Homeఎంటర్టైన్మెంట్Peddi overseas collections: ఓవర్సీస్ లో 'గేమ్ చేంజర్' కంటే తక్కువ గ్రాస్ ని రాబడుతున్న...

Peddi overseas collections: ఓవర్సీస్ లో ‘గేమ్ చేంజర్’ కంటే తక్కువ గ్రాస్ ని రాబడుతున్న ‘పెద్ది’.. పొరపాటు ఎక్కడ జరిగింది?

Peddi overseas collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం మీదనే ఇప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ భారీ ఆశలు పెట్టుకుంది. సంక్రాంతి సీజన్ తర్వాత ఒక్కటంటే ఒక్క సరైన హిట్ లేదు, థియేటర్స్ ని మూసుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది. ‘పెద్ది’ ఉంది కాబట్టి సరిపోయింది , లేదంటే థియేటర్స్ ఈ ఏడాది మొత్తం మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది ఏమో. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ ని […]

Peddi overseas collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం మీదనే ఇప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ భారీ ఆశలు పెట్టుకుంది. సంక్రాంతి సీజన్ తర్వాత ఒక్కటంటే ఒక్క సరైన హిట్ లేదు, థియేటర్స్ ని మూసుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది. ‘పెద్ది’ ఉంది కాబట్టి సరిపోయింది , లేదంటే థియేటర్స్ ఈ ఏడాది మొత్తం మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది ఏమో. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ ని చూసి , మన తెలుగు రాష్ట్రాల ట్రేడ్ వర్గాలు కాస్త భయపడుతున్నాయి. ఎందుకంటే అడ్వాన్స్ బుకింగ్స్ ని ఓవర్సీస్ లో మొదలు పెట్టి పది రోజులు అయ్యింది. కానీ ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో గ్రాస్ వసూళ్లు నమోదు అవ్వడం లేదు. ఉదాహరణకు నార్త్ అమెరికా నే తీసుకుందాం, ఇక్కడ భారీ హైప్ ఉన్న చిత్రానికి 2 మిలియన్ డాలర్ల నుండి గ్రాస్ వసూళ్లు ప్రీమియర్ షోస్ నుండి నమోదు అవుతాయి.

‘పెద్ది’ కూడా ఆ క్యాటగిరీ కి చెందిన సినిమా అవుతుందని అంతా అనుకున్నారు. కానీ పరిస్థితి చూస్తుంటే ప్రస్తుతానికి అసలు బాగాలేదు. మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టగానే 1 లక్షా 46 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు, ఈ రేంజ్ లో ఆరంభం ఉందంటే కచ్చితంగా ఈ చిత్రం నార్త్ అమెరికా లో ఓజీ, దేవర , కల్కి చిత్రాలను దాటేస్తుందేమో అనుకున్నారు. కానీ ప్రస్తుతం ట్రెండ్ ‘గేమ్ చేంజర్’ కంటే తక్కువగా ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇది నిజంగా మాస్టర్ స్ట్రోక్ అనే చెప్పాలి. అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టి 10 రోజులైంది , ఇప్పటి వరకు ఈ చిత్రానికి కేవలం 2 లక్షల 40 వేల డాలర్లు మాత్రమే వచ్చింది.

నార్త్ అమెరికా పరిస్థితి వీక్ అనుకుంటే, యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి ఇంకా వీక్ గా ఉన్నాయి. ఇక్కడ ‘గేమ్ చేంజర్’ చిత్రానికి 40 వేల టిక్కెట్లు ప్రీమియర్స్ + మొదటి రోజుకి కలిపి అమ్ముడుపోయాయి. కానీ ‘పెద్ది’ కి కేవలం 4 వేల టికెట్స్ మాత్రమే ఇప్పటి వరకు అమ్ముడుపోయాయి.’గేమ్ చేంజర్’ చిత్రానికి మొదటి 24 గంటల్లో అమ్ముడుపోయిన టికెట్స్ కౌంట్ ఇది , ఇప్పుడు పెద్ది కి నాలుగు రోజుల సమయం పట్టింది. పరిస్థితి ఇదే రేంజ్ లో కొనసాగితే 20 వేల టిక్కెట్లు కూడా అమ్ముడుపోవడం కష్టమే. ఈ డైనమిక్స్ మొత్తం మారాలంటే థియేట్రికల్ ట్రైలర్ మీదనే అభిమానులు చివరి ఆశ పెట్టుకున్నారు. చూడాలి మరి ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper