Peddi movie advance bookings: మరో 17 రోజుల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ‘పెద్ది’ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సినిమా కోసం అభిమానులు దాదాపుగా ఏడాది పాటు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు. ఎందుకంటే గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన ‘గేమ్ చేంజర్’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ముఖ్యంగా చరణ్ ఫ్యాన్స్ ని తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లిపోయేలా చేసింది. అలాంటి సినిమా తర్వాత తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ‘పెద్ది’ పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. దానికి తోడు ఆ చిత్రం నుండి వచ్చిన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ కూడా హిట్ అవ్వడంతో , రామ్ చరణ్ ఈసారి కుంభస్థలం బద్దలు కొట్టబోతున్నాడని అందరూ ఫిక్స్ అయ్యారు.
అభిమానులు అయితే ఓజీ, దేవర రికార్డ్స్ ని అవలీలగా దాటేస్తాము అంటూ సోషల్ మీడియా లో సవాళ్లు కూడా విసిరారు. కానీ ప్రస్తుతానికి ఈ సినిమాకు జరుగుతున్న ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ని చూస్తుంటే, ఆ రేంజ్ కి వెళ్లడం చాలా కష్టమే అనిపిస్తోంది. ఓవర్సీస్ లో బుకింగ్స్ ని మొదలు పెట్టి దాదాపుగా 10 రోజులు కావొస్తుంది , కానీ ఇప్పటి వరకు ఈ చిత్రం కేవలం బుకింగ్స్ ద్వారా కేవలం 4 లక్షల డాలర్లు మాత్రమే రాబట్టింది. అందులో కేవలం నార్త్ అమెరికా నుండి 3 లక్షల డాలర్లు వచ్చాయి. నార్త్ అమెరికా మన టాలీవుడ్ కి కంచుకోట లాంటిది. ఇక్కడ దేవర చిత్రం 2.6 మిలియన్ డాలర్ల గ్రాస్ ని ప్రీమియర్ షోస్ నుండి రాబడితే , ఓజీ చిత్రం 3.1 మిలియన్ డాలర్ల గ్రాస్ ని రాబట్టి సంచలనం సృష్టించింది. ఓజీ చిత్రానికి దాదాపుగా 25 థియేటర్స్ లో ఆల్ టైం రికార్డ్స్ కూడా నమోదు అయ్యాయి.
ఆ చిత్రానికి ఉన్న డిమాండ్ కి తగ్గ షోస్ ని షెడ్యూల్ చేసుంటే 4 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను కూడా రాబట్టి ఉండేది , కానీ మేకర్స్ సరైన ప్లానింగ్ తో ముందుకు వెళ్ళకపోవడం వల్ల 3.1 మిలియన్ డాలర్ల వద్దనే ఆగిపోయింది. అయితే ‘పెద్ది’ కి ప్రస్తుతం నడుస్తున్న ఊపుని చూస్తుంటే , 2 మిలియన్ డాలర్ల గ్రాస్ కి ఒక్క రూపాయి కూడా వచ్చేలా కనిపించడం లేదు. ఇది కూడా నేడు విడుదల అవ్వబోయే థియేట్రికల్ ట్రైలర్ ఆకట్టుకుంటేనే. ఇక ప్రస్తుతం ఉన్న డిమాండ్ ని బట్టి చూస్తుంటే ఈ చిత్రానికి మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 120 నుండి 130 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చేలాగా అనిపిస్తున్నాయి. ఓజీ, దేవర చిత్రాలకు వరల్డ్ వైడ్ గా 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అయితే ‘పెద్ది’ చిత్రం క్రేజ్ రాబోయే రోజుల్లో పెరగొచ్చు , తగ్గొచ్చు ఏదైనా జరగొచ్చు.
















యంగ్ క్రికెటర్ తో డేటింగ్ పై శ్రీలీల షాకింగ్ కామెంట్స్.. సినిమాలకు బ్రేక్..
Sreeleela dating rumors: నిన్నటి నుండి సోషల్ మీడియా లో శ్రీలీల ప్రముఖ యంగ్ క్రికెటర్ తిలక్ వర్మ తో డేటింగ్ లో ఉన్నట్టు పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి. అందుకు కారణం డీసెంట్ గా ధర్మశాల క్రికెట్ స్టేడియం లో జరిగిన ముంబై ఇండియన్స్ వెర్సస్ పంజాబ్ కింగ్స్ IPL మ్యాచ్ లో ఆమె దర్శనం ఇవ్వడమే. ఎందుకంటే శ్రీలీల కర్ణాటక ప్రాంతానికి చెందిన అమ్మాయి, ఆమె సపోర్టు కేవలం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం కి మాత్రమే ఉండాలి , అలాంటిది ముంబై ఇండియన్స్ కి సపోర్టు గా వచ్చిందంటే కచ్చితంగా తిలక్ వర్మ కోసమేనని , గతం లో కూడా అనేక ముంబై క్రికెట్ మ్యాచులకు ఆమె వచ్చిందని , తిలక్ వర్మ కూడా ప్రస్తుతం ప్రేమలో ఉన్నాడు కాబట్టి , ఆయన ప్రేయసి శ్రీలీల నే అయ్యి ఉంటుందని , ఇలా ఎన్నో రకాల విశ్లేషణలు సోషల్ మీడియా లో వచ్చాయి.
అయితే ఈ విషయం పై శ్రీలీల టీం కూడా వెంటనే స్పందించింది. సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారం లో అసలు ఎలాంటి నిజం లేదని , ఇప్పటి వరకు శ్రీలీల , తిలక్ వర్మ లు కనీసం కలుసుకోలేదని చెప్పుకొచ్చారు. దీంతో తిలక్ వర్మ తో డేటింగ్ రూమర్స్ కి చెక్ పడినట్టు అయ్యింది. ఇదంతా పక్కన పెడితే శ్రీలీల జోరు ఈమధ్య టాలీవుడ్ లో బాగా తగ్గిపోయింది. ఆమె చివరి చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. అంతకు ముందు విడుదలైన సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అయ్యాయి. ఈమె కెరీర్ లో సూపర్ హిట్ గా నిల్చిన చిత్రాలు కేవలం రెండు మాత్రమే, అందులో ఒకటి ‘ధమాకా’ కాగా , మరొకటి ‘భగవంత్ కేసరి’.
ఇలా వరుసగా ఫ్లాప్స్ రావడం తో ఆమెకు టాలీవుడ్ అవకాశాలు ఇచ్చేందుకు నిర్మాతలు భయపడుతున్నారని, ఇక టాలీవుడ్ లో శ్రీలీల కెరీర్ ఖతం అయ్యినట్టే అంటూ విశ్లేషకులు కామెంట్స్ చేశారు. కానీ శ్రీలీలకి ఇప్పటికీ అవకాశాలు క్యూలు కడుతూనే ఉన్నాయట , స్వయంగా ఆమెనే కాస్త బ్రేక్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు తెలుస్తోంది. ఎందుకంటే హడావడిగా సినిమాలు ఒప్పుకొని చేయడం వల్ల ఫ్లాప్స్ వస్తున్నాయి, అందుకే ఈసారి జాగ్రత్తగా స్క్రిప్ట్ సెలక్షన్ ఉండాలని నిర్ణయం తీసుకుందట. అంతే కాకుండా రీసెంట్ గానే ఈమె MBBS డిగ్రీ పొందింది , పై చదువులు కూడా చదవాలి అనుకుంటుందట , అందుకే కొంతకాలం చదువు మీద ద్రుష్టి పెట్టాలని అనుకుంటుందట , అందుకే కొంతకాలం టాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. కానీ తమిళం లో రెండు సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, ఇవి మాత్రం పూర్తి చేస్తుందట.