందో తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్ గా త్రిష నటించగా, ఆశికా రంగనాథ్ కీలక పాత్ర పోషించింది. అదే విధంగా ఇషా చావ్లా , సురభి వంటి యంగ్ హీరోయిన్స్ చిరంజీవి కి చెల్లెళ్లుగా నటించారు.

దూరం నుంచి చూస్తే ఏటీఎం.. లోపలికి వెళ్లి చూస్తే క్షవరం అయినట్టే..

SBI ATM salon

SBI ATM salon : ఈ రోజుల్లో చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మేవారు చాలామంది. అయితే ఆ కాయలు అమ్మడంలో కూడా కొంతమంది టెక్నిక్ పాటిస్తుంటారు. తద్వారా వినూత్నమైన మార్కెట్ సంపాదించుకొని భారీగా ఆర్జిస్తూ ఉంటారు. అటువంటి వారిలో ఇతడు పిహెచ్డి చేశాడు అనుకుంటా. చదివింది తక్కువనే. తెలివితేటలు మాత్రం పీహెచ్డీ లెవెల్. అందుకే ఈ రేంజ్ లో షాప్ పెట్టాడు. ఒక రేంజ్ లో సంపాదిస్తున్నాడు.

అతడి పేరు రాహుల్ (కొన్ని పరిమితుల దృష్ట్యా పేరు మార్చాల్సి వచ్చింది) అతడు వృత్తిరీత్యా బార్బర్. చదువుకున్నది కొంత వరకే అయినప్పటికీ.. క్షవరం మాత్రం బాగా చేస్తాడు. డిఫరెంట్ స్టైల్ లో మగవాళ్లకు కటింగ్ చేస్తూ తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇతడి సొంత రాష్ట్రం బీహార్. ఆ ప్రాంతంలోని దానాపూర్ ఏరియాలో నివాసం ఉంటాడు. ప్రపంచంలో ఏ సెలూన్ షాప్ కైనా సరే ఒక పేరు ఉంటుంది. కానీ ఇతడి షాప్ కు ఎటువంటి పేరు ఉండదు. పేరు లేకుండానే ఇతడు ఇంతగా సంపాదిస్తున్నాడా.. అనే డౌట్ మీకు రావచ్చు. బ్రాండ్ గట్టిగా ఉంటే పేరుతో సంబంధం లేదు. ఆయన పేరే ఒక బ్రాండ్ అన్నట్టుగా రాహుల్ తనకంటూ ఒక మార్కెట్ సృష్టించుకున్నాడు.

దానాపూర్ ఏరియాలో రాహుల్ షాప్ కు ఎటువంటి పేరు ఉండదు. అతడి సెలూన్ షాప్ పేరు చెప్పాలంటే ఎవరైనా ఎస్బిఐ ఎటిఎం అంటే చాలు. అదేంటి ఎటిఎం సెంటర్లో కటింగ్ చేయడం ఏంటి అనే అనుమానం మీలో కలిగింది కదా.. అయితే రాహుల్ ఏర్పాటు చేసిన షాప్ మెయిన్ సెంటర్లో ఉంటుంది. గతంలో ఆ భవనంలో ఎస్బిఐ ఏటీఎం కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత మూసివేసింది. ఏటీఎం సెంటర్ మూసివేసినప్పటికీ దాని నేమ్ బోర్డు తొలగించలేదు. అది అప్పటినుంచి అలానే ఉంది. ఆహులు కూడా ఆ నేమ్ బోర్డు అలానే కొనసాగిస్తున్నాడు. దానివల్ల తనకు విపరీతమైన గిరాకీ వస్తుందని అతను చెబుతున్నాడు. ఏటీఎం సెంటర్ అనుకుని చాలామంది డబ్బులు డ్రా చేయడానికి వస్తున్నారని.. వారంతా లోపలికి రాగానే షాక్ అవుతున్నారని రాహుల్ అంటున్నాడు.

డబుల్ డ్రా చేయడానికి వచ్చిన వారిలో చాలామంది కటింగ్ చేయించుకుని వెళ్తున్నారని అతడు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.. పైగా రాహుల్ కు మంచి పేరు ఉండడంతో గిరాకీ కూడా బ్రహ్మాండంగా సాగుతోంది. ఈ నేమ్ బోర్డును ఎస్బిఐ అధికారులు తొలగించకుండా అలానే ఉంచాలని అతడు కోరుతున్నాడు. ఎంతైనా గొప్ప ఆలోచన కదా.. దూరం నుంచి చూస్తే ఇది ఎస్బిఐ ఎటిఎం సెంటర్.. లోపలికి వెళ్తే కచ్చితంగా క్షవరం చేస్తాడు. ఎంతైనా రాహుల్ ఐడియానే ఐడియా.

సూర్య 'వీరభధ్రుడు' మూవీ మొట్టమొదటి రివ్యూ.. కనీసం ఈసారైనా హిట్ కొడతాడా..

Veerabhadrudu Movie 2 Days Collections
Veerabhadrudu Movie 2 Days Collections

Suriya Veerabhadrudu review : సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత సౌత్ లో మంచి మార్కెట్ ఉన్నటువంటి హీరో సూర్య. ఇప్పుడైతే విజయ్ సౌత్ లో రజినీకాంత్ రేంజ్ కి వచ్చేశాడు కానీ , 2020 కి ముందు సౌత్ లో సూర్య కి ఉన్నంత మార్కెట్ విజయ్ , అజిత్ వంటి వారికి ఉండేది కాదు. 2015 లోనే తెలుగు రాష్ట్రాల నుండి 50 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టిన సత్తా ఉన్న హీరో సూర్య. కానీ ఈమధ్య కాలం లో ఆయనకు ఒక్కటంటే ఒక్క సూపర్ హిట్ కూడా రావడం లేదు. భారీ అంచనాల నడుమ విడుదలైన కంగువ దారుణ పరాజయం గా నిలిస్తే, కచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అనే హ్మణాల నడుమ విడుదలైన ‘రెట్రో ‘ ఇంకా పెద్ద ఫ్లాప్ గా నిల్చింది. తమిళనాడు లో నిన్నగాక మొన్న ఇండస్ట్రీ లోకి వచ్చినటువంటి ప్రదీప్ రంగనాథన్ వంటి వారు కూడా సూర్య ని దాటేశారు.

ఇది ఆయన అభిమానులకు ఘోర అవమానం అనే చెప్పాలి. అయితే ఇప్పుడు సూర్య ఈ నెల 14 న ‘కరుప్పు’ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రేడియో బాలాజీ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం లో త్రిష హీరోయిన్ గా నటించింది. తెలుగులో ఈ సినిమా ‘వీరభధ్రుడు’ అనే టైటిల్ తో విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమాపై అటు తమిళం లో కానీ , ఇటు తెలుగు లో కానీ ఎలాంటి అంచనాలు లేవు. రీసెంట్ గానే తమిళనాడు లో అడ్వాన్స్ బుకింగ్స్ ని ప్రారంభించారు , చాలా బలహీనంగా ఉన్నాయి. సూర్య సినిమాకు ఇంత వీక్ అడ్వాన్స్ బుకింగ్స్ ఈమధ్య కాలం lo ఏ సినిమాకు జరగలేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అది కాసేపు పక్కన పెడితే నిన్న చెన్నై లో ee చిత్రానికి సంబంధించిన ప్రివ్యూ షో ని ప్రదర్శించారు.

ఈ షోకి పలువురు సినీ ప్రముఖులు మాత్రమే కాకుండా, మీడియా రిపోర్టర్స్ కూడా వచ్చారు. వాళ్ళ నుండి ఈ సినిమాకు వచ్చిన టాక్ ఏమిటంటే, ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా ఇంటెన్స్ డ్రామా తో ఈమధ్య కాలంలో సూర్య కెరీర్ లోనే ది బెస్ట్ అనిపించేలా ఉందని , సెకండ్ హాఫ్ లో కాస్త ఎమోషనల్ డ్రామా ఉన్నప్పటికీ, బాగా ల్యాగ్ చేశారని క్లైమాక్స్ మాత్రం సూపర్ గా ఉందని టాక్ వినిపిస్తోంది. మరి ఆడియన్స్ కి ఇది నచ్చుతుందో లేదో చూడాలి. ఇకపోతే కాసేపటి క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు ట్రైలర్ ని విడుదల చేశారు మేకర్స్. ఇది ఎలా ఉందో చూసి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి.

కృణాల్ పాండ్యా.. గాయపడిన సింహం.. అతని గర్జన భయంకరం

Krunal Pandya

Krunal Pandya :  మామూలుగా అయితే బెంగళూరు బ్యాటింగ్ భారాన్ని మొత్తం విరాట్ కోహ్లీ మోస్తాడు. లేదా బెతెల్, పాటిదర్.. ఇంకా కొంతమంది ఆటగాళ్లు బెంగళూరు జట్టుకు బలంగా ఉంటారు. అయితే తొలిసారి వీరంతా కూడా విఫలమయ్యారు. తక్కువ స్కోరు చేదించే క్రమంలో పెవిలియన్ క్యు కట్టారు. వరుసగా విరాట్ కోహ్లీ 0 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.

ఒక రకంగా బెంగళూరు జట్టుకు ఇది బీకరమైన షాక్. ప్లే ఆఫ్ దశ సమయంలో బెంగళూరు ఇలా ఆడటం అభిమానులకు ఏమాత్రం కృషించలేదు. ఈ క్రమంలోనే వచ్చాడు పాండ్యా. గర్జించిన సింహం మాదిరిగా బ్యాటింగ్ చేశాడు. ముంబై బౌలర్లకు తన బ్యాట్ పరాక్రమాన్ని చూపించాడు. వీరోచితమైన బ్యాటింగ్ చేసిన అతడు బెంగళూరు జట్టుకు విజయాన్ని ఖాయం చేసి వెళ్లిపోయాడు. కాళ్ల నొప్పి ఇబ్బంది పెడుతున్నప్పటికీ.. ఇంకా రకరకాల సమస్యలు అతడిని వేధిస్తున్నప్పటికీ గట్టిగా నిలబడ్డాడు. 73 పరుగులు చేసిన పాండ్యా బెంగళూరు విజయానికి మూల స్తంభం మాదిరిగా నిలిచాడు. ఈ క్రమంలో పాండ్యా మెన్ అఫ్ ది మ్యాచ్ పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు. అంతేకాదు బెంగళూరు అభిమానుల ప్రశంసలతో తడిసి ముద్దవుతున్నాడు.

ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో పాండ్యా విజయం సాధించిన తర్వాత.. తనకు తగిలిన గాయాన్ని పాండ్యా సోషల్ మీడియాలో షేర్ చేశాడు.. “కొన్ని దెబ్బలు మన పోరాటానికి నిలువెత్తు ప్రతీక మాదిరిగా కనిపిస్తుంటాయి. అవి మనల్ని కొత్తగా చూపిస్తుంటాయని” పాండ్యా రాస్కొచ్చాడు. పాండ్యా పోస్ట్ చేసిన స్వల్ప కాలంలోనే ఇది చర్చకు దారి తీసింది. మరోవైపు గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే ప్రమాదకరమని పాండ్యాను ఉద్దేశించి అభిమానులు పేర్కొంటున్నారు. నీ పోరాట పటిమ గొప్పగా ఉందని బెంగళూరు అభిమానులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.

ప్రస్తుత ఐపీఎల్ లో పాండ్యా బెంగళూరు జట్టుకు అత్యంత కీలకమైన ఆటగాడిగా మారాడు. ఇతడు బౌలింగ్ తో పాటు బ్యాటింగ్లో కూడా అదరగొడుతున్నాడు. కీలకమైన బెంగళూరు బ్యాటర్లు అనుకోని పరిస్థితుల్లో అవుట్ అయినప్పుడు.. ఇతడు నిలబడుతున్నాడు. జట్టు భారాన్ని మొత్తం మోస్తున్నాడు. ఆ సమయంలో ప్రొఫెషనల్ బ్యాటర్ కంటే ఎక్కువగా బ్యాటింగ్ చేస్తూ సత్తా చూపిస్తున్నాడు. సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ సంఖ్యను మరింత పెంచుకుంటున్నాడు పాండ్యా.

'మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్' షో టైటిల్ గెలుచుకున్న జంట అదే.. ఇది చాలా అన్యాయం..

Mad For Each Other show : రీసెంట్ గానే స్టార్ మా ఛానల్ లో మొదలైన ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్ ‘ షో మరో రెండు వారాల్లో ముగియబోతుంది. బిగ్ బాస్ కాకుండా, మరో రియాలిటీ షో అంటే ఆడియన్స్ మొదట్లో బాగా ఆసక్తి చూపించారు , కాన్సెప్ట్ బాగుంది, కంటెస్టెంట్స్ కూడా మంచి ఇస్తున్నారు, కానీ షో మాత్రం పూర్తిగా జనల ఇష్టానికి వ్యతిరేకంగా సాగుతోంది. మ్యాన్షన్ లోపల కష్టపడే కంటెస్టెంట్స్ కి విలువ లేదు, కేవలం కొందరి మీద మాత్రమే పక్షపాతం చూపిస్తూ మిగతా వాళ్లకు అన్యాయం చేస్తున్నారు. ముఖ్యంగా నటరాజ్ మాస్టర్ గురించి మాట్లాడుకోవాలి. ఈ షో మొదలైనప్పటి నుండి , ఇప్పటి వరకు ఈయన నిర్వాహకులపై , కంటెస్టెంట్స్ పై నోర్లు జారుతూనే ఉన్నాడు. ఎన్ని సార్లు ఆయన్ని జడ్జీలు వారించినా వినడంలేదు, ఆయన తీరులో ఎలాంటి మార్పు లేదు.

అయితే జడ్జీలు ఆయన డేంజర్ జోన్ లోకి వచ్చినప్పుడల్లా ‘నో ఎలిమినేషన్’ పెట్టి సేఫ్ చేయడం , ఇతర కంటెస్టెంట్స్ కి అన్యాయం చేయడం ఆడియన్స్ కి ఏ మాత్రం నచ్చడం లేదు. గతం లో కూడా ఇలాగే చేశారు. డేంజర్ జోన్ లోకి వచ్చిన నటరాజ్ మాస్టర్ – నీతూ , అంజలి – పవన్ లకు ఒక గేమ్ పెట్టారు. ఆ గేమ్ లో నటరాజ్ మాస్టర్ ఓడిపోతాడు. న్యాయంగా అయితే నటరాజ్ మాస్టర్ ని ఆరోజు ఎలిమినేట్ చెయ్యాలి, కానీ ఆరోజు ఎలిమినేషన్ ని రద్దు చేశారు , పక్క వారం మంచి టాప్ జోడిగా పేరు తెచ్చుకున్న సంధ్య – బ్రిట్టూ జంటని ఎలిమినేట్ చేశారు. వీళ్ళు ఎలిమినేట్ అయ్యినప్పుడు హౌస్ లో ఉన్నవాళ్ళంతా ఎంత బాధపడ్డారో , ఆడియన్స్ కూడా అంతే బాధ పడ్డారు. ఎలిమినేట్ అవ్వాల్సిన నటరాజ్ మాస్టర్ కి తనని తానూ నిరూపించుకోవడానికి అద్భుతమైన అవకాశం వచ్చింది.

కానీ ఇప్పటి వరకు ఆయన గోల్డెన్ కపుల్ అవ్వలేకపోయాడు. వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా ఒకసారి ఎలిమినేట్ అయ్యి మళ్లీ మ్యాన్షన్ లోకి అడుగుపెట్టిన మహేష్ – సాండ్రా జంట కూడా తమని తాము రీ ఎంట్రీ లో నిరూపించుకున్నారు. మొదటి రోజు నుండే అద్బుతంగా గేమ్స్ ఆడుతూ , నేడు మొదటి ఫైనలిస్ట్ గా ఈ జంట నిలబడడమే కాకుండా, చివరి గోల్డెన్ కపుల్ గా అరుదైన అవకాశాన్ని సంపాదించుకున్నారు. కానీ నటరాజ్ – నీతూ జంట మాత్రం నిరూపించుకోలేదు. ఈ వారం ఎలిమినేషన్ ని రద్దు చేసి , వచ్చే వారం డబుల్ ఎలిమినేషన్ పెట్టారు. అంటే వచ్చే వారం సిద్దు – సోనియా, అభిమానిక – ఆమీర్ జంటలు ఎలిమినేట్ అవ్వబోతున్నాయి అన్నమాట. ఇలా నటరాజ్ మాస్టర్ కి అనుకూలంగా గేమ్ మార్చి , చివరికి టైటిల్ కూడా ఈ జంటకు ఇచ్చే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారేమో అని అంటున్నారు నెటిజెన్స్.

ఐసీసీ వన్డే, టీ 20 ర్యాంకింగ్స్.. టీమ్ ఇండియా అభిమానులు ఎగిరి గంతేసే వార్త ఇదీ

Indian cricket team ranking news
Indian cricket team ranking news

Indian cricket team ranking news: క్రికెట్ లో ఒకప్పుడు ఆస్ట్రేలియాది స్పష్టమైన ఆధిపత్యం కొనసాగేది. ఇప్పుడు ఆ స్థానాన్ని టీమిండియా ఆక్రమించింది. కొంతకాలంగా వైట్ బాల్ ఫార్మాట్ లో తిరుగులేని స్థాయిలో ఆడుతోంది. ఈ నేపథ్యంలో ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్ లో టీమిండియా స్పష్టమైన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.

తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి వన్డే ర్యాంకింగ్స్ ప్రకటించింది. ఇందులో భారత జట్టు ఏకంగా 118 పాయింట్లు సాధించి మొదటి స్థానంలో కొనసాగుతోంది. 113 పాయింట్లతో న్యూజిలాండ్ రెండవ స్థానంలో ఉంది. 109 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉంది. గత ఏడాది మే నెల నుంచి ఆడిన మ్యాచ్ లకు పూర్తి వెయిటేజ్ ఇచ్చింది. అంతకుముందు రెండు సంవత్సరాల ఫలితాలకు సగం వెయిటేజ్ (50%) ఆధారంగా ర్యాంకింగ్ కల్పించింది. రోహిత్ నాయకత్వంలో టీం ఇండియా 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ పై విజయం సాధించింది టీమ్ ఇండియా.

టీ20 లలో కూడా టీం ఇండియా అదరగొడుతుంది.. ఇటీవల జరిగిన టి20 వరల్డ్ కప్ లో అద్భుతమైన విజయాన్ని అందుతుంది. ఏకంగా ట్రోఫీ సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది.. ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు మీద సూపర్ విజయం అందుకుని.. ట్రోఫీని దక్కించుకుంది. 2024లో రోహిత్ నాయకత్వంలో టీమిండియా పొట్టి ప్రపంచ కప్ సొంతం చేసుకుంది. 2026లో సూర్య కుమార్ యాదవ్ నాయకత్వంలో టీమిండియా టి20 వరల్డ్ కప్ సొంతం చేసుకుంది. మొత్తంగా టీమ్ ఇండియా మూడుసార్లు టి20 వరల్డ్ కప్ లను సాధించింది. ఈ ఫార్మేట్లో మూడుసార్లు వరల్డ్ కప్ లు అందుకున్న జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది.

టెస్ట్ ఫార్మేట్ లో టీమిండియా మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇది టీమిండి అభిమానులను తీవ్రంగా కలవరపరుస్తోంది. ఈ ఫార్మేట్ లో కూడా టీమిండియా సత్తా చూపిస్తే.. ఇక తిరుగు ఉండదు. నెంబర్ వన్ స్థానాన్ని అందుకుంటే.. అభిమానుల ఆనందానికి అవధి ఉండదు.. త్వరలోనే టీమ్ ఇండియా టెస్ట్ ఫార్మేట్ లో నెంబర్ వన్ స్థానాన్ని అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.