Home Blog Page 259

భారత్‌–స్వీడన్‌ సంబంధాలు.. వ్యూహాత్మక భాగస్వామ్యంతో కొత్త అధ్యాయం

India Sweden relations
India Sweden relations

India Sweden relations: భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వీడన్‌ పర్యటన భారత్‌–యూరప్‌ సంబంధాల్లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. గోథెన్‌బర్గ్‌లో జరిగిన ఉన్నత స్థాయి చర్చలు రెండు దేశాల మధ్య సహకారాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి ఎత్తి, భవిష్యత్‌కు బలమైన రోడ్‌మ్యాప్‌ను అందించాయి. ఇది కేవలం ద్వైపాక్షిక బంధాల విస్తరణ మాత్రమే కాదు, సాధారణ జనాభా, ఆవిష్కరణలు, స్థిరత్వం, అభివృద్ధి వంటి సాధారణ విలువలపై ఆధారపడిన భాగస్వామ్యం.

వ్యూహాత్మక భాగస్వామ్యం..
భారత్, స్వీడన్‌ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి ఉన్నతీకరించడం ఈ పర్యటనలోని అతి ముఖ్య నిర్ణయం. ఈ అప్‌గ్రేడ్‌ ద్వారా రాజకీయ, ఆర్థిక, సాంకేతిక, రక్షణ, వాతావరణం, ప్రజల మధ్య సంబంధాలు అన్ని రంగాల్లోనూ సమగ్ర సహకారం ఏర్పడనుంది. ఈ లక్ష్యంతో ఇండియా–స్వీడన్‌ జాయింట్‌ యాక్షన్‌ ప్లాన్‌ 2026–2030ను కూడా అనుమోదించారు. ఇది రాబోయే ఐదేళ్లలో భాగస్వామ్యాన్ని ఆచరణాత్మకంగా అమలు చేసే దిశగా బలమైన ఆధారం అవుతుంది.

సాంకేతికత ఆవిష్కరణల్లో కీలక అడుగులు..
సాంకేతిక రంగం ఈ సమ్మేళనం రెండు దేశాలు జాయింట్‌ ఇన్నోవేషన్‌ పార్ట్‌నర్‌షిప్‌ 2.0ను అధికారికంగా ప్రారంభించాయి. దీని కింద ఇండియా–స్వీడన్‌ జాయింట్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సెంటర్‌ ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా, ఇండియా–స్వీడన్‌ టెక్నాలజీ – ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ కారిడార్‌ ఏర్పాటు చేయడం ఈ పర్యటనలోని మరో కీలక ప్రకటన. ఈ కారిడార్‌ ద్వారా ఏఐ, 6జీ, క్వాంటం కంప్యూటింగ్, లైఫ్‌ సైన్సెస్‌ వంటి అత్యాధునిక రంగాల్లో సంయుక్త పరిశోధనలు, స్టార్టప్‌ల మధ్య సహకారం, వ్యాపార అవకాశాలు పెరగనున్నాయి. ఇది భారత డిజిటల్‌ ఇండియా లక్ష్యాలను స్వీడన్‌ యొక్క పారిశ్రామిక ఆవిష్కరణలతో మేళవించి భవిష్యత్‌ సాంకేతికతలకు కొత్త మార్గాలు వెలికితీస్తుంది.

వాణిజ్య, ఆర్థిక సహకారం..
గత సంవత్సరం భారత్‌–స్వీడన్‌ ద్వైపాక్షిక వాణిజ్యం 7.75 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఈ నేపథ్యంలో రాబోయే ఐదేళ్లలో వాణిజ్యం, పెట్టుబడులను రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. స్వీడన్‌ ప్రధాని ఉల్ఫ్‌ క్రిస్టెర్సన్‌ ఈ లక్ష్యం కంటే ముందే సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రీన్‌ ట్రాన్సిషన్, డిఫెన్స్, స్పేస్, స్టార్టప్‌లు, రెసిలియెంట్‌ సప్లై చైన్స్‌ రంగాల్లో సహకారం ఈ లక్ష్యాన్ని సాకారం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రధాని మోదీ యూరపియన్‌ బిజినెస్‌ నాయకులతో జరిపిన సమావేశాల్లో భారత్‌ను విశ్వసనీయ పెట్టుబడి గమ్యస్థానంగా ప్రచారం చేయడం ఈ పర్యటనలో మరో ముఖ్యాంశం.

మోదీ హృదయపూర్వక కృతజ్ఞతలు..
సాంస్కృతిక మేళవింపు పర్యటన సమయంలో స్వీడన్‌ ప్రధాని ఉల్ఫ్‌ క్రిస్టెర్సన్‌తో పాటు స్వీడన్‌ ప్రభుత్వం, ప్రజలు చూపిన ఆప్యాయతకు ప్రధాని మోదీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా స్వీడన్‌ రాజకుటుంబం ప్రధాని మోదీని రాయల్‌ ఆర్డర్‌ ఆఫ్‌ ది పోలార్‌ స్టార్తో సత్కరించడం విశేషం. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ కవితల ఫ్యాక్సిమైల్‌ను బహుమతిగా అందజేయడం రెండు దేశాల మధ్య సాంస్కతిక వారసత్వ సంబంధాలను మరింత బలపరిచింది.

ప్రధాని మోదీ స్వీడన్‌ పర్యటన భారత్‌–స్వీడన్‌ సంబంధాలకు కేవలం ఒక దశ మాత్రమే కాదు, ఒక కొత్త యుగానికి నాంది పలికింది. ఆవిష్కరణ, స్థిరత్వం, పరస్పర లాభదాయక సహకారంపై ఆధారపడిన ఈ భాగస్వామ్యం రెండు దేశాల ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడంతోపాటు, ప్రపంచ స్థాయిలో స్థిరత్వం, ఆవిష్కరణలకు కొత్త మార్గాలు చూపించనుంది.

మోడీ పిలుపునిచ్చారనీ ఆటో ఎక్కారు.. ఇక్కడే బీజేపీ ఎమ్మెల్యే అడ్డంగా బుక్కయ్యారు

BJP MLAs controversy
BJP MLAs controversy

BJP MLAs controversy: ప్రధాని నరేంద్ర మోదీ ఇంధన సంరక్షణకు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో పలు రాజకీయ నాయకులు తమ వాహనాల సంఖ్యను తగ్గించడం ఆరంభించారు. అయితే కొందరు నాయకులు ప్రచారం కోసం ఉపయోగిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు బిజెపి ఎమ్మెల్యేలు ఆటోరిక్షాలో ప్రయాణం చేయడం ఈ వివాదానికి కేంద్రంగా మారింది. కెమెరా మెన్‌తో కలిసిన ‘సాధారణ’ ప్రయాణం అంటూ ఆటోలో ప్రయాణిస్తున్న ఎమ్మెల్యేలను పక్కనే ఉన్న కారులో కెమెరామెన్ రికార్డ్ చేస్తూ వెళ్లడం గమనార్హం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే సరికి నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.

ఎమ్మెల్యే తీరుపై విమర్శలు..
ఎమ్మెల్యేల తీరుపై విమర్శలు. వెల్లువెత్తుతున్నాయి. నాయకులు సాధారణ ప్రజల మాదిరి ప్రయాణించడం మంచి విషయమే. కానీ దానిని కెమెరా ముందు నాటకీయంగా చూపించడం ద్వారా ఆ చర్య యొక్క ఉద్దేశ్యం ప్రశ్నార్థకం అవుతోంది. ఇంధన సంరక్షణ నిజంగా మనస్ఫూర్తిగా చేపట్టాలంటే, కెమెరాలు లేకుండా, నిత్యం అలాంటి ప్రయాణాలు చేయాలి కావాలి. ఒక్కసారి వీడియో కోసం చేసి, మిగతా సమయం విఐపి కాన్వాయ్‌లతో తిరగడంపై యూపీతోపాటు దేశ ప్రజలు మండిపడుతున్నారు.

ఇంధన సంరక్షణ.. నాయకుల బాధ్యత
ప్రధాని మోదీ పిలుపు ఇచ్చిన తర్వాత కొందరు నాయకులు కాన్వాయ్‌లను తగ్గించడం సానుకూల సంకేతం. అయితే ఈ విషయంలో కూడా రాజకీయ ప్రయోజనాలు చూస్తున్నారన్న భావన ప్రజల్లో ఏర్పడుతోంది. నిజమైన సంరక్షణ అంటే ప్రభుత్వ వాహనాల వినియోగం, అధికారిక ఖర్చులు తగ్గించడం, అనవసర ప్రయాణాలను నియంత్రించడం వంటి దీర్ఘకాలిక చర్యలు అవసరం.ఆటోలో ప్రయాణించిన ఎమ్మెల్యేలు నిజంగా సంరక్షణకు కట్టుబడి ఉన్నారా లేదా కేవలం ఫోటో ఆపర్చ్యూనిటీ కోసం చేశారా అనేది వారి రోజువారీ ప్రవర్తన ఆధారంగా తేలాలి.

సోషల్ మీడియా యుగంలో ప్రతి చర్యా కెమెరా ముందు జరిగితే, అది ప్రజల్లో అపనమ్మకం పెంచుతుంది.ముగింపుఇంధన సంరక్షణ ఒక్క నాయకుల విషయం కాదు, ప్రతి పౌరుడి బాధ్యత. నాయకులు దీనిని నిజాయితీగా అమలు చేస్తే మాత్రమే ప్రజలు స్పందిస్తారు. కెమెరా కోసం ఆటో ఎక్కడం కంటే, కెమెరా లేకుండా కూడా ఆటోలో ప్రయాణించే సంస్కృతి ఏర్పడితేనే నిజమైన మార్పు కనిపిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న వివాదం రాజకీయ నాయకులకు ఒక మంచి హెచ్చరికగా మారాలి.

‘తిలా పాపం తలా పిడికెడు’దీని వెనుక అసలు స్టోరీ ఇదే..

Tila Papam Tala Pidikedu meaning
Tila Papam Tala Pidikedu meaning

Tila Papam Tala Pidikedu meaning: తెలుగు భాషలో ఎన్నో జాతీయాలు, సామెతలు మన జీవిత అనుభవాల నుంచి పుట్టుకొచ్చాయి. అలాంటి వాటిలో ‘తిలా పాపం తలా పిడికెడు’అనే జాతీయం చాలా ప్రసిద్ధి చెందింది. ఒక తప్పుకు ఒక్కరే కాదు.. పలువురు కారణమైతే లేదా ఎవరిది పూర్తి తప్పో తేల్చలేని పరిస్థితి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. చిన్న చిన్న తప్పులు కలిసి పెద్ద అనర్థానికి దారి తీసిన సందర్భాల్లో కూడా దీన్ని చెబుతుంటారు. అసలు ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది? దీని వెనక ఉన్న స్టోరీ ఏంటీ?

ఈ జాతీయం వెనుక ఒక ఆసక్తికరమైన పురాణగాథ ప్రచారంలో ఉంది. ఒక రోజు ఓ గద్ద తన ఆహారం కోసం ఒక విషపామును పట్టుకుని ఆకాశంలో ఎగురుతోంది. గద్ద గోళ్లలో చిక్కుకున్న పాము ప్రాణాలతో పోరాడుతూ తీవ్ర వేదన అనుభవించింది. చనిపోతున్న సమయంలో తన నోట్లోని విషాన్ని బయటకు కార్చింది. అదే సమయంలో కిందుగా ఓ యువతి తన తలపై పెరుగుతో నిండిన ముంతను పెట్టుకుని వెళ్తోంది.

ఆ యువతి ముంతపై కప్పిన గుడ్డ కొద్దిగా జారిపోవడంతో, ఆకాశం నుంచి జారిన పాము విషం నేరుగా పెరుగులో పడుతుంది. కానీ ఆ విషయం ఆ యువతికి తెలియలేదు. కొంతసేపటి తర్వాత ఆమె ఆ పెరుగును ఒక బాటసారికి అమ్మింది. ఆ వ్యక్తి ఆకలితో ఆ పెరుగు తిన్నాడు. విషం కలిసిన కారణంగా అతడు కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయాడు.

ఈ ఘటనలో నిజంగా తప్పు ఎవరిది అనే ప్రశ్న తలెత్తింది. పామా? గద్దా? లేక పెరుగు అమ్మిన యువతిదా? పాము తన ప్రాణం కాపాడుకునే ప్రయత్నంలో విషం వదిలింది. గద్ద తన ఆహారం కోసం పామును పట్టుకుంది. యువతికి పెరుగులో విషం పడిందనే విషయం తెలియదు. అంటే ముగ్గురిలో ఎవ్వరూ కావాలని హాని చేయలేదు. కానీ ముగ్గురి చర్యలు కలిసి ఒక అమాయకుడి మరణానికి కారణమయ్యాయి.

కాలక్రమంలో ఆ యువతి, గద్ద కూడా మరణించి యమలోకానికి చేరుకున్నాయని కథ చెబుతుంది. అక్కడ యమధర్మరాజు ఈ సంఘటనపై విచారణ జరిపాడట. కానీ ఇందులో ఒక్కరినే పూర్తిగా తప్పుబట్టడం సాధ్యం కాలేదు. అందుకే ఆ పాపాన్ని అందరికీ సమంగా పంచాడని చెబుతారు. ఇలా తిలా పాపం తలా పిడికెడు అనే మాట అక్కడి నుంచే పుట్టిందని అంటారు.

ఈ జాతీయం మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని కూడా ఇస్తుంది. కొన్ని సందర్భాల్లో పెద్ద ప్రమాదాలు ఒక్కరి వల్ల కాకుండా, అనుకోకుండా జరిగిన చిన్న చిన్న పరిణామాల వల్ల జరుగుతాయి. అలాంటి సందర్భాల్లో బాధ్యతను ఒకరిపై మాత్రమే మోపకుండా, పరిస్థితులను సమగ్రంగా అర్థం చేసుకోవాలని ఈ సామెత సూచిస్తుంది. ప్రస్తుతం కూడా రాజకీయాలు, కుటుంబ వివాదాలు, కార్యాలయ సమస్యలు లేదా సామాజిక ఘటనల్లో ‘తిలా పాపం తలా పిడికెడు’ అనే జాతీయాన్ని తరచుగా వాడుతుంటారు. అంటే జరిగిన తప్పులో అందరికీ కొంత బాధ్యత ఉందని చెప్పే సందర్భాల్లో ఈ మాటను ఉపయోగిస్తారు. తెలుగు భాషలోని జాతీయాల వెనుక ఉన్న జీవన సత్యాలకు ఇది ఒక మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

ఈ 5 కార్లు మిమ్మల్ని కాపాడుతాయి..!

Top 5 Safest Cars
Top 5 Safest Cars

Top 5 Safest Cars: భారత్‌లో కార్లు కొనుగోలు చేసేవారు ఇప్పుడు మైలేజ్‌, డిజైన్‌ మాత్రమే కాదు.. సేఫ్టీ (Safety)ని కూడా ప్రధానంగా చూస్తారు. ముఖ్యంగా భారత్ NCAP క్రాష్ టెస్టుల్లో 5-స్టార్ రేటింగ్ పొందిన కార్లకు భారీ డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కొన్ని మోడళ్లు అత్యంత సురక్షితమైన కార్లుగా పేర్కొనబడుతున్నాయి. ఈ కార్లలో అధునాతన ఎయిర్‌బ్యాగ్స్‌, ADAS,ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్‌, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉండటంతో ప్రయాణికులకు మెరుగైన రక్షణ లభిస్తోంది. మరి వీటిలో టాప్ 5 కార్లు ఏవో చూద్దాం..

కియా సెల్టోస్ :
ప్రస్తుతం భారత్‌లో అత్యంత సురక్షితమైన సేప్టీ SUVలలో కియా సెల్టోస్ ఒకటిగా నిలిచింది. Bharat NCAP క్రాష్ టెస్టుల్లో ఈ SUV 5 స్టార్ రేటింగ్ సాధించింది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్‌, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్ స్టార్ట్ అసిస్ట్‌, హిల్ డిసెంట్ కంట్రోల్‌, TPMS,ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజెస్‌, 360 డిగ్రీ కెమెరా వంటి సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి. ADAS టెక్నాలజీ ద్వారా ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్‌, లేన్ కీప్ అసిస్ట్‌, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రమాద సమయంలో ప్రయాణికుల తలకు, ఛాతీకి గట్టి రక్షణ లభించేలా బాడీ నిర్మాణం రూపొందించారు. ఈ SUV ధర సుమారు రూ. 10.99 లక్షల నుంచి ప్రారంభమవుతోంది.

మహీంద్రా థార్ రాక్స్ అడ్వెంచర్:
మహీంద్రా థార్ రాక్స్ అడ్వెంచర్ SUV అయినప్పటికీ భద్రత పరంగా కూడా బలమైన ఎంపికగా గుర్తింపు పొందింది. ఈ వాహనంలో 6 ఎయిర్‌బ్యాగ్స్‌, రోల్ ఓవర్ ప్రొటెక్షన్‌, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్‌, హిల్ హోల్డ్‌, హిల్ డిసెంట్ కంట్రోల్‌, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కఠినమైన రోడ్లపై కూడా కారు స్థిరంగా ఉండేలా ప్రత్యేక సస్పెన్షన్ సిస్టమ్ అమర్చారు. ఫ్యామిలీతో పాటు అడ్వెంచర్ ప్రియులకు ఇది మంచి ఎంపికగా భావిస్తున్నారు. థార్ రాక్స్ ధర సుమారు రూ. 13 లక్షల నుంచి రూ. 22 లక్షల వరకు ఉంటుంది.

స్కోడా కైలాక్:
స్కోడా కైలాక్ చిన్న SUV అయినప్పటికీ జర్మన్ ఇంజినీరింగ్ కారణంగా మంచి భద్రతను అందిస్తోందని ఆటో నిపుణులు చెబుతున్నారు. ఈ కారులో మల్టీపుల్ ఎయిర్‌బ్యాగ్స్‌, ABS with EBD, ESC, ట్రాక్షన్ కంట్రోల్‌, ISOFIX‌, రివర్స్ కెమెరా, బ్రేక్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. హై స్ట్రెంగ్త్ స్టీల్ బాడీ కారణంగా ప్రమాద సమయంలో క్యాబిన్‌కు తక్కువ నష్టం కలుగుతుంది. దీని ధర సుమారు రూ. 9 లక్షల నుంచి ప్రారంభమవుతుందని మార్కెట్ అంచనా.

టాటా సియెర్రా:
టాటా సియెర్రా మళ్లీ భారత మార్కెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత భద్రత పరంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. Bharat NCAP టెస్టుల్లో ఇది 5 స్టార్ రేటింగ్ సాధించిన ఈ SUVలో Level 2 ADAS, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటర్‌, SOS కాలింగ్ సిస్టమ్‌, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. బలమైన బాడీ నిర్మాణం వల్ల ఫ్రంట్‌, సైడ్ ఇంపాక్ట్ సమయంలో ప్రయాణికులకు గట్టి రక్షణ లభిస్తుంది. ఈ SUV ధర సుమారు రూ. 11 లక్షల నుంచి ప్రారంభమవుతుందని తెలుస్తోంది.

హ్యుందాయ్ వెన్యూ :
హ్యుందాయ్ వెన్యూ కూడా భారత్ NCAPలో 5-స్టార్ రేటింగ్ సాధించింది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్‌, Level 2 ADAS, స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్‌, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్‌, బ్లైండ్ వ్యూ మానిటర్‌, 360 డిగ్రీ కెమెరా, TPMS, ESC వంటి ఫీచర్లు ఉన్నాయి. హై స్ట్రెంగ్త్ స్టీల్ ఫ్రేమ్ కారణంగా ప్రమాద సమయంలో క్యాబిన్‌కు మెరుగైన రక్షణ లభిస్తుంది. సిటీ డ్రైవింగ్‌తో పాటు హైవేపై కూడా ఇది మంచి భద్రతను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీని ధర సుమారు రూ. 8 లక్షల నుంచి రూ.14 లక్షల వరకు ఉంటుంది.

Xiaomi నుంచి 17 Max లాంచ్..ఇది ఇండియాకు వస్తుందా..

Xiaomi 17 Max launch
Xiaomi 17 Max launch

Xiaomi 17 Max launch: Xiaomi కంపెనీ నుంచి కొత్త మొబైల్ వస్తుందని చాలా మంది ఆశిస్తూ ఉంటారు. అందుకు అనుగుణవంగా లేటేస్ట్ గా ఈ కంపెనీ నుంచి 17 Max లాంచ్ డేట్ గురించి పూర్తి అప్‌డేట్ వచ్చేసింది. చైనాలో ఈ ఫోన్ మే చివరి వారంలో లాంచ్ కానుంది. అంటే మే 28 నుంచి 31 మధ్యలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఆ తరువాత భారత్ లోకి వచ్చే అవకాశం కూడా ఉందని భావిస్తున్నారు. అయితే ఈ ఫోన్ లాంచ్ కాకముందే దీని వివరాలు బయటకు వచ్చాయి. ఈ ఫోన్ ఎలా ఉండబోతుందంటే?

Xiaomi 17 Max మొబైల్ ను మొదట్లో ఏప్రిల్ 2026 లో లాంచ్ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ తర్వాత సమాచారం ద్వారా ఇది మే 2026 కి పోస్ట్‌పోన్ అయ్యిందని తేలింది. ఇప్పుడు కంపెనీ చైనీస్ వెబ్‌సైట్ ద్వారా ఫోన్‌ను టీజ్ చేస్తూ, చైనా మార్కెట్‌లో మే చివరిలో లాంచ్ ఉంటుందని కన్ఫర్మ్ చేసింది.

Xiaomi 17 Max లో పెద్ద స్క్రీన్ ఉండనుంది. ఇది ఫ్లాగ్‌షిప్‌తో పనిచేసే అవకాశం ఉంది. ఇందులో సుమారు 6.9 అంగుళాల OLED డిస్ ప్లే ఉండనుంది. ఇది 1.5K రిజల్యూషన్, నేర్‑బెజెల్ లుక్ తో ఉంటాయని లీక్స్ చెబుతున్నాయి. ఇందులో Magic Back Screen లేకుండా ప్రో మోడల్స్ నుంచి కొంచెం మారి, స్లిమ్, ఫ్లాట్ బాడీ డిజైన్ ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. ఫోన్ Xiaomi Dragon Crystal Glass 3 లాంటి హార్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుందని సమాచారం.

ఈ ఫోన్ లో Qualcomm Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్ ఉండనుంది. ఇది కంపెనీ అత్యంత టాప్ ఆఫ్ ది లైన్ ప్లాట్‌ఫామ్ అని రూమర్స్ చెబుతున్నాయి. ఇందులో 16 GB RAM, 512 GB లేదా 1 TB స్టోరేజ్ వేరియంట్‌లు కూడా ప్రత్యేకతగా ఉంటాయని తెలుస్తోంది. ఓఎస్ వైపు చూస్తే Xiaomi HyperOS 3 ఉంటుందని సమాచారం. ఇది బెటర్ మల్టీటాస్కింగ్ కోసం డిజైన్ అయిందని చెబుతున్నారు.

ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ అమర్చినట్లు తెలుస్తోంది. ప్రైమరీ సెన్సార్ 200 MPతో పనిచేసే అవకాశం ఉంది. ఇది 8K వీడియో, హై‑రెజి జూమ్, బెటర్ లో‑లైట్ పెర్ఫార్మెన్స్ కోసం ఉపయోగపడుతుంది. ఇందులో అల్ట్రా‑వైడ్ మరియు టెలిఫోటో లేదా పెరిస్కోప్ లెన్స్‌లు కూడా ఉంటాయని భావిస్తున్నారు. దీంతో ఫోటోగ్రఫీ, వీడియో కంటెంట్ క్రియేటర్స్‌కు బెస్ట్ ఆప్షన్‌గా నిలువడం ఖాయం. Xiaomi 17 Max లో సుమారు 8,000 mAh భారీ బ్యాటరీని ఉంచే అవకాశం ఉందని టిప్‌స్టర్లు చెబుతున్నారు. ఇది Xiaomi బ్రాండెడ్ ఫోన్స్‌లో ఇప్పటివరకూ ఉన్నంత కంటే పెద్దది. దీనికి 100W ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్, 50W వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇది గేమింగ్, హై‑రెజ్ వీడియో స్ట్రీమింగ్, లాంగ్‑హాల్ టాస్క్‌లకు పర్ఫెక్ట్ గా అమర్చే పవర్ హౌస్ ఫోన్‌గా నిలుస్తుంది.

ఇండియాకు సంబంధించి ఇప్పటి వరకు 12 GB RAM + 256 GB స్టోరేజ్ వేరియంట్ సుమారు రూ. 89,999 చుట్టూ ధరతో వచ్చే అవకాశం ఉందని టెక్ బ్లాగర్లు గెస్ చేస్తున్నారు. కానీ ఇది ఇంకా ధృవీకరించబడలేదు. చైనాలో ఈ ఫోన్ స్ట్రిక్ట్‌గా లోకల్ మార్కెట్‌కు మాత్రమే లాంచ్ అయ్యే అవకాశం ఉందని కూడా ప్రచారం ఉంది. అంటే గ్లోబల్ వెర్షన్ రిలీజ్ ఉంటుందా లేదా అనేది క్లియర్ కాలేదు.

కోలీవుడ్ ని షేక్ చేయబోతున్న జాన్వీ కపూర్.. క్రేజీ ఆఫర్ కొట్టేసిన హాట్ బ్యూటీ..

Janhvi Kapoor Kollywood debut
Janhvi Kapoor Kollywood debut

Janhvi Kapoor Kollywood debut: లెజండరీ హీరోయిన్ , అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ లో భారీ హైప్ తో అడుగుపెట్టింది జాన్వీ కపూర్. కానీ సరైన స్క్రిప్ట్స్ ని ఎంచుకోలేకపోవడం వల్ల , ఈమెకు వరుసగా అక్కడ డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చాయి. దీంతో అంత పెద్ద లెజండరీ హీరోయిన్ కూతురు , ఇప్పుడు ఇండస్ట్రీ లో ఎటు కాకుండా పోతుందేమో అని శ్రీదేవి అభిమానులు కాస్త భయపడ్డారు. అయితే బాలీవుడ్ లో జాన్వీ కపూర్ కి కాలం కలిసిరాకపోయినా, టాలీవుడ్ లో మాత్రం బాగా కలిసొచ్చింది అనే చెప్పొచ్చు. ఆమె తొలితెలుగు చిత్రం ‘దేవర’ కమర్షియల్ గా ఎంత పెద్ద సూపర్ హిట్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా కమర్షియల్ గా అంత పెద్ద హిట్ అవ్వడానికి జాన్వీ కపూర్ కూడా ప్రధాన కారణమే. ఎందుకంటే ఆ చిత్రం లోని ‘చుట్టమల్లే’ పాటలో జాన్వీ కపూర్ అందాలను చూసి కుర్రాళ్ళు వెర్రిక్కిపోయారు.

కేవలం ఆ పాట కోసం ఆ చిత్రానికి ఎగబడి వెళ్లిన ఆడియన్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఈమె ‘పెద్ది’ చిత్రం లో హీరోయిన్ గా నటించింది. జూన్ 4 న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాపై అభిమానుల్లో , మూవీ లవర్స్ లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ చిత్రం లోని ‘చికిరి చికిరి’ పాట గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ పాటలో జాన్వీ అందానికి కుర్రాళ్ళు ఫిదా అయిపోయారు. ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని అభిమానుల్లో బలమైన నమ్మకం ఉంది , ఒకవేళ ఈ చిత్రం కూడా అంచనాలకు తగ్గట్టుగా సూపర్ హిట్ అయితే , ఇక టాలీవుడ్ లో జాన్వీ కపూర్ కి తిరుగే లేదని అనుకోవచ్చు.

మరో వైపు ఇప్పుడు ఈమె కోలీవుడ్ లో కూడా బంపర్ ఛాన్స్ కొట్టేసింది. ప్రముఖ సీనియర్ తమిళ హీరో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరో గా తెరకెక్కబోతున్న కొత్త సినిమాలో జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ముందుగా రుక్మిణి వాసంత్ ని హీరోయిన్ గా తీసుకున్నారు కానీ , కొన్ని అనుకోని కారణాల వల్ల , ఆమె ఈ చిత్రం నుండి తప్పుకోవడం తో , ఇప్పుడు ఆ స్థానం లోకి జాన్వీ కపూర్ వచ్చింది. అసలే ఫుల్ ఫార్మ్ లో ఉన్న జాన్వీ కపూర్ , ఇప్పుడు తమిళ సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టడం తో , అందరి ద్రుష్టి ఆమెవైపు మరలింది. చూడాలి మరి తమిళం లో జాన్వీ కపూర్ రేంజ్ రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది.

అప్పుడు కలెక్టర్.. ఇప్పుడు తెలంగాణ రియల్ ఎస్టేట్లో పుష్ప రాజ్

Telangana real estate Pushpa Raj
Telangana real estate Pushpa Raj

Telangana real estate Pushpa Raj: ఆయన ఒకప్పుడు కలెక్టర్ గా పని చేశారు. తన తెలివితేటలతో భారీగా భూములు సంపాదించారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో విపరీతంగా భూములు కొన్నారు. ఆ భూములు ఇప్పుడు వేలకోట్ల ఆస్తులు అయ్యాయి. కలెక్టర్ గా ఉన్నప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రికి ఆయన పాదాభివందనం కూడా చేశారు. కలెక్టర్ ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఓ రాజకీయ పార్టీలో చేరారు. ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు.

ఇప్పుడు ఆయన చేతిలో ఎన్నో కీలకమైన ప్రాజెక్టులు ఉన్నాయి. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్న ఓ కాస్ట్లీ ప్రాంతంలో ఎకరం భూమిని ఆయన ఏకంగా 100 కోట్లు పెట్టి కొన్నారు. ఇటువంటి కోట్లు ఆయనకు లెక్క కావు. లెక్కలోకి కూడా రావు. ఇప్పుడు ఏకంగా ఆయన దాదాపు పదికి మించిన ప్రాజెక్టులను చేతుల్లో పెట్టుకున్నారు. తెల్లాపూర్ ప్రాంతంలో 13 ఎకరాల విస్తీర్ణంలో అపార్ట్మెంట్ నిర్మించారు. ఇందులో 1500 ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఇదే తెల్లాపూర్లో మరో చోట 24 ఎకరాల్లో బహుళ అంతస్తులు నిర్మించారు. ఇందులో ఏకంగా మూడు వేల ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. తెల్లాపూర్ ప్రాంతంలో 21 ఎకరాల విస్తీర్ణంలో అతిపెద్ద అపార్ట్మెంట్ నిర్మించారు. ఇందులో కూడా 3500 ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. తెల్లాపూర్ ప్రాంతంలో ఏడు ఎకరాల విస్తీర్ణంలో అపార్ట్మెంట్ నిర్మించారు. ఇందులో 500 ప్లాట్లు అందుబాటులో వచ్చాయి.

హైదరాబాద్ నగరంలో అత్యంత ఖరీదైన నియో పోలీస్ ఏరియాలో ఏడు ఎకరాలలో బహుళ అంతస్తులు నిర్మించారు. ఇదే ఏరియాలో 8 ఎకరాల విస్తీర్ణంలో 600 ప్లాట్లు నిర్మించారు. నార్సింగి, మంచిరేవుల, కోకాపేట, అత్తాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాలలో దాదాపు ఐదువేల ప్లాట్ల విస్తీర్ణంతో బహుళ అంతస్తులను నిర్మించారు. ఒక రకంగా తెలంగాణ రియల్ ఎస్టేట్లో ఒకప్పుడు ఆపర్ణ, మై హోమ్, జనప్రియ వంటి కంపెనీలు నెంబర్ వన్ స్థానంలో ఉండేవి. కానీ ఆ కంపెనీలను ఈ మాజీ కలెక్టర్ కంపెనీ దాటేసింది. హైదరాబాదులోనే దాదాపు పదివేల ప్లాట్ లకు మించిన సామర్థ్యంతో బహుళ అంతస్తులు నిర్మిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇప్పటికే భారీగా భూములను కొనేసింది. ఈ ప్రకారం చూసుకుంటే ఆ మాజీ కలెక్టర్ రియల్ ఎస్టేట్ బిజినెస్ లో పుష్ప రాజ్ లాగా అవతరించే అవకాశం ఉందని బిజినెస్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.

ఆయన ఒక పార్టీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచినప్పటికీ.. ఇప్పుడు అధికార పార్టీతో దగ్గరగా ఉంటున్నట్టు తెలుస్తోంది. పైగా అధికార పార్టీలో ఒక కీలక నాయకుడితో ఇటీవల బంధుత్వం కూడా పెంచుకున్నారని సమాచారం. అందువల్లే ఈ స్థాయిలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దూకుడు కొనసాగిస్తున్నారని.. వేల కోట్లను సులభంగా సంపాదిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో ఈ మాజీ కలెక్టర్ సిద్ధహస్తుడని మార్కెట్ వర్గాలు చెవులు కోరుకుంటున్నాయి. చూడాలి మరి ఈ మాజీ కలెక్టర్ ఇంకా ఏ స్థాయిలో దూసుకుపోతారో.. ఇంకా ఏ రేంజ్ లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ను తన చేతుల్లో పెట్టుకుంటారో..

గుడ్లు తినేవారు ఈ తప్పులు చేస్తున్నారా.. వెంటనే తెలుసుకోండి..

Mistakes while Eating Eggs
Mistakes while Eating Eggs

Mistakes while Eating Eggs: ప్రపంచవ్యాప్తంగా అత్యంత పోషకవంతమైన ఆహారాల్లో గుడ్లు ఒకటిగా గుర్తింపు పొందాయి. ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, మంచి కొవ్వులు సమృద్ధిగా ఉండటంతో వీటిని ‘సూపర్ ఫుడ్’గా పిలుస్తారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ గుడ్లు మంచి పోషణను అందిస్తాయి. అయితే గుడ్లు తినేటప్పుడు చాలా మంది కొన్ని తప్పులు చేస్తుంటారు. ఇవి ఆరోగ్యానికి హానికరంగా మారే అవకాశం ఉందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఆ తప్పులు ఏవీ? గుడ్లు ఎవరు తినొద్దు?

గుడ్డులోని పచ్చసొనను కొందరు పూర్తిగా పక్కన పెట్టేస్తారు. పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఎక్కువ అనే భయంతో కేవలం తెల్లటి పదార్థాన్ని మాత్రమే తింటుంటారు. కానీ పచ్చసొనలోనే విటమిన్ A, D, E, K, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఐరన్, కొలిన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా మెదడు ఆరోగ్యం, కంటి చూపు, హార్మోన్ల సమతుల్యత కోసం పచ్చసొన ఎంతో ఉపయోగపడుతుంది. అందువల్ల పూర్తిగా దాన్ని మానేయడం వల్ల శరీరానికి అవసరమైన కొన్ని పోషకాలు తగ్గిపోతాయి.

గుడ్లను అతిగా తినడం వల్ల ప్రోటీన్ ఎక్కువ వస్తుంది అన్న ఉద్దేశంతో కొందరు రోజుకు 6 నుంచి 10 వరకు గుడ్లు తింటుంటారు. అయితే అవసరానికి మించి తీసుకుంటే శరీరంలో కొవ్వు, కాలరీలు అధికమయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఇప్పటికే గుండె సంబంధిత సమస్యలు, కొలెస్ట్రాల్, డయాబెటిస్ ఉన్నవారు పరిమితంగా మాత్రమే గుడ్లు తీసుకోవాలి. ఏ ఆహారం అయినా మితంగా తీసుకుంటేనే పూర్తి ప్రయోజనం లభిస్తుంది.

తెల్లసొన Vs పచ్చసొన:
గుడ్డు తెల్లసొనలో అధికంగా ప్రోటీన్ ఉంటుంది. ఇందులో కొవ్వు తక్కువగా ఉండటంతో జిమ్ చేసే వారు, బాడీ బిల్డర్లు ఎక్కువగా తెల్లసొనను తీసుకుంటారు. ఇది కండరాల నిర్మాణానికి ఉపయోగపడుతుంది. తక్కువ కాలరీలు ఉండటంతో బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది.
పచ్చసొనలో మాత్రం విటమిన్లు, ఖనిజాలు, మంచి కొవ్వులు అధికంగా ఉంటాయి. కంటి ఆరోగ్యానికి ఉపయోగపడే ల్యూటిన్, జియాక్సాంతిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఉంటాయి. మెదడు పనితీరుకు అవసరమైన కొలిన్ కూడా పచ్చసొనలోనే లభిస్తుంది. అందువల్ల తెల్లసొన – పచ్చసొన రెండింటినీ కలిపి తినడం వల్లే పూర్తి పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు.

కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు గుడ్లను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. అయితే వారానికి ఎన్ని గుడ్లు తినాలి అనేది వైద్యుల సలహాతో నిర్ణయించుకోవడం మంచిది. ముఖ్యంగా వేయించిన గుడ్ల కంటే ఉడికించిన గుడ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గుడ్లతో పాటు సమతుల ఆహారం, వ్యాయామం కూడా తప్పనిసరి.

గుడ్లు పూర్తి పోషకాల భాండాగారం. అయితే పచ్చసొనను పూర్తిగా మానేయడం లేదా అతిగా గుడ్లు తినడం రెండూ సరైన పద్ధతులు కావు. సరైన మోతాదులో, సమతుల ఆహారంతో కలిపి గుడ్లు తీసుకుంటే శరీరానికి పూర్తి ప్రయోజనాలు అందుతాయి.

రొటీన్ తాగుడు.. పరమ బోరు.. అందుకే ఇలా మారిపోయారు..

Flavoured Alcohol Trends
Flavoured Alcohol Trends

Flavoured Alcohol Trends: టమాట కూర అంటే మనలో చాలామందికి ఇష్టం. అలాగని రోజు టమాటా కూర పెడితే తినడం చాలా కష్టం. కొంతమంది మాంసాహారాన్ని విపరీతంగా తింటుంటారు. ప్రతిరోజు దాన్నే పెడితే విసిరి కొడతారు. ఏదైనా సరే ఒక స్థాయి వరకు బాగుంటుంది. అదే అదే రిపీట్ అవుతుంటే చిరాకు లేస్తూ ఉంటుంది. అందుకే మనుషులు అన్నాక కళాపోషణ ఉండాలి అన్నారు వెనుకటికి రావు గోపాల్ రావు గారు. ఇదే సూత్రాన్ని ఇప్పుడు మద్యం తయారు చేసే కంపెనీలు పాటిస్తున్నాయి.

మధ్యలో అనేక రకాల బ్రాండ్లు ఉన్నాయి. కొందరు బ్రాందీ తాగుతారు. ఇంకొందరు విస్కీ తాగుతారు. మరికొందరు జిన్, రమ్ము, బీర్లు, స్కాచ్, వోడ్కా వంటివి తాగి మత్తులో తూలుతుంటారు. కొంతమందికి తాగడం అనేది ఒక వ్యసనం. అదేదో గొప్ప పని మేం చెప్పడం లేదు గాని.. ప్రపంచంలో అన్ని దేశాలకు ప్రధాన ఆదాయ వనరు మద్యం అమ్మడమే. ప్రభుత్వాలు నడవాలంటే.. సంక్షేమ పథకాలు అమలు కావాలంటే ఖచ్చితంగా మద్యం అమ్మాల్సిందే. గతంలో ఇలాంటి పరిస్థితులు ఉండేవి కావు. కానీ ఇప్పుడు ప్రభుత్వాలకు తప్పడం లేదు. పైగా ప్రభుత్వాలే ఏటికేడు మద్యం షాపుల ధరలు పెంచేస్తున్నాయి. మద్యం ధరలు కూడా అడ్డగోలుగా హైక్ చేస్తున్నాయి.

మద్యం దందాలో ఉన్న కంపెనీలు ఇప్పుడు కొత్తదారులు వెతుకుతున్నాయి. వినియోగదారులకు రకరకాల ప్లేవర్లు అందుబాటులోకి తీసుకొచ్చాయి. ట్రెడిషనల్ ఆల్కహాల్ పట్ల యువత ఆసక్తి చూపించకపోవడంతో.. కంపెనీలు రకరకాల ఫ్లేవర్లను అందుబాటులో తీసుకొచ్చాయి. ఇందులో కూడా కూల్ డ్రింక్స్ ప్లేయర్లను కంపెనీలు అందుబాటులోకి తీసుకొచ్చాయి.

మింట్, జామున్, మ్యాంగో వంటి రుచులను ఆల్కహాల్ కంపెనీలు యాడ్ చేస్తున్నాయి. ఇలాంటి ఫ్లైఓవర్లు ఎక్కువగా వోడ్కా కంపెనీలు తయారు చేస్తున్నాయి. దీనివల్ల కంపెనీల అమ్మకాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇదే విషయాన్ని జాతీయ మీడియా తన కథనాలలో పేర్కొంది.. “గతంలో ఫ్లేవర్ లిక్కర్ ను విదేశీ వ్యక్తులు మాత్రమే తాగేవారు. ఇప్పుడు ఈ సంస్కృతి భారత్ లోకి కూడా వచ్చింది. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ వంటి మెట్రో సిటీస్లలో ఇప్పుడు ఈ ఫ్లేవర్లు అందుబాటులోకి వచ్చాయి. ఆ తర్వాత మిగతా నగరాలలో కూడా అందుబాటులో ఉండే అవకాశం కనిపిస్తోంది. మ్యాజిక్ మూమెంట్స్ అనే కంపెనీ 2026 ఆర్థిక సంవత్సరంలో తన అమ్మకాలను ఏకంగా 21 శాతం పెంచుకుంది. దీనిని బట్టి ఫ్లేవర్ మద్యాన్ని జనం ఎలా ఆస్వాదిస్తున్నారో అర్థం చేసుకోవచ్చని” జాతీయ మీడియా తన కథనంలో పేర్కొంది.

ఎలాంటి బ్రాండ్ అయినా సరే మద్యం అనేది ఘాటుగా ఉంటుంది. కానీ ఆ ఘాటు వాసనను చాలామంది తట్టుకోలేకపోతున్నారు. కొన్నిచోట్ల మద్యం విక్రయాలు పడిపోవడం కంపెనీలను ఆలోచింపజేసింది. ఆ తర్వాత వినియోగదారుల అభిప్రాయాలను కంపెనీలు తెలుసుకున్నాయి. ఫలితంగా ఫ్లేవర్లను పూర్తిగా మార్చేశాయి. అందువల్లే ఇలాంటి మ్యాంగో, మింట్, జామున్ వంటి రకాలను తీసుకొచ్చాయి. దీనివల్ల అమ్మకాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు కూల్ డ్రింక్స్ మాత్రమే ఈ స్థాయిలో అందుబాటులో ఉండేవి. ఇప్పుడు మద్యంలో కూడా ఇటువంటి ఫ్లేవర్లను అందుబాటులోకి తీసుకురావడం ఆశ్చర్యంగా ఉందని నిపుణులు చెబుతున్నారు.

బెర్ముడా ట్రయాంగిల్ కింద దాగున్న రహస్యం బయటపడింది!

Bermuda Triangle mystery solved
Bermuda Triangle mystery solved

Bermuda Triangle mystery solved: అట్లాంటిక్ మహాసముద్రంలో బెర్ముడా ట్రయాంగిల్.. ఇది దశాబ్దాలుగా శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది. దీని రహస్యం తెలుసుకునేందుకు ఎంతో మంది శాస్త్రవేత్తలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే చివరికి ఇప్పుడు ఒక కీలక ఉదంతం ద్వారా అసలు విషయం బయటపడింది. బెర్ముడా దీవుల సముద్ర గర్భం ఇతర ప్రాంతాల కన్నా గణనీయంగా ఎత్తులో ఉండటం ఎందుకనేది తరాల తరాలుగా ప్రశ్నగా ఉంది. తాజా పరిశోధనలో అమెరికన్ శాస్త్రవేత్తల బృందం ఈ అసాధారణ ఎత్తుకు భూమి అంతర్భాగంలో దాగి ఉన్న ఒక ప్రత్యేక నిర్మాణమే కారణమయ్యింది అని భావిస్తోంది.

కార్నెగీ సైన్స్‌కు చెందిన భూకంప శాస్త్రవేత్త విలియం ఫ్రేజర్, యేల్ విశ్వవిద్యాలయానికి చెందిన జెఫ్రీ పార్క్ నేతృత్వంలోని ఈ బృందం సముద్రతీర ప్రాంతం క్రింద భూగర్భ నిర్మాణాన్ని వివరంగా అధ్యయనం చేశారు. సాధారణంగా హవాయి తరహా బహుళ అగ్నిపర్వత ద్వీపాలు ‘మాంటిల్ ప్లూమ్’ అనే ప్రక్రియ వల్ల ఏర్పడతాయి. భూగర్భం నుండి మెల్లగా పైకి వచ్చిన వేడి, తేలికైన శిలలు సముద్రపు అడుగుభాగాన్ని ఉబ్బిస్తూ తాత్కాలికంగా ఎత్తుకు వస్తాయి. ఆ తరువాత టెక్టోనిక్ కదలికలతో ఇది మళ్ళీ పడిపోతుంది. అయితే బెర్ముడా లో మాత్రం ఇలా జరగలేదు.

కార్నెగీ బృందం భూకంప కేంద్రాల నుంచి సేకరించిన తరంగాల డేటాను సేకరించిన తరువాత విశ్లేషించినప్పుడు వారు ఆశ్చర్యకరమైన అంశాన్ని గమనించారు. భూమి లోపల ప్రయాణించే ఈ తరంగాల వేగం శిలల సాంద్రత, నిర్మాణాన్ని బట్టి మారుతుంది. దీనిని ఉపయోగించి వారు బెర్ముడా క్రింద సుమారు 20 మైళ్లు (సుమారు 32 కిమీ) లోతు వరకు భూగర్భ చిత్రాన్ని తయారుచేశారు. ఈ చిత్రంలో అసాధారణమయిన ఒక తేలికపాటి శిలా పొర కనిపించింది. వారి విశ్లేషణ ప్రకారం.. సముద్రపు క్రస్ట్ కింద సుమారు 12 మైళ్లు (సుమారు 19 కిమీ) మందంతో ఉన్న ఆ శిల పొర చుట్టుపక్కల మాంటిల్ కంటే తక్కువ సాంద్రత కలిగి ఉంది. దీంతో ఇది తేలే స్వభావాన్ని కలిగి ఉంది. ఈ తేలికైన శిల పొర కారణంగా పక్కలోని ప్రాంతాల భూమి తులనలో పైకి వచ్చినట్లు కనిపిస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పొర ఫ్లోటింగ్ ప్రభావం కలిగి ఉంది. కాబట్టి, నేలని స్థానికంగా ఎత్తులో నిలబెట్టే ఒక ప్రకృతి పునాదిగా పనిచేస్తోంది.

శాస్త్రవేత్తలు ఈ ప్రక్రియను ‘అండర్‌ప్లేటింగ్’ అని పిలుస్తున్నారు. వారి అంచనాల ప్రకారం ఇది వందల మిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది. ఆ సమయంలో భూమి లోతుల నుండి కార్బన్ అధికంగా ఉన్న ద్రవమైన మాంటిల్ పదార్థం చెల్లి క్రస్ట్ క్రిందకి చేరి అక్కడి తాపన, పీడనల కారణంగా ఘనరూపంలో మారి ఆ వాస్తవికతగా మిగిలి ఉండవచ్చు. కొన్ని హిపోథసిస్‌లు ఈ పదార్థం పాంజియా మహాఖండం ఏర్పడిన సమయానికి సంబంధించిన ప్రాచీన మాంటిల్ కార్యక్రమాల వల్ల వచ్చినదై ఉండవచ్చని సూచిస్తున్నాయి.

ఫ్రేజర్ ఈ కనుగొనబడిన అండర్‌ప్లేటింగ్ ఆవిర్భావాన్ని ప్రత్యేకంగా అర్థం చేసుకోవడం అవసరమని చెప్పారు. ఆయన వ్యాఖ్యానించినట్లే, బెర్ముడా అనేక విషయంలో సాధారణ మాంటిల్ ప్లూమ్ సిద్ధాంతానికి సరిపోలడం లేదు. సాధారణంగా ప్లూమ్ ప్రాంతాల్లో ఇదరకమైన మందపాటి అండర్‌ప్లేటింగ్ కనిపించవచ్చు అని కాదు. తాజా భూకెమికల్ ఆధారాలతో కలిపి చూస్తే, భూమి మంటిల్‌లో ఇంకా పూర్తిగా అర్థం కాకపోయే మరిన్ని ప్రక్రియలు ఉండొచ్చని ఇది సూచిస్తోంది.

ఈ పరిశోధన ఫలితాల ద్వారా బెర్ముడా వద్ద కనిపిస్తున్న ఎత్తును సరళంగా ఒక మాయలోకి నెట్టవద్దని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు; స్థానిక భూగర్భ నిర్మాణం — ఒక పెద్ద, తేలికపాటి శిలా పొర —నే దీని ప్రధాన కారకంగా నిలుస్తుందనే వారి అభిప్రాయం. ఫ్రేజర్ మరియు ఆయన బృందం ఇప్పుడు ఈ ఆవిష్కరణను మరింత సమర్థంగా విశ్లేషించడానికి, ప్రపంచంలోని ఇతర ద్వీపాల క్రింద కూడా ఇలాంటి అండర్‌ప్లేటింగ్ లక్షణాలు ఉన్నాయా లేదా అనేది పరిశీలిస్తున్నారు.

ఈ కొత్త అర్థవివరణ బెర్ముడా ట్రయాంగిల్‌కు సంబంధించిన కొన్ని పాత అణుచుకొనే ఊహాగానాలను కూడా సవాలు చేస్తుంది. పురాతన కాలంలోని భౌగోళిక పరిణామాలు, మాంటిల్ మరియు క్రస్ట్ మధ్య సంక్లిష్ట పరస్పర చర్యలు రంగంలోకి వచ్చాయి అని భావిస్తూ, భూమి అంతర్భాగపు మార్పులు మరియు నిరుపయోగ శాస్త్రీయ సిద్ధాంతాలపై కొత్త కనుగొన్నారు తేలికపాటుగా మరింత గమనార్హమైన ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి.

నన్నెందుకు హీరోగా తీసుకోలేదంటూ స్టార్ డైరెక్టర్ తో కొట్లాడిన అల్లు అర్జున్.. అసలు ఏమైందంటే..

Allu Arjun
Allu Arjun

Allu Arjun argument with star director: కెరీర్ ప్రారంభం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎక్కువగా లవ్ స్టోరీస్ చేస్తూ వచ్చేవాడు అనే సంగతి అందరికీ తెలిసిందే. ‘గంగోత్రి’ నుండి ‘వరుడు’ వరకు ఆయన చేసిన ప్రతీ సినిమా లవ్ స్టోరీ నే. ‘బద్రినాథ్’ చిత్రం నుండి తన పంధా మార్చాడు, ‘సరైనోడు’ చిత్రం నుండి మాస్ హీరో గా మారిపోయాడు. అయితే అల్లు అర్జున్ లవ్ స్టోరీస్ చేసే రోజుల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను మిస్ అయ్యాడు. అందులో ‘భద్ర’ చిత్రం కూడా ఉంది. ఈ చిత్రం పూర్తిగా మాస్ సినిమా కాదు , అలా అని పూర్తి స్థాయి లవ్ స్టోరీ కూడా కాదు , ఈ సినిమా అల్లు అర్జున్ చేసుంటే వేరే లెవెల్ ఉండేదని అప్పట్లో అందరూ అంటూ ఉండేవారు. అదే విధంగా ఆయనకు ఒక లవ్ స్టోరీ ని చూసిన తర్వాత ‘అబ్బా ఇది నేను చేసుంటే బాగుండేది కదా’ అని అనిపించిందట.

ఆ లవ్ స్టోరీ మరేదో కాదు ‘నువ్వు వస్తానంటే నేనొద్దంటానా’. అప్పటి వరకు హీరో గా, కొరియోగ్రాఫర్ గా ఇండియా లోనే టాప్ మోస్ట్ స్థానం లో ఉన్న ప్రభుదేవా, డైరెక్టర్ గా మారి చేసిన సినిమా ఇది. సిద్దార్థ్ , త్రిష లు హీరో హీరోయిన్లు గా నటించగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు. అయితే ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన MS రాజు రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ ‘ ఈ సినిమా అల్లు అర్జున్ కి అప్పట్లో పిచ్చి పిచ్చి గా నచ్చేసింది. నన్ను అతను ఒక రోజు కలిసినప్పుడు , నువ్వు వస్తానంటే నేనొద్దంటానా చిత్రం లో నన్ను హీరోగా తీసుకోవద్దని ఎందుకు అనిపించింది రాజు గారు అని అల్లు అర్జున్ అడిగాడు’.

‘నువ్వు చూసేందుకు చాలా రఫ్ & టఫ్ గా ఉంటాయి, నిన్ను ఫారిన్ కి చెందిన ఒక మిలినియర్ కొడుకుగా చూడలేకపోయాను , అందుకే సిద్దార్థ్ ని తీసుకున్నాను. అతను ఆ చిత్రం లో తన ప్రేమని గెలిపించుకోవడానికి ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది. కానీ నీ స్పీడ్ కి కేవలం గంటలోనే నీ ప్రేమని గెలిపించుకోగలవు , కథ కి అది సూట్ అవ్వదు కాబట్టే నిన్ను తీసుకోలేదు అని చెప్పాను, అప్పుడు అల్లు అర్జున్ ఇది కూడా నిజమేనండి అని చెప్పాడు’ అంటూ చెప్పుకొచ్చాడు MS రాజు. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఒకవేళ అల్లు అర్జున్ ఈ సినిమా చేసుంటే ఎలాంటి ఫలితం ఉండేది అనే అభిప్రాయాన్ని కామెంట్స్ రూపం లో తెలియజేయండి.

'వార్ 2' కి డిజాస్టర్ TRP రేటింగ్స్.. ఎన్టీఆర్ కి ఘోరమైన అవమానం ఇది..

War 2 TRP ratings
War 2 TRP ratings

War 2 TRP ratings: గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన చిత్రాల్లో ‘వార్ 2’. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ని ప్రముఖ నిర్మాత నాగవంశీ 90 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశాడు. కానీ ఫ్లాప్ టాక్ రావడం తో ఫుల్ రన్ లో ఈ చిత్రానికి కనీసం 40 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు కూడా తెలుగు వెర్షన్ నుండి రాలేదు. ఓవరాల్ గా హిందీ లో హృతిక్ రోషన్ క్రేజ్ కారణంగా కాస్త యావరేజ్ రేంజ్ లో ఆడినప్పటికీ, కల్లెక్షన్స్ పరంగా స్పై యూనివర్స్ చిత్రాల్లోనే తక్కువ రాబట్టిన సినిమాగా నిల్చింది ఈ చిత్రం. అయితే ఈ సినిమాని గత వారం స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ చేశారు.

థియేటర్స్ లో ఎలాగో మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకోలేకపోయిన ఈ చిత్రానికి , కనీసం టీవీ టెలికాస్ట్ లో అయినా మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందేమో అని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే ఘోరమైన డిజాస్టర్ రేటింగ్స్ ని నమోదు చేసుకుంది. BAARC సంస్థ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ చిత్రానికి మొదటి టెలికాస్ట్ లో 2.37 రేటింగ్స్ మాత్రమే నమోదు అయ్యిందట. ఇప్పటి వరకు ఒక స్టార్ హీరో సినిమాకు ఈ స్థాయి తక్కువ రేటింగ్స్ నమోదు అవ్వలేదని , ఇది ఎన్టీఆర్ స్టార్ స్టేటస్ కి చాలా అవమానకరమైన రేటింగ్స్ అని అంటున్నారు విశ్లేషకులు. స్టార్ హీరోల సినిమాలకు కనీసం 5 కి పైగా టీఆర్ఫీ రేటింగ్స్ రావడం అనేది సర్వ సాధారణం. 3 నుండి 4 టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చినా డిజాస్టర్ అని పిలుస్తుంది ట్రేడ్ , అలాంటిది కేవలం 2.37 రేటింగ్స్ అంటే ఏ రేంజ్ డిజాస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు.

ఎన్టీఆర్ ని విలన్ క్యారెక్టర్ లో చూసేందుకు అటు థియేట్రికల్ ఆడియన్స్, ఇటు టీవీ ఆడియన్స్ ఇద్దరూ కూడా ఎలాంటి ఆసక్తి చూపించలేదని ఈ రెస్పాన్స్ ని చూసి అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో కలిసి ‘డ్రాగన్’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ వీడియో ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 20 న విడుదల చేయబోతున్నాడు. ఈ గ్లింప్స్ నిడివి దాదాపుగా 4 నిమిషాల 35 సెకండ్ల వరకు ఉంటుందని టాక్.

కోట్ల మందిని నవ్విస్తున్న ఈ బుడ్డోడు తెలంగాణ పిల్లాడే.. ఆ నవ్వుల వెనుక కథ

Telangana boy viral story
Telangana boy viral story

Telangana boy viral story: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏ మీమ్ చూసినా, ఏ ట్రోల్ వీడియో చూసినా ఒక కుర్రాడు టీ గ్లాస్ పట్టుకుని పగలబడి నవ్వుతూ కనిపిస్తాడు. ఆ స్వచ్ఛమైన నవ్వుతో కోట్లాది మంది నెటిజన్ల మనసు గెలుచుకున్న ఆ కుర్రాడి పేరు అరుణ్. ఒక సామాన్య లారీ క్లీనర్ స్థాయి నుంచి ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారిన అరుణ్ జీవిత ప్రయాణం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. చాలా మంది ఈ కుర్రాడు నార్త్ ఇండియన్ లేదా విదేశీ కుర్రాడు అని అనుకుంటున్నారు. కానీ ఈయన తెలుగువాడే అన్న విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మాలపల్లి (నల్లపుచ్చట పల్లి) గ్రామానికి చెందిన అరుణ్ ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. చిన్నతనంలో చదువు సరిగ్గా అబ్బకపోవడంతో, కుటుంబ భారానికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే అతి చిన్న వయసులోనే లారీ క్లీనర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. నెహ్రూ అనే లారీ డ్రైవర్ వద్ద సహాయకుడిగా చేరుతూ, కష్టాలను నవ్వుతూ స్వీకరిస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

అరుణ్ జీవితాన్ని మలుపు తిప్పిన ఆ సంఘటన చాలా యాదృచ్ఛికంగా జరిగింది. ఒకరోజు డ్రైవర్ నెహ్రూతో కలిసి లారీలో వెళ్తున్న అరుణ్, దారి మధ్యలో టీ తాగడానికి ఆగారు. ఇద్దరూ టీ గ్లాసులు పట్టుకుని తాగుతుండగా, నెహ్రూ సరదాగా ఒక జోక్ వేశాడు. ఆ జోక్ అరుణ్ కు ఎంతలా నచ్చిందంటే, తన చేతిలో వేడివేడి టీ ఉందన్న సంగతి కూడా మర్చిపోయి పగలబడి నవ్వడం మొదలుపెట్టాడు. టీ వొలికి చెయ్యి కాలుతున్నా సరే, ఆ బాధ అతని ముఖంలో ఎక్కడా కనిపించలేదు. కేవలం చేతిని దులుపుకుంటూ, ఆనందంతో ఊగిపోతూ నవ్వడం కొనసాగించాడు.

అరుణ్ యొక్క ఆ నిజాయితీతో కూడిన నవ్వును చూసిన డ్రైవర్ నెహ్రూ, వెంటనే తన ఫోన్ తీసి ఆ దృశ్యాన్ని బంధించాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా క్షణాల్లో వైరల్ గా మారింది. కృత్రిమమైన నవ్వులు, నటించే వ్యక్తుల మధ్య అరుణ్ నవ్వులో ఉన్న ‘ప్యూర్ ఎనర్జీ’ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. మీమర్స్ కి ఇది ఒక అద్భుతమైన కంటెంట్ లా దొరకడంతో, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సందర్భానికి అరుణ్ నవ్వుతున్న విజువల్స్ వాడటం మొదలుపెట్టారు.

ఒక్క రాత్రిలో స్టార్ అయిన అరుణ్ గురించి తెలిసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. కటిక పేదరికం, రోజంతా లారీ క్లీనర్ గా శ్రమించే జీవితం ఉన్నప్పటికీ.. చిన్న జోక్ కే అంతలా ఆనందపడటం అతని గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం. సంతోషం అనేది మనం వెతుక్కునే చిన్న చిన్న విషయాల్లోనే ఉంటుందని అరుణ్ నిరూపించాడు. ప్రస్తుతం అరుణ్ సోషల్ మీడియాలో ఒక పెద్ద ‘స్టార్’గా మారిపోయి అందరినీ అలరిస్తున్నాడు.
https://youtu.be/C3yj5Wbx5RE

ఆంధ్రప్రదేశ్ లో జనాభా పెంచాల్సిన అవసరం ఉందా.. చంద్రబాబు గెలుపు వెనుక ఉద్దేశం ఏమిటి?

AP population growth
AP population growth

AP population growth: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్య తరచుగా పిల్లల్ని కనండి అని పిలుపునిస్తున్నారు. తాజాగా ఉత్తరాంధ్ర పర్యటనలో కూడా ఇదే విషయం చెప్పారు. ఒకప్పుడు నేనే కుటుంబ నియంత్రణ పాటించమని చెప్పాను కృషి చేశాను అన్నారు. ఇప్పుడు నేనే చెప్తున్నా పిల్లల్ని కనండి అని పిలుపునిచ్చారు. గతంలో కుటుంబ నియంత్రణ గురించి తీసుకున్న స్థితిని గుర్తుచేస్తూ ఇప్పుడు అదే సందేశాన్ని ఇవ్వడం వివాదానికి గురైంది.

ముగ్గురు ఉంటే 30 వేలు..
చంద్రబాబు తాజాగా పిల్లలు కనడానికి ప్రోత్సాహకాలు ప్రకటించారు . ముగ్గురుని కంటే 30 వేల రూపాయలు నలుగురుని కంటే 40 వేల రూపాయలు ఇస్తానని ఉత్తరంగా పర్యటనలు ప్రకటించారు. ఈ విధమైన ప్రతిపాదనలు పరస్పర విమర్శలకు కారణమయ్యాయి.

దేశంలో జనాభా పరిస్థితి..
మన దేశంలో జనాభా ఇప్పటికే సుమారు 140 కోట్ల పైగా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పెంపు అవసరమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జనాభా కారణంగా ఇప్పటికే మన దేశంలో వనరులపై ఒత్తిడి పెరుగుతుంది. ప్రజలకు పాలకులు మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతున్నారు. మంచి విద్య అందడం లేదు. ఆసుపత్రుల కొరత ఉంది. ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు లభించడం లేదు. సంపద కూడా కొందరి వద్దనే ఉంటుంది. ఆర్థిక అంతరాలు పెరుగుతున్నాయి.

చదరపు కిలోమీటర్ కు 480 మంది పైనే
చదరపు కిలోమీటరుకు కనిపించే జనసాంద్రత భారతదేశంలో ఎక్కువగా ఉంటుంది, ఇది మౌలిక సదుపాయాలపై భారం పెంచుతుంది. రవాణా, ఆరోగ్య, విద్య, నీటి సరఫరా వంటి సేవల అందుబాటును ప్రస్తుత జనాభా కూడా కష్టపడి తీర్చుకుంటోంది. అంతకంటే ఎక్కువ జనాభా పెరగడం పరిస్థితిని మరింత యంత్రంగా మార్చే అవకాశం ఉంది. అమెరికాలో చదరపు కిలోమీటర్ కు 33 మంది, చైనాలో చదరపు కిలోమీటర్ కు 150 మంది ఉన్నారు. మనదేశంలో కూడా ఫెర్టిలిటీ రేటు తగ్గుతుంది. కానీ జనాభా పెంపు ఇప్పట్లో అవసరం లేదు.

ఆంధ్రప్రదేశ్ లో 310 మంది..
ఆంధ్రప్రదేశ్‌లో జనాభా 5 కోట్లకు పైగా ఉంది. ఇది దక్షిణ కొరియాతో సమానం. దక్షిణ కొరియా ప్రపంచంలో చాలా మెరుగైన అభివృద్ధి చెందిన దేశం. ఆంధ్రప్రదేశ్లో చాలావరకు మౌలిక సదుపాయాల లేవు. తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ దక్షిణాది రాష్ట్రాల్లో చివరి స్థానంలో ఉంది. జిడిపి పెంపు ప్రజలకు మెరుగైన జీవనం కల్పించడంపై దృష్టి పెట్టాల్సిన తరుణంలో జనాభా పెంపుకు పిలుపునివ్వడం విమర్శలకు తావిస్తోంది.

చంద్రబాబు జనాభా పెంపు గురించి ప్రజలను ప్రోత్సహించడం కన్నా ముందు సదుపాయాలపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. అజీర్ణంతో బాధపడుతున్న వ్యక్తి ఆకలితో ఉన్నవాడిని ఒకప్పుడు తినమని సూచించినట్లుగా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. అధిక జనాభా సూచన రాజకీయంగా రాకుండా వాస్తవ సమస్యల్ని మరింత పెంచే ప్రమాదం ఉంది.

'జబర్దస్త్' లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఈసారి ఆయన డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ ఎంతంటే..

Hyper Aadi
Hyper Aadi

Hyper Aadi Jabardasth re entry: 12 ఏళ్ళ నుండి నాన్ స్టాప్ గా కొనసాగుతున్న ఏకైక టీవీ షో ఏదైనా ఉందా అంటే అది ‘జబర్దస్త్’ మాత్రమే. ఈటీవీ ఛానల్ లో ప్రసారమయ్యే ఈ బిగ్గెస్ట్ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ ఇండస్ట్రీ కి పరిచయమై టాప్ స్థానానికి చేరుకున్నారు. అందులో సుడిగాలి సుధీర్ , గెటప్ శ్రీను , హైపర్ ఆది , షకలక శంకర్, చమ్మక్ చంద్ర ఇలా ఎంతో మంది ఉన్నారు. అంతే కాదు , ప్రస్తుతం కమెడియన్ గా టాలీవుడ్ లో ఫుల్ బిజీ గా గడుపుతున్న సత్య కూడా జబర్దస్త్ నుండి వచ్చిన వాడే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అయితే ఈ షో ఒకప్పటి రేంజ్ ఆదరణ దక్కించుకోలేకపోతుంది. టీఆర్ఫీ రేటింగ్స్ చాలా తక్కువ వస్తున్నాయి. అందుకే ఈ షోకి ఒకప్పుడు మూలస్తంభం లాగా ఉన్నటువంటి నాగబాబు ని జడ్జీ గా మరోసారి తీసుకొచ్చారు.

ఈ షో బాగా డల్ అయిపోవడానికి మరో ముఖ్య కారణం టాప్ కమెడియన్స్ అయినటువంటి సుడిగాలి సుధీర్, హైపర్ ఆది , చమ్మక్ చంద్ర , ఇమ్మానుయేల్ , అవినాష్ వంటి వారు షో ని వదిలి వెళ్లిపోవడమే. వీళ్ళు వెళ్ళిపోయాక కామెడీ బాగా తగ్గిపోయింది. అందుకే ఇప్పుడు నాగబాబు స్పెషల్ రిక్వెస్ట్ మీద, హైపర్ ఆది ఈ షో లో పాల్గొనడానికి ఒప్పుకున్నాడు. కానీ శాశ్వతంగా కాదు , కేవలం ఒక స్కిట్ లో గెస్ట్ గా మాత్రమే ఆయన సందడి చేయబోతున్నాడు. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది. తన మార్కు పంచులతో ప్రేక్షకుల పొట్ట చెక్కలు అయ్యేలా చేయడం లో హైపర్ ఆది దిట్ట. అందుకే ఆయన ప్రతీ స్కిట్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది. అలాంటి హైపర్ ఆది లేని లోటు జబర్దస్త్ లో స్పష్టంగా కనిపిస్తూ వచ్చేది.

అయితే చాలా కాలం తర్వాత ఇప్పుడు ఈ షో లోకి ఎంట్రీ ఇవ్వడం తో పూర్వ వైభవం తిరిగి వచ్చినట్టు అయ్యింది. తన మార్కు పంచులతో మరోసారి పొట్టచెక్కలు అయ్యేలా చేసాడు హైపర్ ఆది. అందుకు సంబంధించిన ప్రోమో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. ఒకపక్క సినిమాలు చేస్తూనే , మరో పక్క ఈటీవీ లో ప్రసారమయ్యే ఢీ 20 డ్యాన్స్ షోలో, అదే విధంగా ప్రతీ ఆదివారం ప్రసారమయ్యే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ లో కనిపిస్తూ ఉంటాడు హైపర్ ఆది. అయితే ఇప్పుడు ఆయన గెస్ట్ గా పాల్గొన్న ఈ స్పెషల్ జబర్దస్త్ స్కిట్ కోసం ఒక్క పైసా రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదని టాక్.

లైవ్ ఈవెంట్ లో బూతులు మాట్లాడిన హీరోయిన్ రష్మిక.. షాక్ లో హీరో, డైరెక్టర్..

Rashmika live event controversy
Rashmika live event controversy

Rashmika live event controversy: సౌత్ నుండి నార్త్ వరకు యూత్ ఆడియన్స్ దగ్గర నుండి అన్ని వర్గాల ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోయిన్స్ లో ఒకరు రష్మిక మందాన. ఈమె కెరీర్ ని ‘పుష్ప’ కి ముందు , ఆ తర్వాత అని విభజించవచ్చు. ‘పుష్ప’ కి ముందు కేవలం సౌత్ లో మాత్రమే ఈమెకు పాపులారిటీ , క్రేజ్ , ఫాలోయింగ్ ఉండేది. కానీ ‘పుష్ప’ తర్వాత ఈమె రేంజ్ పాన్ ఇండియా కి చేరుకుంది. ఈ సినిమా తర్వాత ఆమె ఒప్పుకున్నా బాలీవుడ్ చిత్రం ‘యానిమల్’ కూడా ఎంతటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా తర్వాత రష్మిక బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా మారిపోయింది. ఆ తర్వాత ఆమె చేసిన ‘చావా’ , ‘పుష్ప 2’ చిత్రాలు ప్రభంజనం సృష్టించాయి.

ఇకపోతే రీసెంట్ గా ఆమె బాలీవుడ్ లో ‘కాక్ టైల్ 2’ అనే చిత్రం చేసింది. షాహిద్ కపూర్ ఇందులో హీరో గా నటించగా, కృతి సనన్ మరో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం వచ్చే నెల 19 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల అవ్వబోతున్న సందర్భంగా , మేకర్స్ అప్పుడే ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలు పెట్టారు. నిన్న ముంబై లో ఏర్పాటు చేసిన ఒక ఈవెంట్ లో మూవీ టీం తో కలిసి పాల్గొన్న రష్మిక, కృతి సనన్ గురించి మాట్లాడుతూ ‘ఆమె ఈ చిత్రం లో చాలా హాట్ గా ఉంది’ అంటూ , ఒక అడల్ట్ బూతు పదాన్ని కూడా ఉపయోగించింది. ఆ తర్వాత వెంటనే ‘అయ్యో సారీ’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఒక్కసారిగా ఆ ఈవెంట్ కి వచ్చిన వాళ్ళందరూ షాక్ అయ్యారు, కృతి సనన్ అయితే సిగ్గు తో తలదించుకుని నవ్వేసింది.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. విజయ్ దేవరకొండ పుణ్యమా అని రష్మిక కూడా బాగా బోల్డ్ గా తయారైంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే రష్మిక పెళ్లి తర్వాత కూడా వరుసగా సినిమాలు చేయడానికి ఒప్పుకుంటోంది. ప్రస్తుతం ఆమె తన భర్త విజయ్ దేవరకొండ తో కలిసి ‘రణబలి’ అనే చిత్రం చేస్తోంది , ‘డియర్ కామ్రేడ్’ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రమిది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ‘రాకా’ చిత్రం లో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో ఆమె పూర్తి స్థాయి విలన్ క్యారెక్టర్ లో కనిపించబోతుంది. వీటితో పాటు ‘మైసా’ అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రం లో కూడా నటిస్తోంది.

ప్రభాస్ రాజు - ఎంఎస్ రాజు మధ్య విభేదాలు రావడానికి కారణం ఏంటి..

Prabhas MS Raju controversy
Prabhas MS Raju controversy

Prabhas MS Raju controversy: యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు ప్రభాస్…మొదటి రెండు సినిమాలతో ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన కూడా ‘వర్షం’ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన నటుడు ప్రభాస్… తనదైన రీతిలో సత్తా చాటుకున్న ఈ నటుడు పాన్ ఇండియాలో స్టార్ హీరోగా మారిపోయాడు. ‘వర్షం’ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన ఆయన ఎమ్మెస్ రాజు తో మంచి పరిచయమైతే ఏర్పడింది. వర్షం సినిమా ప్రొడ్యూసర్ కూడా తనే కావడం విశేషం…వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఆ తర్వాత ‘పౌర్ణమి’ సినిమా వచ్చింది. ఆ సినిమా అనుకున్న మేరకు విజయాన్ని సాధించలేదు. ఇక ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి మరో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకున్న కూడా అది వర్కౌట్ కాలేదు.

కారణం ఏంటంటే ఎమ్మెస్ రాజు విషయంలో కొంతవరకు హర్ట్ అయినట్టుగా తెలుస్తుంది. వీళ్లిద్దరు కలిసి ఒక దర్శకుడి తో సినిమా చేయాలని అనుకున్నాడట. కానీ ఆ దర్శకుడు చెప్పిన కథను ఎమ్మెస్ రాజు చాలా వరకు మార్చేశారట. దాంతో ఆ దర్శకుడు డిసప్పాయింట్ అయి ప్రభాస్ కి ఆ విషయాన్ని చెప్పాడు.

దాంతో ఎమ్మెస్ రాజు తో సినిమా చేస్తే ఆ సినిమా సక్సెస్ సాధించలేదేమో అనే ఉద్దేశ్యంతో ప్రభాస్ ఆయన మార్చిన కథను వినడానికి కూడా ఇష్టం లేక నో చెప్పారట. ఇక అప్పటినుంచి వీళ్ళిద్దరి మధ్య కొంతవరకు డిస్టెన్స్ అయితే పెరిగిందని అందువల్లే వీళ్ళ కాంబినేషన్లో సినిమా రావడం లేదంటూ చాలా మంది చాలా రకాల కామెంట్లు చేస్తున్నారు…

మొత్తానికైతే ప్రస్తుతం తను పాన్ ఇండియాలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు. తనను బీట్ చేయడం ఇప్పుడున్న హీరోల వల్ల కావడం లేదనేది వాస్తవం… ఇక రాబోయే రోజుల్లో కూడా ఆయన పెను సంచలనాలను క్రియేట్ చేసే సినిమాలు చేస్తే అతన్ని ఢీకొట్టే వారు ఎవరు ఉండరనేది వాస్తవం… ప్రస్తుతం ఆయన ఫౌజీ, స్పిరిట్ సినిమాలను చేస్తు బిజీగా ఉన్నాడు…