Home Blog Page 225

వైభవ్ సూర్య వంశీ పప్పులు ఉడకవు..ఆ గేమ్ ప్లాన్ ఏంటో చెప్పేసిన కమిన్స్..

SRH Vs Rajasthan Eliminator
SRH Vs Rajasthan Eliminator

SRH Vs Rajasthan Eliminator: మరికొద్ది సేపట్లో హైదరాబాద్, రాజస్థాన్ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్, హైదరాబాద్ జట్లు విజయం సాధించి ఫైనల్ వెళ్లాలని గట్టి పట్టుదలతో ఉన్నాయి. రెండు జట్లలో కూడా సూపర్ బ్యాటర్లు ఉన్నారు. ప్రస్తుత ఐపిఎల్ సీజన్లో సూపర్ ఫాం కొనసాగిస్తున్నారు. క్వాలిఫైయర్ మ్యాచ్ కావడంతో రెండు జట్లలో ప్లేయర్లు దుమ్ము రేపే అవకాశం ఉంది.

రాజస్థాన్ రాయల్స్ జట్టులో అత్యంత ప్రమాదకరమైన ఆటగాడిగా 15 సంవత్సరాల బాలుడు వైభవ్ సూర్య వంశీ పేరుగాంచాడు. ఇతడు ఈ సీజన్ లో హైదరాబాద్ జట్టు మీద అతడు రెండు మ్యాచ్లు ఆడాడు. తొలి మ్యాచ్లో అంతగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ.. రెండో మ్యాచ్లో మాత్రం సెంచరీ చేశాడు. అతడు తక్కువ పరుగులు చేసినప్పుడు.. సెంచరీ చేసినప్పుడు ఇలా రెండు సందర్భాల్లో రాజస్థాన్ జట్టు ఓటమి పాలు కావడం విశేషం.

వైభవ్ సూర్య వంశీ కి అవకాశం ఇస్తే మాత్రం దూకుడుగా బ్యాటింగ్ చేస్తాడు. బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. అతడు అండగా ఉంటే రాజస్థాన్ జట్టు స్కోరు మెరుపు వేగంతో దూసుకుపోతూ ఉంటుంది. రాజస్థాన్ జట్టు భారీ స్కోర్ చేస్తే హైదరాబాద్ జట్టుకు తీవ్రమైన ఇబ్బంది తప్పదు. అందువల్లే అతడిని ఆదిలోనే కట్టడి చేస్తే హైదరాబాద్ జట్టుకు భారీగా లాభం చేకూరుతుంది. అందువల్లే ఇదే విషయాన్ని హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్ ప్రముఖంగా ప్రస్తావించాడు. సూర్య వంశీ ని కట్టడి చేసేందుకు తమ వద్ద ప్రణాళికలు ఉన్నాయని అతడు పేర్కొన్నాడు.

“ప్రతి జట్టులో కూడా కొంతమంది ప్లేయర్లు ఉంటారు. వారు మ్యాచ్ ఫలితాన్ని వన్ సైడ్ చేస్తారు. అలాంటి వారిని ఆపాలంటే రకరకాల ప్రణాళికలు అవసరం. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సీ అవసరం. మనం ఓడించిన జట్టుతో మళ్లీ ఆడటం వల్ల ఒత్తిడి ఉండదు గాని.. కొన్ని సందర్భాలలో ఫలితం వేరే విధంగా వస్తేనే ఆందోళన కలుగుతుంది. అటువంటి ఆందోళనకు ఈసారి కూడా ఆస్కారం లేకుండా చేద్దామని అనుకుంటున్నాం. అందువల్లే వైభవ్ సూర్య వంశీ మీద ప్రధానంగా దృష్టి సారించామని” కమిన్స్ పేర్కొన్నాడు.

'రాకా' కోసం అల్లు అర్జున్ సంచలన నిర్ణయం.. ఎవరైనా దీనికి సెల్యూట్ చెయ్యాల్సిందే..

Raaka movie latest updates
Raaka movie latest updates

Raaka movie latest updates: ‘పుష్ప’ సిరీస్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న ‘రాకా’ చిత్రం పై ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రేజ్ మామూలుది కాదు. అల్లు అర్జున్ తన ప్రతీ సినిమాతో కొత్తదనాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చెయ్యాలనే తపనతో , కసితో ఉంటాడు. అందులో భాగంగానే ఆయన ఈ చిత్రాన్ని ఒప్పుకున్నాడు అనేది మనకి ఫస్ట్ లుక్ చూసినప్పుడే అర్థం అయ్యింది. ఈ ఫస్ట్ లుక్ లో ఆయన మానవ మృగం లాగా కనిపించడం గమనార్హం. ఆ క్యారెక్టర్ సరిగ్గా వర్కౌట్ అయితే ఇండియన్ బాక్స్ ఆఫీస్ మరోసారి షేక్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదంతా పక్కన పెడితే మన టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రస్తుతం గడ్డు కాలం లో ఉంది. సినిమాలకు సంబంధించిన బడ్జెట్ లు హద్దులు దాటుతున్నాయి. మరోపక్క కరోనా లాక్ డౌన్ తర్వాత పుట్టిన ఓటీటీ బిజినెస్ ఇప్పుడు బాగా పడిపోయింది.

ఎంత పెద్ద సూపర్ స్టార్ సినిమా అయినా సరే , ఒకప్పుడు ఇచ్చిన ఆఫర్స్ ని ఇప్పుడు ఇవ్వడం లేదు ఓటీటీ సంస్థలు , దాదాపుగా 50 శాతానికి పైగా తగ్గించేశాయి . ఇలాంటి సమయం లో హీరోలు గొప్ప మనసు చేసుకొని రెమ్యూనరేషన్స్ తగ్గించుకోవడమో , లేకపోతే తమ ఖర్చులు తగ్గించుకోవడమో చేస్తుంటారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ‘రాకా’ చిత్రం కోసం అదే చేస్తున్నాడు. ఈ సినిమాకు ఆయన రెమ్యూనరేషన్ తగ్గించుకుంటాడో లేదో తెలియదు కానీ , నిర్మాతకు భారం తగ్గించే ప్రయత్నాలు మాత్రం చాలా గట్టిగా చేస్తున్నాడు. తనకు నిర్మాత కల్పించిన ప్రైవేట్ జెట్ సదుపాయాన్ని అల్లు అర్జున్ తిరస్కరించాడు. సాధారణ ఫ్లైట్ లో ఎకానమీ క్లాస్ లోనే ఆయన ఇకపై ప్రయాణం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. రీసెంట్ గానే ముంబై కి ‘రాకా’ షూటింగ్ కోసం వెళ్లిన అల్లు అర్జున్ , ప్రైవేట్ జెట్ లో కాకుండా సాధారణ ఫ్లైట్ లోనే ప్రయాణం చేసాడు.

ఈ సంస్కృతి కి తెరలేపిన మొట్టమొదటి హీరో కమల్ హాసన్. రీసెంట్ గానే ఆయన హైదరాబాద్ లో ‘కల్కి 2’ షూటింగ్ లో పాల్గొన్నాడు. ఈ షూటింగ్ కోసం నిర్మాత అశ్వినీదత్ ప్రైవేట్ జెట్ బుక్ చేస్తానంటే నిరాకరించిన కమల్ హాసన్ , సాధారణ ఫ్లైట్ లో ఎకానమీ క్లాస్ లోనే ప్రయాణం చేశాడు . కమల్ హాసన్ ని చూసి , ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అదే మార్గాన్ని అనుసరించడం తో సోషల్ మీడియా లో నెటిజెన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ‘రాకా’ మూవీ షూటింగ్ జెట్ స్పీడ్ లో సాగుతోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ పై పలు కీలకమైన యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ కి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

చిరంజీవి ఆరోగ్య పరిస్థితి పై అసత్య ప్రచారం.. అరెస్ట్ కాబోతున్న ప్రముఖ ఛానెల్ ఓనర్..

False news about Chiranjeevi health
False news about Chiranjeevi health

False news about Chiranjeevi health: సెలబ్రిటీల పేర్లను వాడుకొని డబ్బులు సంపాదించడం తప్పేమి కాదు, కానీ ఎవరి పేరుని అయితే వాడుకొని డబ్బులు సంపాదిస్తున్నారో, వాళ్ళ ప్రతిష్ట కి , పరువుకు భంగం కలిగిస్తూ డబ్బులు సంపాదించడం అనేది అత్యంత నీచమైన చర్య. అలా సంపాదించిన డబ్బులతో అన్నం తినలేము , కుటుంబాన్ని పోషించలేము. కానీ ఈమధ్య కాలం లో సోషల్ మీడియా లో కొన్ని యూట్యూబ్ చానెల్స్ ని చూస్తే రక్తం మరిగిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే వీళ్ళు ప్రచారం చేసేది ఒక్కటి కూడా నిజం ఉండదు. ఎల్లప్పుడూ అసత్యాలే ప్రచారం చేస్తుంటారు. చివరికి ఆరోగ్యం పైన కూడా అత్యంత నీచమైన ప్రచారాలు చేస్తుంటారు. అలా ఈమధ్య కాలంలో ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ పదే పదే మెగాస్టార్ చిరంజీవి ఆరోగ్య పరిస్థితి పై అభిమానుల్లో లేనిపోని అనుమానాలు సృష్టిస్తూ , వాళ్ళను భయబ్రాంతులకు గురి చేస్తూ వస్తోంది.

దీనిపై మెగాస్టార్ చిరంజీవి సన్నిహిత వర్గాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. పలుమార్లు సదరు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులను హెచ్చరించారు. కానీ తీరు లో ఎలాంటి మార్పు లేకపోవడం తో , హైదరాబాద్ లోని కమలాపురి కాలనీ కి చెందిన న్యాయవాది రామకృష్ణ మిర్యాల సోమవారం రోజున జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు ఆ యూట్యూబ్ ఛానల్ మెగాస్టార్ చిరంజీవి ఆరోగ్యపరిస్థితి పై చేసిన వీడియోలకు సంబంధించిన లింకులు, స్క్రీన్ షాట్స్ వంటివి పోలీసులకు ఆధారాలుగా ఇచ్చారు. సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల్లో ఇలా ఆరోగ్యం పట్ల, మరియు ఇతర విషయాల పట్ల అసత్య ఆరోపణలు చేయడం చట్ట రీత్యా నేరమని , శిక్షార్హులని ఆ పిటీషన్ లో పేర్కొన్నారు. ఈ కేసు ని తీసుకున్న పోలీసులు, కోర్టు అనుమతితో సదరు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. ఇలాంటి యూట్యూబ్ చానెల్స్ ని తక్షణమే బ్యాన్ చెయ్యాలని , మరో సెలబ్రిటీకి ఇలాంటి పరిస్థితి రానివ్వకుండా చెయ్యాలని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

లేడీ ఓరియెంటెడ్ సినిమాకు నిర్మాతగా ప్రదీప్ రంగనాథన్ .. హీరోయిన్ ఎవరంటే..

Pradeep Ranganathan turns producer
Pradeep Ranganathan turns producer

Pradeep Ranganathan turns producer: ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిన వారిలో ఒకరు ప్రదీప్ రంగనాథన్. ఇప్పటి వరకు ఆయన నాలుగు సినిమాల్లో హీరో గా నటిస్తే, అందులో మూడు సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచి 100 కోట్ల గ్రాస్ మార్కుని అవలీల గా దాటాయి. రీసెంట్ గా విడుదలైన ‘LIK’ చిత్రానికి ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ కూడా, కమర్షియల్ గా యావరేజ్ రేంజ్ లో ఆడింది. బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 70 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇది సాధారణమైన విషయం కాదు. హీరో గా ఇంత సక్సెస్ ని చూసిన ప్రదీప్ రంగనాథన్, డైరెక్టర్ గా కూడా అదే రేంజ్ సక్సెస్ లను చూశాడు. ఆయన ఇండస్ట్రీ కి పరిచయం అయ్యిందే డైరెక్టర్ గా అనే సంగతి మన అందరికీ తెలిసిందే. జయం రవి హీరో గా నటించిన ‘కోమలి’ అనే చిత్రానికి దర్శకుడు ఆయనే.

ఆ తర్వాత తాను హీరో గా నటించిన మొదటి చిత్రం ‘లవ్ టుడే’ కి కూడా తానే దర్శకత్వం వహించాడు. తెలుగు , తమిళ భాషల్లో ఈ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాను హీరో గా నటిస్తున్న తదుపరి చిత్రాన్ని కూడా తన స్వియ దర్శకత్వం లోనే తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నాడు ప్రదీప్. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఆయన లేటెస్ట్ గా నిర్మాత గా మారబోతున్నాడు. తన నిర్మాణ సంస్థ లో ఒక లేడీ ఓరియంటెడ్ చిత్రాన్ని నిర్మించే ఆలోచనలో ఉన్నాడట ప్రదీప్ రంగనాథన్ . ఈ చిత్రం లో హీరోయిన్ గా మమిత బైజు నటించబోతున్నట్టు తెలుస్తోంది. గతం లో వీళ్లిద్దరు హీరో హీరోయిన్లు గా ‘డ్యూడ్’ అనే చిత్రం లో కలిసి నటించారు.

ఈ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ఈ చిత్రానికి వ్యక్తిగతంగా చాలా గట్టిగా కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో మరోసారి ఈ క్రేజీ ప్రాజెక్ట్ రాబోతుంది. అయితే ఈ చిత్రానికి ప్రదీప్ రంగనాథన్ కేవలం ఒక నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తాడట , స్క్రీన్ పై కనిపించడట. అంతే కాదు , తనతో ‘డ్రాగన్’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన అస్వత్ మారిముత్తు ఈ చిత్రం లో ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్టు సమాచారం. ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ ఈ ఏడాదే సెట్స్ మీదకు వెళ్లనుంది.

బరువు తగ్గడానికి గ్రీన్ టీ.. బ్లాక్ టీ.. ఏది బెటర్..

Green Tea or Black Tea
Green Tea or Black Tea

Green Tea or Black Tea: ప్రస్తుత రోజుల్లో బరువు ప్రధాన సమస్యగా మారింది. దీంతో చాలా మంది బరువు తగ్గాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేకంగా కొన్ని ద్రవ పదార్థాలు తీసుకుంటూ ఉంటారు. వీటిలో ముఖ్యంగా బ్లాక్ టీ, గ్రీన్ టీని తీసుకునే వారి సంఖ్య ఎక్కువే. అయితే రెండింటిలో ఏది మంచిదనే సందేహం చాలామందికి ఉంటుంది. ఈ రెండు టీలు కూడా ఆరోగ్యానికి ఉపయోగకరమైనవే అయినప్పటికీ, వాటి పని తీరు, శరీరంపై ప్రభావం కొంత భిన్నంగా ఉంటుంది. మరి వీటి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటంటే?

గ్రీన్ టీని సాధారణంగా బరువు తగ్గడానికి ఎక్కువగా సిఫార్సు చేస్తుంటారు. దీనిలో ఉండే క్యాటెకిన్స్, ముఖ్యంగా EGCG అనే యాంటీ ఆక్సిడెంట్ శరీరంలో మెటాబాలిజాన్ని వేగంగా పనిచేయేలా చేస్తుంది. దీంతో శరీరంలోని కొవ్వు కరిగే ప్రక్రియకు సహాయపడుతుంది. అలాగే గ్రీన్ టీ తాగడం వల్ల శరీరంలో క్యాలరీలు కొంత ఎక్కువగా ఖర్చవుతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే డైట్ ఫాలో అయ్యేవారు ఎక్కువగా గ్రీన్ టీని ఎంచుకుంటారు.

గ్రీన్ టీలో కెఫిన్ పరిమాణం తక్కువగా ఉంటుంది. అందువల్ల రోజులో 2 నుంచి 3 కప్పులు తాగినా చాలా మందికి ఇబ్బంది ఉండదు. ఇది శరీరాన్ని తేలికగా ఉంచడంలో, అలసట తగ్గించడంలో సహాయపడుతుంది. కొంతమందికి గ్రీన్ టీ తాగిన తర్వాత ఫ్రెష్‌గా అనిపించడం ఇందుకే. అయితే ఖాళీ కడుపుతో ఎక్కువగా తాగితే అసిడిటీ లేదా వికారం వచ్చే అవకాశం ఉంటుంది.

ఇక బ్లాక్ టీ కూడా తక్కువేమీ కాదు. బ్లాక్ టీ పూర్తిగా ఆక్సిడైజ్ చేసిన టీ ఆకులతో తయారవుతుంది. ఇందులో ఉండే పాలీఫినాల్స్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. బ్లాక్ టీ గట్ హెల్త్‌ను మెరుగుపరచడం ద్వారా పరోక్షంగా బరువు నియంత్రణకు సహాయపడుతుంది. అలాగే ఇది ఆకలిని కొంతవరకు నియంత్రించడంలో ఉపయోగపడవచ్చు. ముఖ్యంగా పాలు, చక్కెర లేకుండా తీసుకుంటే క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి.

బ్లాక్ టీలో గ్రీన్ టీతో పోలిస్తే కెఫిన్ కాస్త ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇది తాగినప్పుడు ఎనర్జీ ఎక్కువగా వచ్చిన భావన కలుగుతుంది. ఉదయం సమయంలో బ్లాక్ టీ తాగడం వల్ల మైండ్ అలర్ట్‌గా ఉండటానికి సహాయపడుతుంది. అయితే అధికంగా తాగితే నిద్రలేమి, గుండె వేగం పెరగడం వంటి సమస్యలు రావచ్చు.

బరువు తగ్గాలంటే కేవలం టీ తాగడం సరిపోదని నిపుణులు చెబుతున్నారు. సరైన ఆహారం, వ్యాయామం, మంచి నిద్ర కూడా చాలా ముఖ్యం. గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ ఒక్కటే మాయలాగా కొవ్వు కరిగించవు. కానీ ఆరోగ్యకరమైన జీవనశైలితో కలిపి తీసుకుంటే బరువు నియంత్రణకు మద్దతుగా పనిచేస్తాయి.

మధుమేహం లేదా హైబీపీ ఉన్నవారు చక్కెర లేకుండా టీ తీసుకోవడం మంచిది. పాలు ఎక్కువగా కలిపితే టీ ప్రయోజనాలు కొంత తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే రెడీమేడ్ ఫ్లేవర్డ్ టీలు లేదా అధిక చక్కెర ఉన్న టీ డ్రింక్స్ బరువు తగ్గడంలో ఉపయోగపడకపోవచ్చు.

iphone కొనేవారికి గుడ్ న్యూస్..

iPhone 17 Pro
iPhone 17 Pro

iPhone 17 Pro: Apple కంపెనీ ఫోన్లు అంటే భారత్ లో క్యూ కడుతూ ఉంటారు. దీని నుంచి ఏ కొత్త సిరీస్ మార్కెట్లోకి వస్తుందని తెలియగానే మొబైల్ వినియోగదారులకు ఎక్కడా లేని ఉత్సాహం ఉంటుంది. అయితే ఈ ఫోన్ ధరలు కాస్త ప్రీమియంగానే ఉంటాయి. అయితే కొత్తలో వచ్చిన సమయంలో ఈ ఫోన్ ను దక్కించుకోని వారు ఇప్పుడు డిస్కౌంట్ ద్వారా దీనిని పొంద వచ్చు. ఈ కంపెనీకి చెందిన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ ‘ఐఫోన్ 17′(iPhone 17)పై ప్రస్తుతం ఆకర్షణీయమైన డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రముఖ విజయ్ సేల్స్ వేదికగా ఫ్లాట్ డిస్కౌంట్లతో పాటు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్‌తో కలిపి ఈ ఫోన్‌ను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఆ వివరాల్లోకి వెళితె..

ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. ఐఫోన్ 17 ప్రో (256GB స్టోరేజ్ వేరియంట్) అసలు ధర రూ. 82,900గా ఉంది. అయితే దీనిపై ఫ్లాట్ డిస్కౌంట్ రూ.1,410 అందిస్తున్నారు. HDFC, RBL బ్యాంక్ ఆఫర్ల ద్వారా రూ. 4,000 వరకు అదనపు తగ్గింపు లభిస్తోంది. దీనివల్ల ఫోన్ ధర బాగా తగ్గుతుంది. అంతేకాకుండా వినియోగదారులు తమ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా మరింత వెసులుబాటును పొందవచ్చు.

ఈ ఐఫోన్ 17 సిరీస్ గ్లోబల్ మార్కెట్‌లో అద్భుతమైన ప్రజాదరణను పొందింది. 2026 మొదటి త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌గా ఇది నిలిచింది. స్టాండర్డ్ మోడల్‌లో కూడా 48 మెగాపిక్సెల్ కెమెరా, 120Hz ప్రో-మోషన్ డిస్‌ప్లే వంటి అప్‌గ్రేడ్స్ ఉండటం వల్ల, సాధారణ వినియోగదారులకు కూడా ఇది ఎంతో ఆకర్షణీయంగా మారింది.

మీరు కూడా ఐఫోన్ 17 సిరీస్‌ను కొనుగోలు చేయాలని అనుకుంటే ప్రస్తుతం ఆన్‌లైన్ స్టోర్లలో నడుస్తున్న ఈ బ్యాంక్ ఆఫర్లు, No Cost EMI సదుపాయాలను సరిచూసుకోవడం ఉత్తమం. ఏటా సెప్టెంబర్ నెలలో యాపిల్ తన కొత్త ఐఫోన్ మోడళ్లను విడుదల చేస్తుంది. కాబట్టి ప్రస్తుత ఆఫర్లు ఆపిల్ అభిమానులకు ఒక గొప్ప అవకాశంగా మారాయి.

మహానాడు వేదికగా సంచలన ప్రకటన

Mahanadu sensational announcement
Mahanadu sensational announcement

Mahanadu sensational announcement: తెలుగుదేశం పార్టీ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. మహానాడు వేదికగా ఒకసారి కొత్త నిర్ణయాన్ని ప్రకటించింది. ఇటీవల పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు మహిళలకు కల్పించే వీలుగా ఈ బిల్లును ప్రవేశపెట్టగా.. మూడింట రెండు వంతు మెజారిటీ లేక వీగిపోయింది ఈ బిల్లు. అయితే ఈ బిల్లు ఇప్పుడు మరోసారి పార్లమెంట్లో ప్రవేశ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ ఈ మహిళా బిల్లు పై గట్టిగానే మాట్లాడుతున్నారు. జాతీయస్థాయిలో మిగతా రాజకీయ పక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ తరుణంలో మహానాడు వేదికగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై సంచలన నిర్ణయం తీసుకుంది తెలుగుదేశం పార్టీ. బిల్లు ఆమోదంతో సంబంధం లేకుండా 2029 ఎన్నికల్లో 33 శాతం మహిళలకు టిక్కెట్లు ఇస్తామని ప్రకటించింది తెలుగుదేశం.

తొలిరోజు సక్సెస్
హైబ్రిడ్ మహానాడు ఈరోజు ప్రారంభం అయ్యింది. రెండు రోజులపాటు కొనసాగనుంది. పూర్తిగా డిజిటల్ విధానంలో.. ఆఫ్ లైన్, ఆన్లైన్ మోడ్ కలగలిపి టిడిపి చేపట్టిన ఈ మహానాడు తొలి రోజు సక్సెస్ అయ్యింది. పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కీలక ప్రసంగం చేశారు. నారా లోకేష్ అయితే ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై. సెటైరికల్ పంచ్ లతో పాటు లోకేష్ చేసిన ప్రసంగం విశేషంగా ఆకట్టుకుంది. నేరుగా పార్టీ శ్రేణులతో మమేకం అయ్యేందుకు లోకేష్ చేసిన ప్రయత్నం హైలైట్ గా నిలిచింది.

మహిళలకు సంబంధించి కీలక ప్రకటన..
స్త్రీ శక్తి ధీమ్ తో సాగిన మహానాడు లో అదే మహిళలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు నారా లోకేష్. పార్లమెంటులో బిల్లుతో సంబంధం లేకుండా 2029 ఎన్నికల్లో 33% మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించారు. అంటే వచ్చే ఎన్నికల్లో దాదాపు 50 మంది మహిళా ఎమ్మెల్యేలు సభకు రానున్నారు అన్నమాట. ఇప్పటికే నాయకులు తమ మహిళా వారసులను రంగంలోకి దించారు. పార్టీతో పాటు పాలనలో భాగస్వామ్యం కల్పిస్తున్నారు. ఇప్పుడు మహానాడు వేదికగా యువరాజు లోకేష్ ప్రకటనతో సీనియర్ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మహానాడు వేదికపై పెద్ద చర్చ నడిచింది. అయితే చాలామంది నేతలు కుమార్తెలు లేకపోవడంతో కోడళ్లను రంగంలోకి దించేందుకు అక్కడి నుంచే ప్రణాళిక మొదలుపెట్టారు. మొత్తానికైతే మహానాడు వేదికగా తొలి రోజు ఒక సంచలన నిర్ణయం వెలువడటం నిజంగా గొప్ప విషయమే.

స్థానిక ఎన్నికలపై తేల్చేసిన జగన్!

YS Jagan Politics
YS Jagan Politics

Jagan on local body elections: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో సరికొత్త పాచిక వేశారు. ఎక్కడ ఏకగ్రీవాలు అనే మాట లేకుండా చూడాలని చూస్తున్నారు. పొరపాటున ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలపై వేటు వేస్తానని హెచ్చరించారు. తద్వారా ఎక్కడ పార్టీ నేతలు తప్పించుకోకుండా ఉండేందుకు ముందుగానే వారిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. ప్రజలు కూడా ఎక్కువగా ఏకగ్రీవాలకు మొగ్గు చూపుతారు. ఎందుకంటే స్థానికంగా రాజకీయ అంశాలు ఎక్కువగా ప్రభావం చూపుతాయి. గ్రామ పెద్దల ప్రమేయంతో చాలాచోట్ల ఏకగ్రీవాల వైపే చూస్తారు. ముఖ్యంగా పంచాయతీలకు ఏకగ్రీవాలు అనేవి సర్వసాధారణం. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏకగ్రీవం అన్న మాట వినిపించకూడదు అంటూ సొంత పార్టీ నేతలను హెచ్చరించడం బ్లాక్మెయిలింగ్ కిందకి వస్తుంది.

అప్పట్లో ఏకగ్రీవాలే అధికం..
2021లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మండలం మొత్తానికి ఒకే పదవిగా ఉండే జడ్పిటిసిలను సైతం ఏకగ్రీవం చేసుకున్నారు. పంచాయితీల గురించి చెప్పనవసరం లేదు. ఇక ఎంపీటీసీల గురించి చెప్పనవసరం లేదు. అన్ని ఏకగ్రీవాలే. ఎందుకంటే అధికార పార్టీగా ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విధానాలను నిరసిస్తూ ప్రాదేశిక ఎన్నికలను బహిష్కరించారు చంద్రబాబు. అప్పట్లో అంతలా ఉండేది ఏకగ్రీవాల పర్వం. ఒక అధికారాన్ని చేపట్టిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వెళ్లాక ఏకగ్రీవాలు వద్దు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏ రీతిలో ఏకగ్రీవాలను చేసుకుందో జగన్మోహన్ రెడ్డికి తెలియంది కాదు. అయితే ఆయన తెలివిగా ఇప్పుడు ఆ బాధ్యతను నియోజకవర్గం అప్పగించారు. అంటే తప్పకుండా పోటీ ఉంటే పార్టీ ఓటు బ్యాంకు ఎటు వెళ్లదన్నది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. అయితే దీనిని ఎక్కువ మంది వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇదే మనిషి ఏకగ్రీవాలు చేయమన్నారు. ఇప్పుడు ఏకగ్రీవాలు అంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇది ఎక్కడి చోద్యం అని ఆవేదన వ్యక్తం చేస్తున్న వారు ఉన్నారు.

కేవలం ఆ అజెండాతో..
ఈరోజు పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లతోపాటు మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలతో సమావేశం అయ్యారు జగన్మోహన్ రెడ్డి. అధికార పార్టీ మహానాడు నిర్వహిస్తున్న దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధపడిపోతుందన్న వార్త ఉంది. అదే అజెండాతో ఈరోజు సమావేశం నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి.. స్థానిక సంస్థల నిర్వహణ బాధ్యతను నియోజకవర్గ ఇన్చార్జిలే తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందో లేదో? తమకే వస్తుందో లేదో? అనే ఆలోచనలో ఉన్నారు కొందరు ఇన్చార్జిలు. కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్లాంటివారు అయితే అసలు యాక్టివ్ కాలేదు. అటువంటి వారికి ఎటువంటి ఆదేశాలు ఇవ్వకుండా.. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు తమను కమిట్మెంట్ చేయడం పై ఆగ్రహంగా ఉన్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు.

కోహ్లీ వల్ల కాలేదు.. గేల్ కు సాధ్యం కాలేదు.. ఇతడే బెంగళూరు రణబలి

Rajat Patidar Bengaluru performance
Rajat Patidar Bengaluru performance

Rajat Patidar Bengaluru performance: విరాట్ కోహ్లీ నాయకుడుగా ఉన్నప్పుడు బెంగళూరు ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కూడా గెలవలేదు. గేల్ వీరవిహారం చేసినప్పుడు కూడా బెంగళూరు విజేతగా నిలవలేదు. వరుసగా అన్నేసీ సీజన్లు పూర్తయినప్పటికీ.. అనేక సంందర్బాలలో ఫైనల్ దాకా వచ్చినప్పటికీ ట్రోఫీని అందుకోలేకపోయింది. కానీ, గత సీజన్లో బెంగళూరు విజేతగా నిలిచింది. టోర్నీ ఆసాంతం అదరగొట్టింది. ఫైనల్ లో పంజాబ్ జట్టును ఓడించి ట్రోఫీని సొంతం చేసుకుంది.

బెంగళూరు విజేతగా నిలవడంతో రజత్ పాటిదార్ కీలక పాత్ర పోషించాడు. నాయకుడిగా, ఆటగాడిగా ద్విముఖ పాత్ర పోషించి సత్తా చూపించాడు. కీలకమైన ఇన్నింగ్స్ లు మాత్రమే కాదు, కీలకమైన పరుగులు కూడా చేసి అదరగొట్టాడు. గత సీజన్ లోనే కాదు, ఈ సీజన్ లో కూడా రజత్ పాటిదార్ దుమ్మురేపుతున్నాడు. వీరోచితమైన బ్యాటింగ్ తో వారెవ్వా అనిపిస్తున్నాడు.

తాజా సీజన్ లో కూడా బెంగళూరును అన్ని రంగాలలో ముందడుగు వేయించాడు రజత్ పాటిదార్. గుజరాత్ జట్టుతో జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్ లో దుమ్ము రేపాడు. గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో 9 సిక్సర్లతో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు రజత్. ఒక టీ20 టోర్నీ ఎడిషన్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన కెప్టెన్ గా రజత్ పాటిదార్ నిలిచాడు. ఈ సీజన్ లో మొత్తం 41 సిక్సర్లు కొట్టాడు రజత్ పాటిదార్.

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023-24 లో 40 సిక్సర్లు కొట్టాడు. ఆ రికార్డును రజత్ పాటిదార్ బద్దలు కొట్టాడు. ఐపీఎల్ లో శ్రేయస్ అయ్యర్ ఏకంగా 39 సిక్సర్లు కొట్టి సంచలనం నెలకొల్పాడు. వారందరూ ఆ స్థాయిలో బ్యాటింగ్ చేసిన నేపథ్యంలో రజత్ పాటిదార్ అంతకుమించిన స్థాయిలో ఆడాడు. ఏకంగా 41 సిక్సర్లు కొట్టాడు.

రజత్ పాటిదార్ బీభత్సమైన ఫామ్ లో ఉన్నాడు. విరాట్ కోహ్లీ, ఇంకా ఇతర ముఖ్యమైన ప్లేయర్లు అంతగా గొప్ప ఇన్నింగ్స్ ఆడలేకపోయినప్పటికీ రజత్ పాటిదార్ మాత్రం ఓ రేంజ్ లో బ్యాటింగ్ చేశాడు. అతడు సెంచరీకి దగ్గరలో ఔట్ అయినప్పటికీ బెంగళూరుకు కావాల్సినంత లాభం చేకూరింది. బ్యాటింగ్ లో రజత్ పాటిదార్ అదరగొడితే.. బౌలింగ్ లో డఫీ, భువనేశ్వర్ సత్తా చూపించారు. ఫలితంగా గుజరాత్ ఓటమి పాలయింది. బెంగళూరు వరుసగా రెండో సీజన్ లో ఫైనల్ వెళ్లడంతో రజత్ పాటిదార్ ను ఆ జట్టు అభిమానులు తమ పాలిట రణబలి అని వ్యాఖ్యానిస్తున్నారు.

భర్త మీద మూడు కోట్ల బీమా.. పది లక్షలకు సుఫారీ.. ఈ భార్య క్రూరత్వం మాటలకందనిది

Shocking Murder Plot Case
Shocking Murder Plot Case

Shocking Murder Plot Case: ఆమెకు పెళ్లయింది. భర్త కూడా ఉన్నాడు. భర్త ఇచ్చే సుఖం సరిపోలేదు. పరాయి వ్యక్తి కోసం ఆరాటపడింది. ఆ ఆరాటంలో కట్టుకున్న వాడిని పూర్తిగా మర్చిపోయింది. పైగా అతడిని చంపేందుకు పక్కా స్కెచ్ వేసింది. ఊరికే చంపడం ఎందుకని బీమా చేయించింది. చివరికి పోలీసులకు దొరికిపోయింది.

తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ ప్రాంతానికి చెందిన సాయినికుమార్, ఆయన భార్య భారతి నివాసం ఉంటున్నారు. భారతికి లగిశెట్టి సురేందర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం కుమార్ కు తెలిసింది. ఈనేపథ్యంలో అతడు భార్యతో అనేక మార్లు గొడవపడ్డాడు. ఇదే విషయం మీద ఆమెను నిలదీశాడు. దీంతో కుమార్ అడ్డు తొలగించుకోవాలని భారతి నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని సురేందర్ తో చెప్పింది.

సురేందర్, భారతి కలిసి ప్రణాళిక రూపొందించారు. ఈనేపథ్యంలో కుమార్ మీద వారు రూ.మూడు కోట్లకు బీమా చేయించారు. కొన్ని సంవత్సరాల క్రితం కుమార్, రామ్ మల్లేష్ కు డబ్బుల విషయంలో గొడవ జరిగింది. దీంతో భారతి, సురేందర్ మల్లేష్ ను కలిశారు. కుమార్ ను లేపేసే ప్లాన్ గురించి చెప్పారు. రూ.10 లక్షలకు సుఫారీ మాట్లాడుకున్నారు. గడిచిన నెలలో రూ.రెండు లక్షలను ముందుగా ఇచ్చారు. మల్లేష్, తన స్నేహితుడు శ్రీరామ్ కుమార్ తో కుమార్ ను లేపేయడానికి ప్లాన్ రూపొందించాడు.

ఈనెల 22న మందు తాగుదామని కుమార్ కు మల్లేష్ ఫోన్ చేశాడు. కుమార్ ను ముల్కల్ల గ్రామంలోని శివారు ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ కుమార్ కు విపరీతంగా మద్యం తాగించారు. అతడు మత్తులో ఉండగా మల్లేష్, శ్రీరామ్ సుత్తెతో గట్టిగా కొట్టారు. అతడు చనిపోయిన తర్వాత రోడ్డు మీద శవాన్ని పడేశారు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కుమార్ తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేయగా అసలు నిజాలు బయటపడ్డాయి. పోలీసులు సురేందర్, భారతి, మల్లేష్ ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నగదు, సుత్తి స్వాదీనం చేసుకున్నారు.

రేవంత్ పెద్ద మనసు.. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అంటే మాటలు కాదు

Revanth Reddy latest decision
Revanth Reddy latest decision

Revanth Reddy latest decision: గ్రామపంచాయతీలు ఆర్థికంగా బలంగా ఉంటేనే దేశం బాగుంటుంది. ఎందుకంటే మన దేశానికి పల్లెలే పట్టు కొమ్మలు కాబట్టి. దురదృష్టవశాత్తు గ్రామీణ ప్రాంతాలను ఇప్పటికి ప్రభుత్వాలు కేవలం ఆదాయం వచ్చే వనరులుగానే చూస్తున్నాయి. ఆదాయాన్ని తీసుకొని అంతంతమాత్రంగా కేటాయింపులు జరుపుతూ.. అభివృద్ధి విషయంలో శీత కన్ను ప్రదర్శిస్తున్నాయి. అందువల్లే గ్రామాలు అభివృద్ధికి నోచుకోకుండా పోతున్నాయి. తెలంగాణలో గడచిన పది సంవత్సరాల కాలంలో గ్రామపంచాయతీలపై భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం విపరీతమైన పెత్తనం సాగించింది. కేంద్ర ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలకు వెళ్లకుండా అడ్డుకట్ట వేసింది. దీంతో పంచాయతీలలో బకాయిలు పేరుకుపోయాయి.

పంచాయతీల మీద ట్రాక్టర్లు.. ఇతర ఖర్చులను వేయడంతో.. బకాయిలు గుదిబండ లాగా మారిపోయాయి. దీంతో కనీసం పంచాయతీలలో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. వచ్చే ఆదాయం మీద హక్కు లేకుండా పోయింది. ఫలితంగా ఎప్పుడో ఒకసారి కార్మికులకు వేతనాలు ఇస్తున్న దుస్థితి ఏర్పడింది. బకాయిలు పెరిగిపోవడం.. ఆర్థిక వృద్ధి లేకపోవడంతో పంచాయతీలు తీవ్రంగా ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. ఇటువంటి స్థితిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీరాజ్ చరిత్రలోనే సరికొత్త విధానాలకు శ్రీకారం చుట్టారు.

ఇకపై వచ్చే ఆదాయాన్ని పంచాయతీ బ్యాంకు ఖాతాలలో వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఖజానా లో వేసి తీసుకునే పద్ధతి ఉండదు. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తున్నారు. పంచాయతీలలో పనిచేసే సిబ్బందికి ఒకటవ తేదీన వేతనాలు వస్తాయి. రేవంత్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పంచాయతీలలో పనిచేస్తున్న యాభై వేల మందికి ఊరట లభిస్తుంది. ఇకపై ప్రభుత్వ ఖజానా నుంచి ప్రతినెల 50 కోట్ల వరకు పంచాయతీలకు వెళ్తాయి.

గత ప్రభుత్వం పంచాయతీ వ్యవస్థలను మొత్తం నిర్వీర్యం చేసేందుకు ట్రెజరీ విధానాన్ని తీసుకొచ్చింది. దీనిని మార్చేందుకు తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018లో సెక్షన్ 70 (3) ని పూర్తిగా సవరించారు. దీనివల్ల ట్రెజరీలో పంచాయతీ ఆదాయాన్ని వేయాల్సిన అవసరం లేదు. పంచాయతీల పేరు మీద ఉన్న బ్యాంకు ఖాతాలో వేసి తీసుకోవచ్చు. వేతనాలు.. ఇతర చెల్లింపులకు వాడుకోవచ్చు. అయితే ఇవన్నీ కూడా ఆడిట్ పరిధిలో ఉంటాయి. ప్రతి పైసా కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.

మరోవైపు కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లేదు. కేంద్రం ఇచ్చే నిధులు మొత్తం నేరుగా పంచాయతీలకే మంజూరు చేస్తుంది. ప్రభుత్వం కూడా తన వాటాగా డబ్బులు ఇస్తోంది. దీనివల్ల స్థానిక సంస్థలు బలోపేతమవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. పంచాయతీలలో పనిచేసే కార్మికులకు అంతంత మాత్రం గానే వేతనాలు ఉంటాయి. ఆ వేతనాలు పకడ్బందీగా వస్తేనే వారి అవసరాలు తీరుతాయి. ఆ విషయాన్ని గుర్తించిన రేవంత్ రెడ్డి పంచాయతీ రాజ్ చట్టంలో పూర్తిగా మార్పులు తీసుకొచ్చారు. దీనివల్ల ఉద్యోగులకు వేతనాలు మాత్రమే కాదు.. పంచాయతీ కూడా ఆర్థికంగా బలోపేతం అవుతాయి. అతి త్వరలోనే నూతన విధి విధానాలు అమలవుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

రవితేజ 'ఇరుముడి' విడుదల తేదీ వచ్చేసింది.. ఈసారి టార్గెట్ మిస్ అయ్యేలా లేదుగా..

Ravi Teja
Ravi Teja

Irumudi release date update: వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో ప్రస్తుతం కెరీర్ లో గడ్డు కాలాన్ని ఎదురుకుంటున్న టాప్ హీరోల్లో ఒకరు మాస్ మహారాజ రవితేజ. ఆయన గత చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఈ సంక్రాంతి కానుకగా విడుదలై పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఆయన ముందు సినిమాలతో పోలిస్తే టాక్ కాస్త బెటర్ గానే వచిన్నప్పటికీ , ఆడియన్స్ ఎందుకో రవితేజ ని నమ్మలేదు. ఇప్పుడు రీసెంట్ గా ఆయన ‘ఇరుముడి’ అనే చిత్రాన్ని ఒప్పుకున్నాడు. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకుడు. పైగా సుబ్రమణ్య స్వామి నేపథ్యం లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు అనే క్లారిటీ ఇవ్వడం తో హైప్ ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయింది. ఈ చిత్రం ఎప్పుడు విడుదలైనా రవితేజ కెరీర్ లోనే ది బెస్ట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంటుంది , అందులో ఎలాంటి సందేహం లేదు.

ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీ పై మేకర్స్ ఒక క్లారిటీ కి వచ్చినట్టు తెలుస్తోంది. ఆగస్టు నెలలో ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని చూస్తున్నారట. అది మొదటి వారం లో విడుదల చెయ్యాలా?, లేదంటే ఆగస్టు 14 న విడుదల చెయ్యాలా అని ఆలోచిస్తున్నారట. ఆగస్టు 14 న విడుదల చేస్తే, 15 న స్వాతంత్ర దినోత్సవం కలిసి వస్తుంది , టాక్ తో సంబంధం లేకుండా బ్రేక్ ఈవెన్ మార్కుని అవలీలగా అందుకోవచ్చు. కానీ ఇక్కడే ఒక సమస్య ఉంది , ఆగస్టు 24 న నేచురల్ స్టార్ నాని నటించిన ‘ది ప్యారడైజ్ ‘ మూవీ విడుదల కాబోతుంది. ఈ చిత్రం పై ఆడియన్స్ లో ఎలాంటి హైప్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒకవేళ ఆగస్టు 14 న విడుదల చేస్తే, కేవలం 10 రోజుల థియేట్రికల్ రన్ మాత్రమే ఉంటుంది.

ఆ తర్వాత ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చి , మంచి రన్ ఉన్నప్పటికీ కూడా థియేటర్స్ ని తొలగించి , ‘ది ప్యారడైజ్’ కి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అదే కంటెంట్ మీద బలమైన నమ్మకం తో ఆగస్టు మొదటి వారం లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తే , పాజిటివ్ టాక్ మీద 3 వారాల బలమైన థియేట్రికల్ రన్ ని చూడొచ్చు. కాబట్టి మేకర్స్ మొదటి వారం లోనే విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ విడుదల తేదికి సంబంధించిన అధికారిక ప్రకటన చేయబోతున్నారట మేకర్స్.

త్రిష ఆ కోరికను మళ్లీ తిరస్కరించిన సీఎం విజయ్..

Trisha request rejected by Vijay
Trisha request rejected by Vijay

Trisha request rejected by Vijay: తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అత్యంత నాటకీయమైన పరిస్థితుల మధ్య అధికారంలోకి వచ్చాడు టీవీ కె అధినేత విజయ్. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాకపోయినప్పటికీ.. తనకున్న లౌక్యం ద్వారా అన్ని పార్టీల మద్దతును కూడగట్టి.. అధికారంలోకి వచ్చాడు విజయ్. ఆ తర్వాత తన రాజకీయ భవిష్యత్తును మరింత పటిష్టం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఏకంగా దేశ రాజకీయాలలో కూడా ప్రవేశించేందుకు విజయ్ రకరకాల ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో రాజ్యసభలో పాదం మోపడానికి.. రాష్ట్రంలో ఖాళీ అసెంబ్లీ స్థానంలో విజయం సాధించడానికి విజయ్ ఇప్పటికే రకరకాల రాజకీయ వ్యవహారాలను అమలు చేస్తున్నాడు.

విజయ్ రాజీనామా వల్ల తూర్పు తిరుచ్చి అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. అక్కడ గెలవాలని.. గెలిచి రాజకీయంగా తన పట్టణం తమిళనాడులో మరింత నిలుపుకోవాలని విజయ్ భావిస్తున్నాడు. అన్నా డీఎంకే నాయకుడు షణ్ముగం రాజీనామా చేసిన నేపథ్యంలో తమిళనాడు కోటాలో ఒక రాజ్యసభ స్థానానికి ఉపఎన్ని జరిగే అవకాశం ఉంది. జూన్ 1 నుంచి ఈ స్థానానికి నామినేషన్లు దాఖలవుతాయి. జూన్ 18న పోలింగ్ జరుగుతుంది. తమిళ రాష్ట్రం నుంచి రాజ్య సభకు ఒక సభ్యుడిని ఎన్నుకోవడానికి 34 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ కావాలి. అయితే కేవలం ఒకే ఒక స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో.. అక్కడ మెజారిటీ ఓటింగ్ అనే విధానాన్ని వర్తింపజేసే అవకాశం ఉంది.

తమిళనాడులో మొత్తం తిరుచ్చి మినహాయించి 23 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ కు దాదాపు 117 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. టి వి కే పార్టీకి ప్రస్తుతం 107 సొంత ఎమ్మెల్యేల బలం ఉంది. టీవీకే పార్టీకి మ్యాజిక్ ఫిగర్ కు 10 ఓట్ల దూరంలో ఉంది. నీ నేపథ్యంలో ఆ పార్టీకి ఇండియన్ ముస్లిం లీగ్, వీసీ కే, సిపిఐ మద్దతు గనుక లభిస్తే విజయం ఖచ్చితంగా కేక్ వాక్ అవుతుంది. అన్నా డీఎంకే లో ఒక వర్గం కూడా విజయ్ కి సపోర్ట్ చేస్తుంది. రాజ్యసభలేదా.. తిరుచ్చి ఈస్ట్ స్థానాన్ని హీరోయిన్ త్రిష కేటాయిస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు విజయ్ మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. తిరుచ్చి ఈస్ట్ స్థానంలో ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న అధికారిని నిలబెట్టేందుకు ఆయన రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఆయన గనుక పోటీకి ఒప్పుకోకపోతే.. మరో అధికారిని రంగంలోకి దించేందుకు విజయ్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల లాల్గుడి నియోజకవర్గంలో ఓడిపోయిన కృపా కృష్ణన్ ను ఇక్కడ నుంచి పోటీ చేయిస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల ప్రభుత్వ నామినేటెడ్ పోస్ట్ లభించడంతో.. కృప పోటీ నుంచి తప్పుకున్నట్టు తేలిపోయింది.

రాజ్యసభకు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రవీణ్ చక్రవర్తికి అవకాశం ఇవ్వాలని విజయ్ భావించినట్టు తెలుస్తోంది. అయితే ఆ తర్వాత రాజకీయ పరిణామాలు మారిపోవడంతో ప్రవీణ్ చక్రవర్తి వ్యవహారాన్ని విజయ్ పక్కన పెట్టారు. రాజ్యసభకు విద్యావేత్త లేదా ప్రముఖ వ్యక్తిని పంపించే అవకాశం ఉందని తెలుస్తోంది. అటు తిరుచ్చి ఈస్ట్, ఇటు రాజ్యసభ విషయంలో విజయ్ త్రిషకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోకపోవడంతో.. ఆమె రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందని విశ్లేషకులు అంటున్నారు. భవిష్యత్తు కాలంలో ఏమైనా సానుకూలమైన నిర్ణయాలు తీసుకుంటే తప్ప త్రిష కోరుకున్న కోరిక నెరవేరే పరిస్థితి లేదని ఆమె అభిమానులు అంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by OkTelugu (@okteluguofficial)

స్కూల్ టీచర్ చనిపోతే ఉగ్రవాదులు వచ్చారు.. పాకిస్తాన్ ఉగ్రరూపం మరోసారి బయటపడింది

Hamza Burhan News
Hamza Burhan News

Hamza Burhan News: ఎవరు ఎన్ని రకాలుగా చెప్పిన సరే పాకిస్తాన్ తీరు మారదు.. దాని ఉగ్రరూపం మారదు. ప్రపంచ దేశాలు తిట్టిపోసినా సరే.. అంతర్జాతీయ వేదికల ముందు పరువు పోయినా సరే.. పాకిస్తాన్ తీరు అలానే ఉంటుంది. పైగా తమ దేశంలో ఉగ్రవాదులు లేరని చెప్పే పాకిస్తాన్ పాలకులు.. చెప్పేవన్నీ కల్లబొల్లి మాటలని అనేక సందర్భాల్లో నిరూపితమైంది. ఇప్పుడు మరోసారి వెలుగులోకి వచ్చింది.

పాకిస్తాన్ దేశంలో ఇటీవల హంజా బుర్హాన్ అనే టీచర్ చనిపోయాడు. అజ్ఞాత సాయుధ దళాల చేతిలో అతడు హత్యకు గురయ్యాడు. అతడి అంత్యక్రియలకు ఉగ్రవాద సంస్థల అధినేతలు హాజరయ్యారు. వారంతా చేతిలో తుపాకులు పట్టుకొని అతడికి నివాళులర్పించారు. అంత్యక్రియలు జరిగేవరకు వారు అక్కడే ఉన్నారు. పైగా అతడు వీరమరణం పొందాడని.. అతడి హక్కుల సాధన కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని వారు నినాదాలు చేశారు. ఒక సాధారణ టీచర్ చనిపోతే ఈ స్థాయిలో ఉగ్రవాదులు రావడం ఒక రకంగా సంచలనం కలిగించింది. అయితే దీనిని తవ్వి చూస్తే అసలు నిజం వెలుగు చూసింది.

బుర్హాన్ సాధారణ టీచర్ కాదు. పుల్వామా అటాక్ కు సంబంధించి కీలక సూత్రధారి. సిఆర్పిఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్న ఆ దాడికి అతడు స్కెచ్ వేశాడు. అప్పటినుంచి ఇతడి గురించి మన దేశ ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయి. అతడు మారుపేరుతో పాకిస్తాన్ దేశంలో నివాసం ఉంటున్నాడు. అక్కడ ఒక స్కూల్లో మత బోధనలు చేస్తున్నాడు. విద్యార్థులలో భారత్ మీద విష ప్రచారం చేస్తున్నాడు. వారి మెదళ్లలో విష బీజాలు నాటుతున్నాడు.. అయితే అతడు ఇటీవల అజ్ఞాత సాయుధ దళాల చేతిలో హతమయ్యాడు.. అతడు ఉగ్రవాది అని చెబితే ప్రపంచం మొత్తం ఉవేస్తుందని భావించిన పాకిస్తాన్.. తెలివిగా సానుభూతి కార్డును ప్లే చేస్తోంది.

ఇటీవల అజ్ఞాత సాయుధ దళాల చేతిలో బుర్హాన్ చనిపోయాడు. అతడి అంత్యక్రియలకు ఉగ్రవాదులు హాజరు కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఇతడు చనిపోయిన తర్వాత ఉగ్రవాదులు నినాదాలు చేశారు. అతడి ఆశయాల సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు పాకిస్తాన్ మీడియా రాసిన కథనాలను ఆధారంగా తీసుకొని వెస్ట్రన్ మీడియా బుర్హాన్ పై సానుభూతి స్టోరీలను ప్రసారం చేసింది.. అతడు ఉగ్రవాది అనే విషయాన్ని తెలివిగా డైవర్ట్ చేసింది. పాకిస్తాన్ నుంచి వచ్చే కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ లో కూడా ఉర్దూకు బదులుగా హిందీలో బుర్హాన్ మీద సానుభూతి వ్యాఖ్యలను పోస్ట్ చేయడం విశేషం. అయితే భారత్ వల్ల పాకిస్తాన్లో అల్లకల్లోలం చెలరేగుతోందని.. ఉగ్రవాదులు మొత్తం మంచి వాళ్ళని.. భారత్ వల్లే ఇదంతా జరుగుతోంది అన్నట్టుగా పాకిస్తాన్ లోని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. కానీ బుర్హాన్ గురించి అసలు విషయాలను కొంతమంది జాతీయవాదులు బయట పెట్టడంతో.. వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి.

అమరావతి మీద ఇంత ద్వేషమా.. 15 కోట్ల వైసిపి కుట్ర బయటపడింది ఇలా..

15 Crore YCP Conspiracy Exposed
15 Crore YCP Conspiracy Exposed

15 Crore YCP Conspiracy Exposed: అమరావతి ఏర్పాటు సమయంలో తాము రాజధానికి అనుకూలమని నాడు వైసిపి అధినేత హోదాలో ఉన్న జగన్ చెప్పారు. రాజధాని ఏర్పాటు కోసం జరిగిన సభకు ఆహ్వానం పలికినప్పటికీ రాలేదు. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి విషయంలో మూడు నాలుకల ధోరణి ప్రదర్శించాడు. ఏకంగా ఏపీకి మూడు రాజధానులు చేస్తామని అన్నాడు. చివరికి విశాఖపట్నం క్యాపిటల్ అంటూ ప్రకటన చేశాడు. దేని పై కూడా క్లారిటీగా జగన్ నిలబడలేదు. కనీసం తాను చెప్పిన త్రీ క్యాపిటల్స్ విధానాన్ని కూడా అమలు చేయలేదు. ఇప్పుడు కొత్తగా మావిగన్ అనే పదాన్ని తెరపైకి తీసుకొచ్చాడు.

అమరావతి విషయంలో వైసీపీ మొదటి నుంచి కూడా వ్యతిరేక ధోరణి ప్రదర్శిస్తోంది. అమరావతిని కేవలం ఒక కులానికి సంబంధించిన రాజధానిగా మాత్రమే చూస్తోంది. ఇప్పటికీ కూడా ఒక కులం వారికే అధికంగా భూములు కేటాయించారని.. దీని వెనుక ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తోంది. ఇంతటితోనే వైసీపీ ఆగలేదు. రాజధాని విషయంలో మరింత విషం చిమ్మడానికి గతంలో అనేక రకాల ప్రయత్నాలు చేసింది. అవి ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అమరావతి విషయంలో వైసిపి తీసుకున్న స్టాండ్.. దానికోసం తెర వెనుక చేసిన ప్రయత్నాలు.. ఇప్పుడు వెలుగులోకి రావడంతో ఏపీ రాజకీయాలలో కలకలం నెలకొంది.

పులివెందుల టిడిపి ఇన్చార్జిగా కొనసాగుతున్న బీటెక్ రవి వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పై సంచలన ఆరోపణలు చేశారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం..” శాసనమండలిలో అమరావతికి వ్యతిరేకంగా మద్దతు ఇస్తే 15 కోట్లు ఇస్తామన్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ కి చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటే బ్లాంక్ చెక్ ఇస్తామన్నారు. నాడు పదిహేను కోట్లు ఇస్తామని చెప్పింది విజయసాయిరెడ్డి. దాని వెనుక ఉన్నది వైయస్ అవినాష్ రెడ్డి. ఈ విషయాన్ని నేను చంద్రబాబుకు చెప్పాను. వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో మొదట్లో నేను సిబిఐకి ఫిర్యాదు చేశాను. ఆ తర్వాత ఆదినారాయణ రంగంలోకి వచ్చారు. సునీత కూడా ఈ వ్యవహారానికి ప్రవేశించారు. నా వద్దకు.. ఆదినారాయణ రెడ్డి వద్దకు అవినాష్ రెడ్డి మనసులు వచ్చారు. బ్లాంక్ చెక్ ఇస్తాం.. ఎన్ని కోట్లయినా రాసుకోండి.. కేసు మొత్తం విత్ డ్రా కావాలని కోరారని” బీటెక్ రవి పేర్కొన్నారు.

కేవలం అమరావతి విషయంలోనే కాకుండా.. వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా బీటెక్ రవి సంచలన విషయాలు వెల్లడించిన నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు మరో టర్ను తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రాజారెడ్డి వ్యవహారంపై ఏపీ రాజకీయాలు అట్టుడికి పోతున్నాయి. రాజశేఖర్ రెడ్డి గురించి కూడా టిడిపి నేతలు పదేపదే విమర్శలు చేస్తున్నారు. ఇటీవల రాజశేఖర్ రెడ్డి మరణాన్ని.. రాజారెడ్డి మరణాన్ని జగన్ తెరపైకి తీసుకొచ్చారు. వారి చావులకు టిడిపి, చంద్రబాబు కారణం అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత టిడిపి శ్రేణులు కూడా గట్టి కౌంటర్ ఇవ్వడం మొదలైంది. ఇప్పుడు బీటెక్ రవి ఏకంగా ఏకంగా అమరావతి గురించి.. వివేకానంద రెడ్డి మరణం గురించి.. తనకు అందిన ఆఫర్ల గురించి చెప్పారు. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాలు ఇంకా ఎలా మారుతాయో చూడాల్సి ఉంది.

'పెద్ది' చిత్రానికి ఆంధ్రా లో కూడా కష్టాలు తప్పవా..? పాపం ఇలాంటి పరిస్థితులు ఊహించలేదు..

Peddi movie release issues in AP
Peddi movie release issues in AP

Peddi movie release issues in AP: ‘పెద్ది’ చిత్రానికి ఎటు చూసినా ప్రస్తుతం కష్టాలే కనిపిస్తున్నాయి. ఈ సినిమాని అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలని దిల్ రాజు వర్గం ప్రయత్నాలు చేస్తుంది. సరిగ్గా ఈ సినిమా విడుదల సమయం లోనే మాకు కమీషన్ బేసిస్ మీద థియేటర్స్ ని రన్ చేసుకునే పద్దతి రావాలి , లేదంటే మేము థియేటర్స్ ని క్లోజ్ చేస్తామని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత చర్చల ద్వారా ‘పెద్ది’ చిత్రానికి ఎలాంటి ఆటంకాలు కలిగించమని చెప్పుకొచ్చారు కానీ, ఇప్పుడు మరోసారి ‘పెద్ది’ చిత్రం కమీషన్ బేసిస్ మీదనే రన్ చెయ్యాలి అనే డిమాండ్ ని తీసుకొస్తున్నారు. లేదంటే తెలంగాణ లో టికెట్ హైక్స్ రానివ్వకుండా చేస్తామని పరోక్షంగా బెదిరింపులు కూడా చేయడం ఈమధ్య కాలం లో మనం చాలానే చూశాము . అయితే రీసెంట్ గానే ఈ ఎక్సిభిటర్స్ గిల్డ్ కి సంబంధించిన వాళ్ళు చిరంజీవి ని కలవడం హాట్ టాపిక్ గా మారింది.

చిరంజీవి తో కలిసి ‘పెద్ది’ చిత్రం కమీషన్ బేసిస్ మీద రన్ చెయ్యాలి , థియేటర్స్ సమస్యల్లో ఉన్నాయి, మూత పడే పరిస్థితుల్లో ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చారు. చిరంజీవి కూడా సమస్యకు పరిష్కారం ఆలోచిద్దాం అని చెప్పాడు , మరో రెండు రోజుల్లో ఇంకో మీటింగ్ ఉండబోతుంది. అదే విధంగా ప్రొడ్యూసర్స్ గిల్డ్ కి సంబంధించిన వాళ్ళు నిన్న రాజమండ్రి లో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిసి తమ సమస్యలను వివరించారు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ‘పెద్ది’ చిత్రానికి టిక్కెట్ హైక్స్ ఇవ్వాలా వద్దా అనే ఆలోచనలో ఉంది. ఎందుకంటే ఒకపక్క హై కోర్టు అనుమతించడం లేదు, మరో పక్క టిక్కెట్ హైక్స్ ఇచ్చినా హై కోర్టు కి వెళ్లి , ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటీషన్ వేయడానికి సిద్ధం గా ఉన్నారు కొంతమంది.

ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం టిక్కెట్ హైక్స్ ఇవ్వకపోతే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇవ్వదు అనే రూమర్ ఫిలిం వర్గాల్లో గట్టిగా ప్రచారం జరిగింది. అందుకే నిన్న ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యులంతా పవన్ కళ్యాణ్ ని కలిసి , జరిగే పరిస్థితులను వివరించారు. టికెట్ హైక్స్ కచ్చితంగా ఇస్తామని, 5 షోస్ కి కూడా అనుమతి ని ఇస్తానని పవన్ కళ్యాణ్ భరోసా ఇవ్వడం తో , నిర్మాతలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ దిల్ రాజు గ్యాంగ్ కి సంబంధించిన వాళ్ళు ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు కి వెళ్లి టిక్కెట్ హైక్స్ కి వ్యతిరేకంగా పిటీషన్ వేస్తె ఏంటి పరిస్థితి?, ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఈ సినిమాకు టిక్కెట్ హైక్స్ ని రద్దు చేయాల్సిన పరిస్థితులు వస్తాయా అనేది చూడాలి.

లుట్యెన్స్‌ ఢిల్లీలో ఒక యుగం ముగింపు.. సిస్టం మాత్రం ఇప్పటికీ అలాగే..

The end of an era in Lutyens Delhi
The end of an era in Lutyens Delhi

The end of an era in Lutyens Delhi: బ్రిటిష్‌ సామ్రాజ్యం వెళ్లిపోయి 79 ఏళ్లు అయినా, ఢిల్లీ హృదయంలో ఒక చిన్న ద్వీపం ఇప్పటికీ ఆ కాలపు మానసికతను, ప్రివిలేజ్‌ను, ఎలిటిజాన్ని కాపాడుకుంటోంది. అదే ఢిల్లీ జింఖానా క్లబ్‌. దాదాపు ఎనిమిదేళ్ల ప్రయత్నాల తర్వాత మే 22, 2026న కేంద్ర ప్రభుత్వం కీలక జారీ చేసిన ఉత్తర్వులు ఆ ’చిన్న ద్వీపం’కు భారీ సవాల్‌ విసిరాయి. 27.3 ఎకరాల ప్రధాన భూమిని జూన్‌ 5లోగా ఖాళీ చేసి అప్పగించాలని ఆదేశించింది. ఇది కేవలం ఒక క్లబ్‌ భూమి స్వాధీనం కాదు.. లుట్యెన్స్‌ ఢిల్లీలో ఇంకా కొనసాగుతున్న ’పాత సిస్టమ్‌’పై ఒక బలమైన వ్యవస్థ.

సాంస్కృతిక గాయం..
బ్రిటిష్‌ వారసత్వం1911లో బ్రిటిష్‌వారు రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చినప్పుడు, కొత్త అధికార కేంద్రానికి అనుగుణంగా సామాజిక, క్రీడా సంస్థలు అవసరమయ్యాయి. 1913 జూలై 3న ఇంపీరియల్‌ ఢిల్లీ జింఖానా క్లబ్‌ స్థాపించబడింది. మొదటి అధ్యక్షుడు స్పెన్సర్‌ హార్‌కోర్ట్‌ బట్లర్‌. లుట్యెన్స్‌ డిజైన్‌ చేసిన సఫ్దర్జంగ్‌ రోడ్‌పై ఉన్న ఈ క్లబ్‌ బ్రిటిష్‌ అధికారులు, సైనికులు, భారతీయ రాజులు (ఏడుగురు మహారాజులు లైఫ్‌ మెంబర్లు), ఎలైట్‌ వర్గాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. భారతీయులకు ప్రవేశం కూడా కష్టం.

స్వాతంత్య్రం వచ్చాక…
స్వాతంత్య్రం వచ్చాక ’ఇంపీరియల్‌’ అనే పదం తొలగించారు. కానీ మానసికత మారలేదు. రాబర్ట్‌ టార్‌ రస్సెల్‌ డిజైన్‌ చేసిన భవనం, 26 టెన్నిస్‌ కోర్టులు, స్విమ్మింగ్‌ పూల్, బార్లు, బ్యాడ్మింటన్, బిలియర్డ్స్‌ ఇవన్నీ లగ్జరీ, ఎక్స్‌క్లూసివిటీకి ప్రతీకలు. సభ్యత్వం వారసత్వంగా వస్తుంది లేదా 30 ఏళ్ల వెయిటింగ్‌ లిస్ట్‌. ప్రభుత్వ సర్వంట్లకు ప్రత్యేక ప్రాధాన్యత. సభ్యత్వ ఫీజు లక్షలు నుంచి కోట్ల వరకు. కానీ పబ్లిక్‌ ల్యాండ్‌పై నామమాత్రపు అద్దె (నెలకు వెయ్యి రూపాయలు) మాత్రమే చెల్లిస్తున్నారు.

ప్రస్తుత సంక్షోభం ఏమిటి?
2026 మే 22న హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ అఫైర్స్‌ మంత్రిత్వ శాఖ ల్యాండ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీస్‌ ఆదేశాలు జారీ చేసింది. ‘హైలీ సెన్సిటివ్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ ఏరియా‘లో ఉన్న ఈ భూమి రక్షణ మౌలిక సదుపాయాలు, జాతీయ భద్రత, పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌ ప్రాజెక్టుల కోసం అవసరం. ప్రధాని నివాసం (7, లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌) సమీపంలో ఉండటం కీలకం. లీజ్‌ షరతులలోని క్లాజ్‌ 4 ప్రకారం పబ్లిక్‌ పర్పస్‌కు భూమి తిరిగి తీసుకోవచ్చు. జూన్‌ 5లోగా శాంతియుతంగా అప్పగించాలి, లేకపోతే చట్టప్రకారం చర్యలు.

కోర్టుకు వెళ్లే యోచనలో సభ్యులు..
క్లబ్‌ సభ్యులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇంటరిమ్‌ స్టే ఇవ్వలేదు, కానీ బలవంతపు చర్యలు ఉండవని ప్రభుత్వం హామీ ఇచ్చింది. 600 మంది ఉద్యోగుల ఉపాధి, వారసత్వ సభ్యత్వాలు, హెరిటేజ్‌ విలువలు – ఇవన్నీ సవాలు చేస్తున్నారు. మరోవైపు, క్లబ్‌పై గతంలో ఆర్థిక అక్రమాలు, మిస్‌మేనేజ్‌మెంట్, ఫ్యాక్షనలిజం ఆరోపణలు ఉన్నాయి. ఎన్‌సీఎల్‌టీ కూడా గతంలో ఇంపీరియల్‌ మైండ్‌సెట్‌ అని విమర్శించింది. అప్పులు (సుమారు రూ.47 కోట్లు) కూడా చెల్లించకపోవడం వివాదానికి ఒక కారణం.

డబుల్‌ స్టాండర్డ్, మార్పు అవసరం..
కశ్మీర్‌ ఫైల్సో్లని ఆ డైలాగ్‌ ఇక్కడ సరిపోతుంది.. ప్రభుత్వం ఏదైనా కావచ్చు, కానీ ’సిస్టమ్‌’ ఇంకా పాత ఎలైట్‌ చేతుల్లోనే ఉంది. జింఖానా క్లబ్‌ ఆ సిస్టమ్‌కు జీవంత ఉదాహరణ. పేదల భూముల కోసం రోడ్డుపైకి వచ్చే సంఘాలు, కమ్యూనిస్టులు, మీడియా ఈ 27 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం మీద మౌనం వహించడం ఆశ్చర్యం. ఇది వారి ’లిబరల్‌’ సర్కిల్స్‌కు చెందినది కాబట్టి. ఈ చర్య సానుకూలం. పబ్లిక్‌ ల్యాండ్‌ పబ్లిక్‌ పర్పస్‌కు వాడాలి. జాతీయ భద్రత ప్రధానం. ఒకవేళ హెరిటేజ్‌ కాపాడాలని అనుకుంటే, ప్రత్యామ్నాయ స్థలం కేటాయించి మార్చవచ్చు. కానీ ప్రివిలేజ్‌ను శాశ్వతంగా కాపాడుకోవడం ఆధునిక భారత్‌కు సరికాదు.

బ్రిటిష్‌వారు వెళ్లిపోయారు. కానీ వారి మనస్తత్వం, ఎక్స్‌క్లూసివ్‌ క్లబ్‌లు, ఖాన్‌ మార్కెట్‌ గ్యాంగ్‌ సంస్కృతి ఇంకా మనల్ని చుట్టుముట్టి ఉన్నాయి. ప్రజాస్వామ్య భారత్‌లో ప్రజల భూమి ప్రజల కోసమే. కోర్టు తీర్పు ఏమైనా, ఈ చర్చ దేశం మొత్తానికి అవసరం. లుట్యెన్స్‌ ఢిల్లీ మారాలి. కొత్త భారత్‌ నిర్మాణం కోసం పాత గోడలు కూల్చడం తప్పనిసరి.