Home Blog Page 274

సూర్య 'వీరభధ్రుడు' ట్విట్టర్ ఆడియన్స్ టాక్ ఇదే.. అదేమీ సెకండ్ హాఫ్ సామీ..

Suriya Veerabhadrudu Twitter Talk
Suriya Veerabhadrudu Twitter Talk

Suriya Veerabhadrudu Twitter Talk: తమిళ హీరో సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘కరుప్పు ‘ నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. నిన్ననే ఈ చిత్రం విడుదల అవ్వాల్సింది , కానీ కొన్ని ఆర్ధిక సమస్యల కారణంగా నేటికీ వాయిదా పడింది. ఓపెనింగ్స్ బాగా ఎఫెక్ట్ అవుతుందని అందరూ అనుకున్నారు కానీ , తమిళనాడు లో బ్లాక్ బస్టర్ ఓపెనింగ్ దక్కింది అనే చెప్పొచ్చు. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 23 వేల టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. ఇది సాధారణమైన విషయం కాదు , ఈమధ్య కాలంలో ఏ సూర్య సినిమాకు కూడా ఈ రేంజ్ బుకింగ్స్ జరగలేదు. మరి ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ వచ్చిందా లేదా? , ట్విట్టర్ ఆడియన్స్ ఈ చిత్రం గురించి ఏమి అనుకుంటున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ మొదటి 15 నిమిషాలు , ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయిందని, ఓవరాల్ ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా బాగుందని అంటున్నారు. ముఖ్యంగా డైరెక్టర్ ఆర్జే బాలాజీ పట్టుకున్న పాయింట్ చాలా అద్భుతంగా ఉందని, ఇలాంటి ఆలోచన ఈమధ్య కాలం లో ఏ డైరెక్టర్ కూడా చెయ్యలేదని అంటున్నారు. సూర్య నటన కూడా అదిరిపోయిందని అంటున్నారు. కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఆ రేంజ్ లో తియ్యలేదని ఈ చిత్రాన్ని ట్విట్టర్ లో చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు. బాగా డ్రాగ్ చేసారని , ఆరవ అతి వేరే లెవెల్ లో ఉందని అంటున్నారు. కానీ చివరి 15 నిమిషాలు మాత్రం వేరే లెవెల్ లో తీసాడట డైరెక్టర్. కాస్త కాంతారా క్లైమాక్స్ ని పోలినట్టు అనిపిస్తుంది అట , ఆడియన్స్ కి పర్వాలేదు అనిపించొచ్చు కానీ , సూర్య ఫ్యాన్స్ కి మాత్రం ఆ 15 నిమిషాలు వేరే లెవెల్ లో అనిపిస్తుందని అంటున్నారు.

ఓవరాల్ గా ఒక్క ముక్కలో చెప్పాలంటే , ఈమధ్య కాలం లో విడుదలైన సూర్య సినెమాలన్నిటికంటే ఈ చిత్రం బాగుంది అనే చెప్పాలి. కరువులో ఉన్న ఆడియన్స్ కచ్చితంగా థియేటర్స్ లో ఎంటర్టైన్ అవుతారు , అందులో ఎలాంటి సందేహం లేదు , ఓవరాల్ గా ఈ చిత్రం కమర్షియల్ గా వర్కౌట్ అవ్వొచ్చు అనే చెప్పాలి. అదే కనుక జరిగితే సూర్య ఫ్యాన్స్ ఆనందం తో ఉక్కిరిబిక్కిరి అవుతారు అనొచ్చు. మరో విషయం ఏమిటంటే , ఈ చిత్రానికి త్రిష గోల్డెన్ హ్యాండ్ సెంటిమెంట్ కూడా బాగా కలిసొచ్చింది అని చెప్పొచ్చు , సాయి అభయంకర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని అంచనాలకు తగ్గట్టుగా కొట్టి ఉంటే ఈ సినిమా రేంజ్ ఇంకా బాగా పెరిగేది అంటున్నారు నెటిజెన్స్.

తమిళ మాస్ మసాలా వీరభద్రుడు రివ్యూ

Veerabhadrudu Review
Veerabhadrudu Review

Veerabhadrudu Review: నటీనటులు: సూర్య, త్రిష, ఇంద్రన్స్, నట్టి నటరాజ్, స్వసిక, అనఘ మాయ రవి, సుప్రీత్ రెడ్డి, యోగి బాబు తదితరులు

సంగీత దర్శకుడు: సాయి అభ్యంకర్

ఛాయాగ్రహణం: జి.కె. విష్ణు

ఎడిటర్: ఆంథోనీ

దర్శకుడు: ఆర్జే బాలాజీ

నిర్మాత: ఎస్.ఆర్. ప్రభు

వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ లాంటి సూర్య ఈమధ్య నటించిన సినిమాలు చెప్పుకోదగ్గ విజయం సాధించలేదు. దీంతో రూటు మార్చి మాస్ ఎలిమెంట్స్ మేళవించిన ఒక ఫాంటసీ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, ఆర్థికపరమైన కారణాల వల్ల ఒక రోజు ఆలస్యంగా నేడు థియేటర్లలోకి వచ్చింది. భారీ అంచనాల సంగతి దేవుడెరుగు సాదా సీదా అంచనాలు కూడా లేకుండా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం.

పోలీసు స్టేషన్లకు పోతే మంచి జరుగుతుందన్న నమ్మకం, కోర్టు మెట్లెక్కితే న్యాయం జరుగుతుందన్న భరోసా ఎక్కువశాతం ప్రజల్లో లేదు ఆనే మాట నిర్వివాదాంశం. ఇలాంటి పరిస్థితుల్లో ఏటికెదురీదుతూ బాధితులకు న్యాయం ఎలా అందేలా చేశారు ఆనే థీమ్ తో ఇప్పటికీ ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే వీరభద్రుడు ఇదే థీమ్ లో తెరకెక్కిన సినిమా. ఆ థీమ్ కు ఫ్యాంటసీ ఎలిమెంట్స్ జోడించి ఈ సినిమాకే ఒక కొత్త ఫ్లేవర్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. నాంపల్లి కోర్టులో కొంతమంది లాయర్లు సిండికేట్ గా మారి అక్కడికి వచ్చే బాధితులను పీడిస్తూ ఉంటారు. వారిని బెదిరించి, కేసులను ఆలస్యం చేసి డబ్బు గుంజుతూ ఉంటారు. ఆ కోర్టులో ఎవరికీ న్యాయం జరగదు. ఇలానే ఇంద్రన్స్ కూతురికి అన్యాయం జరుగుతుంది. దీంతో చలించిపోయిన అతను కోర్టు బయట ఉన్న వీరభద్రుడి విగ్రహం దగ్గరకు వెళ్లి న్యాయం చేయాలని వేడుకుంటాడు. అప్పుడు వీరభద్రుడు మనిషి అవతారం లో ఎంట్రీ ఇచ్చి సిండికేట్ లాయర్లలో ఒకరైన RJ బాలాజీ బెదిరిస్తాడు, బాధితుడికి న్యాయం చేయమని అల్టిమేటమ్ ఇస్తాడు. అయితే అతను బెదరకుండా, కోర్టుల్లో అవినీతి, బంధుప్రీతి లాంటివి కామన్ అని, నువ్వు చెప్పిన వ్యక్తికి న్యాయం చేయాలంటే డబ్బు, లంచాలతో పని చేయిస్తా అంటాడు. వీరభద్రుడు అందుకు ఒప్పుకోడు. అప్పుడు RJ బాలాజీ వీరభద్రుడితో ఈ కోర్టులో మీ మాట చెల్లదు అని, మీకు చేతనైతే వచ్చి కేసు వాదించి గెలవాలని సవాల్ చేస్తాడు. వీరభద్రుడు అందుకు ఒప్పుకుంటాడు. తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? దైవాంశతో వచ్చిన వీరభద్రుడు కోర్టులో న్యాయం వైపు నిలబడి బాధితులకు ఊరటనిచ్చారా? కోర్టుల్లో ఏలాంటి మార్పులు తీసుకొచ్చారు అనేది మిగతా కథ. గ్రామీణ నేపథ్యంలో మొదలైన ఈ కథ, వ్యవస్థలోని లోపాలను వేలెత్తి చూపుతూ, అన్యాయంపై ఒక అతీంద్రియ శక్తి చేసే పోరాటంగా సాగుతుంది.

దర్శకుడు ఆర్జే బాలాజీ ఒక మాస్ ఎంటర్టైనర్ కు ఫాంటసీ ఎలిమెంట్స్ జోడించి ఈ కథను ఆసక్తికరంగానే మొదలుపెట్టాడు. ఫస్ట్ హాఫ్ లో కథా నేపథ్యం, సూర్య ఎంట్రీ మరియు విజువల్స్ తో సినిమా వేగంగా సాగుతుంది. ముఖ్యంగా సూర్యను ఒక పవర్ ఫుల్ గార్డియన్ (శక్తి) గా చూపించిన విధానం డిఫరెంట్ గా ఉంది. అయితే కొన్ని సన్నివేశాలు ఆసక్తికరంగా సాగినప్పటికీ చివరివరకూ అదే టెంపో కొనసాగించలేకపోయారు. ఎప్పుడైతే ఒక దైవిక శక్తి అన్యాయాలపై పోరాటానికి పూనుకుందో అక్కడ కథలో ఆటోమేటిక్ గా ఆసక్తి సన్నగిల్లింది. మరొక అంశం ఏంటంటే, ఈ సినిమాలో ఒకవైపు యాక్షన్, మరోవైపు అఖండ టైపు శక్తి, ఇంకోవైపు కోర్టుల లో జరిగే అవినీతి, అంతులేని ఆలస్యం లాంటి సమస్యలు.. ఇలాంటివి నాలుగైదు ఉండడంతో సినిమా రకరకాలుగా అనిపిస్తూ ఉంటుంది. అక్కడక్కడా ప్రిడిక్టబుల్ గా, బోరింగ్ గా అనిపించే సన్నివేశాలు కూడా ఉన్నాయి. స్క్రిప్టును ఇంకాస్త టైట్ గా తీర్చిదిద్ది ఉంటే సినిమా బెటర్ గా ఉండేదేమో. ఇప్పటికైతే మాస్ మసాలా మిక్చర్ లాగా ఉంది. పెద్ద రిలీఫ్ ఏంటంటే హీరో – హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ పెట్టి ఆల్రెడీ ఉన్న కన్ఫ్యూజన్ ను మరింత పెంచకపోవడం.

సూర్య మరోసారి తన నటనతో సినిమాను ఒంటిచేత్తో నడిపించారు. యాక్షన్ సీక్వెన్స్ లలో సూర్య ఇంటెన్సిటీ అదిరిపోయింది. వీరభద్రుడి అవతారంలో సూర్య డ్యాన్స్ పుష్పలో అల్లు అర్జున్ ను చూసి ఇన్స్పైర్ అయ్యి చేసినట్టుగా అనిపించింది. అడ్వొకేట్ గా త్రిష తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఈ సినిమా దర్శకుడు RJ బాలాజీ అడుగడుగునా సూర్యకు అడ్డుతగిలే సిండికేట్ లాయర్ పాత్రలో చక్కగా నటించాడు, ఓ వైపు విలనీ మరోవైపు కామెడీతో ఆకట్టుకున్నాడు. సపోర్టింగ్ కాస్ట్ లో ఇంద్రన్స్ మరియు నట్టి కీలక పాత్రల్లో మెప్పించారు.

సాయి అభ్యంకర్ పాటలు సొసోగా ఉన్నాయి కానీ నేపథ్య సంగీతం కొత్త ఫ్లేవర్ తో సాగింది. తమిళ మాస్ అనగానే తప్పెట్లు కొట్టడం అన్నట్టు కాకుండా ఫ్రెష్ ఫీల్ తో సాగింది. జి.కె. విష్ణు సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ కూడా డీసెంట్ గా ఉన్నాయి. ముఖ్యంగా వీరభద్రుడు రెడ్ కలర్ నేపథ్యంలో వచ్చే షాట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

ఇందులో ఏం బాగున్నాయో తెలుసా?

1. సూర్య నటన

2. కొత్త తరహా ఫాంటసీ కథాంశం

3. మాస్ ప్రేక్షకులను మెప్పించే యాక్షన్ సీన్స్

సినిమాలో బాగోలేనివి ఇవీ..

1. సెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల సాగదీత

2. ప్రిడిక్టబిలిటీ

రేటింగ్: 2.5/ 5

ఫైనల్ వర్డ్: సమ్మర్ లో టైమ్ పాస్ తమిళ మసాలాను ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు ఒక లుక్ వేయవచ్చు. ప్రతి లాజిక్ ను పట్టి పట్టి చూస్తాం, దేవుళ్ళు లేరు దెయ్యాలు లేరు అని కఠిన కఠోర వాదనలు చేసే వేదాంతులు ఈ సినిమా థియేటర్లకు లక్ష కిలోమీటర్ల దూరంలో ఉండండి.

సర్పంచ్ సాబ్ కు ఏమైంది.. పంజాబ్ జట్టుకు ఈసారీ నిరాశేనా

Punjab Kings IPL 2026
Punjab Kings IPL 2026

Punjab Kings IPL 2026: పంజాబ్ జట్టు ఈ ఐపీఎల్ సీజన్లో ప్రారంభంలో వరుసగా విజయాలు సాధించింది. పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానాన్ని అందుకుంది. దీంతో ఆ జట్టు ప్లే ఆఫ్ వెళ్లడం దాదాపు ఖాయమని అందరూ అనుకున్నారు. 230+ కు మించిన పరుగుల లక్ష్యాన్ని చేదించిన క్రమంలో పంజాబ్ జట్టు కచ్చితంగా ప్లే ఆఫ్ వెళ్తుందని.. గత సీజన్లో కోల్పోయిన ట్రోఫీని.. ఈసారి అందుకుంటుందని విశ్లేషకులు పేర్కొన్నారు.

పంజాబ్ జట్టు కు దిష్టి తగిలిందో.. జట్టు ఆటగాళ్లకు ఏమైందో తెలియదు గాని.. వరుసగా ఓటములు ఎదురవుతున్నాయి. గెలవాల్సిన తరుణంలో ఓడిపోతున్న ఆ జట్టు చివరికి ప్లే ఆఫ్ అవకాశాలను కూడా సంక్లిష్టం చేసుకుంది. గురువారం ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ ఓడిపోవడంతో మరింత ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తోంది. పంజాబ్ జట్టు ఇంకా రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఆ రెండిట్లో గెలిస్తేనే పంజాబ్ జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలుంటాయి.

పంజాబ్ జట్టు ఖాతాలో ప్రస్తుతం 13 పాయింట్లు ఉన్నాయి. ఆ జట్టు నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇంకా రెండు మ్యాచులు పంజాబ్ జట్టు ఆడాల్సి ఉంది. అవి రెండు గెలిస్తేనే పంజాబ్ ప్లే ఆఫ్ వెళ్తుంది. అందులో ఒక్క మ్యాచ్లో ఓడినా సరే.. పంజాబ్ జట్టు పరిస్థితి దారుణంగా మారిపోతుంది. ప్లే ఆఫ్ వెళ్లాలంటే ఇతర జట్ల ఫలితాల మీద ఆధారపడాలి. ముంబై జట్టుతో ఓడిపోవడం పట్ల పంజాబ్ ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

ఈ మ్యాచ్ లో కూటమి తర్వాత పంజాబ్ జట్టు సారధి కీలక వ్యాఖ్యలు చేశాడు. “ఈ ఫలితం ఒక చేదు జ్ఞాపకం” అంటూ వ్యాఖ్యానించాడు. వాస్తవానికి పంజాబ్ జట్టు ఇలా వరుసగా ఓడిపోతుందని ఎవరూ ఊహించి ఉండరు. ఎందుకంటే ఆ జట్టు బ్యాటింగ్లో బలంగా ఉంది. బౌలింగ్లో కూడా అదే స్థాయిలో ఉంది. అలాంటప్పుడు ఆ జట్టు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఐకమత్యం లేకపోవడం. కొంతమంది ఆటగాళ్లు నిర్లక్ష్యమైన షాట్ లు ఆడి వికెట్లు పడేసుకుంటున్నారు. బౌలింగ్ కూడా సరిగా ఉండడం లేదు. కీలక దశలో దారుణంగా పరుగులు ఇస్తున్నారు. ఫీల్డింగ్ కూడా చెప్పుకోదగిన స్థాయిలో లేదు. అందువల్లే పంజాబ్ జట్టు దారుణంగా ఓటములు ఎదుర్కొంటున్నది. తదుపరి రెండు మ్యాచ్లలో పంజాబ్ జట్టు సత్తా చూపించి.. ప్రారంభంలో ఆడినట్టుగా ఆడితే తిరుగు ఉండదు. ఒకవేళ విఫలమైతే పంజాబ్ జట్టు గ్రూప్ దశ నుంచి ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది.

ఈ సీజన్లో పంజాబ్ జట్టు వరుసగా ఐదు విజయాలు నమోదు చేసింది. ఆ తర్వాత వరుసగా ఓటములను ఎదుర్కొన్నది. 2022లో హైదరాబాద్ జట్టు కూడా ఇటువంటి రికార్డు నమోదు చేసింది. ముంబై తో గురువారం జరిగిన మ్యాచ్లో చెన్నై జట్టు చివరి మూడు ఓవర్లలో 50 పరుగులు చేసింది. దీనిని బట్టి పంజాబ్ బౌలింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా పంజాబ్ జట్టు బౌలింగ్ మారాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఆ జట్టుకు నిరాశ తప్పదు.

విజయ్ నా కాళ్ళ మీద పడ్డాడు.. అది జరిగినప్పుడే సంతోషం..

CM Vijay Tamil Nadu
CM Vijay Tamil Nadu

CM Vijay Tamil Nadu: తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ పరిపాలన మీద దృష్టి పెట్టారు. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మద్యం షాపులలో గుర్తింపు కార్డు చూపిస్తేనే అమ్మాలని షరతు విధించారు. 18 కాదని.. 21 సంవత్సరాల వయసు ఉంటేనే మద్యం విక్రయించాలని సూచనలు చేశారు.. బడి, గుడి, మసీదు, చర్చి పక్కన వైన్ షాపులు ఏర్పాటు చేయకూడదని.. అక్కడ ఏర్పాటు చేస్తే తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.

ప్రభుత్వ ఉద్యోగులకు డిఏను పెంచారు. ఇంకా అనేక రకాల నిర్ణయాలు తీసుకుంటూ తమిళనాడులో విజయ్ సంచలనాల మీద సంచలనాలు సృష్టిస్తున్నారు. ఇదే సమయంలో వివాదాలు కూడా ఎదుర్కొంటున్నారు. ఇటీవల తన ఓఏస్డిగా విజయ్ ఒక జ్యోతిష్యుడిని నియమించుకున్నారు. అతడి నియామకం పట్ల అనేక పార్టీలు నిరసన వ్యక్తం చేశాయి. దీంతో విజయ్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఓ ఎస్ డి నియామకాన్ని రద్దు చేశారు. విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఇటీవల ప్రమాణస్వీకారం చేయడం.. బల నిరూపణలో సత్తా చూపించడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా విజయ్ గురించి చర్చ మొదలైంది.

విజయ్ పొలిటికల్ కెరియర్ ఇప్పుడే మొదలైన నేపథ్యంలో.. అతని గురించి బిబిసి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. తమిళనాడులో ఎన్నికలకు ముందు కరూర్ ప్రాంతంలో విజయ్ ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమంలో తీవ్రంగా తొక్కిసలాట చోటుచేసుకుంది. చాలామంది చనిపోయారు. ఆ సమయంలో విజయ్ తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే చనిపోయిన వారి కుటుంబ సభ్యులను మహాబలిపురంలో విజయ్ పరామర్శించారు. వారికి ఆర్థికంగా సహాయం అందించారు. ఈ నేపథ్యంలో కరూర్ ప్రాంతంలో జరిగిన దారుణంలో ఓ మహిళ తన కూతురుని కోల్పోయింది. ఆమె ఏడుస్తుంటే విజయ్ కూడా కన్నీటి పర్యంతమయ్యారు. ఆ సమయంలో ఆ బాలిక తల్లి కాళ్లు పట్టుకున్నారు. “ఈ ఘటన జరిగిన తర్వాత విజయ్ మాకు ధైర్యం చెప్పారు. అండగా ఉంటానని అన్నారు. ఆ మాటలను నిలుపుకున్నారు. మార్పు కోసమే ఆయన రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత తమిళనాడు రాష్ట్రాన్ని మార్చేస్తామని మాకు మాట ఇచ్చారు. ఆయన మాట మీద మాకు నమ్మకం ఉంది. అందువల్లే ఆయనకు మేము ఓటు వేశాం. ఆయన చెప్పిన మార్పు గనుక మా కళ్ళ ముందు కనిపిస్తే కచ్చితంగా మేము సంతోషిస్తామని” ఆ బాలిక తల్లి పేర్కొంది.

సెప్టెంబర్లో కరూర్ ఘటన జరిగింది. ఆ ప్రమాదంలో దాదాపు 41 మంది ఊపిరి ఆడక చనిపోయారు. వారిలో అన్ని వయసుల వారూ ఉన్నారు.. వారికోసం విజయ్ మహాబలిపురంలో సమావేశం నిర్వహించారు. వారందరిని పరామర్శించారు. పార్టీ తరపున ఆర్థిక సహాయం కూడా అందించారు.

తెలుగోడు అంటే అంత చులకనా.. అర్ష్ దీప్ సింగ్ కాస్త తగ్గించుకో..

Arshdeep Singh Controversy
Arshdeep Singh Controversy

Arshdeep Singh Controversy: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆటలోనే కాదు.. ఆ ఆట ఆడే క్రికెటర్లు కూడా జెంటిల్మెన్ ల మాదిరిగా వ్యవహరించాలి. అలా కాకుండా లేకి వ్యవహార శైలి సాగిస్తే పరువు పోతుంది. అలా లేకిగా వ్యవహరించిన చాలామంది క్రికెటర్లు తమ కెరీర్ మొత్తాన్ని కోల్పోయారు. చివరికి అంతర్జాతీయంగా పరువు తీసుకొని.. అనామకంగా మిగిలిపోయారు.

అప్పట్లో టీమిండియా ఆస్ట్రేలియా టూర్ వెళ్లింది. అక్కడ ఆస్ట్రేలియా ఆటగాడు అండ్రు సైమండ్స్ టీమిండి ఆటగాడు హర్భజన్ సింగ్ ను ఉద్దేశించి చవకబారు వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్లో ఇది మంకీ గేట్ వివాదంగా నిలిచిపోయింది. ఈ వివాదం ఆస్ట్రేలియా క్రికెట్ పరువు మొత్తం తీసింది. అంతేకాదు, సైమండ్స్ కూడా తన స్థాయి కోల్పోయాడు. చివరికి కెరియర్ గొప్పగా ఉండగానే.. క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు.

మంకీ గేట్ వివాదాన్ని చాలామంది క్రికెటర్లు ఒక గుణపాఠం లాగా తీసుకుంటారు. క్రికెట్ ఆడుతున్నప్పుడు హుందాగా వ్యవహరించాలని బలంగా అనుకుంటారు. అయితే టీమ్ ఇండియా క్రికెటర్ అర్ష్ దీప్ సింగ్ మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు. తోటి టీం ఇండియా ఆటగాడు తిలక్ వర్మను ఉద్దేశించి లేకి మాటలు మాట్లాడాడు. ఓయ్ అందేరే అని పిలిచాడు. దీని అర్థం చీకటి.. పరోక్షంగా తిలక్ వర్మ చర్మం రంగును ఎగతాళి చేశాడు. దీనిపై సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలు వస్తున్నాయి. అర్ష్ దీప్ సింగ్ రేసిస్ట్ లాగా వ్యవహరించాడని.. ఇటువంటి వ్యాఖ్యలు చేసిన అతడిని బిసిసిఐ హెచ్చరించాలని.. కఠిన చర్యలు తీసుకోవాలని అభిమానులు మండిపడుతున్నారు.

అర్ష్ దీప్ సింగ్ ఇప్పుడు మాత్రమే కాదు.. ఐపీఎల్ ప్రారంభంలో కూడా వివాదానికి కారణమయ్యాడు. తన స్నేహితురాలిని తీసుకొని హోటల్ గదిలోకి వెళ్ళాడు. అంతేకాదు పంజాబ్ జట్టు ప్రయాణించే బస్సులో తన స్నేహితురాలి పక్కన కూర్చోబెట్టుకొని.. కబుర్లు చెప్పాడు. ఇతడి ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకొని.. బిసిసిఐ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆటగాళ్లు తమ గర్ల్ ఫ్రెండ్స్ ను హోటల్ గదుల్లోకి తీసుకెళ్లకూడదని సూచనలు చేసింది. అయినప్పటికీ అర్ష్ దీప్ సింగ్ తన ధోరణి మార్చుకోవడం లేదు. పైగా చర్మం రంగును ప్రత్యేకంగా ప్రస్తావించడం అతడి లేకితనానికి నిదర్శనం.

మహేష్ బాబు విషయంలో త్రివిక్రమ్ అసంతృప్తి తో ఉన్నాడా...

Mahesh Babu Trivikram Movie
Mahesh Babu Trivikram Movie

Mahesh Babu Trivikram Movie: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. రాజకుమారుడు సినిమా ఇచ్చిన సక్సెస్ తో స్టార్ హీరోగా మారిపోయాడు. ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ ను సంపాదించి పెట్టలేదు. అయినప్పటికీ మురారి, ఒక్కడు సినిమాలతో తన సత్తా ఏంటో చూపించాడు. ఇక ఎట్టకేలకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోగా మారిన ఆయన ప్రస్తుతం ‘వారణాసి’ సినిమాతో ప్రపంచ స్థాయి ప్రేక్షకులందరిని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ఇప్పటివరకు ఎవరికి సాధ్యంకానీ రీతిలో సక్సెస్ లను అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు స్టార్ హీరోగా మారడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం తనవంతు సహాయమైతే చేశాడు. అతడు సినిమాతో అతనికి భారీ సక్సెస్ ని కట్టబెట్టాడు. ఈ సినిమా కమర్షియల్ గా ఆడకపోయిన కూడా మహేష్ బాబు లోని వైవిధ్యమైన నటనను బయటికి తీసిన ఘనత కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ కే దక్కుతుంది.

ఇక ఇలాంటి క్రమంలోనే వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘గుంటూరు కారం’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. ఆ సినిమా వల్ల మహేష్ బాబు కెరీర్ కి గాని, త్రివిక్రమ్ కి గాని ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో త్రివిక్రమ్ ఈ విషయంలో కొంతవరకు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారట.

మూడు సినిమాలు మహేష్ బాబుతో చేసినప్పటికి అతనికి ఒక్కటి కూడా ఇండస్ట్రీ హిట్ అందించలేకపోయాననే ఒక వెలితి తనకి ఉందని పలు సందర్భాల్లో చెబుతూ వస్తున్నాడట. ఇక ఏది ఏమైనా కూడా త్రివిక్రమ్ లాంటి దర్శకుడితో సినిమా చేసి కూడా భారీ సక్సెస్ ని సాధించలేకపోయిన మహేష్ బాబును చూసిన అతని అభిమానులు కూడా కొంత వరకు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు…

ఇక పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి వాళ్ళకి ఇండస్ట్రీ హిట్లను కట్టబెట్టిన త్రివిక్రమ్ మహేష్ బాబు విషయంలో మాత్రం తప్పటడుగు వేశాడనే చెప్పాలి. మరి ఫ్యూచర్లో వీళ్ళ కాంబినేషన్ వర్కౌట్ అయితే మాత్రం తప్పకుండా తనకు ఒక భారీ ఇండస్ట్రీ హిట్ ని ఇస్తానని త్రివిక్రమ్ తన సన్నిహితుల దగ్గర చెబుతున్నాడు…

బంగ్లాదేశ్ లో హిందువుల కోసం పోరాడిన యోగికి 500 రోజులు గా నో బెయిల్.. జైల్లో నే దారుణం

ISKCON Bangladesh
ISKCON Bangladesh

ISKCON Bangladesh: ఆయనేమీ అవినీతికి పాల్పడలేదు. అక్రమానికి శ్రీకారం చుట్టలేదు. కోట్లకు కోట్లు వెనకేసుకోలేదు. ఆయన చేసింది కేవలం పోరాటం. అది కూడా తన వర్గం వారిని ఇబ్బంది పెడుతుంటే.. కళ్ళ ముందు చంపేస్తుంటే తట్టుకోలేక నిరసనకు దిగాడు. ఇలాంటి దారుణం ఇంకెన్నాళ్లు అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. మాకు బతికే హక్కు లేదా అంటూ నినదించాడు. అటువంటి వ్యక్తిని ఇంకో సామాజిక వర్గం అయితే నెత్తిన పెట్టుకునేది. కానీ హిందువులు మర్చిపోయారు. చేసిన పోరాటానికి గుర్తింపు లేదు. చివరికి ఆయన పరిస్థితి శ్రీకృష్ణ జన్మస్థానానికి పరిమితమైపోయింది.

ఇంతటి స్థాయిలో ఇబ్బందిని ఎదుర్కొంటున్న ఆ వ్యక్తి పేరు బ్రహ్మచారి చిన్మయి కృష్ణదాస్. పేరుకు తగ్గట్టుగానే ఇతడు శ్రీకృష్ణుడికి విపరీతమైన భక్తుడు. బంగ్లాదేశ్లో ఇస్కాన్ టెంపుల్ లో పరిచారకుడిగా పని చేస్తున్నాడు. ఇతడికి హిందుత్వం అంటే చాలా ఇష్టం. శ్రీకృష్ణుని బోధనలను ఇతడు బంగ్లాదేశ్లో వినిపిస్తూ ఉంటాడు. అయితే బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత.. అక్కడ పరిస్థితులు మారిపోయాయి. బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు పెరిగిపోయాయి.

ఈ పరిస్థితిని కృష్ణ దాస్ తీవ్రంగా తప్పుపట్టాడు. బంగ్లాదేశ్లో ప్రధాన నగరాలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాడు. అతడు వ్యవహరిస్తున్న తీరు పట్ల బంగ్లాదేశ్ అధికారులు కాకుండా.. ఇస్కాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మనము పనిచేయాల్సింది శ్రీకృష్ణ ఆలయాల పరిరక్షణ కోసం.. హిందూ ధర్మం కోసం కాదంటూ వ్యాఖ్యలు చేసింది. దీంతో కృష్ణ దాస్ పోరాటం ఉపయోగం లేనిదిగా మారిపోయింది. ఈ దశలో కృష్ణదాస్ తన పోరాటాన్ని తగ్గించలేదు. అయితే ఆ మధ్య బంగ్లాదేశ్లో సైఫల్ అలీఫ్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు.. ఈ దారుణానికి కారణం కృష్ణ దాస్ అని బంగ్లాదేశ్ ప్రభుత్వం కేసులు పెట్టింది. ఈ కేసుకు సంబంధించి విచారణ లేదు. అతడిని దాదాపు 500 రోజులుగా జైల్లోనే బంగ్లాదేశ్ అధికారులు ఉంచుతున్నారు. ఇటీవల డాకా హైకోర్టులో అతడు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేస్తే.. కోర్టు కొత్త వాదనను తెరపైకి తీసుకువచ్చింది. కృష్ణ దాస్ మీద అనేక రకాల కేసులు ఉన్నాయని.. అందువల్ల బెయిల్ ఇవ్వడం కుదరదని కోర్టు స్పష్టం చేసింది. దీంతో కృష్ణ దాస్ శ్రీకృష్ణ జన్మస్థానంలో.. శ్రీకృష్ణుడి గీతాలు ఆలపించుకుంటూ జీవితాన్ని గడిపేస్తున్నారు. హిందువుల కోసం అతడు పోరాడితే.. చివరికి ఆ హిందువులే అతడిని మర్చిపోయే పరిస్థితి నెలకొంది.

దిల్ రాజు vs మైత్రి రవి, నాగవంశీ... వీళ్లలో తప్పు ఎవరిది...

Dil Raju Vs Mythri Ravi
Dil Raju Vs Mythri Ravi

Dil Raju Vs Mythri Ravi: తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎల్లలు దాటి ముందుకు దూసుకెళ్తుంటే ఎగ్జిబ్యూటర్లు మాత్రం తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు బావుంటున్నారు ఒక్క మేము తప్ప అంటూ వాళ్లు వాళ్ళ ఇబ్బందులను తెలియజేస్తున్నారు…సింగిల్ స్క్రీన్ థియేటర్లకి రెంటెండ్ పర్పస్ లో కాకుండా పర్సంటేజ్ లో రూపంలో డబ్బులు చెల్లిస్తేనే థియేటర్లు నడుపుతామని లేకపోతే వాటన్నింటిని మూతపడేస్తాం అంటూ హైదరాబాదులో ఉన్న 23 థియేటర్ల ఎగ్జిబ్యూటర్లు సైతం వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే దిల్ రాజు తమ్ముడు అయిన శిరీష్ పెట్టారు. అందులో తను సింగిల్ స్క్రీన్ ఎగ్జిబ్యూటర్ల యొక్క బాధలను వివరించారు. రెంటల్ పర్పస్ లో డబ్బులు చెల్లించడం వల్ల అవి థియేటర్ రెంట్లు కట్టుకోవడానికి సరిపోవడం లేదంటూ సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడే పరిస్థితి వస్తుంది. దీనివల్ల ఇండస్ట్రీ బాగా దెబ్బతింటుంది అంటూ ఆయన మాట్లాడారు. హీరోలకు వాళ్ళు తీసుకునే రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేయవచ్చు. అలాగే ప్రొడ్యూసర్స్ సైతం వాళ్ల సినిమాని ఏ రేట్ కి అమ్ముకోవాలి అనేది వాళ్లే డిసైడ్ చేసుకుంటారు. కానీ థియేటర్లను నడిపించే ఎగ్జిబ్యూటర్లు మాత్రం ఏం మాట్లాడకూడదు అంటే వాళ్లకు మాట్లాడే స్వాతంత్ర్యం లేదా వాళ్ళ బాధలను వాళ్ళు చెప్పుకోకూడదా అంటూ కొన్ని ఘాటు కామెంట్లు చేశారు. ఇక దీనికి కౌంటర్ వేస్తూ మైత్రి రవి, నాగ వంశీ ఇలాంటి ప్రొడ్యూసర్లు మరొక ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు… మైత్రి రవి మాట్లాడుతూ మేము విమల్ థియేటర్ ని లీజు కి తీసుకుని దానిని చాలా బాగా డెవలప్ చేశాం. అందులో ఏసీ ని, కూర్చునే సీట్లను కూడా రెన్నోవేషన్ చేశాం. దానివల్ల ప్రేక్షకుడు థియేటర్ కి వస్తున్నాడు. మా థియేటర్లోనే ఎక్కువ సినిమాలను చూస్తున్నారు.

తద్వారా మాకు ప్రాఫిట్ కూడా వస్తుంది అంటూ ఆయన చెప్పాడు. ప్రేక్షకులు థియేటర్ కి రాకుండా ఉండడానికి మెయిన్ కారణం ఆ థియేటర్ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడమే అంటూ ఆయన కామెంట్స్ చేశాడు. అవి ఒకవేళ బాగుంటే తప్పకుండా ప్రేక్షకులు థియేటర్ కి వస్తారని సింగిల్ స్క్రీన్స్ లోనే సినిమాలు చూస్తారని ఆయన మాట్లాడుతున్నాడు.

ఇక నాగ వంశీ సైతం మైత్రి రవిని సపోర్ట్ చేస్తూ సింగిల్ స్క్రీన్ థియేటర్లను నడిపలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ముడివేయండి అంతే తప్ప ఇలాంటి కండిషన్లు పెట్టడం సరైనది కాదు అంటూ తను ఎగ్జిబ్యూటర్లను ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు.

అయితే వీళ్ళిద్దరి వాదనలు విన్న తర్వాత అటు శిరీష్ ఇటు రవి, నాగ వంశీలలో తప్పు ఎవరిది ఎందుకని ఇలా చేస్తున్నారు అంటూ కొన్ని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి… ఇక శిరీష్ ఎగ్జిబ్యూటర్ల సైడ్ నుంచి ఆలోచిస్తుంటే వీళ్ళు మాత్రం ప్రేక్షకులను థియేటర్ కి రప్పించే విధంగా ప్లాన్ చేస్తున్నారు…ఇక వీళ్లలో తప్పు ఎవరిది అని చెప్పడం కష్టమే ఎందుకంటే వీళ్ళిద్దరూ సినిమా గురించే ఆలోచిస్తున్నారు…

రామ్ చరణ్ తో బాలీవుడ్ డైరెక్టర్ మూవీ ప్లాన్ చేస్తున్నాడా...ఇది కష్టమేనా...

Ram Charan Favourite Kollywood Hero
Ram Charan Favourite Kollywood Hero

Ram Charan: ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలను తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. రామ్ చరణ్ లాంటి నటుడు ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. చిరంజీవి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ఆయన ఇప్పటివరకు స్టార్ హీరోలందరికి పోటీని ఇస్తున్నాడు. అయినప్పటికి ఎక్కడ కూడా ఆయన తగ్గకుండా తన పరిధిని విస్తరించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. మరి తను అనుకున్నట్టుగానే ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక పెద్ది సినిమాతో తనకంటు ఒక స్పెషల్ ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు…

ఇక తన క్రేజ్ చూసిన బాలీవుడ్ డైరెక్టర్లు సైతం సినిమా చేస్తే సక్సెస్ ఫుల్ గా మారుతుందనే ఉద్దేశ్యంతో ఉన్నారట. దానికోసమే అతనితో సినిమా చేయడానికి చాలామంది స్టార్ట్ డైరెక్టర్లు అతనికి కథలను వినిపిస్తున్నారు. ఇక ఇప్పటికే రాజ్ కుమార్ హిరానీ సైతం ఒక లైన్ చెప్పారట. దానికి రామ్ చరణ్ ఇంప్రెస్స్ అయినప్పటికి పూర్తి కథ విన్న తర్వాత ఫైనల్ చేద్దామని చెప్పారట.

దానికి రాజ్ కుమార్ హిరానీ సైతం ఓకే అన్నారట… మొత్తానికైతే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించగలిగే కెపాసిటి ఉన్న రామ్ చరణ్ రాబోయే రోజుల్లో ఎలాంటి పెను సంచలనాలను క్రియేట్ చేస్తాడు బాలీవుడ్ దర్శకులతో సినిమాలను చేసి ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలుగు హీరోలు బాలీవుడ్ దర్శకులకు అవకాశాలు ఇవ్వడం లేదు.

ఎందుకంటే ఇంతకుముందు ప్రభాస్ తో ఓం రావత్ చేసిన అది పురుష్ సినిమాతో భారీ డిజాస్టర్ ని కట్టబెట్టాడు. ఇక ‘వార్ 2’ సినిమా చేసిన ఎన్టీఆర్ సైతం భారీ ప్లాప్ ను మూట గట్టుకున్నాడు… ఇక ఇప్పటివరకు మన హీరోలందరు ఎవరికి సాధ్యం కానీ రీతిలో పెను సంచలనాలను క్రియేట్ చేస్తున్న వాళ్లే కావడం విశేషం…

పాకిస్తానీలను తన్ని తరిమేస్తున్న యూఏఈ.. అసలు కారణమేంటంటే

UAE Deporting Pakistanis
UAE Deporting Pakistanis

UAE Deporting Pakistanis: ముస్లింలు అంతా ఒకటే అని మనం అనుకుంటూ ఉంటాం. వారి మధ్య ఐకమత్యం అద్భుతంగా ఉంటుందని భావిస్తుంటాం. కానీ అదంతా అబద్ధమని.. వారి మధ్య కూడా జాతులు.. కులాలు.. తెగలు వంటి సమస్యలు ఉన్నాయని తాజా ఘటన ద్వారా బయటపడింది. ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే పాకిస్తాన్ ప్రజలను బయటికి వెళ్లగొడుతుంటే ఆ దేశ పరిపాలకులు కనీసం నోరు కూడా మెదపడం లేదు. ఒక దేశానికి సంబంధించి ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు.

పాకిస్తాన్ దేశస్థులు ప్రస్తుతం యూఏఈ ప్రభుత్వం చేతిలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. యూఏఈ దేశంలో ఉంటున్న పాకిస్తాన్ ప్రజలను అక్కడి ప్రభుత్వం మొహమాటం లేకుండా బయటకు వెళ్లగొడుతోంది. యుద్ధ ఖైదీలకు వేసినట్టు చేతులకు సంకెళ్లు వేసి బయటకు పంపిస్తోంది. ఇంకోసారి మా దేశంలోకి వస్తే మామూలుగా ఉండదంటూ హెచ్చరిస్తోంది. దీంతో పాకిస్తాన్ ప్రజలు అపరాధ భావంతో తలవంచుకొని.. యుద్ధ ఖైదీల మాదిరిగా దేశానికి తిరిగి వస్తున్నారు.

యూఏఈ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఒక బలమైన కారణం ఉంది. యూఏఈ అమెరికా బలగాలకు.. యుద్ధ క్షేత్రాల ఏర్పాటుకు అవకాశం కల్పించింది. ఈ సమాచారం మొత్తం బయటపడకుండా జాగ్రత్త పడింది. యూఏఈ దేశంలో ఉన్న షియా ముస్లింలు ఈ సమాచారాన్ని ఇరాన్ దేశానికి అందించినట్టు తెలుస్తోంది. అందువల్ల ఇరాన్ యూఏఈ, ఖతార్, కువైట్ దేశాల మీద దారుణంగా దాడులు చేసింది. పెద్దపెద్ద ఆయిల్ రిఫైనరీలు.. ఇతరత్రా మౌలిక ప్రాజెక్టుల మీద కనీ విని ఎరగని స్థాయిలో దాడులు చేసింది. ఈ దాడుల వల్ల ఆ దేశాలు విపరీతంగా నష్టపోయాయి. ఈ నష్టాన్ని పూడ్చుకోవాలి అంటే ఆ దేశాలకు దాదాపు దశాబ్దాల సమయం పడుతుంది. అనేక రకాలుగా కష్టానికి ఓర్చుకొని.. ప్రయాసలు పడి అటువంటి వ్యవస్థలను నిర్మిస్తే.. చివరికి ఇరాన్ దాడులు చేయడంతో పరిస్థితి దారుణంగా మారిపోయింది.

ఇదంతా కూడా పాకిస్తాన్ దేశానికి సంబంధించిన షియా ముస్లింల పని అని యూఏఈ అంతర్గత విచారణలో తేలింది. దీంతో అక్కడి ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టింది. పాకిస్తాన్ దేశానికి సంబంధించిన షియా ముస్లింలను తన్ని తరిమేస్తోంది. ఇప్పటికే 15,000 మందిని వారి వారి దేశాలకు పంపించింది. కేవలం పాకిస్తాన్ దేశస్తులను మాత్రమే కాకుండా.. ఇతర దేశాలకు సంబంధించిన షియా ముస్లింలను కూడా బయటికి పంపిస్తోంది. వీరి తర్వాత సున్నీలను కూడా దేశం దాటి పంపించే దిశగా యూఏఈ ప్రణాళికలు రూపొందించింది. అయితే ఈ స్థాయిలో తమ దేశస్తులను పంపిస్తున్నప్పటికీ పాకిస్తాన్ పరిపాలకులు ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం.

చైనా అప్పుల జాబితాలో 20 దేశాలు.. పాక్ నంబర్ వన్..!

China Debt Countries List
China Debt Countries List

China Debt Countries List: చైనా ప్రపంచ సంపన్న దేశాల్లో రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానం కోసం దూకుడు పెంచింది. ఈ క్రమంలో పలు దేశాలను తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు ఆయా దేశాల బలహీనతను వాడుకుంటుంది. ఆర్థిక అవసరాలు తీర్చేందుకు అప్పులు ఇస్తోంది. వ్యూహాత్మక దేశాల్లో అభివృద్ధి పేరిట పెట్టుబడులు పెడుతోంది. వనరులను తరలించుకుపోతోంది. 2022 నాటికి చైనా అప్పుల జాబితాలో 20 దేశాలు ఉన్నాయి. పాకిస్తాన్ అగ్ర స్థానంలో ఉంది.

పాకిస్తాన్ అగ్ర స్థానం..
చైనా ప్రపంచ మౌలిక పెట్టుబడుల ద్వారా పలు దేశాల వద్ద ఆర్థిక ఆధిక్యత సాధించింది. 2022 డేటా ప్రకారం చైనాకి అత్యధిక బకాయి ఉన్న టాప్ 20 దేశాల్లో పాకిస్తాన్‌ 26.6 బిలియన్ డాలర్లతో అగ్ర స్థానంలో ఉంది. తర్వాత స్థానాల్లో ఆంగోలా, శ్రీలంక, ఇథియోపియా వంటి దేశాలు ఉన్నాయి.

అవసరాల కోసం అప్పులు..
బీజింగ్ నడిపే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీ ఆర్ ఐ) భాగంగా పెద్ద ఎత్తున ఇన్‌‌ఫ్రా ప్రాజెక్టులపై క్రెడిట్ ఇవ్వబట్టి వచ్చే దశల్లో ఆ దేశాలుపై విధ్వంసాత్మక బకాయి ఏర్పడుతోంది. ఈ రుణాలు మెగా పోర్టులు, తూర్పు-పడమటి రహదారులు, డ్యాములు వంటి మనుగడపై ప్రభావాన్ని కలిగించే ఒప్పందాలు. కొన్ని దేశాలు తక్షణ అభివృద్ధి అవసరాల కోసం అప్పులు తీసుకోవటం, పెట్టుబడుల రిటర్న్ అంచనాలు తప్పడంతో డిఫాల్ట్‌-రిస్కు పెరుగుతోంది.

ప్రాంతాల వారీగా ఇలా..
ప్రాంతాల వారీగా పరిశీలిస్తే.. దక్షిణ ఆసియాలో పాకిస్తాన్‌ (26.6 బిలో), శ్రీలంక (8.9 బిలో) వంటి దేశాల్లో రుణభారం జాతీయ రిజర్వులపై, విదేశీ మారక విలువపై తీవ్రమైన ఒత్తిడి సృష్టించింది. శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభం తరువాత కొన్ని ప్రాజెక్టులు చైనా చేతిలోకి వెళ్లాయి. ఆఫ్రికాలో ఆంగోలా (21 బిలో), ఇథియోపియా (6.8 బిలో), కెన్యా (6.7 బిలియన్), జాంబియా (6.1 బిలియన్) వంటివి చైనా క్రెడిట్ ఆధారిత దేశాలు. ఈ దేశాల్లో వార్షిక వనరుల ఆదాయంపై ఆధారపడి రుణ చెల్లింపోలు ఉంటాయి. ఇక లాటిన్ అమెరికా, ఇతర ప్రాంతాల్లో ఈక్వడార్, అర్జెంటినా, బ్రెజిల్ వంటి ప్రాజెక్ట్-ఆధారిత ఒప్పందాలతో చైనా వ్యూహాత్మకంగా ప్రవేశించింది. రీసోర్సెస్ ఎక్స్చేంజ్, ఇంధన ప్రాజెక్టుల రూపంలో అభివృద్ధి చేపడుతోంది.

ఆర్థికం నుండి జియోపొలిటిక్స్.
చైనాకు భారీగా బకాయి ఉన్న దేశాల విదేశీ రిజర్వులు తరిగి పోతున్నాయి. కరెన్సీ విలువ తగ్గడం, ద్రవ్యోల్బణం, దిగుబడి పెరుగుదలలో ఇబ్బందులు పడుతున్నాయి. రుణాలు సక్రమంగా చెల్లించక డిఫాల్ట్ అయితే పోర్టులు, లాజిస్టిక్ హబ్‌లు, మైనింగ్ స్థావరాల లీజు లేదా మేనేజ్‌మెంట్ చైనా సంస్థలు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. తీవ్ర రుణ బాధిత దేశాలు పరిమిత విదేశీ విధాన స్వతంత్రతను చైనా హరించే ప్రమాదం ఉంది. చైనా నిర్దిష్ట విదేశీ రీతులను ప్రోత్సహించేందుకు ఆర్థిక శక్తిని విదేశీ విధానంగా మార్చుకోవచ్చు.

చైనా నుంచి ఒకసారి రుణం తీసుకున్న తర్వాత దాని రాజకీయ, భూభౌతిక, ఆర్థిక పరిమాణం దేశపు స్వతంత్రతపై ఆధిపత్యం కొనసాగునుంది. తక్షణ అభివృద్ధి కోసం రుణం అవసరం అయినప్పటికీ, దీర్ఘకాలికంగా దేశాలు తమ ఆర్థిక వ్యూహాలను బలోపేతం చేసి, స్థానిక ఆదాయాన్ని పెంచే దిశగా దృష్టి పెట్టాలి. లేదంటే ఆ దేశాల ఆర్థిక స్వాతంత్ర్యం ప్రశ్నార్థకమవుతుంది.

సాక్షిని బ్యాన్ చేసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే

Sakshi Media
Sakshi Media

Sakshi Media Ban: విశాఖలో సాక్షి మీడియాను బ్యాన్ చేశారు. అలా చేసింది ఎవరో తెలుసా సాక్షాత్ వైసిపి నేత. ఆ మీడియాలో వార్త రావాలంటే ఒక రేటు.. వార్త ప్రచురితం కావాలంటే మరో రేటు అన్నట్టు.. మీడియా ప్రతినిధులు అమ్ముడుపోయారని బాహటంగానే వ్యాఖ్యానిస్తున్నారు ఓ మాజీ ఎమ్మెల్యే. అందుకే తన నియోజకవర్గ వైపు సాక్షి మీడియా ప్రతినిధులు రావద్దు అని గట్టిగానే హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఎవరు ఆ నేత అంటే.. దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. గత కొద్దిరోజులుగా ఆయన సాక్షి మీడియా ప్రతినిధుల పై ఆగ్రహంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి భార్య భారతికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరిస్తున్నారు.

* వైసీపీలో ఓటమి..
తెలుగుదేశం పార్టీలో వరుసగా మూడుసార్లు గెలిచారు వాసుపల్లి గణేష్ కుమార్. 2019లో జగన్ ప్రభంజనంలో సైతం విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. విశాఖ నగరంలోని నాలుగు నియోజకవర్గాల్లో టిడిపి అభ్యర్థులే అప్పట్లో గెలిచారు. మిగతా ముగ్గురు టిడిపిలో కొనసాగారు. కానీ వాసుపల్లి గణేష్ కుమార్ మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి గణేష్ కుమార్ టిడిపిలోకి వస్తారన్న ప్రచారం నడిచింది. కానీ క్యాడర్ అభ్యంతరాలతో ఆయన చేరికకు టిడిపిలో బ్రేక్ పడినట్లు వార్తలు వచ్చాయి ఆ మధ్యన. అయితే ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తిరిగి యాక్టివ్ అయ్యారు కూడా.

* ప్రాధాన్యత లేకపోవడంతో..
కానీ తాను అనుకున్న స్థితిలో సాక్షి మీడియాలో తనకు తగినంత ప్రాధాన్యం లభించడం లేదన్నది వాసుపల్లి గణేష్ కుమార్ ఆవేదన. పేరుకే సాక్షి మీడియా సొంతది అని.. కానీ కనీస స్థాయిలో కవరేజ్ లేకపోవడంతో ఆయన ఆగ్రహంతో ఉన్నారట. పైగా రాజకీయ ప్రత్యర్థులతో సాక్షి ప్రతినిధులు కలిసిపోయారన్న బాధ ఆయనలో ఉందట. అందుకే బాహటంగా ఈ విషయాన్ని చెబుతూ తన నియోజకవర్గ పరిధిలో సాక్షి మీడియా ప్రతినిధులు రావద్దు అని ఆంక్షలు పెట్టారట. అయితే రాష్ట్రవ్యాప్తంగా చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంది. కానీ ముందుగానే ఓపెన్ అయ్యారు వాసుపల్లి గణేష్ కుమార్. అయితే దీనిపై భారతి మేడంకు ఫిర్యాదు చేస్తామని వాసుపల్లి గణేష్ కుమార్ చెబుతుండడం మాత్రం సంచలనంగా మారింది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

ప్రభాస్ స్పిరిట్ తో ఇబ్బందులు పడుతున్నాడా...

Prabhas Spirit Movie
Prabhas Spirit Movie

Prabhas Spirit Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించగలిగే కెపాసిటి ఉన్న హీరోలు ఎంతమంది ఉన్నా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో వచ్చే క్రేజ్ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరిని డామినేట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రభాస్ లాంటి నటుడు తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్నాడు. ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా పాన్ ఇండియాలో పెను సంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. సినిమా హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా వందల కోట్ల కలెక్షన్స్ ను రాబడుతుంటాయి. అతనితో సినిమా చేస్తే సెక్యూర్ జోన్ లో ఉంటామని ప్రొడ్యూసర్లు అందరు అతని డేట్స్ కోసం పోటీ పడుతున్నారు.

ఇక ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కానీ రీతిలో గొప్ప విజయాలను సాధించిన ఆయన ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న ఫౌజీ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన నేపథ్యంలో ఇప్పుడు స్పిరిట్ సినిమా మీదనే ఆయన పూర్తి ఫోకస్ పెట్టాడు.

రీసెంట్ గా ఒక షెడ్యూల్ ని షూట్ చేస్తున్న సందీప్ ఈ సినిమాతో మరో స్థాయికి వెళ్లాలనే ప్రయత్నంలో ఉన్నాడు…
ఈ సినిమా కోసం ప్రభాస్ విపరీతంగా కష్టపడుతున్నాడు. ఒక్కో షాట్ మీద సందీప్ రెడ్డివంగా చాలా స్పెషల్ కేర్ తీసుకొని చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. షాట్ అనుకున్నట్టుగా వచ్చేంతవరకు చిత్రీకరిస్తున్నారట.

కొన్ని షాట్స్ డూప్ తో చేయమని చెప్పినప్పటికి సందీప్ కాంప్రమైజ్ అవ్వకుండా కేవలం ప్రభాస్ తోనే షూట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకోవాల్సింది. కానీ సందీప్ రెడ్డి వంగ కి డూప్ తో చేయడం ఇష్టం లేక ప్రభాస్ డేట్స్ ఇచ్చినపుడు ఆయనతోనే సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. కాబట్టి అందుకోసమే ఈ సినిమా షూట్ లేట్ అవుతుంది…

టీఎంసీ నేత ఇంట్లో బంగారు పరుపు, సోఫా.. పోలీసులు అరెస్ట్ చేశారు గాని.. లేకుంటే కేజీఎఫ్ ను మించిపోయేవాడు..

TMC Leader Gold Bed
TMC Leader Gold Bed

TMC Leader Gold Bed: ప్రభుత్వం ఇచ్చే పింఛన్ లో 300 టీఎంసీ కార్యకర్తలకే. ప్రభుత్వం అందించే డైరెక్ట్ బెనిఫిషరీ స్కీమ్ లో కొంత వాటా వాళ్లకే. ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకంలో వారికి భాగం వెళ్లాల్సిందే. దీనికి బెంగాల్ ప్రజలు పెట్టిన పేరు కట్ మని.

15 సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాత.. మమతా బెనర్జీ సంపూర్ణ అధికారాలు వచ్చిన తర్వాత టిఎంసి కార్యకర్తలు జలగల మాదిరిగా జనాల మీద పడ్డారు. వారి రక్త మాంసాలను దోచుకున్నారు. ప్రజల కష్టాన్ని తమకు ఆర్జితంగా మార్చుకున్నారు. ఫలితంగా టీఎంసీ కార్యకర్తలు ఆగర్భ శ్రీమంతులుగా మారిపోయారు. ఇప్పుడు బిజెపి అధికారంలోకి రావడంతో.. వారి అక్రమ లీలలు బయటపడిపోతున్నాయి.

బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు తర్వాత బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఈ కేసును బిజెపి ప్రభుత్వం అంత సులభంగా తీసుకోవడం లేదు. ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ కేసు పై విచారణ సాగించాలని అధికారులకు సూచించారు. దీంతో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు కీలకమైన విషయాలు తెలిసాయి. బాంబు పేలుడులో టీఎంసీ నేత షమీం అహ్మద్ కీలకపాత్ర పోషించాడని వెలుగులోకి వచ్చింది.

పూర్తి ఆధారాలతో షమీం ఇంట్లో పోలీసులు దాడులు చేశారు. అతడు నివాసం ఉంటున్న నాలుగు అంతస్తుల బిల్డింగ్ లో ఒక సీక్రెట్ ప్లాట్ ఉంది. అందులో బంగారంతో తయారుచేసిన పరుపు.. గోల్డ్ సోఫా.. ఇంకా అనేక రకాల ఖరీదైన వస్తువులు ఉన్నాయి. వాటిని చూసిన అధికారులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు.. వాస్తవానికి షమీం అహ్మద్ టిఎంసిలో చాలా కిందిస్థాయి నాయకుడు. అతడి ఇంట్లోనే ఈ స్థాయిలో బంగారం.. ఖరీదైన వస్తువులు ఉంటే.. ఇక పెద్దపెద్ద నాయకుల ఇళ్లల్లో ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చని బెంగాల్ లోని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

మమత ప్రభుత్వం ఉన్నన్ని రోజులు టీఎంసీ కార్యకర్తలు ఇష్టానుసారంగా ప్రవర్తించారు. ప్రజలకు అందించే సంక్షేమ పథకాలలో తమ వాటా తీసుకున్నారు. అభివృద్ధి పథకాలలో కూడా తన భాగాన్ని బెదిరించి మరి లాక్కున్నారు. చూస్తుండగానే కోట్లకు పడగలు ఎత్తిపోయారు. అటు బెంగాల్ రాష్ట్రంలో స్థిరమైన అభివృద్ధి లేకపోవడం.. పెద్ద పెద్ద కంపెనీలు రాకపోవడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. యువత వలసలు వెళ్లే దుస్థితి దాపురించింది. ఇంత జరిగినప్పటికీ మమతలో మార్పు రాలేదు. ప్రజలకు అంతంత మాత్రమే సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఓట్లు దండుకున్నారు. చివరికి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఇబ్బంది పెట్టారు.

మూడు పర్యాయాలు ఇలా అధికారంలోకి వచ్చినప్పటికీ.. చివరిసారి మాత్రం బెంగాల్ ప్రజలు తమ విజ్ఞతను ప్రదర్శించారు. ఫలితంగా టి ఎం సి అధికారానికి దూరమైంది.. వచ్చిన అవకాశాన్ని బిజెపి నేతలు సద్వినియోగం చేసుకుంటున్నారు. టీఎంసీ నేతల బాగోతాలను బయటపెడుతున్నారు. అయితే పశ్చిమ బెంగాల్ లో షమీం అహ్మద్ లాంటి వాళ్ళు చాలామంది ఉంటారని.. వారందరి అక్రమ సంపాదన మొత్తం బయటికి తీస్తామని బిజెపి నాయకులు అంటున్నారు.

మమత చేసిన కంపును.. తొలగించాలంటే బిజెపికి ఐదేళ్లూ సరిపోతాయా..

West Bengal BJP
West Bengal BJP

West Bengal BJP: ఒకడు నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి పోటీ చేస్తేనే చితకబాదాడు. ఈ ఎన్నికల్లో ఈవీఎం యంత్రాల మీద బిజెపి సింబల్ మీద స్టికర్ వేశాడు. చివరికి సెంటు కూడా పూశాడు. ఎన్నికల ప్రక్రియ లైవ్ స్ట్రీమింగ్ రాకుండా చూసుకున్నాడు.

ఇంకొకడు నిత్యం భారతదేశం మీద.. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మీద ఇష్టానుసారంగా రాసేవాడు. ఒక పత్రికను నడిపి.. బంగ్లాదేశ్ కు అనుకూలంగా రాతలు రాసేవాడు. భారతదేశాన్ని తీవ్రస్థాయిలో విమర్శించేవాడు. నరేంద్ర మోడీ అంతమైతేనే దేశానికి పట్టిన పీడ విరగడవుతుందని చెప్పుకునేవాడు.

మరొకడు గూండారాజ్ వ్యవస్థను కొనసాగించేవాడు. మమతా బెనర్జీ.. ఆమె అల్లుడు అభిషేక్ బెనర్జీకి కుడి భుజం లాగా ఉండేవాడు. ఇంకా రకరకాల దారుణాలకు పాల్పడేవాడు.

ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు పశ్చిమ బెంగాల్ వదిలి వెళ్ళిపోయారు. వారిలో కొందరు పోలీసుల చేతిలో అరెస్టు అయ్యారు. మరికొందరు సెంట్రల్ ఏజెన్సీ అధికారుల ఎంక్వైరీలో ఉన్నారు. వీరంతా గడచిన 15 సంవత్సరాల కాలంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని జలగల మాదిరిగా పట్టి పీడించారు. ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. పార్టీ మీటింగ్ ల పేరుతో యుక్త వయసు ఉన్న అమ్మాయిలను రోజుల తరబడి తమ వద్ద ఉంచుకునేవారు. చివరికి ఎవరైనా బిజెపి తరఫున పోటీ చేస్తే చావ బాదేవారు. ఇలా చెప్పుకుంటూ పోతే బెంగాల్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు.

బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఇప్పుడు ఆపరేషన్ వెస్ట్ బెంగాల్ మొదలైంది. ఇప్పటికే ముఖ్యమంత్రి సువెందు అధికారి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇన్ని రోజులపాటు వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఇష్టానుసారంగా సాగిన గుండారాజ్ వ్యవస్థకు చరమగీతం పాడుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు.. నాయకులు చేసిన ఆగడాలను బయటపెడుతున్నారు. బెంగాల్ రాష్ట్రాన్ని పంది కొక్కుల మాదిరిగా దోచుకున్న టీఎంసీ నేతలను శ్రీకృష్ణ జన్మస్థానాలకు పంపిస్తున్నారు.

బెంగాల్ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలతో ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలను ఎక్కడికక్కడ కొడుతూ ఉన్నారు. కనీసం ఆ పార్టీ ఛాయలు కూడా వెస్ట్ బెంగాల్లో కనిపించకూడదని ప్రజలు శపథం పూనారు. ప్రజల నుంచి వస్తున్న నిరసన తట్టుకోలేక టీఎంసీ కార్యకర్తలు బిజెపి నాయకులకు ఫోన్లు చేస్తున్నారు. ప్రజల నుంచి తమను కాపాడాలని విన్నవిస్తున్నారు.

బిజెపి నేతలు ప్రజలకు సర్ది చెబుతున్నారు. మన పని అది కాదని.. ఇంకా వెస్ట్ బెంగాల్ రాష్ట్రాన్ని పూర్తిగా పునర్ నిర్మించే బాధ్యతని భుజాలకు ఎత్తుకోవాల్సి ఉందని.. చెబుతున్నారు. అయితే బిజెపి నాయకులు బయటకి అలా చెప్తున్నప్పటికీ.. మమత చేసిన 15 సంవత్సరాల కంపు తొలగించడానికి ఎన్ని స్వచ్ఛభారత్ లు నిర్వహించాలి.. ఎంతమంది సువెందు అధికారి లు ముఖ్యమంత్రులుగా బాధ్యతలు తీసుకోవాలి.. ఇప్పుడు ఇవే ప్రశ్నలు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు బెంగాల్ గొప్పగా కనిపించకపోయినప్పటికీ.. వచ్చే రోజుల్లో మాత్రం క్లీన్ బెంగాల్ గా మారడం ఖాయం.

ఎన్టీఆర్ తో స్నేహం చేసి హీరోగా మారిన నటుడు... ఇప్పుడు తారక్ తో మాట్లాడటం లేదు...

NTR
NTR

NTR: నందమూరి ఫ్యామిలీ హీరోలకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో గొప్ప అవకాశాలైతే దక్కుతున్నాయి. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చే ప్రతి హీరో తమదైన రీతిలో సత్తా చాటుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. నందమూరి తారక రామారావు గారి తర్వాత బాలయ్య బాబు ఆ ఫ్యామిలీని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ఇక మూడోవతరం హీరోగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సైతం ఎప్పుడు పాన్ ఇండియా లెవెల్లో నందమూరి ఫ్యామిలీ స్టామినా ఏంటో చూపిస్తున్నాడు.

ఇక ఇదిలా ఉంటే కెరియర్ స్టార్టింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ తో ఫ్రెండ్షిప్ చేసిన ఒక నటుడు హీరోగా మారి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇంతకీ ఆ నటుడు ఎవరు అంటే రాజీవ్ కనకాల కావడం విశేషం…ఇక ఆ సినిమాతో వీళ్ళిద్దరికీ చాలా మంచి పరిచయమైతే కుదిరింది. దాంతో వీరిద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. ప్రతి సినిమాలో రాజీవ్ కనకాలకి ఒక సపరేట్ క్యారెక్టర్ ఉండే విధంగా డిజైన్ చేయించేవారు.

తద్వారా వీళ్ళిద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ అంటూ ఇండస్ట్రీ మొత్తం వీళ్ళ పేర్లు మారుమ్రోగిపోయాయి. దాంతో రాజీవ్ కనకాల కొన్ని సినిమాల్లో హీరోగా కూడా నటించి సక్సెస్ లను సాధించాడు.
ఇక ఏమైందో తెలియదు గానీ గత కొద్ది రోజులుగా వీళ్ళిద్దరి మధ్య సరిగ్గా మాటలు లేవంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. రీసెంట్ గా రాజీవ్ కనకాల ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చాడు.

మా మధ్య ఎలాంటి గొడవలు జరగలేదని మేమిద్దరం చాలా బాగా మాట్లాడుకుంటున్నామని చెప్పాడు. అవకాశం దొరికిన ప్రతిసారి కలుస్తూ చాలా సేపు డిస్కస్ చేసుకుంటూ ఉంటామని కూడా ఆయన చెప్పడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ తో స్నేహం చేసి హీరోగా మారిన రాజీవ్ కనకాల ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సత్తా చాటుతుండటం విశేషం…

తప్పు సహజం.. కానీ అలా సరిదిద్దుకున్న అలీ

Ali Apology
Ali Apology

Ali Apology: ఇటీవల ప్రముఖ కమెడియన్ అలీ క్షమాపణలు చెప్పారు. ఓ సబ్బుల కంపెనీకి ఇచ్చిన యాడ్ పై అభ్యంతరాలు రావడంతో ముందే మేల్కొన్నారు అలీ. దాదాపు 1000 చిత్రాల్లో నటించారు. ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. బుల్లితెరలో చాలా షోలకు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఓ అభ్యంతరకర యాడ్ లో నటించడం విమర్శలకు గురయ్యారు. వెంటనే పరిస్థితిని గమనించి అలీ క్షమాపణలు చెప్పడం విశేషం. నిజంగా అభినందించదగ్గ విషయం కూడా.

* సబ్బుల కంపెనీ ప్రకటనలో..
ముంబాయికి చెందిన ఓ సబ్బుల కంపెనీ.. తన ప్రకటనకు గాను అలీని సంప్రదించింది. ఆ యాడ్లో సంప్రదాయ వస్త్రధారణలో కనిపించారు అలీ. అయితే లక్ష్మీదేవి పూజ మాదిరిగా ఆ సబ్బును పెట్టి అలీ పూజిస్తుంటారు. అయితే ఈ ప్రకటనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అది లక్ష్మీదేవి పూజను విమర్శించినట్టేనని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. అయితే దాదాపు 1000 చిత్రాల్లో నటించిన సీనియారిటీ అలీ ది. ఇటువంటి విమర్శలు వస్తాయని ఆయన భావించలేదు. ఆ విమర్శలు రావడంతో వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగారు అలీ. ఎంత మాత్రం బేషజాలాలకు పోకుండా వెంటనే క్షమాపణలు చెప్పారు. సదరు బొంబాయి కంపెనీ తో మాట్లాడి ఆ ప్రకటనను నిలిపివేయించారు.

* సోషల్ మీడియా పుణ్యమా అని..
ప్రస్తుతం సమాజంలో మతవాదం పెరుగుతోంది అనడానికి ఈ ఘటన ఒక ఉదాహరణ. ప్రధానంగా హిందుత్వవాదం పెరిగింది. అయితే గతంలో మతాల మాటున స్వేచ్ఛ ఉండేది. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని మత రక్షకులు పెరుగుతున్నారు. మతాన్ని రక్షిస్తున్నామన్న స్థితిలో వ్యవహరిస్తున్నారు. తమ మతాన్ని తాము గొప్పగా చూసుకుంటున్న తరుణంలో.. కొన్ని రకాల పరిధిని దాటి వ్యవహరిస్తున్నారు. మనిషి దైనందిన జీవితంలో కూడా మతాన్ని ముడిపెట్టి స్వేచ్ఛను హరిస్తున్నారు. ఇది ఎంత మాత్రం సహేతుకం కాదు. అయితే అలీ నటించిన ప్రకటనపై అభ్యంతరాలు రావడంతో.. ఆయన క్షమాపణలు చెప్పి తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు.