Home Blog Page 278

గుండెలను కదిలిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ల పోస్ట్..

Afghanistan Cricketers Emotional Post
Afghanistan Cricketers Emotional Post

Afghanistan Cricketers Emotional Post: క్రికెట్ ను జెంటిల్మెన్ గేమ్ అంటారు. 11 మంది మాత్రమే ఆడే ఈ ఆటలో ఉద్వేగాలు తారస్థాయిలో ఉంటాయి. ఆ సమయంలో ఆటగాళ్ల మధ్య బలమైన బంధాలు ఏర్పడుతుంటాయి. ఆ బంధాలను ఆటగాళ్లు నిజ జీవితంలో కూడా కొనసాగిస్తుంటారు. ఇది ఒకప్పటి మాట.. ఇప్పుడు క్రికెట్ మొత్తం జెంటిల్మెన్ గేమ్ కాకుండా.. కాసుల క్రీడగా మారిపోయింది.. ప్రీమియర్ లీగ్ లు అందుబాటులోకి రావడంతో ఆటగాళ్ల మధ్య బలమైన బంధాలు ఉండడం లేదు. పక్కా కమర్షియల్ అన్న తీరుగానే ఆటగాళ్ల వ్యవహారం సాగుతోంది. చివరికి జాతీయ జట్లకు ఆడుతున్న ఆటగాళ్ల మధ్య కూడా హాయ్ బాయ్ అన్నట్టుగానే రిలేషన్స్ ఉంటున్నాయి.

ఇటువంటి పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు ప్రపంచ క్రికెట్ కు సరికొత్త పాఠాలు నేర్పారు. అసలే ఆఫ్ఘనిస్తాన్ దేశంలో పరిస్థితులు ఏమాత్రం బాగుండవు. క్రికెటర్లకు అనుకూలంగా పరిస్థితులు ఉండవు. పైగా అక్కడ ఆ దేశ ప్రభుత్వం క్రికెట్ ఉన్నతికి ఏమాత్రం ప్రోత్సాహం అందించదు. కేవలం ఆటగాళ్లు తమ వ్యక్తిగత ఇష్టంతోనే క్రికెట్ ఆడుతూ ఉంటారు. విపరీతంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కాబట్టి అంతర్జాతీయ మ్యాచులలో సంచలన విజయాలు సాధిస్తూ ఉంటారు.

అటువంటి ఆఫ్గనిస్తాన్ జట్టు క్రికెటర్లు ప్రపంచ క్రికెట్ కు సరికొత్త జ్ఞానోదయం కలిగించారు. క్రికెట్ అంటే మైదానంలో మాత్రమే కాదని.. బయట కూడా బలమైన బంధాలు ఏర్పరచుకునే ఆటగాని నిరూపించారు. ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లలో చాలామంది ప్రస్తుతం ఇండియాలో ఉన్నారు. వీరంతా కూడా ఐపీఎల్ ఆడుతున్నారు. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు మొత్తం ఢిల్లీ వెళ్లారు. అక్కడ గ్రేటర్ నోయిడాలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆఫ్ఘనిస్తాన్ మాజీ క్రికెటర్ షాపూర్ జద్రాన్ ను పరామర్శించారు. అతడు అత్యంత ప్రాణాంతకమైన హెమో పాగో సైటిక్ లింఫో హిస్టియోసిస్ అనే ప్రానంతకమైన వ్యాధితో బాధపడుతున్నాడు. జద్రాన్ ను ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు రషీద్, నబి.. ఇంకా కొంతమంది క్రికెటర్లు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు భావోద్వేగానికి గురయ్యారు. ఆస్పత్రిలో జద్రాన్ పడుతున్న ఇబ్బందికి అక్షర రూపం కల్పించారు.

” చావు బతుకులతో ఇబ్బంది పడుతున్న ప్రియమిత్రుడు జద్రాన్ గ్రేటర్ నోయిడాలోని ఓ ఆసుపత్రిలో పరామర్శించాల్సి వచ్చింది. అతడు మైదానంలో ఎలాంటి ఆట తీరు కొనసాగిస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైదానం లోనే కాదు.. ఇప్పుడు జీవితానికి సంబంధించిన పోరాటంలో అతడు అదే స్థాయిలో పటిమను చూపిస్తున్నాడు. అతడు విజయం సాధిస్తాడని అనుకుంటున్నాను. ఆస్పత్రి బెడ్ మీద అతడు అలా ఉండడం బాధగా ఉంది. త్వరలోనే అతడు కోలుకొని రావాలని కోరుకుంటున్నాను అని” ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు నబి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. జద్రాన్ వన్డేలలో 44.. టి20లలో 36 మ్యాచులు ఆడాడు. 38 సంవత్సరాల వయసు ఉన్న ఇతడు రెండు ఫార్మాట్లలో 80 వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఆఫ్గనిస్తాన్ జట్టు తరఫున 2020లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.

'విశ్వంభర 2' ఉంటుందా...ముందైతే ఫస్ట్ పార్ట్ రిలీజ్ డేట్ చెప్పండి...

Viswambhara 2 Sequel Update
Viswambhara 2 Sequel Update

Viswambhara 2 Sequel Update: గత 50 సంవత్సరాలుగా ఇండస్ట్రీ కి ఎనలేని సేవలను అందిస్తూ ముందుకు దూసుకెళుతున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి… ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేయగలిగే సత్తా తనకి ఉన్నప్పటికి ఆయన కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం అవుతున్నాడు. ఇప్పుడు వశిష్ట డైరెక్షన్లో చేసిన విశ్వంభర సినిమా రిలీజ్ కి రెడీ అవుతోందంటూ మేకర్స్ నుంచి చాలా వరకు అనౌన్స్ మెంట్స్ వచ్చిన కూడా అవేవీ కార్యరూపం దాల్చడం లేదు. గత సంవత్సరం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నప్పటికి ఈ సినిమా అనుకున్న రీతిలో రాలేదనే ఉద్దేశ్యంతో ఈ సినిమానైతే ఆపేసారు. ఇక ఇప్పటికైనా ఈ సినిమాని రిలీజ్ చేస్తారా? లేదా అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి.

ఇక చిరంజీవి సైతం ఈ సినిమా 2026 సమ్మర్ కి ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఒక వీడియో రిలీజ్ చేశాడు. అయినప్పటికి ఈ సినిమా ఇంకా ఇప్పటి వరకైతే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయలేదు. దానికి తోడుగా మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ సినిమా మీద పెద్దగా ఆసక్తిని చూపించడం లేదనే వార్తలు కూడా వస్తున్నాయి.

ఇక ఇప్పుడు సినిమా యూనిట్ నుంచి విశ్వంభర సినిమాకి సీక్వెల్ గా విశ్వంభర 2 కూడా ఉంటుంది అంటూ అనౌన్స్ చేస్తున్నారు. దాంతో విసిగిపోయిన ప్రేక్షకులు ముందైతే మొదటి పార్ట్ రిలీజ్ చేయండి. ఆ తర్వాత సెకండ్ పార్ట్ గురించి ఆలోచించొచ్చు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఎందుకని ఈ సినిమా విషయంలో మేకర్స్ అంతలా భయపడుతున్నారు.

ప్రేక్షకులకు నచ్చుతుందా? నచ్చదా అని ఒకటికి పది సార్లు చెక్ చేసి మరి ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు… సినిమా అవుట్ పుట్ బాగా వచ్చినప్పుడు సిజి వర్క్ ఉన్నా కూడా ప్రేక్షకులు దాన్ని అడ్జస్ట్ చేసుకుంటారు. కానీ వీళ్ళు మాత్రం పూర్తిగా సిజీ మీదనే డిపెండ్ అయినట్టుగా తెలుస్తుంది. కేవలం సీజీ వర్క్ హైలెట్ గా నిలిస్తే చాలు సినిమా సినిమా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు. కానీ కథలోని ఎమోషన్ ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయగలిగితే ఎలాంటి సినిమా అయిన సరే సూపర్ సక్సెస్ ను సాధిస్తుంది…

ఈసారి మోత మోగిపోద్దీ.. ధరలు భారీగా పెరుగుతాయట.. ముందే సర్దుకోండి..

Fuel Price Hike In India
Fuel Price Hike In India

Fuel Price Hike In India: పశ్చిమాసియా యుద్ధం ప్రభావంతో ప్రపంచంపై తీవ్రంగా ఉంది. ఇప్పటికే చమురు ధరలు భారీగా పెరిగాయి. హర్మూజ్‌ మూసివేతతో చమురు సరఫరా నిలిచిపోయింది. దీంతో యురోపియన్‌ యూనియన్‌ దేశాలతోపాటు పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, జపాన్‌ తీవ్రంగా ప్రభావం ఎదుర్కొంటున్నారు. రెండు నెలలు భారత్‌ సర్దుబాటుతో నెట్టుకొచ్చింది. తాజాగా ప్రజలపై భారం వేయాల్సిన పరిస్థితి వచ్చింది. సామాన్యుల జేబును ఖాళీ చేయబోతోంది. వంట గ్యాస్‌ నుంచి పాల వరకు అన్ని ధరలు పెరుగుతున్నాయి.

ఇప్పటికే పెరిగిన ధరలు..
ఇప్పటికే కుకింగ్ ఆయిల్ లీటర్‌కు రూ.150 నుంచి రూ.177-190కి వరకు అంటే సుమారు 20 శాతం పెరిగాయి. అమూల్‌, మదర్‌ డెయిరీ పాల ధరను లీటర్‌కు రూ.2 పెంచాయి, గతేడాది 12 శాతం పెరిగింది. ఇక ఎల్‌పీజీ 14.2 కేజీల సిలిండర్‌ ధర రూ.50 నుంచి రూ.100 పెరిగే అవకాశం ఉంది. సబ్బులు, షాంపూలు ధరలు కూడా 15 నుంచి 20 శాతం పెరుగుతాయని సమాచారం. కూరగాయల ధరలు 18 శాతం, పండ్ల ధరలు 22 శాతం పెరిగే అవకాశం ఉంది.

పెరుగుదలకు కారణాలు..
అమెరికా ఇరాన్‌ యుద్ధం కారణంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు బ్యారెల్‌కు వంద డాలర్ల వరకు చేరింది. యుద్ధానికి ముందు 80 నుంచి 85 డాలర్లు ఉండేది. ఇక దేశీయంగా పశు ఆహారం 30 శాతం పెరిగింది. ఇది పాల ధరలను ప్రభావితం చేసింది. సప్లై చైన్ దెబ్బతినడం, జీఎస్టీ పెంపు ధరలపై ప్రభావం పడింది.

ఆర్థిక పరిణామాలు…
ధరల పెరుగుదలతో ఒక కుటుంబం నెల ఖర్చు రూ.18 వేలకు పెరుగుతుందని అంచనా. ఇప్పటికే మధ్యతరగతి ఆదాయం 12% తగ్గింది. దీంతో జీడీపీ పడిపోయే అవకాశం ఉంది. పేదలకు ధరలు భారంగా మారనున్నాయి. దీంతో ఆర్‌బీఐ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

ప్రభుత్వం ఆయిల్ రిజర్వ్ విడుదల, ఎగుమతి డ్యూటీ తగ్గింపు చేసింది. వ్యవసాయ సాంకేతికత, రెన్యూబల్ ఇంధనాలు, యాంటీ-హోర్డింగ్ చట్టాలు కీలకం. ప్రజలు లోకల్ మార్కెట్లు, బల్క్ బైయింగ్ ఎంచుకోవాలి. ధరల పెరుగుదలను అరికట్టకపోతే ఆర్థిక అస్థిరత పెద్ద సంక్షోభానికి దారితీస్తుంది.

బండి భగీరథ కేసు.. హైకోర్టు లో ఊహించని ట్విస్ట్.. ఏం జరగనుంది..

Bandi Bhagirath Case
Bandi Bhagirath Case

Bandi Bhagirath Case: ఫోక్సో కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ.. ముందస్తు బెయిల్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టులో వేసిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. ఈ విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు బండి సంజయ్ కుమారుడి కేసును మరో మలుపు తిప్పాయి .

బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాధితురాలు వయసు విషయంలో క్లారిటీ లేదని హైకోర్టు స్పష్టత ఇచ్చింది. ఒక్కొక్క సర్టిఫికెట్ లో ఒక్క విధమైన డేటాఫ్ బర్త్ ఉందని భగీరథ తరఫు లాయర్ నిరంజన్ రెడ్డి కోర్టుకు విన్నవించారు. దీనిపై హైకోర్టు స్పందించింది. బాధితురాలి వయసు పై పోలీసులు నిర్ధారణ చేయాలని హైకోర్టు సూచించింది. ఈ కేసు కు సంబంధించి మద్యం తర బెయిల్ విషయంలో శుక్రవారం తీర్పు వెలుపడే అవకాశం ఉంది.

ఇప్పటికే భగీరథ పై కఠిన చర్యలు తీసుకోవాలని గులాబీ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత భగీరథ పై లుక్ అవుట్ నోటీస్ జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.. గులాబీ పార్టీ నేతలు సోషల్ మీడియాలో బండి భగీరథకు వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ట్విట్టర్ వేదికగా కేటీఆర్ అయితే బండి సంజయ్ ని లక్ష్యంగా చేసుకొని తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.. దీంతో ఈ కేసు రాజకీయంగా పెను దుమారాన్ని రేపుతోంది.. బండి భగీరథ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు కావడంతో రాజకీయంగా తెలంగాణలో కలకలం రేపుతోంది.

బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ మీద ఫిర్యాదు చేసిన ఆ యువతి కి సంబంధించిన కొన్ని కీలక వీడియోలను సోషల్ మీడియాలో కొంతమంది పోస్ట్ చేశారు. అయితే ఆ యువతి మైనర్ కాదని వారు వాదిస్తున్నారు. పైగా ఆమె మద్యం తాగుతున్నట్టు.. స్నేహితులతో విలాసాలకు పాల్పడుతున్నట్టు ఆ వీడియోలో ఉంది. బండి భగీరథ మీద హాని ట్రాప్ జరిగిందని.. అందువల్లే అతడిని ఈ స్థాయిలో ఇబ్బంది పెడుతున్నారని బిజెపి నేతలు అంటున్నారు. ఇటీవల హనుమాన్ జయంతిని పురస్కరించుకొని బండి సంజయ్ కూడా కరీంనగర్ గడ్డమీద కీలక వ్యాఖ్యలు చేశారు. తనను రాజకీయంగా కొంతమంది ఇబ్బంది పెడుతున్నారని.. తన కొడుకును వేదనకు గురి చేస్తున్నారని.. వారందరి భరతం పడతానని బండి సంజయ్ హెచ్చరించారు.. గురువారం హైకోర్టులో బండి భగీరథకు సంబంధించిన మద్యంతర బెయిల్ విచారణలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. శుక్రవారం ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారింది. ఒకవేళ బాధితురాలి డేట్ అఫ్ బర్త్ విషయంలో క్లారిటీ లేకపోతే అప్పుడు ఈ కేసు మరో మలుపు తీసుకునే అవకాశం ఉంది.

రష్మిక మొదటి ఆడిషన్ వీడియో చూశారా ..? ఎంత కష్టపడిందో చూస్తే ఆశ్చర్యపోతారు..

Rashmika Mandanna first audition video
Rashmika Mandanna first audition video

Rashmika Mandanna first audition video: దేశం లోనే ప్రస్తుతం టాప్ మోస్ట్ హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా రష్మిక మందాన ఉంటుంది. కన్నడ లో ‘కిరిక్ పార్టీ’ అనే చిత్రం తో ఈమె ప్రస్థానం మొదలైంది. ఈ సినిమా అంత పెద్ద హిట్ అవుతుందని బహుశా ఆమె అనుకొని ఉండదు. అలా యాక్సిడెంటల్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈమెని , మన టాలీవుడ్ కి పరిచయం చేసింది మాత్రం హీరో నాగ శౌర్య నే. ఆయన తల్లి నిర్మాతగా వ్యవహరించిన ‘ఛలో’ చిత్రం ద్వారానే ఈమె మన ఆడియన్స్ కి పరిచయం అయ్యింది. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వడం , ఆ తర్వాత వెంటనే ‘గీతా గోవిందం’ చిత్రం చేయడం వంటివి జరిగాయి. ‘గీతా గోవిందం’ సంచలన విజయం సాధించిన తర్వాత రష్మిక కి మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

వరుసగా సినిమాలు చేస్తూ , హిట్ మీద హిట్ అందుకుంటూ , బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి , అక్కడ ‘యానిమల్’, ‘పుష్ప 2’, ‘చావా’ లాంటి సంచలనాత్మక బ్లాక్ బస్టర్స్ లో హీరోయిన్ గా నటించి , పాన్ ఇండియా లెవెల్ లో లేడీ సూపర్ స్టార్ గా మారిపోయింది. ఇక గత ఏడాది ఈమె ప్రధాన పాత్ర పోషించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రం ఎంత పెద్ద కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో అందరికీ తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే రష్మిక కి ఎలాంటి ఫిలిం బ్యాక్ గ్రౌండ్ లేదు. ఒక సాధారణ అమ్మాయి గా , ఆడిషన్స్ ద్వారా ఎంపికై ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. ఆమె ఆరోజుల్లో ‘కిరిక్ పార్టీ’ చిత్రం కోసం ఇచ్చిన ఒక ఆడిషన్ కి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

ఈ వీడియో లో రష్మిక చాలా కూల్ నటించడం గమనార్హం. ఈ ఆడిషన్ చేస్తున్నది మరెవరో కాదు, ‘కాంతారా’ సిరీస్ హీరో రిషబ్ శెట్టి. ‘కిరిక్ పార్టీ’ చిత్రానికి దర్శకుడు కూడా ఆయనే. ఈ చిత్రం లో హీరోగా నటించిన రక్షిత్ శెట్టి తో అప్పట్లో రష్మిక ప్రేమాయణం నడిపింది , వీళ్లిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత రష్మిక కొన్నాళ్ళకు విజయ్ దేవరకొండ తో ప్రేమలో పడడం, రీసెంట్ గానే వీళ్లిద్దరు పెళ్లి చేసుకోవడం వంటి సంఘటనలు జరిగాయి. ఇకపోతే సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి రష్మిక మొదటి ఆడిషన్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

 

View this post on Instagram

 

A post shared by Mega9tv Telugu (@mega9tv_telugu)

1 కాదు.. 2 కాదు.. ఏకంగా 3.. 'మే 20' ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు..

NTR
NTR

NTR fans unforgettable May 20: జూన్ 20 న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు ని ఆయన అభిమానులు ఎంత ఘనంగా జరుపుకుంటారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు, సంబరాలు , బ్యానర్స్ లతో అభిమానులు ఒక పెద్ద పండుగ లాగా జరుపుకుంటారు. ఈ ఏడాది కూడా అదే రేంజ్ లో జరుపుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ , ఆయన కొత్త చిత్రాలకు సంబంధించిన అప్డేట్స్ ని కూడా ఇవ్వబోతున్నారు మేకర్స్. ముందుగా మే 20 న, అర్థ రాత్రి 12 గంటలకు ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ మూవీ గ్లింప్స్ వీడియో ని విడుదల చేయబోతున్నారు. ఈ గ్లింప్స్ వీడియో ని రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్నీ ప్రాంతాల్లోనూ LED స్క్రీన్స్ తో ప్రదర్శించేందుకు అభిమానులు పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకున్నారు.

అదే విధంగా అభిమానుల్లో ఎప్పటి నుండో ఉన్నటువంటి అనుమానాలకు కూడా ఈ పుట్టినరోజు వేడుక ద్వారా క్లారిటీ ఇవ్వబోతున్నారు మేకర్స్. పూర్తి వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గానే కొరటాల శివ బాలయ్య బాబు తో ఒక సినిమా చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేశారు. దీంతో ‘దేవర 2’ ఆగిపోయింది , ఇక ఆ చిత్రం ఉండకపోవచ్చు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అభిమానులు కూడా ‘దేవర 2’ రావడం అసాధ్యం అని ఫిక్స్ అయిపోయారు. అయితే మే 20 న ‘దేవర 2’ కి సంబంధించిన బ్లాస్టింగ్ అప్డేట్ కూడా ఇవ్వబోతున్నారట మేకర్స్. ఇది కాసేపు పక్కన పెడితే ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ‘గాడ్ ఆఫ్ వార్’ అనే చిత్రం చేయబోతున్నట్టు , నిర్మాత నాగవంశీ అధికారిక ప్రకటన చేశాడు. కానీ కొన్నాళ్ళకు ఈ చిత్రం ఎన్టీఆర్ నుండి అల్లు అర్జున్ కి షిఫ్ట్ అయ్యిందని వార్తలు వచ్చాయి.

సోషల్ మీడియా లో ఈ సినిమా కోసం ఎన్టీఆర్ , అల్లు అర్జున్ అభిమానులు ఒక రేంజ్ లో ఫ్యాన్ వార్స్ కూడా చేసుకున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి కూడా మే 20 న ఒక కీలక అప్డేట్ రాబోతుంది అట. ఇలా ఒకే రోజున ఒకటి కాదు , రెండు కాదు , ఏకంగా మూడు అప్డేట్స్ రాబోతున్నాయి. ఎన్టీఆర్ అభిమానులు జీవితం లో ఎప్పటికీ మర్చిపోలేని రోజుగా , ఈ పుట్టినరోజు మారబోతుంది. వీటితో పాటు ఎన్టీఆర్ కెరీర్ లో ఎంతో స్పెషల్ గా నిల్చిన ‘ఊసరవెల్లి’ చిత్రాన్ని కూడా మే 20 న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాకు కూడా మంచి రెస్పాన్స్ రానుంది, ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగున్నాయి.

అల్లు అర్జున్ స్టైల్ ని అనుకరిస్తే జైలు శిక్ష తప్పదా..? సంచలన నిర్ణయం తీసుకున్న 'రాకా' మేకర్స్..

Raaka makers sensational decision
Raaka makers sensational decision

Raaka makers sensational decision: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన ద్రుష్టి మొత్తం ‘రాకా’ చిత్రం మీదనే పెట్టాడు. వాస్తవానికి ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ వచ్చే నెల తో పూర్తి అవ్వాలి. కానీ డైరెక్టర్ అట్లీ అత్యధిక సన్నివేశాలను రీ షూట్ చేసే పరిస్థితి రావడం తో కుదర్లేదు. కనీసం ఈ ఏడాది లోపు అయినా పూర్తి అవుతుందా అంటే అనుమానమే. రీసెంట్ గానే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనికి ఫ్యాన్స్ , ఆడియన్స్ నుండి అనుకున్నంత రెస్పాన్స్ అయితే రాలేదు. ఫస్ట్ లుక్ సంగతి పక్కన పెడితే , ఈ చిత్రాన్ని అన్ని విధాలుగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి ఏ మాత్రం తగ్గిపోకుండా తీస్తున్నాడట డైరెక్టర్ అట్లీ. త్వరలోనే గ్లింప్స్ వీడియో ని కూడా విడుదల చేయబోతున్నారట.

