Krunal Pandya : మామూలుగా అయితే బెంగళూరు బ్యాటింగ్ భారాన్ని మొత్తం విరాట్ కోహ్లీ మోస్తాడు. లేదా బెతెల్, పాటిదర్.. ఇంకా కొంతమంది ఆటగాళ్లు బెంగళూరు జట్టుకు బలంగా ఉంటారు. అయితే తొలిసారి వీరంతా కూడా విఫలమయ్యారు. తక్కువ స్కోరు చేదించే క్రమంలో పెవిలియన్ క్యు కట్టారు. వరుసగా విరాట్ కోహ్లీ 0 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.
ఒక రకంగా బెంగళూరు జట్టుకు ఇది బీకరమైన షాక్. ప్లే ఆఫ్ దశ సమయంలో బెంగళూరు ఇలా ఆడటం అభిమానులకు ఏమాత్రం కృషించలేదు. ఈ క్రమంలోనే వచ్చాడు పాండ్యా. గర్జించిన సింహం మాదిరిగా బ్యాటింగ్ చేశాడు. ముంబై బౌలర్లకు తన బ్యాట్ పరాక్రమాన్ని చూపించాడు. వీరోచితమైన బ్యాటింగ్ చేసిన అతడు బెంగళూరు జట్టుకు విజయాన్ని ఖాయం చేసి వెళ్లిపోయాడు. కాళ్ల నొప్పి ఇబ్బంది పెడుతున్నప్పటికీ.. ఇంకా రకరకాల సమస్యలు అతడిని వేధిస్తున్నప్పటికీ గట్టిగా నిలబడ్డాడు. 73 పరుగులు చేసిన పాండ్యా బెంగళూరు విజయానికి మూల స్తంభం మాదిరిగా నిలిచాడు. ఈ క్రమంలో పాండ్యా మెన్ అఫ్ ది మ్యాచ్ పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు. అంతేకాదు బెంగళూరు అభిమానుల ప్రశంసలతో తడిసి ముద్దవుతున్నాడు.
ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో పాండ్యా విజయం సాధించిన తర్వాత.. తనకు తగిలిన గాయాన్ని పాండ్యా సోషల్ మీడియాలో షేర్ చేశాడు.. “కొన్ని దెబ్బలు మన పోరాటానికి నిలువెత్తు ప్రతీక మాదిరిగా కనిపిస్తుంటాయి. అవి మనల్ని కొత్తగా చూపిస్తుంటాయని” పాండ్యా రాస్కొచ్చాడు. పాండ్యా పోస్ట్ చేసిన స్వల్ప కాలంలోనే ఇది చర్చకు దారి తీసింది. మరోవైపు గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే ప్రమాదకరమని పాండ్యాను ఉద్దేశించి అభిమానులు పేర్కొంటున్నారు. నీ పోరాట పటిమ గొప్పగా ఉందని బెంగళూరు అభిమానులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.
ప్రస్తుత ఐపీఎల్ లో పాండ్యా బెంగళూరు జట్టుకు అత్యంత కీలకమైన ఆటగాడిగా మారాడు. ఇతడు బౌలింగ్ తో పాటు బ్యాటింగ్లో కూడా అదరగొడుతున్నాడు. కీలకమైన బెంగళూరు బ్యాటర్లు అనుకోని పరిస్థితుల్లో అవుట్ అయినప్పుడు.. ఇతడు నిలబడుతున్నాడు. జట్టు భారాన్ని మొత్తం మోస్తున్నాడు. ఆ సమయంలో ప్రొఫెషనల్ బ్యాటర్ కంటే ఎక్కువగా బ్యాటింగ్ చేస్తూ సత్తా చూపిస్తున్నాడు. సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ సంఖ్యను మరింత పెంచుకుంటున్నాడు పాండ్యా.