Homeవింతలు-విశేషాలుIkaria Island People Lifestyle: వాళ్లకు రోగాలంటే తెలియవు.. వందేళ్లు దర్జాగా జీవిస్తారు.. వారెవరు, ఇది...

Ikaria Island People Lifestyle: వాళ్లకు రోగాలంటే తెలియవు.. వందేళ్లు దర్జాగా జీవిస్తారు.. వారెవరు, ఇది ఎలా సాధ్యమంటే..

Ikaria Island People Lifestyle: పాతిక సంవత్సరాలకే బీపీ.. 30 సంవత్సరాలకే షుగర్.. 40 సంవత్సరాలకే మోకాళ్ల నొప్పులు.. తీపి తినలేరు. కారం భరించలేరు. ఉప్పును తట్టుకోలేరు. ఘాటును ఆస్వాదించలేరు.. మల్లీశ్వరి సినిమాలో చెప్పినట్టు ప్లేట్ భోజనం సరిగా తింటే జీర్ణించుకోలేరు.. ఇలా తయారైంది ఇప్పుడు మన జీవితం .

కానీ వీరు మాత్రం పూర్తిగా విభిన్నం. క్యాన్సర్, గుండె జబ్బులు, జీవన శైలి వ్యాధులతో ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతుంటే.. నిండు నూరేళ్లు వీరు జీవిస్తున్నారు. జీవితాన్ని హాయిగా ఆస్వాదిస్తున్నారు.. ఇటువంటి ఇబ్బందులు లేకుండా బతుకును గొప్పగా బతుకుతున్నారు. గ్రీస్ ప్రాంతంలోని ఇకారియ ద్వీప ప్రజలు ఇప్పుడు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.. వీరి జీవనశైలి చాలా గొప్పగా ఉంది. అది ప్రపంచం మొత్తాన్ని ఆకర్షిస్తోంది.

ఐకారియా ద్వీప ప్రజలకు ఒత్తిడి అంటే ఏంటో తెలియదు. ప్రశాంతంగా జీవనాన్ని సాగిస్తారు. సామూహికంగా ఉంటారు. ప్రతి మనిషి తోటి మనిషితో మాట్లాడుతుంటాడు. వారితో మెరుగైన సంబంధాలు కొనసాగిస్తూ ఉంటాడు. దీనివల్ల ఒత్తిడికి గురి చేసే కార్డి స్టాల్ అదే హార్మోన్ పర్మిత స్థాయిలో ఉంటుంది. వీరు తాజా ఆకుకూరలను.. కాయగూరలను తింటుంటారు. మాంసాహారాన్ని అత్యంత మితంగా తీసుకుంటారు. పైగా వీరు నివాసం ఉండే ప్రాంతాలు గుట్టల మీద ఉంటాయి. దీంతో పనులకు గుట్టలు ఎక్కి దిగుతూ ఉండటంవల్ల శారీరక శ్రమ కలుగుతుంది. ఫలితంగా వారిలో స్థూల కాయం, ఇతర సమస్యలు ఉండవు.

వీరిలో మద్యం తాగే అలవాటు ఉండదు. పైగా తాజా పండ్లను ఆహారంగా తీసుకుంటారు. దీనివల్ల వీరి శరీరం నాజూకుగా ఉంటుంది. పైగా ఈ ద్వీపంలో అక్కడక్కడ వేడి నీటి బుడగలు ఉంటాయి. వీటిలో అక్కడి ప్రజలు స్నానం చేస్తూ ఉంటారు. అందులో స్నానం చేయడం ద్వారా శరీర ఉష్ణోగ్రత క్రమబద్ధీకరణకు గురవుతుంది. ఫలితంగా వీరి శరీరంలో ఎటువంటి అసహజ మార్పులు చోటు చేసుకోవు.. వీరి జీవన శైలి.. ఆహారపు అలవాట్లు.. ప్రపంచానికి కొత్త పాఠాలు నేర్పుతున్నాయి. రోగాలతో.. రకరకాల ఇబ్బందులతో నిండు నూరేళ్లు జీవించలేక ఇబ్బంది పడుతుంటే.. ఇకారియా ప్రజలు మాత్రం మంచి మంచి ఆహారపు అలవాట్లు.. జీవన విధానాలతో బతుకును నూరేళ్లపాటు హాయిగా ఆస్వాదిస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular