Home Blog Page 261

జూన్ 19.. ఏపీలో ఒకేరోజు మూడు

June 19 AP govt key implementations
June 19 AP govt key implementations

June 19 AP govt key implementations: ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ విద్య బలోపేతానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. అవి సత్ఫలితాలు ఇచ్చేలా ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా బడి పిలుస్తోంది కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల మాదిరిగా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యాశాఖ సిబ్బంది ఇంటింటికి వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులను కలుస్తున్నారు. అంగన్వాడి కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య చదువుతున్న చిన్నారులను.. ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా అవగాహన కల్పిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న వారి తల్లిదండ్రులను కలిసి.. ప్రభుత్వ పాఠశాలలో అందుతున్న ఉత్తమ విద్యా బోధన, సౌకర్యాల గురించి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో తల్లిదండ్రుల్లో కూడా ఒక రకమైన అవగాహన వచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ముందుకు వస్తున్నారు. ఇదే స్ఫూర్తితో విద్యా సంవత్సరం ప్రారంభంలోనే మూడు కీలకమైన పథకాలకు శ్రీకారం చుట్టనుంది ఏపీ ప్రభుత్వం.

కొత్త విద్యా సంవత్సరంలో..
జూన్ 12న విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరుచుకోనున్నాయి. అక్కడకు వారం రోజులు అంటే.. జూన్ 19న 3 కీలకమైన అంశాలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆరోజు తల్లికి వందనం కింద నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 15 వేల చొప్పున నిధులు జమ చేయనుంది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి అందించేందుకు నిర్ణయించింది. గత ఏడాది 68 లక్షల మంది తల్లుల ఖాతాల్లో నిధులు జమయ్యాయి. కానీ ఈసారి మాత్రం లబ్ధిదారుల సంఖ్య 70 లక్షలకు దాటనుందట. ఇప్పటికే తల్లికి వందనం లబ్ధిదారుల జాబితాలు సిద్ధం చేసే పనిలో ఉన్నారు అధికారులు. సచివాలయాల వారీగా ఆ జాబితాలను ప్రదర్శించనున్నారు.

– అదే రోజు మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ కూడా జరపనున్నారు. సాధారణంగా ఈ సంస్కృతి కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల్లో కనిపిస్తుంది. కానీ తొలిసారిగా గత ఏడాది కూటమి ప్రభుత్వం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ను నిర్వహించింది. ఈ ఏడాది కూడా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

– ప్రభుత్వ పాఠ్యపుస్తకాలతో పాటు నోటుబుక్కులు అందించేందుకు నిర్ణయించింది. విద్యా కానుక కిట్ల పేరిట వీటిని అందించనున్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో పాఠ్యపుస్తకాల పంపిణీ ప్రక్రియలో చాలా రకాలుగా జాప్యం జరుగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అందించి విద్యా బోధనకు ఎటువంటి అడ్డంకులు ఉండకుండా ప్రయత్నం చేస్తోంది కూటమి ప్రభుత్వం. దీనిపై హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.

బెంగళూరును గెలికింది.. అప్పటి నుంచే దరిద్రం పంజాబ్ చుట్టూ వైఫై లాగా తిరుగుతోంది..

Punjab cricket team bad luck
Punjab cricket team bad luck

Punjab cricket team bad luck: అత్తారింటికి దారేది అనే సినిమా చూశారా.. అందులో ఆలిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఓ డైలాగ్ అంటాడు. నీకు అదృష్టం మెయిన్ డోర్ తట్టేలోగా.. దురదృష్టం బ్యాక్ డోర్ నుంచి బెడ్ రూమ్ లోకి వచ్చేసింది.. ఇక నిన్ను ఎవడూ బాగు చేయలేడు అంటాడు.. సేమ్ ఇప్పుడు పంజాబ్ జట్టు పరిస్థితి ఐపీఎల్లో అలాగే ఉంది. అద్భుతమైన ప్లేయర్లు ఉన్నారు. భీకరమైన బౌలర్లు ఉన్నారు. కానీ ఆ జట్టుకు ఏదీ కలిసి రావడం లేదు.

ఈ ఐపీఎల్లో పంజాబ్ జట్టు వరుసగా విజయాలు సాధించింది. సర్పంచ్ సాబ్ అయ్యర్ మీద ప్రశంసల జల్లు మొదలైంది.. ఇంకేముంది పంజాబ్ ఈసారి కూడా ఫైనల్ వెళ్తుందని అందరూ అనుకున్నారు. ట్రోఫీ కూడా సాధిస్తుందని అంచనాలు వేసుకున్నారు. కొందరైతే టీమ్ ఇండియాకు కాబోయే కెప్టెన్ అయ్యర్ అంటూ కొత్త కొత్త సూత్రీకరణలకు దిగారు. కానీ ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. వరుస విజయాలు ఉత్సాహాన్ని రేపితే.. ఆ తర్వాత ఎదురైన వరుస ఓటములు పంజాబ్ జట్టు పరువు తీస్తున్నాయి. చివరికి ప్లే ఆఫ్ ఆశలు కూడా అత్యంత సంక్లిష్టంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ జట్టు గ్రూప్ దశ నుంచి నిష్క్రమించే పరిస్థితులు ఏర్పడ్డాయి.

వరుస విజయాలు సాధించిన పంజాబ్ జట్టు.. ఇలా దిగజారి పోవడాన్ని ఆ జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు తమ జట్టుకు ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక సంఘటన ను వారు గుర్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా బెంగళూరు తో పోటీపడిన ప్రతిసారి పంజాబ్ జట్టు ఓడిపోవడానికి ఆ జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

2017లో ఏప్రిల్ 28న రాజస్థాన్ రాయల్స్ పై పంజాబ్ 4.3 ఓవర్లలో 49 పరుగులు చేసింది. ఆ తర్వాత 49/1 అంటూ 2017లో 49కే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆల్ అవుట్ అయిన చెత్త రికార్డును టార్గెట్ చేస్తూ ట్వీట్ చేసింది. అప్పటినుంచి పంజాబ్ జట్టు బెంగళూరు తో తలపడిన అన్ని మ్యాచ్లలో ఓడిపోయింది.

తమను గేలి చేసారని.. అప్పటినుంచి పంజాబ్ జట్టుకు దురదృష్టం వెంటాడుతోందని బెంగళూరు ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. నిన్న విజయం సాధించిన తర్వాత మళ్ళీ అలా చేయకూడదని పంజాబ్ జట్టుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గట్టిగా కౌంటర్ ఇచ్చింది. ఇంకోసారి ఇలా చేస్తే పరిణామాలు వేరే విధంగా ఉంటాయని పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసింది. తద్వారా పంజాబ్ జట్టు ఇకపై ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటుందని.. క్రికెట్లో ప్రొఫెషనలిజాన్ని ప్రదర్శిస్తుందని విశ్లేషకులు వ్యాఖ్యలు చేస్తున్నారు.

'ఆదర్శ కుటుంబం' సినిమాలో ఆ సూపర్ హిట్ సాంగ్ ను రీమిక్స్ చేస్తున్నారా...

Adarsha Kutumbam Movie
Adarsha Kutumbam Movie

Super hit song remix in Aadarsha Kutumbam: వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. ఈ సినిమా విషయంలో త్రివిక్రమ్ చాలా స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాని చాలా హంగులు ఆర్భాటాలతో చిత్రీకరిస్తున్నాడట. అయితే ఈ సినిమాలో వెంకటేష్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉండబోతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఇప్పటివరకు వెంకటేష్ చేసిన పాత్రలను మించి ఈ పాత్ర ఉంటుందట. యాక్షన్ ఎపిసోడ్స్ ను సైతం వెంకటేష్ చాలా ఎఫెక్టివ్ గా చేయబోతున్నారట.

ఈ సినిమాను సక్సెస్ ఫుల్ గా నిలుపడానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ శత విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇప్పటివరకు ఆయన నుంచి వచ్చిన సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కాబట్టి ఇప్పుడు రాబోతున్న ఈ సినిమా కూడా అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులను సైతం మెప్పిస్తుందని సినిమా యూనిట్ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాలో వెంకటేష్ ఒకప్పటి సూపర్ హిట్ సాంగ్ ను రీమిక్స్ చేయాలని చూస్తున్నారట. ఇంతకీ ఆ సాంగ్ ఏంటంటే ‘బొబ్బిలి రాజా’ సినిమాలో బలపం పట్టి భామ బళ్లో అనే సాంగ్ ని ఈ సినిమాలో రీమిక్స్ చేస్తున్నారట. మొత్తానికైతే ఈ సాంగ్ డిఫరెంట్ గా ఉండబోతుందట. దానిని స్క్రీన్ మీద చూస్తే ఇంకా బాగా అదిరిపోతుందని సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది.

అటు వెంకటేష్ కి, ఇటు త్రివిక్రమ్ కి సక్సెస్ ను తీసుకొచ్చి సినిమా అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా అంటే ఆ సినిమాలో కామెడీ విపరీతంగా ఉంటుందని ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. మరి దానికి తగ్గట్టుగానే కామెడీ సన్నివేశాలైతే చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాని చిత్రీకరిస్తున్నారట…

ధోని అభిమానులకు బ్యాడ్ న్యూస్

MS Dhoni New Record
MS Dhoni New Record

MS Dhoni retirement : టీమిండియాలోనే కాదు.. ఐపీఎల్ లో కూడా ధోని సాధించిన రికార్డులు మామూలుగా లేవు. చెన్నై జట్టును ఐదుసార్లు విజేతగా నిలిపిన చరిత్ర ధోనీకి ఉంది. టీమిండియా కు t20, వన్డే, పంపియన్స్ ట్రోఫీలు అందించిన చరిత్ర కూడా అతడిది. టీమిండియా క్రికెట్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో రాయదగిన అధ్యాయాలు అనేకం నెలకొల్పాడు ధోని.

ధోని ప్రస్తుతం నాలుగు పదుల వయసు దాటిపోయాడు. చెన్నై జట్టుకు ఒకప్పుడు సారధిగా ఉన్న అతడు.. ఇప్పుడు ఒక ఆటగాడి గానే మిగిలిపోయాడు. గత సీజన్లో అతడు తాత్కాలిక సారధిగా వ్యవహరించాడు. ఆరోగ్యం బాగాలేక పోవడం వల్ల ఈ సీజన్లో ఇంతవరకు మైదానంలో అడుగుపెట్టలేదు. అయితే ధోని కి సంబంధించి చెన్నై మేనేజ్మెంట్ ఒక కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే చెన్నై జట్టు ప్రస్తుతం ఐపీఎల్ లో ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. బెంగళూరు చేతిలో పంజాబ్ ఓడిపోవడంతో చెన్నై జట్టుకు లైన్ క్లియర్ అయింది. ఈ నేపథ్యంలో చెన్నై జట్టు తరుపున ధోని మైదానంలో అడుగుపెట్టి ఆడే అవకాశం ఉందని తెలుస్తోంది.

హైదరాబాద్ జట్టుతో జరిగే మ్యాచ్లో చెన్నై తరఫున ధోని ఆడతాడని తెలుస్తోంది. ఆ మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతుంది. ఆ మ్యాచ్లో ధోని గనక ఆడితే.. చెన్నై అభిమానులకు అద్భుతమైన ఆనందం లభిస్తుంది. అంతేకాదు ఈ మ్యాచ్ లో గెలిస్తే ధోని తదుపరి ప్లే ఆఫ్ మ్యాచ్లు కూడా ఆడే అవకాశం ఉంది. ఒకవేళ హైదరాబాద్ చేతిలో చెన్నై విజయం సాధించకపోతే.. ధోని ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది.

ఇదే విషయాన్ని చెన్నై మేనేజ్మెంట్ పరోక్షంగా ఇటీవల కాలంలో చెబుతూ వస్తోంది. దీనిపై అభిమానులకు కూడా హింట్ ఇస్తోంది. ఇదే కనక జరిగితే చెన్నై అభిమానులు ఇబ్బంది పడడం ఖాయం. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ.. ధోనిని చెన్నై అభిమానులు తలా అని పిలుచుకుంటారు. అతడి నాయకత్వం లో చెన్నై సాధించిన విజయాలను గొప్పగా చెప్పుకుంటారు. ఇప్పుడు ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తే ఆస్థానాన్ని.. ఎవరు భర్తీ చేస్తారని చెన్నై అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అయితే ధోని రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ఏదో ఒక రూపంలో చెన్నై జట్టుతో అతడు కొనసాగుతాడని మేనేజ్మెంట్ చెబుతోంది. ఒకవేళ అతని కోచ్ గా నియమించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

'మెగాస్టార్ 158' మూవీ కథ విషయంలో చిరంజీవి ఇన్వాల్వ్ మెంట్ ఎక్కువ అవుతుందా..

Chiranjeevi
Chiranjeevi

Megastar 158 movie: చిరంజీవి హీరోగా చేస్తున్న ప్రతి సినిమా విషయంలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుందని చాలా మంది దర్శకులు చెబుతూ ఉంటారు. కారణం ఏంటి అంటే ఆయన సీనియర్ హీరో కాబట్టి తనకున్న అనుభవంతో తనకు తోచిన సజెషన్స్ అయితే ఇస్తుంటాడట. ఆ సినిమాకి సరిపడా సజెషన్స్ ఇస్తే దర్శకుడు తీసుకుంటే పర్లేదు. తీసుకోకపోతే ఆయన కామ్ గా ఉండిపోతాడట. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం బాబీ తో చేస్తున్న సినిమా విషయంలో కూడా చిరంజీవి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువవుతుంది అంటూ సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి చిరంజీవి ఇచ్చే సజెషన్ చాలా వాల్యుబుల్ గా ఉంటాయని ఇంతకుముందు అతనితో పని చేసిన చాలా మంది దర్శకులు చెప్పారు. ముఖ్యంగా ఆయన చెప్పే పాయింట్స్ తో సినిమా మొత్తాన్ని మార్చేయొచ్చు అంటూ గతంలో ఆయనతో సినిమా చేసిన అనిల్ రావిపూడి చెప్పడం విశేషం…

‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాలో వెంకటేష్ క్యారెక్టర్ ని పెట్టమని చెప్పింది కూడా చిరంజీవి గారే అంటు అనిల్ రావిపూడి ఒక ప్రెస్ మీట్ లో చెప్పాడు. ఇక ఏది ఏమైనా కూడా అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు చిరంజీవికి ఒక బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని అందించాడు. ఇక ఇప్పుడు బాబీ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా విషయంలో కూడా చిరంజీవి కొన్ని ఇన్ పుట్స్ అయితే ఇస్తున్నారట.

మరి బాబీ వాటిని తన స్టైల్లో కి మార్చి మార్పులు చేర్పులు చేసి చిరంజీవిని కొత్తగా చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి ఇప్పుడు భారీ సక్సెస్ ని సాధించాల్సిన అవసరమైతే ఉంది. మన శంకర్ వరప్రసాద్ సినిమా 400 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది.

కాబట్టి ఇప్పుడు చేయబోతున్న సినిమాలు అంతకుమించిన వసూలు రాబట్టినప్పుడు మాత్రమే చిరంజీవి టాప్ లెవెల్ కి వెళ్తాడు. లేకపోతే మాత్రం మరోసారి ఆయన డిసపాయింట్ అవ్వడం పక్క అంటూ అతని అభిమానులు సైతం ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు…

భర్తతో గొడవలు.. యంగ్ హీరో తో ఎఫైర్.. కోలీవుడ్ ని కుదిపేస్తున్న విషాద సంఘటన..

Jayam Ravi wife Aarti controversy
Jayam Ravi wife Aarti controversy

Jayam Ravi wife Aarti controversy: ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను దశాబ్దాల నుండి అలరించే ఒక హీరో , మీడియా ముందుకు నిస్సహాయత తో వచ్చి , ఆత్మహత్య చేసుకుంటాను అనే సిగ్నల్స్ ఇస్తే, అభిమానులకు ఎంత బాధగా ఉంటుందో ఊహించడానికి కూడా కష్టమే కదా. అలాంటిదే ఇప్పుడు తమిళనాడు లో జరుగుతోంది. ప్రముఖ హీరో జయం రవి తన భార్య ఆర్తి విషయం లో నరకం అనుభవిస్తున్నాడు , ఆమె నుండి ఆయన విడాకులు కోరుతూ రీసెంట్ గా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ పెద్ద కలకలమే రేపింది. విడాకులు ఇచ్చేంత వరకు సినిమాలు చెయ్యనని , షూటింగ్ పూర్తి అయిన సినిమాలను కూడా ఆపేస్తున్నాను అంటూ ఆయన ఇచ్చిన ఒక స్టేట్మెంట్ అభిమానుల చేత కంటతడి పెట్టించింది. మానసికంగా ఆమె ఎంతో క్షోభ పెడుతుందని , తన పీఆర్ టీం తో సైబర్ బుల్లియింగ్ చేస్తున్నాడని , ఆమె కారణంగా నేను ఆత్మహత్యాయత్నం కూడా చేశానని ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చాడు.

అంతే కాకుండా తనతో పిల్లల్ని కలవనివ్వకుండా అడ్డు పడుతుందని , మా మధ్య బాడీ గార్డ్స్ ని పెట్టిందని , నాపై చేతబడి చేయిస్తుందని , ఇలా ఒక్కటా రెండా, ఇన్నాళ్లు ఆయన పడిన బాధ మొత్తాన్ని ప్రెస్ మీట్ ముందు పెట్టాడు. అందరూ జయం రవి ని చూసి అయ్యో పాపం అని బాధపడుతున్నారు. ఇదంతా పక్కన పెడితే జయం రవి భార్య ఆర్తి గురించి సోషల్ మీడియా లో మరో రూమర్ బలంగా వినిపిస్తోంది. అది ఏమిటంటే , ఆర్తి గత కొంతకాలం నుండి ఒక ప్రముఖ యంగ్ హీరో తో ఎఫైర్ పెట్టుకుందని , అనేక సందర్భాల్లో ఆర్తి ని ఆ యంగ్ హీరో తో జయం రవి చూశాడని, ఆ సమయంలో ఆయన మానసిక వేదనకు గురై , ఇక భరించలేక విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యాడని అంటున్నారు.

ఈ విషయాన్ని నిన్న ప్రెస్ మీట్ లో ఆయన బయటపెట్టకపోవడానికి గల ముఖ్య కారణం పిల్లల కోసమే అని , ఎలాగో తన వద్దకు పిల్లల్ని రానివ్వడం లేదు , ఈ విషయం పిల్లలకు తెలిస్తే ఇంటి నుండి దూరం గా వెళ్ళిపోతారనే భయం తోనే జయం రవి ఈ విషయాన్ని దాచాడని అంటున్నారు కొంతమంది నెటిజెన్స్. ఇందులో ఎంత మాత్రం నిజముందో తెలియదు కానీ , ఒకవేళ నిజమైతే మాత్రం ఆర్తి పై నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క జయం రవి మానసిక పరిస్థితి ని ఆయన అభిమానులు వణికిపోతున్నారు , జయం రవి అన్నయ్య , అమ్మ దగ్గరుండి చూసుకోవాలని , లేదంటే భవిష్యత్తులో అనర్థాలు జరిగే ప్రమాదం ఉందని అంటున్నారు నెటిజెన్స్.

అక్కినేని వెంకట్ కి డైరెక్టర్ తేజ ఏమవుతాడు...తేజ పెళ్లి వెంకట్ చేయడానికి కారణమేంటంటే..?

Akkineni Venkat and Teja relationship
Akkineni Venkat and Teja relationship

Akkineni Venkat and Teja relationship: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ లను సాధించిన దర్శకులకు మాత్రమే గొప్ప గుర్తింపు ఉంటుంది. ఎవరైనా ఒక సక్సెస్ ని సాధిస్తే చాలు ఇండస్ట్రీ వాళ్లను నెత్తినెక్కించుకుంటుంది. వాళ్ళతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు సైతం పోటీ పడుతుంటారు. ఇక అదే దర్శకుడు ఒక ఫ్లాప్ సినిమా తీస్తే మాత్రం ఇచ్చిన అడ్వాన్స్ లను సైతం ప్రొడ్యూసర్లు వెనక్కి తీసుకుంటారు. అలాంటి ఒక డేంజర్ జోన్ లో ఉన్న దర్శకులు, నటులు ఎప్పటికప్పుడు వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. లేకపోతే మాత్రం వాళ్ళు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు అంటూ చాలామంది హెచ్చరిస్తున్నారు. ఇక ఇప్పటివరకు జరిగింది ఒకెత్తయితే ఇప్పటినుంచి సినిమా ఇండస్ట్రీ మొత్తం మారిపోతుంది. పాన్ ఇండియాలో సక్సెస్ లను సాధించే వారికి మాత్రమే ఇక్కడ క్రేజ్ దక్కుతుంది. చిత్రం, నువ్వు నేను, జయం లాంటి వరుసగా మూడు సక్సెస్ లతో ఇండస్ట్రీలో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన దర్శకుడు తేజ… ఆయన నుంచి వచ్చిన సినిమాలు అప్పట్లో భారీ విజయాలను దక్కించుకున్నాయి. కానీ ఈ మధ్యకాలంలో ఆయన అనుకున్న సక్సెస్ ని అందుకోలేకపోతున్నాడు. ఆయన చేసిన సినిమాలు చేసినట్టుగా ఫ్లాప్ అవుతున్నాయి. దీనికి కారణం ఏంటి అంటూ కొంతమంది ప్రేక్షకులు కూడా వాళ్ల అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. నిజానికి తేజ ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ కూడా చిన్న హీరోలతో చేసినవే కావడం విశేషం…తను స్టార్ హీరోలతో సినిమా చేయనని గతంలో చాలా సందర్భాల్లో తెలియజేశారు… కారణం ఏంటంటే ఆయనకు స్టార్ హీరోలను హ్యాండిల్ చేయడం రాదని చెబుతూ ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే నాగార్జునాతో రాంగోపాల్ వర్మ చేసిన శివ సినిమాకి తేజ అసిస్టెంట్ కెమెరామెన్ గా పనిచేస్తూనే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో కూడా హెల్ప్ చేశాడు. అక్కినేని వెంకట్, నాగార్జున లకు చాలా బాగా క్లోజ్ అయిపోయాడు.

దాంతో తేజ పెళ్లి చేసుకునే సమయంలో అతని దగ్గర డబ్బులు లేకపోయిన కూడా అక్కినేని వెంకట్ అతని భార్య జ్యోత్స్న ఇద్దరు కలిసి అతనికి పెళ్లి చేశారట. అప్పుడు తను ఉండడానికి ఒక ఇల్లు కూడా లేదట. పెళ్లికి ముందు ఆయన అన్నపూర్ణ స్టూడియోలోని ఒక కాటేజ్ లో ఉండేవాడినని చెప్పాడు.

అయితే అక్కినేని జ్యోత్స్న మాత్రం పెళ్లికి ముందు ఒక ఇల్లు తీసుకోమని చెప్పింది. దాంతో పెళ్లికి 15 రోజులు ముందే ఒక అద్దె ఇల్లు తీసుకున్నాడు. పెళ్లికి ఒక వారం ముందు ఒక కారు కొనుక్కున్నాడు. మొత్తానికైతే పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలు చేసి దర్శకుడిగా స్టార్ స్టేటస్ ని అందుకున్నాడు…

అక్కినేని వెంకట్ జ్యోత్స్న అతనికి ఎందుకు పెళ్లి చేశారు అంటు మీడియాలో చాలా సంవత్సరాల పాటు అక్కినేని వాళ్లతోనే అతను కలిసిపోయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండిపోయాడు. అందువల్లే వాళ్లే పెండ్లి పెద్దలుగా వ్యవహరించి పెళ్లి చేశారంటూ అతను పలు సందర్భాల్లో తెలియజేశాడు…

ఎన్టీఆర్ చేతిలో కత్తి పెట్టిన ప్రశాంత్ నీల్...బొమ్మ బ్లాక్ బస్టరేనా

NTR Dragon Movie
NTR Dragon Movie

NTR Dragon Movie: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్) సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈనెల 20వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ తో పాటు ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను సైతం రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకున్నారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ చాలా డిఫరెంట్ గా కనిపించబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. ఇప్పటివరకు చాలా మంది దర్శకులు ఎన్టీఆర్ ను వాళ్లకు నచ్చిన కోణంలో చూపిస్తే ఫస్ట్ టైం ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ ను తన అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలాంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ల చూపించబోతున్నాడట. ఎన్టీఆర్ చేతిలో ఒక కత్తి పెట్టి మరి అతని చేత బీభత్సమైన ఫైటింగ్లను కూడా చేయిస్తున్నాడు. ఈ రకంగా చూపిస్తే జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి అవధులు ఉండవనే చెప్పాలి.

మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న ప్రతి సినిమా ఈ మధ్యకాలంలో ప్రేక్షకుల్లో భారీ ఇంపాక్ట్ ని క్రియేట్ చేయలేకపోవడంతో ఆయన ప్రశాంత్ నీల్ తో చేస్తున్న ఈ సినిమా విషయంలోనే స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. సినిమా రిలీజ్ కి ఎక్కువ రోజులు పట్టిన పర్లేదు కానీ సినిమా సక్సెస్ ఫుల్ గా నిలవాలనే ఉద్దేశ్యంతోనే ఆయన ముందుకు సాగుతున్నాడు.

ఇక బర్త్ డే రోజు అతని అభిమానులు ఆనందపడేలా ప్రశాంత నీల్ ఒక అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ మూవీ ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఎన్టీఆర్ అభిమానులను అలరింపజేస్తుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరో రెండు రోజులపాటు వెయిట్ చేయాల్సిందే…

ఇప్పటికే ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ సిరీస్, సలార్ సినిమాల సక్సెస్ తో మంచి ఊపులో ఉన్నాడు. కాబట్టి అదే హైప్ ని వాడుకుంటూ సినిమాని నెక్స్ట్ లెవెల్లో నిలుపుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…ఇప్పటి వరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన రాని గుర్తింపు ఎన్టీఆర్ కి ఈ సినిమాతో వస్తుందని భావిస్తున్నాడు…

లైఫ్ లో ఫస్ట్ టైమ్ మహేష్ ఆ సూపర్ హిట్ సినిమాను రీమేక్ చేయాలనుకున్నాడా...

Mahesh Babu
Mahesh Babu

Mahesh Babu: సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు కి చాలా మంచి క్రేజ్ ఉంది. కెరియర్ మొదటి నుంచి కూడా ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న ఈయన ప్రస్తుతం రాజమౌళితో చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఇక ఇప్పుడు సాధించబోయే సక్సెస్ లు అతన్ని ఏ రేంజ్ హీరోగా మారుస్తాయనేది తెలియాల్సి ఉంది…మహేష్ బాబు తన ఎంటైర్ కెరియర్ లో ఇప్పటివరకు ఒక్క రీమేక్ సినిమా కూడా చేయలేదు. కారణం ఏంటి అంటే అతనికి వేరే భాషలో వేరే హీరో చేసిన సినిమాని చూసిన తర్వాత తను ఎంతసేపు ఆ క్యారెక్టర్ లో నటించాలనుకున్నా కూడా ఆయనకి ఒరిజినల్ సినిమాలో చేసిన హీరోనే గుర్తుకొస్తాడట. అవే ఎక్స్ప్రెషన్స్ వస్తాయని, అదే ఎమోషన్ బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుందని దాని వల్ల తను చాలా వరకు సఫర్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి తను రీమేక్ సినిమాను చేయలేనని గతంలో చెప్పాడు. కానీ ఒక సినిమా విషయంలో మాత్రం ఆయన తన రూల్స్ ను పక్కనపెట్టి ఆ మూవీని రీమేక్ చేయాలని అనుకున్నారట.

ఇంతకీ ఆ సినిమాలు ఏంటి అంటే మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా వచ్చిన తుపాకీ, కత్తి సినిమాలు కావడం విశేషం… అయితే తుపాకీ సినిమాని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా విషయం వదిలేస్తే కత్తి సినిమాని మహేష్ బాబు రీమేక్ చేయాలనుకున్నాడు.

కానీ దాని ఒరిజినల్ వెర్షన్ డైరెక్ట్ చేసిన మురుగదాస్ దర్శకత్వంలోనే ఆ సినిమా చేస్తే బాగుంటుందని అనుకున్నారట. ఆ టైమ్ లో మురుగదాస్ ను కూడా సంప్రదించారు. అయినప్పటికి మురుగదాస్ అప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా చేయలేకపోయాడు.

ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు తన మనసును మార్చుకొని రీమేక్ చేయాలి అనుకున్నాడంటే అది మామూలు విషయం కాదు. ఆ తర్వాత కాలంలో కత్తి సినిమాని మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘ఖైదీ నెంబర్ 150’ పేరుతో రీమేక్ చేసి సూపర్ సక్సెస్ ను సాధించాడు. చిరంజీవికి సెకండ్ ఇన్నింగ్స్ మొదట్లోనే సూపర్ సక్సెస్ వరించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి…

ఉత్తరాంధ్రలో వైయస్సార్ కాంగ్రెస్ కు షాక్!

YSR Congress
YSR Congress

YSR Congress: ఉత్తరాంధ్రలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలనుంది అన్న ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత గుడ్ బై చెబుతున్నారన్న టాక్ నడుస్తోంది. గత కొద్ది రోజులుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామాల బెడద తప్పింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చాలామంది నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇక ప్రత్యామ్నాయంగా ఏ పార్టీ లేక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న వారు ఉన్నారు. అటువంటివారు సైతం భవిష్యత్తును అంచనా వేసుకొని టిడిపి వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. ప్రధానంగా ఉత్తరాంధ్ర నుంచి మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన తన కుమార్తె రాజకీయ భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. కోలగట్ల పార్టీ మారితే మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ.

* మంచి నేతగా గుర్తింపు..
రాజకీయంగా నిబద్ధత కలిగిన నేతగా గుర్తింపు పొందారు కోలగట్ల. కాంగ్రెస్ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆయన 1989లో తొలిసారిగా పోటీ చేశారు కాంగ్రెస్ అభ్యర్థిగా. కానీ ఓటమి ఎదురైంది. 1994, 1999 ఎన్నికల్లో సైతం పోటీ చేసి ఓడిపోయారు కాంగ్రెస్ అభ్యర్థిగా. 2004లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఏకంగా అశోక్ గజపతి రాజు పై గెలిచి రికార్డు సృష్టించారు. కానీ మళ్లీ 2009లో ఓడిపోయారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆయన వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2019లో గెలిచిన కోలగట్ల ను డిప్యూటీ స్పీకర్ గా అవకాశం కల్పించారు జగన్. 2024 ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పటినుంచి సైలెంట్ గా ఉన్నారు.

* కుమార్తె కోసం..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మెరుగు పడకపోవడంతో కోలగట్ల వీరభద్ర స్వామి పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. తన కుమార్తె రాజకీయ భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం. టిడిపిలో చేరితే కోలగట్ల కుమార్తెకు విజయనగరం మేయర్ పదవి ఇచ్చేందుకు హై కమాండ్ అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. పైగా విజయనగరం జిల్లాలో బొత్స ఫ్యామిలీతో అంతంతమాత్రంగా ఉంటుంది ఆయనకు సంబంధం. ఈ కారణాలతోనే ఆయన టిడిపి గూటికి చేరేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది.

ఆ రెండు నియోజకవర్గాలపై షర్మిల ఫోకస్!

YS Sharmila
YS Sharmila

ys sharmila focus constituencies : ఏపీ రాజకీయాల్లో వైయస్ షర్మిల దూకుడు పెంచాలని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఎంపిక చేసిన కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నారు. ప్రధానంగా గట్టి అభ్యర్థులను బరిలో దించడం ద్వారా ఓట్లతోపాటు సీట్లు పెంచుకోవాలని చూస్తున్నారు. మరోవైపు తాను సైతం ఈసారి అసెంబ్లీకి పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేశారు షర్మిల. త్రిముఖ పోటీలో భాగంగా.. ఆమె ఏకంగా లక్ష యాభై వేలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. ఒకానొక దశలో కడప ఎంపీగా అవినాష్ రెడ్డి ఓడిపోతారని కూడా అంచనాలు వచ్చాయి. అయితే రాజకీయ ప్రత్యర్థిగా భావించే జగన్మోహన్ రెడ్డి పార్టీని గట్టిగానే దెబ్బతీయగలిగారు షర్మిల. కడప జిల్లాలో కూటమికి ఏడు అసెంబ్లీ స్థానాలు లభించాయి అంటే.. షర్మిల ప్రభావం అధికంగా ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై. వైసిపి ఓడిపోయేందుకు షర్మిల దోహదపడ్డారు.

* అసెంబ్లీకి పోటీ..
అయితే ఈసారి పార్లమెంట్ స్థానానికి కాకుండా అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నారు షర్మిల. దానికి కారణం లేకపోలేదు. అసెంబ్లీలో తన వాయిస్ వినిపించడం ద్వారా తన పొలిటికల్ కెరీర్ కు ఒక నిర్మాణం జరుపుకోవాలని చూస్తున్నారు. ఒకవేళ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షానికి పరిమితం అయినా.. ఆయన అసెంబ్లీకి రారు. అధికారంలోకి వస్తే అదే జగన్మోహన్ రెడ్డి పై గట్టిగానే తన వాయిస్ వినిపించవచ్చు. ఈ రెండు కారణాలతోనే షర్మిల ఇప్పుడు అసెంబ్లీ వైపు మొగ్గు చూపుతున్నారు. తనకు సేఫ్ గా ఉండే నియోజకవర్గాలను ఎంచుకునే పనిలో ఉన్నారు. రాయలసీమలో అయితే కలిసి వస్తుందన్న అంచనా. ఆపై కడప జిల్లాలో అయితే సునాయాసంగా విజయం సాధించవచ్చు అనేది ఆమె అభిప్రాయం. అందుకే కడప జిల్లాలో ఆమె అన్వేషణ ప్రారంభించినట్లు తెలుస్తోంది.

* కమలాపురం పై…
కడప జిల్లాలో ప్రధానంగా రెండు నియోజకవర్గాలపై ఆమె దృష్టి పెట్టారు. ముఖ్యంగా కమలాపురం నియోజకవర్గం పై ఫోకస్ పెట్టారు. దానికి కారణం లేకపోలేదు. ఆ నియోజకవర్గం తన తల్లి విజయమ్మ పుట్టినిల్లు. తన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ నియోజకవర్గ అయితే సేఫ్ జోన్ గా ఉంటుందని భావిస్తున్నట్లు సమాచారం. కడప నియోజకవర్గం పై కూడా ఆమె దృష్టి పెట్టారట. జిల్లా కేంద్రం కావడంతో అక్కడ నుంచి రాజకీయాలు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి వస్తున్నారట. పైగా కడప అసెంబ్లీ నియోజకవర్గంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ అభిమానులు ఎక్కువ. మరి షర్మిల ఎలాంటి అడుగులు వేస్తారో చూడాలి.

నారా దేవన్స్ 'డినో డిట్స్'.. సినిమాల కోసమా? రాజకీయాల కోసమా?

dino dits youtube channel

nara devansh youtube channel :  చంద్రబాబు కుటుంబంలో ఏది జరిగిన ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణే. ఇప్పటివరకు చంద్రబాబు.. తరువాత లోకేష్.. ఇప్పుడు దేవాన్ష్ అన్నట్టు పరిస్థితి మారింది. చదువుతో పాటు ఇతరత్రా అంశాల్లో సైతం ముందున్నారు దేవాన్ష్. మొన్నటి వరకు చదరంగంలో సైతం సత్తా చాటారు. ప్రపంచ స్థాయి పోటీల్లో పాల్గొని నైపుణ్యం కనబరిచారు. ఇప్పుడు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు దేవాన్ష్. ఓ యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించారు. పురాతన జంతువులతో పాటు అంశాలను తనదైన శైలిలో వివరించేందుకు సిద్ధపడ్డారు. యూట్యూబ్ ఛానల్ పరిచయ కార్యక్రమంలో భాగంగా కుమారుడు దేవాన్సుతో పాటు లోకేష్ పాలుపంచుకున్నారు. ప్రోమో వీడియోలో లోకేష్ సైతం కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

* ముద్దుల మనవడు
నారాతోపాటు నందమూరి కుటుంబానికి సైతం దేవాన్స్ స్పెషల్. నందమూరి బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణిని లోకేష్ వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబాలకు పెద్ద మనవడు దేవాన్ష్. బాలకృష్ణకు ఏకైక కుమారుడు లోకేష్ కావడంతో.. దేవాన్ష్ సైతం ఏకైక కుమారుడు లోకేష్ దంపతులకు. అయితే చిన్ననాటి నుంచి నానమ్మ భువనేశ్వరి పర్యవేక్షణలోనే పెరుగుతున్నాడు. ఏటా సంక్రాంతి వేడుకల సమయంలో నారావారిపల్లిలో సైతం దేవాన్స్ సందడి చేస్తుంటాడు. గ్రామానికి వెళ్ళిన క్రమంలో తోటి చిన్నారులతో ఆటలాడుతుంటాడు. కర్ర సాములో సైతం ప్రావీణ్యం పొందాడు. ముఖ్యంగా చెస్ లో రాణిస్తూ వచ్చాడు. ప్రపంచ స్థాయి పోటీల్లో సైతం పాల్గొంటూ వచ్చాడు. ఇప్పుడు కేవలం పరిశోధనాత్మకమైన, ప్రాచీనమైన డైనోసార్లు, ఇతరత్రా జంతువుల గురించి తనకు తెలిసిన విషయాన్ని పంచుకునేందుకు డినోడిట్స్ పేరుతో యూట్యూబ్ ఛానల్లో అందుబాటులోకి వస్తున్నాడు.

* భారీగా ఆదరణ..
కచ్చితంగా ఒక ముఖ్యమంత్రి మనవడు, ఒక మంత్రి కుమారుడు, ప్రముఖ హీరో మనవడు, సెలబ్రిటీ హోదాలో ఇప్పుడు దేవాన్సు యూట్యూబ్ ద్వారా పరిచయం అవుతుండడం మాత్రం గొప్ప విషయం. ఎందుకంటే ఆయన ఎంచుకునేందుకు సినిమా రంగంతో పాటు రాజకీయరంగం ఎలానూ ఉంది. ఒక పద్ధతి ప్రకారం దేవాన్ష్ విషయంలో అడుగులు వేస్తోంది నారా కుటుంబం. ఈ ప్రత్యేక యూట్యూబ్ ఛానల్స్ కు లక్షల్లో అప్పుడే వ్యూయర్ షిప్ వస్తోంది. మున్ముందు కచ్చితంగా ఇది సంచలనాలకు వేదిక కానుంది. ఎక్కువమంది నారా దేవాన్సు కు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఈ రాశి వ్యాపారులకు ఈరోజు ధన పండుగ..

Horoscope
Horoscope

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై రోహిణి నక్షత్ర ప్రభావం ఉండనుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు శివయ్య ఆశీస్సులు ఉండడంతో అన్ని శుభ ఫలితాలే ఉంటాయి. మరికొన్ని రాశుల వారు సంబంధాలను మెరుగుపరచడంలో జాగ్రత్తలు పాటించాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని వస్తువుల కొనుగోలుపై ఖర్చులు ఉండే అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే కొన్ని రోజులు వెయిట్ చేయడం మంచిది. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో పదోన్నతులు పొందే అవకాశం ఉంది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈరోజు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. వ్యాపారులకు అనుకోకుండా ధన లాభం ఉంటుంది. కొత్తగా ఏదైనా పనిని ప్రారంభిస్తే కుటుంబ సభ్యుల మద్దతు పొందాల్సి ఉంటుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. కొన్ని సమస్యలు తొలగిపోయి మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. దూర ప్రయాణాలు చేయడానికి ఇదే మంచి సమయం.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారికి ఈ రోజు సాధారణమైన జీవితం ఉంటుంది. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు జాగ్రత్తగా ఉండాలి. శుభవార్తలు వింటారు. ఇంట్లో జరిగే శుభకార్యం కోసం ఏర్పాటు చేసుకుంటారు. ఇంటి నిర్మాణానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లి ఎందుకు ప్లాన్ చేస్తారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. కొన్ని సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో ఓపికతో వ్యవహరించాలి. మాటల మాధుర్యంతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. పెద్దల ఆశీస్సులతో కొత్తగా పెట్టుబడులు పెడతారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు తమ తెలివితేటలను ప్రదర్శించడం వల్ల పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి తోటి వారి సహకారం తీసుకుంటారు. వ్యాపారులకు ఆకస్మికంగా ధన లాభం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఇంట్లో జరిగే శుభకార్యాలు కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఏ రోజు అన్ని పనులు కలిసి వస్తాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఎవరైనా ఉద్యోగం మారాలని చూస్తే వారికి అనుకూలమైన సమయం ఉంటుంది. సీనియర్ల నుంచి మద్దతు ఉండడంతో కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. వ్యాపారులకు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు గ్రహాలు అనుకూలంగా ఉండడంతో అన్ని రకాలుగా శుభాలే జరుగుతాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు కొన్ని ముఖ్యమైన పనులు ఉంటే వాటిలో ఆటంకం కలిగే అవకాశం ఉంటుంది. కుటుంబ వాతావరణం సంతోషంగా గడుస్తుంది. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగులు కార్యాలయాల్లో అప్రమత్తంగా ఉండాలి. కొన్ని శుభవార్తలు వింటూ ఉంటారు. బంధువుల నుంచి అందిన సమాచారం నిరాశను కలిగిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరపు వస్తువుల కొనుగోలు విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. ప్రభుత్వ పనులు పూర్తికావడానికి కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి. ఇక జీవితం సంతోషంగా ఉంటుంది. అనుకోకుండా శుభకార్యం జరిగే అవకాశం ఉంటుంది. వ్యక్తుల మధ్య సంబంధాలు పెరిగిపోతాయి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అనుకోకుండా వీరికి శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. పూర్వికులు ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఉద్యోగులు అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. మాటల తీరును మెరుగుపరుచుకోవాలి. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు తమ కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉండే అవకాశం ఉంది. అందువల్ల మాటలా మాధుర్యాన్ని పెంచుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని శుభ ఫలితాలే ఉండనున్నాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు కొత్తగా లాభాలు వస్తాయి. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రత్యర్థుల నుంచి జాగ్రత్తగా ఉండాలి.

ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ ఊచకోత తప్పదా..?ప్రశాంత్ నీల్ ఏం ప్లాన్ చేశాడు...

NTR Birthday Special
NTR Birthday Special

NTR Birthday Special: సినిమా ఇండస్ట్రీ లో నందమూరి ఫ్యామిలీ హీరోలకు చాలా మంచి గుర్తింపైతే ఉంది. వాళ్ళు చేసే సినిమాలతో అభిమానులను విశేషంగా అలరించడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులను సైతం మెప్పిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియాలో పెను సంచలనాలను క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. గతంలో ఆయన చేసిన దేవర సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఆయన భారీగా డీలా పడ్డాడు. కానీ ఇప్పుడు మాత్రం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. దానికోసమే ఈనెల 20వ తేదీన ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అసలు ఈ సినిమా వరల్డ్ ఏంటి ఆ మొత్తాన్ని పరిచయం చేయడానికి ప్రశాంత్ నీల్ ఒక గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నారట.

ఈ గ్లింప్స్ మామూలుగా లేదట. ఊర మాస్ గెటప్ లో ఎన్టీఆర్ మనకు కనిపిస్తూనే సినిమా మీద భారీ హైప్ ని క్రియేట్ చేసే విధంగా ఈ గ్లింప్స్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. తను అనుకున్నట్టుగానే ఈ గ్లింప్స్ సినిమా మీద ఎలాంటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తుంది.

ఈ సినిమా బిజినెస్ భారీగా జరుగుతుందా? ఇప్పుడున్న స్టార్ హీరోలందరికి పోటీని ఇవ్వగలిగే కెపాసిటి జూనియర్ ఎన్టీఆర్ కి ఉందా లేదా అనే డౌట్స్ కూడా ఈ గ్లింప్స్ తీర్చబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ నుంచి వస్తున్న ఏ సినిమా అయినా కూడా ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఇక ఇలాంటి క్రమంలోనే ప్రశాంత్ నీల్ ఆయనతో చేసిన ఈ ప్రయోగం ఎంతవరకు సఫలం అవుతుంది అనేది తెలియాలంటే మాత్రం ఈ గ్లింప్స్ ని బేస్ చేసుకొని ఈ సినిమాని అంచనా వేయొచ్చు అంటూ సినిమా మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు…

తెలంగాణ మంత్రి 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం.. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు ఘోర అవమానం..

Minister Tummala Lost Phone
Minister Tummala Lost Phone

Tummala Nageswara Rao : భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కు కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవమానాలు చేసింది. వాటితో పోల్చి చూసుకుంటే ఇది ఒక లెక్కా.. అని ఖమ్మం జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు. నిజమే పీవీ నరసింహారావుకు కాంగ్రెస్ పార్టీ దారుణమైన అవమానం చేసింది. ఈ నాటికి కూడా ఆ అపర ఆర్థిక చాణక్యుడికి కనీసం నివాళి కూడా అర్పించలేకపోతోంది. అది కాంగ్రెస్ పార్టీ దివాలా కోరుతనానికి బలమైన నిదర్శనం. కానీ ఇవాటికి కూడా కాంగ్రెస్ పార్టీ ఆ మహా మనిషికి గౌరవం ఇవ్వకపోగా.. మరింత ఇబ్బంది పెడుతోంది. కొన్ని సందర్భాలలో అభాసుపాలు చేస్తోంది.

మన ఇంట్లో ఎవరైనా చనిపోతే స్మారకాన్ని నిర్మిస్తాం. వర్ధంతి, జయంతి సందర్భంగా అక్కడికి వెళ్లి నివాళులర్పిస్తాం. ఆ స్మారకం ఉన్న ప్రాంతంలోనే మరొక స్మారకాన్ని నిర్మిస్తామంటే అసలు ఒప్పుకోము. ఎందుకంటే ఒక మనిషి భౌతికంగా లేకపోయినా.. ఆయనకు సంబంధించిన స్మారకం ప్రత్యేకంగా ఉండాలని అనుకుంటాం. కానీ ఈ సోయి కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలకు లేకుండా పోయింది.

ఖమ్మం జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు కాంగ్రెస్ మంత్రులలో తుమ్మల నాగేశ్వరరావు ఒకరు. ఈయనకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. తెలుగుదేశం పార్టీలో ఈయన తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఆ తర్వాత భారత రాష్ట్ర సమితిలో చేరారు. మంత్రిగా పనిచేశారు. తనకు విలువ ఇవ్వడం లేదని.. కొంతమంది వ్యక్తులను తీసుకొచ్చి బలవంతంగా ఉమ్మడి ఖమ్మం మీద రుద్దుతున్నారని ఆరోపిస్తూ.. కొంతకాలం పార్టీకి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత 2023లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ విధానాలను.. కాంగ్రెస్ పార్టీ వ్యక్తులను విమర్శించే తుమ్మల నాగేశ్వరరావు ఆ పార్టీలో చేరడం నిజంగా ఆశ్చర్యకరమే.

తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రస్తుతం తుమ్మల నాగేశ్వరరావు పనిచేస్తున్నారు. ఆయన సరిగా 1986లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన సుదీర్ఘంగా రాజకీయాలలో కొనసాగుతున్నారు. రాజకీయాలలో కొనసాగుతూ 40 సంవత్సరాల కాలాన్ని ఆయన పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఖమ్మంలో భారీ ఎత్తున వేడుకలు నిర్వహించారు. కొన్ని పత్రికలు తుమ్మల మీద కథనాల మీద కథనాలు రాశాయి. ఆదే స్థాయిలో యాడ్స్ కూడా దండుకున్నాయి. అయితే తుమ్మల 40 సంవత్సరాల రాజకీయ ప్రస్తానానికి సంబంధించి ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ ప్రాంతంలో ఒక పైలాన్ నిర్మించేందుకు సంకల్పించారు. పీవీ నరసింహారావు విగ్రహం ఏర్పాటుచేసిన ప్రాంతంలోనే పైలాన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నిర్మాణం కూడా మొదలుపెట్టారు. ఇది పీవీ నరసింహారావు అభిమానులకు ఆగ్రహాన్ని కలిగించింది. వెంటనే ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇది కాస్త రాజకీయంగా ఇబ్బంది కలిగించే పరిణామం కావడంతో వెంటనే తుమ్మల నాగేశ్వర రావు స్పందించారు. పైలాన్ నిర్మాణం నిలిపివేయాలని కేఎంసీ కమిషనర్ ను ఆదేశించారు. దీంతో పైలాన్ ఆగిపోయింది.

భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఏర్పాటు చేసింది.. పీవీ నరసింహారావు విగ్రహం చుట్టూ రైలింగ్ ఏర్పాటు చేసింది. అయితే ఆ విగ్రహం ఉన్న ప్రాంతంలోనే పైలాన్ నిర్మించడం సరికొత్త చర్చకు దారి తీసింది.

చిన్నారులను దత్తత తీసుకున్న మంచు మనోజ్.. ఇంత గొప్ప మనసు ఎవరికీ ఉండదేమో..

Bhuma Mounika Reddy
Bhuma Mounika Reddy

Manchu Manoj adopts children : మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటికీ, తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ ని ఏర్పాటు చేసుకొని , మంచి ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరో మంచు మనోజ్. మొదటి సినిమా నుండి ఇప్పటి వరకు రొటీన్ కి భిన్నంగా ఈయన చేసిన సినిమాలంటే యూత్ ఆడియన్స్ కి తెగ ఇష్టం , ముఖ్యంగా ఆయన చిత్రాల్లోని పాటలకు ఉండే క్రేజే వేరు. సినిమాలు చేయడమే కాదు , ఈ హీరోకి సామజిక స్పృహ కూడా ఎక్కువే. సమాజం లో ఎదురయ్యే ప్రతీ చిన్న సమస్యపై స్పందించే గుణం , నలుగురికి సహాయం చెయ్యాలనే గొప్ప మనస్సు, ఇవన్నీ మనోజ్ కి యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని తెచ్చి పెట్టాయి. సోషల్ మీడియా లో మంచు ఫ్యామిలీ మొత్తం పై ట్రోల్స్ పడినప్పటికీ మంచు మనోజ్ మీద ఒక్క ట్రోల్ కూడా పడదు, అందుకు ముఖ్య కారణం ప్రవర్తించే తీరు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇప్పుడు మరోసారి ఆయన ఉదార స్వభావాన్ని చాటుకొని , నెటిజెన్స్ చేత శభాష్ అని అనిపించుకుంటున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే నేడు ఆయన తన సతీమణి భూమా మౌనిక తో కలిసి ‘ఐక్య ధైర్య సేన సమితి’ అనే సేవా సంస్థను ప్రారంభించారు. మే 20 న మనోజ్ పుట్టిన రోజు సందర్భంగా , ఆయన అభిమానులు హైదరాబాద్ లోని KPHB లో జన్మదిన వేడుకలు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు మనోజ్ తన భార్య మౌనిక తో కలిసి హాజరయ్యారు. అంతే కాకుండా ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. మంచు మనోజ్ దంపతులు ఏర్పాటు చేసిన సేవ సంస్థను స్వయంగా నవీన్ యాదవ్ ప్రకటించాడు. ఈ ట్రస్ట్ ని ప్రారంభించిన సందర్భంగా , మొదటి రోజే 5 మంది పిల్లలను దత్తత తీసుకుంటున్నట్టు మనోజ్ అధికారిక ప్రకటన చేశాడు .

ఆ పిల్లల విద్యాబ్యాసం దగ్గర నుండి , వాళ్లకు అవసరం అయ్యే ప్రతీ ఒక్కటి సమకూరుస్తామని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు మనోజ్. తమ సేవ కార్యక్రమాలను కేవలం ఒక్క ప్రాంతానికే పరిమితం చేయడం లేదు , త్వరలోనే ప్రతీ పట్టణం లోనూ ప్రారంభిస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చాడు. ఇది రాజకీయం కోసం చేయడం లేదు , ఈ సంస్థ మా ఇద్దరిది మాత్రమే కాదు, మానవత్వాన్ని విశ్వసించే ప్రతీ ఒక్కరిది అంటూ చెప్పుకొచ్చాడు మనోజ్. మరి రాబోయే రోజుల్లో ఈ సంస్థ ద్వారా మనోజ్, మౌనిక ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయబోతున్నారో చూడాలి.

చిరంజీవి - రాజశేఖర్ కాంబోలో మిస్ అయిన మల్టీ స్టారర్ మూవీ... ఎందుకు క్యాన్సిల్ అయిందంటే...

Rajasekhar And Chiranjeevi
Rajasekhar And Chiranjeevi

Chiranjeevi And Rajasekhar: సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలందరు పాన్ ఇండియా నేపథ్యంలో సినిమాలను చేస్తున్నారు. కొంతమంది ఫ్యాన్ వరల్డ్ నేపథ్యంలో సినిమాలను చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగు సినిమా స్థాయిని పెంచుతున్న హీరోలందరు తమకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్న సినిమాలతో ఏ రేంజ్ లో సక్సెస్ లను సాధిస్తారు. తద్వారా ప్రేక్షకులను ఎలా మెప్పిస్తారు అనేది కూడా చేయాల్సి ఉంది. ఇక మెగాస్టార్ చిరంజీవి లాంటి 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్నాడు. తెలుగు సినిమా స్థాయిని పెంచడంలో తను చాలా వరకు హెల్ప్ చేశాడు. ఇక ఇలాంటి చిరంజీవి ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

70 సంవత్సరాల వయసులో కూడా ఆయన ప్రేక్షకుడి ఆలోచన మేరకు కథల విషయంలో వైవిధ్యాన్ని చూపిస్తూ తన నుంచి అభిమానులు ఏం కోరుకుంటున్నారో దాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆయనకి సినిమా అంటే ఎంత ఇష్టమో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పటివరకు చిరంజీవి చేయలేని పాత్ర లేదు. రాజశేఖర్ లాంటి నటుడు సైతం హీరోగా చేసిన చాలా సినిమాలు సూపర్ సక్సెస్ అయ్యాయి.

అయినప్పటికీ రాజశేఖర్ చిరంజీవికి మధ్య పెద్దగా పోటీ అయితే లేదు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం చిరంజీవికి పోటీ ఇచ్చే విధంగా ప్రయత్నం చేశాడు. అయితే వీళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న విభేదాలు వస్తుండేవి. వీళ్లిద్దరిని కలిపి కొంతమంది దర్శకని నిర్మాతలు సినిమా చేయడానికి సన్నాహాలు చేశారు.

రాఘవేంద్రరావు సైతం వీళ్ళిద్దరిని కలుపుతూ ఒక మల్టీ స్టారర్ సినిమా చేయడానికి ఆసక్తి చూపించాడు. అయినప్పటికి ఇద్దరు కూడా ఓకే అన్నారట. కానీ చివరి నిమిషంలో ఏం జరిగిందో తెలియదు గానీ మొత్తానికైతే ఆ సినిమా పట్టలెక్కలేదు… ఇక ఇప్పుడు రాజశేఖర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి పలు వైవిధ్యమైన పాత్రలు పోషిస్తున్నాడు. కాబట్టి తన సినిమాలో విలనిజాన్ని పండించే క్యారెక్టర్ ఏదైనా దొరికితే వీళ్లిద్దరూ కలిసి చేసే అవకాశాలైతే ఉన్నాయి…