ఇది కాసేపు పక్కన పెడితే మూవీ టీం ఈ చిత్రానికి సంబంధించి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో అల్లు అర్జున్ కి అనేక మ్యానరిజమ్స్ , సిగ్నేచర్ స్టెప్పులు ఉంటాయట. వాటిని ఎవ్వరూ అనుకరించకుండా , భద్రతా కల్పించే ఆలోచన లో ఉన్నారట. అంటే సోషల్ మీడియా లో ఎవ్వరూ కూడా ఆ సిగ్నేచర్ మూమెంట్స్ ని కానీ , మ్యానరిజమ్స్ ని అనుకరిస్తూ రీల్స్ , షార్ట్స్ వంటివి చెయ్యకూడదు అన్నమాట, ఒకవేళ చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయి. అంటే సింపుల్ గా మీకు అర్థం అయ్యే భాషలో చెప్పాలంటే అరెస్ట్ కూడా అవ్వొచ్చు అన్నమాట. ఈ మ్యానరిజమ్స్ ని , సిగ్నేచర్ స్టెప్స్ ని ఎక్సక్లూసివ్ గా ఉంచడం కోసమే ఈ నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది.

‘పుష్ప’ చిత్రానికి నార్త్ ఇండియా లో ఆ రేంజ్ క్రేజ్ ఏర్పడడానికి ముఖ్య కారణం ఇన్ స్టాగ్రామ్ లో ఆ చిత్రం లోని పాటలకు నెటిజెన్స్ రీల్స్ చేయడం వల్లే . అంతే కాదు , చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతీ ఒక్కరు కూడా ‘తగ్గేదేలే ‘ మ్యానరిజమ్స్ చేశారు. అందుకే ఆ సినిమాకు ఆ రేంజ్ రీచ్ వచ్చింది, సీక్వెల్ బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించడానికి కారణమైంది. కానీ ‘రాకా’ కి అలా జరగకుండా చూస్తున్నారు మేకర్స్. ఇదొక సరికొత్త ప్రయోగం అనే చెప్పాలి. మరి ఈ ప్రయోగం ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి , ఒకవేళ పొరపాటున బ్యాక్ ఫైర్ అయితే మాత్రం సినిమా ఫలితం పై ప్రభావం పడే అవకాశాలు కూడా లేకపోలేదు , చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

టైమ్ ట్రావెల్ కామెడీ ఎంటర్టైనర్ గా శర్వానంద్ కొత్త చిత్రం.. హీరోయిన్ ఎవరో చూస్తే ఆశ్చర్యపోతారు..

Sharwanand new movie update
Sharwanand new movie update

Sharwanand new movie update: యంగ్ హీరో శర్వానంద్ వరుస ఫ్లాప్ స్ట్రీక్ నుండి బయట పడ్డాడు అనే అనుకోవచ్చు. ఈ సంక్రాంతికి ఆయన నుండి విడుదలైన ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన నుండి విడుదలైన ‘బైకర్’ చిత్రం కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు కానీ, మంచి కంటెంట్ సినిమా అని మాత్రం అనిపించుకుంది. రీసెంట్ గానే నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రెండు చిత్రాలను చూస్తే అర్థం అవుతుంది, శర్వానంద్ ప్రస్తుతం సరైన ట్రాక్ లోనే వెళ్తున్నాడు అనేది. అయితే శర్వానంద్ రీసెంట్ గానే ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల తో కలిసి ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఇప్పుడిప్పుడే మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి శర్వానంద్ వస్తున్నాడు అనుకుంటే , ఇదేమి ట్విస్ట్. వరుస ఫ్లాప్స్ తో ఆడియన్స్ లో పూర్తిగా క్రెడిబిలిటీ కోల్పోయిన శ్రీను వైట్ల తో ఎందుకు సినిమా చేస్తున్నాడు? , మళ్లీ శర్వానంద్ ట్రాక్ తప్పుతున్నాడని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమా కాన్సెప్ట్ గురించి తెలుసుకున్న తర్వాత , శర్వానంద్ మంచి నిర్ణయమే తీసుకున్నాడని అనిపిస్తోంది. ఈ చిత్రం సాధారణమైన రొటీన్ కామెడీ జానర్ కి సంబంధించినది కాదు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కే యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అట. టైం ట్రావెల్ జానర్ లో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి , కానీ కామెడీ ఎంటర్టైనర్ మాత్రం రాలేదు. నేటి తరం ఆడియన్స్ అభిరుచి కి తగ్గట్టుగా, వేరే లెవెల్ లో ఈ స్క్రిప్ట్ ని రెడీ చేసాడట శ్రీను వైట్ల. ఈ చిత్రం తో తన కం బ్యాక్ ఎవ్వరూ ఊహించని విధంగా ఉండాలని డిజైన్ చేశాడట.

ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్ రోల్ కోసం ముందుగా పూజ హెగ్డే ని తీసుకుందామని అనుకున్నారు కానీ , ప్రస్తుతం ఆమె డేట్స్ ఖాళీ లేకపోవడం తో మిస్ ఇండియా రన్నరప్ మానస వారణాసి ని ఎంచుకున్నారట. రీసెంట్ గానే ఈమె ‘కపుల్ ఫ్రెండ్లీ’ అనే భారీ యూత్ ఫుల్ బ్లాక్ బస్టర్ తో యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. కెరీర్ మంచి ఊపు మీదున్న సమయం లో ఈ చిత్రం లో నటించడానికి ఒప్పుకుంది. ఇది కూడా ఒక విధంగా ఈ చిత్రానికి పాజిటివ్ వైబ్స్ ని కలిగించే విషయం అనే చెప్పొచ్చు. త్వరలోనే షూటింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టి , వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్.

500 కోట్ల సినిమాని రిజెక్ట్ చేసిన విక్టరీ వెంకటేష్.. ఇది మామూలు దురదృష్టం కాదు..

Venkatesh rejected 500 crore movie
Venkatesh rejected 500 crore movie

Venkatesh rejected 500 crore movie: కొన్ని చిత్రాలను వదులుకున్నప్పుడు, అవి కమర్షియల్ గా భారీ బ్లాక్ బస్టర్ గా హిట్ అయ్యినప్పుడు , అయ్యో మా హీరో బంగారం లాంటి సినిమాని మిస్ చేసుకున్నాడే అని బాధ పడుతుంటాము , ఇలాంటి సందర్భాలు దాదాపుగా ఇండియా లో ప్రతీ హీరో అభిమానికి కూడా వచ్చే ఉంటుంది. రీసెంట్ గా అలాంటి సందర్భం విక్టరీ వెంకటేష్ కి కూడా వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే , ఆయన కెరీర్ లో మైలు రాయి లాగా నిల్చిపోయిన చిత్రాల్లో ఒకటి ‘దృశ్యం’. మిస్టిక్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా , మలయాళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘దృశ్యం’ చిత్రానికి రీమేక్. అక్కడ మోహన్ లాల్ హీరో గా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఈ సినిమాని తెలుగు లో వెంకటేష్ తో , తమిళం లో కమల్ హాసన్ తో , హిందీ లో అజయ్ దేవగన్ తో తెరకెక్కించారు.

ఈ చిత్రానికి సీక్వెల్స్ కూడా వచ్చాయి. తెలుగు , మలయాళం భాషల్లో సీక్వెల్స్ కరోనా లాక్ డౌన్ సమయం లో రెడీ అయ్యాయి. అప్పటికి థియేటర్స్ అన్నీ క్లోజ్ ఉండడం తో ఈ రెండు చిత్రాలను అమెజాన్ ప్రైమ్ వీడియో లో నేరుగా విడుదల చేశారు. రెండిటికి కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది . కానీ హిందీ లో అజయ్ దేవగన్ లాక్ డౌన్ తర్వాత థియేటర్స్ లో విడుదల చేయగా, ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది. అప్పుడు తెలుగు , మలయాళం ఒరిజినల్ మేకర్స్ , అయ్యో అనవసరంగా థియేటర్స్ లో విడుదల చేయకుండా పెద్ద పొరపాటు చేశామే అని బాధ పడ్డారు . అయితే రీసెంట్ గానే మలయాళం లో మోహన్ లాల్ ‘దృశ్యం 3’ చిత్రాన్ని పూర్తి చేసాడు.

ఈ నెల 21 న మలయాళం , తమిళం, తెలుగు , కన్నడ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టగా, బుక్ మై షో లో అద్భుతమైన రెస్పాన్ వచ్చింది. బుక్ మై షో గణాంకాల ప్రకారం ఈ చిత్రానికి గడిచిన 24 గంటల్లో 21 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. అతి తక్కువ షోస్ నుండి ఈ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ జరిగిందంటే , పూర్తి స్థాయిలో బుకింగ్స్ ప్రారంభిస్తే ఏ రేంజ్ లో ఉంటుందో అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఈ చిత్రానికి నమోదు అవుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ ని చూస్తుంటే కచ్చితంగా 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసేలా అనిపిస్తుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మలయాళం లోనే ఆ రేంజ్ వసూళ్లు వస్తే , తెలుగు లో వెంకటేష్ కి ఉన్నటువంటి ప్రస్తుత పీక్ మార్కెట్ లో 500 కోట్ల గ్రాస్ ని రాబట్టి ఉండేదని , మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

గ్లోబల్ వైడ్ గా అరుదైన రికార్డు ని నెలకొల్పిన విజయ్ దేవరకొండ - రష్మిక జంట..

Vijay Deverakonda Rashmika rare record
Vijay Deverakonda Rashmika rare record

Vijay Deverakonda Rashmika rare record: ఈమధ్య కాలం లో సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అయిన జంట విజయ్ దేవరకొండ – రష్మిక. ఎన్నో ఏళ్ళ నుండి ప్రేమించుకుంటూ డేటింగ్ చేసిన ఈ జంట , ఈమధ్య కాలంలోనే పెద్దల సమక్షంలో వైవాహిక జీవితం లోకి అడుగుపెట్టారు. పెళ్లి జరిగి రెండు నెలలు కావొస్తున్నప్పటికీ కూడా, ఇప్పటికీ వీళ్లిద్దరికీ సంబంధించిన పెళ్లి ఫోటోలు , వీడియో లు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇన్ స్టాగ్రామ్ లో వీళ్లిద్దరికీ ఉన్నటువంటి క్రేజ్ , ఫాలోయింగ్ మామూలుది కాదు. తెలుగు ఆడియన్స్ తో పాటు వీళ్లిద్దరికీ హిందీ ఆడియన్స్ లో కూడా మంచి క్రేజ్ ఉండడం వల్ల, వీళ్లిద్దరు ఏ చిన్న ఫోటో తమ ఇన్ స్టాగ్రామ్ ద్వారా అప్లోడ్ చేసినా వాటికి మిలియన్ల సంఖ్యలో లైక్స్ వస్తుంటాయి.

ఇప్పుడు వీళ్లిద్దరు కలిసి చేసిన ఒక యాడ్ వీడియో కి ఇన్ స్టాగ్రామ్ లో సెన్సేషనల్ రీచ్ వచ్చింది. పూర్తిహి వివరాల్లోకి వెళ్తే , కొంతకాలం క్రితం వీళ్లిద్దరు కలిసి ‘మన్యవార్ వెడ్డింగ్’ అనే యాడ్ లో కలిసి నటించారు. ఇన్ స్టాగ్రామ్ లో ఈ యాడ్ వీడియో కి 11.5 మిల్లియన్లకు పైగా లైక్స్ వచ్చాయి. దీంతో ప్రపంచం లోనే అత్యధిక లైక్స్ ని సొంతం చేసుకున్న ఏకైక యాడ్ వీడియో గా దీనికి అరుదైన రికార్డు దక్కింది. ఇక వ్యూస్ అయితే దాదాపుగా 104 మిల్లియన్లకు పైగా వచ్చాయి. ఈ రికార్డు ని భవిష్యత్తులో ఏ సెలబ్రిటీ కూడా అందుకోలేరేమో అని అందరూ అనుకుంటున్న సమయంలో, మరోసారి ఈ జంట ద్వారానే ఈ రికార్డు కి గండి పడే ప్రమాదం వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గానే ఈ జంట కలిసి Airbnb అనే యాడ్ లో నటించారు. ఈ యాడ్ వీడియో కి ఇన్ స్టాగ్రామ్ లో ఇప్పటి వరకు 9.1 మిలియన్ లైక్స్ వచ్చాయి.

చూస్తుంటే రాబోయే రోజుల్లో ఈ యాడ్ ‘మన్యవార్ వెడ్డింగ్’ యాడ్ వీడియో రికార్డుని బద్దలు కొట్టేలాగా అనిపిస్తుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. నాకు నేనే పోటీ , నాతో నాకే పోటీ అనే ఫేమస్ పవన్ కళ్యాణ్ డైలాగ్ మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఈ డైలాగ్ ప్రస్తుత పరిస్థితిలో ఈ జంటకు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ జంట చాలా కాలం తర్వాత కలిసి ‘రణబలి’ అనే చిత్రం లో నటిస్తున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీ రేంజ్ లోనే ఉన్నాయి. ఈ రెండు యాడ్ వీడియోస్ కి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే , ఈ సినిమాకు కూడా ఆడియన్స్ నుండి అంతకు మించిన రెస్పాన్స్ వస్తుందేమో అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

వకీల్ సాబ్.. కొత్త అవతారమెత్తిన బెంగాల్‌ మాజీ సీఎం!

Mamata Banerjee viral lawyer look
Mamata Banerjee viral lawyer look

Mamata Banerjee viral lawyer look: మమతా బెనర్జీ… ఫైర్‌ బ్రాండ్‌.. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీని వరుసగా మూడుసార్లు అధికారంలోకి తెచ్చిన ధీశాలి. అయితే అధికారంలో ఉండాలన్న కాంక్షతో బంగ్లాదేశ్‌ నుంచి వస్తున్న వలసదారులను ప్రోత్సహించారు. వారికి స్థానిక గుర్తింపు, ఓటరు కార్డు ఇచ్చి ప్రోత్సహించారు. నేరస్థులకు కొమ్ము కాశారు. ప్రజల ఇబ్బందులను పట్టించుకోలేదు. ఈ క్రమంలో మమత పాలనతో విసిగిపోయిన ఓటర్లు ఇటీవలి ఎన్నికల్లో మమతకు గట్టి షాక్‌ ఇచ్చారు. అయినా మమత తాను ఓటమిని ఒప్పుకోలేదు. సీఎం పదవికి రాజీనామా చేసేది లేదని తెగేసి చెప్పారు. దీంతో గవర్నర్‌ మమత సర్కార్‌ను భర్తరఫ్‌ చేశారు. సువేందు అధికారి నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది.

లాయర్‌గా మమత..
ఇక అధికారంలో ఉన్నప్పుడు అనేక అంశాలపై మమతాబెనర్జీ కోర్టుకు వెళ్లారు. సుప్రీ కోర్టు వరకు న్యాయ పోరాటం చేశారు. నాయశాస్త్రం చదివిన మమత తన కేసులను తానే వాదించుకున్నారు. ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి కావడంతో మరోమారో నల్లకోటు వేసుకుని కోలకతా కోర్టుకు వచ్చారు. ఎన్నికల సందర్భంగా జరిగిన హింస కేసులో టీఎంసీ తరఫున వాదించేందుకు సిద్ధమయ్యారు. ఇది కేవలం న్యాయపోరాటం కాదు..రాజకీయ వ్యూహం. లోక్‌సభ ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ, అతని కుమారుడు శీర్షాన్య బంద్యోపాధ్యాయలతో కలిసి ఆమె హాజరు, ఈ పిటిషన్‌ దాఖలైన నేపథ్యంలో ఆమె ప్రశ్నలు కీలకం.

రెండు వైపులా ఆరోపణలు
ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో రక్తపాతం జరిగింది. నలుగురు ప్రాణాలు కోల్పోయారు, వందలాది మంది గాయపడ్డారు. 200కి పైగా ఎఫ్‌ఐఆర్‌లు, 400కి అధిక అరెస్టులు జరిగాయి.. బీజేపీ విజయాలపై టీఎంసీ కార్యకర్తల దాడులని టీఎంసీ ఆరోపిస్తుంటే, బీజేపీ తమ సానుభూతులపై టీఎంసీ దాడులని ప్రతిఆరోపణలు చేస్తోంది.

సీఎం నుంచి లాయర్‌గా..
మమతా బెనర్జీకి న్యాయవాది నేపథ్యం ఉంది. ఆమె గతంలో బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాలో సభ్యురాలు కూడా. కానీ ముఖ్యమంత్రి పదవి పోవడంతో ఇప్పుడు కోర్టులో నిలబడటం అసాధారణం. ఇది టీఎంసీ బలాన్ని ప్రదర్శిస్తుంది. హింసా ఆరోపణలను రాజకీయ ఆయుధంగా మలచుకోవడానికి ప్రయత్నం. బీజేపీ దీన్ని ’అధికార దుర్వినియోగం’గా చూస్తోంది.

ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారింది. మమతా ఈ పోరాటం ద్వారా తన నాయకత్వాన్ని మరింత బలపరుస్తారా, లేక ఇది రాజకీయ ఓటమికి దారితీస్తుందా? దీర్ఘకాలంలో బెంగాల్‌ డైనమిక్స్‌కు ఇది మైలురాయి.

కరీంనగర్‌ దోపిడీ కేసు.. పోలీసుల చేతిలో 161 తులాలు

Karimnagar robbery case latest news
Karimnagar robbery case latest news

Karimnagar robbery case latest news: తెలంగాణలో ఇటీవల సంచలనం సృష్టించిన కరీంనగర్‌ పీఎంసే జ్యువెల్లరీలో దోపిడీ ఘటనలో పోలీసులు రోజుకో పురోగతి సాధిస్తున్నారు. ఘటన జరిగి పది రోజులు దాటింది. ఇప్పటి వరకు ముగ్గురు దొంగలను పట్టుకున్నారు. బిహార్, బెంగాల్‌లో వీరిని అరెస్టు చేశారు. వీటి నుంచి 161 తులాల బంగారు ఆభరణాలు రికవరీ చేశారు. మాస్టర్‌ మైండ్‌ సుబోద్‌ సింగ్‌తో పాటు మరో 10 మంది పరారీలో ఉన్నారు.

ఏం జరిగిందంటే..
కరీంనగర్‌ పీఎంజీ జ్యువెలరీ దుకాణంపై గ్యాంగ్‌ దాడి చేసి 161 తులాల బంగారాన్ని దోచుకుంది. ఈ దోపిడీ రాష్ట్రవ్యాప్త కలకలం రేపింది. పోలీసులు బిహార్, పశ్చిమ బెంగాల్‌లో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దోచిన మొత్తం బంగారాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు.

మాస్టర్‌ మైండ్‌ సుబోద్‌ సింగ్‌..
బిహార్‌కు చెందిన సుబోద్‌ సింగ్‌ ఈ దోపిడీకి ప్రధాన కుట్రదారుడు. ’ది గోల్డెన్‌ థీఫ్‌’ అనే బిరుదు పొందిన అతను గతంలో కూడా బంగారు దోపిడీలకు పాల్పడ్డాడని పోలీసులు పేర్కొంటున్నారు. అతడితోపాటు మరో 10 మంది బిహార్, ఇతర రాష్ట్రాలకు చెందినవారు పరారీలో ఉన్నారు. వారి మీద ఇప్పటికే లుక్‌ఔట్‌ నోటీజులు జారీ అయ్యాయి.

పోలీసు చర్యలు
పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, మొబైల్‌ ట్రాకింగ్, ఇంటర్‌స్టేట్‌ ఇంటెలిజెన్స్‌తో వేగంగా చర్య తీసుకున్నారు. బంగారం రికవరీ దుకాణానికి భారీ ఆర్థిక లాభం. ప్రస్తుత ధరల్లో దాదాపు 1012 కోట్ల రూపాయల విలువ ఉంటుంది. ముగ్గురు అరెస్టులతో కేసు 30 శాతం పూర్తయిందని అధికారులు తెలిపారు.

ఈ దోపిడీలు అంతర్రాష్ట్ర ముఠాల దూకుడును తెలియజేస్తున్నాయి. బంగార ధరలు భారీగా పెరగడంతో ఇలాంటి దోపిడీలు పెరుగుతున్నాయి. దొంగలను పట్టుకోవడంతో తెలంగాణ పోలీసులు ఈ విజయంతో ప్రశంసలు అందుకున్నారు, కానీ మిగిలిన పరారీదారులు పట్టుబడే వరకు జాగ్రతలు తప్పవు.

భారత్ లో ఇరాన్ విదేశాంగ మంత్రి.. యుద్ధ సంధిలో రాజకీయాల మలుపు

Iran Foreign Minister visit to India
Iran Foreign Minister visit to India

Iran Foreign Minister visit to India: అమెరికా-ఇరాన్ యుద్ధం ప్రస్తుతం హోల్డ్ లో ఉంది. కానీ ఉద్రిక్తతలు మాత్రం కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ భారత్‌కు చేరుకున్నారు. బ్రిక్స్ సదస్సు పేరుతో జరిగిన ఈ తొలి అధికారిక పర్యటన దౌత్య పరంగా ప్రత్యేకమైనది. హర్మూజ్ జలసంధి ద్వారా భారత ఇంధన సరఫరాకు ఆటంకాలు ఎదురవుతున్న సమయంలో ఈ పర్యటన రక్షణాత్మక మలుపుగా మారింది. భారత్ తన ఆర్థిక, భద్రతా ప్రయోజనాలను కాపాడుకునే అవకాశాన్ని సృష్టించుకుంది.

బ్రిక్స్ వేదికపై ఇరాన్ గొంతుక..
బ్రిక్స్ ఆఫీషియల్స్ మీటింగ్ మే 14న(గురువారం), న్యూ ఢిల్లీలో జరుగుతుంది. ఇందులో ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీ పాల్గొనడం ప్రపంచ ఉద్రిక్తతల్లో ఇరాన్ స్థానాన్ని బలపరుస్తుంది. బ్రిక్స్ లో సభ్య దేశాలు భారత్, రష్యా, చైనా మొత్తం 45 శాతం, ప్రపంచ జనాభా 30 శాతం జీడీపీ కలిగి ఉన్నాయి. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇది ఇరాన్‌కు మొదటి అంతర్జాతీయ వేదిక. భారత్ మీడియేటర్‌గా నిలబడి, పర్షియన్ గల్ఫ్ స్థిరత్వానికి దోహదపడగలదు.

కీలక చర్చల అవకాశాలు..
హర్మూజ్ గుండా 20 శాతం చమురు, 25 శాతం ఎల్ ఎన్ జీ సరఫరా జరుగుతుంది. ఇందులో భారత్‌కు 50 శాతం ఎల్ పీ జీ, 30 శాతం చమురు ఈ మార్గం గుండా జరుగుతుంది. యుద్ధం కారణంగా ఎల్ పీ జీ ధరలు 15% పెరిగి, గృహ ఇంధన ఖర్చు రూ.1000 కోట్లు పెరిగింది. అరాఘ్చీతో కేంద్రం నౌకల సురక్షిత రవాణా, రూట్ క్లియరెన్స్‌పై చర్చించే అవకాశం ఉంది.

ద్వైపాక్షిక లాభాలు..
ఈ సందర్శన చాబర్ హార్ట్ పోర్టు, ఐ ఎన్ ఎస్ టి సీ కారిడార్‌ను ముందుకు తీసుకెళ్తుంది. భారత నౌకాదళం ఇప్పటికే 5 షిప్ ఎస్కార్ట్‌లు చేసింది. అయితే, అమెరికా ఒత్తిడి సవాల్ గా మారింది. అరాఘ్చీ పర్యటన భారత్‌ను బలపరుస్తుంది.

బొత్స స్థానంలో ఆమె..

Varudu Kalyani replaces Botsa
Varudu Kalyani replaces Botsa

Varudu Kalyani replaces Botsa: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అధినేత జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని బెంగళూరు వచ్చారు. అక్కడి నుంచి తాడేపల్లి కి చేరుకున్నారు. పార్టీ సీనియర్లతో వరుసగా సమావేశాలు జరుపుతారు. వచ్చే నెల నుంచి ఆయన జిల్లాల పర్యటనలు మొదలు పెడతారని ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి ఆయన పర్యటనలు ఉంటాయని పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. కొత్తగా పార్టీ తరఫున ఒక నియామకం చేపడతారని తెలుస్తోంది.

సీనియర్ గా ఛాన్స్..
మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. 175 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం 11చోట్ల మాత్రమే ఆ పార్టీ గెలిచింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి. కానీ శాసనమండలిలో మాత్రం 30 మందికి పైగా ఎమ్మెల్సీలు ఆ పార్టీకి ఉన్నారు. అక్కడ మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీది తిరుగులేని ఆధిపత్యం. అక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా ఉంది. అందుకే తనకు దక్కని ప్రతిపక్ష హోదా ఒక సీనియర్ కు ఇవ్వాలని భావించారు జగన్మోహన్ రెడ్డి. అలా బొత్స సత్యనారాయణకు చాన్స్ దక్కింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో బొత్స చీపురుపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కానీ విశాఖ స్థానిక సంస్థల నుంచి బొత్సకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి.. శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్ష నాయకుడిగా ఛాన్స్ ఇచ్చారు. అలా ఒక సీనియర్ నాయకుడిగా బొత్స సముచిత స్థానాన్ని దక్కించుకున్నారు.

అనారోగ్య సమస్యలతో..
అయితే ఇటీవల తరచూ బొత్స అనారోగ్యానికి గురవుతూ వస్తున్నారు. రాజకీయాల్లో తీవ్ర ఒత్తిడికి గురవుతూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బొత్సకు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేందుకు వీలుపడటం లేదు. ఇప్పటికే కుటుంబ సభ్యులతో పాటు పిల్లలిద్దరూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా పని చేసేందుకు సిద్ధమయ్యారు. అందుకే బొత్సను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్రియాశీలక పదవుల నుంచి విముక్తి కలిగించాలని కుటుంబ సభ్యులు అధినేత జగన్మోహన్ రెడ్డిని కోరారట. ఆయన సానుకూలంగా స్పందించారట. ఒకవేళ బొత్స వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్ష నాయకుడి పదవి నుంచి వైదొలిగితే తరువాత ఎవరు అనేది మెదులుతున్న ప్రశ్న. అయితే ప్రముఖంగా వినిపిస్తున్న పేరు వరుదు కళ్యాణి. ఆమె వెనుకబడిన వర్గాలకు చెందినవారు. అనకాపల్లి జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. బొత్స స్థానంలో ఆమె ఎంపిక లాంఛనమేనని ప్రచారం నడుస్తోంది. అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.

'జైలర్ 2' ఇప్పట్లో లేనట్టే.. రజినీకాంత్ అభిమానులకు చేదు వార్త..

Jailer 2
Jailer 2

Jailer 2 movie delayed: కోలీవుడ్ లో ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాల్లో వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టేంత సత్తా ఉన్న చిత్రం ‘జైలర్ 2’. 2023 వ సంవత్సరం లో రజిని కెరీర్ ని మలుపు తిప్పిన ‘జైలర్’ చిత్రానికి ఇది సీక్వెల్. అందుకే ఈ సీక్వెల్ పై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. షూటింగ్ కార్యక్రమాలు కూడా రెండు నెలల క్రితమే పూర్తి అయ్యింది. షూటింగ్ పూర్తి అయిన సందర్భంగా మూవీ టీం కేక్ కటింగ్ కూడా చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అయితే ఆగస్టు నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారని సోషల్ మీడియా లో ఒక బజ్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ తేదీన విడుదల చేయడం చాలా వరకు కష్టం అనే టాక్ వినిపిస్తోంది.

ఎందుకంటే కొన్ని సన్నివేశాలను రీ షూట్ చెయ్యాలని రజినీకాంత్ ఆదేశించడం తో , ప్రస్తుతం ఆ సన్నివేశాలను రీ షూట్ చేస్తున్నారు. ఈ రీ షూటింగ్ కే నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉందట. అందుకే జూన్ , ఆగస్టు నెలల్లో విడుదల చెయ్యాలని అనుకున్న ఈ మూవీ ని ఇప్పుడు కృష్ణాష్టమి సందర్భంగా సెప్టెంబర్ 4 న విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే రజిని దర్శనం ఎప్పుడుడెప్పుడు చూసుకుందామా ?, ఎంత తొందరగా చూసుకుందామా ? అని ఆతృతగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఇప్పుడు నిరాశే ఎదురైంది. రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుందో చూడాలి. మరోపక్క ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చకచకా జరుగుతున్నాయి.

ఇదంతా పక్కన పెడితే మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని అయినా విడుదల చేస్తే బాగుంటుందని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ చిత్రాన్ని ప్రకటించిన రోజు ఒక స్పెషల్ వీడియో ని విడుదల చేశారు. అది తప్ప, ఇప్పటి వరకు మరో కంటెంట్ ని విడుదల చేయలేదు. ఇదే అభిమానులను తీవ్రమైన నిరాశకు గురి చేస్తున్న విషయం. టీజర్ విడుదల చేస్తే సినిమా పై ప్రస్తుతం ఉన్న బజ్ పదింతలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది , అన్ని ప్రాంతాల్లోనూ ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరుగుతుంది. ఇప్పటికే మేకర్స్ , ఈ సినిమా తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ కోసం 60 కోట్ల రూపాయిలు డిమాండ్ చేస్తున్నారట.

ఓవర్సీస్ లో 'గేమ్ చేంజర్' కంటే తక్కువ గ్రాస్ ని రాబడుతున్న 'పెద్ది'.. పొరపాటు ఎక్కడ జరిగింది?

Peddi Movie Climax Twist
Peddi Movie Climax Twist

Peddi overseas collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం మీదనే ఇప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ భారీ ఆశలు పెట్టుకుంది. సంక్రాంతి సీజన్ తర్వాత ఒక్కటంటే ఒక్క సరైన హిట్ లేదు, థియేటర్స్ ని మూసుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది. ‘పెద్ది’ ఉంది కాబట్టి సరిపోయింది , లేదంటే థియేటర్స్ ఈ ఏడాది మొత్తం మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది ఏమో. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ ని చూసి , మన తెలుగు రాష్ట్రాల ట్రేడ్ వర్గాలు కాస్త భయపడుతున్నాయి. ఎందుకంటే అడ్వాన్స్ బుకింగ్స్ ని ఓవర్సీస్ లో మొదలు పెట్టి పది రోజులు అయ్యింది. కానీ ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో గ్రాస్ వసూళ్లు నమోదు అవ్వడం లేదు. ఉదాహరణకు నార్త్ అమెరికా నే తీసుకుందాం, ఇక్కడ భారీ హైప్ ఉన్న చిత్రానికి 2 మిలియన్ డాలర్ల నుండి గ్రాస్ వసూళ్లు ప్రీమియర్ షోస్ నుండి నమోదు అవుతాయి.

‘పెద్ది’ కూడా ఆ క్యాటగిరీ కి చెందిన సినిమా అవుతుందని అంతా అనుకున్నారు. కానీ పరిస్థితి చూస్తుంటే ప్రస్తుతానికి అసలు బాగాలేదు. మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టగానే 1 లక్షా 46 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు, ఈ రేంజ్ లో ఆరంభం ఉందంటే కచ్చితంగా ఈ చిత్రం నార్త్ అమెరికా లో ఓజీ, దేవర , కల్కి చిత్రాలను దాటేస్తుందేమో అనుకున్నారు. కానీ ప్రస్తుతం ట్రెండ్ ‘గేమ్ చేంజర్’ కంటే తక్కువగా ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇది నిజంగా మాస్టర్ స్ట్రోక్ అనే చెప్పాలి. అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టి 10 రోజులైంది , ఇప్పటి వరకు ఈ చిత్రానికి కేవలం 2 లక్షల 40 వేల డాలర్లు మాత్రమే వచ్చింది.

నార్త్ అమెరికా పరిస్థితి వీక్ అనుకుంటే, యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి ఇంకా వీక్ గా ఉన్నాయి. ఇక్కడ ‘గేమ్ చేంజర్’ చిత్రానికి 40 వేల టిక్కెట్లు ప్రీమియర్స్ + మొదటి రోజుకి కలిపి అమ్ముడుపోయాయి. కానీ ‘పెద్ది’ కి కేవలం 4 వేల టికెట్స్ మాత్రమే ఇప్పటి వరకు అమ్ముడుపోయాయి.’గేమ్ చేంజర్’ చిత్రానికి మొదటి 24 గంటల్లో అమ్ముడుపోయిన టికెట్స్ కౌంట్ ఇది , ఇప్పుడు పెద్ది కి నాలుగు రోజుల సమయం పట్టింది. పరిస్థితి ఇదే రేంజ్ లో కొనసాగితే 20 వేల టిక్కెట్లు కూడా అమ్ముడుపోవడం కష్టమే. ఈ డైనమిక్స్ మొత్తం మారాలంటే థియేట్రికల్ ట్రైలర్ మీదనే అభిమానులు చివరి ఆశ పెట్టుకున్నారు. చూడాలి మరి ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.

చివరి నిమిషంలో వాయిదాపడ్డ సూర్య 'వీరభద్రుడు' మూవీ.. అసలు ఏమైందంటే..

Suriya Veerabhadrudu Twitter Talk
Suriya Veerabhadrudu Twitter Talk

Suriya Veerabhadrudu movie postponed: తమిళ హీరో సూర్య కి ఈమధ్య కాలం లో అసలు టైం కలిసి రావడం లేదు. ఒకపక్క ఆయన చేసే సినిమాలు హిట్ అవ్వడం లేదు , మరోపక్క విడుదల సమస్యలు. నేడు ఆయన హీరో గా నటించిన ‘కరుప్పు ‘ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళ భాషల్లో విడుదల అవ్వాలి. మూవీ టీం ఈమేరకు ప్రొమోషన్స్ కూడా పెద్ద ఎత్తున చేశారు. మరి కొద్దిగంటల్లో సినిమా విడుదల అవ్వబోతుంది అనగా, అకస్మాత్తుగా షోస్ ని క్యాన్సిల్ చేయడం మొదలు పెట్టారు. ఇది సూర్య అభిమానులను తీవ్రమైన నిరాశకు గురి చేసింది. ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఇప్పుడు షోస్ రద్దు చేయడంతో ఈరోజు ఈ చిత్రం విడుదల అవ్వడం లేదనే సంకేతం అభిమానులకు , ప్రేక్షకులకు వచ్చేసింది.

ఆర్థిక సమస్యలు కారణంగానే ఈ సినిమా నేడు విడుదలకు నోచుకోవడం లేదని అంటున్నారు. ఈ ఫైనాన్సియల్ క్లియరెన్స్ కనీసం మ్యాట్నీ షోస్ కి అయినా క్లియర్ అవుతుందని అనుకున్నారు , కానీ అది కూడా జరగలేదు , మ్యాట్నీ షోస్ ని ఇండియా వైడ్ గా రద్దు చేశారు , టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్లకు డబ్బులు రీ ఫండ్ అయిపోయాయి. ఇప్పుడు కనీసం ఫస్ట్ షోస్ నుండి అయినా పరిస్థితులు సర్దుకుంటాయి లేదో చూడాలి. ఒకవేళ ఫస్ట్ షోస్ కి సర్దుకుంటే , వాటిని ప్రీమియర్ షోస్ లాగా భావించవచ్చు , అసలైన విడుదల ని రేపు పరిగణించొచ్చు, చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. సాధ్యమైనంత వరకు ఈ చిత్రాన్ని రేపే విడుదల చేయొచ్చు. గతం లో అనేక తమిళ సినిమాలకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. వాటిల్లో కొన్ని కమర్షియల్ గా హిట్స్ అయ్యాయి కూడా, మరి ‘కరుప్పు’ కి ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.

తెలుగు లో ఈ చిత్రం ‘వీరభధ్రుడు’ అనే టైటిల్ తో విడుదల కాబోతుంది. త్రిష ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించగా, రేడియో బాలాజీ దర్శకత్వం వహించాడు. థియేట్రికల్ ట్రైలర్ ని చూస్తుంటే , మామూలు రొటీన్ కమర్షియల్ సినిమా లాగానే అనిపిస్తోంది. ఈమధ్య కాలం లో ఇలాంటి సినిమాలకు ఆదరణ బాగా తగ్గిపోయిన సంగతి తెలిసిందే. ఒకవేళ పాటలు సూపర్ హిట్ అయ్యుంటే , కచ్చితంగా మంచి హైప్ క్రియేట్ అయ్యేది. కానీ ఈ చిత్రానికి సాయి అభయంకర్ యావరేజ్ మ్యూజిక్ ని అందించాడు. అందుకే ఆడియన్స్ లో ఈ చిత్రం పై అంచనాలు గొప్ప రేంజ్ లో లేవు. కానీ విడుదల తర్వాత ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి.