Homeఎంటర్టైన్మెంట్Dragon Glimpse Leaked: ఎడారిలో జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం.. 'డ్రాగన్' గ్లింప్స్ లీక్ అయిపోయింది..

Dragon Glimpse Leaked: ఎడారిలో జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం.. ‘డ్రాగన్’ గ్లింప్స్ లీక్ అయిపోయింది..

Dragon Glimpse Leaked: మరో 5 రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రాబోతుంది. అభిమానులు మే 20 కోసం ప్రతీ ఏడాది ఎంతలా ఎదురు చూస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ఏడాది వాళ్లకు చాలా స్పెషల్ గా జీవితాంతం గుర్తు ఉండిపోబోతుంది. ఎందుకంటే ఆరోజున ఎన్టీఆర్ కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వరద లాగా రానున్నాయి. ముందుగా ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ తో కలిసి చేస్తున్న ‘డ్రాగన్’ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ వీడియో విడుదల […]

Dragon Glimpse Leaked: మరో 5 రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రాబోతుంది. అభిమానులు మే 20 కోసం ప్రతీ ఏడాది ఎంతలా ఎదురు చూస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ఏడాది వాళ్లకు చాలా స్పెషల్ గా జీవితాంతం గుర్తు ఉండిపోబోతుంది. ఎందుకంటే ఆరోజున ఎన్టీఆర్ కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వరద లాగా రానున్నాయి. ముందుగా ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ తో కలిసి చేస్తున్న ‘డ్రాగన్’ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ వీడియో విడుదల కాబోతుంది. ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు , అర్థ రాత్రి 12 గంటలకు ఈ గ్లింప్స్ వీడియో ని విడుదల చేయబోతున్నారు. ఈ గ్లింప్స్ కోసం కేవలం ఎన్టీఆర్ అభిమానులు మాత్రమే కాదు , టాలీవుడ్ మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోంది. ఎందుకంటే ఎన్టీఆర్ కెరీర్ లోనే ఇది చాలా స్పెషల్ చిత్రం , దీనికి బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టేంత సత్తా ఉంది కాబట్టి.

అయితే ఈ గ్లింప్స్ వీడియో గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది , అభిమానులు అయితే మెంటలెక్కిపోతున్నారు. ఒక నిటారు ఎడారిలో జూనియర్ ఎన్టీఆర్ స్పోర్ట్స్ కారు వేసుకొని స్టైల్ గా ఎంట్రీ ఇస్తాడని, ఒక పవర్ ఫుల్ డైలాగ్ కూడా ఆ గ్లింప్స్ వీడియో లో ఉంటుందని అంటున్నారు. ప్రశాంత్ నీల్ సినిమాలు అంటే , డార్క్ షెడ్ లో కలర్ గ్రేడింగ్ ఉంటుంది అనే సంగతి మన అందరికీ తెలిసిందే. కానీ ఈ చిత్రం లో మాత్రం ఆయన రూటు మార్చి , మామూలు కలర్ గ్రేడింగ్ తోనే ఈ చిత్రాన్ని షూట్ చేశాడట . గ్లింప్స్ వీడియో హాలీవుడ్ స్టాండర్డ్స్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంటుందని , ఎన్టీఆర్ చాలా డాషింగ్ లుక్ తో కనిపిస్తాడని అంటున్నారు.

ఇకపోతే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మొదటి భాగం జూన్ 11 ,2027 లో విడుదల కాబోతుంది , రెండవ భాగం డిసెంబర్ 2027 న విడుదల కాబోతుంది. ఈ రెండు సినిమాలకు సంబంధించిన షూటింగ్ ని ఒకేసారి పూర్తి చేసే పనిలో ఉన్నాడట ప్రశాంత్ నీల్. ఈ చిత్రంలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటిస్తోంది. రీసెంట్ గానే జార్జియా లో ఎన్టీఆర్ పై కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలను కూడా చిత్రీకరించారు, ఈ షాట్స్ ని కూడా గ్లింప్స్ వీడియో లో చూడొచ్చని అంటున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper