Homeఎంటర్టైన్మెంట్Prabhas makeover viral video: ప్రభాస్ మేక్ ఓవర్ అదుర్స్.. ఒక్కసారిగా 'మిర్చి' కాలానికి వెళ్లిపోయాడుగా.....

Prabhas makeover viral video: ప్రభాస్ మేక్ ఓవర్ అదుర్స్.. ఒక్కసారిగా ‘మిర్చి’ కాలానికి వెళ్లిపోయాడుగా.. వీడియో వైరల్..

Prabhas makeover viral video: రెబల్ స్టార్ ప్రభాస్ వింటేజ్ లుక్స్ ఎలా ఉండేవో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. హీరో అంటే ఇలా ఉండాలిరా అని ప్రతీ మనిషి అనుకునే రేంజ్ లో ఉండేవాడు. హృతిక్ రోషన్ ని మించిన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఉండేవాడు. మాస్ మూవీస్ , లవ్ స్టోరీస్, ఫ్యామిలీ స్టోరీస్ , యాక్షన్ స్టోరీస్ , హిస్టారికల్ స్టోరీస్ , ఇలా ప్రతీ జానర్ కి సూట్ అయ్యే ఏకైక ఇండియన్ […]

Prabhas makeover viral video: రెబల్ స్టార్ ప్రభాస్ వింటేజ్ లుక్స్ ఎలా ఉండేవో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. హీరో అంటే ఇలా ఉండాలిరా అని ప్రతీ మనిషి అనుకునే రేంజ్ లో ఉండేవాడు. హృతిక్ రోషన్ ని మించిన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఉండేవాడు. మాస్ మూవీస్ , లవ్ స్టోరీస్, ఫ్యామిలీ స్టోరీస్ , యాక్షన్ స్టోరీస్ , హిస్టారికల్ స్టోరీస్ , ఇలా ప్రతీ జానర్ కి సూట్ అయ్యే ఏకైక ఇండియన్ సూపర్ స్టార్. అయితే ఈ రేంజ్ లుక్స్ బాహబలి వరకు మాత్రమే ఉండేది. కానీ ఆ తర్వాత మాత్రం ప్రభాస్ లుక్స్ లో వచ్చిన మార్పులు చూసి అందరూ షాక్ కి గురయ్యారు. ఎలా ఉండేవాడో ప్రభాస్, ఇలా ఐపోయాడేంటని ప్రతీ ఒకరు అనుకునేవారు. ‘రాజాసాబ్’ లో పర్వాలేదు అనే రేంజ్ లుక్స్ ఉన్నప్పటికీ, వింటేజ్ ప్రభాస్ లుక్స్ ని మిస్ అవుతున్నామే అనే ఫీలింగ్ ఉండేది ఫ్యాన్స్ లో.

కానీ ఇక నుండి వాళ్ళు అలా ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు , ఎందుకంటే ప్రభాస్ లేటెస్ట్ లుక్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి. ఈ రేంజ్ లో లుక్స్ పరంగా కం బ్యాక్ ఇస్తాడని కలలో కూడా ఊహించలేదు అంటూ సోషల్ మీడియా లో ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రముఖ సీనియర్ నటుడు, మాజీ మంత్రి మురళి మోహన్ కి నార్త్ అమెరికా తెలుగు సొసైటీ, TAGKC సన్మానం చేశారు. ఇది చాలా అరుదైన గౌరవం. దీనిపై ప్రభాస్ స్పందిస్తూ మురళి మోహన్ కి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపాడు. ఆ వీడియో లో ప్రభాస్ అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించడం చూసి అభిమానులు మెంటలెక్కిపోతున్నారు. ఇలా కదా మేము ప్రభాస్ ని చూడాలని అనుకున్నది , ‘స్పిరిట్ ‘ మూవీ కోసం బాగానే మేకోవర్ అయ్యాడు అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.

డైరెక్టర్ సందీప్ వంగ ఈసారి ప్రభాస్ ని లుక్స్ దగ్గర నుండి యాక్షన్ వరకు వేరే లెవెల్ లో ఉండేలా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడని , అందుకు ప్రభాస్ లేటెస్ట్ లుక్స్ ఒక ఉదాహరణ అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే న్యూ ఇయర్ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేయగా , దానికి ఎలాంటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూశాము . ముఖ్యంగా జెన్ జీ ఫ్యాన్స్ విపరీతంగా సంతృప్తి చెందారు. అదే విధంగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 5 న విడుదల చేయబోతున్నట్టు కూడా అధికారిక ప్రకటన చేశారు. అయితే ఇప్పుడు షూటింగ్ కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉండడంతో , ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది డిసెంబర్ కి వాయిదా వేసే అవకాశం ఉంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper