Suriya Veerabhadrudu movie postponed: తమిళ హీరో సూర్య కి ఈమధ్య కాలం లో అసలు టైం కలిసి రావడం లేదు. ఒకపక్క ఆయన చేసే సినిమాలు హిట్ అవ్వడం లేదు , మరోపక్క విడుదల సమస్యలు. నేడు ఆయన హీరో గా నటించిన ‘కరుప్పు ‘ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళ భాషల్లో విడుదల అవ్వాలి. మూవీ టీం ఈమేరకు ప్రొమోషన్స్ కూడా పెద్ద ఎత్తున చేశారు. మరి కొద్దిగంటల్లో సినిమా విడుదల అవ్వబోతుంది అనగా, అకస్మాత్తుగా షోస్ ని క్యాన్సిల్ చేయడం మొదలు పెట్టారు. ఇది సూర్య అభిమానులను తీవ్రమైన నిరాశకు గురి చేసింది. ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఇప్పుడు షోస్ రద్దు చేయడంతో ఈరోజు ఈ చిత్రం విడుదల అవ్వడం లేదనే సంకేతం అభిమానులకు , ప్రేక్షకులకు వచ్చేసింది.
ఆర్థిక సమస్యలు కారణంగానే ఈ సినిమా నేడు విడుదలకు నోచుకోవడం లేదని అంటున్నారు. ఈ ఫైనాన్సియల్ క్లియరెన్స్ కనీసం మ్యాట్నీ షోస్ కి అయినా క్లియర్ అవుతుందని అనుకున్నారు , కానీ అది కూడా జరగలేదు , మ్యాట్నీ షోస్ ని ఇండియా వైడ్ గా రద్దు చేశారు , టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్లకు డబ్బులు రీ ఫండ్ అయిపోయాయి. ఇప్పుడు కనీసం ఫస్ట్ షోస్ నుండి అయినా పరిస్థితులు సర్దుకుంటాయి లేదో చూడాలి. ఒకవేళ ఫస్ట్ షోస్ కి సర్దుకుంటే , వాటిని ప్రీమియర్ షోస్ లాగా భావించవచ్చు , అసలైన విడుదల ని రేపు పరిగణించొచ్చు, చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. సాధ్యమైనంత వరకు ఈ చిత్రాన్ని రేపే విడుదల చేయొచ్చు. గతం లో అనేక తమిళ సినిమాలకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. వాటిల్లో కొన్ని కమర్షియల్ గా హిట్స్ అయ్యాయి కూడా, మరి ‘కరుప్పు’ కి ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.
తెలుగు లో ఈ చిత్రం ‘వీరభధ్రుడు’ అనే టైటిల్ తో విడుదల కాబోతుంది. త్రిష ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించగా, రేడియో బాలాజీ దర్శకత్వం వహించాడు. థియేట్రికల్ ట్రైలర్ ని చూస్తుంటే , మామూలు రొటీన్ కమర్షియల్ సినిమా లాగానే అనిపిస్తోంది. ఈమధ్య కాలం లో ఇలాంటి సినిమాలకు ఆదరణ బాగా తగ్గిపోయిన సంగతి తెలిసిందే. ఒకవేళ పాటలు సూపర్ హిట్ అయ్యుంటే , కచ్చితంగా మంచి హైప్ క్రియేట్ అయ్యేది. కానీ ఈ చిత్రానికి సాయి అభయంకర్ యావరేజ్ మ్యూజిక్ ని అందించాడు. అందుకే ఆడియన్స్ లో ఈ చిత్రం పై అంచనాలు గొప్ప రేంజ్ లో లేవు. కానీ విడుదల తర్వాత ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి.