Homeఎంటర్టైన్మెంట్Seerat Kapoor: అల్లు అర్జున్ ప్రాపర్టీ అంటూ హీరోయిన్ పై నెటిజెన్స్ అసభ్య కామెంట్స్.....

Seerat Kapoor: అల్లు అర్జున్ ప్రాపర్టీ అంటూ హీరోయిన్ పై నెటిజెన్స్ అసభ్య కామెంట్స్.. ఇచ్చి పారేసిన హీరోయిన్..

Seerat Kapoor: సోషల్ మీడియా లో ఈమధ్య కాలంలో కొంతమంది నెటిజెన్స్ చేసే కామెంట్స్ కి సెలబ్రిటీలు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు , బాధ పడుతున్నారు. ఒకప్పుడు ఈ కామెంట్స్ కి స్పందించే వారు కాదు , కానీ ఇప్పుడు మాత్రం హద్దులు దాటుతుండడంతో తప్పనిసరి పరిస్థితిలో రెస్పాన్స్ ఇవ్వాల్సి వస్తోంది. ముఖ్యంగా హీరోయిన్స్ ఇలాంటి కామెంట్స్ ని అసలు తీసుకోలేకపోతున్నారు. ‘రన్ రాజా రన్’ హీరోయిన్ సీరత్ కపూర్ కి రీసెంట్ గా నెటిజెన్స్ […]

Seerat Kapoor: సోషల్ మీడియా లో ఈమధ్య కాలంలో కొంతమంది నెటిజెన్స్ చేసే కామెంట్స్ కి సెలబ్రిటీలు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు , బాధ పడుతున్నారు. ఒకప్పుడు ఈ కామెంట్స్ కి స్పందించే వారు కాదు , కానీ ఇప్పుడు మాత్రం హద్దులు దాటుతుండడంతో తప్పనిసరి పరిస్థితిలో రెస్పాన్స్ ఇవ్వాల్సి వస్తోంది. ముఖ్యంగా హీరోయిన్స్ ఇలాంటి కామెంట్స్ ని అసలు తీసుకోలేకపోతున్నారు. ‘రన్ రాజా రన్’ హీరోయిన్ సీరత్ కపూర్ కి రీసెంట్ గా నెటిజెన్స్ నుండి అలాంటి అనుభవమే ఒకటి ఎదురైంది. రీసెంట్ గా అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా సీరత్ కపూర్ ఆయనతో ఒక ప్రైవేట్ జెట్ లో తీసుకున్న ఫోటోని అప్లోడ్ చేసి శుభాకాంక్షలు తెలిపింది. ఈ ఫోటో బాగా వైరల్ అయ్యింది. ఈ ఫొటోలో సీరత్ కపూర్ అల్లు అర్జున్ తో చాలా సన్నిహితం గా ఉందని , ఈమె అల్లు అర్జున్ ప్రాపర్టీ అంటూ డబుల్ మీనింగ్ వచ్చేలా కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేశారు.

దీనిపై సీరత్ కపూర్ స్పందిస్తూ ‘లవ్ ఎమోజీలు పెట్టినంత మాత్రానా మీరు చేసే కామెంట్స్ గౌరవప్రదంగా ఉన్నాయని కాదు. ఒక మహిళా ఎవరికీ ప్రాపర్టీ కాదు , ఆమె కూడా మనిషే, ఆమెకంటూ కొన్ని కలలు , కోరికలు , గొంతు , గుర్తింపు ఉంటాయి. దయచేసి చూసుకొని కామెంట్స్ చేయండి , మీ అభిమానం ఒకరిని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు. గ్లామర్ గర్ల్ అనే ముద్ర వేసి , మీ ఇష్టమొచ్చినట్టు మాట్లాడే సంస్కృతి ని ఇక నుండి అయినా ఆపండి’ అంటూ చెప్పుకొచ్చింది. ఆమె కోపాన్ని వ్యక్తం చేసిన తీరుకి నెటిజెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇకపోతే అందం , అభినయం ఉన్నప్పటికీ ఎందుకో సీరత్ కపూర్ అనుకున్నంత స్థాయిలో గుర్తింపు ని సంపాదించలేకపోయింది. సినిమాలు చేస్తూనే ఉంది కానీ , మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్లు దొరకడం లేదు , సెకండ్ హీరోయిన్ రోల్స్, లేదంటే వేరే ఏదైనా చిన్న క్యారెక్టర్స్ తోనే ఆమె కెరీర్ ని సాగిస్తోంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper