Home Blog Page 273

రాజమౌళి వల్ల పర్సనల్ గా బాగా ఇబ్బంది పడ్డ నటులు వీళ్లే... ఓపెన్ గా చెప్పిన స్టార్ హీరో...

S S Rajamouli
S S Rajamouli

Rajamouli working style: ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమైన రాజమౌళి ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో వరుస సినిమాలను చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన నుంచి వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే తనే నుంచి రాబోతున్న సినిమాల విషయంలో ఆయన ఇంకాస్త జాగ్రత్తగా ఉండాల్సిన సమయమైతే ఆసన్నమైంది. ప్రస్తుతం ఆయన మహేష్ బాబును హీరోగా పెట్టి చేస్తున్న వారణాసి సినిమాతో యావత్ ఇండియన్ సినిమా పరిధిని దాటి ప్రపంచ స్థాయి ప్రేక్షకులను మెప్పించే విధంగా సన్నాహాలు చేస్తున్నాడు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాని చాలా ఎమోషన్స్ తో తెరకెక్కిస్తున్నారు.

ఇక అవసరమైన చోట ఎలివేషన్స్ ను కూడా యాడ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఈ సినిమా సూపర్ సక్సెస్ ను సాధిస్తుంది అంటూ మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు. 1500 కోట్ల బడ్జెట్ tho తెరకెక్కుతున్న ఈ సినిమా 3000 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టాల్సిన అవసరమైతే ఉంది… నిజానికి రాజమౌళి ఒక సినిమా కోసం చాలామంది ఆర్టిస్టులను లాక్ చేస్తుంటాడు.

వాళ్ళ డేట్స్ ని బల్క్ గా తీసుకొని తనకి కావలసిన మెకోవర్ లో వాళ్ళను రెడీ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే బాహుబలి సినిమా కోసం ప్రభాస్, రానా డేట్స్ ని బల్క్ గా తీసుకొని తన దగ్గరే ఒక మూడు సంవత్సరాల పాటు వాళ్ళని ఉంచుకున్నాడు. ఇక ఈ క్రమంలోనే వాళ్ళ బాడీలు సైతం భారీగా ఉండాలని వాళ్లకి విపరీతంగా తినిపించి వాళ్ళ బాడీని బలంగా తయారయ్యేలా చేశాడు. రాజమౌళి పెట్టిన టార్చర్ కి తమ బాడీని చాలా బాగాబిల్డ్ చేసుకున్న హీరోలు ఈ సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు దానిని మెయింటైన్ చేయకపోవడంతో ప్రభాస్ బాడీ మొత్తం షిప్ అవుట్ అయిపోయింది.

రానాకి సైతం ఒక కిడ్నీ ఫెయిల్ అయిపోయింది… దాంతో రానా కిడ్నీ మార్చుకున్న విషయం మనకు తెలిసిందే. మొత్తానికైతే రాజమౌళి వల్ల వీళ్ళిద్దరి కెరియర్లు చాలా వరకు నష్టపోయాయనే చెప్పాలి. దాంతో ప్రభాస్ ఇప్పటికి కోల్పోవడం లేదు. తనకు ఏదో ఒక హెల్తీ ఇష్యూ వస్తుంది. ఇక ఎందుకని ప్రభాస్ హెల్త్ బాగుపడటం లేదనే విషయంలో చాలా రకాల చర్చలైతే జరుగుతున్నాయి.

 

ఇంటర్లో 97% మార్కులు.. పరీక్ష కంటే ముందు 82 కీమో థెరపీలు..

Student Success Story
Student Success Story

Student Success Story: పరీక్ష మందు చిన్నపాటి జ్వరం వస్తేనే చాలామంది ఇబ్బంది పడతారు. ఆ ప్రభావం పరీక్ష మీద ఖచ్చితంగా ఉంటుంది. మార్కులు కూడా తక్కువగా వస్తూ ఉంటాయి. చిన్నపాటి జ్వరం వస్తేనే పరీక్ష మీద ఈ స్థాయిలో ప్రభావం ఉంటే.. ఈమె ఏకంగా 82 కీమో థెరపీలు చేసుకుంది. క్యాన్సర్ వ్యాధిని జయించింది. భరించలేని బాధ ఉన్నప్పటికీ.. చదువుల తల్లి సరస్వతి మాదిరిగా తన ప్రతిభను నిరూపించుకుంది. ఏకంగా ఇంటర్లో 97% మార్కులు సాధించింది.

పశ్చిమ బెంగాల్లో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలలో అద్రిజా గాన్ అనే యువతి ఏకంగా 97% మార్కులు సాధించింది. తద్వారా రాష్ట్రస్థాయి ర్యాంకు అందుకుంది. అయితే ఈ స్థాయిలో మార్కులు సాధించడం వెనక కన్నీటి గాధ ఉంది. అద్రిజా మూడు సంవత్సరాల క్రితం క్యాన్సర్ వ్యాధి బారిన పడింది. ఆ వ్యాధి నివారణ కోసం ఆమె ఏకంగా 82 సార్లు కీమో థెరపీ చేయించుకుంది. ఆస్పత్రిలో నరకం చూస్తుంది. అయినప్పటికీ ఆమె చదువుకు కీమో థెరపీలు ఆటంకం కలిగించలేదు. ఒకవైపు తీవ్రమైన అనారోగ్య సమస్య.. మరోవైపు ఇబ్బంది పెడుతున్న శస్త్ర చికిత్స.. అయినప్పటికీ ఆమె చదువుకొని కొనసాగించింది. ఒక దశలో తల్లిదండ్రులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినప్పటికీ ఆమె ఏ మాత్రం వెనకడుగు వేయలేదు.

అద్రిజా పదవ తరగతిలో కూడా 94% మార్కులు సాధించింది. అద్రిజా బిగ్ బజార్ ప్రాంతంలోని రామకృష్ణ శారదా మిషన్ సిస్టర్ నివేదిత బాలికల పాఠశాలలో చదువుతోంది. ఈమె 2018లో అత్యంత అరుదైన బ్లడ్ క్యాన్సర్ వ్యాధి బారిన పడింది. ఆరవ తరగతి వార్షిక పరీక్షలు జరుగుతున్నప్పుడు ఆమెకు అనారోగ్యం సోకింది. తల్లిదండ్రులు వైద్య పరీక్షలు చేస్తే ఆమెకు అరుదైన టి సెల్ లింఫోమా సోకినట్టు తేలింది. 2021 వరకు ఆమె చికిత్స తీసుకుంటూనే ఉంది. ఆ సమయంలో ఆమెకు ఏకంగా 82 సార్లు కీమో థెరపీలు చేశారు. వ్యాధి ఇబ్బంది పెడుతున్నప్పటికీ .. మందులు వేసుకుంటే శరీరం సహకరించకపోయినప్పటికీ .. అద్రిజా కష్టపడి చదివింది. అత్యంత ఉత్తమమైన మార్కులు సాధించింది. తద్వారా చదువుకు అనారోగ్యం ఆటంకం కాదని నిరూపించింది. అద్రిజా సాధించిన మార్కుల పట్ల ఆమె తండ్రి మంగల్ హర్షం వ్యక్తం చేస్తున్నాడు. తన కుమార్తె గొప్ప ప్రయత్నం చేసిందని కొనియాడుతున్నాడు.

పతనం అంచున అమెరికా.. జిన్‌పింగ్‌తో ఏకీభవించిన ట్రంప్‌!

Trump agrees with Xi Jinping
Trump agrees with Xi Jinping

Trump agrees with Xi Jinping: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండు రోజుల పర్యటన నిమిత్తం బీజింగ్‌ వెళ్లారు. అక్కడ ట్రంప్‌కు ఘన స్వాగతం లభించింది. ఈ పర్యటనలో ఇరు దేశాల అధ్యక్షులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు అమెరికాపై కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్రరాజ్యం పతనం అంచున ఉందని కుండ బద్దలు కొట్టాడు. అయితే ట్రంప్‌ దీనిని కవర్‌ చేయడానికి తంటాలు పడ్డాడు. జిన్‌పింగ్‌ చెప్పింది వంద శాతం నిజమన్నాడు. అయితే అది బైడెన్‌ పాలన గురించి అని, తాను వచ్చాక అమెరికా గ్లోబల్‌ శక్తిగా ఆర్థిక, రాజకీయ పురోగతి సాధించిందని వెల్లడించారు.

రాజకీయ ఆధిపత్యం..
చైనా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు అమెరికాపై ఆధిపత్యం కనబర్చే అంశంగా ఉంది. ఇక ట్రంప్‌ సమాధానం కూడా ఇలాగే ఉంది. తన ఆధిపత్యం తగ్గకుండా జిన్‌పింగ్‌ వ్యాఖ్యలను సమర్థిస్తూనే అమెరికా పతనం తన పాలనలో కాదని, బైడెన్‌ పాలనలో అని పేర్కొన్నారు. షీ వ్యాఖ్యలు గ్లోబల్‌ ఆర్థిక వాతావరణం, సరఫరా గొలుసులు, నాణ్యమైన టెక్‌ కేపబులిటీని తెలియజేస్తున్నాయి. ట్రంప్‌ ఆరోపణలు బైడెన్‌ పాలనపై దాడిని సూచిస్తునానయి.

ఆర్థిక, సెక్యూరిటీ పరిణామాలు..
ప్రపంచ మార్కెట్లు: ‘‘పతనం అంచున’’ వంటి ప్రకటనలు ఆర్థిక అస్థిరత భయాన్ని కలిగిస్తాయి. ఆర్థిక పెట్టుబడులు, డాలర్‌ ఇండెక్స్, షేర్‌ మార్కెట్లు ప్రత్యక్షంగా ప్రభావితం అవుతాయి. ఇదే సమయంలో రెండు పెద్ద దేశాల మధ్య సెక్యూరిటీ పరమైన సమస్యలు తలెత్తుతాయి. చిన్న దేశాలనూ ఒత్తిడికి గురిచేస్తాయి.

 

ఎడారిలో జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం.. 'డ్రాగన్' గ్లింప్స్ లీక్ అయిపోయింది..

Dragon Glimpse Leaked
Dragon Glimpse Leaked

Dragon Glimpse Leaked: మరో 5 రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రాబోతుంది. అభిమానులు మే 20 కోసం ప్రతీ ఏడాది ఎంతలా ఎదురు చూస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ఏడాది వాళ్లకు చాలా స్పెషల్ గా జీవితాంతం గుర్తు ఉండిపోబోతుంది. ఎందుకంటే ఆరోజున ఎన్టీఆర్ కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వరద లాగా రానున్నాయి. ముందుగా ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ తో కలిసి చేస్తున్న ‘డ్రాగన్’ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ వీడియో విడుదల కాబోతుంది. ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు , అర్థ రాత్రి 12 గంటలకు ఈ గ్లింప్స్ వీడియో ని విడుదల చేయబోతున్నారు. ఈ గ్లింప్స్ కోసం కేవలం ఎన్టీఆర్ అభిమానులు మాత్రమే కాదు , టాలీవుడ్ మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోంది. ఎందుకంటే ఎన్టీఆర్ కెరీర్ లోనే ఇది చాలా స్పెషల్ చిత్రం , దీనికి బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టేంత సత్తా ఉంది కాబట్టి.

అయితే ఈ గ్లింప్స్ వీడియో గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది , అభిమానులు అయితే మెంటలెక్కిపోతున్నారు. ఒక నిటారు ఎడారిలో జూనియర్ ఎన్టీఆర్ స్పోర్ట్స్ కారు వేసుకొని స్టైల్ గా ఎంట్రీ ఇస్తాడని, ఒక పవర్ ఫుల్ డైలాగ్ కూడా ఆ గ్లింప్స్ వీడియో లో ఉంటుందని అంటున్నారు. ప్రశాంత్ నీల్ సినిమాలు అంటే , డార్క్ షెడ్ లో కలర్ గ్రేడింగ్ ఉంటుంది అనే సంగతి మన అందరికీ తెలిసిందే. కానీ ఈ చిత్రం లో మాత్రం ఆయన రూటు మార్చి , మామూలు కలర్ గ్రేడింగ్ తోనే ఈ చిత్రాన్ని షూట్ చేశాడట . గ్లింప్స్ వీడియో హాలీవుడ్ స్టాండర్డ్స్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంటుందని , ఎన్టీఆర్ చాలా డాషింగ్ లుక్ తో కనిపిస్తాడని అంటున్నారు.

ఇకపోతే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మొదటి భాగం జూన్ 11 ,2027 లో విడుదల కాబోతుంది , రెండవ భాగం డిసెంబర్ 2027 న విడుదల కాబోతుంది. ఈ రెండు సినిమాలకు సంబంధించిన షూటింగ్ ని ఒకేసారి పూర్తి చేసే పనిలో ఉన్నాడట ప్రశాంత్ నీల్. ఈ చిత్రంలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటిస్తోంది. రీసెంట్ గానే జార్జియా లో ఎన్టీఆర్ పై కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలను కూడా చిత్రీకరించారు, ఈ షాట్స్ ని కూడా గ్లింప్స్ వీడియో లో చూడొచ్చని అంటున్నారు.

'పెద్ది' కి ఎలాంటి ఆటంకాలు లేకుండా విడుదల అయ్యేలా చూస్తాము - దిల్ రాజు

Dil Raju comments on Peddi
Dil Raju comments on Peddi

Dil Raju comments on Peddi: ఎట్టకేలకు గత రెండు మూడు రోజుల నుండి ఎక్సిభిటర్స్ గిల్డ్, ప్రొడ్యూసర్స్ గిల్డ్ మధ్య ఏర్పడిన విభేదాలకు నేడు తెరబడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే తెలంగాణ లోని ఎక్సిభిటర్స్ మాకు ఇక నుండి కమీషన్ బేసిస్ మీద అగ్రిమెంట్ చేసుకుంటేనే సింగల్ స్క్రీన్స్ థియేటర్స్ ని రన్ చేస్తాము , లేదంటే మూసేస్తాము అంటూ మీడియా ముందుకొచ్చి మాట్లాడిన సంగతి తెలిసిందే. దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి , ఏషియన్ సునీల్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి కౌంటర్ గా మొన్న నాగవంశీ , మైత్రీ మూవీ మేకర్స్ రవి ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి , మేము కమీషన్ బేసిస్ విధానం పై సానుకూలంగానే ఉన్నాము , కానీ ఇది ఒకటి రెండు రోజుల్లో పరిష్కరింపబడే సమస్య కాదు , కూర్చొని మాట్లాడుకోవాలి , మాకంటూ కొన్ని డిమాండ్స్ ఉన్నాయి , అవన్నిటికి ఒప్పుకుంటేనే మేము ఈ విధానాన్ని స్వాగతిస్తాము అంటూ చెప్పుకొచ్చారు.

నిన్న సాయంత్రం అయితే, తెలంగాణ లో సింగల్ స్క్రీన్స్ ని ఈ సమస్య పరిష్కారం అయ్యేవరకు మూసి వేస్తామని అధికారిక ప్రకటన కూడా చేశారు ఎక్సిభిటర్స్. అయితే నేడు ప్రొడ్యూసర్స్ గిల్డ్ , ఎక్సిభిటర్స్ గిల్డ్ మధ్య సమావేశం జరిగింది. ఈ సమావేశం మొదలు మామూలు స్థితిలో అవ్వలేదు. నిర్మాత నాగవంశీ , ఏషియన్ సునీల్ ఒకరిని ఒకరు కొట్టుకునేంత పని చేశారు. ఏషియన్ సునీల్ ‘నువ్వు నాశనం చేసేస్తా’ అంటూ నాగవంశీ పై రెచ్చిపోగా, అందుకు నాగవంశీ కోపం అదుపు తప్పి , ఆయనపై చెయ్యి చేసుకునేందుకు ముందుకు దూసుకెళ్లాడు, అప్పుడు ఏషియన్ సునీల్ వద్ద ఎక్సిభిటర్ గా పని చేస్తున్న శ్రీధర్ అడ్డు రావడంతో అతనిపై నాగవంశీ చెయ్యి చేసుకున్నాడు. ఇద్దరు కాసేపు కొట్లాడుకున్నారు కూడా. పరిస్థితి చెయ్యి దాటిపోవడం తో, అల్లు అరవింద్ , దిల్ రాజు కలుగచేసుకొని , ఈ సమావేశాన్ని శాంతియుతంగా ముగించారు.

అనంతరం దిల్ రాజు బయటకు వచ్చి మీడియా తో మాట్లాడుతూ ‘నిర్మాతలు కూడా కమీషన్ బేసిస్ మీద సినిమాలను రన్ చేయడానికి అంగీకరించారు. త్వరలోనే ఒక కమిటీ ని ఏర్పాటు చేసి A సెంటర్ లో ఎంత కమీషన్ ఉండాలి , మిగిలిన సెంటర్స్ లో ఎలాంటి కమీషన్ ఉండాలి అనేది నిర్ణయిస్తాము. మా సతీష్ గారు నిర్మించిన ‘పెద్ది’ చిత్రానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చాలా స్మూత్ గా విడుదల కాబోతుంది’ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో రామ్ చరణ్ అభిమానుల్లో కలిగిన భయాందోళనకు ఇక్కడితో చెక్ పడింది. జూన్ 3 న అన్ని ప్రాంతాలతో పాటు తెలంగాణ లో కూడా భారీ లెవెల్ ప్రీమియర్ షోస్ తో ఈ చిత్రం విడుదల కాబోతుంది.

ట్రంప్ కు ఘోర అవమానం.. చైనా ముందు తలవంచుకోవాల్సి వచ్చిందిగా..

Trump humiliation in China
Trump humiliation in China

Trump humiliation in China: ప్రపంచ ఆర్థిక శక్తిగా అమెరికా ఉన్నప్పటికీ.. కొంతకాలంగా చైనా దూకుడు ముందు తట్టుకోలేకపోతోంది. తయారీ రంగం నుంచి మొదలుపెడితే సైన్స్ అండ్ టెక్నాలజీ వరకు ఇలా అన్ని విషయాలలో చైనాతో అమెరికా పోటీ పడలేకపోతోంది. చైనాను తొక్కిపెట్టే ప్రయత్నాలు అనేకం చేస్తున్నప్పటికీ అవి సాధ్యం కావడం లేదు. పైగా చైనా అమెరికాకు దిమ్మతిరిగే విధంగా సమాధానాలు చెబుతోంది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు చైనాలో పర్యటిస్తున్నారు. అనే రకాలైన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. తొమ్మిది సంవత్సరాల తర్వాత ట్రంప్ చైనాలో పర్యటిస్తున్న నేపథ్యంలో రకరకాల వార్తలు షికారు చేస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. అమెరికా అధ్యక్షుడికి చైనాలో జరిగిన ఘోర అవమానం మరొక ఎత్తు. వెస్ట్రన్ మీడియాలో దీనికి సంబంధించిన కథనాలు ఇప్పుడు విస్తృతంగా సర్కులేట్ అవుతున్నాయి.

చైనాలో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు భద్రతను పర్యవేక్షించే కమాండింగ్ వ్యవస్థలు పనిచేయలేదు. అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల పాచికలు చైనాలో పారలేదు. అంతేకాదు ట్రంప్ పర్యటిస్తున్న వేళ చైనా సెక్యూరిటీ సిబ్బంది అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లకు చుక్కలు చూపించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నది.. ట్రంప్ సమావేశ వేదిక వద్ద మాట్లాడుతుంటే చైనా జర్నలిస్టులు దూసుకు వచ్చారు… వైట్ హౌస్ సిబ్బందిని మొత్తం నెట్టేశారు. ఈ ఘటనలో అమెరికా సిబ్బంది ఒకరికి గాయాలయ్యాయి. దీనిపై అమెరికన్ అధికారాలు నిరసన వ్యక్తం చేసినప్పటికీ ఉపయోగాలు లేకుండా పోయింది.

ట్రంప్, జిన్ పింగ్ బీజింగ్ లోని టెంపుల్ ఆఫ్ హెవెన్ ను సందర్శిస్తున్న సమయంలో.. అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ వద్ద తుపాకీ ఉందని గుర్తించిన చైనా అధికారులు.. అతడిని గుడిలోకి పంపించలేదు. అంతేకాదు తుపాకీ స్వాధీనం చేసిన తర్వాతే లోపలికి వెళ్లాలని సూచించారు. దానికి అమెరికా ప్రతినిధి ఒప్పుకోలేదు. ఈ క్రమంలో చైనా, అమెరికా అధికారుల వద్ద ఘర్షణ జరిగింది. చాలాసేపటి తర్వాత చైనా అధికారులు ఒప్పుకున్నప్పటికీ.. తుపాకీ ఉన్న సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ బయట ఉండిపోవాల్సి వచ్చింది.

టెంపుల్ ఆఫ్ హెవెన్ ను దర్శించుకున్న తర్వాత ట్రంప్ ను ప్రెసిడెన్షియల్ మోటార్ కేడ్ లో కలవనీయకుండా అమెరికన్ జర్నలిస్టులను చైనా అధికారులు అడ్డుకున్నారు. కొద్దిసేపు ఘర్షణ జరిగిన తర్వాత అమెరికా జర్నలిస్టులు ట్రంప్ కాన్వాయ్ ను అందుకున్నట్టు తెలుస్తోంది. ఇవి కేవలం వెలుగులోకి వచ్చినవి మాత్రమే.. ట్రంప్ పర్యటన సమయంలో చైనా అనేక రకాల అడ్డంకులు సృష్టించింది. అమెరికా రిపోర్టర్లకు నీళ్ల సీసాలు కూడా ఇవ్వలేదు. వాష్ రూమ్ వినియోగించే విషయంలో కూడా పరిమితి విధించింది. మరోవైపు ఫాక్స్ న్యూస్ కు సంబంధించిన ఒక వ్యాన్ నో పార్కింగ్ ఏరియాలో పార్కింగ్ చేయడంతో.. ఫైన్ విధించారు. గతంలో కూడా చైనా అధికారులు ఇలానే ట్రంప్ పర్యటిస్తున్నప్పుడు అమెరికన్ జర్నలిస్టులను నియంత్రించారు. అయితే ఈ కథనాలను అమెరికా తోసి పుచ్చడం విశేషం. వీటిపై చైనా ఇంతవరకు స్పందించలేదు.

సుకుమార్ - విజయ్ దేవరకొండ కాంబోలో సినిమా మిస్ అవ్వడానికి కారణం ఎవరు...

Sukumar Vijay Deverakonda combo
Sukumar Vijay Deverakonda combo

Sukumar Vijay Deverakonda combo: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడు ఒక్కో పంథా ను అనుసరిస్తూ సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. సుకుమార్ లాంటి ఇంటలిజెంట్ డైరెక్టర్లు సైతం డిఫరెంట్ తరహా సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో ఆయన చేసిన రంగస్థలం సినిమా ఇండస్ట్రీ లో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డుని సైతం కట్టబెట్టిన ఘనత తనకే దక్కుతుంది… రంగస్థలం సినిమా తర్వాత సుకుమార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ఒక సినిమా వస్తుంది అంటూ అనౌన్స్ మెంట్ వచ్చింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత పుష్ప సినిమాతో బిజీ అయిపోయిన సుకుమార్ రెండు పార్టీలకు కలిపి దాదాపు నాలుగు సంవత్సరాల సమయాన్ని తీసుకున్నాడు. రామ్ చరణ్ తో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే విజయ్ దేవరకొండ తో చేయాల్సిన ప్రాజెక్టు ఎందుకు క్యాన్సిల్ అయింది.

ఎందుకని కాన్సిల్ అవ్వాల్సి వచ్చింది అంటూ కొంతమంది సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ కోసం అనుకున్న కాన్సెప్ట్ తోనే రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నాడు అంటూ కొంతమంది చెబుతుంటే ప్రస్తుతం సుకుమార్ కి ఉన్న మార్కెట్ విజయ్ దేవరకొండకు ఉన్న మార్కెట్ వేరు…

కాబట్టి వాళ్ళిద్దరి మధ్య పొంతన కుదిరే అవకాశాలు లేవు. టైర్ వన్ హీరోలతో మాత్రమే సుకుమార్ సినిమా చేయగలిగితే ఇండస్ట్రీ రికార్డు బ్రేక్ అవుతాయి అలా కాకుండా మీడియం రేంజ్ హీరోలతో సినిమా చేస్తే ఆ సినిమా పెద్ద ఇంపాక్ట్ ను క్రియేట్ చేయకపోవచ్చనే ఉద్దేశ్యంతోనే సుకుమార్ మరోసారి రామ్ చరణ్ వైపు అడుగులు వేస్తున్నాడు.

అందుకే విజయ్ దేవరకొండ ను పక్కన పెట్టాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి… ప్రస్తుతం విజయ్ దేవరకొండ సైతం పాన్ ఇండియా ప్రాజెక్టులను చేస్తున్నాడు. రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వంలో రణబాలి అనే సినిమా చేస్తున్నాడు. రవి కిరణ్ దర్శకత్వంలో ‘రౌడీ జనార్ధన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల మీద కూడా భారీ బజ్ క్రియేట్ అవుతుంది. ఇక ఈ సినిమాలతో టాప్ హీరోగా మారతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…

ప్రభాస్ వాళ్ల అమ్మ కోరికను తీర్చుతాడా...

Prabhas Directors
Prabhas Directors

Prabhas mother wish: సినిమా ఇండస్ట్రీలో వారసత్వం ఉన్నంత మాత్రాన రాణిస్తారనే గ్యారంటీ లేదు. తమ సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలో పైకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నప్పటికి వారసత్వంగా వచ్చిన వాళ్ళు సైతం చాలా తక్కువ మంది సక్సెస్ లను సాధించారు. వాళ్లకి సినిమాలు చేయడానికి ప్లాట్ ఫామ్ అయితే దొరుకుతుంది. కానీ ఆ సినిమాలతో వారిని ప్రూవ్ చేసుకుంటేనే ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ గా నిలుస్తారు. లేకపోతే మాత్రం చాలా వరకు డీలా పడిపోయే ప్రమాదమైతే ఉంది. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని లెక్కించగలుగుతున్న స్టార్ హీరోలందరు ముందుకు దూసుకెళ్తుంటే కొంతమంది మాత్రం చాలా వరకు వెనుకబడిపోతున్నారు. కృష్ణంరాజు తమ్ముడి కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేశాడు. ప్రభాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదట్లో కొంతవరకు డౌన్ అయినప్పటికి వర్షం సినిమాతో పుంజుకున్న ఆయన ఛత్రపతి సినిమాతో మాస్ హీరోగా అవతరించాడు…ఇక ప్రస్తుతం 45 సంవత్సరాల వయస్సును కలిగి ఉన్న ప్రభాస్ ఇప్పటికి ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో అతని మీద చాలావరకు విమర్శలైతే వస్తున్నాయి.

వాళ్ళ అమ్మ సైతం ప్రభాస్ కి వీలైనంత తొందరగా పెళ్లి చేసుకోమని చెబుతుందట. అయిన కూడా ప్రభాస్ మాత్రం ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయం చెప్పి ఆ మాటను దాటవేస్తున్నాడు. తన తల్లి కోరిక కూడా అదే కావడంతో ఇప్పటికైనా ఆయన పెళ్లి చేసుకొని తన అమ్మ కోరికను తీర్చాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కృష్ణం రాజు భార్య సైతం ప్రభాస్ కి సంబందాలైతే చూస్తుంది.

ఆయన తొందరలోనే పెళ్లి చేసుకుంటాడా? వాళ్లు సంబంధం చూసిన తర్వాత మళ్లీ తన డిసిజన్ మార్చుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో పెను సంచలనాలను క్రియేట్ చేస్తున్నాడు.

కాబట్టి ఇప్పుడు తను చేయబోయే సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించాల్సిన అవసరమైతే ఉంది… ఇక సినిమాలతో పాటు తన పర్సనల్ విషయాల్లో కూడా ఆయన స్పెషల్ కేర్ తీసుకోవాలి. తొందరగా పెళ్లి చేసుకుంటే తన ఫ్యామిలీతో పాటు తన అభిమానులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తారు…

 

గంటకు 41 వేల టికెట్స్.. బాక్స్ ఆఫీస్ వద్ద సూర్య 'కరుప్పు' ప్రభంజనం..

Karuppu advance bookings
Karuppu advance bookings

Karuppu advance bookings: గత 12 ఏళ్లుగా బాక్స్ ఆఫీస్ వద్ద సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేక ఇబ్బంది పడుతున్న బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎవరైనా ఉన్నారా అంటే, అది సూర్య మాత్రమే. ఈమధ్య కాలం లో అయితే ఆయనకు వరుసగా మూడు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ పడ్డాయి. ఇక సూర్య సినిమాలను జనాలు చూడరేమో అని అందరూ ఫిక్స్ అయిపోయిన ఈ సందర్భంలో , నేడు ఆయన నుండి విడుదలైన ‘కరుప్పు’ చిత్రానికి మొదటి ఆట నుండే అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చింది. సూర్య చిత్రానికి ఇలా పాజిటివ్ టాక్ వచ్చిన చివరి చిత్రం ‘సింగం 2’. అప్పటి నుండి ఇప్పటి వరకు సూర్య కి పాజిటివ్ టాక్ వచ్చిన సినిమా ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం. అయితే ఈ చిత్రం నిన్ననే విడుదల అవ్వాల్సింది , కొన్ని అనుకోని కారణాల వల్ల నేటికీ వాయిదా పడింది.

ప్రతీ సినిమాకు బుక్ మై షో లో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగే సంగతి తెలిసిందే. కానీ ఈ చిత్రం వాయిదా పడడం వల్ల , అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదు కేవలం 70 వేల టికెట్స్ మాత్రమే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అమ్ముడుపోయాయి. దాని ప్రభావం నేడు చాలా బలంగా పడింది , పైగా పాజిటివ్ టాక్ కూడా రావడం తో సెన్సేషనల్ కరెంటు బుకింగ్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో గంటకు 43 వేల టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. ఇది సాధారణమైన విషయం కాదు. తమిళనాడు లో ఇప్పటి వరకు ఈ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ సూపర్ స్టార్ రజినీకాంత్, విజయ్ చిత్రాలకు మాత్రమే జరిగాయి, వాళ్ళిద్దరి తర్వాతి స్థానంలో ఇప్పుడు సూర్య నిలిచాడు. ఇది ఆయన అభిమానులకు మంచి బూస్ట్ ఇచ్చే సందర్భం అనే చెప్పొచ్చు.

కోలీవుడ్ లో నిన్న మొన్నటి వరకు సూర్య కి ప్రదీప్ రంగనాథన్ , శివ కార్తికేయన్ వంటి హీరోల రేంజ్ లో కూడా ఓపెనింగ్స్ వచ్చేవి కాదు , క్లోజింగ్ వసూళ్లు అయితే చాలా దారుణంగా ఉండేవి , కానీ ఇప్పుడు ఈ ‘కరుప్పు’ అడ్వాన్స్ బుకింగ్స్ ని చూస్తుంటే , ఈ చిత్రానికి మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 30 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు కచ్చితంగా వచ్చేలాగానే అనిపిస్తోంది. మరో పక్క ఈ చిత్రం తెలుగు లో ‘వీరభధ్రుడు ‘ అనే టైటిల్ తో విడుదలైంది. ఇక్కడ పెద్దగా ఓపెనింగ్స్ ఉండవేమో అని అంతా అనుకున్నారు కానీ , ఇక్కడ కూడా ఈ చిత్రానికి డీసెంట్ స్థాయి ఓపెనింగ్స్ దక్కాయి , బుక్ మై షో యాప్ లో తెలుగు వెర్షన్ కి గంటకు 4 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి.

 

పవన్ కళ్యాణ్ సినిమాలు ఇక నడువవా...

Pawan Kalyan
Pawan Kalyan

Pawan Kalyan flop movies: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన చాలా సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే కెరియర్ స్టార్టింగ్ లో ఆయన పవర్ స్టార్ గా అవతరించడమే కాకుండా మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆ ప్లేస్ ని కైవసం చేసుకునే కెపాసిటి పవన్ కళ్యాణ్ కి ఉందనే పేరును సంపాదించుకున్నాడు. కానీ ఈ మధ్యకాలంలో ఆయన నుంచి వస్తున్న సినిమాలు ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోతున్నాయి. గత సంవత్సరం వచ్చిన ఓజీ సినిమా ఓకే అనిపించింది. ఇక రీసెంట్ గా వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో ఆయన భారీ డిజాస్టర్ ని మూటగట్టుకున్నాడు. తన కెరియర్ లోనే అలాంటి ఒక ఫ్లాప్ సినిమా ఇప్పటివరకు రాలేదు.

దాంతో పవన్ కళ్యాణ్ ఎలాంటి సినిమాలు చేస్తే ప్రేక్షకులకు నచ్చుతుంది. సోషల్ మెసేజ్ ఇచ్చే సినిమాలో నటిస్తే ప్రేక్షకులు దానిని సక్సెస్ చేస్తారా? లేదంటే కమర్షియల్ సినిమాల్లో నటిస్తే ప్రేక్షకులు దాన్ని ఓన్ చేసుకొని ఆ సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలుపుతారా ఏం చేస్తే ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కుతాయనే ఉద్దేశ్యంతో అటు పవన్ కళ్యాణ్, ఇటు దర్శకులు ఒక సందిగ్ధ పరిస్థితిలో ఉన్నారు.

ఇక వాళ్ళు అనుకున్నట్టుగానే సూపర్ సక్సెస్ లను సాధించి భారీ విజయాలను రాబట్టగలుగుతారా? లేదంటే పవన్ కళ్యాణ్ చేయబోయే సినిమాలన్నీ ఫ్లాప్ గా మిగులుతాయా లేదా అనేది తెలియాల్సి ఉంది. నిజానికి పవన్ కళ్యాణ్ ఎక్కువ డేట్స్ ఇచ్చి దర్శకుడిని ఎంకరేజ్ చేస్తూ సినిమాలు చేస్తే బాగుంటుంది. కానీ ప్రస్తుతం ఆయనే పాలిటిక్స్ లో చాలా బిజీగా ఉన్నాడు. కాబట్టి ఎక్కువ డేట్స్ ఇవ్వడం అనేది చాలా వరకు కష్టం అవుతుంది.

ఇక ఇలాంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ సినిమాలు చేయకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే ఆయనా ఉన్న బిజీ కి సినిమాలు సరైన కంటెంట్ తో రాకపోవడంతో వరుసగా ప్లాపులను మూటగట్టుకుంటున్నాయి. దానివల్ల అతనికి బ్యాడ్ నేమ్ రావడమే కాకుండా తన అభిమానులు సైతం తీవ్రమైన నిరాశను వ్యక్తం చేస్తున్నారు…

 

అపనమ్మక భేటీలు.. ట్రంప్‌ సీక్రెట్‌ కమాండ్‌కు చైనా చెక్‌!

Donald Trump China Visit
Donald Trump China Visit

Donald Trump China visit: అగ్రరాజ్యాధినేత డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక తొలిసారి చైనా పర్యటనకు వచ్చారు. రెండు రోజులు చైనాలో పర్యటించారు. అయితే అమెరికా – చైనా మధ్య ఇప్పటికే పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. టారిఫ్‌ విషయంలో ఇప్పటికీ ఇరు దేశాల మధ్య వైరం కొనసాగుతోంది. ఇక చైనా ఎదగకుండా చేయడమే లక్ష్యంగా ట్రంప్‌ పనిచేస్తుంటే.. అమెరికాను అగ్రస్థానం నుంచి దించి తాము నిలవాలని చైనా ప్రయత్నిస్తోంది. ఇలాంటి తరుణంలో డొనాల్డ్‌ ట్రంప్‌ చైనా పర్యటన చర్చనీయాంశమైంది. ఈ పర్యటనలో అధ్యక్షుల స్థాయి సమావేశం రాజకీయంగా, భద్రతాపరంగా ఒక పరీక్షగా నిలిచింది. అప్పనమ్మకాల మధ్య అధ్యక్షుల భేటీ కీలకంగా మారింది. ఇదే సమయంలో వైట్‌ హౌస్‌ సిబ్బంది, అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు ట్రంప్‌ భద్రత కోసం ఉపయోగించే డివైస్‌లను కూడా చైనా పనిచేయకుండా చేసింది.

చైనాలో పనిచేయాని మెరికా ట్రిక్కులు
రెండు రోజుల పర్యటన నిమిత్తం బీజింగ్‌ వెళ్లిన ట్రంప్‌ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో గురువారం భేటీ అయ్యారు. ఈ వేదికవద్ద చైనా మీడియా సిబ్బంది దూసుకువచ్చారు. అప్పటికే అక్కడ ఉన్న అమెరికా ప్రతినిధులను తోసుకుంటూ వెళ్లారు. ఈ ఘటనలో ఒక అమెరికా ప్రతినిధి కిందపడి గాయపడ్డాడు. ఈ విషయమై చైనా ప్రతినిధులపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆలయంలోకి అనుమతి నిరాకరణ..
ఇక చైనాలోని టెంపుల్‌ ఆఫ్‌ హెవెన్‌ పరిధిలో ఇరు దేశాల అధ్యక్షులు సందర్శించారు. ఈ సమయంలో అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్‌ వద్ద తుపాకీ ఉందన్న అతడిని టెంపుల్‌లోకి అనుమతించలేదు. ఆయుధాన్ని ఇచ్చి వెళ్లాలని సూచించారు. ఇందుకు అమెరికా ప్రతినిధులు అంగీకరించలేదు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. సుమారు 30 నిమిషాల తర్వాత మరో సీక్రెట్‌ అధికారిని అనుమతించారు. గన్‌తో ఉన్న ఏజెంట్‌ బయటే ఉండిపోయాడు.

జర్నలిస్టులపై ఆంక్షలు..
ప్రెసిడెన్షియల్‌ కాన్వాయ్‌ చక్రంలో అమెరికా జర్నలిస్టులను అడ్డుకోవడం, హైడ్రేషన్‌ సదుపాయాలపై పరిమితులు పెట్టడం వంటి చర్యలు పర్యటన వ్యాపారిక పారదర్శకత లోపాన్ని ఎత్తి చూపాయి. ఒక దేశం ఆహ్వానించిన శిఖర సమావేశానికి రిపోర్టింగ్‌ ప్రధానం. కానీ దానిపైనే ఆంక్షలు పెట్టడం ద్వారా తాము అమెరికా వ్యతిరేకతను ప్రదర్శించింది. దీనిపై అమెరికా ప్రతినిధుల ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత చరిత్ర..
చైనా ఇలా వ్యవహరించడం ఇదే తొలిసారి కాదు. 2017లో కూడా ట్రంప్‌ బీజింగ్‌ వెళ్లినప్పుడు గొడవలు జరిగాయి. ఇరువర్గాల మధ్య భద్రతా ప్రోటోకాల్‌లలో తేడాలు, ఇతర అంశాలు విభేదాలకు కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో నమ్మకాన్ని తిరిగి నిర్మించడం, ప్రటోకాల్‌లపై స్పష్టమైన ఒప్పందం, మీడియా అనుమతిపై ముందస్తు అవగాహనల అవసరం.

చైనా భద్రతా విధానాలు, జాతీయ రీతులపై ప్రత్యేక హక్కులు వారికే ఉంటాయి. అయితే అతిథులు వచ్చినప్పుడు వీటి గురించి ముందే తెలియజేయాలి. ఇప్పటికే అమెరికా చైనా మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ తరుణంలో రాజకీయ, వ్యూహాత్మక విధానాలు అవలంభించడం ద్వారా ఇరు దేశాలు అభాసుపాలవుతున్నాయి. ప్రోటోకాల్, భద్రతా సంస్కృతి, మీడియా పరస్పర క్రియల సమన్వయమై నడవాలి. లేకుంటే చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యగా మారుతాయి.

 

మధ్య తరగతిపై ‘పెట్రో’ బాంబ్‌.. ఇంటి బడ్జెట్‌ తలకిందులు..!

Petrol Price Hike
Petrol Price Hike

Petrol Price Hike: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే కేంద్రం పెట్రోల్, డీజిల్‌ ధరలు పెంచుతుందని విపక్షాలు పదే పదే చెబుతూ వస్తున్నాయి. కేంద్రం దీనిని కొట్టిపారిసేంది. కానీ అందరూ ఊహించిందే జరిగింది. ఎన్నికల అనంతరం కమర్షియల్‌గ్యాస్‌ సిలిండర్‌ ధర భారీగా పెంచిన కేంద్రం, తాజాగా పెట్రోల్, డీజిల్‌పై రూ.3 పైగా పెంచింది. ఇది సమాన్య, మధ్య తరగతి ప్రజలకు పెద్ద భారం. రోజువారీ అవసారాలపైనా ప్రభావం ఉంటుంది. పేద, మధ్య తరగతి కుటుంబాల బడ్జెట్‌ను తలకిందులు చేస్తుంది. ప్రత్యేకించి నగర మధ్యతరగతి, ఇళ్ల సర్వీసులపై ఆధారపడి ఉండే ప్రజలపై ఈ ప్రభావం ఎక్కువ.

ప్రాథమిక ప్రభావాలు..
పెట్రో ధరల పెంపుతో మొదటగా రవాణా చార్జీల పెరుగుతాయి. ఆటో, క్యాబ్‌ ఫేర్‌లు, లోకల్‌ బస్సు రేట్లు, ఇంటర్‌సిటీ బస్సుల చార్జీలు పెరుగుతాయి. ఇది ఉద్యోగాలకి వెళుతూ వచ్చిన ఖర్చును పెంచుతుంది. వేతనంలో కోత పడుతుంది. ఇక నిత్యావసరాలైన కూరగాయలు, పండ్లు, పాలు, రేషన్‌ వస్తువుల ధరలు పెరుగుతాయి. ముఖ్యంగా తాజా సరఫరాల్లో ట్రాన్స్‌పోర్ట్‌ భాగం పెద్ద భాగం కావడంతో ఇది ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ, ఈకామర్స్‌ షిప్పింగ్‌ ఫీజులు, రికవరీ ఛార్జీలు పెరుగుతాయి. పరోక్షంగా… వ్యవసాయం (ట్రాక్టర్‌ ఇంధనము), నిర్మాణం (ప్రాజెక్ట్‌ డైమెండ్‌), లోజిస్టిక్స్‌ ఇంధన ఆధారిత వ్యయాలు పెరిగినప్పుడే ఉత్పత్తి ఖర్చు పైకి తీసుకుంటుంది.

మధ్యతరగతి కుటుంబాలపై ప్రభావం..
సామాన్య నగర కుటుంబం ఒక నెలలో కనీసం 5–8 శాతం అదనపు ఖర్చు భరించాల్సి వస్తుందని ఆర్థిక విశ్లేషణలు సూచిస్తాయి. ట్రాన్స్‌పోర్ట్‌ బేస్డ్‌ ఉద్యోగాలు కలిగినవారు, పిల్లల స్కూల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఖర్చులు పెరిగి బడ్జెట్‌ లెక్కలు మారుతాయి. ఉపాధి ఆధారిత ఆదాయాలు మారుతుంటే వినియోగం తగ్గి ఎంఎస్‌ఎంఈల డిమాండ్‌ దెబ్బ తింటుంది. ఆర్థిక చక్రం నెగెటివ్‌లోకి వెళ్తుంది.

తక్షణ పరిష్కారాలు..
పేద, మధ్యతరగతికి నేరుగా ఇంధన/రవాణా సబ్సిడీలతో రాష్ట్ర ప్రభుత్వాలు ఉపశమనం కలిగించాలి. బస్సు/మెట్రో ఫ్యార్స్‌లో రవాణా చార్జీలు పెరగకుండా చర్యలు తీసుకోవాలి. రైతులపై భారం పడకుండా సబ్సిడీలు పెంచాలి. స్థానిక సరఫరా గొలుసులను బలోపేతించడం ద్వారా తాజా ఉత్పత్తుల ధరలను నిలుపుకోవచ్చు. దీర్ఘకాలికంగా ప్రభావం తగ్గించేందుకు ప్రత్యామ్నాయాలైన ఈవీ, సోలార్‌ వాహనాల వినియోగం పెంచాలి. లాజిస్టిక్స్‌ ఎఫిషియెన్సీ, ఫ్లీట్‌ మెనేజ్‌మెంట్‌ ద్వారా ఇంధన వినియోగాన్ని నవీకరించాలి. ఉపాధి గ్యారంటీ స్కీమ్స్‌ ద్వారా షార్ట్‌టర్మ్‌ ఇన్‌కం సపోర్ట్‌ ఇవ్వాలి.

లీటరుకు రూ.3 పెరిగినదే తక్కువగా అనిపించవచ్చు. కానీ అది సామాన్యుడి రోజువారీ జీవితంపై ప్రభావాన్ని చూపుతుంది. రోడ్‌ చార్జీల నుంచి నిత్యావసరాల వరకు అన్నీ పెరుగుతాయి. తక్షణ ఉపశమనం అవసరమే అయినప్పటికీ, దీర్ఘకాలిక, నిర్మాణాత్మక మార్పులు అవసరం. ప్రభుత్వం, పరిశ్రమలు, సామాజిక రంగం కలిసి చర్య తీసుకుని వినియోగదారుల బడ్జెట్‌ను రక్షించకపోతే తదుపరి కొన్నేళ్లలో సామాజిక, ఆర్థిక ఒత్తిడి మరింత పెరుగుతుంది.

సినిమా ఇండస్ట్రీ కి ప్రాబ్లమ్స్ వస్తే క్లియర్ చేసే వాళ్లేవరున్నారు...

Telugu Film Industry
Telugu Film Industry

Telugu Film Industry: సినిమా ఇండస్ట్రీలో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే దాని గురించి పట్టించుకునే నాధుడు లేకుండా పోయారు. ఒకప్పుడు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా దాసరి నారాయణ రావు ఉండేవారు. అతని దగ్గరికి ఏ ప్రాబ్లంతో వెళ్లిన కూడా దానికి ఒక సొల్యూషన్ చూపించేవారు. కానీ ఇప్పుడు అలా ఇండస్ట్రీకి పెద్దదిక్కు అనేవారు ఎవరు లేకుండా పోవడంతో చాలామంది చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చిన్న సినిమాల విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక దానికి తోడుగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల విషయంలో ప్రొడ్యూసర్లు ఎలాంటి నిర్ణయాలను తీసుకోవాలి. వాళ్ళు తీసుకునే నిర్ణయాల మీదనే సింగిల్ స్క్రీన్ భవిష్యత్ ఆధారపడి ఉంది.

ఇక ఇలాంటి సమయంలో వాళ్ళు ఎలాంటి డిసీజన్స్ తీసుకుంటారు అనే దాని మీద కూడా చాలా రకాల కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే సమయంలో దాసరి నారాయణరావు ఉండి ఉంటే దానికి ఒక క్లియర్ కట్ సొల్యూషన్ తీసుకొచ్చి ఉండేవాడని ఆయన లేకపోవడం వల్ల ఆయన బాధ్యతను ఎత్తుకున్న వారు కూడా ఎవరు లేరు. దీని వలన ప్రొడ్యూసర్స్ అలాగే ఎగ్జిబ్యూటర్ల మధ్య విపరీతమైన విభేదాలైతే వస్తున్నాయి.

వీటన్నింటినీ పక్కన పెట్టాలంటే ఇండస్ట్రీ పెద్ద అనే వాళ్ళు ఒకరు ఉండాలి. వాళ్ళు ఏదైనా డిసిషన్ తీసుకున్నారు అంటే అది ఫైనల్ డెసిజన్ అయి ఉండాలి. అలా దానికి అందరు కట్టుబడి ఉండే విధంగా చూసినట్లయితే మాత్రం ఇండస్ట్రీ చాలా సంవత్సరాల పాటు చక్కగా ముందుకు సాగుతుంది. లేకపోతే మాత్రం ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వెళ్తే మాత్రం ఇండస్ట్రీ కూలిపోయే ప్రమాదం ఉంది.

అలాగే ప్రేక్షకులకు క్వాలిటీ సినిమాలను అందించడంలో కూడా మేకర్స్ చాలా వరకు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి రావచ్చు… అందుకే ఇండస్ట్రీ ని కాపాడుకోవడానికి ఇండస్ట్రీ పెద్ద ఉండాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇండస్ట్రీ పెద్దగా ఎవరో ఒకరిని నియమించి ఇండస్ట్రీలో ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ చూపించే విధంగా అడుగులు వేస్తే బాగుంటుందని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు…

ప్రభాస్ ఆ నలుగురు హీరోలను ఎంకరేజ్ చేస్తున్నాడా...

Prabhas
Prabhas

Prabhas: ఈశ్వర్ సినిమాతో తన నట ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ప్రభాస్ ఆ సినిమాతో ఎక్కడలేని గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన సక్సెసులు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. బాహుబలి తో పాన్ ఇండియా సక్సెస్ లను సాధించిన ఆయన ఆ తర్వాత చేసిన సినిమాలతో సైతం పాన్ ఇండియా రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు. రాజాసాబ్ సినిమాతో భారీ డిజాస్టర్ ని మూటగట్టుకున్న ఆయన ఇప్పుడు చేస్తున్న సినిమాలతో పెను సంచలనాలను క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో గొప్ప విజయాలను క్రియేట్ చేయగలిగే హీరోలలో ప్రభాస్ కూడా ఒకరు కావడం విశేషం…ఇక ప్రభాస్ తనతో పాటు తన ఫ్రెండ్స్ ను కూడా హీరోలుగా ఎంకరేజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది… ఇంతకీ తన ఫ్రెండ్స్ ఎవరు అంటే గోపీచంద్, శర్వానంద్, సంతోష్ శోభన్, సంగీత్ శోభన్ లు కావడం విశేషం…

ఈ నలుగురితో సినిమాలు చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నాడు. అలాగే క్రియేషన్స్ నుంచి కూడా వెళితే సినిమాలు చేయించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ తను హీరో గానే కాకుండా తను ఒక మంచి ఫ్రెండ్ గా కూడా గుర్తింపును సంపాదించుకుంటున్నాడు… తనతో పాటు తన ఫ్రెండ్స్ ని కూడా టాప్ హీరోలుగా నిలబెట్టడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు.

ఇక ఈ క్రమంలోనే ప్రభాస్ తన స్నేహితులను సైతం హీరోలుగా నిలబెట్టాలని చేస్తున్న ప్రయత్నం సక్సెస్ అవుతుంది. ఇప్పటివరకు వాళ్ళందరు టాప్ లెవల్లో ఉన్నారని ప్రభాస్ వాళ్ళందరికీ సూపర్ సక్సెస్ ని కట్టబెట్టి మళ్ళీ లైన్ లోకి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నాడు. సంతోష్ శోభన్, సంగీత్ శోభన్ లను ఎంకరేజ్ చేయడానికి వాళ్ల నాన్న శోభన్ కారణమని చెబుతున్నారు.

ఎందుకంటే శోభన్ ప్రభాస్ కి వర్షం సినిమాతో సూపర్ సక్సెస్ ని అందించాడు. అందుకే వాళ్ళ మీద కృతజ్ఞతను చూపిస్తూ వారికి సక్సెస్ లను కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ఇవాళ సినిమాల ప్రమోషన్స్ లో పాల్గొంటూ దానిమీద భారీ బజ్ క్రియేట్ అయ్యే విధంగా చేస్తున్నాడు…

నీట్ పేపర్ లీకేజీ.. నిందితుడు మామూలోడు కాదు.. అత్తెసరు మార్కులతో గవర్నమెంట్ కాలేజీ లో మెడికల్ సీట్

NEET Paper Leak
NEET Paper Leak

NEET Paper Leak: కొత్త బొక్కలను పూడ్చే క్రమంలో పాత వ్యవహారాలు బయటపడ్డట్టు.. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారాన్ని విచారణ చేస్తున్న సిబిఐ అధికారులకు కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఈ క్రమంలోనే గతంలో జరిగిన లీక్ వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి.

నీట్ పేపర్ లీకేజీలో కీలక సూత్రధారిగా వికాస్ ను ఇప్పటికే సిబిఐ అధికారులు గుర్తించారు. అయితే అతడు గత ఏడాది యష్ యాదవ్ అనే వ్యక్తి నుంచి నీట్ ప్రశ్న పత్రం కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది కూడా అక్కడినుంచి వికాస్ ఈ పేపర్ కొనుగోలు చేసినట్టు సమాచారం. అయితే ఈ కొనుగోలు వ్యవహారంలో యష్ తండ్రి మంగీలాల్, మామ దినేష్ హస్తం కూడా ఉన్నట్టు సమాచారం. వికాస్ సోదరి ప్రగతి.. దగ్గరి బంధువులు సానియా, గుంజన్, పలాక్ కూడా గత ఏడాది మెడికల్ సీట్లు పొందారు. లీక్ అయిన పేపర్ ద్వారానే వీరు సీట్లు సాధించినట్లు సమాచారం.

మామూలోడు కాదు

వికాస్ పదో తరగతిలో 63% మార్కులు మాత్రమే సాధించాడు. ఇంటర్లో 55% మార్కులు వచ్చాయి. 2024 లో నీట్ రాస్తే 720 మార్కులకు గాను 240 మార్కులు మాత్రమే సాధించాడు. సికార్ ప్రాంతంలో ఒక శిక్షణ కేంద్రంలో 46 పరీక్షలు రాశాడు. సగటున 384 మార్కులు మాత్రమే సాధించాడు. అయితే 2025లో 85.11 పర్సంటేజ్ తో ఏకంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీటు సంపాదించాడు.

వికాస్ సోదరి ప్రగతికి పదవ తరగతిలో 69 శాతం మార్కులు వచ్చాయి. ఇంటర్లో 91% సాధించింది. 2024లో నీట్ పరీక్ష రాస్తే 720 మార్కులకు గాను 355 వచ్చాయి. సికార్ ప్రాంతంలో కోచింగ్ సెంటర్లో 50 నమూనా పరీక్షలు రాసింది. ఎప్పుడు కూడా ఆమెకు 320 నుంచి 342 మార్కులు దాటలేదు. 2025లో మాత్రం ఆమెకు 92.53% వచ్చింది. నీతో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది.

వికాస్ దగ్గర బంధువు సానియాకు పదవ తరగతిలో 63%, 12వ తరగతిలో 89% మార్కులు వచ్చాయి. 2024 లో నీట్ రాస్తే 320 మార్కులు వచ్చాయి. సికార్ లో 49 మోడల్ టెస్టులు రాస్తే ఆమెకు ఏకంగా 515 నుంచి 550 మార్కులు మాత్రమే వచ్చాయి. 2025లో నీట్ రాస్తే 98.61 పర్సంటేజ్ వచ్చింది. ఆమె జైపూర్ ప్రాంతంలో ఓ గవర్నమెంట్ కాలేజీలో చదువుతోంది.

ఇప్పుడు కూడా వికాస్ కుటుంబ సభ్యులు రిషి అనే తమ బంధువు కోసం పేపర్ కొనుగోలు చేశారు. ఇతడికి పదవ తరగతిలో 43 శాతం.. ఇంటర్లో 50% మాత్రం మార్కులే వచ్చాయి..

పేపర్ లీకేజ్ వ్యవహారంలో సరికొత్త విషయాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో.. సిబిఐ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

సూర్య 'వీరభధ్రుడు' ట్విట్టర్ ఆడియన్స్ టాక్ ఇదే.. అదేమీ సెకండ్ హాఫ్ సామీ..

Suriya Veerabhadrudu Twitter Talk
Suriya Veerabhadrudu Twitter Talk

Suriya Veerabhadrudu Twitter Talk: తమిళ హీరో సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘కరుప్పు ‘ నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. నిన్ననే ఈ చిత్రం విడుదల అవ్వాల్సింది , కానీ కొన్ని ఆర్ధిక సమస్యల కారణంగా నేటికీ వాయిదా పడింది. ఓపెనింగ్స్ బాగా ఎఫెక్ట్ అవుతుందని అందరూ అనుకున్నారు కానీ , తమిళనాడు లో బ్లాక్ బస్టర్ ఓపెనింగ్ దక్కింది అనే చెప్పొచ్చు. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 23 వేల టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. ఇది సాధారణమైన విషయం కాదు , ఈమధ్య కాలంలో ఏ సూర్య సినిమాకు కూడా ఈ రేంజ్ బుకింగ్స్ జరగలేదు. మరి ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ వచ్చిందా లేదా? , ట్విట్టర్ ఆడియన్స్ ఈ చిత్రం గురించి ఏమి అనుకుంటున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ మొదటి 15 నిమిషాలు , ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయిందని, ఓవరాల్ ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా బాగుందని అంటున్నారు. ముఖ్యంగా డైరెక్టర్ ఆర్జే బాలాజీ పట్టుకున్న పాయింట్ చాలా అద్భుతంగా ఉందని, ఇలాంటి ఆలోచన ఈమధ్య కాలం లో ఏ డైరెక్టర్ కూడా చెయ్యలేదని అంటున్నారు. సూర్య నటన కూడా అదిరిపోయిందని అంటున్నారు. కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఆ రేంజ్ లో తియ్యలేదని ఈ చిత్రాన్ని ట్విట్టర్ లో చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు. బాగా డ్రాగ్ చేసారని , ఆరవ అతి వేరే లెవెల్ లో ఉందని అంటున్నారు. కానీ చివరి 15 నిమిషాలు మాత్రం వేరే లెవెల్ లో తీసాడట డైరెక్టర్. కాస్త కాంతారా క్లైమాక్స్ ని పోలినట్టు అనిపిస్తుంది అట , ఆడియన్స్ కి పర్వాలేదు అనిపించొచ్చు కానీ , సూర్య ఫ్యాన్స్ కి మాత్రం ఆ 15 నిమిషాలు వేరే లెవెల్ లో అనిపిస్తుందని అంటున్నారు.

ఓవరాల్ గా ఒక్క ముక్కలో చెప్పాలంటే , ఈమధ్య కాలం లో విడుదలైన సూర్య సినెమాలన్నిటికంటే ఈ చిత్రం బాగుంది అనే చెప్పాలి. కరువులో ఉన్న ఆడియన్స్ కచ్చితంగా థియేటర్స్ లో ఎంటర్టైన్ అవుతారు , అందులో ఎలాంటి సందేహం లేదు , ఓవరాల్ గా ఈ చిత్రం కమర్షియల్ గా వర్కౌట్ అవ్వొచ్చు అనే చెప్పాలి. అదే కనుక జరిగితే సూర్య ఫ్యాన్స్ ఆనందం తో ఉక్కిరిబిక్కిరి అవుతారు అనొచ్చు. మరో విషయం ఏమిటంటే , ఈ చిత్రానికి త్రిష గోల్డెన్ హ్యాండ్ సెంటిమెంట్ కూడా బాగా కలిసొచ్చింది అని చెప్పొచ్చు , సాయి అభయంకర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని అంచనాలకు తగ్గట్టుగా కొట్టి ఉంటే ఈ సినిమా రేంజ్ ఇంకా బాగా పెరిగేది అంటున్నారు నెటిజెన్స్.

తమిళ మాస్ మసాలా వీరభద్రుడు రివ్యూ

Veerabhadrudu Review
Veerabhadrudu Review

Veerabhadrudu Review: నటీనటులు: సూర్య, త్రిష, ఇంద్రన్స్, నట్టి నటరాజ్, స్వసిక, అనఘ మాయ రవి, సుప్రీత్ రెడ్డి, యోగి బాబు తదితరులు

సంగీత దర్శకుడు: సాయి అభ్యంకర్

ఛాయాగ్రహణం: జి.కె. విష్ణు

ఎడిటర్: ఆంథోనీ

దర్శకుడు: ఆర్జే బాలాజీ

నిర్మాత: ఎస్.ఆర్. ప్రభు

వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ లాంటి సూర్య ఈమధ్య నటించిన సినిమాలు చెప్పుకోదగ్గ విజయం సాధించలేదు. దీంతో రూటు మార్చి మాస్ ఎలిమెంట్స్ మేళవించిన ఒక ఫాంటసీ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, ఆర్థికపరమైన కారణాల వల్ల ఒక రోజు ఆలస్యంగా నేడు థియేటర్లలోకి వచ్చింది. భారీ అంచనాల సంగతి దేవుడెరుగు సాదా సీదా అంచనాలు కూడా లేకుండా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం.

పోలీసు స్టేషన్లకు పోతే మంచి జరుగుతుందన్న నమ్మకం, కోర్టు మెట్లెక్కితే న్యాయం జరుగుతుందన్న భరోసా ఎక్కువశాతం ప్రజల్లో లేదు ఆనే మాట నిర్వివాదాంశం. ఇలాంటి పరిస్థితుల్లో ఏటికెదురీదుతూ బాధితులకు న్యాయం ఎలా అందేలా చేశారు ఆనే థీమ్ తో ఇప్పటికీ ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే వీరభద్రుడు ఇదే థీమ్ లో తెరకెక్కిన సినిమా. ఆ థీమ్ కు ఫ్యాంటసీ ఎలిమెంట్స్ జోడించి ఈ సినిమాకే ఒక కొత్త ఫ్లేవర్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. నాంపల్లి కోర్టులో కొంతమంది లాయర్లు సిండికేట్ గా మారి అక్కడికి వచ్చే బాధితులను పీడిస్తూ ఉంటారు. వారిని బెదిరించి, కేసులను ఆలస్యం చేసి డబ్బు గుంజుతూ ఉంటారు. ఆ కోర్టులో ఎవరికీ న్యాయం జరగదు. ఇలానే ఇంద్రన్స్ కూతురికి అన్యాయం జరుగుతుంది. దీంతో చలించిపోయిన అతను కోర్టు బయట ఉన్న వీరభద్రుడి విగ్రహం దగ్గరకు వెళ్లి న్యాయం చేయాలని వేడుకుంటాడు. అప్పుడు వీరభద్రుడు మనిషి అవతారం లో ఎంట్రీ ఇచ్చి సిండికేట్ లాయర్లలో ఒకరైన RJ బాలాజీ బెదిరిస్తాడు, బాధితుడికి న్యాయం చేయమని అల్టిమేటమ్ ఇస్తాడు. అయితే అతను బెదరకుండా, కోర్టుల్లో అవినీతి, బంధుప్రీతి లాంటివి కామన్ అని, నువ్వు చెప్పిన వ్యక్తికి న్యాయం చేయాలంటే డబ్బు, లంచాలతో పని చేయిస్తా అంటాడు. వీరభద్రుడు అందుకు ఒప్పుకోడు. అప్పుడు RJ బాలాజీ వీరభద్రుడితో ఈ కోర్టులో మీ మాట చెల్లదు అని, మీకు చేతనైతే వచ్చి కేసు వాదించి గెలవాలని సవాల్ చేస్తాడు. వీరభద్రుడు అందుకు ఒప్పుకుంటాడు. తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? దైవాంశతో వచ్చిన వీరభద్రుడు కోర్టులో న్యాయం వైపు నిలబడి బాధితులకు ఊరటనిచ్చారా? కోర్టుల్లో ఏలాంటి మార్పులు తీసుకొచ్చారు అనేది మిగతా కథ. గ్రామీణ నేపథ్యంలో మొదలైన ఈ కథ, వ్యవస్థలోని లోపాలను వేలెత్తి చూపుతూ, అన్యాయంపై ఒక అతీంద్రియ శక్తి చేసే పోరాటంగా సాగుతుంది.

దర్శకుడు ఆర్జే బాలాజీ ఒక మాస్ ఎంటర్టైనర్ కు ఫాంటసీ ఎలిమెంట్స్ జోడించి ఈ కథను ఆసక్తికరంగానే మొదలుపెట్టాడు. ఫస్ట్ హాఫ్ లో కథా నేపథ్యం, సూర్య ఎంట్రీ మరియు విజువల్స్ తో సినిమా వేగంగా సాగుతుంది. ముఖ్యంగా సూర్యను ఒక పవర్ ఫుల్ గార్డియన్ (శక్తి) గా చూపించిన విధానం డిఫరెంట్ గా ఉంది. అయితే కొన్ని సన్నివేశాలు ఆసక్తికరంగా సాగినప్పటికీ చివరివరకూ అదే టెంపో కొనసాగించలేకపోయారు. ఎప్పుడైతే ఒక దైవిక శక్తి అన్యాయాలపై పోరాటానికి పూనుకుందో అక్కడ కథలో ఆటోమేటిక్ గా ఆసక్తి సన్నగిల్లింది. మరొక అంశం ఏంటంటే, ఈ సినిమాలో ఒకవైపు యాక్షన్, మరోవైపు అఖండ టైపు శక్తి, ఇంకోవైపు కోర్టుల లో జరిగే అవినీతి, అంతులేని ఆలస్యం లాంటి సమస్యలు.. ఇలాంటివి నాలుగైదు ఉండడంతో సినిమా రకరకాలుగా అనిపిస్తూ ఉంటుంది. అక్కడక్కడా ప్రిడిక్టబుల్ గా, బోరింగ్ గా అనిపించే సన్నివేశాలు కూడా ఉన్నాయి. స్క్రిప్టును ఇంకాస్త టైట్ గా తీర్చిదిద్ది ఉంటే సినిమా బెటర్ గా ఉండేదేమో. ఇప్పటికైతే మాస్ మసాలా మిక్చర్ లాగా ఉంది. పెద్ద రిలీఫ్ ఏంటంటే హీరో – హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ పెట్టి ఆల్రెడీ ఉన్న కన్ఫ్యూజన్ ను మరింత పెంచకపోవడం.

సూర్య మరోసారి తన నటనతో సినిమాను ఒంటిచేత్తో నడిపించారు. యాక్షన్ సీక్వెన్స్ లలో సూర్య ఇంటెన్సిటీ అదిరిపోయింది. వీరభద్రుడి అవతారంలో సూర్య డ్యాన్స్ పుష్పలో అల్లు అర్జున్ ను చూసి ఇన్స్పైర్ అయ్యి చేసినట్టుగా అనిపించింది. అడ్వొకేట్ గా త్రిష తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఈ సినిమా దర్శకుడు RJ బాలాజీ అడుగడుగునా సూర్యకు అడ్డుతగిలే సిండికేట్ లాయర్ పాత్రలో చక్కగా నటించాడు, ఓ వైపు విలనీ మరోవైపు కామెడీతో ఆకట్టుకున్నాడు. సపోర్టింగ్ కాస్ట్ లో ఇంద్రన్స్ మరియు నట్టి కీలక పాత్రల్లో మెప్పించారు.

సాయి అభ్యంకర్ పాటలు సొసోగా ఉన్నాయి కానీ నేపథ్య సంగీతం కొత్త ఫ్లేవర్ తో సాగింది. తమిళ మాస్ అనగానే తప్పెట్లు కొట్టడం అన్నట్టు కాకుండా ఫ్రెష్ ఫీల్ తో సాగింది. జి.కె. విష్ణు సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ కూడా డీసెంట్ గా ఉన్నాయి. ముఖ్యంగా వీరభద్రుడు రెడ్ కలర్ నేపథ్యంలో వచ్చే షాట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

ఇందులో ఏం బాగున్నాయో తెలుసా?

1. సూర్య నటన

2. కొత్త తరహా ఫాంటసీ కథాంశం

3. మాస్ ప్రేక్షకులను మెప్పించే యాక్షన్ సీన్స్

సినిమాలో బాగోలేనివి ఇవీ..

1. సెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల సాగదీత

2. ప్రిడిక్టబిలిటీ

రేటింగ్: 2.5/ 5

ఫైనల్ వర్డ్: సమ్మర్ లో టైమ్ పాస్ తమిళ మసాలాను ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు ఒక లుక్ వేయవచ్చు. ప్రతి లాజిక్ ను పట్టి పట్టి చూస్తాం, దేవుళ్ళు లేరు దెయ్యాలు లేరు అని కఠిన కఠోర వాదనలు చేసే వేదాంతులు ఈ సినిమా థియేటర్లకు లక్ష కిలోమీటర్ల దూరంలో ఉండండి.