Home Blog Page 277

తమిళనాడు రాజకీయాల్లో 'పుష్ప 2' మేనియా.. సీఎం విజయ్ కి ఊహించని షాక్..

Pushpa 2 Dialogues In Politics
Pushpa 2 Dialogues In Politics

Pushpa 2 Dialogues In Politics: ‘పుష్ప’ సిరీస్ అనేది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఒక భారీ బ్లాక్ బస్టర్ సినిమా మాత్రమే కాదు , ఒక కల్చరల్ ఫినామినా అని చెప్పడం లో ఎలాంటి అతిశయం లేదు. ఈ చిత్రం లోని అల్లు అర్జున్ మ్యానరిజమ్స్, డైలాగ్స్ , సన్నివేశాలు మన నిజ జీవితం పై ఎంతో ప్రభావం చూపించాయి. క్రీడాకారుల దగ్గర నుండి , రాజకీయ నాయకుల వరకు , ప్రతీ ఒక్కరు ఈ చిత్రం లోని మ్యానరిజమ్స్ ని , డైలాగ్స్ ని ఉపయోగించే వారే. అంతే కాకుండా ‘పుష్ప 2’ చిత్రం ప్రభావం తెలుగు రాజకీయాలపై ఏ రేంజ్ లో చూపించిందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఈ చిత్రం లోని ‘రప్పా రప్పా’ డైలాగ్ ని వైసీపీ నాయకులూ ఉపయోగించడం పెద్ద సంచలనం గా మారింది.

‘2029 ఎన్నికల్లో మా వైసీపీ పార్టీ అధికారం లోకి రాగానే , ఒక్కొక్కరిని గంగమ్మ తల్లి జాతర లో పొట్టేలు ని నరికినట్టు , రప్పా రప్పా నరుకుతాం’ అని ప్లకార్డులతో వైసీపీ కార్యకర్తలు ర్యాలీ చేయడం , అలా బెదిరింపుల చేసిన వైసీపీ కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం కేసులు వేయడం పెద్ద సంచనలం గా మారింది. ఇప్పుడు ‘రప్పా రప్పా’ అనే డైలాగ్ , వైసీపీ పార్టీ లేటెస్ట్ స్లోగన్ గా మారిపోయింది. ఇప్పుడు ఈ ‘పుష్ప 2’ మేనియా తమిళనాడు రాజకీయాలను కూడా ఆవహించింది. రీసెంట్ గా ఏర్పాటు చేసిన అసెంబ్లీ సమావేశాల్లో , ప్రతిపక్ష నేత స్టాలిన్ , సీఎం విజయ్ పై కొన్ని ఘాటు విమర్శలు చేసాడు.

ఆయన మాట్లాడుతూ ‘ఎన్నికల్లో సీఎం విజయ్ టీవీకే పార్టీ కి సంపూర్ణమైన మెజారిటీ రాలేదని , 63 శాతం మంది తమిళ ప్రజలు విజయ్ కి వ్యతిరేకంగా ఓట్లు వేశారని, మెజారిటీ రాకపోయినప్పటికీ కూడా , ఆయన ‘పుష్ప 2′ సినిమాలో మాదిరిగా ప్రతీ పార్టీ ఇంటికి ఒక డబ్బుల సోఫా పంపించి, వాళ్ళని కొనేస్తున్నాడని , ఇది ప్రజాస్వామ్యానికి పూర్తిగా విరుద్ధం కాబట్టి , మేము ఈ సభ నుండి వాకౌట్ చేస్తున్నాము’ అంటూ ఆయన అసెంబ్లీ నుండి తన పార్టీ నేతలతో కలిసి బయటకు వెళ్ళిపోయాడు. అయితే ఆయన వాడిన ఈ ‘పుష్ప 2′ సోఫాలు’ డైలాగ్ ఇప్పుడు తమిళనాడు లో పెద్ద చర్చకు దారి తీసింది. అలా ఒక పక్క తెలుగు రాజకీయాలను , మరో పక్క తమిళ రాజకీయాలను ‘పుష్ప 2’ చిత్రం తీవ్ర స్థాయిలో ప్రభావితం చేసిందని అనడంలో ఎలాంటి సందేహం లేదు.

నేటి అర్థ రాత్రి నుండే OTT లోకి 'ధురంధర్ 2' గ్రాండ్ ఎంట్రీ.. ఎందులో చూడాలంటే..

Dhurandhar 2 OTT
Dhurandhar 2 OTT

Dhurandhar 2 OTT: ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన చిత్రం ‘ధురంధర్ 2: ది రివెంజ్’. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ‘ధురంధర్’ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రం నార్త్ లోనే కాదు , సౌత్ స్టేట్స్ లో కూడా ప్రభంజనం సృష్టించింది. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే ఈ చిత్రం కేవలం సౌత్ ఇండియా నుండే 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక్కడి సూపర్ స్టార్స్ కి కూడా సౌత్ స్టేట్స్ నుండి ఇప్పటి వరకు ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లను రాబట్టలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటిది ఒక హిందీ చిత్రానికి మన సౌత్ నుండి 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టడం అంటే సాధారమైన విషయం కాదు. బాలీవుడ్ సినిమాకు ఇది ఒక అరుదైన రికార్డు అని చెప్పొచ్చు.

ఇదంతా పక్కన పెడితే నేడు అర్థరాత్రి నుండి ఈ చిత్రం ఓటీటీ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వనుంది. మొదటి భాగం నెట్ ఫ్లిక్స్ లో విడుదలై సంచలనాలను నమోదు చేసింది. దాదాపుగా 100 రోజుల పైన నుండి ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ అవుతోంది. అంటే ‘ధురంధర్ 2’ చిత్రం విడుదలకు నెల రోజుల ముందు నెట్ ఫ్లిక్స్ లోకి ఎంట్రీ ఇస్తే , ‘ధురంధర్ 2’ థియేటర్స్ లో అద్భుతాలు సృష్టించి , ఇప్పుడు ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చే వరకు అది నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ అవుతూనే ఉంది అన్నమాట. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఇలా ఉండగా , ‘ధురంధర్ 2’ కి సంబంధించిన ఓటీటీ హక్కులను తమవద్దనే ఉంచుకున్నారు జియో స్టూడియోస్ సంస్థ.

అందుకే నేడు అర్థ రాత్రి నుండి ఈ చిత్రం జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. హిందీ తో పాటు, తెలుగు తమిళం , మలయాళం మరియు కన్నడ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. థియేటర్స్ లో అద్భుతాలు సృష్టించి , ‘బాహుబలి 2’ గ్రాస్ వసూళ్లను కూడా దాటి 1830 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలన సృష్టించిన ఈ సినిమా, ఓటీటీ లో ఎలాంటి సంచలనాలకు కేంద్ర బిందువుగా మారబోతుందో చూడాలి. నెట్ ఫ్లిక్స్ లో ఉన్న ఆడియన్స్ కంటే , హాట్ స్టార్ లో ఉండే ఆడియన్స్ చాలా ఎక్కువ . ముఖ్యంగా మన ఇండియన్స్ అత్యధిక శాతం ఉపయోహించేది హాట్ స్టార్ , కాబట్టి , ఇక్కడ ఈ చిత్రం ఎన్ని వారాలు ట్రెండ్ అవ్వబోతుందో చూడాలి.

చీరలో అందాల దివి..

Divi Raises
Divi Raises

ఒక్కరోజులోనే.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ ను అజ్ఞాత సాయుధులు లేపేశారు..

Lashkar Terrorist Eliminated
Lashkar Terrorist Eliminated

Lashkar Terrorist Eliminated: ఎవరో వస్తున్నారు.. ముసుగులు ధరించి చూస్తుండగానే కాల్పులు జరుపుతున్నారు. వెంటనే మాయమైపోతున్నారు. సంఘటన స్థలంలోనే కొంతమంది వ్యక్తులు చనిపోతున్నారు. కాల్పులు జరిపింది ఎవరు.. అనే ప్రశ్నలకు సమాధానం లభించడం లేదు. చనిపోయిన వ్యక్తులు మాత్రం ఉగ్రవాదులు.. భయంకరమైన ఉగ్రవాదులు.. దీని వెనుక ఎవరు ఉన్నారు.. ఎవరు ఇదంతా చేస్తున్నారు.. ఈ ప్రశ్నలకు సమాధానం ముంజేతి కంకణమే అయినప్పటికీ.. జరుగుతున్న తీరు చూస్తే భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసినవారు.. భారత దేశంలో అల్ల కల్లోలం సృష్టించిన వారు నేల కొరికిపోతున్నారు.

మన శత్రుదేశం పాకిస్తాన్లో కొంతకాలంగా ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన కమాండర్లు.. కీలక నాయకులు.. మతోన్మాదాన్ని పెంచి పోషించే వ్యక్తులు చనిపోతున్నారు. సాయుధులైన వ్యక్తుల చేతిలో తుపాకీ తూటాలకు నేలకొరిగి పోతున్నారు. వాస్తవానికి వీరంతా కూడా భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసేవారు. గతంలో మనదేశంలో దారుణమైన అల్లర్లు.. ఇతర గొడవలకు వీరంతా కారణమయ్యారు.. దారుణమైన మారణ హోమాన్ని సృష్టించారు. వీరి మీద ఎప్పటినుంచో భారత భద్రతా దళాలు దృష్టి సారించాయి. వీరిని అంతం చేయడానికి ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సాధ్యం కావడం లేదు.

భారత్ భద్రతా దళాలు కాచుకొని కూర్చున్నప్పటికీ.. కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు సాయుదులుగా మారిపోయారు. వారంతా ఉగ్రవాదుల మీద దాడులు చేస్తున్నారు. అందరూ చూస్తుండగానే కాల్పులు జరుపుతున్నారు. ఇలా గత కొంతకాలంగా ఉగ్రవాదుల మీద కాల్పులు జరుపుతూ చంపేస్తున్నారు. తాజాగా పాకిస్తాన్లోని బలు చిస్తాను ప్రాంతంలోని క్వెటా ఏరియాలో లస్కర్ ఏ తోయిబా సీనియర్ కమాండర్ మీరు శుక్రకాన్ రైసాని అనే ఉగ్రవాదిని సాయుదులు హతమార్చారు. ఎల్ఈటీ నియామకాలు, తీవ్రవాద భావజాల వ్యాప్తి, శిక్షణ నెట్వర్క్ లో ఇతడికి కీలక వ్యక్తి. మన దేశానికి వ్యతిరేకంగా జరిగిన అనేక దాడులలో ఇతడు పాలుపంచుకున్నాడు. గురువారం ఇతడి మీద కాల్పులు చేరడానికి ఒకరోజు ముందు లష్కరే ఏ తోయిబా కార్యక్రమంలో పాల్గొన్నాడు. అతడు చనిపోయిన తర్వాత ఎప్పటి మాదిరిగానే పాకిస్తాన్ అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. వాళ్లకు తెలుసు చంపింది ఎవరో. కానీ బయటికి చెప్పలేదు. చెప్పినా ఉపయోగం ఉండదు.

'6 నెలలు నరకం చూశాను' అంటూ కన్నీళ్లు పెట్టుకున్న కియారా అద్వానీ.. అసలు ఏమైందంటే..

Kiara Advani Emotional
Kiara Advani Emotional

Kiara Advani Emotional: పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరోయిన్స్ లో ఒకరు కియారా అద్వానీ. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ఈమె పేరు చెప్తేనే మెలికలు తిరిగిపోతుంటారు. తెలుగు లో ఈమె చేసింది మూడు సినిమాలే. అందులో ఒక్కటే కమర్షియల్ గా యావరేజ్ రేంజ్ లో ఆడింది , మిగిలిన రెండు సినిమాలు ఒక దానిని మించి ఒకటి డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. అయినప్పటికీ ఈమెకు ఇసుమంత క్రేజ్ కూడా తగ్గలేదు. తెలుగు లో ఈమెకు హిట్స్ లేకపోవచ్చు కానీ , బాలీవుడ్ లో వరుసగా బ్లాక్ బస్టర్స్ ని అందుకొని , అక్కడి స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా నిల్చింది. ఇకపోతే ఈమె 2023 వ సంవత్సరం లో ప్రముఖ బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా ని ప్రేమించి పెళ్లాడింది. రీసెంట్ గానే వీళ్లిద్దరికీ ఒక పాప కూడా పుట్టింది.

అయితే ఇటీవలే కియారా అద్వానీ ఒక ప్రముఖ బాలీవుడ్ పోడ్ క్యాస్ట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో , ఆమె పాపకు జన్మని ఇచ్చిన తర్వాత పడిన బాధ గురించి చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె మాట్లాడుతూ ‘నాకు పాప పుట్టిన తర్వాత 6 నెలల వరకు నరకం చూశాను. నాపై నాకే చాలా జాలి కలిగేది , అది నా మనసుకి చాలా కష్టం గా అనిపించింది. చిన్న చిన్న విషయాలకే ఎమోషనల్ అయిపోయి ఏడ్చేసేదాన్ని , నాలోని ఎమోషన్స్ ని అసలు కంట్రోల్ చేసుకోలేకపోయాను. నా మనసులోని భావాలను సరిగ్గా అర్థం చేసుకోవడానికి , వాటికి ప్రాధాన్యత ఇవ్వడానికి నాకు ఏకంగా ఆరు నెలల సమయం పట్టింది. ఎంతసేపు కుటుంబం , పని, ఇతరుల మంచి గురించి మాత్రమే కాదు , నా గురించి నేను ఆలోచించుకోవడం అనేది ఈ మాతృత్వం నేర్పింది’.

‘ఇలా ఎమోషనల్ ఇన్ బాలన్స్ గా ఉన్న సమయం లో నా భర్త సిద్దార్థ్ మల్హోత్రా ఇచ్చిన సప్పోర్టుని జీవితాంతం మర్చిపోలేను. ప్రతీ రోజు షూటింగ్ చేసి అలిసిపోయి వస్తాడు. కానీ నా దగ్గరకు వచ్చి , నన్ను సంతోష పెట్టడం కోసం డ్రైవ్ కి తీసుకెళ్లేవారు. ఈ డ్రైవ్స్ నా మనసుకు ఎంతో ప్రశాంతత ని అందించాయి’ అంటూ చెప్పుకొచ్చింది కియారా అద్వాని. ఇకపోతే రీసెంట్ గానే ఆమె కన్నడ సూపర్ స్టార్ యాష్ తో కలిసి ‘టాక్సిక్’ అనే చిత్రంలో నటించింది. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం , కొన్ని అనుకోని కారణాల వల్ల, వాయిదా పడింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన సరికొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్.

సాయి పల్లవి కి ఊహించని షాక్ ఇచ్చిన హిందీ 'రామాయణ్' టీం..పెద్ద అవమానమే ఇది...

Sai Pallavi Ramayan
Sai Pallavi Ramayan

Sai Pallavi Ramayan: మన తెలుగు యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న సాయి పల్లవి , రీసెంట్ గానే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఆమె సెట్స్ లోకి అడుగుపెట్టిన మొదటి చిత్రం నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ‘రామాయణ్’, కానీ అంతకంటే ముందే ‘ఏక్ దిన్’ అనే చిత్రం విడుదలైంది. రీసెంట్ గానే విడుదలైన ఈ చిత్రం లో హీరోగా అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ నటించాడు. ఈ సినిమాకు మొదటి రోజు , మొదటి ఆట నుండే ఘోరమైన నెగెటివ్ టాక్ రావడం తో , డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది , కనీస స్థాయి ఓపెనింగ్ వసూళ్లు కూడా రాలేదు. తెలుగు లో ఈ చిత్రం ‘ఒక్క రోజు’ అనే పేరుతో విడుదలైంది , ఇక్కడ కూడా ఈ సినిమా ఒక్క రోజే ఆడింది , అంత పెద్ద ఫ్లాప్ అన్నమాట.

ఈ సినిమా తర్వాత విడుదలయ్యే ‘రామాయణ్’ అయినా సాయి పల్లవి అదృష్టాన్ని మారుస్తుందో లేదో చూడాలి. రీసెంట్ గానే ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ కి ఆడియన్స్ నుండి డివైడ్ టాక్ వచ్చింది. వందల కోట్ల బడ్జెట్ అని ఊదరగొట్టారు , కానీ అక్కడ చూస్తుంటే టీవీ సీరియల్స్ క్వాలిటీ రేంజ్ విజువల్స్ కనిపిస్తున్నాయి అంటూ ఈ టీజర్ విడుదలైనప్పుడు నెటిజెన్స్ విమర్శలు చేశారు. ఇది కాసేపు పక్కన పెడితే, ఈ మూవీ టీం సాయి పల్లవి కి ఇప్పుడు ఊహించని షాక్ ఇచ్చింది. అదేమిటంటే సాయి పల్లవి ఏ భాషలో నటించినా , ఆమె తన సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం అలవాటు. అదే విధంగా ‘రామాయణ్ ‘ కి కూడా ఆమె డబ్బింగ్ చెప్పాలని అనుకుంది. కానీ డైరెక్టర్ నితీష్ తివారీ అందుకు ఒప్పుకోలేదు.

కారణం సీత పాత్రకు హిందీ లో పలకాల్సిన డిక్షన్ తో సాయి పల్లవి డైలాగ్స్ చెప్పలేకపోతుందట. పవర్ ఫుల్ ఫీల్స్ ని ఆమె వాయిస్ ఇవ్వకపోవడం తో , వేరే వాళ్ళతో డబ్బింగ్ చెప్పించాలని నితీష్ తివారీ నిర్ణయం తీసుకున్నాడట. ఈ విషయాన్నీ సాయి పల్లవి కి కూడా చెప్పారట , మొదట్లో ఆమె కాస్త బాధ పడిందట కానీ, ఔట్పుట్ ముఖ్యం కదా అని కాంప్రమైజ్ అయ్యిందట, కానీ సోషల్ మీడియా లో ఈ విషయాన్ని తెలుసుకున్న వాళ్ళు , సాయి పల్లవి కి ఘోరమైన అవమానం జరిగింది అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో సాయి పల్లవి సీతగా నటిస్తుండగా, రాముడిగా రణబీర్ కపూర్ , రావణుడిగా రాకింగ్ స్టార్ యాష్, సూర్పనక్క గా రకుల్ ప్రీత్ సింగ్, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. ఈ ఏడాది దీపావళి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

'పెద్ది' నుండి శివరాజ్ కుమార్ గ్లింప్స్ ని విడుదల చేసిన మేకర్స్.. ఈ రేంజ్ లో ఉన్నాడేంటి..

Peddi Shivarajkumar Glimpse
Peddi Shivarajkumar Glimpse

Peddi Shivarajkumar Glimpse: ‘ సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా గ్లోబల్ స్టార్ రాంక్ హారం నటించిన ‘పెద్ది’ మూవీ మేనియా నే కనిపిస్తోంది. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని వచ్చే నెల 4వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఒక రోజు ముందుగా , అనగా జూన్ 3 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోస్ కూడా పడబోతున్నాయి. సినిమా విడుదలకు సరిగ్గా 3 వారాల సమయం మాత్రమే ఉంది, కానీ మేకర్స్ ఆశించిన స్థాయిలో ప్రొమోషన్స్ చేయడం లేదని సోషల్ మీడియా లో రామ్ చరణ్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున రచ్చ చేశారు. వాళ్ళ బాధని అర్థం చేసుకున్న మేకర్స్, రోజుకి ఎదో ఒక అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మే 18 నుండి ఎలాగో దేశవ్యాప్తంగా నాన్ స్టాప్ ప్రొమోషన్స్ ని ప్లాన్ చేశారు , అందుకు సంబంధించిన షెడ్యూల్ ని కూడా నేడు విడుదల చేశారు.

అదే విధంగా ఇంటర్వ్యూస్ కూడా పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు. కాసేపటి క్రితమే ఇన్ స్టాగ్రామ్ లో బుచ్చి బాబు రామ్ చరణ్ తో కలిసి డ్రైవ్ లో వెళ్తూ , అభిమానులతో 2 నిమిషాల పాటు లైవ్ ఇంటరాక్షన్ ని ఏర్పాటు చేశాడు . రామ్ చరణ్ గారితో పెద్ది గురించి ఎక్సక్లూసివ్ ఇంటర్వ్యూ ని చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో విడుదలైన కొద్ది నిమిషాలకే మరో వీడియో ని విడుదల చేశారు మేకర్స్. ఇది ప్రముఖ నటుడు శివరాజ్ కుమార్ కి సంబంధించిన వీడియో. కన్నడ లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఈయన , ఈ చిత్రం లో ఒక కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇన్ని రోజులు ఆయనకు సంబంధించిన లుక్ ని విడుదల చేయకుండా సస్పెన్స్ లో ఉంచారు మేకర్స్.

నేడు ఆయనకు సంబంధించిన ఒక చిన్న గ్లింప్స్ వీడియో ని విడుదల చేశారు మేకర్స్. ఇందులో శివరాజ్ కుమార్ గౌర్ నాయుడు అనే పాత్రలో కనిపించబోతున్నాడు. ఈయన కుస్తీ మాస్టర్ , రామ్ చరణ్ కి గురువు గా కనిపించనున్నాడు. ఈ వీడియో లో ఆయన కుస్తీ పోటీ దారులకు శిక్షణ ఇవ్వడాన్ని మనం చూడొచ్చు , ఒక పహిల్వాన్ ని ఆయన ఒంటి చేతితో పైకి లేపి కిందకు విసిరి వేయడం హైలైట్ గా నిల్చింది. అనేక సందర్భాల్లో శివరాజ్ కుమార్ ఈ పాత్ర నా కెరీర్ లో మైలు రాయిగా నిలిచిపోతుందని చెప్పుకుంటూ వచ్చాడు. ముందుగా ఈ పాత్ర కోసం విజయ్ సేతుపతి ని సంప్రదించారు కానీ , ఆయన ఎందుకో ఒప్పుకోలేదు. సోషల్ మీడియా ని ఊపేస్తున్న ఈ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

ఆరంభం మొదలైంది..టీమ్ ఇండియాను లీడ్ చేసేది తెలుగోడే..

Tilak Varma India A Captain
Tilak Varma India A Captain

Tilak Varma India A Captain: అప్పుడెప్పుడో అజహారుద్దీన్ పురుషుల క్రికెట్ జట్టుకు సారధిగా వ్యవహరించాడు. వివిఎస్ లక్ష్మణ్.. ఇంకా గొప్ప గొప్ప ప్లేయర్లు టీమిండియాలో ఆడినప్పటికీ.. సారధ్య బాధ్యతలు అందుకోలేకపోయారు. అయితే ఇన్నాళ్లకు నేను ఉన్నాను.. నేను విన్నాను అన్నట్టుగా వచ్చేసాడు. ఓ యువకుడు. అతని ఆట తీరు.. డైనమిక్ పర్సనాలిటీ బీసీసీఐ పెద్దలను కదిలించింది. చివరికి అతడికి సారధ్య బాధ్యతలను అప్పగించాల్సి వచ్చింది.

టీమిండియా యంగ్ సెన్సేషన్ తిలక్ వర్మకు ప్రమోషన్ లభించింది. టీమిండియా కెప్టెన్ గా అతడికి ఉన్నతి సాధ్యమైంది. శ్రీలంక జట్టుతో వచ్చే నెలలో జరిగే ట్రై సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఇందులో భారత ఏ జట్టుకు నాయకుడిగా తిలక్ వర్మ వ్యవహరిస్తాడు. భారత ఏ జట్టుతో పాటు, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ ఈ టోర్నీలో ఆడుతాయి. పరిమిత ఓవర్ల ట్రై సిరీస్ అనంతరం ఇండియా ఏ జట్టు, శ్రీలంకయ్య జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్ మొత్తం పూర్తయిన తర్వాత జాతీయ జట్టును ప్రకటిస్తారు. వైట్ బాల్ మ్యాచ్లు దంబుల్లాలో జరుగుతాయి. రెడ్ బాల్ మ్యాచ్ లు గాలే లో జరుగుతాయి..

ట్రై సిరీస్ కోసం భారత ఏ జట్టుకు నాయకుడిగా తిలక్ వర్మ వ్యవహరిస్తాడు. ఐపీఎల్ సంచలన ఆటగాళ్లు ప్రియాంష్ ఆర్య, వైభవ్ సూర్య వంశీ, రియాన్ పరాగ్, ఆయుష్ బదోని , నిశాంత్ సింధు, హార్ష్ దూబే, సూర్యాన్ష్ షెడ్జ్, ప్రబ్ సిమ్రాన్ సింగ్, కుమార్ కుషాగ్ర, విప్ రాజ్ సింగ్, యాష్ వీర్, విప్ రాజ్, అర్షద్ ఖాన్ వంటి ప్లేయర్లకు బీసీసీఐ జట్టులో చోటు కల్పించింది.

ఇదీ షెడ్యూల్

జూన్ 9, మంగళవారం నాడు శ్రీలంక ఏ జట్టుతో భారత ఏ జట్టు పోటీపడుతుంది.

జూన్ 11 గురువారం ఇండియా ఏ జట్టుతో ఆఫ్గనిస్తాన్ ఏ జట్టు పోటీపడుతుంది.

జూన్ 13 శనివారం ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్టుతో, శ్రీలంక ఏ జట్టు పోటీపడుతుంది.

జూన్ 15 సోమవారం ఇండియా ఏ జట్టుతో, శ్రీలంక ఏ జట్టు పోటీ పడుతుంది.

జూన్ 17 బుధవారం ఇండియా ఏజట్టుతో ఆఫ్గనిస్తాన్ ఏ జట్టు పోటీపడుతుంది.

జూన్ 19 శుక్రవారం నాడు ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్టు, శ్రీలంక ఏ జట్టు పోటీ పడతాయి.

జుట్టు 21 ఆదివారం రోజు ఫైనల్ పోటీ జరుగుతుంది.

'పెద్ది' ని ఎలా విడుదల చేస్తారో చూస్తా అంటూ బెదిరింపులు.. విషయం చాలా దూరం వెళ్లేలా ఉందే..

Peddi Release Issue
Peddi Release Issue

Peddi Release Issue: ఇండస్ట్రీ లో సినీ నిర్మాతలు , ఎక్సిభిటర్స్ గిల్డ్ మధ్యలో రోజురోజుకి మాటల యుద్ధం హద్దులు దాటిపోతోంది. మొన్న ఎక్సిభిటర్స్ గిల్డ్ తరుపున దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి , ఏషియన్ సునీల్ తదితరులు పెట్టిన ప్రెస్ మీట్ పెద్ద దుమారమే రేపింది. పరోక్షంగా రాబోయే ‘పెద్ది’ చిత్రానికి ఇబ్బందులు కలిగిస్తామని , మైత్రీ మూవీ మేకర్స్ కి వార్నింగ్ ఇచ్చినట్టుగా ఆ ప్రెస్ మీట్ ఉన్నింది. దీనికి కౌంటర్ గా నిన్న ప్రొడ్యూసర్స్ గిల్డ్ తరుపున మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అధినేతల్లో ఒకసారైనా రవి శంకర్, సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ, సాహు గారపాటి వంటి నిర్మాతలు ప్రెస్ మీట్ ని నిర్వహించారు. దిల్ రాజు గ్యాంగ్ చేసిన వ్యాఖ్యలను , వాళ్ళు అనుసరిస్తున్న తీరు ని తప్పుబడుతూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

అయితే నిన్నటి ప్రెస్ మీట్ లో నాగవంశీ వ్యాఖ్యలకు ఏషియన్ సునీల్ చాలా తీవ్రమైన కౌంటర్లు ఇచ్చాడు. ముందుగా నాగవంశీ ఏమి మాట్లాడాడు అంటే ‘నిన్న ప్రెస్ మీట్ లో ఒక పెద్దాయన సింగిల్ స్క్రీన్స్ గురించి మాట్లాడుతుంటే నాకు నవ్వొచ్చింది. A సెంటర్ నుండి C సెంటర్ వరకు , ఖాళీ స్థలం దొరికితే మల్టీ ప్లెక్స్ థియేటర్స్ ని నిర్మించి , సింగిల్ స్క్రీన్స్ కి వచ్చే ఆదాయాన్ని కూడా రానివ్వకుండా చేస్తున్న ఆయన , నిన్న సింగిల్ స్క్రీన్స్ గురించి మాట్లాడుతుంటే కామెడీ అనిపించింది , దయచేసి ప్రెస్ మీట్స్ లో ఇలాంటి కామెడీ మరోసారి చేయొద్దు’ అంటూ చెప్పుకొచ్చాడు. దీనికి సునీల్ నారంగ్ చాలా తీవ్రంగానే కౌంటర్ ఇచ్చాడు, ఆయన మాట్లాడుతూ ‘నిన్న ఎవరో ఒక ఆయన , కళ్లద్దాలు పెట్టుకొని , విగ్గు తో వచ్చి ఏదేదో మాట్లాడాడు , ఆయన పేరు పాము నా ?, సారీ నాగవంశీ, నేను ఖాళీ స్థలం దొరికితే మల్టీప్లెక్స్ థియేటర్స్ కడుతున్నాను అట , ఇదిగో నా చేతిలో ఉన్న ఈ లిస్ట్ చూడు , 35 సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్ ని నిర్మించాను , కాస్త ఈ విషయాన్ని ఆయనకు చెప్పండి’ అంటూ చెప్పుకొచ్చాడు.

అంతే కాదు , ఈయన తన వాట్సాప్ లో పెట్టిన ప్రొఫైల్ పిక్చర్ ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. అందులో ఏముందంటే ‘మా నాన్న నాకు ఒకటే నేర్పించారు , ఎప్పుడు కూడా గొడవని మొదలు పెట్టకు, కానీ ఎదుటి వారు నిన్ను గొడవకు దిగామని ఫోర్స్ చేస్తే , వాళ్ళను నాశనం చేసేయ్ అని చెప్పేవాడు’ అని ఒక ప్రొఫైల్ పిక్చర్ ని పెట్టుకున్నాడు. దీని అర్థం ఏమిటంటే ‘పెద్ది’ చిత్రానికి నైజాం ప్రాంతం లో చుక్కలు చూపించబోతున్నాం అని చెప్పకనే చెప్పాడు అన్నమాట. నేడు కాదు నేడు తెలంగాణ లో ఎక్సిభిటర్స్ అందరూ సింగిల్ స్క్రీన్స్ ని మూసివేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. కమీషన్ బేసిస్ మీద చిత్రాలను రన్ చేసుకోవడానికి నిర్మాతలు అంగీకరించే వరకు , మేము థియేటర్స్ ఓపెన్ చెయ్యము అంటూ చెప్పుకొచ్చారు. ఇది ‘పెద్ది’ కి చాలా పెద్ద దెబ్బ అనే చెప్పాలి.

ఐపీఎల్ లో అట్టర్ ప్లాప్.. వీరి ఖేల్ ఖతం

IPL 2026 Flop Captains
IPL 2026 Flop Captains

IPL 2026 Flop Captains: ఐపీఎల్ ఈసారి సంచలనాలకు వేదికగా మారింది. కొంతమంది ఆటగాళ్లు అద్భుతం అనే స్థాయిలో ఆడుతుంటే.. మరి కొంతమంది దారుణమైన ప్రదర్శనతో నిరాశపరిచారు. ముఖ్యంగా భారీ అంచనాలు ఉన్న ప్లేయర్లు వాటిని అందుకోలేక విఫలమయ్యారు. అయితే ఆటగాళ్లుగా విఫలమైన వారు.. సారధ్య బాధ్యతలను కూడా కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది.

ఈసారి ఐపీఎల్లో నలుగురు కెప్టెన్లు విపరీతమైన చర్చకు దారి తీశారు. వారంతా కూడా అద్భుతమైన ప్లేయర్లు. అయితే ఈ ఐపీఎల్లో అంతగా ఆకట్టుకోలేకపోయారు. దీంతో వారిలో ముగ్గురు మీద వేటుపడే అవకాశం కనిపిస్తోంది. మరొక ఆటగాడు తనంతట తానుగా జట్టు నుంచి తప్పుకునే అవకాశం ఉందని స్పోర్ట్స్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

రిషబ్ పంత్

ఇతడు నీ లక్నో జట్టు యాజమాన్యం 27 కోట్లకు కొనుగోలు చేసింది. ఇతడి నాయకత్వంలో ఈసారి లక్నో జట్టు కేవలం 11 మ్యాచ్లలో.. మూడు మాత్రమే గెలిచింది. ఇంకా మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అందులో లక్నో జట్టు గెలుస్తుందని నమ్మకం లేదు. పంత్ 11 మ్యాచులు వాడి కేవలం 251 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది. అతడు సరిగ్గా ఆడక పోవడంతో వచ్చే సీజన్లో సారధిగా ఉండే అవకాశం లేదని తెలుస్తోంది.

అక్షర్ పటేల్

ఢిల్లీ జట్టుకు నాయకత్వం వహిస్తున్న ఇతడు.. మొదట్లో వరుస విజయాలు అందించాడు. ఆ తర్వాత వరుస ఓటములతో నిరాశపరిచాడు. ఇటీవల బెంగళూరు మీద ఢిల్లీ సంచలనమైన విజయం సాధించింది. ఆ తర్వాత వరుస ఓటములతో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. ఇంకా రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అందులో గెలిచినా సరే ఢిల్లీ జట్టు ప్లే ఆఫ్ వెళ్లే అవకాశం లేదు. అక్షర్ అంతగా జట్టును నడిపించలేకపోతున్నాడని విమర్శలు కనిపిస్తున్నాయి. ఆటగాడిగా కూడా అతడు ఆకట్టుకోలేకపోతున్నాడు. ఆల్ రౌండర్ అయిన ఇతడు ఇప్పటివరకు వంద పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్లో 10 వికెట్లు మాత్రమే తీగలిగాడు. వచ్చే సీజన్లో ఇతడి స్థానంలో రాహుల్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతుంది.

రహానే

కోల్కతా జట్టు నుంచి అయ్యర్ తప్పుకున్న తర్వాత రహానేకు అవకాశం వచ్చింది.. అయితే అతడు జట్టును అంత సమర్థవంతంగా నడిపించలేకపోతున్నాడు. 11 మ్యాచ్లలో అదరు 237 పరుగులు చేశాడు. మిగతా ప్లేయర్లు సరిగా ఆడలేక పోతున్నారు. దీంతో రహానే మీద తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. రింకు సింగ్.. రఘు వంశీ మినహా మిగతావారు ఆకట్టుకోలేకపోతున్నారు. భారీ ధరపెట్టి కొనుగోలు చేసిన గ్రీన్ తేలిపోతున్నాడు. దీంతో కోల్కతా జట్టు మేనేజ్మెంట్ వచ్చే సీజన్లో రహానే స్థానంలో మరొక ఆటగాడికి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తుందని తెలుస్తోంది. రహానే సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలం కావడం వల్లే జట్టు ఓటములు ఎదుర్కొంటుందని మేనేజ్మెంట్ భావిస్తున్నది.

హార్దిక్ పాండ్యా

ముంబై జట్టు ఇతడిని ఏరి కోరి తీసుకొచ్చింది. ఇతడు మాత్రం అంచనాలను అందుకోలేకపోతున్నాడు. జట్టులో స్టార్ క్రికెటర్లు ఉన్నప్పటికీ ఉపయోగం లేకుండా పోతోంది. హార్దిక్ పాండ్యా సరైన స్థాయిలో నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడు. దీనికి తోడు అతడికి గాయమైంది. గత రెండు మ్యాచ్లలో మేనేజ్మెంట్ అతడిని బెంచ్ కు పరిమితం చేసింది. వచ్చే సీజన్లో అతడు జట్టు నుంచి తప్పుకుంటాడని తెలుస్తోంది. లక్నో లేదా కోల్కతాకు సారధిగా వెళ్లే అవకాశం ఉంది.

'దృశ్యం 3' మూవీ మొట్టమొదటి రివ్యూ.. ఇలాంటి ట్విస్టులు ఏ సినిమాలో కూడా చూసుండరు..

Drishyam 3 6th Day Collections
Drishyam 3 6th Day Collections

Drishyam 3 First Review: క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో సరికొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టిన చిత్రాల్లో ఒకటి ‘దృశ్యం’. ఇండియన్ ఫైన్ ఇండస్ట్రీ హిస్టరీ లోనే ఇలాంటి క్రైమ్ థ్రిల్లింగ్ జానర్ మూవీ గతంలో ఎప్పుడూ రాలేదు. థియేటర్ లో కూర్చున్న ఆడియన్స్ కి ఈ చిత్రం ఇచ్చిన అనుభూతి వేరే లెవెల్. మలయాళం లో మోహన్ లాల్ హీరో గా నటించిన ఈ సినిమాని తెలుగు లో విక్టరీ వెంకటేష్ , తమిళం లో కమల్ హాసన్ , హిందీ లో అజయ్ దేవగన్ వంటి సూపర్ స్టార్స్ రీమేక్ చేశారు. అన్ని భాషల్లోనూ ఈ చిత్రం కమర్షియల్ గా భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. ఆ తర్వాత సీక్వెల్స్ కూడా విడుదలై మంచి ప్రేక్షకాదరణ దక్కించుకున్నాయి. ఇప్పుడు ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘దృశ్యం 3’ తెరకెక్కింది. ఒక్క హిందీ లో మినహా, మిగిలిన అన్నీ భాషల్లోనూ ఈ చిత్రం ఈ నెల 21 న విడుదల కాబోతుంది.

తెలుగు లో విక్టరీ వెంకటేష్ తో చేద్దామని అనుకున్నారు కానీ , ఆయన డేట్స్ సర్దుబాటు కాకపోవడం తో , మలయాళం వెర్షన్ ని తెలుగు లో దబ్ చేసి విడుదల చేయబోతున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ ని కొన్ని థియేటర్స్ లో ప్రారంభించగా , అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మొదటి 24 గంటల్లో ఈ చిత్రానికి 20 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు వెర్షన్ ప్రివ్యూ షో ని నిన్న ప్రసాద్ ల్యాబ్స్ లో కొంతమంది ప్రముఖులకు వేసి చూపించారు , ఈ ప్రివ్యూ షో కి కొంతమంది సీనియర్ మీడియా రిపోర్టర్స్ కూడా హాజరయ్యారు. వాళ్ళ నుండి ఈ చిత్రానికి వచ్చిన టాక్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కాస్త స్లో గానే మొదలు అవుతుందని , కానీ స్క్రీన్ ప్లే చాలా ఆసక్తికరంగా సాగుతుందని , ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు వచ్చే సన్నివేశం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే ది బెస్ట్ గా నిలిచిపోతుందని , ఇలాంటి స్క్రీన్ ప్లే తో ఈమధ్య కాలం లో ఒక్క సినిమా కూడా రాలేదని అంటున్నారు. ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ ఆ రేంజ్ లో ఉంటుందట. ఇక సెకండ్ హాఫ్ ఆరంభం నుండి సినిమా ముగిసేవరకు ప్రతీ అంశం చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందని , ముఖ్యంగా చివరి 45 నిమిషాల్లో వచ్చే ట్విస్టులకు ఆడియన్స్ మైండ్ బ్లాస్ట్ అయ్యేంత పని చేస్తుందని అంటున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే , మరో వారం రోజులు ఆగాల్సిందే.

గ్రేటర్ నికోబర్ ఆందోళనలో బయట పడుతున్న విదేశీ కుట్రలు

Greater nicobar

Greater Nicobar project : గ్రేటర్ నికోబార్ ప్రాజెక్ట్.. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ముందుండి ఈ ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ లో పిటీషన్ ఫైల్ చేసింది ఆశిష్ కొటారీ.. కల్ప వ్రక్ష అనే ఎన్జీవో ఫౌండర్. దీనికి దాతలు ఎవరు అంటే విదేశీ కంపెనీలే.. భారత్ లో కార్పొరేట్ సంస్థలు.. భారత్ నిషేధించిన సంస్థలే ఈ సంస్థకు ఫౌండ్స్ వస్తున్నాయి. వీళ్లందరికీ చైనా ఫండింగ్ ఉన్నాయి. సపోర్టు ఉంది. రాహుల్ గాంధీ యూరప్ పర్యటనలో ఈ చైనా పండింగ్ సంస్థలను కలిశారు. ఇప్పుడు అవే గ్రేటర్ నికోబర్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు పిటీషన్లు వేశాయి.

ఈ ఆశిష్ కొటారీ తండ్రి రజినీ కొటారీ.. ఈయన సీఎస్.బీఎస్ ఫౌండర్. విదేశీ నిధులు స్వీకరించారని భారత ప్రభుత్వం నిషేధించింది. వీళ్లందరికీ యోగేంద్ర యాదవ్, నందిని సుందర్, వైర్ లాంటి పచ్చి భారత వ్యతిరేక సామాజికవేత్తలతో కలిసి గ్రేటర్ నికోబార్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు.

గ్రేటర్ నికోబర్ ఆందోళనలో బయట పడుతున్న విదేశీ కుట్రలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

నీట్ పేపర్ లీకేజీ.. శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా రిపీట్

Neet Paper Leak Case
Neet Paper Leak Case

Neet Paper Leak Case: శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా చూశారా.. ఇందులో చిరంజీవి ఒక రౌడీ. ఒక ఛాలెంజ్ నిమిత్తం డాక్టర్ అవ్వాలని అనుకుంటాడు. అనేక అడ్డదారులు తొక్కుతాడు. చివరికి డాక్టర్ అవ్వలేక చేతులెత్తేస్తాడు. అదంటే సినిమా కాబట్టి సాగిపోతూ ఉంటుంది. కానీ దానిని రియల్ లైఫ్ లోకి అప్లై చేశాడు ఇతడు. ఏకంగా నీట్ పేపరు మొత్తాన్ని లీక్ చేశాడు. లక్షల పదిమంది విద్యార్థుల భవితవ్యాన్ని నాశనం చేశాడు.

నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహారాష్ట్రలోని నాసిక్ వైద్యుడు డాక్టర్ శుభం ను సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. విచారిస్తున్న క్రమంలో దారుణమైన నిజాలు బయటపడుతున్నాయి. శుభం వైద్యుడిగా కొనసాగుతున్నాడు. కానీ ఒక్కరోజు కూడా మెడికల్ కాలేజీకి వెళ్లలేదు. ఇతడి స్వస్థలం నందగావ్. ఇతడు నాసిక్ ప్రాంతంలో కోచింగ్ కారిడార్ ప్రాంతంలో ఎస్సార్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. దాని నేమ్ బోర్డు లో శుభం పేరు ముందు డాక్టర్ అని రాసి ఉంటుంది. స్థానికంగా అతడు తనను తాను డాక్టర్గా పరిచయం చేసుకున్నాడు. అంతేకాదు ఎంబిబిఎస్, బిడిఎస్, బిహెచ్ఎంఎస్ వంటి మెడికల్ కోర్సులలో అడ్మిషన్ల కోసం ప్రయత్నాల సాగించే విద్యార్థులకు అతడు సలహాలు ఇస్తుంటాడు. 2021లో భోపాల్ సమీపంలోని సత్యసాయి యూనివర్సిటీలో బ్యాచ్లర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ కోర్సు ఇతడు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అయితే పోలీసులు విచారణలో ఆ యూనివర్సిటీ వీసీని సంప్రదించారు. అప్పుడు అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం అడ్మిషన్ సమయంలోనే శుభం యూనివర్సిటీ కి వెళ్ళాడు. ఆ తర్వాత తరగతులకు హాజరు కాలేదు.

నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారం ముందుగా రాజస్థాన్లో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత విచారణ జరుగుతున్న కొద్ది అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పేపర్ ను శుభం పదిలక్షలకు కొనుగోలు చేశాడు. కొరియర్ లో ప్రశ్నపత్రం వస్తే.. దానిని పిడిఎఫ్ లాగా మార్చాడు. ఆ తర్వాత దానిని గురుగ్రామ్ ప్రాంతంలో ఒక వ్యక్తికి 15 లక్షలకు అమ్మాడు. ఈ పేపర్ మొత్తం అనేక రాష్ట్రాలను చుట్టింది. పలువురు విద్యార్థులు రెండు నుంచి ఐదు లక్షల వరకు వెచ్చించి కొనుగోలు చేశారు. అయితే క్వశ్చన్ పేపర్ లీకేజీ బయటపడడంతో.. శుభం పరారీ లో ఉన్నాడు. తర్వాత తనను ఎవరు గుర్తుపట్టకుండా ఉండడానికి గుండు చేయించుకున్నాడు. అయితే పోలీసులు డిజిటల్ ఆధారాలు సేకరించి అతడిని అరెస్ట్ చేశారు. శుభం సోదరుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తమిళనాడులో అన్నామలై భవిష్యత్ ఇక ఉరుకులు పరుగులే

Annamalai future : ఇటీవల స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలో ఒక టాక్ నడిచింది. శశిథరూర్, అన్నామలై, తేజస్వి సూర్య ముగ్గురు హాజరయ్యారు. అన్నామలై మాట్లాడుతూ విజయ్ గెలవడం అనేది తమిళనాడు రాజకీయాల్లో పెనుమార్పులకు సంకేతం అని.. ద్రవిడవాదానికి ముగింపు పడబోతోందని అర్థమవుతోంది. ఇది నిజం.

విజయ్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే తమిళనాడులో మార్పు మొదలైంది. అన్నాడీఎంకే ఈ ఎన్నికల తర్వాత కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తాయి. రెండు పార్టీలు బలంగా ఉంటే.. మూడో పార్టీ మనుగడ కష్టం. ఇప్పుడు చార్మ్ గల నాయకుడు అన్నాడీఎంకేకు లేరు. విజయ్, స్టాలిన్ బలంగా ఉన్నారు. రెండు పార్టీలు ఇప్పుడు పట్టున్నాయి.దీంతో అన్నాడీఎంకే ఉనికి లేకుండా పోయింది.

తమిళనాడులో అన్నామలై భవిష్యత్ ఇక ఉరుకులు పరుగులే. దీనిపై ‘రామ్ ’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

రెండు ప్లే ఆఫ్ కు వెళ్లినట్టే.. మిగతా రెండు స్థానాలకు వెళ్లే అవకాశం వేటికుందంటే..

IPL 2026 Playoff Race
IPL 2026 Playoff Race

IPL 2026 Playoff Race: ఐపీఎల్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే లక్నో, ముంబై టోర్నీ నుంచి నిష్క్రమించాయి. కోల్ కతా కూడా దాదాపు నిష్క్రమించినట్టే. గ్రూప్ సమరంలో టాప్ ఫోర్ స్థానాలలో నిలిచిన జట్లు ప్లే ఆఫ్ బెర్త్ సిద్ధం చేసుకుంటాయి.

ప్రస్తుత పాయింట్ల పట్టికలో బెంగళూరు 16, గుజరాత్ 16, హైదరాబాద్ 14, పంజాబ్ 13 పాయింట్లతో కొనసాగుతున్నాయి. చెన్నై 12, రాజస్థాన్ 12 పాయింట్లతో ప్లే ఆఫ్ వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని సంకేతాలు పంపిస్తున్నాయి. ఢిల్లీ ఖాతాలో 10, కోల్ కతా ఖాతాలో తొమ్మిది పాయింట్లు ఉన్నాయి. అయితే ఇవి సాంకేతికంగా మాత్రమే ప్లే ఆఫ్ బరికి సిద్ధంగా ఉన్నాయి

బెంగళూరు ఖాతాలో 16 పాయింట్లు ఉన్నాయి. 12 మ్యాచ్లు ఆడిన ఈ జట్టు 8 విజయాలు సాధించింది. ప్లే ఆఫ్ బెర్త్ దాదాపు సిద్ధం చేసుకుంది. ఈ జట్టు మిగిలిన రెండు మ్యాచ్లలో ఒక దాంట్లో గెలిస్తే చాలు ప్లే ఆఫ్ వెళ్లిపోతుంది. ఒకవేళ రెండు గెలిస్తే టాప్ 2 స్థానంలో ఉంటుంది. మే 17న పంజాబ్ జట్టుతో.. మే 22న హైదరాబాద్ జట్టుతో బెంగళూరు పోటీ పడుతుంది.

గుజరాత్ జట్టు ఖాతాలో 16 పాయింట్లు ఉన్నాయి. నెట్ రన్ రేట్ విషయంలో బెంగళూరు కంటే తక్కువ స్థానంలో ఉంది. గుజరాత్ 12 మ్యాచ్లలో 8 గెలిచింది. తదుపరి రెండు మ్యాచ్లలో గెలిస్తే టాప్ 2 స్థానంలో ఉంటుంది. ఒకదాంట్లో గనక విజయం సాధిస్తే ప్లే ఆఫ్ వెళ్ళిపోతుంది. ఈ జట్టు మే 16న కోల్కతా.. మే 21న చెన్నై తో పోటీ పడుతుంది.

హైదరాబాద్.. మ్యాచ్లో హైదరాబాద్ ఓడిపోవడంతో మూడో స్థానానికి పడిపోయింది. 12 మ్యాచ్లలో ఏడు గెలిచింది. మిగిలిన రెండు మ్యాచ్లలో గెలిస్తే ప్లే ఆఫ్ వెళ్లిపోతుంది. అలాకాకుండా ఒక దాంట్లో గెలిచి.. ఒక దాంట్లో పడిపోతే మిగతా జట్ల ఫలితాల మీద ఆధార పడాల్సి ఉంటుంది. మే 18న చెన్నై జట్టుతో.. మే 22న బెంగళూరు తో హైదరాబాద్ పోటీ పడుతుంది.

పంజాబ్.. వరుసగా నాలుగు మ్యాచ్లో ఓడిపోయి టాప్ స్థానాన్ని కోల్పోయింది. 11 మ్యాచ్లో 6 గెలిచింది. ఈ జట్టు ఖాతాలో 13 పాయింట్లు ఉన్నాయి. మిగతా మూడింటిలో గెలిస్తే ఎలాంటి ఇబ్బందులేకుండా ప్లే ఆఫ్ వెళ్లిపోతుంది. ఒకవేళ ఒకదాంట్లో ఓడిపోతే మాత్రం ఈ జట్టుకు ఇబ్బందులు తప్పవు. ముంబై జట్టుతో మే 14న.. బెంగళూరు తో మే 17న.. లక్నోతో మే 23న ఈ జట్టు ఆడుతుంది.

చెన్నై, రాజస్థాన్.. ఈ రెండు జట్లు వచ్చే మూడు మ్యాచ్లలో కచ్చితంగా గెలవాలి. దాంట్లో ఓడిపోతే మాత్రం ఇబ్బందులు తప్పవు. చెన్నై జట్టు కంటే రాజస్థాన్ నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉంది. 11 మ్యాచ్లలో ఆరు విజయాలు నమోదు చేశాయి చెన్నై, రాజస్థాన్. ఈ రెండు జట్లు 12 పాయింట్లతో కొనసాగుతున్నాయి. లక్నోతో మే 15న.. మే 18న హైదరాబాద్.. మే 21న గుజరాత్ జట్టుతో చెన్నై పోటీ పడుతుంది.. ఢిల్లీతో మే 17న.. లక్నోతో మే 19న.. ముంబై తో మే 24న రాజస్థాన్ పోటీ పడుతుంది.

ఢిల్లీ.. ఈ జట్టు ప్లే ఆఫ్ వెళ్లడం దాదాపు కష్టమే. ఇప్పటికే 12 మ్యాచ్లు ఆడిన ఈ జట్టు ఐదు విజయాలు మాత్రమే నమోదు చేసింది. ఒకవేళ తదుపరి మ్యాచ్లో గెలిచినప్పటికీ నాకౌట్ చేరుకునే అవకాశం లేదు. నెట్ రన్ రేట్ ఏమాత్రం ఆశాజనకంగా లేదు. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో మే 17న.. కోల్కతా జట్టుతో మే 24న ఢిల్లీ పోటీ పడుతుంది.

కోల్ కతా.. ఈ జట్టు ప్లే ఆఫ్ వెళ్లే అవకాశాలు దాదాపు ముగిసిపోయాయి. కోల్కతా 11 మ్యాచుల్లో నాలుగు విజయాలు మాత్రమే నమోదు చేసింది. వచ్చే మూడు మ్యాచ్లో గెలిచినప్పటికీ.. ఇతర జట్ట సమీకరణల మీద ఆధారపడాల్సి ఉంటుంది. గుజరాత్ జట్టుతో మే 16న.. ముంబై జట్టుతో మే 20న.. ఢిల్లీ జట్టుతో మే 24న పోటీ పడాల్సి ఉంటుంది.

అక్షరాలా 150 కోట్లు.. షూటింగ్ దశలోనే అరుదైన రికార్డుని నెలకొల్పిన 'కాంచన 4'

Kanchana 4 Movie Update
Kanchana 4 Movie Update

Kanchana 4 Movie Update: హారర్ థ్రిల్లర్ జానర్ సినిమాల్లో సరికొత్త ఒరవడిని సృష్టించిన చిత్రం ఏదైనా ఉందా అంటే , అది ‘కాంచన’ సిరీస్ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ముందుగా ‘ముని’ అనే చిత్రం తో ఈ సిరీస్ మొదలైంది. ఆ సినిమా కమర్షియల్ గా తెలుగు, తమిళ భాషల్లో పెద్ద హిట్ అవ్వడం తో , దానికి సీక్వెల్ గా ‘కాంచన (ముని 2)’ తెరకెక్కింది. ఇది కమర్షియల్ గా ఒక సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. ఇక ఆ తర్వాత కొన్నాళ్ళకు ‘గంగ(కాంచన 2)(ముని 3)’ తెరకెక్కింది. ఇది కూడా సూపర్ హిట్. అదే విధంగా 2019 వ సంవత్సరం లో ‘కాంచన 3 (ముని 4)’ తెరకెక్కింది. ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కూడా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది.

ఇక ప్రస్తుతానికి రాఘవ లారెన్స్ ‘కాంచన 4(ముని 5)’ ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం తో ‘కాంచన’ సిరీస్ కి ఎండ్ కార్డు ఇవ్వబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కార్యక్రమాలు మొదలై చాలా రోజులు అయ్యింది. వాస్తవానికి అయితే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఈ పాటికి పూర్తి అవ్వాలి , కానీ మరో మూడు నుండి నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉందట. ఈ చిత్రం లో దెయ్యం గా పూజా హెగ్డే నటించబోతున్నట్టు సమాచారం. సినిమా ఆమె ఫ్లాష్ బ్యాక్ ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఏ సినిమాలో చూడని విధంగా ఉంటుందట. ఈ చిత్రం లో నోరా ఫతేహి కూడా కీలక పాత్ర పోషించబోతుంది. అయితే రీసెంట్ గానే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు చూసుకున్న రాఘవ లారెన్స్ ఎందుకో సంతృప్తి చెందలేదట.

అందుకే ఆ సన్నివేశాలను మరోసారి రీ షూట్ చేస్తున్నాడు. ఇప్పటికే రాఘవ లారెన్స్ ఈ చిత్రానికి అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ ఖర్చు చేయించాడు. ‘కాంచన’ సిరీస్ చాలా ఫేమస్ కాబట్టి , ‘కాంచన 4’ కి ఇప్పటి నుండి తెలుగు , తమిళ బాషల నుండి పలువురు బయ్యర్స్ భారీ ఆఫర్స్ ని డిమాండ్ చేస్తున్నారట. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి తెలుగు , తమిళ భాషలకు కలిపి 150 కోట్ల రూపాయిల థియేట్రికల్ బిజినెస్ వేల్యూ పలుకుతుందట. రాబోయే రోజుల్లో ఈ చిత్రం నుండి విడుదల అవ్వబోయే ప్రమోషనల్ కంటెంట్ ని ఆడియన్స్ చూసిన తర్వాత ఈ వేల్యూ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు , చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

'KGF' మేకర్స్ చేతుల్లోకి 'పెద్ది'.. ఇక బాక్స్ ఆఫీస్ విద్వంసం మామూలు రేంజ్ లో ఉండదు..

Ram Charan Peddi Collections
Ram Charan Peddi Collections

Peddi Overseas Rights: సరిగ్గా మరో 3 వారాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ‘పెద్ది’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని పాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ , రామ్ చరణ్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ చిత్రం నుండి విడుదలైన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ వేరే లెవెల్ లో పేలింది , ముఖ్యంగా ‘చికిరి చికిరి’ పాట కేవలం ఇండియన్స్ ని మాత్రమే కాదు , ఇతర దేశాలకు చెందిన మూవీ లవర్స్ ని కూడా ఉర్రూతలూ ఊహించింది. ఇక ఆ తర్వాత విడుదలైన ‘రయ్ రయ్ రారా’ పాటకు కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇది కాసేపు పక్కన పెడితే రామ్ చరణ్ పుట్టినరోజు నాడు విడుదలైన ‘పహిల్వాన్’ గ్లింప్స్ వీడియో అయితే నేషనల్ లెవెల్ లో సోషల్ మీడియా ని షేక్ చేసి వదిలింది.

ఇలా ఒక్కటా , రెండా , ఈ చిత్రం నుండి ఏ చిన్న కంటెంట్ విడుదలైనా సోషల్ మీడియా మొత్తం షేక్ అయ్యేది. అయితే రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త ఇప్పుడు అభిమానులను మెంటలెక్కిపోయేలా చేస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ రైట్స్ మొత్తాన్ని ‘హోమబుల్ ఫిలిమ్స్’ సొంతం చేసుకుంది. కేజీఎఫ్ , సలార్, కాంతారా సిరీస్ ఇలా ఎన్నో పాన్ ఇండియన్ అద్భుతాలను నిర్మించిన ఈ సంస్థ ఇప్పుడు ‘పెద్ది’ చిత్రం తో ఓవర్సీస్ లో డిస్ట్రిబ్యూషన్ రంగం లోకి అడుగుపెట్టింది. కర్ణాటక ప్రాంతానికి చెందిన థియేట్రికల్ రైట్స్ ని కూడా ఈ సంస్థనే సొంతం చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక అప్డేట్ కూడా బయటకు రానుంది.

అయితే హోమబుల్ ఫిలిమ్స్ సంస్థ అంత తేలికగా ఒక చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకు రాదు. సినిమాలో కంటెంట్ వేరే లెవెల్ లో ఉంటేనే , వాళ్ళు ఒక చిత్రాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఒక్కటి చాలు , ఈ సినిమాని ఎందుకు కొనాలి అని చెప్పడానికి, అయితే ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని రషస్ ని హోమబుల్ ఫిలిమ్స్ సంస్థకు చూపించారట, వాళ్లకు పిచ్చి పిచ్చి గా నచ్చడం తో, వెంటనే ఈ చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ రైట్స్, మేకర్స్ కోరినంత ఇచ్చి సొంతం చేసుకున్నారట. ఇక బాక్స్ ఆఫీస్ విద్వంసం ఏ రేంజ్ లో ఉండబోతుందో తెలియాలంటే మరో మూడు వారాలు ఆగాల్సిందే.