Chandrababu: కేంద్ర పెద్దలు గొప్ప ఆశతో ఉన్నారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ఆమోదించుకోవాలని చూస్తున్నారు. అయితే గతంలో మహిళా బిల్లును ప్రవేశపెట్టగా విపక్షాలన్నీ కలిపి ఓడించాయి. ఈ బిల్లులు పాస్ కావాలంటే మూడింట రెండో వంతు మెజారిటీ అవసరం. అయితే లోక్ సభలో అంత మెజారిటీ లేదు ఎన్డీఏకు. అందుకే ఆ బిల్లు వీగిపోయింది. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు వెనక్కి తీసుకోక తప్పలేదు. అయితే ఇప్పటివరకు బిజెపి పెద్దల పొలిటికల్ వ్యూహాలు ఫలించాయి. కానీ ఈ రెండు బిల్లుల విషయంలో మాత్రం ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. అందుకే ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
* ఎన్డీఏ వైపు డిఎంకె..
తమిళనాడులో డీఎంకేకు ఏకపక్షంగా లోక్సభ ఎంపీల బలం ఉంది. నిన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ డిఎంకె ఓడిపోయింది. టీవీకే నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నడుస్తోంది. అయితే దశాబ్దాల పొత్తును వదులుకొని కాంగ్రెస్ పార్టీ డీఎంకేకు గుడ్ బై చెప్పింది. టీవీకే గూటికి చేరింది. అయితే కాంగ్రెస్ చేసిన పనికి ఆగ్రహంగా ఉంది డిఎంకె. వెన్నుపోటుగా అభివర్ణిస్తోంది. అందుకే బిజెపి విషయంలో స్టాలిన్ కు ఉన్న అభిప్రాయం మారుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఎన్డీఏ గూటికి డీఎంకే చేరుతుంది అనేది ఒక అంచనా. మరోవైపు పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కోట బద్దలవుతోంది. అక్కడ 20 మంది వరకు లోక్ సభ సభ్యులు బిజెపి వైపు వస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 29 మంది ఎంపీలు టీఎంసీ కి ఉండగా.. అందులో 20 మంది వస్తే.. ఆ పార్టీ పార్లమెంటరీ వ్యవస్థ బిజెపిలో విలీనం అవుతుంది. మరోవైపు అక్కడ రాజ్యసభ సభ్యులు సైతం ఒకేసారి బిజెపి గూటికి వస్తారని ప్రచారం నడుస్తోంది. ఈ పరిణామాల క్రమంలో ఆ రెండు బిల్లుల ను సమన్వయం చేసుకునే బాధ్యతలను ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్ర పెద్దలు అప్పగించినట్లు ప్రచారం నడుస్తోంది.
* అభ్యంతరాలు రాకుండా..
ప్రధానంగా నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు దక్షిణాది రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ఈ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీల వాదన. ఇప్పటికే దీనిపై ఏపీ మంత్రి నారా లోకేష్, తమిళనాడుకు చెందిన చిదంబరం మధ్య గట్టిగానే వాదనలు నడిచాయి. ఇప్పుడు రాష్ట్రాల్లో ఉన్న పార్లమెంట్ స్థానాలను 50 శాతానికి పెంచుతూ.. అన్ని రాష్ట్రాలకు ఒకే మాదిరిగా ఈ నియోజకవర్గాల పెంపు ఉంటుంది అనేది కేంద్రం స్పష్టం చేసే అవకాశం ఉంది. పైగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన స్టాలిన్, రేవంత్ రెడ్డి వంటి వారిని ఒప్పించే బాధ్యతను చంద్రబాబుకు కేంద్ర పెద్దలు కట్టబెట్టినట్లు ప్రచారం నడుస్తోంది. వచ్చే నెలలోనే ఈ రెండు బిల్లులు మరోసారి ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. ఆ సమయానికి ఈ బిల్లులకు పూర్తిస్థాయిలో మద్దతును చంద్రబాబు కూడగట్టాలని కేంద్ర పెద్దలు బాధ్యత అప్పగించినట్లు సమాచారం. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.
















ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పినట్టు యుద్ధమే!
Professor Nageshwar: మీరు యుద్ధం ప్రారంభించారు.. నేను ముగిస్తాను అంటూ తేల్చి చెప్పారు ప్రొఫెసర్ నాగేశ్వర్. ఇటీవల ఆయన చుట్టూ తెలుగు రాజకీయాలు నడుస్తున్నాయి. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసిన నేపథ్యంలో జరిగిన చర్చ ఇది అంటూ ఆయన ఒక విశ్లేషణ చేశారు. చంద్రబాబు కంటే జగన్ నమ్మదగిన మిత్రుడు అని.. ఆయనను అరెస్టు చేయమన్న పవన్ కళ్యాణ్ ను అమిత్ షా క్లాస్ పీకినట్లు చెప్పుకొచ్చారు ప్రొఫెసర్ నాగేశ్వర్. అప్పటినుంచి ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్ తీరుపై కూటమి పార్టీలు మండిపడ్డాయి. ముఖ్యంగా జనసేన, టిడిపి ఓ రేంజ్ లో విరుచుకుపడ్డాయి. జనసేన నేతల ఫిర్యాదుతో కేసు నమోదు కూడా జరిగింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్టు ఉంటుందన్న ప్రచారం నడిచింది. అయితే తాను ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రకటించగా.. ఇంతటితో ఈ వివాదం ఫుల్ స్టాప్ అంటూ జనసేన ప్రకటించింది. అంతటితో ఆ వివాదం ముగిసిపోయిందని అంతా భావించారు.
* హైదరాబాదులో సమావేశం..
అయితే ఉన్నట్టుండి ప్రొఫెసర్ నాగేశ్వర్ యుద్ధం మీరు ప్రారంభించారు.. నేను ముగిస్తానంటూ ప్రకటన చేశారు. అది మొదలు మళ్లీ రచ్చ ప్రారంభం అయింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్ కోసం హైదరాబాదులో ఏపీ పోలీస్ టీం దిగినట్లు ప్రచారం నడిచింది. అయితే రాజమండ్రిలో ఉన్న పవన్ కళ్యాణ్ ముందు రోజు గట్టిగానే మాట్లాడారు ప్రొఫెసర్ నాగేశ్వర్ పై. తరువాత రోజు మాట్లాడి వదిలేయండి నాగేశ్వర్ మంచివాళ్లు అంటూ చాలా ఈజీగా మాట్లాడారు. అరెస్టులు వద్దు అంటూ పోలీసులకు సూచించారు. దీంతో ఈ వివాదానికి పూర్తి సమాప్తం అన్నట్లు పరిస్థితి మారింది. అయితే ఉన్నట్టుండి మళ్లీ ప్రొఫెసర్ నాగేశ్వర్ తెలంగాణ రాజకీయ విశ్లేషకులతోపాటు జర్నలిస్ట్ ఫారం ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. వారు పవన్ కళ్యాణ్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. సినీ పరిశ్రమ వారిని తెగ దూషణలకు దిగారు. చంద్రబాబుతో పాటు లోకేష్ పై కూడా మాట్లాడారు.
* ఏపీ పాలకుల దాడిగా..
మీరు యుద్ధం ప్రారంభించారు నేను ముగిస్తాను అన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రకటన ఇప్పుడు నిజమేనని తెలుస్తోంది. ఎందుకంటే ఇదంతా ఏపీ పాలకుల దాడిగా హైదరాబాదులో ఉన్న జర్నలిస్టులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ రాజకీయ ప్రేరేపిత విశ్లేషణ చేశారు. దానికి సంబంధించిన వివాదమే ఇదంతా. పైగా ఆయన హుందాగా తన మాటలను వెనక్కి తీసుకున్నారు. ఇంతవరకు ఆయన అరెస్టు కూడా జరగలేదు. అయినా సరే ఇప్పుడు తెలంగాణ సమాజం.. పెద్ద యుద్ధమే ప్రకటించడం వెనుక రాజకీయ వ్యూహం ఉన్నట్లు అర్థమవుతుంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పినట్టు ఇది ఒక యుద్దం గా కనిపిస్తోంది. యుద్ధం ఆగుతుందా? లేకుంటే ఇంకా కొనసాగుతుందా? అన్నది చూడాలి.