Home Blog Page 224

ప్రొఫెసర్ నాగేశ్వర్ వర్సెస్ టిడిపి.. వైరం అక్కడ మొదలైంది

Professor Nageshwar Vs TDP
Professor Nageshwar Vs TDP

Professor Nageshwar Vs TDP: టిడిపి మీద వైసిపికి ద్వేషం ఉంటుంది. భారత రాష్ట్ర సమితికి కూడా కోపం ఉంటుంది. రాజకీయంగా ప్రత్యర్థి పార్టీలకు కచ్చితంగా విభేదాలు ఉంటాయి. దీనిని తప్పుగా చూడాల్సిన అవసరం లేదు. తప్పు పట్టాల్సిన అవసరం అంతకంటే లేదు. కానీ రాజకీయ పార్టీల మీద న్యూట్రల్ గా ఉండే విశ్లేషకులకు కోపం ఉండడమే ఇక్కడ అసలైన ఆశ్చర్యం.. ప్రభుత్వపరంగా.. పార్టీలపరంగా తప్పులు జరిగినప్పుడు విశ్లేషకులు వాటిని ఎత్తి చూపించాలి. అవసరమైతే వారు తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను చెప్పగలగాలి. ఇవి న్యూట్రల్ కోణంలోనే ఉండాలి. అలాకాకుండా వ్యక్తిగత లక్ష్యాలకు అనుగుణంగా విమర్శలు చేస్తేనే విశ్లేషకుల అసలు రంగు బయటపడుతుంది. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా తన అసలైన రంగును టిడిపి విషయంలో బయటపెట్టుకున్నారు.

ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడిన మాటలకు.. ఏపీ పోలీసులు నమోదు చేసిన కేసులకు సంబంధించిన వ్యవహారం రాజకీయాలలో మంట పుట్టిస్తోంది.. దీనిని కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు తెలంగాణ, ఆంధ్ర వివాదంగా మార్చారు. దీనిని ఆసరాగా చూపించి కొంతమంది కావాలని భావోద్వేగాలు రెచ్చగొట్టి. వాటి ద్వారా చలికాచుకోవాలని భావిస్తున్నారు. వారు మాట్లాడిన మాటలు.. చేస్తున్న ప్రకటనలు విద్వేషాలను రగిలించే విధంగా ఉన్నాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడిన మాటలు తప్పు.. వాటిని సమర్ధించుకోవడం ఇంకా తప్పు.. పైగా వాటికి ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ పూయడం మరింత పెద్ద తప్పు..

అప్పట్లో వైసిపి పరిపాలన సాగుతున్నప్పుడు రాళ్ల మీద జగన్ తన బొమ్మలు వేసుకున్నాడు. దీనిని తప్పు అని టిడిపి నేతలు ప్రశ్నించారు. ఆ సమయంలో ఒక ఛానల్ లో డిబేట్ కు వెళ్లారు ప్రొఫెసర్ నాగేశ్వర్. ఆ సమయంలో ఆయన ఉల్టా వాదించడం మొదలుపెట్టారు. కరోనా సమయంలో సర్టిఫికెట్ లపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బొమ్మలు వేసుకున్నప్పుడు.. భూములకు పాతే రాళ్ల మీద జగన్ బొమ్మలు వేసుకుంటే తప్పు ఏంటి అని వాదించాడు. హద్దు రాళ్ల మీద బొమ్మలు.. కోవిడ్ సర్టిఫికెట్ మీద నరేంద్ర మోడీ ఫోటోలు ఒకే రకమైనవని ప్రొఫెసర్ నాగేశ్వర్ వాదించడం ఆయన మేధావితనానికి ఒక బలమైన నిదర్శనం. ఇంతకంటే ఎక్కువ దిగజారరు అనుకున్న ప్రతి సందర్భంలోనూ ఆయన దిగజారి నిరూపించుకుంటూనే ఉన్నారని టిడిపి నేతలు అంటున్నారు.

నాడు జగన్ బొమ్మల మీద మాట్లాడిన ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద టిడిపి నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేశారు. దీనిపై ప్రొఫెసర్ నాగేశ్వర్ నారా లోకేష్ ను వ్యక్తిగతంగా కలిశారు.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఆపాలని లోకేష్ కు విజ్ఞప్తి చేశారు. దానికి లొకేషన్ నుంచి సానుకూల స్పందన రాలేదని తెలుస్తోంది. అప్పట్నుంచి కడుపు మంటతో ప్రొఫెసర్ నాగేశ్వర్ రగిలిపోతున్నారు.. అందువల్లే టిడిపి మీద ఈ స్థాయిలో మండిపడుతున్నారు.

ప్రత్యేక హోదా కంటే పెట్టుబడులు.. కేంద్రం ద్వారా వచ్చే నిధుల కోసమే చంద్రబాబు, నారా లోకేష్ పాటు పడుతున్నారు. ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదని.. ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా అది సాధ్యం కాదని చంద్రబాబు.. లోకేష్ కు తెలుసు.. అందువల్లేవారు నిధుల కోసం.. పెట్టుబడుల కోసం తాపత్రయపడుతున్నారు.. అయితే ప్రత్యేక హోదా విషయాన్ని పదేపదే ప్రస్తావించి టిడిపిని ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇబ్బంది పెడుతున్నారు.. అందువల్లే టిడిపి నాయకులు ఆయన మీద ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది.

మరోవైపు రైల్వే జోన్ విషయంలో కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడిన మాటలు టిడిపికి ఇబ్బంది కలిగిస్తున్నాయి.. ఏపీకి రైల్వే జోన్ తెచ్చుకోవడం కష్టమైంది.. అది ఇచ్చిన సరే వేస్ట్ అని నాగేశ్వర్ అనడంతో టిడిపికి ఆ మాటలు ఇబ్బందికరంగా మారాయి. మరోవైపు పదేపదే కేంద్రాన్ని నిలదీయాలని టిడిపికి నాగేశ్వర్ పిలుపునివ్వడం.. దానిని వైసిపి నాయకులు తమ కొనుకూలంగా ప్రచారం చేసుకోవడం.. టిడిపిని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడటంతో..”దేశం” నాయకుల్లో ఆగ్రహం కలిగిస్తోంది.

తాజాగా నాగేశ్వర్ కు అనుకూలంగా హైదరాబాదులో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ క్రాంతి వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి ఆవేశంగా మాట్లాడారు.. చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ ను తెలంగాణలో అడుగుపెట్టనివ్వమని స్పష్టం చేశారు..

“జనసేన అధినేతకు డెమోక్రసీ గురించి మాట్లాడే హక్కు లేదు. తెలంగాణ గురించి మాట్లాడే నైతికతలేదు. పూటకు ఒక రంగు మారుస్తాడు. చేగువేరా బొమ్మ పెట్టుకుని గద్దర్ వంటి నాయకుడిని మోసం చేస్తాడు. ఎన్టీఆర్ ను మోసం చేసి.. ఆయన చావు కారణమైన చంద్రబాబుకు సపోర్ట్ చేస్తాడు.. చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ జాగ్రత్త.. రజాకార్లను ఉరికించి కొట్టిన గడ్డ ఇది. మీ ఆస్తులు తగలబెట్టడమే కాదు.. మీ అస్తిత్వం కూడా లేకుండా చేస్తాం.. చంద్రబాబు హెరిటేజ్ ను నేటి నుంచి తెలంగాణలో లేకుండా నిషేధిస్తాం”.. రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు మాట్లాడిన మాటలు ఇవి.. ఇంకా చాలానే ఉన్నాయి.. ఇదంతా చూస్తుంటే ఓ పార్టీ మెప్పుకోసం చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది.

కొంత మంది జనసేన కార్యకర్తలు కేసులు పెట్టారు. అవేవో ఆంధ్రా ప్రభుత్వం పెట్టినట్లు నాగేశ్వర్ చెప్పడం, తనకు అనుకూల మేధావులు తో కూడా చెప్పించడం, దాన్ని ఎదుర్కోడానికి తనేదో వీరోచిత పోరాటం చేస్తున్నాను అనడం, ప్రాణం పోయినా ప్రశ్నిస్తూనే ఉంటాను లాంటి సినిమా డైలాగ్స్ చెప్పడం…. ఇదంతా తనను తను ఎక్కువగా చేసుక9దానికి చేస్తున్న ప్రయత్నాలు ఎబ్బెట్టుగా ఉన్నాయి.

అసలు అరెస్టుల ప్రస్తావన తీసుకొచ్చిందే నాగేశ్వర్. తన శిష్యులు ఎవరో చెప్పారని తను మొదలెడితేనే ఈ అల్లరి అంతా జరుగుతోంది. అస్సలు అటువంటిదేమీ లేదని ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చారు. దాన్ని నాగేశ్వర్, ఇతర మేధావులు, రాజకీయ నాయకులు అసలు పట్టించుకోవడం లేదు. అంతేకాదు వాళ్ళ ధోరణిలో వాళ్ళు ఆవేశపూరిత స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఇది ఒక వింత అయితే, వాటిని వారించే ప్రయత్నం నాగేశ్వర్ చేయకపోవడం ఇంకా వింతగా ఉంది. ఇవన్నీ చూస్తుంటే ఆయన చర్యలు, మాటలు వెనుక ఉద్దేశ్యాలు ఇంకేవో ఉన్నాయని అనుమానం వస్తోంది.

'అందరివాడు' ఎన్టీఆర్.. బర్త్ డే స్పెషల్!

Nandamuri Taraka Rama Rao Jayanthi
Nandamuri Taraka Rama Rao Jayanthi

Nandamuri Taraka Rama Rao Jayanthi: నందమూరి తారక రామారావు.. ఈ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. సినిమా రంగంలో మకుటం లేని మహారాజుగా ఉండేవారు. విలక్షణమైన తన నటనతో, డైలాగ్ డెలివరీతో సినిమాను నిలబెట్టిన ఒక యోధుడు. నటనలో పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను మెప్పించే తీరు అమోఘం. ఎటువంటి మాధ్యమాలు లేని సమయంలో.. సినిమా మాధ్యం ద్వారా సమాజాన్ని మేలుకొలిపిన గొప్ప కథానాయకుడు.. అంతకుమించి గొప్ప నాయకుడు. ఆరు పదుల వయసులో పార్టీని ఏర్పాటు చేసి.. 9 నెలల కాలంలో అధికారంలోకి తీసుకొచ్చిన వన్ అండ్ ఓన్లీ లెజెండరీ పర్సన్ నందమూరి తారక రామారావు. ఆయన జయంతి ఈరోజు. ఏటా మే 28న ఆయన జయంతిని ఘనంగా జరుపుకుంటారు.

* నటనలో విశ్వరూపం..
ఇప్పుడు మాదిరిగా సినిమా సెట్టింగులు ఉండేవి కావు. ఇప్పుడు మాదిరిగా టెక్నాలజీ ప్రభావం కూడా ఉండేది కాదు. తెలియాల్సినదంతా నటన. ఆ నటన ద్వారా 24 ఫ్రేమ్స్ ను దాటి వెళ్ళాలి. ప్రేక్షకుడికి చేరువ కావాలి. ఇప్పుడు మాదిరిగా ఓటీటి వంటి ప్రత్యామ్నాయ మాధ్యమాలు ఉండేవి కావు. ఎవరైనా, ఎంతటి వారైనా థియేటర్ కు వచ్చి చూడాల్సిందే. సినిమాలో కథ ఉంటే.. కథా వస్తువు ఉంటే.. అన్నింటికీ మించి నటన కనిపిస్తేనే చూసే రోజులు అవి. అటువంటి సమయంలోనే తన నటనలో విశ్వరూపాన్ని చూపించారు. రాముడిగా కనిపించారు.. కృష్ణుడిగా కనిపించారు.. దుర్యోధనుడిగా కనిపించారు.. కర్ణుడుగా కనిపించారు. ఏ పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేయడం నందమూరి తారక రామారావు కే సాధ్యం. వెండితెర ఇలవేల్పు మాత్రమే కాదు.. దేవుడిగా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న గొప్ప మహామనిషి.

* పాలనలో ఆదర్శం..
రాజకీయాలు అంటే కటౌట్లు, సోషల్ మీడియాలో ప్రచారం, హైప్ క్రియేషన్.. కానీ ఇవి లేని రోజుల్లోనే రాజకీయాల్లోకి వచ్చి రాజ్యాధికారం దక్కించుకున్న వ్యక్తి నందమూరి తారక రామారావు. దశాబ్దాల కాంగ్రెస్ పాలనను కూకటి వేళ్ళతో పెకిలించి.. ప్రాంతీయ పార్టీలకు తన తెలుగుదేశం పార్టీ విజయం ద్వారా మార్గం చూపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు. తెలంగాణను పట్టిపీడిస్తున్న పట్వారి, పటేల్ వ్యవస్థను పూర్తిగా రూపుమాపారు. బడుగు బలహీన వర్గాల వారికి అన్ని రకాల అవకాశాలు కల్పించారు. రెండు రూపాయలకే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, చౌక ధరల దుకాణాలు వంటి వాటితో.. పేదల బతుకు మార్చారు. పేదలు బతికేలా చేశారు. అందుకే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. కుల,మతాలకు, వర్గాలకు, ప్రాంతాలకు అతీతుడు ఎన్టీఆర్. అందుకే అందరివాడు అయ్యారు.

సింపతి డ్రామా.. చాలు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారూ.. ఇక ఆపండి

Professor Nageshwar
Professor Nageshwar

Professor Nageshwar: ఒకప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటే మేధావుల వర్గంలో గౌరవం ఉండేది. ఆయన అర్థవంతంగా తన విశ్లేషణలను సాగించేవారు. పలు పత్రికలకు ఆయన ఆర్టికల్స్ కూడా రాస్తూ ఉండేవారు. అవి సరి కొత్త సమాచారాన్ని అందిస్తూ ఉండేవి. అందువల్లే నాగేశ్వర్ ను మేధావి అని పిలుస్తుంటారు. ఆయన ఎమ్మెల్సీ గా కూడా పని చేశారు. అటువంటి నాగేశ్వర్ ఇప్పుడు దారి తప్పినట్టు కనిపిస్తోంది. రాజకీయ పార్టీలకు వంతపాడే వ్యక్తిగా ఆయన మారిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

గల్లి నుంచి ప్రపంచదాకా జరిగే అన్ని విషయాల మీద విపరీతమైన గ్రిప్ ఉన్న నాగేశ్వర్ న్యూట్రల్ గా మాట్లాడితే బాగుండేది. కానీ ఆయన ఇటీవల పవన్ కళ్యాణ్, అమిత్ షా భేటీని వేరే కోణంలో చూసినట్టు మాట్లాడారు. ఈయన సమక్షంలోనే పవన్ కళ్యాణ్, అమిత్ షా భేటీ జరిగినట్టు చెప్పుకోచ్చారు. వాస్తవానికి అక్కడ జరిగిన విషయం ఒకటైతే.. నాగేశ్వర్ మాట్లాడిన మాటలు మరొక విధంగా ఉన్నాయి. పైగా అవి జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ మధ్య ఉన్న సంబంధాలను చెడగొట్టే విధంగా ఉన్నాయి.

జగన్ అరెస్ట్ విషయాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారని.. దానికి అమిత్ షా ఒప్పుకోలేదని.. ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పుకొచ్చారు. వాస్తవానికి జగన్ మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అనుకుంటే.. వెంటనే చేసేస్తారు. దానికి పవన్ కళ్యాణ్ అనుమతి అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లి జగన్ అరెస్ట్ మీద మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలోని అంధ పాతాళానికి తోకేస్తానని పవన్ కళ్యాణ్ ప్రతిజ్ఞ చేశారు. దానిని చేతల్లో చూపించారు.. ఇక కొత్తగా పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని తొక్కాల్సిన అవసరం లేదు. రాజకీయంగా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం అంతకంటే లేదు.

పవన్ కళ్యాణ్ ఆకాంక్షలు ఇప్పుడు వేరే విధంగా ఉన్నాయి. ఏపీ రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి.. నిధులు.. ఇంకా అనేక అంశాలు ఆయన మదిలో ఉన్నాయి. ఇటీవల అనారోగ్యానికి గురి అయిన తర్వాత చికిత్స పొందారు పవన్ కళ్యాణ్. అమిత్ షా కోరిక మేరకే ఆయన ఢిల్లీ వెళ్లారు.. ఆయనతో అనేక రాజకీయపరమైన అంశాలు కూడా చర్చించారు.. వచ్చే ఎన్నికల్లో కూటమి కలిసి పోటీ చేయాలని.. ఏపీ రాష్ట్రాన్ని బాగు చేయాలని అమిత్ షా తో పవన్ కళ్యాణ్ చర్చించినట్టు వార్తలు వస్తున్నాయి. కేంద్ర హోం శాఖ వర్గాలు కూడా ఇదే విషయాన్ని ప్రకటిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్, అమిత్ షా భేటీలో జరిగింది ఇది అయితే ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పింది మరొకటి.. పైగా తన మాట్లాడిన మాటలకు కౌంటర్ గట్టిగా రావడంతో ప్రొఫెసర్.. విక్టిమ్ కార్డు ప్లే చేయడం మొదలుపెట్టారు. దీనికి తెలంగాణలో టిఆర్ఎస్ అధినేత్రి కవిత.. సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి తోడయ్యారు. ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర సెంటిమెంట్ రగిలించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ను అరెస్ట్ చేస్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో కట్టుకున్న ఇంటిని ముట్టడిస్తామని కవిత హెచ్చరించారు. ఇంకా కొంతమంది వ్యక్తులు కూడా దీనికి తోడయ్యారు.

ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ చేస్తున్న అతి ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే జరగని విషయాన్ని జరిగినట్టు చెప్పడం ఒక తప్పైతే.. దానిని తనకు అనుకూలంగా మార్చుకోవడం మరింత తప్పు. పైగా కొంతమంది ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ కు అనుకూలంగా మాట్లాడారు. ఇక్కడ అనవసరంగా ఆంధ్ర, తెలంగాణ సెంటిమెంట్ రగిలించి పబ్బం గడుపుకోవాలని సూచిస్తున్నారు. పైగా ప్రొఫెసర్ నాగేశ్వర్ తనను దమ్ముంటే అరెస్టు చేసుకోండి అంటూ సవాల్ విసిరుతున్నారు. అలాంటి సవాల్ విసిరిన వ్యక్తి ఇలా చేయడమేంటి.. కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులతో ప్రకటనలు చేయించడం ఏంటి.. పైగా డీజీపీని కలిసి తనకు భద్రత కల్పించాలని కోరడమేంటి.. అంతేకాదు టీవీ స్టూడియోలో యుద్ధం మీరు మొదలుపెట్టారు.. ముగింపు నేను ఇస్తానని రాజకీయ నాయకుడిలాగా మాట్లాడటం ఏంటి..

ఇవన్నీ చూస్తుంటే పకడ్బందీ రాజకీయ లక్ష్యాలతోనే.. ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసినట్టు అర్థమవుతుందని విశ్లేషకులు అంటున్నారు. తను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నామని ఆ మాజీ ఎమ్మెల్సీ చెప్పినప్పుడు.. అంతటితోనే ఆ వ్యవహారాన్ని వదిలేయాల్సింది.. రాజకీయ నాయకులకు లక్ష్యాలు ఉంటాయి కాబట్టి వారు ఊహాజనితమైన మాటలు మాట్లాడుతుంటారు. కానీ విశ్లేషకులు అలా ఉండకూడదు.

ముఖ్యంగా న్యూట్రల్ గా ఉండేవారు అదే విధానాన్ని కొనసాగించాలి. అలాకాకుండా.. పక్కా పొలిటికల్ లీడర్ల మాదిరిగా మాట్లాడుతూ.. పొలిటికల్ పార్టీల లక్ష్యాలకు అనుకూలంగా వ్యవహరించే వారిని విశ్లేషకులు అనరు. అటువంటివారిని పెయిడ్ ఆర్టిస్టులు అంటారు. ఈ మాట అనడానికి ఇబ్బందిగా ఉన్నప్పటికీ తప్పడం లేదు. పైగా ఇంత జరిగిన తర్వాత కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ సింపతి కార్డు ప్లే చేయడం నిజంగా హాస్యాస్పదం.. ఇప్పటికే చాలా జరిగిపోయింది.. మహానటి సినిమాను మించిపోయింది.. అందువల్ల చివరి మాటగా ప్రొఫెసర్ గారు ఆపండి ఇక మీ అతి.. మీ పెయిడ్ ఆర్టిస్టులను శాంతింప చేయండి.

భారత్ కు అత్యాధునిక 5వ తరం యుద్ధవిమానాలు.. కీలక ముందడుగు

India 5th Generation Fighter Jets
India 5th Generation Fighter Jets

India 5th Generation Fighter Jets: ఆధునిక కాలంలో యుద్ధాలు మారిపోతున్నాయి. ఆ యుద్ధాలు ఎలా వస్తాయో.. ఎందుకు వస్తాయో అర్థం కావడం లేదు. పైగా యుద్ధాలు చేసే స్థాయి కూడా మారిపోయింది. అత్యాధునిక ఆయుధాలను వాడటం పెరిగిపోయింది. వాటి వల్ల వినాశనం అనేది తీవ్రస్థాయిలో ఉంటుంది. అమెరికా, ఇరాన్ యుద్ధంలో ఇదే జరిగింది. అంతకుముందు రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో కూడా ఇదే జరిగింది.

ఆపరేషన్ సిందూర్ తర్వాత రక్షణ రంగానికి భారత్ కేటాయింపులు పెంచింది. దీంతోపాటు అత్యాధునిక ఆయుధాలను సొంతంగా సమకూర్చుకునే విధానంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే స్వదేశీ ఫైటర్ జెట్ల తయారీకి ఎల్ అండ్ టి, బిఇఎల్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, భారత్ ఫోర్జ్ సంస్థలను షార్ట్ లిస్టు చేశారు. తాజాగా ఆ కంపెనీ నుంచి ప్రపోజల్స్ కూడా ఆహ్వానించారు.

వచ్చే ఐదు నెలల కాలంలో ఈ కంపెనీలలో ఒకదానిని ఫైనల్ చేస్తారు. ఫైనల్ అయిన సంస్థ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ తో కలిసి పనిచేస్తుంది. అంతేకాదు ఆధునిక కాలంలో యుద్ధ అవసరాలకు తగ్గట్టుగా ఫైటర్ జెట్ల విమానాలను తయారు చేస్తూ ఉంటుంది. విమానాల తయారీని ఏఎంసీఏ ప్రోగ్రాం కింద రూపొందించారు. ఈ ప్రాజెక్టు విలువ అక్షరాల 15 వేల కోట్ల రూపాయలు. వీటి ద్వారా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో యుద్ధ విమానాలను తయారు చేస్తారు. ఇటీవల కాలంలో అమెరికా ఇరాన్ చేతిలో అనేక రకాల యుద్ధ విమానాలను నష్టపోయింది.. ఆ లోపాలను గుర్తించి.. ఎటువంటి విపత్తులనైనా ఎదుర్కొనే స్థాయిలో యుద్ధ విమానాలను తయారు చేస్తారని తెలుస్తోంది.

మన దేశం ఇతర దేశాల మీద యుద్ధాలకు వెళ్ళకపోయినప్పటికీ.. ఎటువంటి ఆక్రమణలకు పాల్పడకపోయినప్పటికీ.. స్వదేశీ రక్షణ కోసం యుద్ధ విమానాలు అత్యాధునిక స్థాయిలో ఉండాలని భారత ప్రభుత్వం భావిస్తుంది. అందువల్లే యుద్ధ విమానాల తయారీలో కీలకమైన ముందడుగు వేసింది. ఏకంగా ఐదవ తరం యుద్ధ విమానాలను భారత్ తయారు చేస్తున్న నేపథ్యంలో.. ప్రపంచం మొత్తం ఆసక్తిగా మన వైపే చూస్తోంది. కేవలం సొంత అవసరాలు మాత్రమే కాకుండా.. ఎగుమతులు కూడా ఉంటాయని సమాచారం. ఇప్పటికే కొన్ని దేశాలకు భారత్ ఆయుధాలను విక్రయిస్తోంది. గతంతో పోల్చి చూస్తే కొన్ని వందల రెట్ల వ్యాపారాన్ని రక్షణ రంగంలో భారత్ నమోదు చేయడం విశేషం.

పిచ్చిపట్టిందా ఏంటి.. హార్దిక్ పాండ్యా ఇలా చేశాడు.. అంతా అవాక్కు

Hardik Pandya
Hardik Pandya

Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు ఏమైంది.. ఎవరైనా చేతబడి చేశారా.. పిచ్చి పిచ్చిగా ఉంటున్నాడు. ప్రేయసితో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నాడు. నిబంధనలు పక్కన పెట్టి స్వేచ్ఛగా విహరిస్తున్నాడు. మైదానంలో విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. తోటి ఆటగాళ్లతో వింతగా వ్యవహరిస్తున్నాడు. తన సోదరుడు క్రునాల్ పాండ్యా అదరగొడుతుంటే.. బెంగళూరు జట్టు తరఫున పరుగులు, వికెట్లు సాధిస్తూ తిరగులేని పేరు తెచ్చుకుంటుంటే హార్దిక్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాడు.

హార్దిక్ పాండ్యా నాయకత్వంలో ముంబయి ఇండియన్స్ అంతగా ఆకట్టుకోలేదు. గత సీజన్ లో నాలుగో స్థానంలో నిలిచింది. అంతకుముందు సీజన్ లో దిగువస్థానానికి పరిమితమైంది. హార్దిక్ నాయకత్వంలో ముంబయి ఇండియన్స్ అంతగా ఆడలేకపోవడంతో మీడియాలో, సోషల్ అతని మీద తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు ముంబై ఇండియన్స్ యాజమాన్యం అతడిని తొలగిస్తుందని.. అతని స్థానంలో కొత్త ఆటగాడికి నాయకుడిగా బాధ్యతలు అప్పగిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇంతవరకు ముంబై ఇండియన్స్ యాజమాన్యం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. మరోవైపు హార్థిక్ కు కూడా తాను ముంబై ఇండియన్స్ జట్టును వదిలి వెళుతున్నట్టు ప్రకటించలేదు.

ఈ వ్యవహారం ఇలా సాగుతుండగానే హార్దిక్ పాండ్యా గురించి ఒక అప్డేట్ తెరపైకి వచ్చింది. హార్దిక్ పాండ్యా తన instagram ఎకౌంటును డి ఆక్టివేట్ చేశాడు. అతడి గురించి సెర్చ్ చేస్తే యూజర్ నాట్ ఫౌండ్ అని వస్తోంది. ఇటీవల అతడు ముంబై ఇండియన్స్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ ను అన్ ఫాలో చేశాడు. అంతేకాదు గులాబీ రంగు లో కొన్ని వస్తువులను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో అతడు ముంబై ఇండియన్స్ జట్టును వదిలి వెళ్ళిపోతున్నాడని అందరికీ అర్థమైంది. కాకపోతే దీనిపై అధికారికంగా ప్రకటన రాలేదు..

ఈ సీజన్లో హార్దిక్ పాండ్యా అంత గొప్పగా ఆడలేదు. జట్టును కూడా అంత గొప్పగా ముందుకు తీసుకెళ్లలేదు. తోటి ఆటగాళ్లతో అతడికి విభేదాలు ఉన్నాయని వార్తలు కూడా వచ్చాయి. కొన్ని మ్యాచ్లకు అతడిని ముంబై యాజమాన్యం దూరం కూడా పెట్టింది. అయినప్పటికీ ఆ జట్టు ఆట తీరు మారలేదు. మధ్యలో సూర్య కుమార్ యాదవ్.. బుమ్రా జట్టుకు తాత్కాలిక సారదులుగా వ్యవహరించారు. అయినప్పటికీ ముంబై రాత మారలేదు. ఇప్పుడు ఏకంగా హార్దిక్ పాండ్యా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను డి ఆక్టివేట్ చేయడంతో.. మొత్తానికి అతడు ముంబై జట్టు నుంచి బయటికి వెళ్లిపోతున్నాడని పరోక్షంగా సంకేతాలు ఇచ్చాడు. మరికొద్ది రోజుల్లో అధికారికంగా సమాచారం వస్తుందని స్పోర్ట్స్ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.

ఈ ఐదు రాశుల వారికి ఈరోజు అన్ని విజయాలే.. ఇందులో మీది ఉందా..

Today 9 June 2026 Horoscope
Today 9 June 2026 Horoscope

Today 28 May 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై చిత్త నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అనుకోకుండా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. మరి కొన్ని రాశుల వారు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉండలు ఉన్నాయి. ఉద్యోగులకు అదనపు ఆదాయం చేకూరుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. కొత్తగా ప్రాజెక్టులను ప్రారంభిస్తే వెంటనే పూర్తిచేస్తారు. విద్యార్థులు పోటి పక్షులు పాల్గొంటే విజయం సాధిస్తారు. పిల్లలతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది. జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. మాట తీరుగా ఎదుటివారిని ఆకట్టుకుంటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. కొత్తగా ప్రాజెక్టులను ప్రారంభిస్తే వెంటనే పూర్తిచేస్తారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారికి ఈ రోజు అన్ని శుభ ఫలితాలే ఉండనున్నాయి. గతంలో అనుకున్న పనులను ఇప్పుడు పూర్తి చేస్తారు. కుడుమ జీవితం సంతోషంగా ఉంటుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు ఉంటాయి. అనుకోకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు నాణ్యమైన సమయాన్ని పిల్లలతో గడుపుతారు. వారి కెరీర్ విషయంలో కీలకని నిర్ణయం తీసుకుంటారు. ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వ్యాపారులకు ప్రత్యర్థుల బెడద ఉంటుంది. అందువల్ల కొత్తగా ఆర్థిక వ్యవహారాలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు శత్రువుల బెడద ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. సంబంధంలేని వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల అండదండలతో వ్యాపారులు లాభాలు పొందుతారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని విషయాల్లో శుభ ఫలితాలు ఉంటాయి. అయితే వ్యక్తిగత జీవితంలో ఇతరుల జోక్యం చేసుకోనివ్వకూడదు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. కార్యాలయాల్లో ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఖర్చులపై నియంత్రణ ఉండాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో రాణిస్తారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంది. అందువల్ల కొన్ని పనులు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు మెరుగైన ఫలితాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరుల సలహా పాటించాలి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారి మనసు ఈ రోజు ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తను వింటారు. ఖర్చులను నియంత్రించుకోవాలి. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు ఎక్కువగా వస్తాయి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు సీనియర్ల నుంచి మద్దతు ఉంటుంది. దీంతో ఉద్యోగులు పదోన్నతులు పొందే అవకాశాలు ఉంటాయి. పూర్వికులు ఆర్థిక సంబంధించి శుభవార్తలు వింటారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఉద్యోగులకు కార్యాలయాల్లో అనుకూలమైన వాతావరణ ఉంటుంది.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని విషయాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటారు కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొత్తగా పెట్టుబడులు పెడతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వ్యాపారాలు ఈరోజు శుభవార్తలు వింటారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

బే ఏరియాలో ఘనంగా మహానాడు.. ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు

NRI TDP Bay Area

– ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో మిల్పిటాస్‌లో వైభవంగా నిర్వహణ

NRI TDP Bay Area అమెరికాలోని బే ఏరియాలో ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో మహానాడుతో పాటు స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎన్నారై టీడీపీ నాయకుడు జయరాం కోమటి ఆధ్వర్యంలో మిల్పిటాస్‌లోని బిర్యానీ జంక్షన్ (స్వాగత్) వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి దాదాపు వంద మందికి పైగా టీడీపీ అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించిన అభిమానులు ఆయన తెలుగు ప్రజలకు చేసిన సేవలను, రాజకీయాల్లో తీసుకొచ్చిన మార్పులను, సినీరంగంలో చూపిన ప్రతిభను స్మరించుకున్నారు. వేడుకల్లో పాల్గొన్న వారంతా ఎన్టీఆర్‌పై తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తూ ప్రత్యేకంగా జయంతి సంబరాలను నిర్వహించారు.

కార్యక్రమంలో మాట్లాడిన జయరాం కోమటి, పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా స్వర్గీయ ఎన్టీరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని తెలిపారు. ఆయన ఆశయాలను ప్రస్తుత ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా కృషి చేస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మహానాడు ప్రారంభమైన సమయానికే బే ఏరియాలో కూడా కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు. మహానాడు రెండో రోజు మెయిన్ స్క్రీన్‌పై ఎన్నారైల భాగస్వామ్యంపై మాట్లాడనున్నట్లు జయరాం కోమటి వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా రంగస్థల నటుడు అక్కిరాజు సుందరరామకృష్ణ పాల్గొన్నారు. ఎన్టీఆర్‌తో కలిసి కొన్ని సినిమాల్లో నటించిన ఆయన, తనకు ఎన్టీఆర్‌తో ఉన్న అనుభవాలను గుర్తు చేసుకున్నారు. పౌరాణిక పద్యాలను ఆలపిస్తూ సభలోని వారిని అలరించారు. 78 ఏళ్ల వయస్సులోనూ ఆయన ఉత్సాహంగా పాల్గొనడం అందరినీ ఆకట్టుకుంది. గతంలో ప్రముఖ నటి జమునతో కలిసి ‘శ్రీకృష్ణరాయబారం’ నాటకాన్ని అనేక ప్రాంతాల్లో ప్రదర్శించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు.

వేడుకల నిర్వహణలో ఎన్నారై టీడీపీ నాయకుడు వెంకట్ కోగంటి కీలక పాత్ర పోషించారు. చిన్నారుల చేత కేక్ కట్ చేయించి ఎన్టీఆర్ జయంతిని ప్రత్యేకంగా జరిపారు. అనంతరం జూమ్ మీటింగ్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న మహానాడును వీక్షించారు.

ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ తాడపనేని, విజయ్ గుమ్మడి, వీరు ఉప్పల, విజయ్ సాగర్ రెడ్డి, సీతారాం కొడాలి, అంబటి సతీష్, వాసు బండ్ల, భాస్కర్ అన్నె, సురేంద్ర కారుమంచి, శ్రీనివాస్ వల్లూరిపల్లి, జగదీష్ గింజుపల్లి, తెలుగు టైమ్స్ ఎడిటర్ సి.వి. సుబ్బారావు, శివ దువ్వూరు, హరి బొప్పూడి, రమేష్ మల్లారపు, నరహరి మార్నేని, ధీరజ్ కావూరి, అశోక్ మైనేని, కోన నరేంద్రనాథ్ రెడ్డి, మోహన్ మల్లంపాటి, వెంకట్ పరిమి, రవికిరణ్ ఆలేటి, రాఘవయ్య, రాజశేఖర్ పర్వతనేని, చంద్రశేఖర్ తిరుమలపుత్ర, రాంబాబు మానుకొండ, మోహన్ శ్రీకాంత్ పచవ, కళ్యాణ్ వీరపనేని, వీరబాబు పత్తిపాటి, లోకేష్, ధీరజ్ కావూరి, మురళీ, కృష్ణ చెరుకుళ్ళ, మునిరెడ్డి, శివ అద్దంకి, నవీన్ కొడాలి, అనిల్ రెడ్డి దప్పిలి, సుధీర్ నెల్లూరు, శ్రీనివాస్ వెలగపూడి, సురేష్ బాబు రాగలపల్లి, మధుసూదన్ రెడ్డివారి, బిల్ల భగవాన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు కూడా పాల్గొనడం విశేషం. సునీత రాయపనేని, శిరీష నెక్కలపూడి, విలేఖ్య వెనిగళ్ళ, శైలజ వెల్లంకి, ప్రభావతి కొప్పల్లి, మానస పరిమి, శ్రీదేవి శిరియాలు నెల్లూరి, దివ్య శ్రీ తదితర మహిళలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

29 బంతుల్లో 97.. పాపం వైభవ్.. క్రిస్ గేల్ రికార్డ్ తృటిలో మిస్.. ఇంత దురదృష్టమా?

Vaibhav Suryavanshi Orange Cap IPL 2026
Vaibhav Suryavanshi Orange Cap IPL 2026

Vaibhav Suryavanshi 97 runs : రాజస్థాన్ జట్టుతో ప్లే ఆఫ్ మ్యాచ్ కు ముందు హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ సూర్య వంశీ గురించి ఫోకస్ పెట్టినట్టు వెల్లడించాడు. అతడిని అవుట్ చేయడానికి అనేక రకాల ప్రణాళికలు రూపొందించినట్టు వివరించాడు. కానీ అవేవీ వాస్తవ రూపం దాల్చలేదు. చివరికి అతడి బౌలింగ్ లో కూడా వైభవ్ సూర్య వంశీ విధ్వంసం సృష్టించాడు. ఫోర్లు, సిక్సర్లతో సునామి కళ్ళ ముందు ఉండేలా చేశాడు. కేవలం 29 బంతుల్లో 12 సిక్సర్లు.. 5 ఫోర్ ల సహాయంతో 97 పరుగులు చేశాడు. సెంచరీ చేస్తాడు అనుకుంటున్న క్రమంలో అతడు ప్రపుల్ హింగే బౌలింగ్ లో భారీ షాట్ కొట్టాడు.. ఆ బంతిని మలింగ అద్భుతంగా క్యాచ్ పట్టడంతో 97 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. అతడి దూకుడు వల్ల రాజస్థాన్ రాయల్స్ జట్టు కేవలం 8 ఓవర్లలోనే.. 125 పరుగులు చేయడం విశేషం.

ఐపీఎల్ లో అత్యంత తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన ఆటగాడిగా గేల్ పేరు మీద రికార్డు ఉంది. అతడు 30 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతడి రికార్డును ఇంతవరకు ఏ ఆటగాడు కూడా బద్దలు కొట్టలేదు. అయితే సూర్య వంశీ 29 బంతుల్లోనే సెంచరీ చేసే అవకాశం ఉన్నప్పటికీ.. అతడు భారీ షాట్ కు ప్రయత్నించడంతో క్యాచ్ అవుట్ అయ్యాడు. సెంచరీ మిస్ అయినప్పటికీ యూనివర్సల్ బాస్ గేల్ రికార్డును సూర్య వంశీ బద్దలు కొట్టాడు.

ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా అతడు రికార్డు సృష్టించాడు. 2012 సీజన్లో గేల్ 59 సిక్సర్లు కొట్టాడు. అయితే వైభవ్ ఆ రికార్డును బద్దలు కొట్టాడు. 14 సంవత్సరాలుగా రికార్డును 15 సంవత్సరాల చిచ్చరపిడుగు సూర్య వంశీ చెరిపేశాడు. ముఖ్యంగా హైదరాబాద్ కెప్టెన్ బౌలింగ్లో వరుసగా మూడు సిక్సర్లు కొట్టి.. కేవలం 16 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో 29 బంతుల్లోనే సూర్య వంశీ ఐదు ఫోర్లు.. 12 సిక్సర్లు కొట్టడం విశేషం.. కేవలం బౌండరీల ద్వారానే అతడు 92 పరుగులు సాధించాడు. దీనిని బట్టి అతడి బ్యాటింగ్ ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు.

హైదరాబాద్ జట్టు మీద గత మ్యాచ్లో సూర్య వంశీ సెంచరీ చేశాడు.. అంతకుముందు మ్యాచ్ లో అంతగా ఆకట్టుకోలేదు. అయితే హైదరాబాద్ జట్టు ఈ సీజన్లో రాజస్థాన్ జట్టుతో జరిగిన రెండు మ్యాచ్ల్లో విజయం సాధించింది. ప్రస్తుత మ్యాచ్లో హైదరాబాద్ బౌలర్లు దారుణంగా పరుగులు ఇస్తున్నారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అది ఎంత తప్పో సూర్య వంశీ తన బ్యాటింగ్ ద్వారా నిరూపించాడు.

ముగిసిన వివాదం.. 'పెద్ది' ఫ్యాన్స్ కి శుభవార్త.. ఇక బాక్స్ ఆఫీస్ ర్యాంపేజ్ మామూలుగా ఉండదు..

Peddi Ticket Price Hike
Peddi Ticket Price Hike

Peddi Ticket Price Hike: గత కొంతకాలం గా టాలీవుడ్ లో జరుగుతున్న వివాదాన్ని మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఎక్సిభిటర్స్ మాకు కమీషన్ బేసిస్ మీద సినిమాలను రన్ చేసుకునే అవకాశం ఇవ్వాలని , అది ‘పెద్ది’ నుండే మొదలు అవ్వాలని పెద్ద ఎత్తున హల్చల్ చేశారు. కానీ నిర్మాతలు అందుకు ఒప్పుకోలేదు. ‘పెద్ది’ విషయం లో ఇప్పటి వరకు విధానం ఆలోచించే అవకాశం రాలేదని , చర్చల ద్వారా , కొన్ని కండీషన్స్ ని వాళ్ళు ఒప్పుకుంటూనే మేము కమీషన్ బేసిస్ మీద ఈ చిత్రాన్ని రన్ చేయడానికి ఒప్పుకుంటామని నిర్మాతలు తేల్చి చెప్పారు. దీనిపై కొన్ని రోజులు వివాదం నడుస్తూనే ఉన్నింది. అయితే రీసెంట్ గానే ఎక్సిభిటర్లు మెగాస్టార్ చిరంజీవి ని కలవడం , అదే విధంగా నిర్మాతలు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలవడం తో ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరికింది.

‘పెద్ది’ చిత్రాన్ని రెంటల్ బేసిస్ మీద నడిపేందుకు ఎక్సిభిటర్లు ఒప్పుకున్నారు. కానీ ఒకవేళ తెలంగాణ లో టికెట్ రేట్స్ హైక్స్ కి ప్రభుత్వం అనుమతిస్తే , అందులో నుండి వచ్చే కలెక్షన్స్ లో 7.5 వాటా మాకు ఇవ్వాలని ఎక్సిభిటర్లు షరత్తు పెట్టడం , అందుకు నిర్మాతలు కూడా ఒప్పుకోవడం తో , వివాదం ఇక్కడితో ముగిసింది. దీంతో జూన్ 4 న తెలంగాణ లో ఒకవేళ టికెట్ రేట్స్ పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇస్తే , ఈ చిత్రం కమీషన్ బేసిస్ మీదనే రన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదంటే రెంటల్ బేసిస్ మీదనే రన్ అవుతాయి. దిల్ రాజు బృందం కూడా 7.5 శాతం కమీషన్ కి ఒప్పుకోవడం , ఎలాగో దిల్ రాజు ప్రభుత్వం లో ఉన్నాడు కాబట్టి , టికెట్ హైక్స్ కి ఎలాంటి అడ్డంకి పెట్టే అవకాశం లేకపోవడం తో , కచ్చితంగా ఈ చిత్రానికి టికెట్ హైక్స్ వస్తుందని అంటున్నారు విశ్లేషకులు.

దీంతో ప్రస్తుతానికి ‘పెద్ది’ ముందు ఉన్నటువంటి చిక్కుముడులు తెరపడినట్టే అయ్యింది. మరి రాబోయే రోజుల్లో ఇంకా ఏమైనా ట్విస్టులు రాబోతున్నాయా లేదా అనేది చూడాలి. ఇకపోతే ఈ సినిమాకు జూన్ 3 న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ప్రీమియర్ షోస్ ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రీమియర్ షోస్ టికెట్ రేట్స్ 600 రూపాయిల వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో ఈ ప్రీమియర్ షోస్ తో పాటుగా, రోజుకి 5 షోస్ ప్రదర్శించేందుకు అనుమతి ఇవ్వనుంది కూటమి సర్కార్. ఇక మొదటి రోజు ఓపెనింగ్ వసూళ్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయి చూడాలి.

బ్యాటర్లు సిక్సర్లు కొట్టిన వెంటనే... ఆ దూరం ఎలా తెలుస్తుంది..

Cricket Six Distance Technology
Cricket Six Distance Technology

Cricket Six Distance Technology: టి20 ఫార్మాట్ అనేది అందుబాటులోకి వచ్చిన తర్వాత బ్యాటర్లు బంతిని కొట్టే తీరు మారిపోయింది. ఫోర్ల కంటే కూడా సిక్సర్ లను అధికంగా కొట్టే ప్లేయర్లు ఎక్కువైపోయారు. ప్రొఫెషనల్ బ్యాటర్లు మాత్రమే కాదు.. కొన్ని సందర్భాలలో బౌలర్లు కూడా బ్యాటర్ల అవతారం ఎత్తుతున్నారు. బంతి కనిపిస్తే చాలు కసికొద్ది కొడుతున్నారు. దీంతో బంతి ఎక్కడో పడిపోతుంది. సిక్సర్ మీటర్ ను అవలిలగా దాటేస్తోంది

ఒకప్పుడు బ్యాటర్లు సిక్సర్లు కొడితే భారీగా ఎత్తువెళ్లి కింద పడితే దానిని గొప్పగా చెప్పేవారు. అప్పట్లో సిక్స్ వెళ్ళిన దూరాన్ని లెక్కించే పద్ధతి ఉండేది కాదు. ఆధునిక కాలంలో క్రికెట్ స్వరూపం కూడా పూర్తిగా మారిపోయింది. ఆటగాళ్లు ఆడే తీరు.. పరుగులు చేసే తీరు.. గణాంకాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రత్యేకమైపోయాయి. ఆటగాళ్లు తీసే పరుగులనుంచి మొదలు పెడితే కొట్టే సిక్సర్ల వరకు ప్రతిదీ కూడా అత్యంత ఖచ్చితత్వంతో ఉంటోంది.

ఐపీఎల్ సీజన్ కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో.. ఆటగాళ్లు సిక్సర్లు కొట్టగానే వెంటనే అది ఎంత దూరం వెళ్ళిందో వెంటనే తెలుస్తోంది. అయితే ఇది ఎలా జరుగుతుంది.. వెంటనే ఆ దూరాన్ని ఎలా చెప్పగలుగుతున్నారు అనే డౌటు అందరిలోనూ వ్యక్తం అవుతుంది. మైదానంలో హై స్పీడ్ హాక్ ఐ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. ఇవి ప్రతి సెకండ్ కు వందల ఫోటోలను తీస్తాయి. బంతి వేగాన్ని.. అది వెళ్లే కోణాన్ని వెంటనే పరిశీలిస్తాయి. బంతి గ్యాలరీ లోకి వెళితే.. ఫిజిక్స్ మోడల్ ఆధారంగా అది ఎక్కడ పడిందో వెంటనే అంచనా వేస్తాయి. ఎల్బిడబ్ల్యు నిర్ణయాలకు కూడా ఈ టెక్నాలజీని ఇప్పుడు వాడుతున్నారు.

బంతి వెళ్లిన వేగాన్ని.. ప్రయాణించిన దూరాన్ని వెంటనే చెప్పడం వల్ల అభిమానులలో కూడా ఆసక్తి విపరీతంగా పెరిగిపోతుంది. బ్యాటర్లల్లో కూడా పోటీ తత్వం ఎక్కువ అవుతుంది. అందువల్లే ఒకరిని మించి మరొకరు అన్నట్టుగా సిక్సర్లు కొడుతున్నారు. ఐపీఎల్ లో పరుగుల వరద పారడానికి ఇది కూడా ఒక కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

బి*కి*నీలో సాన్య అందాలు కేక..

Sanya Malhotra Latest Photos
Sanya Malhotra Latest Photos

ఒక్క డైలాగ్ కోసం ఏకంగా 78 టేకులు.. 'పెద్ది' షూటింగ్ విశేషాలు చూస్తే ఆశ్చర్యపోతారు..

Ram Charan Peddi Collections
Ram Charan Peddi Collections

Ram Charan Peddi Movie: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ వచ్చే నెల 4 న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు ఒక రేంజ్ లో చేస్తున్నారు మేకర్స్. సోషల్ మీడియా లో తెరిచి చూస్తే ‘పెద్ది’ తప్ప మరొకటి కనిపించడం లేదు. ముఖ్యంగా యూట్యూబ్ ని ఒక్కసారి ఓపెన్ చేసి చూస్తే, పెద్ది ఇంటర్వ్యూ లే కనిపిస్తున్నాయి. ఆ రేంజ్ లో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా రీసెంట్ గానే రామ్ చరణ్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించిన బొమ్మన్ ఇరానీ, దివ్యేన్దు లతో కలిసి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ లో వీళ్ళ మధ్య జరిగిన సరదా సంభాషణ ద్వారా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి.

ముఖ్యంగా ఈ సినిమాలో డైలాగ్స్ భాగం ఎంతో ప్రత్యేకం , చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. బుచ్చి బాబు ఏది కూడా ఒక పట్టాన సంతృప్తి చెందే మనిషి కాదని, అతను చాలా వరకు పర్ఫెక్షన్ కోరుకునే డైరెక్టర్ అనే విషయం మన అందరికీ తెలిసిందే. డైరెక్టర్ సుకుమార్ స్కూల్ నుండి వచ్చిన వాడు కాబట్టి , ఆ మాత్రం ఉండడం లో వింతేమీ లేదు. అయితే ఈ సినిమాలో హీరో రామ్ చరణ్ కి ఎలివేషన్ ఇస్తూ , నటుడు బొమ్మన్ ఇరానీ చెప్పే క్రాస్ ఓవర్ ఆడ్లేట్ డైలాగ్ కోసం ఏకంగా 78 టేకులు తీసుకోవాల్సి వచ్చిందట. డైరెక్టర్ బుచ్చి బాబు ఆ సన్నివేశాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించాడని , నా సినీ కెరీర్ లో ఇన్ని టేకులు ఏ చిత్రానికి కూడా తీసుకోలేదని బొమ్మన్ ఇరానీ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

ఒక్క డైలాగ్ కోసమే ఈ రేంజ్ లో కష్టపడ్డారంటే , ఇక సినిమా కోసం ఏ రేంజ్ లో కష్టపడి ఉంటారో అర్థం అవుతుందని , రామ్ చరణ్ ఎందుకు ఈ చిత్రం తన కెరీర్ లోనే నెంబర్ 1 గా నిలుస్తుందని చెప్పాడో ఇప్పుడు అర్థం అవుతుందని , జూన్ 4 న రామ్ చరణ్ నట విశ్వరూపం చూసి ఇండియా మొత్తం ఉలిక్కిపడే పరిస్థితి వస్తుందని అంటున్నారు ఫ్యాన్స్. మరి ఆ రేంజ్ లో ఈ సినిమా ఉంటుందా లేదా అనేది చూడాలి. ఒకవేళ ఆ రేంజ్ లో ఉంటే మాత్రం కచ్చితంగా ఈ చిత్రం వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

5వ రోజు కంటే 6వ రోజున ఎక్కువ వసూళ్లు.. బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తున్న 'దృశ్యం 3'..

Drishyam 3 6th Day Collections
Drishyam 3 6th Day Collections

Drishyam 3 6th Day Collections: ఏంటో ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద చాలా విచిత్రమైన ఫలితాలు దక్కుతున్నాయి. మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సినిమాలకంటే ఎక్కువగా, డివైడ్ టాక్ ని తెచ్చుకున్న సినిమాలే ఈమధ్య కాలం లో ఎక్కువగా ఆడుతున్నాయి. ఆ కోవకు చెందిన చిత్రమే ‘దృశ్యం 3’. మోహన్ లాల్ హీరో గా నటించిన ఈ చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆట నుండే డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద నిలబడడం చాలా కష్టం అని విశ్లేషకులు సైతం మొదటి రోజున అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ , ఈ చిత్రం మొదటి వీకెండ్ లోనే డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా చాలా తక్కువ ఉండడం వల్లే ఇది సాధ్యమైందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

ఆరు రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రాంతాల వారీగా ఎంత గ్రాస్ వసూళ్లను రాబట్టింది అనేదానిపై ఒక లుక్ వేద్దాం. ఈ చిత్రం ఒక్క కేరళ రాష్ట్రం నుండే 51 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 6 కోట్ల 70 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. తెలుగు వెర్షన్ ఈ వీకెండ్ తో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా తమిళనాడు రాష్ట్రం నుండి చిత్రానికి 6 కోట్ల 40 లక్షలు, కర్ణాటక రాష్ట్రము నుండి 10 కోట్ల 30 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 5 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక ఓవర్సీస్ లో అయితే కలెక్షన్స్ సునామీ అనే చెప్పాలి.

12 రోజుల్లో ఈ చిత్రానికి అక్కడ ఏకంగా 90 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ వీకెండ్ తో ఆ ప్రాంతం లో 100 కోట్ల గ్రాస్ మార్కుని కూడా అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 169 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్ళు , 75 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. 5 వ రోజున ఈ చిత్రానికి 13 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా , 6 వ రోజున దాదాపుగా 16 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. దీన్ని బట్టీ చూస్తుంటే ఈ చిత్రానికి కచ్చితంగా లాంగ్ రన్ ఉంటుందని , ఫుల్ రన్ లో 300 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టే అవకాశం ఉందని అంటున్నారు.

ఎండగా ఉందని.. మందు కొట్టకండి బాస్.. ఏం జరుగుతుందో తెలుసా

Summer Alcohol Risks
Summer Alcohol Risks

Summer Alcohol Risks: నేటి కాలంలో మద్యం తాగడం అనేది చాలామందికి ఒక అలవాటుగా మారింది.. ముందు ఇది అకేషనల్ గా మారుతుంది. ఆ తర్వాత అలవాటవుతుంది. ఇక మూడో స్టేజ్లో వ్యసనంగా మారుతుంది. మందు అనేది వ్యసనం అయిపోయిన తర్వాత దానిని తాగకుండా ఉండడం కష్టమైపోతుంది. కొన్ని సందర్భాలలో తాగడం మాత్రమే పని అవుతుంది.

ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. అలాంటప్పుడు మద్యం తాగేవారు ఎక్కువ మోతాదులో తీసుకుంటారు. శరీరం నుంచి చెమట అధికంగా వెళ్లడం వల్ల వారిలో నీరసంగా ఉంటుంది. ఆ నీరసాన్ని ఉత్సాహంగా మార్చుకోవడానికి మద్యం తాగుతూ ఉంటారు. కొంతమంది మద్యంతోపాటు.. బీర్ల వంటివి కూడా తాగేస్తూ ఉంటారు. తాగినప్పుడు బాగానే ఉంటుంది. పైగా మత్తు అనేది ఉంటుంది కాబట్టి నిద్ర కూడా త్వరగా పడుతుంది. ఫలితంగా శరీరం రిలాక్స్ అయినట్టు అనిపిస్తుంది. అయితే అది తాత్కాలికమైనది మాత్రమే.

వేసవిలో విపరీతంగా మద్యం తాగడం వల్ల అది ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది.. ఆల్కహాల్ అనేది శరీరంలో నీటి శాతాన్ని వేగంగా తగ్గిస్తుంది.. ఒకరకంగా అది డీహైడ్రేటింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఫలితంగా వడదెబ్బ వంటి వాటి బారిన పడే ప్రమాదం ఉంటుంది. మధ్యమధ్యలో ఉన్నప్పుడు వడదెబ్బకు సంబంధించిన లక్షణాలను మన శరీరం.. మెదడు వంటివి వెంటనే గుర్తించలేవు. దీనివల్ల పరిస్థితి దారుణంగా మారుతుంది. ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది.

మద్యం అతిగా తాగే అలవాటు ఉన్నవారు వేసవిలో దానిని తగ్గించుకోవడం మంచిది. ఒకేసారి కాకుండా విడతలవారీగా మద్యాన్ని తాగే అలవాటును తగ్గించుకోవాలి. దీనివల్ల శరీరం క్రమంగా మెరుగవుతూ ఉంటుంది. అంతర్గత అవయవాల పనితీరు కూడా ఉత్తేజంగా మారుతూ ఉంటుంది.. మద్యం తాగడం వల్ల అనేక రకాల అనారోగ్యాలు శరీరం మీద దాడి చేస్తూ ఉంటాయి. మద్యం తాగి అలవాటు ఉన్నవారు ఒకేసారి మానివేయకుండా.. క్రమంగా మద్యం తాగే పరిమాణాన్ని పూర్తిగా తగ్గించుకోవాలి. దీనివల్ల శరీరం కూడా అలవాటు పడిపోతూ ఉంటుంది. మద్యం తాగడం మానేస్తే చర్మం కాంతివంతంగా ఉంటుంది. నాజూకుతనాన్ని కలిగి ఉంటుంది. ఇతర సమస్యలు రావడానికి అవకాశం ఉండదు.. శరీరం కూడా నవోత్తేజాన్ని పొందుతుంది.

గమనిక

ఈ కథనం కేవలం పాఠకులకు సమాచారం కోసం మాత్రమే. వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మద్యం తాగే అలవాటు ఉన్నవారు.. దానిని మానేయాలంటే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

'కరుప్పు' 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. 300 కోట్ల గ్రాస్ క్లబ్ కి అతి చేరువలో సూర్య..

Karuppu 12 Days Collections
Karuppu 12 Days Collections

Karuppu 12 Days Collections: తమిళ హీరో సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘కరుప్పు’ బాక్స్ ఆఫీస్ వద్ద రాబడుతున్న వసూళ్లను చూస్తుంటే , ఈ రేంజ్ కం బ్యాక్ ఈమధ్య కాలం లో ఏ సౌత్ స్టార్ హీరో కూడా ఇవ్వలేదని అనిపిస్తోంది. అప్పట్లో పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ చిత్రం తో ఏ రేంజ్ కం బ్యాక్ ఇచ్చాడో , సూర్య ఇప్పుడు దాదాపుగా అదే రేంజ్ కం బ్యాక్ ఇచ్చాడు. వంద కోట్ల గ్రాస్ వసూళ్లను కూడా కొల్లగొట్టలేని స్థాయి నుండి , ఇప్పుడు ఏకంగా 300 కోట్ల గ్రాస్ ని కొల్లూగొట్టే స్థాయికి చేరుకోబోతున్నాడు. విడుదలై దిగ్విజయంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రాంతాల వారీగా ఎంత గ్రాస్ వసూళ్లను రాబట్టిందో ఒకసారి వివరంగా ఈ కథనంలో చూద్దాం. తెలుగు లోనే ఈ చిత్రం మొదటి వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంది.

తమిళనాడు రాష్ట్రము నుండి ఈ చిత్రానికి దాదాపుగా 12 రోజుల్లో 124 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఊపు చూస్తుంటే కచ్చితంగా ఈ చిత్రం తమిళనాడు రాష్ట్రం నుండి 150 కోట్ల గ్రాస్ మార్కుని అందుకునేలా ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఒక్క చెన్నై సిటీ నుండే ఈ చిత్రానికి 18 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే , ఈ చిత్రం ఇక్కడ ‘వీరభధ్రుడు’ అనే టైటిల్ తో విడుదలైన సంగతి తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ని కేవలం 7 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఈ 12 రోజుల్లో ఇప్పటి వరకు ఈ చిత్రానికి తెలుగు వెర్షన్ నుండి 27 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 14 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

అంటే పెట్టిన డబ్బులకు రెండింతలు లాభాలు వచ్చాయి అన్నమాట. ఇది సాధారణమైన విషయం కాదు. అదే విధంగా కర్ణాటక రాష్ట్రం నుండి ఈ చిత్రానికి 19 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా , కేరళ నుండి 11 కోట్ల 75 లక్షలు, హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 3 కోట్లు, ఓవర్సీస్ నుండి 68 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళ భాషలకు కలిపి ఇప్పటి వరకు 253 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ వీకెండ్ కూడా బలమైన హోల్డ్ ని కనబర్చగలిగితే ఈ చిత్రం కచ్చితంగా 300 కోట్ల గ్రాస్ మార్కుని అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

కంపెనీ అంటే ఇదిరా సామీ.. కష్టపడ్డందుకు ఏకంగా ఒక్కో ఉద్యోగికి 3.25 కోట్ల బోనస్

Samsung Massive Employee Bonus
Samsung Massive Employee Bonus

Samsung Massive Employee Bonus: అంతర్జాతీయంగా పరిస్థితులు బాగోలేదు. బాగుపడతాయని నమ్మకం కూడా లేదు. ఐటీ కార్యకలాపాలు మొత్తం ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా సాగుతున్నాయి. భవిష్యత్తు కాలంలో మనుషుల అవసరం ఉంటుందో.. లేదో కూడా తెలియడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఐటీ కంపెనీలు ఉద్యోగులను పక్కన పెడుతున్నాయి. అర్ధాంతరంగా తొలగిస్తున్నాయి. దీంతో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు.

ఇటువంటి పరిస్థితులున్న నేటి కాలంలో ఓ కంపెనీ భారీగా లాభాలను సంపాదించింది. అంతేకాదు ఈ లాభాలు సాధించడానికి కారణమైన ఉద్యోగుల విషయంలో గొప్ప నిర్ణయం తీసుకుంది. ఆ ఉద్యోగులు ఊహించిన విధంగా ఆఫర్ ఇచ్చింది. దీంతో ఆ సంస్థలో పనిచేస్తున్న ఎంప్లాయిస్ మొత్తం ఎగిరి గంతులు వేస్తున్నారు. ఏమి మా మహాభాగ్యమంటూ సంబరాలు చేసుకుంటున్నారు.

మనదేశంలో దీపావళి సందర్భంగా కంపెనీలు ఉద్యోగులకు బోనస్ లు ప్రకటిస్తుంటాయి. ఉత్తమమైన ఉద్యోగులకు అద్భుతమైన కానుకలు ఇస్తుంటాయి. అయితే ఇప్పుడు దీపావళి కాదు. పేరుపొందిన పండగలు కూడా లేవు. కానీ సాంసంగ్ కంపెనీ తన సంస్థలో పనిచేసే ఉద్యోగులకు ఈ సంవత్సరంలో దీపావళి పండుగను ముందుగానే తీసుకొచ్చింది. అన్ని కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలలో కోతలు విధిస్తుంటే.. సాంసంగ్ కంపెనీ మాత్రం భిన్నంగా ఆలోచిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి డిమాండ్ పెరిగిన నేపథ్యంలో.. సాంసంగ్ కంపెనీ ఊహించని లాభాలు సొంతం చేసుకోండి. గత క్వార్టర్లో ఆ కంపెనీకి సంబంధించిన షిఫ్ట్ డివిజన్ ఆదాయం ఏకంగా 49 రెట్లు పెరిగిపోయింది. ఫలితంగా ఆవిభాగంలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి 3.25 కోట్లను బోనస్ గా ఇచ్చేందుకు సాంసంగ్ కంపెనీ యూనియన్ ఆమోదాన్ని తెలిపింది. సాంసంగ్ కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఏకంగా 78,000 మంది ఉద్యోగులకు ప్రత్యక్ష లబ్ధి చేకూరుతుంది. కొత్తకాలంగా చిప్ యూనిట్ ల విషయంలో సాంసంగ్ కంపెనీ ప్రధానంగా దృష్టి సారించింది. దీంతో ఆ కంపెనీ ఆదాయం భారీగా పెరిగింది. అందువల్లే ఉద్యోగులకు ఈ స్థాయిలో బోనస్ ప్రకటించింది.

సిద్ధరామయ్య సీఎం కుర్చీ పాయే.. కర్ణాటకు కొత్త సీఎం అతడే.. అసలేం జరిగిందంటే..

Karnataka New CM
Karnataka New CM

Karnataka New CM: అధికారంలోకి రాకముందు కుర్చీల కోసం కొట్లాట.. అధికారం వచ్చిన తర్వాత పదవుల కోసం కొట్లాట.. కాంగ్రెస్ పార్టీలో రాజకీయాల గురించి ఢిల్లీకి సర్కిల్స్ ప్రాంతంలో బాగా పేరుపొందిన సామెత ఇది. ఈ సామెత సంవత్సరాల కాలం నాటిదైనప్పటికీ.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉందంటే కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. దేశమంతా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలలో మాత్రం అనుకూలమైన వాతావరణం కొనసాగుతోంది. దక్షిణాది రాష్ట్రాలలో కేరళ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. తమిళనాడులో అధికార పార్టీలో భాగస్వామ్య పక్షంగా ఉంది.

ఉన్న అధికారాన్ని సుస్థిరం చేసుకొని.. దేశవ్యాప్తంగా అధికారాన్ని దక్కించుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ చేయాల్సి ఉండగా.. దక్షిణాది రాష్ట్రాలలో అందుకు భిన్నంగా సాగుతోంది. ముఖ్యంగా పదవుల కోసం నాయకుల మధ్య జరుగుతున్న పోరాటాలు ప్రజల్లో చులకన భావాన్ని కలిగిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ప్రధానమైన కన్నడ సీమలో ప్రస్తుతం సీఎం మారతారు అనే చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య గురువారం రాజీనామా చేస్తారని వార్తలు వస్తున్నాయి.. కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఈనెల 30న ప్రమాణస్వీకారం చేస్తారని కూడా తెలుస్తోంది.

ముఖ్యమంత్రి స్థానం కోసం శివకుమార్ మధ్య.. సిద్ధరామయ్య మధ్య పోటీ ఎప్పటినుంచో సాగుతూనే ఉంది. ఇద్దరు కూడా బలమైన నాయకులు కావడంతో ఎవరి మనసు నొప్పించకుండా ఉండేందుకు అధిష్టానం నాయకత్వ మార్పు ప్రక్రియను చేపడుతున్నట్లు తెలుస్తోంది.. గతంలో సీఎం స్థానం కోసం శివకుమార్ అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. ఈ పంచాయతీ ఢిల్లీ దాకా కూడా వెళ్ళింది. అధిష్టానం మధ్యలో జోక్యం చేసుకోవడంతో శివకుమార్ కాస్త వెనక్కి తగ్గారు. అప్పట్లోనే అధిష్టానం శివకుమార్ కు కొంత వ్యవధి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఆ వ్యవధి ముగిసిపోవడం శివకుమార్ అధిష్టానం ముందు ప్రస్తావించినట్టు తెలుస్తోంది. నీతో నాయకత్వ మార్పుకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

అధిష్టానం చెప్పినట్టు సిద్ధరామయ్య నడుచుకుంటారని కర్ణాటక మీడియాలో వార్తలు వస్తున్నాయి. గురువారం సిద్ధరామయ్య తన మంత్రివర్గంలో ఉన్న వ్యక్తులకు అల్పాహార విందు ఇస్తారని.. ఆ తర్వాత లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు రాజీనామా పత్రం సమర్పిస్తారని తెలుస్తోంది.. గురువారం ఉదయాన్నే ఢిల్లీ నుంచి సిద్ధరామయ్య ఇంటికి వస్తారని.. ఆ తర్వాత వారిద్దరూ మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది.

ముఖ్యమంత్రి రేసులో ఉన్న వ్యక్తులలో డీకే శివకుమార్ తో పాటు పరమేశ్వర పేరు కూడా వినిపిస్తోంది. మరోవైపు తాను రాజీనామా చేసిన తర్వాత.. కర్ణాటక రాష్ట్రంలో బలంగా ఉన్న అహీంద వర్గాలకే ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలని సిద్ధరామయ్య చెప్పినట్టు తెలుస్తుంది. ఒకవేళ దీనికి గనక అధిష్టానం ఓకే చెబితే అప్పుడు పరమేశ్వర ముఖ్యమంత్రి అవుతారు. పరమేశ్వర ప్రస్తుతం హోం మంత్రిగా ఉన్నారు. ఈయన దళిత సామాజిక వర్గానికి చెందినవారు. 2023లో పార్టీ అధిష్టానం రెండున్నర సంవత్సరాలు మాత్రమే సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉంటారని డీకే శివకుమార్ తో చెప్పింది. అందువల్ల ఇప్పుడు ముఖ్యమంత్రి మార్పు జరుగుతోందని తెలుస్తోంది.