Home Blog Page 284

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ముహూర్తం ఫిక్స్!

AP Panchayat Elections 2026
AP Panchayat Elections 2026

AP Panchayat Elections 2026: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై స్పష్టత వస్తోంది. సెప్టెంబర్ లో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. డిసెంబర్లో పూర్తి చేసేందుకు ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. కొత్త సంవత్సరం నాటికి కొత్త పాలకవర్గాలు కొలువుదీరేలా చూడాలని ప్రభుత్వం కూడా చూస్తోంది. ఇప్పటికే మున్సిపల్ పాలకవర్గాల గడువు ముగిసింది ముందుగా. తర్వాత పంచాయితీ పాలకవర్గాల గడువు కూడా ముగిసింది. వచ్చే నెలలో జిల్లా పరిషత్, మండల పరిషత్ పాలకవర్గాల గడువు ముగియనుంది. దాదాపు స్థానిక సంస్థలన్నీ పాలకవర్గాలు లేక ప్రత్యేక అధికారుల పాలనలోకి వచ్చాయి. అందుకే వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది ప్రభుత్వం. ఎన్నికల సంఘం కూడా సన్నాహాలు ప్రారంభించింది.

*ఆ నిబంధనతో..
రాష్ట్రవ్యాప్తంగా వందకు పైగా మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్లకు సంబంధించిన పాలకవర్గాల పదవీకాలం గడువు మార్చి 17 తో ముగిసింది.. దీంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13వేల పంచాయితీలకు సైతం పాలకవర్గాల గడువు ఏప్రిల్ 2తో ముగిసింది. వచ్చే నెలలో జిల్లా పరిషత్తులతో పాటు మండల పరిషత్తుల పదవి కాలం కూడా ముగియనుంది. ఇప్పటికే పంచాయతీలతో పాటు మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారులు వచ్చారు. జిల్లా పరిషత్తులకు సైతం ప్రత్యేక అధికారులు రానున్నారు. పాలకవర్గాల పదవీకాలం ముగిసిన ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహించి కొత్త కార్యవర్గాలను ఎన్నుకోవాలన్న నిబంధన ఉంది. అందుకే సెప్టెంబర్ నుంచి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించి డిసెంబర్ లోగా పూర్తి చేయాలని ఎన్నికల సంఘం గట్టి వ్యూహంతోనే ఉంది.

* ముందుగా పంచాయితీలకు..
ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. చివరిసారిగా 2021లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా పంచాయితీలను గెలుచుకుంది. అప్పట్లో ఎన్నికలు జరిగిన తీరు కూడా అందరికీ తెలిసిన విషయమే. వాలంటీర్లతో పాటు సచివాలయ ఉద్యోగుల ద్వారా పంచాయితీల్లో నెగ్గుకు వచ్చింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. మొన్నటి వరకు స్థానిక సంస్థలన్నీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతిలోనే ఉండేవి. ఆ పార్టీ యాక్టివ్ గా ఉండడానికి అదొకటి కారణం. ముందుగా పంచాయితీలకు, తరువాత మున్సిపాలిటీలకు, చివరిగా జిల్లా పరిషత్తులతో పాటు మండల పరిషత్తులకు ఎన్నికలు నిర్వహించాలన్నది ప్రభుత్వ ఆలోచన. సెప్టెంబర్ లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఖాయం అని తెలుస్తోంది.

జగన్ జిల్లాల పర్యటన అప్పటి నుంచే..

YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: జగన్( Y S Jagan Mohan Reddy ) జిల్లాల పర్యటనలకు సిద్ధపడుతున్నారు. కూటమి రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న తరుణంలో ప్రజల మధ్యకు రావాలని భావిస్తున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఈ పర్యటనలు కొనసాగనున్నాయి. వాస్తవానికి గత ఏడాది సంక్రాంతికి ముందు జనంలోకి జగన్ వస్తారని వార్తలు వచ్చాయి. అయితే కూటమికి కనీసం రెండేళ్ల పాలనా గడువు ఇవ్వాలన్న ఉద్దేశంతో జగన్ వెనక్కి తగ్గారు. అయితే ఇప్పుడు కూటమి రెండేళ్ల పాలన పూర్తయిన తరుణంలో.. ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభం అయిందని భావిస్తున్నారు. ఇదే సరైన సమయమని చెప్పి ప్రజల మధ్యకు వచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇటీవలే విదేశీ పర్యటన ముగించుకుని వచ్చారు జగన్. తాడేపల్లి కి వచ్చి పార్టీ సీనియర్ నేతలతో సమావేశం అవుతారు. జిల్లాల పర్యటనకు సంబంధించి ఒక నిర్ణయానికి రానున్నారు.

* కచ్చితంగా గెలవాల్సిందే..
వచ్చే ఎన్నికలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తాడోపేడో లాంటివి. కచ్చితంగా పార్టీ గెలవాల్సిందే. లేకుంటే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అందుకే జిల్లాల పర్యటనల ద్వారా నియోజకవర్గాల స్థితిగతులు తెలుసుకోవడం, అక్కడ సరైన అభ్యర్థులను రంగంలోకి దించడం వంటి వాటిపై దృష్టి పెడతారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు ఈ పర్యటనలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రతి నియోజకవర్గ నుంచి ఒక వందమంది నేతల జాబితాను తయారుచేసి.. వారి నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు. అయితే ఇది సాధారణ పర్యటనలా.. లేకుంటే బస్సు యాత్రల ద్వారా చేరువ కావాలా? అన్నది తేల్చాల్సి ఉంది. కానీ పార్లమెంట్ నియోజకవర్గాల పర్యటనలు మాత్రం పక్కా అని తెలుస్తోంది.

* ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభం..
జగన్ తన జిల్లాల పర్యటనలను ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి ఆయన పర్యటనలు మొదలవుతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. లండన్ పర్యటనను ముగించుకొని జగన్ బెంగుళూరు చేరుకున్నారు. నిన్ననే ఓ వివాహ వేడుకలకు హాజరయ్యారు. తాడేపల్లి వచ్చి పార్టీ సీనియర్లతో సమీక్షిస్తారు ఇదే విషయంపై. జూన్ 12 నాటికి కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అవుతుంది. ఆ సమయానికి జిల్లాల పర్యటనలు మొదలు పెడితే బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. అయితే తాడేపల్లిలో సీనియర్ నేతలతో సమావేశం జరిగిన తర్వాత.. జగన్ జిల్లాల పర్యటనలకు ఒక క్లారిటీ రానుంది.

పాకిస్తాన్ కు నీళ్లు కట్.. చావు దెబ్బ తీసిన భారత్

India Pakistan Water Dispute
India Pakistan Water Dispute

India Pakistan Water Dispute:  పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌ 1969 నాటి సిందు జలాల ఒప్పందాన్ని హోల్డ్‌లో పెట్టింది. నీటిని అవసరం లేనప్పుడు వదులుతూ.. అవసరం ఉన్నప్పుడు ఆపుతూ పాకిస్తాన్‌కు చుక్కలు చూపిస్తోంది. ఈ క్రమంలో పాకిస్తాన్‌కు వెళ్లే నీటిని తాజాగా దారి మళ్లించింది. దీంతో పంజాబ్, జమ్మూ కశ్మీర్‌ రైతులకు వరం కలిగించింది.

పాకిస్తాన్‌ ఓవరాక్షన్‌కు ఫలితం
పహల్గాం ఉగ్రదాడితోపాటు తరచూ భారత్‌ను కవిస్తున్న పాకిస్తాన్‌ ఓవరాక్షన్‌కు ఫలితమిది. 2024 వరకు రావి నది నీరు పాకిస్తాన్‌కు మాత్రమే అందుతుందని భావించారు, ఈ క్రమంలో షాపూర్‌–ఖండి ప్రాజెక్టు నిర్మించి ఆ నీటిని దారి మళ్లించింది. ఇది పాకిస్తాన్‌ అంచనా తప్పు అని నిరూపించింది. భారత్‌ చాలాకాలంగా నిర్మిస్తున్న ముఖ్యమైన ప్రాజెక్టు 2024లో పూర్తి చేసి నీటిని ఉపయోగిస్తోంది. ఇది భారత్‌ దృఢ∙సంకల్పానికి నిదర్శనం.

నీటి యుద్ధంలో భారత్‌ విజయం
బ్యారేజీ నిర్మించకుండా ముందు రావి నది నీరు అత్యంత పాకిస్తాన్‌లోకి వెళ్లేది. ఇప్పుడు ఆ నీటిని జమ్మూ కశ్మీర్‌లోని కతువా జిల్లాలోని బ్యారేజీని నింపుతున్నారు. ఇది నీటి యుద్ధంలో భారత్‌ విజయం. నీరు అంటే ప్రాణం – రైతులకు, భారత్‌కు. పాకిస్తాన్‌కు వెళ్లే నీటిని దారిమళ్లించి భారత్‌ రైతులకు ప్రాణం పోసింది.

వేల ఎకరాలకు జీవం..
షాపూర్‌–ఖండి బ్యారేజీ నిర్మాణంతో వేల ఎకరాలకు ఏడాదంతా నీరు అందుతోంది. కథువా, సాంబా జిల్లాల్లో వ్యవసాయం మెరుగుపడింది. వర్షాధారంగా కాకుండా స్థిరంగా వ్యవసాయం చేసే అవకాశం కలిగింది. రైతుల జీవితాలలో మార్పు వచ్చింది. వర్షాధార వ్యవసాయం నుంచి స్థిర వ్యవసాయానికి మారింది. ఇది రైతుల ఆర్థిక స్థిరత్వానికి దారి తీసింది.

పంజాబ్, జమ్మూ కశ్మీర్‌ రైతులకు లాభం
బ్యారేజీ నిర్మాణంతో పంజాబ్, జమ్మూ కశ్మీర్‌ రైతులకు ఆశ్చర్యకర లాభం. వారికి ఏడాదంతా నీరు అందుతోంది. వ్యవసాయం మెరుగుపడుతోంది. భారత్‌ సర్కార్‌ రైతులను మర్చిపోలేదు. నీటి ప్రాజెక్టుల ద్వారా రైతులకు వరం కలిగిస్తోంది. బ్యారేజీ నిర్మాణానికి చాలాకాలం పట్టినా తాజాగా ఫలితం లభించింది. రైతులకు వరం కలిగింది.

పాకిస్తాన్‌పై భారత్‌ ఆధిపత్యం
ఇది కేవలం నీటి పంపుణీ మాత్రమే కాదు నీతి విజయం. పాకిస్తాన్‌ పై భారత్‌ ఆధిపత్యం. రావి నది నీరు పాకిస్తాన్‌కు మాత్రమే అందుతుందని భావించార, కానీ భారత్‌ దారిమళ్లించింది.

షాపూర్‌ ఖండి ప్రాజెక్టు భారత్‌ విజయం, రైతుల లాభం. పాకిస్తాన్‌ నీటిని దారిమళ్లించి భారత్‌ రైతులకు వరం కలిగించింది. ఇది భారత్‌ రచనాత్మక యోచన, నిర్మాణ సామర్థ్యం, రైతు పక్షపాతానికి నిదర్శనం.

బిజెపి ముఖ్యమంత్రులకు అభినందనలు తెలపని జగన్!

Jagan Mohan Reddy
Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వైఖరిలో మార్పు కనిపిస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ఇది స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా బిజెపి విషయంలో వైసీపీ వైఖరి మారుతోంది. కాంగ్రెస్ పార్టీ స్వల్పంగా బలం పెంచుకుంది. దక్షిణాదిన ఐదు రాష్ట్రాలు ఉంటే.. అందులో నాలుగు చోట్ల కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఒక్క ఏపీలో మాత్రమే టిడిపి కూటమి అధికారంలో ఉంది. మొన్ననే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే కూటమి విజయం సాధించింది. అయితే బిజెపి చంద్రబాబును బలంగా నమ్ముతుండడంతో ఇకమీదట ఆ పార్టీని నమ్ముకుంటే ఇబ్బందికరమని భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అందుకే తన ఆలోచనను మార్చుకున్నట్లు అర్థమవుతోంది ఇటీవల పరిణామాలతో..

* ప్రధానిపై నోరోపారేసుకున్న వైసీపీ నేత…
ప్రధాని నరేంద్ర మోడీపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి పేర్ని నాని నోరు జారారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బిజెపి కాంగ్రెస్ పార్టీతో స్నేహం చేసేందుకు సిద్ధమైంది అన్న వార్తలు వస్తున్నాయి. పశ్చిమ ఆసియా యుద్ధం నేపథ్యంలో భారత దేశంలో సంక్షోభం రాకుండా అందరూ పొదుపు మంత్రం పాటించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. దానిని ఎద్దేవా చేశారు పేర్ని నాని. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేరుగా మోడీపై ఈ తరహా విమర్శలు గతంలో ఎన్నడూ చూడలేదు. కచ్చితంగా వైసీపీ వ్యూహం మార్చి ఉంటుందన్న టాక్ పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. మొన్ననే నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు.

* విజయ్ కు శుభాకాంక్షలు..
అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వైఖరి స్పష్టమైంది. తమిళనాడులో కాంగ్రెస్ మద్దతుతో అధికారంలోకి వచ్చిన విజయ్ కు శుభాకాంక్షలు తెలిపారు జగన్మోహన్ రెడ్డి. కానీ పశ్చిమ బెంగాల్ తో పాటు అస్సాం, పుదుచ్చేరిలో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారికి ఎటువంటి శుభాకాంక్షలు తెలపలేదు. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ ఓడిపోయారు. సువేందూ అధికారి సీఎం అయ్యారు. అయినా సరే జగన్ నుంచి అతనికి ఎటువంటి శుభాకాంక్షలు వెళ్లలేదు. తద్వారా జగన్మోహన్ రెడ్డి వైఖరి మారిందని స్పష్టం అవుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో.. ఆ పార్టీ మద్దతుతోనే అధికారంలోకి రావచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి అంచనాగా తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబుకు బలమైన మిత్రుడిగా భావిస్తోంది బిజెపి. అటువంటప్పుడు ఆ పార్టీని నమ్మడం శ్రేయస్కరం కాదని భావించి.. జగన్మోహన్ రెడ్డి యూటర్న్ తీసుకున్నట్లు ప్రచారంలో ఉంది. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి

బెంగాల్‌లో బీజేపీ యాక్షన్‌ మొదలు.. సువేందు కీలక ఆదేశాలు!

Suvendu Adhikari
Suvendu Adhikari

Suvendu Adhikari: బెంగాల్‌లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం తక్షణమే యాక్షన్‌ మొదలు పెట్టింది. నిర్మొహమాటంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్నికల హామీలు అమలు చేసే దిశగా పావులు కదుపుతోంది. ఈమేరకు ఆదేశాలు జారీ చేస్తోంది.

రెడ్‌ రోడ్‌పై నమాజ్‌ నిషేధం
మొదటిది కోల్‌కతాలో రోడ్లపై నమాజ్‌ చేయడం నిషేధించింది. కోల్‌కతా పట్టణంలో ఇరుకు రోడ్ల కారణంగా ట్రాఫిక్‌ సమస్య ఉంది. అయినా కోల్‌కతాలో రోడ్లపై ముస్లింలు నమాజ్‌ చేయడంతో మరింత సమస్య ఎదురవుతోంది. ట్రైన్‌కు వెళ్లేవారు 2 గంటల ముందు వెళ్లాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో సీఎం సువేందు అధికారి కోల్‌కతా రెడ్‌ రోడ్‌పై నమాజ్‌ను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఎందుకు నిషేధం?
రెడ్‌ రోడ్డు ఫోర్టు విలియంకు వెళ్లే రోడ్డు. నేతాజా విగ్రహం ఉంటుంది. మన సైన్యంకు సంబంధించిన హెడ్‌ క్వార్టర్స్‌ విలియంలో ఉంటాయి. అందుకే నమాజ్‌ నిషేధించింది. తక్షణం ఆదేశాలు అమలులోకి వచ్చాయి. మిగతా రోడ్లపైనా క్రమేపీ మిగతా వాటికి కూడా ఇది విస్తరిస్తుంది.

గోవుల స్మగ్లింగ్‌పై కఠిన చర్యలు
గోవులను బంగ్లాదేశ్‌కు స్మగ్లింగ్‌ చేయడం జరుగుతుంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత అనుప్రద మండల్‌ మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడు. ఇతను ఆవుల స్మగ్లింగ్‌ వ్యాపారంలో కీలకం. ఏటా 3 లక్షల గోవులను సరిహద్దు దాటించడం జరుగుతంది. ఇది తృణమూల్‌ నేతలకు ఆదాయంగా మారింది. తాజాగా సువేందు అధికారి ప్రభుత్వం నిషేధించింది.

రాళ్లు విసరడంపై నిషేధం
రాళ్లు విసరడంపైనా బెంగాల్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. బెంగాలీలు, బంగ్లాదేశీయులు ఎవరైనా రాళ్లు విసిరితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. బంగ్లాదేశ్‌ సరిహద్దులో నిఘా పెంచాలని నిర్ణయించింది.

స్మగ్లింగ్‌ వ్యాపారం వివరాలు
2006–07లో ఖమ్మం జిల్లాలో నిఖెల్‌తో చేసిన రూపాయి ఇస్తే రెండు రూపాయలు ఇస్తామని తెలిపారు. దీంతో బంగ్లాదేశ్‌కు తరలించి ప్లేట్లు తయారు చేసేవారు. ఇలా అనేక రకాల స్మగ్లింగ్‌ జరిగేది. స్మగ్లింగ్‌ పూర్తిగా నిలిపివేసేందుకు సరిహద్దు భద్రత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ట్రాఫిక్‌ సమస్య పరిష్కారం..
కోల్‌కతా పట్టణంలో ఇరుకు రోడ్ల కారణంగా ట్రాఫిక్‌ సమస్య ఉంది. నమాజ్‌ చేయడంతో మరింత సమస్య ఎదురవుతోంది. ట్రైన్‌కు వెళ్లేవారు 2 గంటల ముందు వెళ్లాల్సిన పరిస్థితి. నమాజ్‌ నిషేధంతో ట్రాఫిక్‌ సమస్య తగ్గుతుంది. ప్రజలకు సౌకర్యం కల్పిస్తుంది.

బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం తక్షణమే యాక్షన్‌ మొదలు పెట్టింది. నమాజ్‌ నిషేధం, గోవుల స్మగ్లింగ్‌ నిలపడం, రాళ్లు విసరడం నిషేధం, సరిహద్దు భద్రత పెంచడం – ఇవన్నీ బీజేపీ యాక్షన్‌ ప్లాన్‌ భాగం.

ప్రధాని చెప్పినట్టుగా వర్క్ ఫ్రమ్ హోం చేస్తే.. హైదరాబాదులో ఎంత పెట్రోల్ సేవ్ అవుతుందో తెలుసా.

Work From Home
Work From Home

Work From Home: మనదేశంలో పేరుపొందిన ఐటి నగరాలలో హైదరాబాద్ ముందు వరుసలో ఉంటుంది. ఫార్మా లో కూడా హైదరాబాద్ నగరానికి తిరుగులేని స్థాయి ఉంది. అతిపెద్ద కంపెనీలు.. అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఫలితంగా హైదరాబాద్ స్థాయి గ్లోబల్ రేంజ్ ను మించిపోయింది. మన దేశ ఆర్థిక రాజధాని ముంబైతో హైదరాబాద్ పోటీ పడుతుంది. హైదరాబాద్ నగరంలో పెద్ద పెద్ద కంపెనీలు ఏర్పాటైన నేపథ్యంలో.. ఉద్యోగులు కూడా అదే స్థాయిలో ఉన్నారు. హైదరాబాదులోనే వారు స్థిర నివాసం ఏర్పరచుకోవడంతో.. హైదరాబాద్ నగరం అంతకంతకు విస్తరిస్తోంది.

హైదరాబాదు నగరంలోని ఐటీ కారిడార్ ప్రాంతంలో దాదాపు తొమ్మిది లక్షల మందికి పైగా పనిచేస్తున్నారు. వీరిలో చాలామంది సొంత వాహనాలలో ఆఫీస్ కు వస్తుంటారు. కొన్ని కంపెనీలు గతంలో ప్రయాణ సౌకర్యాన్ని అందించేవి. ఖర్చులను తగ్గించుకోవడానికి చాలావరకు కంపెనీలు ప్రయాణ సౌకర్యాన్ని తగ్గించేశాయి. దీంతో ఉద్యోగులు మొత్తం సొంత వాహనాలలో కార్యాలయాలకు వస్తున్నారు. దీంతో హైదరాబాద్ నగరంలో పెట్రోల్ వినియోగం పెరిగిపోయింది.. పెట్రోల్ వినియోగం పెరిగిపోవడం వల్ల సహజంగానే కాలుష్యం కూడా పెరిగిపోతూ ఉంటుంది.

ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్క్ ఫ్రం హోం చేసుకోవాలని సూచించారు. అంతర్జాతీయంగా యుద్ధ ప్రభావాలు ఇంకా తగ్గలేదని.. దీనివల్ల మన దేశం మీద తీవ్రమైన ఒత్తిడి ఉందని.. అందువల్ల ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయడానికి ఆసక్తిని చూపించాలని సూచించారు. ప్రధానమంత్రి కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం విధానానికి మరోసారి శ్రీకారం చుడుతున్నట్టు తెలుస్తోంది.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఒకసారి హైదరాబాద్ లో ఉన్న పరిస్థితిని అంచనా వేస్తే..

హైదరాబాదు నగరంలో ఐటి కారిడార్ ప్రాంతంలో 9 లక్షల మందికిపైగా పనిచేస్తూ ఉంటారు. వీరిలో చాలామంది సొంత వాహనాలలో ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు. ఇందులో సగం మంది(4.5 లీటర్లు) కి వర్క్ ఫ్రం హోం ఇచ్చినా.. రోజుకు 3.6 లక్షల లీటర్ల పెట్రోల్ ఆదా అవుతుంది. ఒక్కో వ్యక్తి సగటున 20 కిలోమీటర్లు ప్రయాణిస్తారు అనుకుంటే మొత్తం 90 లక్షల కిలోమీటర్లు అవుతుంది. లీటర్ కు సగటున 25 కిలోమీటర్ల మైలేజీ వస్తుంది అనుకుంటే 3.87 కోట్లు ఆదా అయినట్టే. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర 107.50 గా ఉంది. హైదరాబాద్ నగరంలోనే ఇలా ఉంటే, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్ కతా, వంటి నగరాలలో కూడా ఇదే విధానాన్ని కొనసాగిస్తే మరింత పెట్రోల్ ఆదా అవుతుందని.. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

ఒకడి పక్షుల పిచ్చి హంటా వైరస్ పుట్టుకకు కారణమైంది.. చాలా మంది ప్రాణాలు తీసింది.. గగుర్పొడిచే స్టోరీ

Hantavirus Outbreak
Hantavirus Outbreak

Hantavirus Outbreak: ఎవడి పిచ్చి వాడికి ఆనందం అంటారు. కానీ కొంతమంది పిచ్చి ప్రపంచాన్ని ఆనందంలో కాకుండా ఏడుపులో ముంచి వేస్తుంది. చైనా శాస్త్రవేత్తల నిర్లక్ష్యం ప్రపంచాన్ని కరోనాకు బలి చేసింది. చివరికి చైనా శాస్త్రవేత్తలు కూడా కోవిడ్ వల్ల ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ శాస్త్రవేత్త చేసిన పని కూడా అలాంటిదే.

అతడి పేరు లియో. ఇతడు ఉండేది డచ్ ప్రాంతంలో. ఇతడు శాస్త్రవేత్త. పక్షులను పరీక్షించడం.. కొత్త కొత్త జీవజాతులను ప్రపంచానికి పరిచయం చేయడం ఇతడికి చాలా ఆసక్తికరమైన పని. అయితే ఇతను చేసిన ఒక పని ప్రపంచాన్ని వైరస్ మీద నిలబెట్టింది. అంతేకాదు ఇప్పుడు ఆ వైరస్ గురించి ప్రపంచం మొత్తం ఈపరితంగా భయపడుతోంది.

లియో హంట వైరస్ బారిన పడి చనిపోయాడు. ఈ వైరస్ సోకిన మొదటి వ్యక్తి ఇతడే. అత్యంత అరుదైన పక్షి జాతులను చూసేందుకు ఇతడు తాపత్ర పడుతుంటాడు. అది ఇతడిని హంట వైరస్ బారిన పడేలా చేసింది. ఇతడు క్రూజ్ నౌక లో ప్రయాణించాడు.. లియో తోపాటు అతని సతీమణి కూడా చనిపోయింది.

అత్యంత అరుదైన పక్షులను చూసేందుకు లియో, అతని భార్య మీర్జామ్ దాదాపు ఐదు నెలల పాటు దక్షిణాఫ్రికాలో పర్యటించారు. ఈ క్రమంలో మార్చి 27న అర్జెంటీనాలో ఒక ప్రాంతం వద్దకు వెళ్లారు. అక్కడ డార్విన్ కరకర పక్షిని చూసేందుకు చాలాసేపు అక్కడే ఉన్నారు. నాలుగు రోజుల తర్వాత లియో దంపతులు 100కు పైగా ప్రయాణికులతో కలిసి ఆ నౌకలో ప్రయాణం మొదలుపెట్టారు. గత నెల 6న లియో జ్వరం బారిన పడ్డాడు. ఆ తర్వాత తీవ్రమైన అస్వస్థతకు గురై ఐదు రోజుల అనంతరం చనిపోయాడు.

గత నెల 24న లియో భార్య.. తన భర్త మృతదేహంతో అట్లాంటిక్ లోని సెయింట్ హెలెనా ద్వీపంలో దిగింది. దక్షిణాఫ్రికా నుంచి డచ్ ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధమైంది. అయితే ప్రయాణంలోనే ఆమె ఆరోగ్యం అత్యంత విషమంగా మారింది. నీతో ఆమె కూడా చనిపోయింది. ఈ నెల 4న వారి మృతదేహాలకు పరీక్ష నిర్వహించగా వైరస్ దొరికినట్టు అధికారులు గుర్తించారు.

అర్జెంటీన ప్రాంతంలో చెత్తకుప్పలు ఉన్న ఏరియాలలో ఎలుకల రెట్టల నుంచి వచ్చే దుర్గందాన్ని పీల్చడం వల్ల వీడియో వైరస్ బారిన పడ్డట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ వైరస్ అతనికి ప్రాణాంతకంగా మారిందని పేర్కొంటున్నారు.. ఆ నౌకలో ప్రయాణించిన మరో 8 మందికి కూడా వైరస్ సోకినట్టు తెలుస్తోంది. ఇందులో ముగ్గురు ఇప్పటికే చనిపోయారు. ఆ నౌకలో 23 దేశాలకు సంబంధించిన 140 మంది ప్రయాణించారు. ఇప్పటికే అనౌక నెదర్లాండ్ ప్రాంతానికి చేరింది. వైరస్ సోకని వారి వారి ప్రాంతాలకు పంపించారు.

టెన్త్ క్లాస్ లో ప్రేమ.. ఇప్పుడేమో ఆ బంధం.. వీరి వ్యవహారం ఎక్కడిదాకా దారి తీసిందంటే

Peddapalli
Peddapalli

Peddapalli: ఏ వయసు లో జరగాల్సిన ముచ్చట.. ఆ వయసులో జరగాలి అంటారు. అలాగే ఏ వయసులో చేయాల్సిన పని.. ఆ వయసులోనే చేయాలి. ఎందుకంటే ఒక్కసారి వయసు అనేది దారి తప్పితే.. మనసు అనేది అదుపు తప్పితే ఆ తర్వాత చాలా దారుణం జరుగుతాయి.. అటువంటిదే ఇది కూడా

ఆమె పేరు అలేఖ్య. అతని పేరు వంశీ. విరిద్దరి పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగిరెడ్డిపల్లి.. వీరు పదవ తరగతి వరకు కలిసి చదువుకున్నారు. ఆ సమయంలో ప్రేమలో పడ్డారు. కానీ అది వారు అనుకున్నంత సులభంగా విజయవంతం కాలేదు. దీంతో ఎవరి దారి వారు చూసుకున్నారు. ఇటీవల కాలంలో అలేఖ్య, వంశీ, వారితో పదో తరగతి చదువుకున్న స్నేహితులు పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఆ సమయంలో అలేఖ్య, వంశీ గత జ్ఞాపకాలను తలుచుకున్నారు.. దానిని అక్కడితోనే ఆపివేస్తే బాగుండేది.. అయితే దానిని వారు వివాహేతర సంబంధం గా మార్చుకున్నారు.. ఆ తర్వాత వారిద్దరు కలవడం కామన్ అయిపోయింది.

ఈ విషయం అలేఖ్య భర్త నవీన్ కు తెలిసింది.. వంశీ హైదరాబాదులోనే ఉంటుండడం.. అలేఖ్య కూడా అక్కడే ఉండడంతో.. ఇద్దరు కలిసి తిరిగేవారు. ఈ విషయం నవీన్ కు తెలిసి అలేఖ్య మీద దృష్టిపెట్టాడు. ఆమె వ్యవహారం తెలుసుకున్నాడు. ఇంకేముంది తన ఫ్రెండ్ ద్వారా ఒకరోజు నవీన్ వంశీకి ఫోన్ చేయించాడు. వారు ఉంటున్న ప్రాంతానికి పిలిపించాడు. నవీన్ మరో స్నేహితుడు భాస్కర్ ను అక్కడ తీసుకొచ్చాడు. వంశీని మాటల్లో పెట్టాడు. నవీన్, భాస్కర్, వంశీ పీకలదాకా మద్యం తాగారు.. ఆ మత్తులో వంశీని ఏం చేయాలో అది చేశారు. ఆ తర్వాత అతడి మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో చుట్టారు. కారు డిక్కీ ప్రాంతంలో పెట్టుకున్నారు. హైదరాబాద్ నగరానికి దూరంగా ఉన్న మందని అనే ప్రాంతంలో పడేశారు.. ఆ తర్వాత అలేఖ్యతో నవీన్ మామూలుగానే ఉన్నాడు.

వంశీ కుటుంబ సభ్యులు అతడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వంశీ కాల్ డేటా పరిశీలించారు. అతడి సెల్ఫోన్ సిగ్నల్ కూడా పరిశీలించి చివరికి నవీన్, అలేఖ్యను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత నవీన్ ను విచారించిన పోలీసులు.. అసలు విషయాన్ని వెలికి తీశారు. ఇప్పుడు నవీన్, అలేఖ్య, భాస్కర్ జైలు ఊచలు లెక్కబెడుతున్నారు.

SRH ఇంత చెత్తగానా.. ఇలాగైతే ఐపీఎల్ ట్రోఫీ గెలిచినట్టే

SRH Vs Gujarat Titans
SRH Vs Gujarat Titans

SRH Vs Gujarat Titans: గుజరాత్ జట్టుతో మ్యాచ్.. కచ్చితంగా హైదరాబాద్ గెలుస్తుంది.. ఇది సాధారణ విశ్లేషకుడి మాట కాదు. గూగుల్ ప్రిడిక్షన్ కూడా. కానీ వాస్తవంలో ఏం జరిగిందంటే హైదరాబాద్ దారుణంగా ఓడిపోయింది. గుజరాత్ బౌలింగ్ ముందు తట్టుకోలేక తడబడి పోయింది. దూసుకు వస్తున్న బంతులను తట్టుకోలేక పెద్దపెద్ద బ్యాటర్ల సైతం తలవంచారు. పరుగులు తీయడం కాదు కదా.. కనీసం వికెట్ కాపాడుకుంటే చాలు దేవుడా అనే స్థాయిలో ఉండిపోయారు. కానీ గుజరాత్ బౌలర్లు పదేపదే మ్యాజిక్ చేయడంతో హైదరాబాద్ బ్యాటర్ల పప్పులు ఉడకలేదు.

ఈ మ్యాచ్లో గుజరాత్ 168 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్, సాయి సుదర్శన్ జాగ్రత్తగా బ్యాటింగ్ చేశారు. వీరిద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. వాస్తవానికి వీరిద్దరూ ఆడుతున్న తీరు చూసి అప్పటికే హైదరాబాద్ ప్లేయర్లు పిచ్ గురించి ఒక అంచనా వేసుకొని ఉంటే బాగుండేది. కానీ, పిచ్ ను సులభంగా తీసుకున్నారు. పరుగులు ఈజీగా తీయవచ్చు అని భావించారు. కానీ వాస్తవంలో పరిస్థితి మరో విధంగా ఉండడంతో హైదరాబాద్ ఆటగాళ్లకు పరాభవం తప్పలేదు.

ఈ మ్యాచ్లో గుజరాత్ 168 పరుగులు చేస్తే.. హైదరాబాద్ జట్టు కేవలం 14.5 ఓవర్లలో 86 పరుగులకే చాప చుట్టేసింది.. ప్రమాదకరమైన హెడ్ 0 పరుగులకే అవుట్ అయ్యాడు. అభిషేక్ శర్మ ఆరు పరుగులు మాత్రమే చేశాడు. కిషన్ 11 పరుగులు చేసి పెవిలియన్ వెళ్ళాడు. స్మరణ్ 9 పరుగులు, క్లాసెన్ 14 పరుగులు, సలీల్ అరోరా 16 పరుగులు చేశారు. నితీష్ కుమార్ రెడ్డి రెండు పరుగులకే అవుట్ అయ్యాడు..

ఈ ఓటమి ద్వారా హైదరాబాద్ జట్టు అనేక చత్త రికార్డులను నమోదు చేసుకుంది. 86 పరుగులకే ఆల్ అవుట్ అయి ఐపీఎల్లో అత్యంత తక్కువ స్కోరు నమోదు చేసింది. 2019లో ముంబై ఇండియన్స్ జట్టు మీద 96 పరుగులకు ఆల్ అవుట్ అయిన హైదరాబాద్ జట్టు.. తన పేరు మీద ఉన్న చెత్త రికార్డును తన బీట్ చేసింది. పరుగుల పరంగా కూడా అతిపెద్ద ఓటమిని హైదరాబాద్ జట్టు నమోదు చేసుకుంది. 2025లో కోల్ కతా జట్టు చేతిలో 80 పరుగుల తేడాతో ఓడిపోయిన హైదరాబాద్.. తాజా మ్యాచ్లో 82 పరుగులు తేడాతో కూటమిపాలైంది. గుజరాత్ జట్టుతో జరిగిన గత ఏడు మ్యాచ్లలో హైదరాబాద్ జట్టు వరుసగా 6 మ్యాచులలో ఓడిపోయింది.

ప్లాట్ పిచ్ ల మీద మాత్రమే హైదరాబాద్ ప్లేయర్లు బ్యాటింగ్ చేస్తారని విమర్శలు ఉన్నాయి. వాటిని హైదరాబాద్ ప్లేయర్లు మరోసారి నిజం చేశారు. ఎందుకంటే బ్లాక్ సాయిల్ పిచ్ మీద సరిగా ఆడలేకపోయారు. కనీసం బంతిని డిపెండ్ కూడా చేసుకోలేకపోయారు. ఏ మాత్రం సత్తా చూపించలేకపోయారు. ఫలితంగా హైదరాబాద్ తన ఐపిఎల్ చరిత్రలోనే దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. ఇలా తరబడిన ఆటగాళ్లు ఐపీఎల్ ట్రోఫీ ఎలా సాధిస్తారని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇలాగైతే కష్టమేనని.. ఇప్పటికైనా ప్లేయర్లు తమ ధోరణి మార్చుకోవాలని అభిమానులు పలుకుతున్నారు.

బంగారం కొంటున్నారా.. నేటి అర్ధరాత్రి నుంచి కేంద్రం తీసుకొచ్చిన గోల్డ్ స్ట్రోక్ తెలుసా..

Gold Import Duty Hike
Gold Import Duty Hike

Gold Import Duty Hike: ఇటీవల హైదరాబాద్ లో జరిగిన సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాది పాటు బంగారాన్ని కొనుగోలు చేయాలని ఆలోచన పూర్తిగా విరమించుకోవాలని భారతీయులకు సూచించారు. ఆయన మాటలు బంగార పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు అవి పూర్తిగా నిజమైపోయాయి. ఎందుకంటే కేంద్రం ఒక్కసారిగా గోల్డెన్ స్ట్రోక్ ఇచ్చేసింది. బంగారం కొనుగోలు చేయాలని వారి ఆశలను ఒక్కసారిగా తుంచేసింది.

ఇటీవల హైదరాబాద్ సభలో నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఏడాది పాటు భారతీయులు బంగారం కొనుగోలు చేయొద్దని సూచించారు. ఆయన మాట్లాడిన రెండు రోజుల్లోనే కేంద్రం బంగారం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. బంగారం, వెండి, ప్లాటినం దిగుమతుల మీద సుంకం రెట్టింపు చేసింది. ఇప్పటిదాకా అది ఐదు శాతం మాత్రమే ఉండేది. ఇప్పుడు ఏకంగా 10 శాతానికి పెరిగిపోయింది. ఇది మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. ఆభరణాల తయారీకి వాడే వస్తువులు.. ఇతర లోహాలు.. పారిశ్రామిక దిగుమతులకు కూడా ఇది వర్తిస్తుంది. దీంతో దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది.. ఇప్పటికే బంగారం ధర (24 క్యారెట్లు) 1,40,000 మించి ట్రేడ్ అవుతోంది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఆ ధర మరింత పెరిగే అవకాశం ఉంది.

బంగారం దిగుమతులు పెరుగుతుండడం కేంద్ర ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ధరలు పెరుగుతున్నప్పటికీ చాలామంది బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. మార్కెట్ నిపుణులు కూడా బంగారం మీద ఇన్వెస్ట్ చేయాలని సూచనల మీద సూచనలు చేస్తున్న నేపథ్యంలో.. చాలామంది ఇతర రంగాలను పక్కనపెట్టి.. కేవలం బంగారం మీద మాత్రమే ఇన్వెస్ట్ చేస్తున్న నేపథ్యంలో.. ఇతర రంగాలలో కొనుగోళ్లు పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో ఆయా రంగాలలో ఆర్థికంగా అభివృద్ధి అంతగా సాగడం లేదు. అందువల్లే కేంద్రం ఈ నిర్ణయం తీసుకొని ఉంటుందని తెలుస్తోంది. బంగారం కొనుగోళ్లు ఏడాదిపాటు తగ్గిపోతే మన దేశానికి సంబంధించిన విదేశీ మారకద్రవ్య నిల్వలు పెరుగుతాయని కేంద్రం అంచనా వేస్తోంది.

కేవలం బంగారం, ఇతర ఖరీదైన లోహాలు మాత్రమే కాదు.. ఆహార పదార్థాల ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. దేశంలో ఏప్రిల్ నెలకు సంబంధించి రిటైల్ ద్రవ్యోల్బణం ఏకంగా నాలుగు నెలల గరిష్టానికి చేరుకుంది. నాలుగు నెలల క్రితం ఇది 3.48 శాతంగా ఉండేది. జనవరిలో 2.74 శాతంగా ఉండేది. దీనికి ప్రధాన కారణం ఆహార ధరల పెరుగుదలే. వరుసగా ఆలు.. ఉల్లి.. టమాటా ధరలు క్రాష్ అయ్యాయి. మిగతా ఉత్పత్తుల ధరలు పెరిగాయి. దీంతో నాలుగు నెలల్లో ఆహార ద్రవ్యోల్బణం గడిచిన నాలుగు నెలల్లో 2.13 శాతం నుంచి 4.2 శాతం వరకు పెరిగింది. జ్యువెలరీ, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్ వంటి వాటిపై ఏప్రిల్ లో ద్రవ్యోల్బణం 53.61 శాతానికి చేరుకుంది.

నిర్మాత దిల్ రాజు పై మెగా ఫ్యాన్స్ ఫైర్..మెగా హీరోల సినిమాలు వచ్చినప్పుడే సమస్యలు గుర్తుకొస్తాయా..

Dil Raju
Dil Raju

Dil Raju Mega Fans Controversy: సోషల్ మీడియా లో మెగా ఫ్యాన్స్ తీవ్రమైన అసహనం తో ఊగిపోతున్నారు. ఒకపక్క ‘పెద్ది’ మూవీ కి పొటెన్షియల్ కి తగ్గ ప్రొమోషన్స్ చేయడం లేదని మేకర్స్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే , మరోపక్క తెలంగాణ లో కమీషన్ బేసిస్ మీద థియేటర్స్ ని రన్ చేసేందుకు నిర్మాతలు ఒప్పుకోవాలని , లేదంటే మే 29 నుండి థియేటర్స్ బంద్ చేస్తామని డిమాండ్ చేస్తున్నారు. దిల్ రాజు సోదరుడు శిరీష్ , అతని పార్టనర్ సునీల్ నారంగ్ వంటి వారు నేడు ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి , థియేటర్స్ ని రక్షించాలంటే, కమీషన్ బేసిస్ మీద సినిమాలను రన్ చెయ్యాలని , ప్రతీ రాష్ట్రంలోనూ ఇదే పద్దతిలో థియేటర్స్ రన్ అవుతున్నాయని, కానీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అలాంటి పరిస్థితి కనిపించడం లేదని, #RRR చిత్రం నుండి ఇప్పటి వరకు వందల థియేటర్స్ తెలంగాణ లో క్లోజ్ అయ్యాయని శిరీష్ ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చాడు.

వాళ్ళ డిమాండ్స్ సముచితంగానే ఉన్నాయి, కానీ మెగా హీరోల సినిమాలు వచ్చినప్పుడు మాత్రమే వీళ్లకు ఇలాంటి సమస్యలన్నీ గుర్తుకొస్తాయి , మిగిలిన సినిమాలకు అసలు గుర్తుకు రావంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. గతం లో పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ విషయం లో కూడా ఇదే జరిగిందని , సాక్ష్యాత్తు ఉపముఖ్యమంత్రి హోదా లో ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాకే వీళ్ళు అడ్డు పడాలని చూశారని , ఇప్పుడు రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా విషయం లోనూ అదే చేస్తున్నారని అంటున్నారు. ఈ సంవత్సరం మొదలై నాలుగు నెలలు పూర్తి అయ్యింది, ఈ నాలుగు నెలల్లో ఎందుకు ఈ సమస్యని పరిష్కరించుకోలేకపోయారు?, సరిగ్గా పెద్ది సినిమా విడుదల సమయం లోనే థియేటర్స్ పడుతున్న కష్టాలు గుర్తుకొచ్చాయా..?.

ఇలా టార్గెట్ చేస్తూ , మళ్ళీ మేము ఏ సినిమాని టార్గెట్ చేయడం లేదు , దయచేసి అర్థం చేసుకోండి అంటూ వివరణ ఇవ్వడం చాలా హాస్యాస్పదం గా ఉంది అంటూ సోషల్ మీడియా లో మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దిల్ రాజు గ్యాంగ్ కి రామ్ చరణ్ , పవన్ కళ్యాణ్ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థకు అధిక ప్రాధన్యత ఇవ్వడం నచ్చడం లేదని , అందుకే సరిగ్గా మెగా హీరోల సినిమాలు విడుదల సమయంలోనే ఇలా చేస్తున్నారని సోషల్ మీడియా లో విశ్లేషకుల నుండి వినిపిస్తున్న మాట. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ని మొదలు పెట్టినప్పటి నుండి దిల్ రాజు వాళ్ళని టార్గెట్ చేశాడని , అంతే కాకుండా స్టార్ హీరోల సినిమాలన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి , కుళ్ళు తో వాళ్ళని తొక్కే ప్రయత్నం లో భాగంగానే ఇలా చేస్తున్నారని అంటున్నారు నెటిజెన్స్, చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది.

ఎండు డొక్కలు.. పుండు రెక్కలు.. ఉక్రెయిన్ సైనికుల పరిస్థితి ఎంత దారుణమంటే..

Ukraine Soldiers Hunger
Ukraine Soldiers Hunger

Ukraine Soldiers Hunger: ఏ మనిషికైనా సరే పీల్చే గాలి తర్వాత.. తాగే నీటి తర్వాత అత్యంత ముఖ్యమైనది ఆహారం. ఆ జానెడు పొట్టను నింపుకోవడానికి మనిషి రకరకాల పనులు చేస్తుంటాడు.. కానీ ఆ పొట్టనిండడమే కష్టం అనుకుంటే.. పొట్ట నిండుగా ఆహారం కూడా వెళ్లే మార్గం లేకపోతే.. అంతకుమించిన దరిద్రం మరొకటి ఉండదు.

ఆదిమ కాలంలో మనుషులు ఆహారం కోసం అన్వేషణ సాగించారు. ఆ ఆహారాన్ని తమకు తాముగా సంపాదించుకున్నారు. అనేక క్రమాలుగా మనుషులుగా ఎదిగిన తర్వాత గొప్పగా జీవించడం మొదలుపెట్టారు. మనుషులు అభివృద్ధి చెందే క్రమంలో ఆలోచనలు గొప్పగా ఉండాలి.. జీవితం మరింత ఉన్నతంగా ఉండాలి. అలాకాకుండా రాతియుగంలోకి మనుషులు వెళ్లిపోయి.. దారుణమైన స్థితిలోకి మరలిపోతుంటే అంతకుమించిన తీరుగమనం మరొకటి ఏముంటుంది.

కొంతకాలంగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం సాగిస్తున్నాయి. రెండు వైపులా కూడా తీవ్రమైన ప్రాణ నష్టం చోటుచేసుకుంది. ఆస్తి నష్టం.. ఆర్థికంగా నష్టం విపరీతంగా జరిగింది. అయినప్పటికీ రెండు దేశాలు ఏమాత్రం పట్టు విడిపోవడం లేదు. పైగా మరింత దారుణంగా దాడులు చేసుకుంటున్నాయి. వాస్తవానికి ఈ యుద్ధం వల్ల రష సాధించింది లేదు. ఉక్రెయిన్ వెనకేసుకున్నది లేదు. రెండు దేశాల సంబంధించిన అధిపతులు బాగానే ఉన్నారు.. పైగా రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేసుకుంటున్నారు.

యుద్ధం అంటే ముందు వరుసలో ఉండి చేసేది సైనికులు మాత్రమే. ఆ సైనికుల ప్రాణాలు ఇప్పుడు గాలిలో దీపాలుగా మారిపోయాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ దేశానికి సంబంధించిన సైనికులు అత్యంత దారుణమైన స్థితిలో ఉన్నారు.. కనీసం వారికి తినడానికి తిండి కూడా లేదు.. గత నెల చివరిలో ఉక్రెయిన్ దేశానికి చెందిన నలుగురు సైనికులు చనిపోయారు. వారి దృశ్యాలు అత్యంత కలవరపరిచే విధంగా ఉన్నాయి.. 17 రోజులుగా సైనికులకు ఎటువంటి ఆహారం సరఫరా చేయకపోవడంతో.. సైనికులు ఆకలితో అల్మటించి చనిపోయినట్టు తెలుస్తోంది. ఆకలి తట్టుకోలేక వారు వాన నీళ్లు తాగారు. ఉక్రెయిన్ సైన్యంలో 14వ మేకనైజ్డ్ బ్రిగేడ్లో పనిచేస్తున్న సైనికుడి భర్త అనస్తాసియా సిల్చుక్ తన భర్త ఫోటోను ఏప్రిల్ 22న సోషల్ మీడియాలో బయటపెట్టింది.

రష్యా బాంబుదాడులతో ధ్వంసం చేసిన తర్వాత ఆగ్నేయ డొనేట్స్ ప్రాంతంలో ఓసికిల్ నదికి ఎడమ, తూర్పు ఒడ్డు ప్రాంతంలో ఉక్రెయిన్ సైనికులు తలదాచుకున్నారు. ఆహారం లేక, తాగడానికి నీరు లేక సైనికులు ఆకలి కేకలు వేశారని తెలుస్తోంది. సైనికుడు ఓలెక్సాండర్ తన మాతృభూమి కోసం పోరాడుతున్నప్పుడు తీవ్రమైన ఆకలి బాధను అనుభవించాలని ఆల్ జజీరా అనే మీడియా సంస్థ ఇంటర్వ్యూలో చెప్పాడు. “వారాల తరబడి మీకు రోజుకు చాక్లెట్ బార్ లు, ఓట్ మీల్, వాటర్ బాటిల్ మాత్రమే లభిస్తాయి. కాబట్టి మీరు వేడి భోజనం కోసం కలలు కనకూడదు” అంటూ కీవ్ లో కాలిగాయం నుంచి కోరుకుంటున్న ఓ సైనికుడు మీడియా ఇంటర్వ్యూ లో తన బాధను వ్యక్తం చేశాడు. దీనిని బట్టి యుద్ధంలో ఉక్రెయిన్ సైనికులు ఏ స్థాయిలో ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

'జన నాయగన్ ' కి ఊహకందని బిజినెస్ ఆఫర్స్.. సీఎం విజయ్ బ్రాండ్ మాస్..

Jana Nayagan First Day Collection
Jana Nayagan First Day Collection

Jananayagan Business: రెండు , మూడు నెలల క్రితం వరకు KVN ప్రొడక్షన్స్ సంస్థ ని చూసి అందరూ అయ్యోపాపం అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇండియా లో ఈ నిర్మాతలను మించిన అదృష్టవంతులు ఎవ్వరూ లేరని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళ చేతుల్లో ‘జన నాయగన్ ‘ చిత్రం ఉంది. సంక్రాంతి కానుకగా విడుదల అవ్వాల్సిన ఈ సినిమాని , సెన్సార్ సభ్యులు సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించడం తో ఈ చిత్రం విడుదల ఆగిపోయింది. అనంతరం కొన్ని రోజుల తర్వాత ఈ సినిమా ఆన్లైన్ లో HD క్వాలిటీ తో లీక్ అయ్యింది. దాదాపుగా అందరూ ఈ చిత్రాన్ని ఆన్లైన్ లోనే చూసేశారు. పాపం నిర్మాత పరిస్థితి ఏంటో అని అంతా అనుకున్నారు. అప్పటి వరకు ఈ చిత్రం తో బిజినెస్ డీల్స్ పెట్టుకున్న వారంతా వెనక్కి వెళ్లిపోయారు , చివరికి అమెజాన్ ప్రైమ్ ఓటీటీ సంస్థ కూడా డీల్ ని రద్దు చేసుకుంది.

అయితే ఇప్పుడు ఆ సినిమా హీరో విజయ్ తమిళనాడు కే సీఎం అయ్యి కూర్చున్నాడు. దేశం మొత్తం ఆయన పేరు , ఆయన తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలకు సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ‘జన నాయగన్’ చిత్రానికి మంచి క్రేజ్ ఏర్పడింది. అమెజాన్ ప్రైమ్ సంస్థ ఇప్పుడు మళ్లీ ఈ చిత్ర నిర్మాతలతో డీల్ మాట్లాడేందుకు ముందుకొచ్చింది. ఈసారి ఏకంగా 120 కోట్ల రూపాయిలు ఆఫర్ చేస్తున్నారట. ఇది చిన్న అమౌంట్ కాదు , ఓటీటీ మార్కెట్ క్రాష్ అయిన కారణంగా పాన్ ఇండియన్ చిత్రాలను కూడా ఈ రేంజ్ రేట్స్ కి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించడం లేదు ఓటీటీ సంస్థలు , అలాంటిది ఒక రీమేక్ సినిమాకు ఇంత క్రేజ్ పలకడం సీఎం విజయ్ బ్రాండ్ ఇమేజ్ కి నిదర్శనం అని అంటునారు. అంతే కాదు థియేట్రికల్ బిజినెస్ కి కూడా ప్రస్తుతం మార్కెట్ లో మామూలు రేంజ్ డిమాండ్ లేదనే చెప్పాలి, వందల కోట్ల ఆఫర్లు వస్తున్నాయి , చూడాలి మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది , మొదటి రోజు మాత్రం కచ్చితంగా వంద కోట్ల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని , ఫుల్ రన్ లో తమిళనాడు లో ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందని అంటున్నారు.

సింహం వేటాడితే ఎలా ఉంటుందో తెలుసా వైరల్ వీడియో

Lion Hunting Viral Video
Lion Hunting Viral Video

Lion Hunting Viral Video: అది గుజరాత్‌లోని ప్రసిద్ధ గిర్ అభయారణ్యం. పర్యాటకులు సఫారీ వాహనాల్లో ప్రకృతిని, వన్యప్రాణులను వీక్షిస్తూ ఉత్సాహంగా సాగిపోయే ప్రదేశం. చుట్టూ దట్టమైన పొదలు, ఎండ వేడికి ఎండుతున్న గడ్డి.. వాతావరణం అంతా ప్రశాంతంగా కనిపిస్తోంది. కానీ ఆ ప్రశాంతత వెనుక ఒక భయంకరమైన వేట దాగి ఉందని అక్కడ ఉన్న పర్యాటకులు ఊహించలేదు. ఈ వేటను చూసి పర్యాటకులు ఒక్కసారిగా విస్మయానికి గురయ్యారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సఫారీలో ఉన్న పర్యాటకు తమ చూట్టూ ప్రదేశాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఇదే సమయంలో వీరి వైపు ఒక ఓ జంతువు ఏమరపాటుగా వచ్చింది. ఆ జంతువు రాకను ముందే పసిగట్టిన ఒక ఆడసింహం, అత్యంత వ్యూహాత్మకంగా పర్యాటకుల సఫారీ వాహనం వెనుక దాక్కుంది.ఈ వాహనం అడ్డుగోడలా మారడంతో, వేటాడే జంతువుకు సింహం ఉనికి అస్సలు తెలియలేదు. సింహం తన శరీరాన్ని భూమికి ఆనించి, శ్వాసను కూడా నియంత్రించుకుంటూ సరైన సమయం కోసం వేచి చూసింది.

ఆ జంతువు వాహనానికి అతి దగ్గరగా రాగానే, ఆడసింహం మెరుపు వేగంతో దానిపైకి ఎగిరిపడింది. ఈ దాడికి ఆ జంతువు కోలుకునేలోపే, సమీపంలోనే పొంచి ఉన్న మగసింహం కూడా రంగ ప్రవేశం చేసింది. గంభీరమైన గర్జనతో మగసింహం ఒక్కసారిగా దానిపైకి దూకి, పదునైన పళ్ళతో జంతువు గొంతును గట్టిగా పట్టుకుంది. కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలోనే ఆ భీకర వేట ముగిసిపోయింది.

తమ కళ్లముందే అతి తక్కువ దూరంలో జరిగిన ఈ సహజసిద్ధమైన వేటను చూసి పర్యాటకులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. కొందరు భయంతో వణికిపోగా, మరికొందరు ఆ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించారు. ప్రకృతిలో ‘బలవంతుడిదే రాజ్యం’ అనే సూత్రానికి ఈ ఘటన సజీవ సాక్ష్యంగా నిలిచింది. ప్రస్తుతం ఈ భీకర వేటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

 

 

బి*కి*నీలో అందాల నటాషా.. చూడతరమా?

Natasha Bharadwaj poolside photos
Natasha Bharadwaj poolside photos

అల్లు అర్జున్ ప్రాపర్టీ అంటూ హీరోయిన్ పై నెటిజెన్స్ అసభ్య కామెంట్స్.. ఇచ్చి పారేసిన హీరోయిన్..

Seerat Kapoor
Seerat Kapoor

Seerat Kapoor: సోషల్ మీడియా లో ఈమధ్య కాలంలో కొంతమంది నెటిజెన్స్ చేసే కామెంట్స్ కి సెలబ్రిటీలు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు , బాధ పడుతున్నారు. ఒకప్పుడు ఈ కామెంట్స్ కి స్పందించే వారు కాదు , కానీ ఇప్పుడు మాత్రం హద్దులు దాటుతుండడంతో తప్పనిసరి పరిస్థితిలో రెస్పాన్స్ ఇవ్వాల్సి వస్తోంది. ముఖ్యంగా హీరోయిన్స్ ఇలాంటి కామెంట్స్ ని అసలు తీసుకోలేకపోతున్నారు. ‘రన్ రాజా రన్’ హీరోయిన్ సీరత్ కపూర్ కి రీసెంట్ గా నెటిజెన్స్ నుండి అలాంటి అనుభవమే ఒకటి ఎదురైంది. రీసెంట్ గా అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా సీరత్ కపూర్ ఆయనతో ఒక ప్రైవేట్ జెట్ లో తీసుకున్న ఫోటోని అప్లోడ్ చేసి శుభాకాంక్షలు తెలిపింది. ఈ ఫోటో బాగా వైరల్ అయ్యింది. ఈ ఫొటోలో సీరత్ కపూర్ అల్లు అర్జున్ తో చాలా సన్నిహితం గా ఉందని , ఈమె అల్లు అర్జున్ ప్రాపర్టీ అంటూ డబుల్ మీనింగ్ వచ్చేలా కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేశారు.

దీనిపై సీరత్ కపూర్ స్పందిస్తూ ‘లవ్ ఎమోజీలు పెట్టినంత మాత్రానా మీరు చేసే కామెంట్స్ గౌరవప్రదంగా ఉన్నాయని కాదు. ఒక మహిళా ఎవరికీ ప్రాపర్టీ కాదు , ఆమె కూడా మనిషే, ఆమెకంటూ కొన్ని కలలు , కోరికలు , గొంతు , గుర్తింపు ఉంటాయి. దయచేసి చూసుకొని కామెంట్స్ చేయండి , మీ అభిమానం ఒకరిని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు. గ్లామర్ గర్ల్ అనే ముద్ర వేసి , మీ ఇష్టమొచ్చినట్టు మాట్లాడే సంస్కృతి ని ఇక నుండి అయినా ఆపండి’ అంటూ చెప్పుకొచ్చింది. ఆమె కోపాన్ని వ్యక్తం చేసిన తీరుకి నెటిజెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇకపోతే అందం , అభినయం ఉన్నప్పటికీ ఎందుకో సీరత్ కపూర్ అనుకున్నంత స్థాయిలో గుర్తింపు ని సంపాదించలేకపోయింది. సినిమాలు చేస్తూనే ఉంది కానీ , మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్లు దొరకడం లేదు , సెకండ్ హీరోయిన్ రోల్స్, లేదంటే వేరే ఏదైనా చిన్న క్యారెక్టర్స్ తోనే ఆమె కెరీర్ ని సాగిస్తోంది.

తమిళనాడు యువత కి సీఎం విజయ్ బంపర్ ఆఫర్.. దేశంలో ఎక్కడా ఇలాంటివి జరగలేదు..

CM Vijay Tamil Nadu
CM Vijay Tamil Nadu

CM Vijay Bumper Offer For Youth: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఈ ఒక్క రోజులోనే ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నాడు. దేశం లో ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు , భవిష్యత్తులో విజయ్ తీసుకున్న ఈ నిర్ణయాలను ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయొచ్చు, ఆ రేంజ్ లో ఉన్నాయి. ముందుగా దేవాలయాలు, విద్యాసంస్థలు, బస్సు స్టెప్పులు ఉన్న 500 మీటర్ల రేడియస్ లో మద్యం దుకాణాలు ఉండరాదని , మా సర్వే ద్వారా 770 మద్యం దుకాణాలు ఈ ప్రదేశాల్లో ఉన్నాయని , తాకసనమే వాటిని తొలగించాలని జీవో ని జారీ చేశారు. ఇది ఒక విప్లవాత్మక నిర్ణయం అనే చెప్పాలి. అదే విధంగా విజయ్ తీసుకున్న మరో సంచలన నిర్ణయం , పబ్లిక్ ప్రదేశాల్లో బ్యానర్స్ కట్టడం , సంబరాలు చేయడం వంటివి నిషేధించడం. తన పార్టీ కార్యకర్తలకు కూడా చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

తమిళనాడు రాష్ట్రంలో ఎక్కడా కూడా టీవీకే పార్టీ కార్యకర్తలు, పబ్లిక్ ప్రాంతాల్లో బ్యానర్స్ కట్టరాదని , ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా సంబరాలు చేయడం వంటివి కూడా ఇక నుండి ఆపాలని, ఎవరైనా ఈ నియమాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశాడు . ఇది కూడా చాలా గొప్ప నిర్ణయం , పరిణీతి చెందిన నాయకులూ చేసే పనులు ఇవి. దేశం లో ఏ రాజకీయ నాయకుడు తీసుకొని స్టెప్ ఇది. ఈరోజు విజయ్ తీసుకున్న మరో సంచలన నిర్ణయం , TNPSC,SSC,IBPS,RRB వంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఉచిత కోచింగ్ సెంటర్స్ ని నిర్వహించాలని సీఎం విజయ్ సరికొత్త జీవో ని జారీ చేసాడు. ఇది గతం లో తమిళనాడు లో ఉన్న స్కీం అని కొందరు అంటుంటే, కొత్త స్కీం అని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా ఒక్క రోజులో మూడు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు. రాబోయే రోజుల్లో విజయ్ ఇంకా ఎన్ని అద్భుతాలు చేస్తాడో చూడాలి.