Chiranjeevi Srikanth Odela movie: చిరంజీవి హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది. ప్రస్తుతం చిరంజీవి – బాబీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. ఈ ఇయర్ ఇప్పటికే ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో సూపర్ సక్సెస్ ను సాధించాడు. ఇక ప్రస్తుతం శ్రీకాంత్ చేస్తున్న ‘ప్యారడైజ్’ సినిమా ఆగస్ట్ 21 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ మూవీ ప్రేక్షకులందరిలో ఒక ఇంపాక్ట్ ను క్రియేట్ చేయగలుగుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని శాసించగలిగే కెపాసిటి ఉన్న స్టార్ హీరోలందరు ఉన్నప్పటికి చిరంజీవితో సినిమా చేయడం అనేది ప్రతి ఒక్క దర్శకుడి కల…
అలాగే శ్రీకాంత్ ఓదెల సైతం చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమాలు చూసుకుంటూ పెరిగాడు. చిరంజీవి అంటే చాలా ఇష్టమట. కాబట్టి తనతో సినిమాలు చేయడానికి ఒక మంచి స్టోరీ ని చెప్పాడట. ప్రస్తుతం చిరంజీవి బాబీ తో చేస్తున్న సినిమా పూర్తి అయిన తర్వాత శ్రీకాంత్ తను చిరంజీవితో చేయబోయే సినిమాకు సంబంధించిన పూర్తి కథను చెబుతానని తను పలు సందర్భాల్లో చెప్పాడు. ప్రస్తుతం ప్యారడైజ్ రిజల్ట్ మీదనే శ్రీకాంత్ – చిరంజీవి సినిమా ఆధారపడి ఉంటుందని పలువురు సినిమా మేధావులు చెబుతున్నారు.
చిరంజీవి ఈ సినిమా కోసం భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంతకుముందు ఆయన 40 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకోగా ఈ సినిమా కోసం 60 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. ఈ సంవత్సరం ఇప్పటికే ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమా 400 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది.
ఇక చిరంజీవి కి ఒక మంచి కంటెంట్ తో సినిమా పడితే 500 నుంచి 600 కోట్ల వరకు కూడా కలెక్షన్స్ రాబట్టగలిగే సత్తా తనకు ఉందని మెగా ఫ్యాన్స్ సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక చిరంజీవి సైతం 70 సంవత్సరాల వయసులో కూడా ప్రేక్షకులకు వినోదాన్ని అందించడానికి తన శాయ శక్తుల ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని బట్టి చిరంజీవికి సినిమాలంటే ఎంత ఇష్టమో మనం అర్థం చేసుకోవచ్చు…















'ఊర్లో పెళ్ళికి అదేదో హడావిడి అంటారు కదా' అని సీఎం విజయ్ విజయం పై పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్..
Pawan Kalyan comments on Vijay: `రీసెంట్ గా తమిళనాడు లో సినీ నటుడు విజయ్ సార్వత్రిక ఎన్నికల్లో సంచలన విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన సందర్భంగా, సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ , విజయ్ లను పోలుస్తూ కొంతమంది ఏ రేంజ్ ట్రోల్స్ వేసారో మన కళ్లారా చూశాము . అభిమానులు సైతం 2024 లో పవన్ కళ్యాణ్ వేవ్ తారా స్థాయిలో ఉన్నింది , రిస్క్ చేసి పోటీ చేసుంటే కచ్చితంగా సీఎం అయ్యేవాడేమో అని కామెంట్స్ చేశారు. మొత్తం మీద తమిళనాడు లో సీఎం గా విజయ్ బాధ్యతలు చేపట్టడం , పవన్ కళ్యాణ్ పై సీఎం అవ్వాలనే ఒత్తిడి అభిమానుల నుండి తీవ్రస్థాయిలో మొదలైంది. అయితే నేడు ఆయన కార్యకర్తలతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం లో ఈ విషయం పై చాలా ఘాటుగానే స్పందించాడు.
ఆయన మాట్లాడుతూ ‘రీసెంట్ గానే పక్క రాష్ట్రంలో ఒకరు పార్టీ ని స్థాపించి , ముఖ్యమంత్రి అయిపోయారని, మీరు కూడా అలాగే అవ్వాల్సింది అంటూ ఎన్నో వేల మెసేజిలు వచ్చాయి. ఊర్లో పెళ్ళికి అదేదో హడావిడి అంటారు కదా, అలాగే ఉన్నాయి మీ మాటలు. మన రాష్ట్రంలో పరిస్థితులు ఎలాంటివో చూసి కూడా ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారు, పోనీ మీ మాటకు తగ్గట్టుగానే 2019 లో పోటీ చేస్తే ఏమి చేశారు , రెండు చోట్ల ఓడించారు. మన రాష్ట్ర పరిస్థితులను చూసి దశాబ్దం కాలం వరకు నలుగుతాను అని ఊహించే రాజకీయాల్లోకి అడుగుపెట్టాను. పదవి కోసం నేను ఏనాడూ కూడా రాజకీయాలు చెయ్యాలని అనుకోలేదు. అలా అనుకుంటే 2009 లోనే ఎంపీ గా పోటీ చేసి ఉండేవాడిని. 2014 లో ఎన్డీయే తో కలిసి ఉన్నప్పుడు , మల్కాజ్ గిరి స్థానం నుండి నేను పోటీ చేయాల్సి ఉంది , కానీ నాకు పార్టీ ని నడపడం ముఖ్యం, పార్టీ ని స్థాపించినప్పుడు నాతో పాటు నడిచిన వాళ్ళు , ఈరోజు చాలా మంది లేరు. ఓడిపోయిన వెంటనే పారిపోయారు. నాతో మొదటి నుండి ప్రయాణం చేసింది కేవలం జనసైనికులు మాత్రమే’ అంటూ చెప్పుకొచ్చాడు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్న ఈ వీడియో ని మీ కోసం క్రింద అందిస్తున్నాము చూడండి.