Home Blog Page 285

తమిళనాడు యువత కి సీఎం విజయ్ బంపర్ ఆఫర్.. దేశంలో ఎక్కడా ఇలాంటివి జరగలేదు..

CM Vijay Tamil Nadu
CM Vijay Tamil Nadu

CM Vijay Bumper Offer For Youth: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఈ ఒక్క రోజులోనే ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నాడు. దేశం లో ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు , భవిష్యత్తులో విజయ్ తీసుకున్న ఈ నిర్ణయాలను ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయొచ్చు, ఆ రేంజ్ లో ఉన్నాయి. ముందుగా దేవాలయాలు, విద్యాసంస్థలు, బస్సు స్టెప్పులు ఉన్న 500 మీటర్ల రేడియస్ లో మద్యం దుకాణాలు ఉండరాదని , మా సర్వే ద్వారా 770 మద్యం దుకాణాలు ఈ ప్రదేశాల్లో ఉన్నాయని , తాకసనమే వాటిని తొలగించాలని జీవో ని జారీ చేశారు. ఇది ఒక విప్లవాత్మక నిర్ణయం అనే చెప్పాలి. అదే విధంగా విజయ్ తీసుకున్న మరో సంచలన నిర్ణయం , పబ్లిక్ ప్రదేశాల్లో బ్యానర్స్ కట్టడం , సంబరాలు చేయడం వంటివి నిషేధించడం. తన పార్టీ కార్యకర్తలకు కూడా చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

తమిళనాడు రాష్ట్రంలో ఎక్కడా కూడా టీవీకే పార్టీ కార్యకర్తలు, పబ్లిక్ ప్రాంతాల్లో బ్యానర్స్ కట్టరాదని , ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా సంబరాలు చేయడం వంటివి కూడా ఇక నుండి ఆపాలని, ఎవరైనా ఈ నియమాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశాడు . ఇది కూడా చాలా గొప్ప నిర్ణయం , పరిణీతి చెందిన నాయకులూ చేసే పనులు ఇవి. దేశం లో ఏ రాజకీయ నాయకుడు తీసుకొని స్టెప్ ఇది. ఈరోజు విజయ్ తీసుకున్న మరో సంచలన నిర్ణయం , TNPSC,SSC,IBPS,RRB వంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఉచిత కోచింగ్ సెంటర్స్ ని నిర్వహించాలని సీఎం విజయ్ సరికొత్త జీవో ని జారీ చేసాడు. ఇది గతం లో తమిళనాడు లో ఉన్న స్కీం అని కొందరు అంటుంటే, కొత్త స్కీం అని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా ఒక్క రోజులో మూడు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు. రాబోయే రోజుల్లో విజయ్ ఇంకా ఎన్ని అద్భుతాలు చేస్తాడో చూడాలి.

ధనుష్ 'కర' 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..హిట్ టాక్ తో ఈ రేంజ్ డిజాస్టర్ వసూళ్లు ఊహించలేదు..

Kara 12 Days Worldwide Collections
Kara 12 Days Worldwide Collections

Kara 12 Days Worldwide Collections: ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాలకు కలెక్షన్స్ రాకపోవడం సహజమే , కానీ ఈ ఏడాది ఏంటో అసలు అర్థం కావడం లేదు , సూపర్ హిట్ , లేదా డీసెంట్ టాక్ వచ్చిన సినిమాలకు కూడా కలెక్షన్స్ రావడం లేదు. ఇదే నిర్మాతలను, బయ్యర్స్ ని తీవ్రమైన మనోవేదనకు గురి చేస్తున్న విషయం. చిన్న సినిమాలకు ఇలాంటి సమస్యలు ఉంటే పర్వాలేదు, కానీ ధనుష్ లాంటి పాపులర్ హీరో సినిమాకు కూడా పాజిటివ్ టాక్ మీద కనీసం యావరేజ్ రేంజ్ కలెక్షన్స్ కూడా రావడం లేదంటే ఏమనుకోవాలి చెప్పండి.. ?, రీసెంట్ గానే ఆయన హీరో గా నటించిన ‘కర’ మూవీ భారీ అంచనాల నడుమ విడుదలైంది. ఈ చిత్రానికి సోషల్ మీడియా నుండి అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ కలెక్షన్స్ మాత్రం డిజాస్టర్ రేంజ్ లోనే వచ్చాయి. 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ప్రాంతాల వారీగా ఎంత గ్రాస్ వసూళ్లు వచ్చాయో చూద్దాం.

ముందుగా తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే నైజాం ప్రాంతం నుండి 3 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టగా, ఆంధ్రా + సీడెడ్ ప్రాంతాల నుండి 3 కోట్ల 25 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 6 కోట్ల 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 3 కోట్ల 27 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో కోటి 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. ఇక ఇతర ప్రాంతాల విషయానికి వస్తే , తమిళనాడు లో ఈ చిత్రానికి 12 రోజుల్లో 28 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

ఇది చాలా అంటే చాలా తక్కువ అనే చెప్పాలి. ఇక కర్ణాటక ప్రాంతం విషయానికి వస్తే 12 రోజుల్లో 3 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టగా, కేరళ నుండి 60 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 40 లక్షలు, ఓవర్సీస్ నుండి 10 కోట్ల 60 లక్షలు , ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా అన్ని బాషల నుండి ఈ చిత్రానికి 50 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 24 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఓవరాల్ గా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో 17 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. ఇది దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి. మహా అయితే మరో కోటి రూపాయిల షేర్ మాత్రమే ఈ చిత్రానికి రాబోయే రోజుల్లో వస్తుందని, ఓవరాల్ గా కమర్షియల్ గా బిగ్గెస్ట్ డిజాస్టర్ అని అంటున్నారు.

అల్లు అర్జున్ ఆ విషయం లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడా...

Allu Arjun Strict On Movie Scripts
Allu Arjun Strict On Movie Scripts

Allu Arjun Strict On Movie Scripts: గంగోత్రి సినిమాతో హీరోగా కెరియర్ ను స్టార్ట్ చేసిన అల్లు అర్జున్ ఆ సినిమా సక్సెస్ అయిన కూడా అతనికి పెద్దగా పేరైతే రాలేదు. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో చేసిన ఆర్య సినిమాతో స్టార్ హీరోగా మారిపోయాడు. స్టైలిష్ స్టార్ గా అవతరించిన ఆయన వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ముఖ్యంగా తన డ్యాన్సులతో ప్రేక్షకులను మెప్పించాడనే చెప్పాలి. అతని నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు అల్లు అర్జున్ ఆ సినిమాలో ఎలాంటి డిఫరెంట్ స్టెప్పులు వేయబోతున్నాడు అనే ధోరణిలో ప్రేక్షకులంతా ఎదురు చూసేవారంటే అల్లు అర్జున్ ఏ రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ లాంటి నటుడు ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో తనదైన రీతిలో వ్యవహరిస్తున్నాడు… అయితే అల్లు అర్జున్ కొన్ని విషయాల్లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారట…

ముఖ్యంగా షూటింగ్ టైమ్ లో తను చేయబోయే సీన్ పట్ల క్లారిటిగా ఉండకపోతే ఆయన కొంతవరకు ఇబ్బంది పడతారట. అందుకే తను ఎవరైతే టాలెంటెడ్ డైరెక్టర్ అని అనుకుంటాడో ఏరుకోరి మరి వాళ్ళకే అవకాశాలను ఇస్తున్నాడు. నిజానికి అల్లు అర్జున్ చాలామంది దర్శకులతో పనిచేస్తున్నాడు. కాబట్టి అతనికి ఒక్కొక్క దర్శకుడి యొక్క స్టైల్ ఏంటి అతను ఎలా తనని చూపిస్తాడు అనే విషయాల్లో చాలా క్లారిటీ గా ఉంటున్నాడు.

అందువల్లే అల్లు అర్జున్ ఏ దర్శకుడితో మనం సినిమా చేస్తే సేఫ్ జోన్ లో ఉండొచ్చు ఏ డైరెక్టర్ తో ఎక్స్పెరిమెంట్లు చేస్తే మనం ప్లాప్ లను మూట గట్టుకోవాల్సి వస్తుందనేది ముందుగానే క్యాలిక్యులేషన్స్ వేసుకొని మరి సినిమాలు చేస్తున్నాడు. ఒక దర్శకుడు సెట్ లో పూర్తి క్లారిటితో లేనప్పుడు ఆ సినిమా అనుకున్న రేంజ్ లో రాదని తన సన్నిహితులు దగ్గర చెబుతూ ఉంటాడట.

అందుకే కాన్ఫిడెంట్ గల దర్శకులకు మాత్రమే సినిమాలు ఇస్తాడు. ఒకవేళ దర్శకుడు సెట్ లో తడబడితే మాత్రం అతనికి కొంత వరకు మోరల్ సపోర్ట్ ఇస్తారట. అయిన కూడా దర్శకుడికి క్లారిటి లేకపోతే మాత్రం అల్లు అర్జున్ అతన్ని క్షేమించాడని అసలు ఎందుకని ఆ ప్రాజెక్టు తన చేత లాక్ చేయించారని దర్శక నిర్మాతల మీద ఫైర్ అవుతుంటాడట…

ఆత్మహత్య చేసుకుంటాను అంటూ రామ్ చరణ్ అభిమాని సంచలన లేఖ.. అసలు ఏమైందంటే..

Ram Charan Fan Letter
Ram Charan Fan Letter

Ram Charan Fan Letter: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ‘పెద్ది’ మూవీ టీం పై తీవ్రమైన అసహనం తో ఉన్నారు. వాళ్ళ మీద కోపం తో ఏమి చెయ్యాలో తెలియక సోషల్ మీడియా లో రామ్ చరణ్ ని ట్యాగ్ చేస్తూ , తమ ఫ్రస్ట్రేషన్ ని తీర్చుకుంటున్నారు. మార్కెట్ లో మంచి క్రేజ్ ఉన్నటువంటి పెద్ది చిత్రానికి పాన్ ఇండియా లెవెల్ లో మార్కెటింగ్ చేయడం లో మూవీ టీం తీవ్రంగా విఫలం అయ్యిందని, సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుంటే , ఇప్పటి వరకు కనీసం ప్రమోషనల్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టలేకపోతున్నారని, మొదట్లో ఈ చిత్రం పై ఏర్పడిన హైప్ ఇప్పుడు లేదని, బాగా తగ్గిపోయిందని , మళ్లీ బజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేయడం లేదని రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ బలహీనంగా ఉండడం రామ్ చరణ్ అభిమానులను తీవ్రమైన నిరాశకు గురి చేస్తోంది.

ఎందుకంటే ఈ చిత్రం ‘ఓజీ’, ‘దేవర’, ‘కల్కి’ ‘పుష్ప 2’ తరహా లో నార్త్ అమెరికా నుండి సెన్సేషనల్ అడ్వాన్స్ బుకింగ్స్ ని నమోదు చేసుకుంటుందని అనుకున్నారు. ఎందుకంటే ఈ చిత్రం అలాంటి హైప్ ఉన్న కంటెంట్ సినిమాల జాబితాలోనిదే కాబట్టి. కానీ బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే అలా లేదని , కనీసం రెండు మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను అయినా ఈ చిత్రం రాబడుతుందో లేదో అని అభిమానులు కంగారు పడుతున్నారు. ఈ నేపథ్యం లో ఒక రామ్ చరణ్ అభిమాని మూవీ టీం ని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియా లో అప్లోడ్ చేసిన ఒక ఆత్మహత్య లేఖ ఇప్పుడు సంచలనం గా మారింది. ఇది కచ్చితంగా తెలివి తక్కువ చర్య , ఇలా చేయడం చాలా తప్పు , కానీ వాళ్ళ ఆవేదన ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం.

ఆ అభిమాని మాట్లాడుతూ ‘మన సినిమా విడుదలకు సరిగ్గా 20 రోజుల సమయం ఉంది. కానీ ఇప్పటి వరకు ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు, ఒక ప్లానింగ్ లేదు , షెడ్యూల్ లేదు. ఇప్పటికే మేము ఈ విషయంలో ‘గేమ్ చేంజర్’ నిర్మాతల అలసత్వానికి విసిగిపోయాము. కనీసం మీరైనా మా ఫ్యాన్స్ బాధని అర్థం చేసుకోండి. మీరు ఇంకా ప్రొమోషన్స్ షెడ్యూల్ ని విడుదల చేయకపోతే నేను ఫ్యాన్ కి ఉరి వేసుకొని చనిపోతాను, మా జీవితం లో ఉండే బాధలకన్నా , మీరు పెట్టే మెంటల్ టార్చర్ ఎక్కువగా ఉంది’ అంటూ ఒక లేఖని అప్లోడ్ చేసాడు రామ్ చరణ్ అభిమాని.

అలేఖ్య చిట్టి అందాలు.. మనకు సెగలు పుడుతాయి..

Ramya Moksha Photoshoot
Ramya Moksha Photoshoot

అంతు పట్టని దువ్వాడ రాజకీయం!

Duvvada Srinivas Political Strategy
Duvvada Srinivas Political Strategy

Duvvada Srinivas Political Strategy: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రజల మధ్యకు వస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం లో పర్యటనలు మొదలుపెట్టారు. వచ్చే ఎన్నికల్లో ఆయన టెక్కలి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీ తరఫున పోటీ చేస్తారు. లేకుంటే మాత్రం ఇండిపెండెంట్ గా బరిలో ఉంటారు. ఎలా చూసుకున్నా ఆయన పోటీ చేయడం అనివార్యం అని తెలుస్తోంది. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేసింది. ఆయన కుటుంబ, వ్యక్తిగత వ్యవహార శైలితో పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయని భావించి హై కమాండ్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే తిరిగి వైసీపీలో చేరుతానని ఆశ భావంతో ఉన్నారు ఎమ్మెల్సీ దువ్వాడ. అదే సమయంలో వైసీపీలోని జిల్లా నేతలతో ఆయనకు సఖ్యత లేదు. జగన్మోహన్ రెడ్డిని అభిమానిస్తూనే జిల్లా నేతలపై ఆరోపణలు చేస్తున్నారు దువ్వాడ.

* టెక్కలిలో తరచూ పర్యటనలు..
దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి అసెంబ్లీ తరచూ పర్యటనలు చేస్తున్నారు. వివాహాలతో పాటు శుభకార్యాలకు హాజరవుతున్నారు. మృతుల కుటుంబాలతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శిస్తున్నారు. ఇదంతా టెక్కలి నియోజకవర్గంలో పోటీ చేసేందుకు అని స్పష్టమవుతోంది. నిన్ననే ఆయన టెక్కలి జిల్లా కేంద్ర ఆస్పత్రిని సందర్శించారు. అక్కడ రోగులతో మాట్లాడారు. సదుపాయాలపై ఆరా తీశారు. జగన్మోహన్ రెడ్డి ఈ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తే.. నిర్వహణలో టిడిపి కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రాష్ట్ర మంత్రి అచ్చెనాయుడు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడులపై విమర్శలు చేశారు. అయితే ఈ పర్యటనలో సైతం ఆయన వెంట దివ్య మాధురి ఉండడం విశేషం.

* నష్టం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకే..
వచ్చే ఎన్నికల నాటికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి టిక్కెట్ దక్కించుకోవాలన్నదే దువ్వాడ శ్రీనివాస్ టార్గెట్. అయితే ఇప్పటికే ఒకసారి ఎంపీగా,, రెండుసార్లు ఎంపీ అభ్యర్థిగా ఛాన్స్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. కానీ నెగ్గలేకపోయారు దువ్వాడ. అయితే ఆయనలో ఉన్న దూకుడు మెచ్చి కానీ ఇప్పుడు జిల్లా నేతలను కాదని దువ్వాడకుపార్టీలో ఎంట్రీ ఇచ్చే అవకాశం లేదు. అలాగని దువ్వాడ టిడిపిని విపరీతంగా వ్యతిరేకిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని అభిమానిస్తున్నారు. ఒకవేళ ఇండిపెండెంట్గా పోటీ చేసి.. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తన ప్యానల్స్ పెట్టి పోటీ చేస్తే మూల్యం చెల్లించుకునేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అయితే దువ్వాడ సైతం తనకు టిక్కెట్ ఇవ్వకపోతే ప్రధమ శత్రువుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని మాత్రమే చూసే అవకాశం ఉంది.

అందాల ’దివి’..అలా రెచ్చగొట్టకే మళ్లీ మళ్లీ..

Divi Vadthya Photos
Divi Vadthya Photos

విజయ్ ద్వారా రాహుల్.. జగన్ గట్టి ప్రయత్నం!

Rahul gandhi And Jagan
Rahul gandhi And Jagan

Rahul gandhi And Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఇప్పటివరకు బిజెపి పై పల్లెత్తు మాట అనని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా స్వరం పెంచుకుంది. దేశ ప్రజలు పొదుపు పాటించాలని ఏడు అప్పీల్స్ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. వాటిని జాతీయ మిషన్ గా ప్రకటించారు. అయితే ఇప్పుడు వ్యతిరేకంగా వైసీపీ కామెంట్లు పెడుతోంది. గతంలో కేంద్రం ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా శభాష్ అని పొగిడేవారు జగన్. బిజెపి అడగకుండానే మద్దతు తెలిపేవారు. కానీ ఇప్పుడు సడన్ గా రూటు మార్చింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోదీ పొదుపు మంత్రాన్ని బోధిస్తే.. దానిని తప్పు పడుతూ మాట్లాడారు పేర్ని నాని. ప్రధాని స్థాయి నేతను చులకన చేస్తూ మాట్లాడారు.

* సాక్షి మీడియా అతి..
తమిళనాడులో విజయ్ గెలుపుతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన చేంజ్ కనిపిస్తోంది. విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన క్రమంలో సాక్షి మీడియా చూపించిన ప్రత్యేక ఆసక్తి ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. విజయ్ గెలుపును ఒక చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించింది సాక్షి. అంతటితో ఆగకుండా ఆయనకు రాహుల్ గాంధీతో ఉన్న పాత స్నేహాన్ని హైలైట్ చేస్తోంది. అయితే రాహుల్ ను ఎత్తిచూపడం ద్వారా.. ఏపీలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు దిశగా జగన్ ఆలోచన చేస్తున్నారా అనేది ఒక అనుమానం. ఏపీలో జవసత్వాలు లేకుండా ఉంది కాంగ్రెస్ పార్టీ. అయినా సరే ఆ పార్టీకి ఓటు బ్యాంకు ఉంది. మళ్లీ జగన్ రూపంలో పొత్తు పెట్టుకుంటే క్యాడర్ ఉత్సాహంతో పనిచేసి.. ఐదు నుంచి 10% ఓటర్లు యాక్టివ్ అవుతారు. సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న చాలా వర్గాలు తిరిగి యాక్టివ్ అవుతాయి. విజయ్, రాహుల్ గాంధీ మధ్య ఉన్న బంధాన్ని సాక్షి విపరీతంగా ప్రచారం చేయడం చూస్తుంటే.. ఏపీలో ఏదో పొత్తుల వ్యూహం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

* జాతీయ స్థాయి విధానాలపై..
గత కొన్నేళ్లుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విధానాలను పరిశీలిస్తే.. నేరుగా బిజెపి పై కానీ.. ఎన్డీఏ ప్రభుత్వం పై కాని విమర్శించిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు నేరుగా ప్రధానిని టార్గెట్ చేయడం ద్వారా చూస్తుంటే మాత్రం ఏదో ఒక అనుమానం వ్యక్తం అవుతుంది. పైగా ఏపీ రాజకీయాలపై ఎక్కువగా దృష్టి పెట్టే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.. జాతీయస్థాయి విధానాలపై బిజెపిపై విమర్శలు చేయడం చూస్తుంటే మాత్రం పక్క వ్యూహం అన్నట్టు అర్థమవుతోంది. ఇక ముసుగులో గుద్దులాట వద్దు అన్నట్టు ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి. నియోజకవర్గాల పునర్విభజన అంశంపై కూడా జగన్ అభ్యంతరాలు తెలుపుతూ ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.. ఇప్పుడు ఏకంగా ప్రధాని మోదీ వ్యక్తిగత ప్రయాణాలపై కూడా వైసిపి నేతలు మాట్లాడుతున్నారంటే.. బిజెపితో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవడం లేదని.. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యేందుకు ఒక మార్గమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

'ది ప్యారడైజ్' వాయిదా రూమర్స్ పై స్పందించిన మూవీ టీం.. సంచలనం రేపుతున్న లేటెస్ట్ ట్వీట్..

The Paradise Movie Latest Update
The Paradise Movie Latest Update

The Paradise Movie Latest Update: నేచురల్ స్టార్ నాని హీరో గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ది ప్యారడైజ్’ పై అభిమానుల్లో , ప్రేక్షకుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక మీడియం రేంజ్ హీరో సినిమాకు స్టార్ హీరో రేంజ్ హైప్ రావడం చాలా కాలం తర్వాత ఈ చిత్రానికే జరిగింది. ముఖ్యంగా ఈ చిత్రం నుండి విడుదలైన ‘ఆయా షేర్’ పాటకు ఎంతటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఏ ఈవెంట్ లో చూసినా ఈ పాటనే వినిపిస్తోంది. యూట్యూబ్ లో కూడా వందల మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. జెన్ జీ మొత్తం ఈ పాటకు ఒక రేంజ్ లో వైబ్ అవుతున్నారు. అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమా పై చాలా కాలం నుండి ఒక నెగెటివ్ ప్రచారం జరుగుతూ ఉంది.

అదేమిటంటే డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల బౌండెడ్ స్క్రిప్ట్ తో నాని వద్దకు రాలేదని, సన్నివేశాలన్నీ సెట్స్ వద్దనే రాసుకొని తీస్తున్నాడని , ఆ కారణం చేత వంద రోజుల్లో పూర్తి చెయ్యాలని అనుకున్న సినిమా బాగా ఆలస్యం అవుతూ వస్తోందని, రీ షూట్స్ కారణంగా బడ్జెట్ కూడా భారీగా పెరిగిపోయిందని , మార్చి 26 న విడుదల అవ్వాల్సిన ఈ సినిమాని ఆగస్టు 21 కి వాయిదా వేశారని, కానీ షూటింగ్ ఆలస్యం అవుతుండడం వల్ల , ఈ చిత్రం ఆ తేదీన విడుదల అవ్వడం కూడా అసాధ్యమని , ఈ ఏడాది లో విడుదల కష్టమేనని , వచ్చే ఏడాది లోనే ఈ చిత్రానికి మోక్షం లభిస్తుందని , ఇలా ఎన్నో రకాల ప్రచారాలు జరిగాయి. దీనిపై మూవీ టీం నేడు చాలా గట్టిగానే రెస్పాన్స్ ఇచ్చింది. దీంతో నాని అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఇంతకీ ఏమని క్లారిటీ ఇచ్చారో చూద్దాం.

మేకర్స్ మాట్లాడుతూ ‘గత కొన్నిరోజుల నుండి మా ప్యారడైజ్ చిత్రం పై అనవసరమైన రూమర్స్ ప్రచారం అవుతున్నాయి. వాటిపై మేము ఈరోజు క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాము. ప్యారడైజ్ చిత్రాన్ని మొదలు పెట్టే మొదటి రోజే మేము ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ని సిద్ధం చేసుకున్నాము. 100 రోజుల షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నాము. మిగిలిన బ్యాలన్స్ షూటింగ్ మరికొద్దిరోజుల్లోనే పూర్తి చేయబోతున్నాము. సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్నట్టుగా, ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ఒక్క షాట్ ని కూడా మేము రీ షూట్ చెయ్యలేదు. దయచేసి అభిమానులు ఇలాంటి రూమర్స్ ని నమ్మకండి. ‘ది ప్యారడైజ్’ చిత్రం ప్లాన్ చేసిన షెడ్యూల్ ప్రకారమే ఆగస్టు 21 న విడుదల కాబోతుంది’ అంటూ చెప్పుకొచ్చారు.

చిరంజీవి విషయంలో క్లారిటి గా ఉన్న దర్శకుడు... కానీ మెగాస్టార్ ఛాన్స్ ఇవ్వడం లేదు...

Chiranjeevi
Chiranjeevi

Chiranjeevi: గత 50 సంవత్సరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న వారిలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. ఆయన చేసిన సినిమాలు సగటు ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని కూడా పెంచుతున్నాయి. అయితే అతనితో సినిమా చేయడానికి చాలామంది దర్శక నిర్మాతలు ఆసక్తిని చూపిస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి.

ఇక ఇప్పుడు ఆయన ఎవరితో సినిమా చేస్తున్నాడు అనేది చాలా కీలకంగా మారబోతుంది. గతంలో తనకు వాల్తేరు వీరయ్య లాంటి భారీ సక్సెస్ ని అందించిన బాబీ డైరెక్షన్లో మరోసారి నటించడానికి సిద్ధమయ్యాడు. అయితే ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవితో సినిమా చేయడానికి పూరి జగన్నాథ్ చాలా సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాడు. అయిన కూడా చిరంజీవి పూరి జగన్నాథ్ కి సినిమా చేసే అవకాశం ఇవ్వడం లేదు.

చిరంజీవిని ఒక మాఫియా డాన్ గా చూపిస్తే ప్రేక్షకులందరు ఎంటర్ టైన్ అవుతారని ఆలోచిస్తున్న పూరి జగన్నాథ్ కి చిరంజీవి మాత్రం డేట్స్ ఇవ్వకపోవడంతో ఆయన కొంతవరకు డీలా పడిపోతున్నాడు. తన ఎంటైర్ కెరీర్ లో ఒక్కసారైనా సరే చిరంజీవితో సినిమా చేయాలని చూస్తున్న పూరి జగన్నాథ్ ఎప్పటికైనా తన కోరికను నెరవేర్చుకుంటానని తన సన్నిహితుల దగ్గర చెబుతున్నాడట. ఇక పూరి జగన్నాథ్ కి ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు. పూరి మేకింగ్ తనకు నచ్చడం లేదా పూరి జగన్నాథ్ చేసే సినిమాల్లో హీరోలకు సపరేట్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. చిరంజీవి ఇప్పటివరకు చాలా డిఫరెంట్ క్యారెక్టర్ లలో నటించాడు.

కానీ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో నటిస్తే మాత్రం చిరంజీవిని తప్పకుండా టాప్ లెవల్లో చూపిస్తాడు అంటూ అటు చిరంజీవి అభిమానులు, ఇటు పూరి జగన్నాథ్ ఫ్యాన్స్ సైతం వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు… ఇక తొందరలోనే విల్లా కాంబోలో సినిమా స్టార్ట్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

మే 29 నుండి థియేటర్స్ బంద్.. 'పెద్ది' చిత్రానికి కోలుకోలేని షాక్.. అసలు ఏమైందంటే..

Peddi Movie
Peddi Movie

Peddi Movie: తెలంగాణ లో మళ్లీ థియేటర్స్ యాజమాన్యాలు , ఎక్సిభిటర్స్ యుద్ధం మొదలు పెట్టారు. నేడు ఏర్పాటు చేసిన సమావేశం లో మాకు ఎట్టి పరిస్థితిలోనూ కమీషన్ బేసిస్ మీదనే సినిమాలను రన్ చెయ్యాలి అనే ప్రతిపాదన పెట్టారు. ఈ అంశం పై గత కొన్ని రోజుల నుండి చర్చలు నడుస్తూనే ఉన్నాయి, అవి విఫలం అవుతూనే ఉన్నాయి. ఈ విధానం పై దిల్ రాజు వర్గం సుముఖం గానే ఉంది , ఎందుకంటే తెలంగాణ లో అత్యధిక శాతం థియేటర్స్ ఉన్నవి వీళ్ళకే కాబట్టి , కానీ అందుకు ఇతర నిర్మాతలు అసలు ఒప్పుకోవడం లేదు. ముఖ్యంగా మైత్రీ మూవీ మేకర్స్ ఇందుకు పూర్తిగా వ్యతిరేకం. ఈ కారణం చేత , రీసెంట్ గా ఈ సంస్థ నుండి విడుదలైన ‘జెట్ లీ’ చిత్రానికి దిల్ రాజు మరియు ఏషియన్ ప్రాపర్టీస్ లో విడుదల ని బ్యాన్ చేశారు.

ఈ నెలలో మరోసారి సమావేశం ఉంటుందట , ఆ సమావేశం సఫలం అవ్వకుంటే , ఈ నెల 29 నుండి థియేటర్స్ ని బంద్ చెయ్యాలని అనుకుంటున్నారట ఎక్సిభిటర్స్. ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం. అయితే వచ్చే నెల 4 న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నుండి ‘పెద్ది’ చిత్రం విడుదల కాబోతుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ఈ సినిమాకు నైజాం ప్రాంతం లో 60 కోట్ల రూపాయిల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇంత బిజినెస్ జరిగిన ఈ చిత్రాన్ని నాశనం చేసేందుకు దిల్ రాజు గ్యాంగ్ పెద్ద రూట్ మ్యాప్ వేసిందని సోషల్ మీడియా లో సాగుతున్న చర్చ. కాసేపటి క్రితమే దిల్ రాజు సోదరుడు శిరీష్ మాట్లాడుతూ ‘ఇకపై మీరు ప్రభుత్వం నుండి జీవోలు తెచ్చుకున్నా సరే , మా సింగిల్ స్క్రీన్స్ లో మామూలు టికెట్ రేట్స్ మాత్రమే ఉంటాయి’ అంటూ చెప్పుకొచ్చాడు.

అంటే ‘పెద్ది’ చిత్రానికి అత్యధిక టికెట్ రేట్స్ మా థియేటర్స్ లో అనుమతించము అని చెప్పకనే చెప్పారు. అభిమానులను భయపెడుతున్న మరో అంశం ఏమిటంటే , ఈ సినిమాని ‘జెట్ లీ’ లాగానే దిల్ రాజు , ఏషియన్ గ్రూప్స్ కి సంబంధించిన థియేటర్స్, బ్యానర్స్ లో బ్యాన్ చేసే అవకాశం ఉంది. ఇలా జరగడం చాలా అన్యాయం అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఒక నిర్మాత అయ్యుండి , కోట్ల రూపాయిల బిజినెస్ జరిగిన ఒక పెద్ద సినిమాని డ్యామేజ్ చేయాలనీ చూడడం అత్యంత నీచమైన చర్య అని, దిల్ రాజు ఇలాంటి పాలిటిక్స్ ఆపకపోతే భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఎదురుకోవాల్సి వస్తుందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

'తలపతి విజయ్' ని హీరోగా నిలబెట్టడానికి వాళ్ల నాన్న అన్ని ఇబ్బందులు పడ్డాడా...

Thalapathy Vijay father struggles
Thalapathy Vijay father struggles

Thalapathy Vijay father struggles: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో సత్తా చాటుకున్న నటుడు విజయ్…హీరోగానే కాకుండా ఆయన రాజకీయ నాయకుడిగా కూడా తన సత్తా చాటుతున్నాడు. గత రెండు సంవత్సరాల క్రితం స్థాపించిన టీవీకే పార్టీతో ఈసారి అసెంబ్లీ ఎలక్షన్లో పోటీ చేసిన ఆయన 108 సీట్లను కైవసం చేసుకోవడం తమిళనాడు జనాలతో పాటు యావత్ ఇండియాలోని జనాలందరిని ఉలిక్కిపడేలా చేసింది. మొత్తానికైతే ఆయన తమిళనాడు సీఎం గా మారడం ఇప్పటికి ఒక కల లాగే మారిపోయింది. ఇక ఏది ఏమైనా కూడా మొదటిసారి పోటీ చేసి ఎలక్షన్స్ లో గెలవడం అనేది ఎంత ఆషామాషీ వ్యవహారమైతే కాదు. ఒకప్పుడు ఎంజీఆర్, ఎన్టీఆర్ లాంటి వారు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి సీఎంలు గా మారారు. కానీ ఈ తరంలో మాత్రం అలా మారడం చాలా కష్టంతో కూడుకున్న పని ఎందుకంటే తెలుగులో చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి వారు సైతం పార్టీలను స్థాపించి చాలా ఇబ్బందులను ఎదుర్కొన్న సందర్భాలను మనం చూశాం. కానీ విజయ్ మాత్రం అలవోకగా సీఎం పదవిని దక్కించుకోవడంతో అతని అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు…

ప్రస్తుతం విజయ్ తన భార్య బిడ్డలకు దూరంగా ఉంటున్నాడు. కారణం ఏదైనా వాళ్ల నుంచి విడిపోయి ఇలా ఉండడం చాలా బాధాకరమైన విషయమనే చెప్పాలి. ఇక ఇది ఇలా ఉంటే ఆయన భార్యాబిడ్డలను వదిలేయడమే కాదు. ఇంతకుముందు తన తండ్రి అయిన ఎస్ ఏ చంద్రశేఖర్ ని సైతం విజయ్ దూరం పెట్టిన విషయం మనకు తెలిసిందే…గతంలో అతనికి వాళ్ళ నాన్నకు కొన్ని విభేదాలైతే వచ్చాయి… అయితే విజయ్ ని స్టార్ హీరో గా నిలబెట్టడంలో వల్ల నాన్న చంద్రశేఖర్ చాలా కీలకపాత్ర వహించారు. తను ఇతర హీరోలతో చేసిన సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించాయి. చంద్రశేఖర్ తన కొడుకు అయిన విజయ్ ని హీరోగా పెట్టి చేసిన సినిమాలన్నీ ప్లాపులుగా మారాయి. దాంతో అతనికి ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రముఖ ప్రొడ్యూసర్ అయిన ఆర్ బి చౌదరి దగ్గరికి వెళ్లి ప్రతి రోజు అసిస్టెంట్ డైరెక్టర్లు తనకి కథలు చెప్పడానికి ఎలాగైతే తన అరుగు మీద ఎదురుచూస్తూ ఉంటారో అలా చంద్రశేఖర్ ఆర్ బి చౌదరి వెయిట్ చేశాడట…

అది చూసిన ఆర్ బి చౌదరి చంద్రశేఖర్ మీరు ఇలా వెయిట్ చేయడం ఏంటి? నాకు ఒక ఫోన్ చేసి వస్తే అయిపోయేది కదా అని అడిగారట. దాంతో చంద్రశేఖర్ నా కొడుకును హీరోగా నిలబెట్టడానికి శాయశక్తుల ప్రయత్నం చేశాను. నా వల్ల కావడం లేదు ఎలాగైనా సరే మీ బ్యానర్ లో నా కొడుకు హీరోగా ఒక సినిమా చేయాలని చెప్పడంతో అప్పటికే డైరెక్టర్ విక్రమన్ (వసంతం మూవీ డైరెక్టర్) తో ఒక సినిమా చేయడానికి ఆర్ బి చౌదరి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక విక్రమన్ కి కూడా ఇది మొదటి సినిమా కావడంతో ఆర్ బి చౌదరి తనని పిలిచి ఎలాగైనా సరే మనం చంద్రశేఖర్ కొడుకు అయిన విజయ్ ని హీరోగా పెట్టి సినిమా చేస్తున్నాం అని చెప్పాడు…

అప్పటికే విక్రమన్ వేరే హీరోతో ఈ సినిమా చేయాలని అనుకున్నాడు. మరి ఆ హీరోను తీసేసి విజయ్ తో సినిమా చేస్తే తను ఊరుకుంటాడా? అసలే గాను స్టార్ హీరో అని విక్రమన్ చెప్పాడట. దాంతో ఆర్ బి చౌదరి అది నేను చూసుకుంటాను మన కథకి ఈ కుర్రాడు సెట్ అవుతాడు కదా అని అడిగాడట. దాంతో విక్రమన్ సైతం సెట్ అవుతాడని చెప్పాడట. ఒకే నువ్వు విజయ్ తో సినిమాకి సన్నాహాలు చేసుకోమని చెప్పి చౌదరి గారు ఇంతకు ముందు కమిట్ అయిన స్టార్ హీరోతో మాట్లాడి మొత్తానికైతే సెటిల్ చేశారు… ఇక విజయ్ హీరోగా విక్రమన్ దర్శకత్వం లో ‘పూవే ఉనక్కగన్’ అనే సినిమా తెరకెక్కింది…

ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. ఇక ఆ తర్వాత ఈ సినిమాని తెలుగులో జగపతిబాబు హీరోగా భీమినేని శ్రీనివాసరావు ‘శుభాకాంక్షలు ‘ అనే పేరుతో రీమేక్ చేశాడు. ఇక్కడ కూడా సూపర్ సక్సెస్ ని సాధించడంతో జగపతిబాబు సైతం ఎనలేని గుర్తింపును సంపాదించుకున్నాడు…మొత్తానికైతే విజయ్ తన తండ్రి అయిన ఎస్ ఏ చంద్రశేఖర్ తో విభేదాలను పెట్టుకోవడం అనేది సరైనది కాదని తెలుసుకున్న విజయ్ ఎట్టకేలకు వాళ్ళ నాన్నతో కలిసి పోయాడు…ఇక ఆర్ బి చౌదరి రీసెంట్ గా కార్ యాక్సిడెంట్ అయి మరణించాడు. ఆయన చనిపోవడం తమిళ సినిమా ఇండస్ట్రీ కి కోలుకోలేని ఎదురుదెబ్బనే చెప్పాలి…

అల్లు అర్జున్ ఇండస్ట్రీ కి రాకముందు ఆ ఇద్దరు హీరోల కోసం ఏదైనా చేసేవాడా..

Allu Arjun Politics
Allu Arjun Politics

Allu Arjun favorite heroes: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా గుర్తింపును సంపాదించుకున్న ఆయన ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో చేస్తున్న ‘రాకా’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల హృదయాలను దోచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఆయనను టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ప్రస్తుతం చేస్తున్న రాకా సినిమాతో మరోసారి పాన్ ఇండియాలో పెను సంచలనాలను క్రియేట్ చేస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే అల్లు అర్జున్ తనకంటూ ఒక మార్కెట్ ని క్రియేట్ చేసుకొని యావత్ ఇండియన్ సినిమా హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నాడు. అల్లు అర్జున్ ఇండస్ట్రీకి రాకముందు అతనికి ఒక ఇద్దరు హీరోలంటే విపరీతమైన ఇష్టం ఉండేదట. వాళ్లకోసం ఏదైనా చేసేవాడని తన సన్నిహితులు చెబుతుంటారు. ఇంతకీ ఆ హీరోలు ఎవరంటే ఒకరు మెగాస్టార్ చిరంజీవి కాగా, మరొకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కావడం విశేషం…

వాళ్ల సినిమాలు చూసుకుంటూనే పెరిగిన అల్లు అర్జున్ వాళ్ల ద్వారానే నటనలో మేలుకోవాలను సైతం నేర్చుకున్నారట. మొత్తానికైతే చిరంజీవి, పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినప్పటికి వాళ్ళు కనిపించిన ప్రతిసారి అతనిలో ఏదో ఒక ఉత్తేజమైతే కలిగేదట.

అందువల్లే వాళ్ళ రేంజ్ కి ఇతను వెళ్లాలని ఎప్పటికప్పుడు అనుకునేవాడట. మొత్తానికైతే గంగోత్రి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తను ఆ తర్వాత చేసిన వరుస సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించి తనకంటూ ఒక క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే అల్లు అర్జున్ లాంటి నటుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలా అరుదుగా ఉంటారని చాలామంది చెబుతున్నారు.

ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అతనికి విభేదాలేమీ లేకపోయిన కూడా వీళ్ళ మధ్యలో ఇంతకు ముందున్న ర్యాపో లేదనే విషయం మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది…చూడాలి మరి ఫ్యూచర్ లో వీళ్ళ మధ్యన ఉన్న చిన్న చిన్న ఈగో ఫీలింగ్స్ పోయి ఇంతకు ముందులా కలిసి మెలిసి ఉంటారా లేదా అనేది…

మంచు విష్ణు స్టార్ హీరోగా మారకపోవడానికి కారణం ఎవరు..

Manchu Vishnu career issues
Manchu Vishnu career issues

Manchu Vishnu career issues: తెలుగు సినిమా ఇండస్ట్రీలో వైవిధ్యమైన నటుడిగా పేరు సంపాదించుకున్న వాళ్ళలో మోహన్ బాబు మొదటి స్థానంలో ఉంటాడు… ప్రస్తుతం ఆయన తన సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసి విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నాడు. అందుకే ఆయన నాని హీరోగా చేస్తున్న ‘ప్యారడైజ్’ సినిమాలో మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇక మహేష్ బాబు అన్న కొడుకు అయిన జయకృష్ణ హీరోగా చేస్తున్న ‘ శ్రీనివాస మంగాపురం’ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనలోని పూర్తి నటుడిని బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటివరకు మోహన్ బాబు చేసిన పాత్రలన్నింటి కంటే ఇది చాలా భిన్నంగా ఉంటుందట. మోహన్ బాబు కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు మంచు విష్ణు…మోహన్ బాబు ఒకప్పుడు తన టాలెంట్ ను ఉపయోగించి అటు హీరోగా, ఇటు విలన్ గా పలువైవిద్య భరితమైన పాత్రలను పోషించాడు… ఇక విష్ణు కూడా నటనలో తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేసినప్పటికి అది వర్కౌట్ కాలేదు.

ఆయన మొదట్లో ఒకటి రెండు సక్సెస్ లను సాధించిన కూడా అవి ఆయన కెరియర్ ను బిల్డ్ చేయలేకపోయాయి. అందుకే ఆయన ఇండస్ట్రీ కి వచ్చి దాదాపు 20 సంవత్సరాలు దాటినా కూడా ఇప్పటికి ఇంకా స్ట్రాజిలింగ్ లోనే ఉన్నాడు. ఒక్క సక్సెస్ ని సాధించడానికి తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు…

నిజానికి విష్ణు హీరోగా బిల్డ్ అవ్వకపోవడానికి మోహన్ బాబును ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే విష్ణు కి నటనలో చాలా వరకు మేలుకోవాలు నేర్పినప్పటికి ఆయన ఎలాంటి కథలను సెలెక్ట్ చేసుకోవాలి ఎలాంటి సినిమాలు. చేస్తే ఇప్పుడున్న ప్రేక్షకులు ఆదరిస్తున్నారు అనే విషయాలను తనకి చెప్పడంలో మోహన్ బాబు ఫెయిల్ అయ్యాడు.

అందుకే కెరియర్ మొదట్లో ప్లాపులు వచ్చినప్పటికి ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ వచ్చాడు తప్ప సక్సెస్ లను సాధించలేదు. ఢీ, దేనికైనా రెడీ, దూసుకెళ్తా లాంటి సినిమాలు మాత్రమే ఆయన కెరియర్ లో సక్సెస్ఫుల్ సినిమాలు గా నిలిచాయి. గత సంవత్సరం చేసిన కన్నప్ప సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించి పెట్టలేదు. దాంతో ఆయన కొంతవరకు డీలా పడిపోయాడు…

బాలయ్య కి ఇండస్ట్రీ లో క్లోజ్ ఫ్రెండ్ ఎవరంటే..

Balakrishna
Balakrishna

Balakrishna close friend in industry: విశ్వ విఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు కొడుకు, నందమూరి నటసింహం అనే పేరు ప్రఖ్యాతలను పొందిన ఒకే ఒక్కడు బాలయ్య బాబు… ఆయన హీరోగా చేసిన చాలా సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించిపెట్టాయి. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరించడమే కాకుండా నందమూరి ఫ్యాన్స్ ని సైతం అలరిస్తున్నాయనే చెప్పాలి. మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న హీరో కూడా బాలకృష్ణనే కావడం విశేషం…ఈ మధ్యకాలంలో ఆయన నుంచి వచ్చిన సినిమాలు సక్సెస్ లను సాధిస్తున్నాయి… ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలన్నీ అతనికి భారీ సక్సెస్ లను కట్టబెట్టినవే కావడం విశేషం… ఇప్పటివరకు ఆయన ఎప్పుడు చేయనటువంటి వైవిధ్యభరితమైన పాత్రలను సైతం పోషిస్తున్నాడు. ప్రస్తుతం ప్రయోగాత్మకమైన సినిమాలను సైతం చేయడానికి సిద్ధమవుతున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం లో చేసిన సినిమాతో భారీ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు.

ఇక ఇదిలా ఉంటే బాలయ్య బాబు పర్సనల్ లైఫ్ లో చాలా కోపంగా ఉంటాడని ఎవరిని పడితే వాళ్ళను కొడుతుంటాడు అని చాలా మంది చాలా రకాల కామెంట్స్ చేస్తుంటారు. నిజానికి బాలయ్య అలాంటి వ్యక్తి కాదు. అందరితో కలిసిమెలిసి ఉంటాడు తనకు నచ్చని పని ఎవరైనా చేస్తే మాత్రం ఊరుకోడు. ఏదైనా స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా మాట్లాడడానికి ఇష్టపడుతుంటాడు.

అందుకే బాలయ్య బాబుని కొంతమంది విమర్శిస్తుంటే చాలామంది అతన్ని ఇష్టపడుతూ ఉంటారు…ఇక బాలయ్య బాబుకి సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు… ఆయనకు కెరియర్ మొదటి నుంచి వచ్చిన ఫ్రెండ్స్ కొంతమంది ఉంటే సినిమా దర్శకులలో బి.గోపాల్ అతనికి చాలా సన్నిహితమైన వ్యక్తి అంటు బాలయ్య బాబు సైతం పలు సందర్భాల్లో తెలియజేశాడు…

బాలయ్య హీరోగా రాణిస్తున్న క్రమంలో బి.గోపాల్ అతనికి భారీ సక్సెస్ లను అందించాడు. ఆ క్రమంలోనే వీళ్లిద్దరి మధ్య మంచి ర్యాపో కుదిరి బాలయ్య తనని క్లోజ్ ఫ్రెండ్ ల భావిస్తుంటాడు. ఇప్పటికీ వీళ్లిద్దరూ అవకాశం వచ్చిన ప్రతి సారి వాళ్ల ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతుంటారు…

రేపు ప్రధాని సంచలన ప్రకటన.. బాంబు పేల్చబోతున్నారు..

PM Modi Tweet
PM Modi Tweet

PM Modi big announcement tomorrow: దేశవ్యాప్తంగా ప్రజలు పొదుపు పాటించాలని, ఖర్చులు తగ్గించుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన చర్యలు కూడా తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మధ్య ఆసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తల నేపథ్యంలో వస్తు ధరలు పెరిగే అవకాశం ఉందని చాలా మంది చర్చించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో కేంద్ర క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది. మే 13న ఉదయం 11 గంటలకు ప్రధాని Narendra Modi అధ్యక్షతన జరిగే ఈ భేటీలో ఇంధన వినియోగ నియంత్రణ, ధరల స్థిరీకరణ, ప్రత్యామ్నాయ విధానాలపై కీలక చర్చ జరిగే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ భేటీలో మోదీ ఎలాంటి బాంబు పేలుస్తారో? అన్న చర్చ సాగుతోంది.

ఇటీవల ప్రధాని మోదీ దేశ ప్రజలకు, ప్రభుత్వ శాఖలకు ఇంధన పొదుపుపై ప్రత్యేక సూచనలు చేశారు. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించేందుకు సాధ్యమైన చోట్ల ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ (WFH) విధానాన్ని ప్రోత్సహించాలని సూచించారు. అవసరం లేని ప్రయాణాలు తగ్గించాలని, ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా విద్యుత్, ఇంధన వినియోగంపై నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రుల బృందం మంగళవారం అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. రవాణా వ్యవస్థ, ఆయిల్ డిపోలు, సరఫరా గొలుసు వ్యవస్థలపై సమీక్ష జరిపి అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని అధికారులకు మార్గనిర్దేశం చేసినట్లు సమాచారం.

మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగొచ్చన్న ప్రచారం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మారడం, దిగుమతి వ్యయాలు పెరగడం వంటి అంశాల ప్రభావం దేశీయ ధరలపై పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీంతో బుధవారం నాటి క్యాబినెట్ సమావేశంలో ధరల నియంత్రణకు సంబంధించి ఏదైనా ప్రకటన వస్తుందా అన్న ఆసక్తి నెలకొంది.

అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ సంస్థలు కొంతవరకు హైబ్రిడ్ లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేయాలని కేంద్రం సూచించే అవకాశముందనే చర్చ కూడా జరుగుతోంది. దీనివల్ల నగరాల్లో ట్రాఫిక్ తగ్గడంతో పాటు ఇంధన వినియోగం కూడా నియంత్రణలోకి వస్తుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. దేశ ఆర్థిక పరిస్థితులు, ఇంధన అవసరాలు, భవిష్యత్ సరఫరా వ్యూహాల దృష్ట్యా ఈ సమావేశం కీలకంగా మారింది. ప్రజలకు భరోసా కలిగించేలా ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంటుందో అనే దానిపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది.

విజయ్ సీఎం అవ్వడం రజిని కి ఇష్టం లేదా.. ? సంచలనం రేపుతున్న లేటెస్ట్ వీడియో..

Rajinikanth reaction to Vijay CM
Rajinikanth reaction to Vijay CM

Rajinikanth reaction to Vijay CM: తమిళ హీరో విజయ్ సీఎం అవ్వడం పై సూపర్ స్టార్ రజినీకాంత్ అసంతృప్తి తో ఉన్నాడా ?, అసలు ఆయనకు విజయ్ అంటే ఎందుకు ఇష్టం లేదు?, విజయ్ తండ్రి దర్శకత్వం వహించిన చిత్రం తోనే రజినీకాంత్ వెండితెర అరంగేట్రం చేశాడు , అతని తండ్రితో రజనీకాంత్ కి మంచి సాన్నిహిత్యం ఉంది, అయినప్పటికీ ఎందుకు విజయ్ అంటే రజినీకాంత్ కి ఇష్టం లేదు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే మొదటి నుండి రజినీకాంత్ విజయ్ గురించి ఏదైనా ప్రశ్న ఎదురైనప్పుడు సమాధానం దాటవేస్తూ వచ్చేవాడు. అంతే కాకుండా, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత , హంగ్ పరిస్థితి ఏర్పడినప్పుడు కూడా రజినీకాంత్ స్టాలిన్ వద్దకు వెళ్లి, అన్నా డీఎంకే తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యమని సూచించినట్టు తమిళ వర్గాల్లో జోరుగా వినిపించిన వార్త.

ఇక ఎన్నికల్లో గెలిచినా రోజున విజయ్ కి శుభాకాంక్షలు తెలిపాడు కానీ, ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మాత్రం ఎలాంటి శుభాకాంక్షలు తెలపలేదు. అందుకే రజనీకాంత్, విజయ్ కి మధ్య దూరం భారీగా పెరిగిపోయిందని , ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ వివాదాలు ఉన్నాయని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వాదనలకు మరింత బలం చేకూరుస్తూ నేడు మరో వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. చెన్నై విమానాశ్రయం లో రజినీకాంత్ నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో మీడియా రిపోర్టర్స్ ఆయన వద్దకు వెళ్లి ‘విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు , దీనిపై మీ స్పందన ఏంటి?’ అని ప్రశ్నించగా, రజినీకాంత్ నవ్వుతూ సమాధానాన్ని దాటవేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. దీని అర్థం ఏంటి?, విజయ్ సీఎం అవ్వడం రజినీకాంత్ కి ఇష్టం లేదు అనే కదా అని కొందరి వాదన.

కానీ సమయం సందర్భం లేకుండా, ఎక్కడ పడితే అక్కడ మీడియా వాళ్ళు ఇలాంటి ప్రశ్నలు అడగడం బాధాకరం అనేది మరికొందరు చెప్తున్న మాట. ఏది ఏమైనా వీళ్లిద్దరి మధ్య ఎందుకో ఎక్కడో తెలియని గ్యాప్ ఏర్పడిందని అందరూ అంటున్నాడు. ఇదంతా పక్కన పెడితే విజయ్ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన రాజకీయ ప్రత్యర్థులందరినీ ఇంటికి వెళ్లి మరీ కలిశాడు . ఆయన సాధ్యమైనంత వరకు పాజిటివ్ వాతావరణం లోనే రాజకీయాలను నడపాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యం లో తన తోటి సినీ నటులను కూడా కలిసే ప్రయత్నం చేస్తాడా లేదా అనేది చూడాలి. ఒకవేళ కలిస్తే రజినీకాంత్ ని కలుస్తాడా లేదా అనేది కూడా ఆసక్తికరమైన అంశం.